ఈ పుస్తకములో వెతకండి
ఈ చిన్న గ్రంథము సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రయని గాని అతని శ్రమల పూర్ణ వృత్తాంతమని గాని చెప్పుకొనదు. అది ఒక గంభీర భక్తాత్మ యొక్క అసాధారణ సౌందర్యమైన స్వభావ రహస్యమును బయలుపరచుటకు ప్రయత్నించును; పూర్ణముగా ప్రతిష్ఠింపబడిన జీవితము యొక్క ఆకర్షణ శక్తిని విస్తరింపజేయుటకును జ్ఞాపకముంచుకొనుటకును కోరును.
క్రీస్తును ప్రకటించుటలోను జీవించుటలోను ఒక మంచివాడు ఆయనను లోకమునకు ఎట్లు ప్రత్యక్షపరచి «సమస్త మనుష్యులను తనయొద్దకు ఆకర్షించునో» ఏ మట్టుకైనను ఇది చూపినయెడల, మరి కొన్ని హృదయములు క్రీస్తునందు లోతైన భక్తికి రేపబడి సాధువు ఆత్మలో కొంత పాలు పొందినయెడల, ఈ గ్రంథోద్దేశము నెరవేరును.
సాధు సుందర్ సింగ్ మనుష్యులను క్రీస్తువైపు త్రిప్పు అద్భుత శక్తికి ఈ చిన్న నివాళి అర్పించుట మిక్కిలి సంతోషము; ఆ శక్తిని అనుభవించినవాడు దీనిని పాఠకునికి సమర్పించుచున్నాడు. దీని సందేశము అంగీకరించు వారందరికి దేవుని ఆశీర్వాదమగునట్లు నిరీక్షణతోను ప్రార్థనతోను ఇది అర్పింపబడుచున్నది.
యేసు చెప్పెను
«నేను ఎత్తబడినయెడల సమస్త మనుష్యులను నాయొద్దకు ఆకర్షించెదను.»
అనుబంధములు
