ప్రభువు ఆనందం — 2. నిరపేక్ష ఆనందం
2. నిరపేక్ష ఆనందం
రెండవదిగా, ఈ ఆనందము దైవికాధికారము క్రింద సమస్త మానవజాతికి కూడ పరలోకము నుండి పంపబడినది. ఈ ఆనందము “సమస్త ప్రజలకు” ఉద్దేశింపబడినది. అది ఏ ఒక్క వర్గము వారికో పరిమితము కావలెనని ఉద్దేశింపబడలేదు. “అది సమస్త ప్రజలకు కలుగును” అని అది స్పష్టముగా చెప్పుచున్నది. కాబట్టి ఈ ఆనందము తనకు మాత్రమే ఉద్దేశింపబడినదని ఎవరైన తలంచినయెడల, ఈ తప్పుడు తలంపు ఫలితముగా అతడు తానే ఆ ఆనందమును కోల్పోవును. బైబిలులో దేవుడు చెప్పునది తప్పకుండ సత్యమే. దానిని మార్చలేము. “సమస్త ప్రజలు” అను పదము, అన్ని దేశములవారిని, అన్ని భాషలవారిని, అన్ని వయసులవారిని, అన్ని జీవనరీతులవారిని, ధనికులను పేదవారిని, విద్యావంతులను నిరక్షరాస్యులను, నాగరికులను అనాగరికులను, ఉన్నతులను నీచులను, తెల్లవారిని నల్లవారిని సూచించును. ఈ ఆనందమును అందరు పొంది అనుభవించవచ్చును.
రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు బేత్లెహేములో పుట్టినప్పుడు, ఆత్మీయ చీకటి లోకముపై కమ్ముకొనియుండెను. అది గందరగోళముతోను అస్తవ్యస్తతతోను నిండిన కాలము. యూదులు రోమా పరిపాలన క్రిందనుండుటచేత, అవి వారికి దాస్యపు దినములు. విగ్రహారాధన దేశమంతటిని ఆవరించియుండెను, దేవుని ప్రజలైన యూదులు దేవుని స్వరమును వినుటకు ఏ ప్రవక్తయు లేడు, ఏ ఆరాధనాస్థలమును లేకుండెను. అటువంటి కాలములోనే దేవుని ఆనందపు, సమాధానపు సందేశము ప్రజలందరికి తేబడెను. “సమస్త ప్రజలు” అను మాటలలో మీరు కూడ చేరియున్నారు. కావున అది మీకు వర్తించదని తలంచి మిమ్మల్ని మీరు మినహాయింపుగా చేసికొనకుడి.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
