పంచుకోవడం
2. పంచుకోవడం
అటుపైన మనం చూస్తాము, రాహాబు తన సొంత ఇంటివారి గురించి శ్రద్ధ వహించింది. ఆమె తన తండ్రి యింటివారికి కృప చూపి, వారిని సజీవులుగా కాపాడతామని నిజమైన ఆనవాలు ఇమ్మని ఆ గూఢచారులను కోరింది (11:14,12వ వచనములు). అదేవిధంగా, ప్రతి విశ్వాసి తన కుటుంబం కొరకు రక్షణను అపొస్తలుల కార్యములు 16:31లో మనకివ్వబడిన వాగ్దానం ప్రకారం క్లెయిమ్ చేసుకోగలరు. మనం విశ్వాసము ద్వారా మన బంధువుల కొరకు రక్షణను క్లెయిమ్ చేసినప్పుడు, గొప్ప పరలోక వారసత్వంలో మనకు పూర్తి భాగం లభిస్తుంది. అనేకమంది తాము తిరిగి జన్మించామని చెప్పుకుంటారు, కానీ తమ స్నేహితుల కొరకు, రక్షింపబడని కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నారా అని అడిగితే వారి దగ్గర సమాధానం ఉండదు. మనం కూడా మన బంధువుల రక్షణ గురించి శ్రద్ధ వహిస్తే, ఆ వారసత్వంలో మనకు పూర్తి భాగం లభిస్తుంది. మనం దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని, రక్షింపబడని మన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. మన ప్రార్థనలకు జవాబు కనిపించడానికి చాలాకాలం వేచియుండవలసి రావచ్చు, కానీ నిరుత్సాహపడకుండా, ఆ యిల్లు మొత్తానికి విడుదల కలుగుతుందని క్లెయిమ్ చేస్తూ ప్రార్థనలో కొనసాగాలి.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
