ప్రభువు ఆనందం — 7. వర్ణనాతీత ఆనందం
ఏడవదిగా, 1 Pet. 1:8లో, అపొస్తలుడైన పేతురు వర్ణనాతీతమైనదిగాను మహిమతో నిండినదిగాను ఉన్న ఆనందము గురించి మాటలాడుచున్నాడు. ఈ ఆనందమును మాటలతోనైనను పాటలతోనైనను తగినరీతిగా వ్యక్తపరచలేము. ఏ భూసంబంధమైన భాషయు ఈ ఆనందమును వ్యక్తపరచలేదు. మనము ఎక్కువగా మాటలాడకపోయినను, మనము పరలోకములో ఉన్నామన్న భావన కలిగించు విశేషమైన ఆనందము మన హృదయాలలో ఉండును. కృపగల దేవుడు ఈ ఆనందమును మనకు కానుకగా దయచేయును. ఇది అద్భుతమైనదిగాను వర్ణనాతీతమైనదిగాను ఉండి, మనలను ఎన్నడును విడువదు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
