ప్రభువు ఆనందం — 6. మార్పులేని ఆనందం
6. మార్పులేని ఆనందం
ఆరవదిగా, దుఃఖము కూడ ఈ ఆనందమును తీసివేయలేదు. “దుఃఖాక్రాంతులమైనట్టుండియు ఎల్లప్పుడు సంతోషించువారము, దరిద్రులమైనట్టుండియు అనేకులను భాగ్యవంతులనుగా చేయువారము, ఏమియు లేనట్టుండియు సమస్తమును కలిగియుండువారము” (2 Cor. 6:10). దుఃఖములో ఆనందమెలా ఉండగలదా అని మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ అటువంటి ఆనందమునిచ్చునది దేవుడే. ఉదాహరణకు, మిక్కిలి తుఫానుతో ప్రమాదకరముగా ఉన్న సముద్రమును యేసు సంపూర్ణముగా ప్రశాంతముగాను నిమ్మళముగాను చేయగలిగెను (Matt. 8:26). అటులనే దేవుని ప్రజలు గొప్ప దుఃఖము, ప్రియులను కోల్పోవుట లేదా ఏ రకమైన శ్రమ, పరీక్ష మధ్యనైనను తమ హృదయాలలో గొప్ప సమాధానమును అనుభవింతురు.
దుఃఖపు కాలములలో మనము మోకాళ్ళూని, “దేవుడు తప్పు చేయలేడు. ఆయన ప్రేమ ఎన్నడు మారదు. ఆయన వాక్యము ఎన్నడు మారదు. ఆయనే సర్వాధికారి” అని చెప్పుకొనవలెను.
ఈ విధముగా ఒక నిజమైన విశ్వాసి తన ఆనందమును ఎన్నడును కోల్పోడని మనము చూతుము,
తీవ్రమైన దుఃఖములోను వేదనలోను కూడ. [తరువాతి పేజీ శీర్షిక ఇక్కడ కలిసిపోయినది: 7. వర్ణనాతీత ఆనందం]
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
