శక్తివంతమైన సేనాధిపతి
యెరికో చాలా మందమైన గోడలు గల బలమైన పట్టణం, మరియు దానిలో పోరాడుటకు అనేకమంది పరాక్రమశాలులు ఉండిరి
ఇశ్రాయేలు పిల్లలకు వ్యతిరేకంగా. అయినప్పటికీ రాహాబు విశ్వాసము స్థిరముగాను గొప్పదిగాను ఉండెను, జీవముగల దేవుని విజయమును ఆమె నమ్మెను. అందుకే ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎర్రని దారమును కట్టింది. విశ్వాసము ద్వారా, సాధారణ విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణను పొంది, గొప్ప పరలోక వారసత్వాన్ని పొందుటకు సిద్ధపడగలము.
[శక్తివంతమైన సేనాధిపతి]
అటుపైన ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి కనాను దేశములో ప్రవేశించవలసిన సమయం వచ్చింది. వారు ఆ నదిని ఎంతో అసాధారణమైన రీతిలో దాటిరి. క్రీస్తుయేసునందు మన వారసత్వంలోనికి మనం ఎలా ప్రవేశించి దానిని అనుభవించవచ్చో అనేదానికి ఇది కూడా మరింత తెలియజేస్తుంది. దేవుడు ఆజ్ఞాపించెను, “మీరు ఆ మార్గమును ఇంతకుముందు వెళ్ళియుండలేదు గనుక, మీరు వెళ్ళవలసిన మార్గమును తెలిసికొనునట్లు మీకును దానికిని [ప్రభువు నిబంధన మందసమునకు] రమారమి రెండు వేల మూరల యెడము ఉండవలెను; దాని దగ్గరకు రాకుడి” (యెహో. 3:4). నిబంధన మందసమును మోయు యాజకులు వాగ్దాన దేశములో ప్రవేశించబోతున్నప్పుడు, మొదట దేవుడే స్వయముగా వారి తరఫున యుద్ధము చేయుటకు వారి ముందు నడిచెను. వారు ఆ నదిని దాటి, అప్పటికి ఆ దేశమును ఆక్రమించియున్న బలమైన శత్రువులను, అనగా కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను జయించగలిగారు. జీవముగల మహా దేవుడు తమ మధ్య తమ శక్తివంతమైన సేనాధిపతిగా స్వయముగా ఉన్నాడని ఆ మందసము వారికి గుర్తు చేయుటకు ఉద్దేశింపబడింది. ఆయనే వారిని నడిపించి, వారి ముందు నుండి శత్రువులను తరిమివేయును; వారు తమ సొంత శక్తిని, సామర్థ్యమును లేదా యుద్ధాయుధములను ఆధారము చేసికొనవలసిన అవసరం లేదు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
