English | తెలుగు | हिन्दी

అధ్యాయం 24

ప్రభువు ఆనందం — 3. అజేయ ఆనందం

మన వారసత్వం · బఖ్త్ సింగ్

ప్రభువు ఆనందం — 3. అజేయ ఆనందం

3. అజేయ ఆనందం

మూడవదిగా, ఇది అన్ని కాలములలోను అనుభవించదగిన ఆనందము. ఇది అప్పుడప్పుడో లేక కొద్దికాలమో మాత్రమే కాదు. మన జీవితము వ్యాధి, దుఃఖము, హింస, బాధ, దరిద్రత, ఒంటరితనము, ప్రియులను కోల్పోవుట వంటి వివిధ పరిస్థితులచేత ఎల్లప్పుడు మార్పులకు లోనగుచుండును. కానీ ఇది ప్రభువు ఆనందము కనుక, అత్యంత దుఃఖకరమైన పరిస్థితులలో సయితము ఈ ఆనందమును అనుభవించవచ్చును. ఇది కొనసాగు ఆనందము, ఏ పరిస్థితిచేతను ఓడింపబడజాలదు. బైబిలు ఇందులో ఏమి చెప్పుచున్నదో చూడుడి, 1 Thess. 5:16 లో ఈ ఆనందము గురించి, “ఎల్లప్పుడును ఆనందించుడి.” ఏ పరిస్థితిలోనైనను మీరు మీ జీవితకాలమంతయు ఆనందించవచ్చును. మనము అన్నిరకముల కష్టములను శ్రమలను గుండా వెళ్ళవలసివచ్చుననియు దేవుని వాక్యము మనలను హెచ్చరించును. అయినను అటువంటి కష్టముల మధ్యలోను, ఇది ప్రభువు ఆనందము కనుక, ఈ ఆనందము ఎల్లప్పుడు అక్కడ ఉండును.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑