English | తెలుగు | हिन्दी

అధ్యాయం 8

సహవాసం

మన వారసత్వం · బఖ్త్ సింగ్

సహవాసం

8. సహవాసం.

నిబంధన మందసము యాజకులచేత మోయబడవలసియుండెను, తక్కిన ప్రజలందరు వారిని వెంబడించవలసియుండెను.

మనము కూడా సంఘము మొత్తముతో మనలను మనము గుర్తించుకొనవలెను, అప్పుడే మనము అన్ని అడ్డంకులను జయించుటలో సఫలులమగుదుము

. మనము ఇతర విశ్వాసులతో సహవాసములో ఉండి, సంఘమును కట్టుటలో మన పూర్తి భాగమును తీసికొనవలెను. అనేకమంది విశ్వాసులు...

ఇతర విశ్వాసులతో సహవాసము చేయరు. వారు ఇలా అనుకుంటారు...

ఇంటివద్దనే ఉండి కొన్ని మంచి పుస్తకములు చదివినా లేదా కొన్ని మంచి పనులు చేసినా అది తమకు దీవెన తెచ్చునని. రేడియోలో వచ్చు

సందేశములను రోజంతా వినవచ్చునని కూడా వారు అనుకుంటారు. చాలామంది

ఈ ప్రసారములతోనే సంతృప్తి పడుదురు. మంచి సంగీతమును, మంచి సందేశములను వినుట ద్వారానే దేవుని ఆశీర్వాదములన్నియు పొందగలమని వారు అనుకుంటారు. కానీ వారికి

[అస్పష్టం] ఆరాధన కొరకైనను ప్రార్థన కొరకైనను ఆయన వాక్యమును అధ్యయనము చేయుట కొరకైనను మనము కలిసికొనునప్పుడు మనకు కలుగు సహవాసము యొక్క విలువ తెలియదు. రేడియోలో వచ్చు సందేశముల ద్వారానో, మంచి పుస్తకముల ద్వారానో, పత్రికల ద్వారానో మీకు పూర్తి ఆశీర్వాదములు లభించునని తలంచి సహవాసము నుండి దూరముగా ఉండకండి. అలా చేసినయెడల మీరు రక్తహీనులుగాను శక్తిహీనులుగాను మాత్రమే ఉండిపోతారు. ప్రార్థన కొరకును సహవాసము కొరకును తోటి విశ్వాసులతో మాటిమాటికి కలిసికొనుట వలన కలుగు అనేక ప్రయోజనములను మీరు కోల్పోతారు. మన బలమును ఎదుగుదలయు ఒకరితో ఒకరు కలిగియుండు సహవాసముపైననే ఆధారపడియుండును. తొలి విశ్వాసులు అపొస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థనలయందును స్థిరముగా కొనసాగినందున ఆత్మీయముగా ఎదుగుటకు ఆరంభించిరి (అపొ. కార్య. 2:42).

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑