ప్రభువు ఆనందం
ప్రభువు ఆనందము (Noh. 8:10).
మొదటి భాగములో, Neh. 8:10, మనమిలా చదువుదుము, “యెహోవా వలని ఆనందమే మీకు బలము.” ప్రభువు ఆనందము వాస్తవముగా అంటే ఏమిటో మనము గ్రహించగలమేమో, మరియు దానితోకూడ వచ్చు గొప్ప బలమును కూడ మనము పొందగలమేమో చూతము.
ఒక పాపి ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తములో కడుగబడి తన పాపముల క్షమాపణను పొందినప్పుడు, అతడు ఒక విశేషమైన పరలోక ఆనందమును పొందును. మనము మాటలాడుచున్న ప్రభువు ఆనందము ఇదియే.
ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కొరకును తృప్తి కొరకును తన జీవితమును ధారపోసినప్పుడు ఈ ఆనందము వృద్ధియగును. మనము ఒకసారి ఈ ఆనందమును పొందిన తరువాత, దానిని దినదినము మరింత మరింతగా అనుభవించగలము. పైన ఇవ్వబడిన అదే లేఖనభాగములో, “ఏమియు సిద్ధపరచనివారికి భాగములు పంపుడి” అని వ్రాయబడియున్నది. మరో మాటలో చెప్పాలంటే, రక్షింపబడిన వ్యక్తి అనుభవించు పరలోక ఆనందమును, దుఃఖములో ఉండి ఈ పరలోక ఆనందము లేనివారికి పంచవచ్చును. అనగా ఒకరు పొందిన పరలోక ఆనందమును ఇతరులతోను, అనగా దుఃఖములో ఉండి అటువంటి ఆనందము లేనివారితోను పంచుకొనవచ్చునని దీని భావము.
ప్రభువు ఈ ఆనందము ప్రతి పాపముపైనను శోధనపైనను కూడ విజయమునిచ్చును. పైన ఇవ్వబడిన లేఖనవాక్యము నుండి ఈ ఆనందము పరలోకసంబంధమైనదని మనము చూతుము.
ఈ ఆనందము యొక్క వివిధ లక్షణములను, ఈ గొప్ప ఆనందమును అందరు ఎలా పొంది అనుభవించగలరో పరిశీలింతము.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
