గొప్ప వెల
20. గొప్ప వెల. ఆకాను తన పాపము కొరకు అతి గొప్ప వెల చెల్లించవలసివచ్చెను. ఇది మనకు, సర్వమానవజాతి పాపములన్నిటికి తీర్పును భరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించవలసివచ్చిన అత్యంత గొప్ప వెలను జ్ఞాపకము చేయవలెను. మన ప్రియమైన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మనమెంత కృతజ్ఞులమై యుండవలెను.
ప్రభువు అయి పైనను, దాని రాజుపైనను, దాని ప్రజలపైనను, దాని పట్టణముపైనను, దాని దేశముపైనను సంపూర్ణ విజయమును వాగ్దానము చేసెను (యెహో. 8:1). వారు యెహోవా ఆజ్ఞలను సంపూర్ణ వివరములతో పాటించినందున ఆ విజయమును అనుభవించగలిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు సాతానుపైనను అతని దుష్ట శక్తిపైనను సంపూర్ణ విజయమును పొందియున్నాడు (Col. 2:15). ఆయన ఆజ్ఞలకు లోబడుటచేత మనము కూడ దినదినము ఆయన విజయమును అనుభవించగలము. మీరు యెహోషువ గ్రంథమును అధ్యయనము చేయునప్పుడు, విశ్వాసము ద్వారా మనము స్వాధీనము చేసికొని, ఆయన వారసత్వమును సంపూర్ణముగా అనుభవించుటకు దోహదపడు అనేక సాధారణమైనను అత్యంత ప్రాముఖ్యమైన సత్యములను మీరు కనుగొందురు. మనమందరము ఈ అనుభవమును పొందుటకు దేవుడు సహాయము చేయుగాక.
వారసత్వము రాబోవు వారసునికి అప్పగించబడినప్పుడు, తాను వారసత్వముగా పొందబోవు ఆస్తుల జాబితా విషయమై సహజముగా ఆ వారసునికి ఆసక్తి కలుగును. దేవుని నుండి మనకు కలుగు వారసత్వములో అనేక అద్భుతమైన దీవెనలు ఉన్నవి. ఆ అద్భుతమైన దీవెనలలో ఒకటి ప్రభువు ఆనందము.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
