English | తెలుగు | हिन्दी

అధ్యాయం 15

అదృశ్య శక్తి

మన వారసత్వం · బఖ్త్ సింగ్

అదృశ్య శక్తి

ఇశ్రాయేలు పిల్లలు ఇప్పుడు యెరికోకు ఎదురుగా ఉండిరి. ఆ సమయమున యెహోవా సేనకు అధిపతి యెహోషువకు కనబడెను. ఈ దర్శనము ద్వారా (Josh. 5:13-15), తానే స్వయముగా తన ప్రజల తరఫున యుద్ధము చేయుదునని దేవుడు అతనికి హామీ ఇచ్చెను. ఆ తరువాత యెహోషువ అనేక యుద్ధములు చేయవలసివచ్చెను గాని ఆ సేనాధిపతి మరెప్పుడును అతనికి కనబడలేదు, ఇక ఆయన గురించి ప్రస్తావింపబడలేదు. అటుపైన ప్రభువు కనబడకయు అదృశ్యరీతిగాను వారి తరఫున యుద్ధము చేయుచుండెను (Josh. 21:43-45). ఆ ప్రభువే మనతో కూడ ఉండునని వాగ్దానము చేసియున్నాడు. ఆయన మన కంటికి కనబడకపోయినను, మన జీవితములను, పథకములను, పరిస్థితులను ఆయనకు సంపూర్ణముగా అప్పగించినయెడల, ఆయన మనతోకూడ ఉండి మన యుద్ధములను తానే చేయును.

ఆ సేనాధిపతి యెహోషువను తన పాదరక్షలను తీసివేయుమని కోరెను. దీని భావం ఏమిటంటే యెహోషువ ప్రతి అపవిత్రత నుండి విడుదల పొందవలెననియే. మనము వివిధ స్థలములలో సంచరించునప్పుడు, ఏదో ఒక విధముగా మాలిన్యము అంటకుండ ఉండలేము. మనము ఈ దుష్ట లోకములో ఉన్నంతవరకు, మనము చూచు వాటివలననో, వినువాటివలననో మలినపరచబడు ప్రమాదములో ఎల్లప్పుడు ఉందుము. ఒక తలంపు గాని, మాట గాని, క్రియ గాని మాలిన్యమును తెచ్చిపెట్టవచ్చు. మనము శుద్ధీకరణ కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తమును క్లెయిమ్ చేసికొనవలెను, అప్పుడు యెహోవా సేనాధిపతి ఎల్లప్పుడు మనతోకూడ ఉండును. ఈ విధముగా రక్తమునందు సాధారణ విశ్వాసము ద్వారా మనలను మనము అపవిత్రపరచుకొనకుండ ఉంచుకొనుచు, ప్రభువు యొక్క అదృశ్యమైనను మిక్కిలి వాస్తవమైన సన్నిధిని అనుభవించి, ఆయనలో మన స్వాస్థ్యములను స్వాధీనము చేసికొనగలము.

[అస్పష్టం]

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑