పోషణ
మన దైనందిన కార్యములను నిర్వహించుటకు శారీరక బలము కొరకు మనకు ఆహారము ఎంత అవసరమో, మన వివిధ బాధ్యతలను భరించుటకును, వివిధ శోధనలను జయించుటకును ప్రభువైన యేసుక్రీస్తు జీవితము మనకు అంతే అవసరము. మనము సరిగా భుజింపనియెడల మన శరీరము మనతో సహకరింపదు. అటులనే ఒక్కసారి భుజించి చాలాకాలము బలముగా ఉండుట సాధ్యము కాదు. మన శరీరములు రోజుకు రెండు మూడుసార్లు భుజించవలసియుండునట్లుగా చేయబడినవి. ఆత్మీయముగా కూడా ఇది సత్యమే. బలపరచబడుటకు మనము విశ్వాసము ద్వారా ప్రభువైన యేసు జీవితమును పుచ్చుకొనవలెను. మనము దినదినము ఆయనతో ఇలా చెప్పుకొనగలము, “ప్రభువా, నీ జీవితమే నా జీవితము. ఈ దినపు కర్తవ్యములకును కార్యకలాపములకును ఆ జీవితమే నాకు కావలెను.” ఈ విధముగా మనము బలపరచబడి, మన బలహీనతలను జయించగలము, లేనియెడల మనము తప్పకుండ ఓడిపోయి బలహీనులముగానే ఉండిపోవుదుము.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
