English | తెలుగు | हिन्दी

అధ్యాయం 19

అడ్డంకులు

మన వారసత్వం · బఖ్త్ సింగ్

అడ్డంకులు

యెహోషువ గ్రంథము ఏడవ అధ్యాయములో ఇశ్రాయేలు పిల్లలు అయి యెదుట ఓడిపోయినట్లు మనము చదువుదుము. అది ఒక మనుష్యుని జీవితములోని పాపము వలననే జరిగెను. మనము శరీరముగా ప్రభువు కార్యములో నిమగ్నమైయున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు సంఘముగా మనము సాతానుతో యుద్ధము చేయుచున్నాము. ఒక్క వ్యక్తి తరఫున వచ్చు వైఫల్యము గాని కొదవగాని సంఘము మొత్తముపై హానికరమైన ప్రతికూల ప్రభావమును చూపును.

యెహోషువయు పెద్దలును ప్రార్థనలో కొనసాగుచుండగా, ఆకాను పాపము బయలుపరచబడెను. దేవుడు వారిని కోరిన విధముగానే దానితో వ్యవహరించబడెను; వెంటనే విజయపు వాగ్దానము నెరవేరుటకు ఆరంభమయ్యెను. దీని వెలుగులో, మనము కూడ మన హృదయములను పరిశోధించుకొని, దేవుని కార్యమునకు ఏ అడ్డంకిని తీసుకురాకుండునట్లు దేవుని ముందును మనుష్యుల ముందును సంగతులను సరిదిద్దుకొనవలెను.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑