ప్రభువు ఆనందం — 1. అపరిమిత ఆనందం
7. అపరిమిత ఆనందం. మొదటిగా, ఇది మిక్కిలి గొప్ప ఆనందము, అది మనకు మిక్కిలి గొప్ప కొలతలో ఇయ్యబడియున్నది. “దూత వారితో ఇట్లనెను, భయపడకుడి, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; అది సమస్త ప్రజలకు కలుగును. కావున దావీదు పురమునందు నేడు రక్షకుడు మీ నిమిత్తము పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు” (Luke 2:10-11). మన ప్రభువైన యేసుక్రీస్తు జననకాలమున దూతలచేత ఈ సందేశము లోకమునకు తేబడెను. అది గొప్ప శక్తితోను అధికారముతోను ప్రకటింపబడెను: “మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.” ప్రభువైన యేసుక్రీస్తు తన గొప్ప ఆనందమును మనకిచ్చుటకు లోకమునకు వచ్చెను. ఈ ఆనందము నేరుగా పరలోకము నుండి వచ్చినది, పరలోకసంబంధమైనది.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
