English | తెలుగు | हिन्दी

అధ్యాయం 16

చొచ్చుబాటు

మన వారసత్వం · బఖ్త్ సింగ్

చొచ్చుబాటు

యెరికోకు గొప్ప బలమైన ప్రాకారములుండెను, ఇశ్రాయేలు పిల్లల భయము వలన ద్వారములన్నియు గట్టిగా మూయబడియుండెను. లోపల పరాక్రమశాలులైన శూరులుండిరి. ఆ ఎత్తైన బలమైన ప్రాకారములను చూచుటయే ఎవరినైనను భయపెట్టియుండును, కానీ ఇశ్రాయేలీయుల విషయములో అలా జరుగలేదు. యెరికోను దాని నివాసులందరితోకూడ తమ చేతికిచ్చినట్లే యని ప్రభువు వారికి వాగ్దానము చేసియుండెను (Josh. 6:2). కాబట్టి యెరికో సమీపమునకు రాకమునుపే విజయము తమదేయని వారు గట్టి నమ్మకముతో ఉండిరి. యెరికో రాజును అతని పరాక్రమశాలులును సాతానును అతని దూతలను సూచించుదురు. మనము దుష్టశక్తులతో పోరాడవలసియున్నది (Eph. 6:12). కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సాతానును ఇదివరకే ఓడించి అతనిని అవమానపరచియున్నాడు (Col. 2:15). ఆయన మన తరఫున ఆ విజయమును సాధించియున్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారా మనము కూడ, దుష్టుని ప్రతి దాడిపైన ఆయన విజయమును క్లెయిమ్ చేసికొనగలము.

దేవుడు తలచుకొనినయెడల తన దూతలచేత యెరికోను నాశనము చేయించుకొనగలిగియుండెను. కానీ ఇశ్రాయేలీయులు తన సహకార్యకర్తలుగా ఉండవలెనని ఆయన కోరుకొనెను. ఆయన సహకార్యకర్తలముగా మారుటకు మనకు బలమైన విశ్వాసము అవసరము. అందుకే ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానములను నమ్మి, ఏ మాత్రము సందేహము గాని ప్రశ్న గాని లేకుండ ఆయన ఆజ్ఞలకు లోబడవలసియుండెను. ప్రభువు కోరుకొనినయెడల, ఇశ్రాయేలీయులు యెరికో పట్టణము చుట్టును ఒక్కసారియే తిరిగి ప్రాకారములు కూలిపోవునట్లు చేయగలిగియుండిరి. కానీ వారు పదమూడుసార్లు ఆ పట్టణము చుట్టును తిరుగవలసివచ్చెనని మనము చూతుము. ప్రతిసారి వారు తిరుగుచున్నకొద్దీ, వారి విశ్వాసము మరింత మరింత బలపడెను. ప్రాకారము పైనుండి తమను చూచుచున్న ప్రజలవైపు ఏ మాత్రము దృష్టి నిలుపవద్దని వారికి ఆజ్ఞ ఇవ్వబడెను. బహుశా ఆ ప్రజలు వారిని చూచి నవ్వుచు హేళన చేయుచుండిరి. మరొకవైపు బాకాలు ఊదుటచేత, ఇశ్రాయేలు పిల్లలు ప్రభువు నుండి వచ్చు విజయమునందు సంతోషించుచుండిరి.

వారి కన్నులు ఆ పట్టణమునుండియు దాని నివాసులనుండియు తప్పించబడి, ప్రభువుపైననే నిలుపబడెను. ప్రభువు మాటలయందుంచిన ఈ బలమైన, క్రియాశీలక విశ్వాసము ద్వారాను, ఆయన ఆజ్ఞలకు సంపూర్ణముగా లోబడుట ద్వారానే వారు వాగ్దాన దేశములో ప్రవేశించి దానిని స్వాధీనము చేసికొనగలిగిరి.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑