ప్రభువు ఆనందం — 4. సురక్షితమైన ఆనందం
4. సురక్షితమైన ఆనందం. నాలుగవదిగా, ఈ ఆనందమును ఎవరును మనయొద్దనుండి తీసివేయలేరు, స్నేహితులైనను శత్రువులైనను, బంధువులైనను అపరిచితులైనను. “మీ ఆనందమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు” (John 16:22). శత్రువులు మన లోకసంబంధమైన ఆనందమును దోచుకొనగలరు గాని, పరలోకము నుండి వచ్చు ఆనందమును తీసివేయలేరు. కొందరు అసూయచేతను వైరముచేతను మనపై అబద్ధపు నిందలు మోపి మన లోకసంబంధమైన ఆనందమును తీసివేయ ప్రయత్నింతురు. కానీ ప్రభువు ఈ ఆనందమును “ఎవడును మనయొద్దనుండి తీసివేయడు”. అటువంటి స్వభావముగల ఆనందము మీకున్నదా? లేక మీ ఆనందమును ఎవరైనను తీసివేయుటలో సఫలమైరా? మీ ఆనందము నిజముగా ఆత్మీయమైనదిగాను పరలోకసంబంధమైనదిగాను ఉన్నయెడల దానిని ఎవరును ముట్టుకోలేరు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
