నిజమైన అనుసరణ
6. నిజమైన అనుసరణ.
యొర్దాను నదిని దాటిన తరువాత ఇశ్రాయేలు పిల్లలు ఎత్తైన గోడలు గల యెరికో పట్టణమును జయించవలసియుండెను. తమకు ముందుగా నడుచుచున్న ప్రభువును వెంబడించి, ఆయన ఆజ్ఞాపించినదంతయు చేసినయెడల, శత్రువు ఓడింపబడుటను తాము చూతుమని ప్రభువు వారితో చెప్పెను. వారు ఈ మార్గములో ఇంతకుముందు నడువలేదనియు, ఐగుప్తులో సంపాదించిన జ్ఞానముపైనైనను వారి గత అనుభవముపైనైనను ఆధారపడలేరనియు దేవుడు ఇశ్రాయేలీయులకు స్పష్టముగా తెలియజేసెను. ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియును, ఆయన మాత్రమే వారిని నడిపింపగలడు. వారు కేవలము ఆయనను వెంబడించవలసియుండెను.
కనాను దేశములోని వేర్వేరు పట్టణములు వేర్వేరు రీతులలో జయింపబడెను. యెరికో జయింపబడిన రీతిలోనే అయి కూడా జయింపబడలేదు. కాబట్టి ప్రభువు ప్రతిసారి వేరొక పథకమును కలిగియుండెను. ఆయన తన పథకములను యెహోషువకు అంచెలంచెలుగా బయలుపరచెను, ఇశ్రాయేలు పిల్లలు ఆ బయలుపరచబడిన పథకమును సంపూర్ణముగా అనుసరించినప్పుడు విజయము తప్పకుండ కలుగునని నిశ్చయత కలిగియుండిరి. తమకును నిబంధన మందసమునకును మధ్య దూరముంచుకొనమని ప్రభువు వారిని అడిగిన కారణము (యెహో. 3:4) వారు తమ దృష్టిని ఆయనపైననే నిలిపి, జాగరూకతతోను భయభక్తులతోను ఆయనను అనుసరించుటకే.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
