సంపూర్ణత
మందసమును మోసిన యాజకులు, ప్రజలందరు ఆవలి తీరమునకు దాటువరకు నదిలోనే నిలిచియుండిరి. ఒక్కరు కూడా వెనుక ఉండిపోకుండ అందరు దాటిపోయిరి. దేవుని విషయమైనంతవరకు, ఆయన ప్రతి విశ్వాసి
వారసత్వమును స్వాధీనము చేసుకొనుటకు తగినంత ఏర్పాటు చేసియున్నాడు. అటువంటి గొప్ప ఆధిక్యత అపొస్తలుడైన పౌలు వంటివారికో లేదా ఇతర గొప్పవారికో మాత్రమే ఉద్దేశింపబడిందని మనం సందేహించి తలంచవచ్చు. కానీ ఒక
రీతిగా దేవుడు మనకు చూపుచున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తమ విశ్వాసముంచువారు, తమ సొంత మానవ సామర్థ్యములపై ఆధారపడక, విశ్వాసము ద్వారా ఆ వారసత్వములో తమ భాగమును పొంది, ప్రభువైన యేసుక్రీస్తు విజయమును తమకొరకు నిశ్చయముగా క్లెయిమ్ చేసికొనగలరు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
