UECF.NETమోషే ప్రత్యక్షపు గుడారము
మోషే ప్రత్యక్షపు గుడారము

United Evangelical Christian Fellowship · UECF.NET · Telugu web book

మోషే ప్రత్యక్షపు గుడారము

The Tabernacle of Moses

సహో. ధర్మా మల్లు (M.Min) · Grace Ministries, విశాఖపట్నం · 2012

“నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను” (నిర్గమకాండం 25:8). ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము, దాని ఉపకరణములు, బలిపీఠపు అర్పణలు మరియు యాజకత్వము — వీటి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కార్యమును వివరించే తెలుగు అధ్యయన గ్రంథము. 15 పటములు, 3 భాగములు, 14 అధ్యాయములు — పూర్తిగా వెతకదగినది.

Front cover of మోషే ప్రత్యక్షపు గుడారము — photograph of the life-size Tabernacle model at Timna, Israel
3భాగములు · Parts
14అధ్యాయములు · Chapters
15పటములు · Diagrams
19kపదాలు · Words
124ముద్రిత పుటలు · Pages

ఫోటోలుPhotographs of the Tabernacle model (Timna Park, Israel)

Photographs: the brazen altar, its bronze grate, the laver, the door of the Tabernacle, the upright boards and the Holy Place Photographs: the table of shewbread, the lampstand with a priest, the altar of incense, the ark of the covenant, the tablets, Aaron’s rod and the manna pot, and the high priest

పై ఫోటోలు ‘bibleplaces.com’ వారి అనుమతితో వాడబడినవి. Photographs used with the permission of BiblePlaces.com.

రచయిత గురించి · ఈ ప్రచురణ గురించిAbout

పుస్తకమును గురించి

‘మోషే ప్రత్యక్షపు గుడారము’ అను యీ పుస్తకమునందు ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణరీతి, అందలి ఉపకరణములు, వాటియందు వాడబడిన పదార్థములు, బలిపీఠపు అర్పణలు మరియు యాజకత్వము యొక్క ప్రాముఖ్యతను గూర్చి వర్ణించబడినది. ప్రత్యక్షపు గుడారమును అధ్యయనము చేయుటలోను, దానిని గూర్చి యితరులకు బోధించుటలోను సహకారిగా వుండవలెనను ఉద్దేశ్యముతో యీ పుస్తకము వ్రాయబడినది.

పాపియైన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పరచబడి, ఆయన సన్నిధి చేరుట ప్రభువైన యేసుక్రీస్తు దైవమానవుడిగా, మధ్యవర్తిగా సిలువలో జరిగించిన రక్షణకార్యము ద్వారా మాత్రమే సాధ్యపడునన్న ప్రాథమిక సత్యము ప్రత్యక్షపుగుడారమునందు మరుగైయున్నది (యోహాను 14:6; అపొ.కా. 4:12).

రచయిత గురించి

సహో. ధర్మా మల్లు

సహో. ధర్మా మల్లు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల సమీపములోని రేవనూరు అను గ్రామములో ఒక హైందవ, వ్యవసాయ కుటుంబములో జన్మించి, తన కళాశాల రెండవ సంవత్సరములో యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిరి. తెలుగు క్రైస్తవ లోకమునకు సాహిత్యపరంగా సహకరించ వలెనను భారముతో మొదట ‘క్రీస్తు ఉపమానములు – దేవుని రాజ్య మర్మములు’ అను పుస్తకమును, రెండవదిగా ‘మోషే ప్రత్యక్షపు గుడారము’ అను యీ పుస్తకమును రచించిరి.

కృతజ్ఞతలు

ఈ పుస్తకమును ప్రచురించుటలో ఎంతో సహాయపడిన దైవదాసులు సహో! డి.యస్.యన్. రాజుగారికి, సహో! హానోకు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. ప్రచురణ కర్తలకు, ట్రెపింగ్లో సహాయపడిన సహో! సతీష్బాబు (రెనీ (గ్రాఫిక్స్) గారికి నా వందనములు. అంతేగాక, యీ పుస్తక పంపిణీలో సహాయము చేసిన దైవదాసులు సహో! వర ప్రసాద్ గారికి, సహో॥ ఇమ్మానుయేలు గారికి, సహో॥ దేవ ప్రసాద్ గారికి నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇందు నిమిత్తమై ప్రార్థించిన విశ్వాసులందరికీ నా కృతజ్ఞతలు.

సహో. ధర్మా మల్లు

ప్రతులకు సంప్రదించండి · Copies of the printed book

Grace Ministries
D.No. 6-38-20/1, L.V. Nagar, Drivers Colony
Gajuwaka, Visakhapatnam – 530 026
Tel. 0891-2511689, 9177747337, 9490885102
E-mail: dmbooks075@gmail.com

Moshe Prathyakshapu Gudaaramu (The Tabernacle of Moses) — Dharma Mallu · First Edition © 2012 · Designing & typesetting: Renee Graphics. Written permission must be obtained from the author for reprinting or translating any part of this book.

About this web edition

This is the UECF.NET web edition of మోషే ప్రత్యక్షపు గుడారము, prepared from the publisher’s 2012 PDF. The printed book was typeset in a legacy (non-Unicode) Telugu font, so the text was converted to Unicode Telugu by optical character recognition of the page images and then checked against the page layout; the fifteen diagrams (పటములు) and the photograph plates are reproduced from the original. A small number of OCR errors may remain — please report any you find to info@uecf.net, quoting the printed page number shown beside each paragraph.

Features: chapter navigation, full-text search (Ctrl/⌘ K), bookmarks, resume where you left off, light/dark theme and adjustable text size — all stored only in your browser. The original PDF is available for download above.