UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము
మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము · Part I — The Tabernacle
5. ప్రత్యక్షపు గుడార ఉపకరణములు
The Furniture of the Tabernacle · ముద్రిత పుటలు 36–60 · 3,872 పదాలు · ≈32 నిమిషాలు
ఈ అధ్యాయములో
36ప్రియులారా, నాలుగవ అధ్యాయమైన “ప్రత్యక్షపు గుడారము”లో ప్రత్యక్షపు గుడార నిర్మాణ ప్రాముఖ్యతను గమనించితిమి. ప్రస్తుత అధ్యాయములో ప్రత్యక్షపు గుడారములోని ఉపకరణముల ప్రాముఖ్యతను ధ్యానించుకొందుము. ప్రత్యక్షపు గుడారము పటము-2 లో చూపబడినట్లు పరిశుద్ధ స్థలము), “అతి పరిశుద్ధస్థలము” అను రెండు భాగములుగా విభజింపబడినది. ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించగానే, కుడివైపున, అనగా ఉత్తర దిక్కున “బల్ల” ఉంచబడినది. బల్లకు యెదురుగా దక్షిణపు దిక్కున “దీప వృక్షము” ఉంచబడినది. ఈ రెండింటి మధ్యలో పడమటి వైపున అతిపరిశుద్ధ స్థలమును వేరుచేయుచున్న “అడ్డతెరికు ముందు “ధూపవేదిక” ఉంచబడినది. చివరిగా అతి పరిశుద్ధస్థలములో “నిబంధన మందసము” ఉంచబడినది. ఈ నాలుగు ఉపకరణములను గురించిన వర్ణన క్రింద యివ్వబడినది.
a) బల్ల (Table of shewbread)
(నిర్గమకాండం 25:23-30; లేవీయకాండం 24:5-9)
“మరియు నీవు తుమ్మకజ్జతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని యెత్తు మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి, దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి, దాని బద్దెపైని చుట్టును బంగారు జవచేయవలెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి, దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోత కట్టిలు ఉంగరములును బద్దెకు సమీపముగా వుండవలెను. ఆ మోతకళ్టిలు తుమ్మకజ్జతో చేసి, వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్చణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను” (నిర్గమకాండం 25:23-380),

38పై వాక్య భాగమును గమనించిన యెడల, బల్లయు, దాని మోత కట్టిలును తుమ్మకజ్టతో చేయబడి, బంగారు రేకుతో పొదగబడినవి. బల్లకు సంబంధించిన పళ్ళెములు, ధూపార్తులు, గిన్నెలు, పాత్రలు మేలిమి బంగారుతో చేయబడినవి. తుమ్మకజట్టి యేసు క్రీస్తు యొక్క ‘పాపరహిత మానవత్వము’ను, బంగారు యేసు క్రీస్తు యొక్క ‘దైవత్వము’ను సూచిస్తున్నవని యిది వరకు చూచితిమి.
ఈ బల్లను గురించి ధ్యానించిన యెడల క్రింద తెలుపబడినట్లు గొప్ప సత్యమును మనము తెలిసికొనగలము.
i) బల్ల, దానిమీది రొట్టెలు సహవాసమును సూచిస్తున్నవి. సాధారణముగా మన టమేమను కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇతరులతో పంచుకొనుటకు బల్లచుట్టూ భోజన సహవాసము కలిగియుందుము. అనగా, బల్ల సహవాసము ప్రేమ కొరకైన ఒక వేదికగా వాడబడుతున్నది. ఉన్నతమైన అధికారము గలవారెవరైనా మనలను భోజనసహవాసమునకు పిలిచిన యెడల, వారి ప్రేమకు పాత్రులముగా యెంచబడి నందుకు మనము సంతోషించి, దానిని ఒక ఆధిక్యతగా యెంచుకొందుము.
యూదా రాజైన యెహోయాకీము బబులోను రాజు దయనొందినవాడై, అతని భోజనబల్ల దగ్గర సహవాసము కలిగియుండెను (2 రాజులు 25:27-30). యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు రాజైన దావీదు దయనొందినవాడై, దావీదు భోజన బల్ల దగ్గర అతనితో సహవాసము కలిగియుండెను (2 సమూయేలు 9:7, 13), మెఫీబోషెతు దావీదును వెదకలేదు గాని దావీదే మెఫీబోషెతును వెదకి, కనుగొని, అతనియందు దయచూపెను (2 సమూయేలు 9:1-5). మెఫీబోషెతు నిస్సహాయ స్థితిలోవున్న మానవుని, దావీదు రాజు దేవుని సూచిస్తున్నారు. ఇదే విధానములో, దేవుడు, మనము టప్రేమించక పోయినప్పటికీ, తానే మొదట మనలను ప్రేమించాడు (1యోహాను 4:19). ఆ ప్రేమను బట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును జీవాహారముగా (రొట్టెలు), జీవజలముగా (పానీయము) మానవులకు అనుగ్రహించెను (యోహాను 4:14, 6:32-385, 7:37, 38; ప్రకటన 22:17). తద్వారా ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము మనకు అనుగ్రహించాడు (1 కొరింథీ 1:9; 1 యోహాను 1:38; ఫిలిప్పీ 2:1).
39యేసుక్రీస్తు పరలోకపు మన్నాగా మనమధ్యకు వచ్చాడు (నిర్గమకాండం 16:4, 5; కీర్తన 78:24). తన శరీరము తిని, తన రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడని చెప్పాడు (యోహాను 6:47-58). తన శిష్యులతో పస్కా భోజనము చేయునపుడు రొట్టెను, ద్రాక్షారసమును వారికిచ్చి, యివి నా శరీరము, రక్తము. వీటిని తిని త్రాగుమని తన శిష్యులతో చెప్పాడు (మత్తయి 26:26-28). తన శరీరము తిని, తన రక్తము త్రాగడమనగా ఆయన ఆజ్ఞలను గైకొని, వాటి ప్రకారము జీవించుటయని అర్థము.
ఆయన మాటల ప్రకారము జీవించినపుడు యేసుక్రీస్తును ఆత్మీయ ఆహారము మరియు ఆత్మీయపానీయము (జీవాహారము మరియు జీవజలము)గా కలిగియుండి, ఆయనతో సహవాసము చేయుదుము (1 కొరింథీ 10:1-4, 15-
21). ప్రభువు దినమందు విశ్వాసులముగా బల్ల చుట్టూచేరి, రొట్టె మరియు ద్రాక్షారసములో పాలుపొందడం ద్వారా ఆయనతో సహవాసము కలిగియుందుము (1 కొరింథి 11:23-28). ప్రభువైన యేసుక్రీస్తునందు మనము అనుభవించబోవు ఐశ్వర్యము విందు సహవాసముతో దేవుని వాక్యములో పోల్చబడియున్నది (యెషయా 25:6; మత్తయి22:4; లూకా22:30). ఇట్టి సహవాసమునకు యేసుక్రీస్తు మానవులందరినీ ఆహ్వానించుచున్నాడు (ప్రకటన 3:20). ఇందు నిమిత్తమే ఆయన భూమిమీద వున్నప్పుడు సుంకరులతోను, పాపులతోను భోజనసహవాసము కలిగి, వారికి సువార్త ప్రకటించెను (మత్తయి 9:9-13).
ii) బల్లమీది రొట్టెలు గోధుమలను నలుగగొట్టి, పిండి చేయుట ద్వారా చేయబడినవి (లేవీకాండం 24:5). ఇదే విధానములో యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము నలుగగొట్టబడి, మనము భుజించుటకు రొట్టెగా చేయబడెను (యెషయా 52:14, 53).
iii) బల్లమీద మొత్తము పండ్రెండు రొట్టెలు వుంచబడినవి (లేవీకాండం 24:6). ఇవి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములకు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కటి చొప్పున చేయబడినవన్నమాటను తెలియజేయుచున్నది. అనగా యేసుక్రీస్తు అనెడి జీవాహారము ఏ ఒక్కరిని విడిచి పెట్టకుండా మానవులందరి కొరకు అందుబాటులో 40 ఉన్నదన్న సత్యమును తెలియజేయుచున్నది (యోహాను 3:16).
40iv) బల్లమీది రొట్టెల మీద స్వచ్చమైన సాంబ్రాణి ఉంచబడినది. అది యెహోవా యెదుట రొట్టెలకు జ్ఞాపకార్థమైన హోమముగా వుండును (లేవీకాండం 24:7). సాంబ్రాణి యేసుక్రీస్తు తండ్రితో కలిగియున్న పరిపూర్ణమైన ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధనా జీవితమును సూచిస్తున్నది.
v) బల్లమీది రొట్టెలు గోధుమ పిండితో చేయబడినవి. ఈ గోధుమ పిండి నూకలు లేనిదై, స్వచ్చమైన పిండిగా ఉన్నది. దీనిని బట్టి యేసుక్రీస్తు ఎలాంటి పాపము, లోపము లేనివాడని చూడగలము. యేసుక్రీస్తు యొక్క పాపరహిత జీవితము యీ క్రింది వచనములలో గమనించగలము.
✿ లూకా 238:4 - ఈ మనుష్యునియందు నాకు ఏనేరమును కనబడలేదు (పిలాతు),
✿ మత్తయి 27:19 - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని (పిలాతు భార్య).
✿ మత్తయి 27:4 - నేను నిరపరాధ రక్తమును అప్పగించి, పాపము చేసితిని (ఇస్కరియోతు యూదా).
✿ లూకా 23:41 - ఆయన యే తప్పిదము చేయలేదు (సిలువ మీది దొంగ).
✿ లూకా 23:47 - ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెను (శతాధిపతి).
✿ మత్తయి 17:5 - ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి (తండ్రియైన దేవుడు),
✿ ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్క్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు (హెబ్రీ 7:26).
vi) బల్లమీది రొట్టెలు ప్రతి విశ్రాంతి దినమున చక్కపరచబడవలెను. అది అహరోను, అతని సంతతివారికి వుండవలెను (లేవీకాండం 24:8, 9). ఈ మాట ప్రతివారము విశ్వాసులు రొట్టె విరిచి, బల్ల సహవాసము దేవునితో కలిగియుందురన్న సత్యమును మనకు సూచిస్తున్నది (అపొ.కా. 2:46, 20:7). ఇది స్థానిక సంఘమునకు దేవుడు ఏర్పరచిన కట్టడగా వుంటున్నది (1 కొరింథీ 11:23-28). అంతేగాక, బల్లమీది రొట్టెలను అహరోను, అతని సంతతివారు (యాజకులు) పరిశుద్ధస్థలములో 41 తినవలెను (లేవీకాండం 24:9). అనగా, రొట్టెలను యాజకులు మాత్రమే తినవలెను. దీనిని బట్టి ప్రభువు బల్ల విశ్వాసులకు మాత్రమేనన్న సత్యమును గమనించగలము. విశ్వాసులు యాజుకులుగా చేయబడియున్నారు (1 పేతురు 2:9; ప్రకటన 1:6). మరియు యాజకులు పరిశుద్ధస్థలములో మాత్రమే యీ రొట్టెలను తినవలెను. పరిశుద్ధ స్థలము రెండువేల మూరల ఘనపరిమాణము గలిగి, సంఘకాలమును సూచిస్తున్నదని గత అధ్యాయములో చదివితిమి. అనగా క్రీస్తు సంఘం యీ భూమి మీద వున్నంతకాలము యీ బల్ల సహవాసము కలిగి యుండవలెనన్న సత్యమును గమనించగలము. చివరిగా, యీ రొట్టెలు అతిపరిశుద్ధమని లేవీకాండం 24:9లో చదువుచున్నాము. ఈ మాట మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధతను సూచిస్తున్నది. దీనిని బట్టి యీ రొట్టెలను తిను యాజకులు (ప్రభువు బల్లలో పాల్గొను విశ్వాసులు) కూడా పరిశుద్ధత తమ జీవితములలో కలిగి, దీనిని ఆచరించవలెనని తెలిసికొనుచున్నాము (1 కొరింథి 11:27, 28).
41vii) చివరిగా, యీ బల్ల రెండు మోతకళ్టలు కలిగి, ఒక స్థలము నుండి యింకొక స్థలమునకు మోయబడుతున్నది (నిర్గమకాండం 25:27). ఇది అరణ్యములో ఇశ్రాయేలీయుల యొక్క యాత్రా జీవితమును సూచిస్తున్నది. విశ్వాసులముగా మనము కూడా యీ భూమిమీద విశ్వాసముతో కూడిన యాత్రాజీవితమును కొనసాగిస్తున్నాము (1 పేతురు 2:11; హెద్రీ11:9-13, 13:14).
b) దీపవృక్షము (Golden candlestick)
(నిర్గమకాండం 25:31-40, 37:17-24)
ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించగానే ఎడమవైపున, అనగా దక్షిణ దిక్కున “దీపవృక్షము” వుంచబడినది.
“మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్కనుండి మూడు కొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి 42 ఆరు కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గపువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గపువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును, వాటి మొగ్దలును, వాటి పువ్వులును వుండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమై నకిషి పనిగా ఉండవలెను. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలిగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర, దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండమీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము” (నిర్గమకాండం 25:31-40).
42దీపవృక్షము పైన చెప్పబడిన విధముగా బంగారుతో చేయబడి, దాని పై భాగమున వున్న ఏడు దీపములు వెలిగింప బడుట ద్వారా పరిశుద్ధ స్థలమంతటికీ వెలుగు కలుగజేయుచున్నది. ఈ దీపవృక్షము క్రింద తెలుపబడిన సత్యమును తెలియ జేయుచున్నది.
i) దీపవృక్షము మొదటిదిగా దేవుడు లోకమునకు వెలుగైయున్నాడన్న సత్యమును సూచిస్తున్నది (1 యోహాను 1:5). ఆయన జ్యోతిర్మయుడు (యాకోబు 1:17). వెలుగు యొక్క నివాసస్థలము ఆయన యొద్ద వున్నది (దానియేలు 2:22). ఆయనకు రాత్రి పగటివలె వుండును (కీర్తన 139:12). యేసుక్రీస్తు లోకమునకు వెలుగు (యోహాను 1:4, 9, 8:12, 9:5). దేవుని వాక్యము (యేసుక్రీస్తు) మన త్రోవకు వెలుగు (కీర్తన 119:105).
ii) రెండవదిగా, దీపవృక్షము పరిశుద్ధస్థలమునకు వెలుగునిచ్చినట్లు, యేసుక్రీస్తు ద్వారా దేవుని వెలుగు చేత వెలిగింపబడిన మనము (సంఘము) ఈ కృపాకాలములో దేవుని వెలుగును అన్యులపై ప్రకాశింపజేయవలెనని తెలుసుకొనుచున్నాము.

44మనము ఒకప్పుడు చీకటియై యుండగా, యేసుక్రీస్తు ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మనలను నడిపించెను (మత్తయి 5:14; 1 పేతురు 2:9; ఎఫెసీ 5:8, 13, 14). ఇట్లు దేవుని వెలుగు చేత వెలిగింప బడిన మనము యీ లోకములో వెలుగు సంబంధుల వలె, జ్యోతులవలె నడుచుకొనవలెనని (ఎఫెసీ 5:10-11; ఫిలిప్పీ 2:15; సామెతలు 4:18) దేవుని వాక్యము సెలవిస్తున్నది.
iii) దీపవృక్షము యొక్క కొలతలు వాక్యములో వ్రాయబడలేదు. దీనిని బట్టి దేవుని వెలుగు అపరిమితమైనదని తెలుసుకొనవచ్చును. దేవుడు సమీపించరాని తేజస్సులో నివసించుచున్నాడని వాక్యము తెలియజేయుచున్నది (1 తిమోతి 6:16). ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె వున్నది (ప్రకటన 1:16).
iv) దీపవృక్షము మేలిమి బంగారుతో చేయబడినది. బంగారు యేసుక్రీస్తుయొక్క దైవత్వమును సూచిస్తున్నదని మరొకసారి గమనించుచున్నాము.
v) దీపవృక్షము నకిషి పనిగా చేయబడినదని పై వాక్య భాగములో చదివితిమి. అనగా బంగారు కొలిమిలో కరిగించబడి, శుద్ధిచేయబడి, దీపవృక్షముగా పోయబడినది. దేవుని వాక్యము ‘బంగారునకు కొలిమి తగినది’ అని సెలవిస్తున్నది (సామెతలు 17:3, 27:21). బంగారు యొక్క ముడి పదార్ధము భూమిలోనుండి తీయబడిన తరువాత అది కొలిమిలో బాగా కరిగించబడి, శుద్ధిచేయబడినపుడే బంగారు వచ్చును. దేవుని వాక్యము మన ‘విశ్వాసము’ను బంగారుతో పోల్చుచున్నది. “నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దాని కంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును” (1 పేతురు 1:7). బంగారు, వెండి కొలిమిలో అగ్ని చేత నిర్మలము చేయబడు విధానములో, విశ్వాసయాత్రలో మన విశ్వాసము శోధనలు, పరీక్షల ద్వారా నిర్మలము చేయబడునని దేవుని వాక్యము సెలవిస్తున్నది (జెకర్యా 13:9; యోబు238:10; యెషయా 1:25, 48:10; మలాకీ 3:3; కీర్తన 66:10). ఈ శోధనలు సహించినపుడు పైన చెప్పబడినట్లు మనకు మెప్పు కలుగును. అట్టివారికి 45 ప్రభువు జీవకిరీటము అనుగ్రహించును (యాకోబు 1:12).
45vi) పటము-12లో చూపబడినట్లు దీపవృక్ష ప్రకాండము నుండి ఆరు కొమ్మలు వచ్చుచున్నవి (నిర్గమకాండం 25:32). ఈ మాట “యేసుక్రీస్తు ద్రాక్షావల్లి, ఆయన యందు విశ్వాసముంచువారు తీగెలు” అన్న సత్యమును సూచిస్తున్నది (యోహాను 15:5). తీగెలు ద్రాక్షావల్లిలో నిలిచియున్నపుడే అవి యెదిగి ఫలించును. అదే విధానములో మనము యేసుక్రీస్తునందు నిలిచియున్నపుడే ఆత్మీయంగా యెదిగి, ఫలించువారమైయుందుము (యోహాను 15:4). తీగెలు యెదుగుటకు కావలసిన జీవము కాండములో నుండి (ద్రాక్షావల్లిలో నుండి) వచ్చును. అదే విధముగా విశ్వాసులు ఆత్మీయముగా యెదిగి, ఫలించుటకు కావలసిన జీవము యేసుక్రీస్తు నుండి వచ్చును (యోహాను 10:10, 14:6).
vii) దీపవృక్షము యొక్క కాండము, దాని ఆరు కొమ్మలపైన యేడు దీపములు చేయబడియున్నవి. ఈ దీపములు పరిశుద్ధ స్థలమంతటికీ వెలుగునిచ్చుచున్నవి (సంఖ్యాకాండం 8:2, 3; నిర్గమకాండం 25:37, 40:25). ఈ యేడు దీపములు ప్రకటన 1:12-20 లో చెప్పబడిన యేడు సంఘములను (యేడు దీపస్తంభములను) సూచిస్తున్నవి. ఈ యేడు దీపములు పరిశుద్ధస్థలమంతటికీ వెలుగునిచ్చినట్లు, క్రీస్తు సంఘము యీ కృపా కాలములో జ్యోతివలె అన్యులను క్రీస్తు ప్రేమతో వెలిగించవలెనన్న సత్యమును గమనించగలము.
viii) పైన చెప్పబడిన యేడు దీపములు వెలిగింపబడుటకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనెను వాడవలెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (లేవీకాండం 24:1-4; నిర్గమకాండం 27:21). “దంచి తీసిన అచ్చమైన ఒలీవనూనె” పరిశుద్ధాత్మ శక్తిని సూచిస్తున్నది. ఒలీవ నూనె దీపమును వెలిగింపజేసినట్లు, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము ద్వారా మనము యేసుక్రీస్తు కొరకు సాక్షులముగా జీవించగలము (అపొ.కా. 1:8).
ix) దీపవృక్షము మీది దీపములు మానక నిత్యమూ వెలిగింపబడవలెను (నిర్గమకాండం 27:20; లేవీ కాండం 24:2). ఆలాగుననే, యేసుక్రీస్తు కొరకు మనము గప్రతి దినమూ సాక్షులమై యుండవలెను (లూకా 9:23; అపొ.కా. 2: 46, 46 5:42, 17/7:11, 17, 19:9; 1 కొరింథి 15:31; హెబ్రీ 3:18),
46X) దీపవృక్షము మీది దీపములు చక్కగా వెలుగునట్లు అహరోను, అతని కుమారులచేత సవరింపబడుచున్నవి (నిర్గమకాండం 27:21; లేవీకాండం 24:3, 4). ఈ మాట “ఫలించు ప్రతి తీగె మరి యెక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును” అన్న యేసుక్రీస్తు మాటను సూచిస్తున్నది (యోహాను 15:2). పైన చెప్పబడినట్లు విశ్వాసములో మనము వృద్ధిపొందు నిమిత్తము శ్రమలు, పరీక్షలగుండా వెళ్లవలసియుందుము (యోహాను 16:33; 2 తిమోతి 3:12; అపొ.కా. 14:22; హెబ్రీ 12:5, 6; 2 కొరింథి 12:7).
c) ధూపవేదిక (Altar of incense)
(నిర్గమకాండం 30:1-10, 34-38, 37:25-29)
పరిశుద్ధ స్థలములో వుంచబడిన మూడవ ఉపకరణము ధూపవేదిక. ఇది అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయుచున్న అడ్డతెరకు ముందు ఉంచబడినది. ధూపవేదిక నుండి పైకి వెళ్ళు చున్న ధూపము విశ్వాసుల యొక్క ఆరాధన, ప్రార్థనలను సూచిస్తున్నది. ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలమునకు ముందు వుంచబడినదను మాట విశ్వాసుల ఆరాధన, ప్రార్థనలు దేవునికెంతో ప్రియమైనవన్న సత్యమును సూచిస్తున్నది.
“మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకట్టతో దాని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగానుండవలెను. దాని యెత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. దాని పై భాగమునకును, దాని నాలుగు ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి, దానికి చుట్టు బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను. దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోత కళలకు స్థలములు. ఆ వోతకళట్టిలను తుమ్మకజ్జతో చేసి, వాటికి బంగారురేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా

48శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునపుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దానిమీద అన్య ధూపమునైనను, దహనబలి సంబంధమైన ద్రవ్యమైనను, నైవేద్యమైనను అర్పింపకూడదు. పానీయమునైనను దానిమీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాపపరిహారార్థబలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది” (నిర్గమకాండం 30:1-10).
పై వాక్య భాగమును గమనించిన యెడల ధూపవేదికను గురించి క్రింద తెలుపబడిన సత్యమును చూచెదము.
i) ధూపవేదిక తుమ్మకజ్ఞతో చేయబడి, బంగారు రేకుతో పొదగబడినది. తుమ్మకజ్ఞ యేసుక్రీస్తు యొక్క పాపములేని మానవత్వమును, బంగారు యేసుక్రీస్తు యొక్క దైవత్వమును సూచిస్తున్నవని గత అధ్యాయములలో చూచితిమి. కనుక యీ ధూపవేదిక యేసుక్రీస్తును సూచిస్తున్నది.
ii) ధూపవేదిక బంగారు జవతో చుట్టబడియున్నది. ఇది యేసుక్రీస్తు యొక్క రాజరికమును సూచిస్తున్నది. దీనిని గూర్చిన వివరణ “నిబంధన మందసము”లో యివ్వబడినది.
iii) ధూపవేదికపై ధూపము అర్పించుట అహరోను మరియు అతని కుమారుల పని. అనగా యాజకుల పని. అయితే, యేసుక్రీస్తు వారికంటె శ్రేష్టమైన యాజకుడుగా మన మధ్యకు వచ్చాడు. పాతనిబంధన లోని యాజకులు బలహీనతలు గలిగిన మనుష్యులై యుండిరి. అయితే యేసుక్రీస్తు పాపము, అపవిత్రత, దోషము లేక మనకు సరిపోయిన ప్రధానయాజకుడాయెను (హెబ్రీ 49 77:26-28). భూసంబంధయాజకులు మరణమునకు లోనైన వారు గనుక అనేకులుండిరి గాని యేసుక్రీస్తు నిరంతరము జీవిస్తూ, మార్పులేని యాజకత్వము కలిగియున్నాడు (హెబ్రీ 7:23, 24). పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి మేకలయొక్క మరియు కోడెల యొక్క రక్తముతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, తన సొంత పాపముల కొరకు, ప్రజలందరి పాపముల కొరకు ఆ రక్తమును అర్పించుచుండెను. అయితే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకునిగా తన్నుతాను అనేకుల పాపము భరించుటకు సిలువమరణము పొంది, తన రక్తము చిందించుట ద్వారా నిత్యమైన పాప విమోచన ప్రజలందరికీ సంపాదించి, అతి పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించెను (హెబ్రీ 7:28, 8:1-6, 9:1-28, 10:1-15). కనుక యేసుక్రీస్తు యొక్క ప్రధానయాజకత్వము పాత నిబంధనలోని యాజకత్వము కంటె శ్రేష్టమైనదని గమనించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క యాజకత్వపు అర్పణ (సిలువమరణము) దేవుని ఉగ్రత నుండి తప్పించి, పాపులనందరినీ నీతిమంతులుగా తీర్చునదిగా వున్నది (రోమా 5:1, 9).
49iv) పైన చెప్పబడినట్లు ధూపవేదిక మీది ధూపము యేసుక్రీస్తు యొక్క బలియాగమును సూచిస్తున్నది. రెండవదిగా యీ ధూపము యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన ప్రార్థనలను సూచిస్తున్నది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి, దేవుడి కుడి పార్కమున ఉన్నవాడై, మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు (రోమా 8:34). తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు (హెబ్రీ 7:25). దేవుడొక్కడే. దేవునికిని, నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన “క్రీస్తుయేసు” అను నరుడు (1 తిమోతి 2:5). ఆయన మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను (హెబ్రీ 9:24).
మూడవదిగా, ధూపవేదిక మీది ధూపము విశ్వాసుల ఆరాధన, స్తుతి, ప్రార్థనలను సూచిస్తున్నది. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువారు యాజకులుగా చేయబడి, ఆయనను బట్టి దేవుని సన్నిధిలో ప్రవేశము కలిగియున్నారు (1 పేతురు 50 2:9; ప్రకటన 1:6; ఎఫెసీ 2:18; హెబ్రీ 10:21, 22). వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుదురు (1 పేతురు 2:5). తమ శరీరములను సజీవయాగముగా దేవునికి అర్పించుదురు (రోమా 12:1). తమ జిహ్వాఫలము అర్పించుట ద్వారా దేవునికి స్తుతియాగము చేయుదురు (హెబ్రీ 13:15). ఉపకారము, ధర్మము అను యాగములు చేయుదురు (హెబ్రీ 18:16). ఇతరుల పట్ల దయాళుత్వము ప్రదర్శించుట ద్వారా దేవునికి ప్రీతికరమైన యాగము చేయుదురు (ఫిలిప్పీ 4:18). వారి ప్రార్ధనలు ధూపము వలె దేవుని సన్నిధికి చేరును (కీర్తన 141:2; ప్రకటన 8:3, 4).
50v) ధూపవేదిక మీది ధూపము కొరకు జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క స్వచ్చమైన సాంబ్రాణి అను పరిమళ ద్రవ్యములు సమభాగములుగా ధూపద్రవ్యముగా (పొడిగా) చేయబడుచున్నవి (నిర్గమకాండం 30:34). అనగా యీ నాలుగు రకముల పరిమళ ద్రవ్యములు గుర్తింపులేనంతగా దంచబడి, పొడిగా చేయబడి, ధూపద్రవ్యముగా చేయబడినప్పుడే వాటినుండి సువాసనగల ధూపము వచ్చుచున్నది. అలాగే, మనము కూడా యీ లోకము, శరీరము కొరకు చనిపోయి, క్రీస్తు కొరకు జీవించినపుడు, మన జీవితములు దేవుని సన్నిధిలో సువాసనగల ధూపము వలె వుండును (రోమా 6:11, 13). గోధుమగింజ భూమిలోపడి, చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (యోహాను 12:24, 25).
పైన చెప్పబడిన నాలుగు పరిమళద్రవ్యములతో చేయబడిన ధూపద్రవ్యము ఉప్పుగలదియు, స్వచ్చమైనదియు, పరిశుద్ధమైనదియు నైయున్నది (నిర్గమకాండం 30:35). అలాగే మన క్రైస్తవజీవితములు ఉప్పుగలిగి, స్వచ్ళమైనవి మరియు పరిశుద్ధమైనవిగా ఉన్నప్పుడే దేవునికిష్టమైన ధూపద్రవ్యముగా వుందుమని దీనిని బట్టి తెలుసుకొనుచున్నాము. ‘మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి, 51 మనుష్యులచేత త్రొక్కబడుటకేగాని మరి దేనికిని పనికిరాదు” (మత్తయి 5:13). “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను, కృపాసహితముగాను ఉండనియ్యుడి”(కొలస్సి 4:6), స్వచ్చముగా వుండడమనగా నిర్లోషముగా, నిందా రహితముగా వుండుటయని తెలిసికొనుచున్నాము. “మనము తన యెదుట పరిశుద్ధులమును, నిరోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను యేర్చరచుకొనెను” (ఎఫెసీ 1:6).
51vi) ధూపవేదిక మీద అన్య ధూపమును అర్పింపకూడదు (నిర్గమకాండం 30:9). నాదాబు, అభీహులు దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు దేరి వారిని కాల్చివేసెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (లేవీయకాండం 10:1-3). కోరహు, దాతాను, అబీరాములు, వారి సంబంధులును తిరుగుబాటుతో కూడిన ధూపమువేసి, నశించిరి (సంఖ్యాకాండం 16). దీనిని బట్టి మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుచూ, ఆయనను ఆరాధించలేమని, అట్లు చేసిన యెడల దేవుని ఉగ్రతకు పాత్రులమగుదుమని తెలుసుకొనుచున్నాము. అననీయ, సప్పీరాలు కపటముతో దేవుని సేవించగోరి, నశించిరి (అపొస్తలుల కార్యములు 5:1-11). ఇశ్రాయేలీయులు తమ చుట్టూవున్న ప్రజల పాపములో పాలివారు కాకుండా, యథార్థపరులై తనను సేవించవలెనని దేవుడు వారిని కోరెను (ద్వితీయోపదేశకాండం 18:9-14). అందువలన మనము దైవ కృపగలిగి, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్పియైయున్నాడు” (హెబ్రీ 12:28-29).
vii) ధూపవేదిక చచ్చౌకముగా వుండి, నాలుగు మూలలలో నాలుగు కొమ్ములు కలిగియున్నది (నిర్గమకాండం 30:1-2) బలిపీఠపు కొమ్ములు రక్షణ శృంగమును సూచిస్తుండగా ధూపవేదిక కొమ్ములు విశ్వాసుల ప్రార్ధనలయొక్క బలమును సూచిస్తున్నవి. “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై యుండును” (యాకోబు 5:16). సంవత్సరమున కొకసారి అహరోను పాపపరిహారార్థ 52 బలి రక్తముతో ధూపవేదికకు ప్రాయశ్చిత్తము చేయుచుండెను (నిర్గమకాండం 30:10). ఈ మాటను బట్టి మన ప్రార్ధనలకు బలము కేవలము యేసుక్రీస్తు రక్తము వలననే కలుగుచున్నదని తెలుసు కుంటున్నాము. గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టి మనము సాతానును జయించుదుము (ప్రకటన 12:11).
52viii) చివరిగా అహరోను ప్రతిదినము ప్రొద్దున, సాయంత్రము మరియు ప్రదీపములను చక్కపరచునపుడెల్లను ధూపవేదిక మీద ధూపము వేయవలెనని నిర్గమకాండం 30:7-8 లో చదువుచున్నాము. దీనిని బట్టి మన ప్రార్ధనల యందు మనము యెడతెగకయుండవలెనని తెలుసుకుంటున్నాము (ఎఫెసి 6:18; కొలస్సి 1:3, 4:12; అపొ.కా. 12:5; రోమా 1:9; 1 ఛెస్సలోనీకయులకు 1:3, 2:18, 5:15; 2 తిమోతి 1:3; రోమా 12:12).
ధూపవేదికను గూర్చిన సత్యమును అనుసరించుటకు దేవుడు మనకు సహాయముచేయునుగాక.
d) నిబంధన మందసము (Ark of the Covenant)
(నిర్గమకాండం 25:10-22, 37:1-9)
ప్రియులారా, ప్రత్యక్షపు గుడార పరిశుద్ధస్థలములో ఉంచబడిన బల్ల, దీపవృక్షము మరియు ధూపవేదిక అను ఉపకరణములను గురించి యింతవరకు యీ అధ్యాయములో ధ్యానించితిమి. యిప్పుడు పరిశుద్ధ స్థలములోనుండి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, అచ్చట వున్న “నిబంధన మందసనమూుిను గురించి ధ్యానింతుము. అతిపరిశుద్ధస్థలము వెయ్యిమూరల ఘనపరిమాణము కలిగి, క్రీస్తు రెండవరాకడలో నుండబోవు వెయ్యేళ్ల పరిపాలన మరియు నిత్యరాజ్యమైన “నూతన యెరూషలేము”ను సూచిస్తున్నది (ప్రకటన 220:1-6, 21, 22). అతి పరిశుద్ధ స్థలములో వుంచబడిన నిబంధన మందసము అచ్చట లేనియెడల ప్రత్యక్షపు గుడారములోని మిగిలిన ఉపకరణములన్నియు అర్థరహితమగును. దీనిని బట్టి “నిబంధన మందసము” యొక్క ప్రాముఖ్యత యెంత గొప్పదో మనకు తెలియుచున్నది. దాని ప్రాముఖ్యతను క్రిందనివ్వబడిన వివరణలో గమనించగలము.

54“వారు తుమ్మకజ్టతో నొకమందసమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని యెత్తు మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను, వెలుపలను దానికి పొదిగింపవలెను. దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు, యెదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దానికి నాలుగుకాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకజట్టతో మోతకళట్టిలను చేసి, వాటికి బంగారు రేకులను పొదిగించి, వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకళ్టిలను దూర్చవలెను. ఆ మోతకళ్టిలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీది కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణా పీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా, వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును యెత్తి ఆ మందసము మీద వుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని, కరుణాపీఠము మీద నుండియు, శాసనములు గల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను” (నిర్గమకాండం 5:10-22).
నిబంధన మందసము సాక్ష్యపుమందసమనియు (నిర్గమకాండం 30:6), యెహోవా నిబంధనమందసమనియు (సంఖ్యాకాండం 10:33), పరిశుద్ధ మందసమనియు (2 దినవృత్తాంతములు 35:3), బలసూచకమైన మందసమనియు 55 (కీర్తనలు 132:8) పిలవబడుతున్నది. ఈ మందసమును గూర్చి క్రిందతెలుపబడిన సత్యమును గమనించగలము.
55i) నిబంధన మందసము భూమిమీద దేవుని సింహాసనమును సూచిస్తునది (2 సమూయేలు 86:2). దేవుని ప్రకాశము మందసమును ఆవరించియున్నది. “కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము” (కీర్తన 80:1).
ii) మందసము దేవుని పరిశుద్ధతను సూచిస్తున్నది. బేత్సెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి, ఆ జనులలో ఏబదివేల డెబ్బదిమందిని మొత్తెనని మరియు జనులు దుఃఖాక్రాంతులైరనియు 1 సమూయేలు 6:19లో వ్రాయబడియున్నది. మరియు దావీదు మహారాజు తన జనులతో కలిసి, మందసమును యెరూషలేమునకు తరలిస్తున్నప్పుడు ఎడ్లుకాలు జారినందున పడబోతున్న మందసమును ఉజ్ఞా చేయిచాపి, పట్టుకొనినందున యెహోవా అతనిని మొత్తెనని 2 సమూయేలు 6:5-7లో చదువుచున్నాము. దీనిని బట్టి మందసము ప్రతిష్ఠించబడిన యాజకుల చేతనే మోయబడవలెననియు, అన్యులు దానిని ముట్టకూడదనియు తెలుసుకుంటున్నాము.
iii) మందసము దైవత్వము యొక్క సర్వపరిపూర్ణతను అనగా యేసుక్రీస్తును సూచిస్తున్నది (కొలొస్సయులకు 1:19, 2:9; యోహాను 1:14). దీనిని గూర్చి క్రింద యివ్వబడిన వివరణలో అధికముగా తెలుసుకొందుము.
iv) నిబంధన మందసము తుమ్మకజ్జతో చేయబడి, దానికి లోపలను, వెలుపలను బంగారు రేకుతో పొదిగింపబడినది. తుమ్మకట్టి యేసుక్రీస్తు యొక్క పాపరహిత మానవత్వమును (కీర్తన 16:10; లూకా 1:35; 1 పేతురు 1:23; 1 యోహాను 3:5), బంగారు యేసుక్రీస్తు యొక్క దైవత్వమును (1 తిమోతి 3:16; మత్తయి 1:21-23; యెషయా 7:14, 9:6; యోహాను 1:14). సూచిస్తున్నవని యిదివరకు మనము చూచితిమి.
v) నిబంధన మందసము బంగారు జవతో చుట్టబడియున్నది. బంగారు జవ ఒక కిరీటమును సూచిస్తున్నది. అనగా యిది యేసుక్రీస్తు యొక్క రాజరికమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు భూమి మీద వున్నప్పుడు యూదుల రాజుగా 56 పిలువబడ్డాడు (మత్తయి 2:2, 221:1-11; యోహాను 19:14). ఆయన రాజరికము దేవుని వాక్యములో అనేక మారులు ప్రవచింపబడినది (ఆదికాండం 49:10; సంఖ్యాకాండం 24:17; యెషయా 9:6, 7; మీకా 5:2, 3), యేసుక్రీస్తు స్థాపించబోవు రాజ్యము శాశ్వతమైనది మరియు బలమైనది (దానియేలు 2:44, 7:14; ప్రకటన 11:15; కీర్తన 45:6, 7). అది సత్య సంబంధమైనదై (యోహాను 18:3817, 38; కొలస్సి 1:13), నీతి, న్యాయములు కలిగియుండును (యిర్మీయా 23:5-6, 33:14-18).
56vi) నిబంధన మందసము మోయబడునట్లు తుమ్మకజ్జతో చేయబడి, బంగారు రేకుతో పొదగబడిన రెండు మోతకళట్టిలు కలిగియున్నది. ఇది మరొకసారి యేసుక్రీస్తు యొక్క ధైవత్వ మానవత్వములను సూచిస్తున్నది. లేవీయులు మందసమును మోతకళ్టిలతో తమ భుజముల మీదకి యెత్తికొనిరి (1 దినవృ 15:15). ఇశ్రాయేలీయులు తమ అరణ్య ప్రయాణములో తాము వెళ్లిన చోటికి మందసమును మోసికొని పోయిరనుమాట భూమి మీద మనము యాత్రికులము, పరదేశులమై యున్నామనియు, మన యాత్రా జీవితములలో దేవుని సన్నిధిని, సహవాసమును కలిగి యుండవలెనను సత్యమును సూచిస్తున్నది (మత్తయి 8:20; యోహాను 15:19; 1పేతురు 2:11). అరణ్య ప్రయాణము ముగిసిన తరువాత ఇశ్రాయేలీయులు సొలొమోను మందిరములో మందసమును వుంచిరి (1 రాజులు 8:8). అలాగే, భూమి మీద విశ్వాసులు తమ యాత్రాజీవితము ముగిసిన వెంటనే దేవుని చేత నిర్మింపబడిన, దేవుని నిబంధన మందసము కలిగియున్న పట్టణములో శాశ్వతముగా నివసింతురు (హెబ్రీ 11:10; ప్రకటన 11:19).
vii) నిబంధన మందసములో అతిప్రధాన అంశమైన “కరుణాపీఠము”ను గురించి యిపుడు ధ్యానింతుము. కరుణాపీఠము మేలిమి బంగారుతో చేయబడినది (నిర్గమకాండం 25:17). బంగారు దేవత్వమును సూచిస్తున్నది. ఈ కరుణాపీఠము మీద సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు రక్తమును ప్రోక్షించుచున్నాడు (లేవీయకాండం 16). అనగా పాపులైన మానవులు దేవునితో సమాధాన పరచబడుటకు దేవుడు మానవుడై, తన రక్తమును చిందించాడు. ఈ దైవమానవుడే యేసుక్రీస్తు, దేవుని యొక్క కరుణాపీఠము.
57పరిశుద్ధ గ్రంథము దేవుడు పరిశుద్ధుడని సెలవిస్తున్నది (కీర్తనలు 99:5, 9; యెషయా 6:3, 57:15; 1 పేతురు 1:14-16; నిర్గమకాండం15:11; (ప్రకటన 15:4; 1 సముయేలు 2:2). దేవుని పరిశుద్ధతను సూచించే శాసనములు (పది ఆజ్ఞలు) నిబంధన మందసములో వుంచబడినవి (నిర్గమకాండం 25:20). ఈ శాసనములను అతి క్రమించుట ద్వారా మానవుడు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసియున్నాడు (రోమా 3:11, 12, 23; యెషయా 53:6; కీర్తన 14:3, 119:176; ఎఫెసీ 2:12, 4:18). తాను చేసిన పాపమును బట్టి ప్రతి మానవుడు దేవుని ఉగ్రతకు, నిత్యమరణమునకు (నరకము) పాత్రుడయ్యాడు (రోమా 2:2-8, 6:23; ప్రకటన 21:8; యోహాను 3:36). అయితే, దేవుడు ప్రేమా స్వరూపి (1 యోహాను 4:8) గనుక మానవునిపై “కరుణ” చూపించాలనే “నిబంధన” చేసియున్నాడని నిబంధన మందసముపై వున్న “కరుణాపీఠము” మనకు తెలియజేయుచున్నది (1 యోహాను 4:10). ఈ కరుణాపీఠమే యేసుక్రీస్తు (రోమా 3:24-26; హెబ్రీ 9:5-12) యేసుక్రీస్తు తాను సిలువలో కార్చిన రక్తము ద్వారా పాపులైన మానవులను దేవునితో సమాధానపరచి (2 కొరింధి 5:18, 19; 1 పేతురు 1:18, 19), మానవుల పాపములకు శాంతికరమై యున్నాడు (1 యోహాను 2:2). యేసు క్రీస్తు రక్తము మానవులపైవున్న దేవుని ఉగ్రతను తీసివేయుటను బట్టి మానవులు దేవుని కృపాసనము యొద్దకు రాగలుగుదురు (హెబ్రీ 4:14-16). నిబంధన మందసములో వున్న దేవుని శాసనములను కరుణాపీఠము కప్పివేసినట్లు, దేవుని శాసనములను అతిక్రమించి మానవుడు చేసిన పాపమును యేసుక్రీస్తు కప్పివేశాడు (యోహాను 1:29). తద్వారా మాత్రమే (క్రీస్తు రక్తమును బట్టి మాత్రమే) దేవుడు కరుణాపీఠముపై నుండి మానవునితో సంభాషించాడు (నిర్గమకాండం 25:22; సంఖ్యాకాండం 7:89). కరుణాపీఠము నొద్ద కృపాసత్యములు కలియుచున్నవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొన్నవి (కీర్తన 85:10; యోహాను 1:14).
ప్రియులారా, యీ సంగతుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుచుండిన యెడల, పాపక్షమాపణ అనుభవములేని వారైతే, విశ్వాసముతో యీ క్రింది ప్రార్థనను చేసినట్లయితే దేవుడు మిమ్ములను రక్షించును. “దేవా, నేను పాపిని, నా పాపముల కొరకు యేసుక్రీస్తు రక్తము కార్చినందుకు వందనములు. యేసురక్తముతో నా 58 పాపములను కడిగి, నన్ను నీతిమంతునిగా తీర్చి, నిత్యజీవమును నాకు అనుగ్రహించుము. మీ రాకడవరకు మీ కొరకు సాక్షిగా జీవించుటకు సహాయము చేయుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ. ఆమెన్.”
58viii) కరుణాపీఠమునకు రెండు వైపుల రెండు కెరూబులు చేయబడినవి. అవి తమ ముఖములు కరుణాపీఠము వైపు కలిగి, తమ రెక్కలతో కరుణాపీఠమును కప్పుచున్నవి (నిర్గమకాండం 25:18-20). దేవుడు కెరూబుల మీద ఆసీనుడై యున్నాడనియు (కీర్తన 80:1, 99:1), కెరూబుల మధ్య నివసిస్తున్నాడనియు (2 సమూయేలు 6:2; యెషయా 37:16), యెహోవా మహిమ కెరూబుల పైన వున్నదనియు (యెహెజ్కేలు 10:4, 18, 11:22) వాక్యము సెలవిస్తున్నది. కెరూబుల మధ్యనుండి దేవుడు మోషేతో మాటలాడెను (సంఖ్యాకాండం 7:89). ప్రత్యక్షపు గుడార పై కప్పు తెర మరియు అతి పరిశుద్ధ స్థలమునకు ముందున్న అడ్డతెరయు కెరూబులు కలిగియున్నట్లుగా మనము చూచితిమి (నిర్గమకాండం 26:1, 31), కనుక కెరూబులు దేవుని సన్నిధికి సాక్ష్యములని తెలుసుకుంటున్నాము.
ix) నిబంధన మందసము దేవుడు మానవుని కలుసుకొను స్థలముగా వర్ణించబడినది (నిర్గమకాండం 29:42, 30:6, 36; సంఖ్యాకాండం 7:89). అనగా యిక్కడ దేవుని మహిమ ప్రత్యక్షమగుచున్నది. ఈ మహిమ హెబ్రీ భాషలో “పెకీనా” అని పిలువబడుతున్నది. ప్రత్యక్షపు గుడారము పూర్తి చేయబడినప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మెననియు, యెహోవా తేజస్సు మందిరమును నింపెననియు దేవుని వాక్యము సెలవిస్తున్నది (నిర్గమకాండం 40:34). ఆ మేఘము పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్బిస్తంభముగా ఇశ్రాయేలీయులను నడిపించెను (నిర్గమకాండం 40:35-38),
ప్రస్తుత కాలములో దేవుని మహిమ యేసుక్రీస్తు రూపములో లోకమునకు బయలుపరచబడినది (2 కొరింథీ 4:6). యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయున్వాడు (హెబ్రీ 1:3), ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమయనియు (యోహను 1:14), మహిమాస్వరూపి యనియు (1 కొరింథీ 2:8), మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వంటి ముఖము కలిగిన వాడనియు (ప్రకటన 1:16) 59 వాక్యములో వర్ణింపబడినాడు.
59x) చివరిగా నింబంధన మందసములో వుంచబడిన దేవుని శాసనములు, మన్నా పాత్ర మరియు అహరోను కట్టిలను గూర్చి ధ్యానింతుము. నిబంధన మందసములో దేవుని శాసనములు (నిర్గమకాండం 25:21, 40:20; ద్వితీయోపదేశ కాండం 10:5), మన్నాతో కూడిన పాత్ర (నిర్గమకాండం 16:33-34) మరియు అహరోను కట్టి (సంఖ్యాకాండం 17:10) వుంచబడినవి (హెబ్రీ 9:4).
ఈ మూడు వస్తువులు మొదటిదిగా త్రియేక దేవుని సూచిస్తున్నవి.
✿ శాసనములు గల పలకలు తండ్రియైన దేవునిచేత యివ్వబడినవి. ఇవి మానవుని పట్ల దేవుని చిత్తమును తెలియజేయుచున్నవి.
✿ పాత్రలో వుంచబడిన మన్నా దేవుని కుమారుడు, ప్రభువైన యేసుక్రీస్తు ‘జీవాహారము’ అన్న సత్యమును సూచిస్తున్నది (యోహాను 6:32-35, 47-51).
✿ నిబంధన మందసములో వుంచబడిన అహరోను కట్టి చిగిర్చి, పువ్వులు పూసి, బాదముపండ్లు గలదాయెనని సంఖ్యాకాండం 17:8లో వ్రాయబడినది. చిగిర్చి, పువ్వులు పూసి, ఫలించిన అహరోను కట్టి పరిశుద్ధాత్మను సూచిస్తున్నది. పరిశుద్ధాత్మ విశ్వాసుల జీవితములలో ఆత్మఫలము ఫలింపజేయును (గలతి 5:22, 23).
రెండవదిగా నిబంధన మందసములో ఉంచబడిన పై మూడు వస్తువులు క్రీస్తునందు శరీరముగా నివసించుచున్న దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతను సూచిస్తున్నవి (కొలొస్సి 2:9).
✿ పలకలపై నున్న దేవుని శాసనములు (ధర్మశాస్త్రము) మానవునికి పాపమనగా యెట్టిదో తెలియజేసెను (రోమా 7:7). అంతేగాక మానవులందరినీ పాపులుగా, మరణానికి పాత్రులుగా తీర్పు తీర్చెను (గలతీ 3:10) మరియు ధర్మశాస్త్రము ద్వారా యెవడును నీతిమంతుడుగా తీర్చబడడు (గలతీ 3:11). అయితే, ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి మనలను విడిపించుటకు శాపముగా చేయబడ్డాడు (గలతీ 3:13). తద్వారా విశ్వాసము వలననైన దేవుని నీతిని మనకనుగ్రహించాడు (రోమా 5:8-10, 10:4). ఈ రీతిగా దేవుని శాసన 60 పలకలను రక్తముతో ప్రోక్షింపబడిన కరుణాపీఠము కప్పివేసినట్లు, దేవుని ధర్మశాస్త్ర ఉగ్రతనుండి యేసు క్రీస్తు తన మరణము ద్వారా మనలను విమోచించాడు.
60✿ మన్నా పాత్రలో ఉంచబడిన మన్నా యేసుక్రీస్తు గుణగణములను సూచిస్తున్నది. మన్నా సన్నని కణములుగా వున్నది (నిర్గమకాండం 16:14), ఇది క్రీస్తుతగ్గింపును సూచిస్తున్నది. మన్నా తెల్లగా ఉన్నది (నిర్గమకాండం 16:14, 31), ఇది యేసుక్రీస్తు పరిశుద్ధతను సూచిస్తున్నది. మన్నా గుండ్రముగా కొతిమీర గింజవలె యున్నది (నిర్గమకాండం 16:31). ఇది క్రీస్తు యే లోపము, దోషము లేక సంపూర్ణుడైన మానవుడని తెలియజేయుచున్నది. ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో మన్నా చేత పోషించబడిరి. అది వారికి సరిపోయినదిగా, బలమునిచ్చునదిగా తప్పక లభించునదిగా వుండెను. అలాగే, మన యాత్రా జీవితములలో మనము ఆత్మీయముగా బలమునొంది, పెంచి పోషించబడునట్లు యేసుక్రీస్తు జీవాహారముగా (దేవుని వాక్యముగా) వున్నాడు.
✿ అహరోను యొక్క చిగిర్చి, పువ్వులు పూసి, ఫలించిన కట్టి యేసుక్రీస్తుమొక్క ప్రధాన యాజకత్వమును సూచిస్తున్నది. కోరహును, అతనితో నున్నవారును మోషేపై తిరగబడి, నశించిన తరువాత (సంఖ్యాకాండం 16) దేవుడు తాను అహరోనును ప్రధానయాజకునిగా ఏర్పరచుకొన్నానని తెలియజేయుటకు ఒక్కొక్క గోత్రమునకు ఒక కట్టి చొప్పున పండ్రెండు కజ్టిలను తీసుకు రమ్మని మోషేతో సెలవిచ్చెను. మరుసటి రోజు అహరోను దేవునిచేత ప్రధాన యాజకునిగా ఏర్పరచబడ్డాడనుటకు బుజువుగా అహరోను కట్టి చిగిర్చి, పువ్వులు పూసి, ఫలించియుండెను. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు దేవునిచేత ప్రధాన యాజకునిగా మన కొరకు ఏర్పరచబడినాడని తెలియజేయుచున్నది (హెబ్రీ 5:1-10, 7:24-25).