UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము
మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము · Part I — The Tabernacle
2. బలిపీఠము
The Brazen Altar · ముద్రిత పుటలు 10–14 · 722 పదాలు · ≈6 నిమిషాలు
(నిర్గమకాండం 27:1-8, 38:1-7)
10ఒకటవ అధ్యాయములో వెలుపలి ఆవరణము, ఆవరణపు ద్వారము గురించి చూచితిమి. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక ఆయన సన్నిధి కంచెద్వారా పాపభూయిష్టమైన యీ లోకములో నుండి వేరు చేయబడినదని, ఆయన సన్నిధిలో ప్రవేశించుటకు ఒకే ఒక్క ద్వారము (యేసుక్రీస్తు) కలదని తెలుసుకొన్నాము. ఈ ద్వారము నుండి వెలుపలి ఆవరణములోనికి ప్రవేశించినపుడు, మొట్టమొదట ”బలిపీఠము”ను చూచెదము. ఈ బలిపీఠము క్రింద ప్రాయబడిన రీతిలో ఎంతో గొప్ప సత్యమును మనకు తెలియజేయుచున్నది.
“మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకజ్టతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు మూడు మూరలు. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదె ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడను దానికి చేయవలెను. ఆవల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి, ఆవల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టుక్రింద దానినుంచ వలెను. మరియు బలిపీఠము కొరకు మోతకళట్టిలను చేయవలెను. ఆ మోతకట్టిలను తుమ్మకజ్టతో చేసి, వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకట్టిలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకళ్టిలు దాని రెండు ప్రక్కలనుండవలెను. పలకలతో గుల్లగా దానిచేయవలెను. కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను” (నిర్గమకాండం 7:1-8).
ప్రియులారా, “బలిపీఠము” అనగా బలి అర్పించు వేదిక. అది పాపమునకు తీర్చు తీర్చబడు స్థలము. ఆవరణద్వారము నుండి లోపలికి ప్రవేశింపగానే మొట్టమొదట బలిపీఠము ఉన్నదన్నమాట పాపముతో నిండిన మానవుడు తన

12పాపములు క్షమింపబడకుండా ప్రత్యక్షపు గుడారములో (దేవుని సన్నిధిలో) ప్రవేశింప లేడన్న సత్యమును సూచిస్తున్నది (1 కొరింథి 6:9-10; గలతి 5:19-21; ప్రకటన 21:8). అయితే రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని దేవుని వాక్యము సెలవిస్తున్నది (హెబ్రీ 9:22). ఈ సత్యము ఆదినుండి దేవుని వాక్యములో తెలుపబడియున్నది. దేవుడు తనకు వ్యతిరేకముగా పాపము చేసిన ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలు తొడిగించినపుడు రక్తము చిందింపబడి, బలి అర్పింపబడి, వారి పాపము కప్పబడెను (ఆదికాండం 3:21). నోవహు (ఆదికాండం 8:20), అబ్రహాము (ఆదికాండం 12:7), ఇస్సాకు (ఆదికాండం 26:25), యాకోబు (ఆదికాండం 35:1) బలిపీఠములను కట్టి, బలులు అర్పించిరి.
దేవుడు మోషేకు ధర్మశాస్త్రమును అనుగ్రహించి, ఇశ్రాయేలీయులు పాపము చేసినపుడు తమ పాపము కప్పబడుటకు వారు బలిపీఠము మీద అర్పింపవలసిన బలులను గూర్చినవివరములు మోషేకు బయలుపరచెను. ఈ బలుల క్రమము, వాటి ప్రాముఖ్యత యీ పుస్తకము యొక్క రెండవ భాగములో వివరింపబడినది. బలిపీఠము మీద యెడ్లయొక్క మేకలయొక్క రక్తము చిందింపబడి, అవి బలిగా అర్పింపబడుట ద్వారా ఇశ్రాయేలీయుల పాపము కప్పబడెనను మాట ప్రస్తుత కాలములో యేసు క్రీస్తునందు మానవునికున్న “పాపనివారణ”ను సూచిస్తున్నది. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ (హెబ్రీ 10:1). యేసుక్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడెను (హెబ్రీ 9:11-10:18).
బలిపీఠమును గూర్చిన వాక్యభాగము (నిర్గమకాండం 27:1-8) ను పరిశీలించినటైతే యీ క్రింది విషయములను గమనించవచ్చును.
a) బలిపీఠము చేయుటకు తుమ్మకట్టి వాడబడినది (నిర్గమకాండం 27:1, 6). తుమ్మ కట్టి ఎంతో మన్నిక గలిగినది మరియు “పుచ్చుపట్టనిది”. కట్టి లేదా చెక్క యేసుక్రీస్తు యొక్క మానవత్వమును సూచిస్తున్నది (పాపదాస్యము నుండి మానవుని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయెను - హెబ్రీ 2:14, 17). తుమ్మకజ్టి యేసుక్రీస్తు యొక్క “పాపము లేని మానవత్వము”ను సూచిస్తున్నది. మానవుని పాపపరిహారార్థ బలి “పాపములేని” యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. 13 ఆయన యందు పాపమేమియులేదు (1యోహాను 3:5), ఆయన పాపమెరుగడు (2 కొరింథీ 5:21), ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు (1పేతురు 2:22), ఆయన పాపములేనివాడుగా వుండెను (హెబ్రీ 4:15, 7:26), ఆయన నిర్లోషమును, నిష్కకంకమునగు గొఱ్ఱెపిల్ల (నిర్గమకాండం 12:6; 1పేతురు 1:19). తుమ్మకజ్జ ఎంతో మన్నిక కలిగినట్లు యేసునిరంతరము వున్నవాడు, నిరంతరము జీవించువాడు (హెబ్రీ 7:24, 25). తుమ్మకళజ్టి పుచ్చుపట్టనట్లు యేసుక్రీస్తు కుళ్ళుపట్టడు (కీర్తన 16:10; అపొ.కా. 2:31).
13b) బలిపీఠమునకు లోపల, బయట తుమ్మకజ్టిపై ఇత్తడి రేకు పొదిగింపవలెను (నిర్గమకాండం 27:2). ఇత్తడి బలమును మరియు “పాపముపై తీర్చు”ను సూచిస్తున్నది. ఇత్తడి బలిపీఠము, దాని పనిముట్లమందు మాత్రమే గాక, గంగాళము (తరువాయి అధ్యాయము), ప్రత్యక్షపు గుడార తెర (మేకవెండ్రుకలతో చేయబడినది), గుండీలు, వెలుపలి ఆవరణ స్తంభములు, వాటి దిమ్మలు, మేకులయందు వాడబడినది. ఇత్తడి వెలుపలి ఆవరణములో అత్యధికముగా వాడబడినదనుమాట, వెలుపలి ఆవరణములో మాత్రమే రక్తము చిందించబడి, పాపముపై తీర్చు జరుగుతున్నదన్న సత్యమును తెలియజేయుచున్నది. తుమ్మకళ్టపై ఇత్తడి పొదగబడుతున్నదన్నమాట యేసు క్రీస్తు యొక్క పాపరహిత శరీరము పై మానవుని పాపపు తీర్పునకు సంబంధించిన శిక్ష ఉగ్రత పడినదన్న సత్యమును సూచిస్తున్నది (2 కొరింథీ 5:21; యెషయార్3; గలతీ 3:13; రోమా 8:3; ద్వితీ. 21:23). అరణ్యములో తనకు వ్యతిరేకముగా సణిగిన ఇశ్రాయేలీయుల మధ్యకు దేవుడు విష సర్పములను పంపినపుడు అనేకులు వాటిచేత చంపబడిరి. అపుడు ప్రజలు మోషేతో సర్పములను తొలగించమని వేడుకొనగా దేవుడు మోషేతో “అత్తడి సర్పమొకటిచేసి, ఒక స్తంభము మీద దానిని నిలుపవలెనని, సర్పకాటు పొందిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచుటవలన బ్రదుకునని” చెప్పెను. ఈ యిత్తడి సర్పమువలె యేసుక్రీస్తు కూడా సిలువపై యెత్తబడి, ఆయనయందు విశ్వాసముంచువారిని రక్షించునని తెలుసుకొనుచున్నాము (సంఖ్యాకాండం 21:6-9; యోహాను 38:14-16, 5:24, 12:32). యేసుక్రీస్తును తృణీకరించిన 14 యెడల దేవుని ఉగ్రత వారిపైకి వచ్చునని దేవుని వాక్యము సెలవిస్తున్నది (రోమా 6:23). ఇశ్రాయేలీయులు దేవుని మాట విననియెడల వారితలపైని ఆకాశము ఇత్తడివలె, క్రిందనున్న నేల యినుము వలెనుండునని దేవుడు చెప్పెను (ద్వితీయోపదేశకాండం 28:23),
14c) బలిపీఠము చచ్చాకముగా నుండి, దాని నాలుగు మూలలా నాలుగు కొమ్ములు చేయబడి, ఆ కొమ్ములు ఇత్తడి రేకు పొదిగింపబడినవి (నిర్గమకాండం 27:2). ఈ మాట ప్రపంచపు నలుమూలలా ఉన్న ప్రజలందరి పాపముల కొరకైన తీర్పును, శిక్షను యేసుక్రీస్తు సిలువలో భరించెననియు, రక్షణ-పాపవిమోచన ప్రపంచ ప్రజలందరికి యేసుక్రీస్తునందు కలుగునన్న సత్యమును తెలియ జేయుచున్నది (అపొ.కా. 1:8; మత్తయి 8:18-0; మార్కు 16:15-20; ప్రకటన 5:9-10). కొమ్ము బలమును సూచిస్తున్నది (కీర్తన 92:10). బలిపీఠపు కొమ్ము “రక్షణ శృంగమును” సూచిస్తున్నది (2 సమూయేలు 22:3; కీర్తన 18:2). దేవుడు తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణశ్చంగమును (యేసుక్రీస్తును), మన శత్రువు (సాతాను) నుండి తప్పించి, రక్షణ కలుగజేయుటకు అనుగ్రహించెను (లూకా 1:68, 69).
d) బలిపీఠము మీద అర్పింపబడబోవు బలిపశువును బలిపీఠపు కొమ్ములకు కట్టుదురు (కీర్తన 118:27). ఈ బలిపశువుకు యిష్టము లేకున్నను అది బలిగా అర్చింబడును. అయితే, యేసుక్రీస్తు తనంతట తానే సకల మానవుల పాప పరిహారార్థము బలిగా అర్పించుకొనెను (హెబ్రీ 7:28, 9:28, 10:7-10; యోహాను 10:15-18).
యేసుక్రీస్తును మనమందరమూ రక్షణ శృంగముగా కలిగియుందుము గాక. బలిపీఠము మీద అర్పింపబడు ఆయారకముల బలులను గూర్చిన వివరణ యీ పుస్తకము యొక్క రెండవ భాగములో యివ్వబడినది.