UECF.NETమోషే ప్రత్యక్షపు గుడారము
మోషే ప్రత్యక్షపు గుడారము

UECF.NETBooksమోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు

రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar

1. దహనబలి

The Burnt Offering · ముద్రిత పుటలు 64–66 · 505 పదాలు · ≈4 నిమిషాలు

📄 PDF

(లేవీయకాండం 1:1-17, 6:8-13)

64పై వాక్యభాగమును ఢ్యానించిన యెడల యీ క్రింది సంగతులు గమనించవచ్చును.

a) దహన బలి మొదటిదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగమును సూచిస్తున్నది. దహనబలిగా తన్ను తాను సమర్పించుకొనుట ద్వారా యేసుక్రీస్తు పాపియైన మానవునిపైనున్న దేవుని ఉగ్రతను చల్లార్చి, పాపక్షమాపణకు వీలు కల్పించాడు. యేసుక్రీస్తను దహనబలియందు దేవుడు ఆనందించాడు గనుక యిది దేవునికి ఇంపైన సువాసనగల హోమముగా వున్నది (లేవీయకాండం 1:9, 13, 17),

b) దహనబలి అర్పించువాడు నిర్రోషమైన కోడెదూడ గాని, నిర్దోషమైన గొట్టెగాని, నిర్దోషమైన మేకగాని, తెల్ల గువ్వలుగాని, పావురపు పిల్లలు గాని తన స్టోమతను బట్టి అర్పించవలెను (లేవీయకాండం 1:3, 10, 14). ఈ మాట మరో సారి ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు లోపల, వెలుపల యే దోషము, పాపము లేనివాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆయనయందు పాపమేమియు లేదు (1 యోహాను 3:5). ఆయన పాపమెరుగడు (2 కొరింథీ 5:21). ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను యే కపటమును కనబడలేదు (1 పేతురు 2:22). ఆయన పాపము లేని వాడుగా వుండెను (హెబ్రీ 4:15).

అంతేగాక, పైమాట ద్వారా మనకున్న శ్రేష్టమైనవన్నియు ప్రభువు సేవకు వాడవలెనని హెచ్చరించబడుచున్నాము (మలాకీ 1:7, 8,13). దీని గురించిన వివరణ అంశము f లో యివ్వబడినది. నోవహు పవిత్రమైన పశువులు, పక్షులను దహనబలిగా దేవునికి సమర్పించాడు (ఆదికాండం 8:20, 21).

c) దహనబలి అర్పించువాడు బలిగా అర్పింపబడుచున్న జంతువు యొక్క తల మీద తన చేతులుంచవలెను(లేవీయకాండం 1:4). అనగా తన పాపములను బట్టి చావవలసిన మానవుడు, తనకు బదులుగా తన స్థానములో పశువును 65 బలిగా అర్పించుచున్నాడన్న సత్యమును మనము గమనిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా, మన స్థానములో పాపమునకు రావలసిన శిక్షననుభవించి, సిలువ వేయబడినాడు (యెషయా 53:4-6; 1పేతురు 2:24; 2 కొరింథీ 5:21).

65d) దహనబలి పశువు వధింపబడిన తరువాత యాజకులు దాని రక్తమును బలిపీఠము చుట్టు ప్రోక్షించవలెను (లేవీయకాండం 1:5, 11). బలిపశువుగా తనను తాను అర్పించుకున్న ప్రభువైన యేసుక్రీసు యొక్క రక్తము సిలువపై చిందించబడినది. అది మన పాపముల నుండి మనలను కడిగి, మనలను విమోచించును (1 యోహాను 1:7; 1 పేతురు 1:19; హెబ్రీ 9:14; రోమా 3:25, 26, 5:9), రక్త ప్రోక్షణలేకుండా పాపక్షమాపణ కలుగదు (హెబ్రీ 9:22).

e) దహనబలిగా అర్పించబడుతున్న గొఱ్ఱెగాని, మేకగాని బలిపీఠపు ఉత్తర దిక్కున వధింపబడుతున్నది (లేవీయకాండం1:11). యేసుక్రీస్తు బలిగా అర్పింపబడిన కలువరి సిలువ యెరూషలేమునకు ఉత్తర దిక్కునవున్నది.

f) దహనబలి పశువు యొక్క రక్తము బలిపీఠము చుట్టు ప్రోక్షింపబడిన తరువాత యాజకుడు దాని చర్మము ఒలిచి, దాని అవయవములను విడదీసి,దాని ఆంత్రములను,కాళ్లను నీటితో కడిగి, బలిపీఠము మీది అగ్ని మీద పేర్చబడిన కట్టెలమీద దాని తలను, ఆంత్రములను, కాళ్లను, క్రొవ్వును దహించవలెను (లేవీయకాండం 1:6-9).

i) తల మానవుని మనస్సును (తలంపులు, తెలివి తేటలు, (గ్రహింపు, వివేకము) సూచిస్తున్నది. యేసుక్రీస్తు తన సొంత తలంపులు, ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదని, దేవుని చిత్తము నెరవేర్చుటకే వచ్చెనని యోహాను 6:38 లో వ్రాయబడినది.

ii) ఆంత్రములు (ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు, గుండె) మానవుని హృదయ ప్రేమను, అనురాగమును సూచిస్తున్నవి. ఆంత్రములు నీళ్లతో కడుగబడిన తరువాత దహించబడుచున్నవి. ఇది శుద్ధమైన హృదయమును, హృదయ వాంఛను సూచిస్తున్నది. యేసుక్రీస్తు పవిత్రమైన హృదయముతో దేవుని ప్రేమించాడు 66 (యోహను 14:31). విశ్వాసులను, సంఘమును ప్రేమించాడు (గలతీ 2:20; ఎపెసీ 5:2, 25). నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నదని చెప్పుట ద్వారా తన హృదయ వాంఛను తెలియపరిచాడు (యోహాను 4:34).

66iii) కాళ్ళు మానవుని వెలుపలి నడకను సూచిస్తున్నవి. కాళ్ళు కూడా దహించ బడడానికి ముందు నీళ్ళతో కడుగబడుచున్నవి. ఇది శుద్ధనడకను, ప్రవర్తనను సూచిస్తున్నది. యేసుక్రీస్తు పాపములేని నడకను కలిగియుండెనని యిది వరకు చూచితిమి (1 యోహాను 38:5; 2 కొరింథీ 5:21; 1 పేతురు 2:22; హెబ్రీ 4:15).

iv) క్రొవ్వు మానవుని ఆరోగ్యమును, బలమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు బాల్యమునుండే తన ఆరోగ్యమును బలమును దేవుని పని కొరకు ఉపయోగించెను (లూకా 2:43-52).

ఈ రీతిగా, బలిపశువు యొక్క తల, ఆంత్రములు, కాళ్లు, క్రొవ్వు బలిపీఠము మీద దహించబడిన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు తన స్వయమును దేవునికి ప్రతిష్ఠించుకొన్నట్లుగా మనము తెలుసుకొనుచున్నాము. ఈ సంగతులను బట్టి వునము కూడా మన స్వయమును దేవునికి ‘ప్రతిష్ఠించుకొనవలెనని హెచ్చరింపబడుచున్నాము. అనగా, మన మనస్సులోని తలంపులు, నోటి మాటలు, వ్యాదయధ్యానము, ‘ప్రవర్తన ద్వారా దేవుని వుపౌొమవరచవలెనని తెలుసుకొనుచున్నాము (కీర్తన 19:14). మన దేహములతో దేవుని మహిమపరచవలెనని (1 కొరింథీ 6:20), వాటిని సజీవయాగముగా దేవునికి సమర్పించుకొనవలెనని (రోమా 12:1) వాక్యము సెలవిస్తున్నది. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ (మార్కు 12:30),