UECF.NETమోషే ప్రత్యక్షపు గుడారము
మోషే ప్రత్యక్షపు గుడారము

UECF.NETBooksమోషే ప్రత్యక్షపు గుడారము › మూడవ భాగము – యాజకత్వము

మూడవ భాగము – యాజకత్వము · Part III — The Priesthood

2. యాజకుల వస్త్రములు

The Garments of the Priests · ముద్రిత పుటలు 96–124 · 4,683 పదాలు · ≈39 నిమిషాలు

📄 PDF

ఈ అధ్యాయములో

96ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాడు గనుక అతడు ధరించిన వస్త్రములు యేసుక్రీస్తు యొక్క గుణగణములను సూచిస్తున్నవి. దేవుని చేత పిలువబడిన ప్రధాన యాజకుడు, యితర యాజకులు నీటి చేత కడుగబడిన తరువాత యాజకవస్త్రములను ధరించిరి. దేవుని వాక్యమను నీటితో మనలను కడుగుకొనుట ద్వారా (మన లోపములు సరిచేసికొనుట ద్వారా) మనము కూడా యాజకవస్త్రములను (యేసుక్రీస్తు గుణగణములను) ధరించిన వారమగుదుము. పటము-15లో చూపబడిన ప్రధాన యాజకుని వస్త్రముల వివరణ యీ క్రింద యివ్వబడినది.

a) సన్ననార చొక్కాయి, దట్టి, నారలాగులు

(నిర్గమ 28:39-43, 29:4-9, 39:27-29; లేవీ. 6:10, 8:6-7, 16:4) సన్ననార చొక్కాయి (Linen Tunic)

పై వాక్యభాగములలో అహరోనును, అతని కుమారులును నీళ్లతో కడుగబడిన తరువాత సన్ననార నిలువుటంగీ (చొక్కాయి)లను ధరించి, సన్ననార దట్టీలను కట్టుకొనిరని చదువుదుము. సన్ననార (Fine Linen) వెలుపలి ఆవరణములోను, ఆవరణ ద్వారములోను, ప్రత్యక్షపు గుడార ద్వారపు తెర, అతి పరిశుద్ధ స్థలమునకు ముందున్న అడ్డతెర యందు మరియు పై కప్పు తెరయందు వాడబడినది. ఈ సన్ననార వస్త్రము యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు పొందిన దేవుని నీతిని సూచిస్తున్నదని యిది వరకు చూచితిమి (రోమా 3:22; 2 కొరింథీ 5:21; యెషయా 61:10; ప్రకటన 7:14, 19:7-8). అంతేగాక, సన్ననార తెల్లనిదై, యేసుక్రీస్తు 97 యొక్క పరిశుద్ధతను సూచిస్తున్నది (ప్రకటన 19:14). యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను గూర్చి బల్లను గూర్చిన వివరణలో చూచితిమి.

సన్ననార దట్టీ (Sash) (నిర్గమ. 28:39; లేవీయ. 8:7, 16:4)

97పటము - 15లో సన్ననార దట్టీ ఏఫోదు నిలువుటంగీకి లోపలి వైపున వున్నది గనుక యిది వెలుపలికి కనిపించదు. ఈ దట్టీ విచిత్రమైన దట్టీకి వేలయున్నది. దట్టీ నడుముకు కట్టబడినదై, నడుమును బలపరచి, ముందున్న పనికొరకు మనలను సిద్ధపరచును. అనగా యిది “ముందున్న పనికొరకైన లేదా పరిచర్య కొరకైన సిద్ధపాటు”ను సూచిస్తున్నది.

i) ప్రభువైన యేసుక్రీస్తు తన పై వస్త్రము తీసి, ఒక తువాలు నడుమునకు కట్టుకొని, శిష్యుల పాదములు నీటితో కడిగెను (యోహాను 13:4, 5). ఆయన పాదములమట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని యుండెనని ప్రకటన 1:18లో చదువుచున్నాము.

ii) ఇశ్రాయేలీయులు అరణ్యప్రయాణము కొరకైన సిద్ధపాటును సూచిస్తూ, తమ నడుము కట్టుకొని, పస్కాబలిని తినవలెనని దేవుని చేత ఆజ్ఞాపింపబడిరి (నిర్గమకాండం 12:11),

iii) ఎలీషా ఇశ్రాయేలు రాజుగా యెహూను అభిషేకించుటకు తన శిష్యుని నడుము బిగించుకొని, తైలపు గిన్నె తీసికొని, రామోత్లిలాదుకు పొమ్మని ఆజ్ఞాపించెను (2 రాజులు 9:1).

iv) ఇంకను యీ దట్టీ దేవుని నీతిని. సత్యమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు తన నడుమునకు నీతియు, తన తుంట్లకు సత్యమును నడికట్టుగా కలిగియుండెనని యెషయా11:5లో చదువుచున్నాము. విశ్వాసులముగా మనము కూడా సత్యమను దట్టీని కలిగియుండవలెనని ఎఫెసీ 6:14లో దేవుని వాక్యము సెలవిస్తున్నది. అనగా దేవుని పట్ల మన పరిచర్య సత్యవంతమైనదై, దేవుని నీతి, పరిశుద్ధతతో కూడినదిగా వుండవలెనని తెలుసుకుంటున్నాము.

సన్ననార లాగులు (Trousers)

98అహరోనును, అతని కుమారులును సన్ననార నిలువుటంగీలు ధరించి, దట్టీలు కట్టుకొని, సన్ననార లాగులను ధరించిరి (నిర్గమకాండం 28:42; లేవియకాండం 16:4). సన్ననార లాగులు వారి మానము కప్పుకొనుటకు వారు ధరించవలెనని, వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధ స్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీవించునప్పుడైనను, వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను, అతని కుమారుల మీదను వుండవలెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (నిర్గమకాండం 28:42, 43). సన్ననార లాగులు నిలువుటంగీకి లోపలివైపున వున్నవి గనుక పటము- 15లో కనిపించవు.

ఏదేను తోటలో ఆదాము, హవ్వలు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి, పాపముచేసి, తాము దిగంబరులమని తెలుసుకొని, అంజూరపు ఆకులతో కచ్చడములు చేసికొని, తమ మానమును కప్పుకొనిరి (ఆదికాండం 3:1-7). ఇది మానవుల స్వనీతిని సూచిస్తున్నది. స్వనీతి అనునది మానవుడు తన పాపము కప్పిపుచ్చుకొనుటకు స్వంతముగా చేయు ప్రయత్నము. దీనిని గూర్చి దేవుని వాక్యము క్రింది సత్యమును తెలియజేయుచున్నది.

i) మానవుల స్వనీతి దేవుని యెదుట మురికి గుడ్డల వంటిది (యెషయా 64:6). అది దేవుని ఆశీర్వాదమునకు నోచుకొనదు (ద్వితీ. 9:4-6).

ii) మానవుల స్వనీతి దేవుని నీతికి లోబడదు (రోమా 10:3). అది యితరులను తృణీకరించును (లూకా 18:9). ఎదుటి వానికంటె హెచ్చించుకొనును (యెషయా 65:5; లూకా 18:11; మత్తయి 7:3-5). అంతేగాక, మానవుని స్వనీతి వెలుపలి ఆచారములతో నిండియుండును (మత్తయి 15:1-9; లూకా 18:12),

ఆదాము, హవ్వలు ఆకుల కచ్చడములు కట్టుకొని, తమ మానమును కప్పుకొన్నప్పటి కీ, దేవుని యెదుటకు వచ్చుటకు భయపడి, చెట్ల మధ్య దాగుకొనిరి(ఆదికాండం 3:8). అనగా మానవుడు తన స్వనీతితో దేవుని యెదుట నిలువలేడు. అంతేగాక, ఆకుల కచ్చడములు ఎండకు ఎండి, వాడి పోవును

The garments of the high priest
పటము-15: ప్రధాన యాజకుని వస్త్రములు

100గనుక మానవుల మానమును ఎల్లప్పుడూ కాపాడలేవు. అనగా మానవుల స్వనీతి వారిని రక్షించలేదు (మత్తయి 5:20). అయితే, దేవుడు వారిని కనికరించి, జంతువును చంపి, వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించెను (ఆదికాండం 3:21). ఈ చర్మపు చొక్కాయిలు ఎల్లప్పుడూ వుండును. ఇదే సత్యమును సూచిస్తూ, దేవుని నీతికి సూచకమైన సన్ననార లాగులను యాజకులు ధరించిరి. దేవుని యెదుట నిలిచి, పరిచర్య చేయుటకు దేవుని నీతి కలిగి యుండవలెనన్న సత్యమును తెలియజేయుటకు యాజకులు సన్ననార నిలువుటంగీ, సన్ననార దట్టీ మరియు సన్ననార లాగులను ధరించిరి. అలాగే, ప్రస్తుత కాలములో మనము కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతిని పొంది, నీతిమంతులముగా తీర్చబడినపుడే దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలమని తెలుసుకుంటున్నాము.

చివరిగా, శరీర స్వభావము కప్పివేయబడి, ఆత్మ స్వభావము కలిగి దేవుని పరిచర్య చేయవలెనన్న సత్యమును యాజకులు సన్ననార లాగులు ధరించుటలో మనము చూడగలము. శరీరమందు మంచిది యేదియు నివసింపదు. దానిలో పాప నియమమున్నది (రోమా 7:18-24). శరీర స్వభావము గలవారు (గలతీ 5:19-21) దేవుని సంతోషపరచలేరు (రోమా 8:8). ఆత్మానుసారమైన మనస్సు (రోమా 8:6) గలిగి, ఆత్మకార్యములతో (గలతి 5:22) దేవుని పరిచర్య జరిపించవలెనని తెలుసుకొంటున్నాము.

b) ఏఫోదు నిలువుటంగీ (Robe of the ephod)

(నిర్గమకాండం 28:31-35, 29:4-7, 39:22-26)

యాజకులు (అహరోను కుమారులు) సన్ననార చొక్నాయిని, సన్ననార దట్టీని, సన్ననార లాగులను మాత్రమే ధరించిరి. అయితే ప్రధాన యజకుడు (అహరోను) వీటికి అదనంగా సన్ననార చొక్కాయికి పైగా ఏఫోదు నిలువుటంగీని ధరించుచున్నాడు (నిర్గమకాండం29:4-9). ఏఫోదు నిలువుటంగీ ప్రధాన యాజకుని యొక్క ఘనతను, హోదాను సూచిస్తున్నది. యాజకులు విశ్వాసులను సూచిస్తున్నారు గనుక వారు ధరించిన సన్ననార వస్త్రములు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు పొందిన దేవుని నీతిని సూచిస్తున్నవి. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తును 101 సూచిస్తున్నాడు గనుక తాను ధరించిన ఏఫోదు నిలువుటంగీ, ఏఫోదు మరియు పతకము యేసుక్రీస్తు గుణగణములను సూచిస్తున్నవి.

101ఏఫోదు నిలువుటంగీ నీలి దారముతో కుట్టబడినది (నిర్గమకాండం 28:31). నీలము ఆకాశమండలము యొక్క రంగు. అనగా, నీలిరంగు, యేసుక్రీస్తు పైనుండి (ఆకాశమండలము నుండి) దిగివచ్చాడన్న సత్యమును (యేసుక్రీస్తు దైవత్వమును) సూచిస్తున్నది (యోహాను 38:81; అపో.కా. 1:11). అంతేగాక, యీ నీలిరంగు యేసుక్రీస్తును పైనుండి వచ్చినదేవుని కృపగా తెలియజేయుచున్నది (యోహాను 1:14, 17). ఏఫోదు నిలువుటంగీ అంచులేకుండా (Seamless) కుట్టబడినది. అనగా యిది యేసుక్రీస్తు యొక్క అపరిమితమైన కృపను సూచిస్తున్నది (రోమా 5:20-21). ఈ కృపద్వారా రక్షింపబడి, నిత్యజీవమునకు వారసులమైతిమి (ఎఫెసీ 2:8; తీతు 2:11, 3:7).

ఏఫోదు నిలువుటంగీకి దిగువ భాగపు అంచున నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల దానిమ్మపండ్లును, వాటి నడుమ బంగారు గంటలును అంచు చుట్టూ తగిలింపబడినవి (నిర్గమకాండం 28:33-34). నీల, ధూమ్ర, రక్తవర్ణములు ఏఫోదు నిలువుటంగీలో మాత్రమే గాక ఆవరణద్వారములోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెర, అడ్డతెర, పైకప్పు తెరయందును, ఏఫోదునందును, పతకమునందును వాడబడినవి. వీటి ప్రాముఖ్యత “ప్రత్యక్షపు గుడార పై కప్పు తెరలు” అను అంశము క్రిందతెలుపబడినది. నీలిరంగు పైన తెలిపినట్లు యేసుక్రీస్తు యొక్క దైవత్వమును, కృపను సూచిస్తుండగా, రక్తవర్ణము యేసుక్రీస్తు యొక్క మానవత్వమును (హెబ్రీ 2:17-18, 5:7-8; మార్కు 9:12; ఎఫెసీ 1:7; ఫిలిప్పీ 2:5-8), ధూమ్రవర్ధము (నీలము, రక్త వర్ణముల కలయిక) యేసుక్రీస్తు యొక్క దైవ, మానవ స్వభావమును, మధ్యవర్తిత్వమును (1 తిమోతి 2:5) సూచిస్తున్నవి.

నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల దానిమ్మపండు ఫలభరితమైన జీవితమును (ద్వితీ. 8:5-10; యోహాను 15:5), ప్రేమను (పరమగీతములు 77:10-12), సమాధానమును (యోవేలు 1:8-12) సూచిస్తున్నది. సమాధానము ఆత్మఫలములో ఒక భాగము (గలతీ 5:22). ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త (యెషయా 102 9:6; లూకా 1:79, 2:14; కొలొస్సీ 1:20; హెబ్రీ 13:20; 2 థెస్స. 3:16) యని యిక్కడ మనము గ్రహించుచున్నాము.

102చివరిగా ప్రధానయాజకుని కదలికను గూర్చిన గమనము యాజకులు కలిగియుండునట్లు దానిమ్మ పండ్ల నడుమ బంగారు గంటలు తగిలించబడినవి (నిర్గమకాండం 28:35). ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కదలిక మన జీవితములలో యెలా వున్నదన్న గమనము మనము కలిగి యుండవలెనని దీని ద్వారా తెలుసుకుంటున్నాము. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ మరణము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగి, భూమి వణకి, బండలు బద్దలాయెను (మత్తయి 27:51),

c) ఏఫోదు, విచిత్రమైన దట్టీ, భుజఖండములు (Ephod, waistband, shoulder pieces)

(నిర్గమ. 28:6-12, 39:1-5; లేవీయ. 8:7; 1సమూ. 30:7; హోషేయ 3:4)

ఏఫోదు నిలువుటంగీని ధరించిన ప్రధాన యాజకుడు దానిపైన ఏఫోదును ధరించుచున్నాడు (లేవీ. 8:7). ఏఫోదు అనగా ప్రధాన యాజకుని ఛాతీపైనను, వీపు పైనను రెండు భాగములుగా ట్రేలాడు వస్త్రము. ఈ వస్త్రము ఛాతీకి దిగువ భాగమున విచిత్రమైన దట్టీకిని, పై భాగమున భుజ ఖండములకును అతికించబడియున్నది (నిర్గమకాండం 28:6-8). న్యాయవిధాన పతకం యీ ఏఫోదునకు తగిలింపబడినది (తరువాతి అంశములో దీనిని గూర్చి తెలుపబడినది). ఏఫోదు, విచిత్రమైన దట్టీ, భుజ ఖండములు, న్యాయ విధాన పతకము అన్నీ కలిపి ఒక వస్త్రముగా ప్రధాన యాజకుడు ధరించుచున్నాడు.

ఏఫోదు మరియు విచిత్రమైన దట్టీ సన్ననార, బంగారుతో కలిపి, నీలధూమ్ర రక్తవర్ణములతో చేయబడినవి. సన్ననార, నీల ధూమ్ర రక్తవర్ధముల ప్రాముఖ్యతను యిది వరకు చూచితిమి, బంగారును గూర్చి “ప్రత్యక్షపు గుడార నిలువు పలకల” వర్ణనలో అది వాడబారనిది యనియు (ప్రకటన 3:18; 21:21), శుద్ధమైనదనియు (యోబు 23:10; 1 పేతురు1:7) తెలుసుకొంటిమి. అనగా యిది యేసుక్రీస్తు యొక్క నిత్యత్వమును (యెషయా 9:6; యోహాను 1:1-3, 18, 8:56-59, 17:5; 103 హెబ్రీ 1:10-12) మరియు దైవత్వమును (యోహాను 6:69) సూచిస్తున్నది. దట్టీని గూర్చి “సన్ననార చొక్కాయి” వర్ణనలో తెలుసుకొంటిమి.

103ఏఫోదు మరియు విచిత్రమైన దట్టీ యేసుక్రీస్తు యొక్క నీతి (సన్ననార), నిత్యత్వము (బంగారు), దైవత్వము (బంగారు మరియు నీలి రంగు), కృప (నీలిరంగు), మానవత్వము (రక్తవర్ణము) మరియు మధ్యవర్తిత్వము (ధూమ్ర వర్ణము)లను సూచిస్తున్నవి.

చివరిగా భుజ ఖండములు (లేతపచ్చలు లేక రత్నములు) ఇశ్రాయేలీయుల పంట్రెడు గోత్రముల పేర్లు చెక్కబడినవై (ఒక్కొక్క భుజ ఖండముపై ఆరు గోత్రముల పేర్ల చొప్పున రెండు భుజఖండములు) ప్రధానయాజకుని రెండు భుజములపై వుంచబడుచున్నవి (నిర్గమకాండం 228:9-12). “జ్ఞాపకార్థముగా అహరోను తన రెండు భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును” అని నిర్గమకాండం 28:12లో చదువుచున్నాము.

అనగా ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల పేర్లను యెహోవా సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని, వారి పక్షమున విజ్ఞాపన చేయునని గ్రహించుచున్నాము. దీనిని బట్టి క్రింది సంగతులు తెలుసుకొనుచున్నాము.

i) భుజ ఖండముల రత్నములపై ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు చెక్కబడిన రీతిలో దేవుడు తన ప్రజల పేర్లను తన అరచేతులయందు చెక్కియున్నాడు (యెషయా 49:15, 16). తన ప్రజలను (ఎఫెసీ 1:4-6) పేరుపెట్టి పిలిచియున్నాడు (యెషయా 43:1, 45:3). పరలోకమందును, జీవగ్రంథమందును వారిపేర్లు వ్రాసియున్వాడు (లూకా 10:20; ప్రకటన 20:15).

ii) యేసుక్రీస్తు తన ప్రజలను నిత్యమూ జ్ఞాపకము చేసుకుంటున్నాడు (మలాకీ 3:16; యెషయా 49:15).

iii) యేసుక్రీస్తు తన ప్రజల భారమును భరించుచున్నాడు (మత్తయి 11:28; హెబ్రీ 13:5; కీర్తన 55:22, 56:8; 1 పేతురు 5:7; ద్వితీ. 32:9-14).

iv) యేసుక్రీస్తు తండ్రియైన దేవునితో మన కొరకు విజ్ఞాపనచేయుచున్నాడు (హెబ్రీ 7:25, యోహాను 17).

d) న్యాయ విధాన పతకము (Breastpiece)

(నిర్గమ కాండం. 28:13-30; ఆదికాండం 49; ద్వితీయోపదేశకాండం 33)

104ఏఫోదు, విచిత్రమైన దట్టీ, భుజఖండములు, న్యాయ విధాన పతకము అన్నీ కలిపి ఒక వస్త్రముగా ప్రధాన యాజకుడు ధరించుచున్నాడని యిది వరకు చూచితిమి. న్యాయ విధాన పతకము వాక్యభాగము (నిర్గమకాండం 28:13-30) పరిశీలించిన యెడల యీ క్రింది సంగతులు తెలుసుకొనగలము.

i) న్యాయ విధాన పతకము చిత్రకారుని పనిగా బంగారు తోను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోను, పేనిన సన్ననారతోను చేయబడినది (నిర్గమకాండం 28:15). బంగారు, నీల ధూమ్రరక్తవర్ణములు మరియు సన్ననార యొక్క ప్రాముఖ్యతను గత అంశములలో ధ్యానించితిమి.

ii) న్యాయ విధాన పతకము పై భాగము రెండు బంగారు ఉంగరములు కలిగి, యీ ఉంగరములు బంగారు గొలుసులతో భుజఖండములకు కట్టబడుచున్నవి. అదే విధముగా, న్యాయ విధాన పతకపు క్రింది భాగము రెండు బంగారు ఉంగరములు కలిగి, విచిత్రమైన దట్టీకి వున్న రెండు బంగారు ఉంగరములకు నీలి సూత్రములతో కట్టబడుచున్నది (నిర్గమకాండం 28:22-28). మరొకసారి యిక్కడ బంగారు యేసుక్రీస్తు యొక్క నిత్యత్వమును, దైవత్వములను, నీలిరంగు యేసుక్రీస్తు యొక్క కృపను సూచిస్తున్నట్లు మనము గమనించగలము.

iii) న్యాయ విధాన పతకములో ఊరీము, తుమ్మీము అనునవి వుంచబడుచున్నవి (నిర్గమకాండం 28:30). ఊరీము, తుమ్మీములు దేవుని చిత్తమును, తీర్పును తెలియజేయు రత్నములు (సంఖ్యాకాండం 27:18-23; 1సమూయేలు 238:9-12, 30:7-10). ఊరీము అనగా తెలియజేయుట (వెలుగులోనికి తేబడుట). తుమ్మీము అనగా పరిపూర్ణత. అనగా దేవుని పరిపూర్ణమైన చిత్తము తెలియజేయబడుట. ప్రస్తుతకాలములో మనకు పరిశుద్ధాత్మ ఊరీము వలెను, దేవుని వాక్యము తుమ్మీము వలెను వున్నవి. దేవుని వాక్యానుసారమైన చిత్తము పరిశుద్ధాత్మ మనకు తెలియజేయును (యోహాను 16:13; 1 కొరింథి 2:10-13). న్యాయ విధాన పతకము మడవబడి, అందులో ఊరీము, తుమ్మీములు వుంచబడుచున్నవి (నిర్గమకాండం 28:16),

105iv) న్యాయ విధాన పతకము జేీనెడు పొడుగు, జేనెడు వెడల్పుగలదై, వెలుపల నాలుగు పంక్తులలో పంక్తికి మూడు చొప్పున పండ్రెండు రత్నములు బంగారు జవలలో పొదగబడి, వాటిపై ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు వ్రాయబడినవి (నిర్గమకాండం 28:16-21). ఈ పండ్రెండు రత్పముల ప్రాముఖ్యతను ధ్యానించక ముందు యీ క్రింది సంగతులను గమనించగలము.

v) న్యాయ విధాన పతకములో బంగారు జవలలో పొదగబడిన రత్నములు విశ్వాసులను సూచిస్తున్నవి. ఈ పతకము జేనెడు పొడుగు, జేనెడు వెడల్పు గలిగి, ప్రధాన యాజకుని ఛాతీని పూర్తిగా కప్పుచున్నది. ఛాతీ ప్రేమను, అనురాగమును సూచిస్తున్నది గనుక యేసుక్రీస్తు హృదయమంతా విశ్వాసుల కొరకైన ప్రేమతో నిండియున్నదని తెలుసుకొనుచున్నాము. ఆయన మనలను అంతము వరకు ప్రేమించెను (యోహాను 13:1). పతకములోని బంగారు జవలలో పొదగబడిన విలువైన రత్నముల వలె విశ్వాసులు జగత్తుకు పునాది వేయబడకమునుపే దేవుని చేత క్రీస్తులో ఏర్పరచబడినవారై (ఎఫెసీ 1:4), ఆయన దృష్టికి విలువైన వారుగా ఉన్నారు (కీర్తన 72:14, 116:15).

vi) భుజ ఖండముల వర్ణనలో చెప్పబడినట్లు యిచ్చట కూడా అహరోను (ప్రధానయాజకుడు) ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల పేర్లను యెహోవా సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని, వారి పక్షమున విజ్ఞావన చేయునని తెలుసుకొనుచున్నాము (నిర్గమకాండం 28:29), యేసుక్రీస్తు తన ప్రజల పేర్లను తన ఎదపై కలిగి, దేవుని సన్నిధిలో వారిని భరించుచూ, వారి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు (హెబ్రీ 7:25).

vii) భుజ ఖండములపై ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు వారి జనన క్రమము చొప్పున వ్రాయబడినవి (నిర్గమకాండం 228:9, 10). అనగా ఒకదానిపై ఆరుపేర్లు (రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, దాను, నఫ్రాలి), మరొకదానిపై ఆరు పేర్లు (గాదు, ఆషేరు, ఇశ్చాఖారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను) చొప్పున పండ్రెండు పేర్లు రెండు భుజ ఖండములపై వ్రాయబడినవి. అయితే, న్యాయ 106 విధాన పతకములో యీ పేర్ల వరుస మారిపోయి, గోత్రముల చొప్పన వ్రాయబడినవి: యూదా, ఇశ్ఫాఖారు, జెబూలూను, రూబేను, షిమ్యోను, గాదు, ఎప్రాయీము, మనష్నే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి (సంఖ్యాకాండం 10:14-28; నిర్గమకాండం 28:21). మారుమనసు పొందిన ప్రతి మానవుడు దేవుని కుటుంబములో జన్మించునని భుజ ఖండముల మీది పట్టికను బట్టీ తెలుసుకుంటున్నాము. అయితే, విశ్వాసులు, తాము ఎప్పుడు మారుమనసు పొందారన్న మాటను బట్టికాక, విశ్వాసులుగా తాము కనబరచు నమ్మకత్న్వమును బట్టి మాత్రమే దేవుని హృదయమునకు దగ్గరగా వుందురన్న సత్యమును న్యాయ విధాన పతకపు పట్టికను బట్టీ తెలుసుకొనగలము (మత్తయి 12:45, 19:30, 20:16).

106viii) భుజ ఖండములపై వున్న యోసేపు, లేవీ పేర్లు న్యాయ విధాన పతకముపై లేవు. లేవీ గోత్రము యాజకత్వము కొరకు యెన్సుకొనబడగా, యోసేపునకు బదులు ఆయన కుమారులు మనష్నే, ఎప్రాయీముల పేర్లు వ్రాయబడినవి.

✿ చివరిగా న్యాయ విధాన పతకములోని రత్నములు, వాటిపై పొదగబడిన గోత్రముల యొక్క ప్రాముఖ్యత క్రింద యివ్వబడినది.

వాక్యభాగము: నిర్గమ. 28:16-21; సంఖ్యా. 10:14-28

i) మాణిక్యము – యూదా (Ruby – Judah)

మొట్ట మొదటిగా యూదా గోత్రపు పేరు మాణిక్యముపై పొదగబడినది. యూదా అను పేరుకు “యెహోవా స్తుతింపబడును” అని అర్థము (ఆదికాండం 29:35). “యుహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది” (కీర్తన 147:1). “ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి” (కీర్తన 100:4). యూదా గోత్రమునుండి స్తుతులకు పాత్రుడైన ప్రభువైన యేసుక్రీస్తు “యూదా గోత్రపు సింహము”గా, రాజుగా ఉద్భవించాడు (ఆదికాండం 49:8, 9; ప్రకటన 5్:5, 7:9, 10). ఆయన రాజరికము నిరంతరముండును (అదికాండం 49:10; దానియేలు 2:44; ప్రకటన 11:15).

107యూదా ఇశ్చాఖారు జెబూలూను

మాణిక్యము గోమేధికము మరకతము

(Ruby)(Topaz) (Beryl)

రూబేను షిమ్యోను గాదు

పద్మరాగము నీలము సూర్యకాంతము

(Turquoise)(Sapphire)(Diamond)

ఎప్రాయీము మనష్నే బెన్యామీను

గారుత్మతము యష్యురాయి ఇంద్రనీలము

(Jacinth) (Agate)(Amethyst)

దాను ఆషేరు నఫ్రాలి

రక్త వర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతము

(Chrysolite) (Onyx) (Jasper)

న్యాయ విధాన పతకపు రత్నములు, పేర్ల పట్టిక

108మాణిక్యము (కెంపు) ఎబుపు రంగులో ఉండును. ఇది పగడముగా (సామెతలు 3:15; విలాపవాక్యములు 4:7), ముత్యముగా (సామెతలు 31:10) చెప్పబడినది. ఈ ఎటలబుపు రంగు యూదా గోత్రలక్షణమును సూచిస్తున్నది. ఆదికాండం 49:11, 12లో “ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎట్టిగాను, అతని పళ్లు పాలచేత తెల్లగాను వుండును” అని యూదాను గూర్చి వ్రాయబడినది. ద్రాక్షారసము ఎటుపు రంగులో వుండును. ఇది సంతోషమును సూచిస్తున్నది. “యూదా తన బట్టలు ద్రాక్షారసముతో ఉదుకుకొనెను మరియు ఆయన కన్నులు ద్రాక్షారసముచే ఎలుపెక్కెను” అన్న మాట సమృద్ధియైన సంతోషమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు కన్నులు అగ్బిజ్వాలలవలె (ఎజ్టినివై) వున్నవని ప్రకటన 1:14లో చదువుదుము. ఈ లోకములో లభించని మిక్కిలి విలువైన సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వద్ద విస్తారముగా లభించునని తెలుసుకుంటున్నాము (యెషయా 51:11, రర: 1; 1 పేతురు1:8).

ii) గోమేధికము – ఇశ్శాఖారు (Topaz – Issachar)

ఆదికాండం 30:14-18 వచనములలో లేయా తన కుమారుడైన రూబేను తెచ్చిన పుత్రదాతవృక్షపు పండ్లు రాహేలుకిచ్చి, దాని కారణముగా యాకోబుతో శయనించెనని, తద్వారా పుట్టిన కుమారునికి “ఇశ్చాఖారు” అను పేరు పెట్టనని చదువుచున్నాము. “ఇశ్ఫాఖారు” అను పేరుకు ‘జీతమునకు కుదుర్చుకొనుట’ అని అర్థము. ఈ పేరులో గొప్ప సత్యము చూడగలము. దేవుని ద్రాక్ష వనములో (దేవుని సంఘములో) పనిచేయుటకు మనలను పనివారుగా దేవుడు పిలిచియున్నాడు (మత్తయి 20:1-16). మనము చేయు పనిని బట్టి జీతము నిర్ణయింపబడబోవు చున్నది (1 కొరింథీ 3:8, 11-15, 9:25; 2 కొరింథీ 5:10; ప్రకటన 22:12). దేవుని వాక్యమును అనుసరించుటలో మనము చూపు నమ్మకత్వమును బట్టి మన ప్రతిఫలము వుండును (కీర్తన 19:11; సామెతలు 11:18, 13:13, 25:21, 9292),

109“ఇశ్యాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొని యున్న బలమైన గార్ధభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును” అని ఆదికాండం 49:14-15లో వ్రాయబడినది. అనగా విశ్రాంతి కొరకు, రమ్యమైన భూమి కొరకు ఇశ్చాఖారు వెట్టిచేయు గార్ధభము వలె ఉన్నట్లు పరలోకములో బహుమానమును ఆశించి, పాటుపడు పనివారివలె మనముండవలెనని తెలుసుకొను చున్నాము (మత్తయి 25:14-30). గోమేధికము పసుపు పచ్చగా ఉండు రత్నము. ఆంగ్లములో యిది Topaz (టొపాజ్)” అని పిలువబడుతున్నది. టొపాజ్ అను పదమునకు ‘వెడకుటి అని అర్థము. ఈ రత్నము అంత సుళువుగా దొరకదని, దాని కొరకు శ్రద్ధగా చాలా సేపు వెదకిన తరువాతనే అది దొరికెనని దీనిని గూర్చి చెప్పబడును. అలాగే ఇశ్చాఖారు కష్టపడి పనిచేసి, బహుమానమును పొందువాడుగా ఉన్నాడు గనుక యీ రత్నముపై అతని పేరు వ్రాయబడెను.

iii) మరకతము – జెబూలూను (Beryl – Zebulun)

జెబూలూను లేయాకు జన్మించిన ఆరవ కుమారుడు (ఆదికాండం 30:20). “జెబూలూను” అను పేరుకు “నివాసము” అని అర్థము. “జెబూలూను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును” అని యాకోబు జెబూలూనును ఆశీర్వదించెను (ఆదికాండం 49:13). ఓడరేవు ఓడలకు ఆశ్రయముగా ఉండి, ఓడలో ప్రయాణికులు, సరుకులు నింపబడుట, ఖాళీచేయబడుట జరుగును. అంతేగాక, ఓడరేవు లోని దీపస్తంభము (Light house) ఓడలకు ప్రమాద సంకేతములు తెలియజేయును. సముద్రమునుండి వచ్చు ఓడలు దరిజేరుటకు ఒక మార్గదర్శిగా దీపస్తంభముంటున్నది. దీనిని బట్టి జెబూలూను ఓడరేవుగా, దీపస్తంభముగా వున్నాడని గమనించుచున్నాము. దీనికి తగినట్లుగానే జెబూలూను పేరు మరకతమను రత్నముపై పొదగబడినది. మరకతము యొక్క మూలపదము ప్రకాశించుచున్న రాయిని సూచిస్తున్నది.

యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని” చెప్పెను (యోహాను 8:12). 110 “జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను, మరణచ్చాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను” అను ప్రవచనము నెరవేరునట్లు యేసుక్రీస్తు జెబూలూను, నఫ్తాలి ప్రాంతములలో సముద్రతీరమందలి క టెర్నహూమునకు వచ్చి కాపురముండెనని మత్తయి 4:12-1 6లో చదువుచున్నాము. విశ్వాసులు లోకమునకు వెలుగైయున్నారని, లోకములో తమ వెలుగు ప్రకాశింపజేసి, దీపస్తంభమువలె యేసుక్రీస్తుకు సాక్షులుగా వుండవలెనన్న సత్యమును దీని ద్వారా తెలుసు కుంటున్నాము (మత్తయి 5:14-16; ఎఫెసీర్: 8-14; ఫిలిప్పీ 2:16).

iv) పద్మరాగము – రూబేను (Turquoise – Reuben)

110రూబేను లేయాకు జన్మించిన జ్యేష్టకుమారుడు. యాకోబు లేయాకంటె రాహేలును యెక్కువగా టైమించెను. లేయా ద్వేషింపబడుటచూచి యెహోవా లేయా గర్భమును తెరచెను మరియు రాహేలు గొడ్రాలైయుండెను. లేయా తన మొదటి కుమారుని కని, యెహోవా నా శ్రమచూచెనని అతనికి “రూబేను” అను పేరు పెట్టెను (ఆదికాండం 29:30-32). రూబేను అను పేరునకు “కుమారుని చూడుము” (See a son) అని అర్ధము. అనగా యెహోవా తన శ్రమను చూచి, తనకు కుమారుని అనుగ్రహించెను చూడుమని లేయా తన భర్త యాకోబుతోను, యిరుగు పొరుగు వారితోను చెబుతున్న అర్థమును మనమిక్కడ చూడగలము. మానవుల పతనావస్థను చూచి, యెహోవా తన కుమారుని మనకనుగ్రహించాడు (యెషయా 9:6).

రూబేను మొదటికుమారుడు గనుక జ్యేష్టత్వపు హక్కు కలిగినవాడు (ద్వితీ. 21:15-17). అయితే, ఆదికాండం 35:22 లో రూబేను తన తండ్రి ఉపపత్పియైన బిల్హాత్రో శయనించెనని చదువుదుము. తాను చేసిన యీ తప్పిదమును బట్టి రూబేను యెంతో నష్టమును, అవమానమును పొందాడు (సామెతలు 6:32, 383), తన జ్యేష్టత్వపు హక్కును కోల్పోయాడు (1దిన వృ. 5:1-2). అంతేగాక, తన 111 సోదరుల యొద్ద తన మాట విలువను కోల్పోయాడు (ఆదికాండం 42:22). యాకోబు తనను ఆశీర్వదించినప్పుడు “నీళ్లవలె చంచలుడవని” రూబేనును గూర్చి చెప్పాడు (అదికాండం 49:4). తాను చేసిన జారత్వమును బట్టి రూబేను చావకయుండునుగాక, అతని వారు కొద్దిమంది అగుదురని మోషే రూబేనును గూర్చి చెప్పాడు (ద్వితీ. 33:6). జారత్వమునకు దూరముగా ఉండి, కామాభిలాషను, శరీరాశను విసర్జించి, మన మనస్సును స్వాధీనపరచుకొని, శోధనను జయించ వలెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (1 థెస్స. 4:3, 4; 1 పేతురు 2:11; సామెతలు 16:32; యాకోబు 1:12). మన శరీరమును నలుగగొట్టి, దానిని వశపరచుకొనని యెడల (1 కొరింథీ 9:27), ప్రాకారము లేని పురమువలె అగుదుమని (సామెతలు 5:28) తెలుసుకుంటున్నాము.

111రూబేను పేరు పొదగబడిన పద్మరాగమను రత్నము ఆకుపచ్చదై, సముద్ర అగాధపు రంగు కలిగియున్నది. ఇది రూబేను యొక్క నీటిని పోలిన చంచలత్వమును సూచిస్తున్నది. దీని వలన కలుగు నష్టమును గూర్చి 1 కొరింథీ 3:15లో “ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తనమట్టుకు రక్షింపబడును గాని, అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును” అని దేవుని వాక్యము మనలను హెచ్చరించుచున్నది.

v) నీలము – షిమ్యోను (Sapphire – Simeon)

షిమ్యోను లేయాకు జన్మించిన రెండవ కుమారుడు. యెహోవా తాను ద్వేషింపబడుట చూచి, తనకు మొదటికుమారుని (రూబేను-కుమరుని చూడుము) అనుగ్రహించెనని తలంచిన లేయా, తాను ద్వేషింపబడితినన్న సంగతి విని, తనకు రెండవ కుమారుని అనుగ్రహించెనని అతనికి ‘షిమ్యోను’ అని పేరు పెట్టెను. షిమ్యోను” అనుగా “వినుటి అని అర్థము. ఈ రీతిగా రూబేను, షిమ్యోనుల జననములో “యెహోవా చూచును”, “యెహోవా వినును” అని అర్ధమున్నదని తెలుసుకుంటున్నాము. “అగుపులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని. వారిని విడిపించుటకు దిగివచ్చియున్నానని” దేవుడు మోషేతో చెప్పాడు (నిర్గమకాండం 3:7; అపొ.కా. 7:34). ప్రస్తుతకకాలములో 112 మానవుల దురవస్థను చూచి, వారి మొర వినుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును లోకమునకు పంపెను (యోహాను 38:16),

112అయితే, యాకోబు తన కుమారులు షిమ్యోను మరియు లేవిని గూర్చి యిట్లు చెప్పాడు: “షిమ్యోను, లేవీ అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవడ్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపము వచ్చి, మనుష్యులను చంపిరి. తమ స్వేచ్చచేత ఎద్దుల గుది కాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది. వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపించబడును. యాకోబులో వారిని విభజించెదను. ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను” (ఆదికాండం 49:5-7). దీనికి కారణము ఆదికాండం 84వ అధ్యాయములో చూడగలము. షిమ్యోను, లేవీ, హివ్వీయుడైన షెకెము తమ సహోదరియైన దీనాతో శయనించినందుకు మపెకెమును, అతని తండ్రిని, ఆ దేశపు మగవారినందరిని కత్తివాతచే సంహరించిరి. తమ కోపము చేత పాపము చేసిన వానినే గాక, యితరులు అనేకులను మోసపరచి, చంపడమేగాక జంతువులపై కూడా దాడిచేసిరి. కనుకనే యాకోబు షిప్యూనును, లేవిని గద్దించుచున్నాడు. “త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును” (సామెతలు 14:17). “కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండ కూడదనియు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము విసర్దించుమనియు” వాక్యము సెలవిస్తున్నది (ఎఫెసి 4:26, 31). కనికరముగలవారు ధన్యులు, వారు కనికరము పొౌందెదరని యేసుక్రీస్తు చెప్పెను (మత్తయి ర్: 7).

షిమ్యోను చేసిన తప్పిదమును బట్టి యాకోబు అతడు విభజింపబడునని చెప్పాడు. తాను చెప్పినట్లే షిమ్యోను గోత్రికుల సంఖ్య 59, 300 నుండి 22, 200కు తగ్గెను (సంఖ్యాకాండం 1:23, 26:14). షిమ్యోను పేరు పొదగబడిన “నీలము” యొక్క మూలపదమునకు ‘విభజించుట’ అని అర్థము. షిమ్యోను తప్పిదము యొక్క పర్యవసానమును సూచిస్తూ, అతని పేరు యీ రత్నముపై పౌొదగబడెను.

vi) సూర్యకాంతము – గాదు (Diamond – Gad)

113గాదు లేయా దాసియైన జిల్పా ద్వారా యాకోబునకు పుట్టిన కుమారుడు. “గాదు” అను పేరునకు ‘అదృష్టము’ అని అర్థము (ఆదికాండం30:11). ఆంగ్ల బాషలో యిదే వచనములో “గాదు”అను పేరుకు “సైనిక సమూహము వచ్చుచున్నది” అని అర్థము చెప్పబడినది (A Troop Cometh, KJV). ఈ అర్థమునకు తగినట్టుగానే, గాదీయులు యుద్ధశూరులు, పరాక్రమ శాలులని 1దిన వృ. 12:8-15 వచనములలో చదువుదుము. యాకోబు “బంటుల గుంపు గాదును కొట్టును. అతడు మడిమెను కొట్టును” అని గాదును గూర్చి చెప్పెను (ఆదికాండం 49:19). మోషే గాదును గూర్చి చెబుతూ, “అతడు ఆడు సింహము వలె పొంచియుండును. బాహువును, నడినెత్తిని చీల్చివేయును. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను” అని చెప్పాడు (ద్వితీ. 38:20-21). మోషే ఆశీర్వచన ప్రకారమే గాడు వంశమునుండి వచ్చిన యెఫ్తా పరాక్రమముగల బలాధ్యుడై, ఇశ్రాయేలీయులను అమ్మోనీయుల నుండి రక్షించి, వారికి న్యాయాధిపతిగా వుండెను (న్యాయాధిపతులు11). అలాగే, ఏలియా గాదు వంశమునుండి వచ్చినవాడై, బయలు ప్రవక్తలను చంపించి, ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా వుండెను (1 రాజులు 17:1).

గాదు గోత్రపు పేరు సూర్యకాంత రత్నము మీద పొదగబడినది. తెలుగులో సూర్యకాంతమని తర్జుమా చేయబడినప్పటికీ, అంగ్లములో యిది ‘వజ్రముగా (Diamond) చెప్పబడినది. వజ్రము యొక్క గట్టి తనము గాదు వంశస్థుల యొక్క పరాక్రమమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు సైనికులుగా, యోధులుగా, అంధకారశక్తులపై పోరాటము చేయువారముగా దేవుని వాక్యము మనలను వర్ణిస్తున్నది (2 తిమోతి 2:3-5; ఫిలిప్పీ 2:25; ఎఫెసి 6:10-18).

vii) గారుత్మతము – ఎఫ్రాయీము (Jacinth – Ephraim)

ఐగుప్తులో యోసేపునకు జన్మించిన యిద్దరు కుమారులలో మొదటివాడు మనష్నే, రెండవ వాడు ఎఫ్రాయీము. యోసేపు పేరు భుజ ఖండము మీద పవ్రాయబడగా, యిక్కడ తనకు బదులుగా తన యిద్దరు కుమారుల పేర్లు 114 పవ్రాయబడుచున్నవి. ఇది రెండంతల ఆశీర్వాదమును సూచిస్తున్నది. యోసేపు అను పేరుకు వృద్ది పొందించువాడు” అని అర్ధము. యాకోబు యోసేపును గురించి, “యోసేపు ఫలించెడి కొమ్మ. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి. వారు బాణములను వేసి, అతని హింసించిరి” అని చెప్పెను (ఆదికాండం 49:22, 23). తన సహోదరుల ద్వారాను, ఐగుప్తులోను ఎంతో శ్రమ, వేదనను అనుభవించినప్పటికీ, తన శ్రమలో దేవుడు యోసేపును వృద్ధిచేశాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి, శ్రమలయందును అతిశయపడుదము (రోమా 5:3, 4). అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మీ విశ్వాసము యీ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును (1 పేతురు 1:6, 7). కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, దేవుడు తానే మిమ్మును పూర్ణులనుగా చేసి, స్థిరపరచి, బలపరచును (1 పేతురు 5:10).

114తనకు బాధకలిగిన దేశములో దేవుడు తనను అభివృద్ధి పొందించెనని యోసేపు తన రెండవ కుమారునికి “ఎఫప్రాయీము” (రెండంతలుగా ఫలించుట) అను పేరు పెట్టెను (ఆదికాండం 41:52). యాకోబు మన్నే ఎప్రాయీములను ఆశీర్వదించునపుడు, యోసేపు వారించినప్పటికీ, ఉద్దేశ్యపూర్వకముగా తన కుడిచెయ్యి చిన్నవాడైన ఎప్రాయీము మీద వుంచి, అతడు తన అన్న కంటె గొప్పవాడగునని చెప్పెను (ఆదికాండం 48:13-20). ఎప్రాయీూము పేరు “గారుత్మతము” అను రత్నము మీద పొదగబడినది. “గారుత్మతము” అనగా ఒక ప్రశస్త రత్నమని మాత్రమే చెప్పబడుచున్నది. మరియు అది ఒక మర్మముతో కూడినదనియు అందురు. యాకోబు చిన్నవాడైన ఎప్రాయీముపై కుడి చెయ్యివుంచి, పెద్దవాడైన మనష్నే కంటె రెండంతల ఆశీర్వాదము నిచ్చుట యోసేపునకు ఒక మర్మముగా కనిపించెను.

viii) యష్మురాయి – మనష్షే (Agate – Manasseh)

115మనపష్నే యోసేపునకు జన్మించిన మొదటి కుమారుడని, అయితే అతని తమ్ముడైన ఎప్రాయీము అతని కంటె గొప్పవాడగునని యాకోబు ప్రవచించెనని చూచితిమి. మనష్నే జన్మించినపుడు యోసేపు, “దేవుడు నా సమస్తమైన బాధను, నా తండ్రి యింటి వారనందరిని నేను మరచి పోవునట్లు చేసెనని” చెప్పి, అతనికి “మనష్టే! (మరచుట) అని పేరు పెట్టెను (ఆదికాండం 41:51). వెనుకటి బాధను మరచి, ముందుకు వెళ్లుట కైస్తవ జీవితములో యెంతో ప్రాముఖ్యమైనదని తెలుసుకొందుము. “వెనుక వున్నవి మరచి, ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసు నందు దేవుని వున్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను” అని పౌలు చెప్పాడు (ఫిలిప్పీ 3:18). యేసుక్రీస్తు, ‘నాగటిమీద చెయ్యిపెట్టి, వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని” లూకా 9:62లో సెలవిచ్చెను.

మోషే యోసేపు గోత్రమును ఆశీర్వదిస్తూ, “అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును. ఎప్రాయీము యొక్క పదివేలును, మనష్నే యొక్క వేలును ఆలాగు వుందురని” చెప్పెను (ద్వితీ. 33:17). మోషే చెప్పినట్లుగా ఎప్రాయీూము మనష్షే గోత్రముల వారు కలిసి డెబ్బది రెండువేల యేడువందల మందియై, ఇశ్రాయేలు ఒక చివరనుండి యింకొక చివరవరకు ఆక్రమించిరి (సంఖ్యాకాండం 2:18-21; యెహోషువా 16:17). మనష్నే పేరు ‘యష్క్మురాయి’ అను రత్నము మీద పొదగబడినది. యష్యురాయి ఎంతో గట్టిదై, వెలుపల ఆకర్షణీయంగా లేకపోయినను, దానిని విడగొట్టినపుడు అందమైన రత్నములుగా చేయబడుతున్నది. అలాగే, మనష్షే తన జ్యేష్టత్వపు ఆశీర్వాదము కోల్పోయినప్పుటికీ, ఆ గోత్రము రెండు భాగములుగా విడగొట్టబడి, యొర్దాను నదికిరువైపుల వున్న ప్రాంతమును స్వతంత్రించుకొని, ఆశీర్వదింపబడెను.

ix) ఇంద్రనీలము – బెన్యామీను (Amethyst – Benjamin)

116యాకోబు బేతేలు నుండి ఎప్రాతాకు వెళ్లుమార్గములో తన భార్యయైన రాహేలు ప్రసవవేదనతో ప్రయాసపడుచు, ఒక కుమారుని కని, తన ప్రాణము పోవుచుండగా అతనికి ‘బెనోని’ (దుఃఖపుత్రుడు) అని పేరు పెట్టెను. అయితే యాకోబు అతనికి ‘బెన్యామీను’ (కుడిచేతి పుత్రుడు) అను పేరు పెట్టెను (ఆదికాండం 35:15-19). యాకోబు తన మొదటి భార్య లేయా కంటె రెండవ భార్య రాహేలును బహుగా ప్రేమించెను (ఆదికాండం 29:30). దానిని బట్టి రాహేలుకు పుట్టిన యోసేపు, బెన్యామీనులను కూడా అమితంగా మేమించెను (ఆదికాండం 37:3, 42:4, 43:1-14),

కుమారుడును, రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవునికి కుడిచేతి పుత్రుడు” (మార్కు 16:19; అపొ.కా. 2:33). తండ్రి కుమారుని టేమించెను (యోహాను 3:35). కుమారుని ద్వారా మనలను (సంఘమును) ప్రేమించాడు (యోహాను 38:16; 2 థెస్స2:16). బెన్యామీను జన్మించుట కొరకు రాహేలు మరణమైన రీతిలో మనము నూతనంగా జన్మించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణమాయెను (రోమా 5:8).

బెన్యామీనును గూర్చి యాకోబు, “బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అతడు ఉదయమందు ఎరను తిని, అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును”అని చెప్పెను (ఆదికాండం 49:27). బెన్యామీను గోత్రమునుండి వచ్చిన న్యాయాధిపతి ఏహూదు (న్యాయాధిపతులు 3:12-29), ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు (1సమూయేలు 9:1, 21), మొర్దెకై (ఎస్తేరు 2:5), అపొస్తలుడైన పౌలు (రోమా 11:1; ఫిలిప్పీ 3:5) ఆయా దీతులలో యీ గోత్రలక్షణమును కనబరచిరి. మోషే బెన్యామీనును గూర్చి, “బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మీద అతడు నివసించును” అని చెప్పెను (ద్వితీ 33:12). ఇది విశ్వాసుల పట్ల దేవుడు కలిగియున్న ప్రేమను, దేవుడు వారికి అనుగ్రహించు భద్రతను గూర్చి తెలియజేయుచున్నది (కీర్తన 91, 121).

117చివరిగా బెన్యామీను పేరు “ఇంద్రనీలమను” రత్నము మీద పొదగబడినది. ఆంగ్లములో యిది ‘amethyst’ గా పిలువబడుతున్నది. ‘Amethyst’ అను పదమునకు “మత్తులో లేనట్టి” అను అర్థము యివ్వబడినది. న్యాయాధిపతులు 19, 20 అధ్యాయములలో బెన్యామీను గోత్రము వారు ఒక లేవీయుని అవమానపరచి, అతని భార్యను అత్యాచారము చేసి, ఇతర గోత్రములతో యుద్ధము చేయుట ద్వారా వారు చేసిన తప్పిదమును గూర్చి వ్రాయబడినది. ఇటువంటి మత్తులో జీవించకుండా, ఆత్మపూర్ణులుగా జీవించవలెనన్న సత్యమును యీ రత్నము ద్వారా తెలుసుకుంటున్నాము (ఎఫెసి 5:18-21).

x) రక్తవర్ణపు రాయి – దాను (Chrysolite – Dan)

“దాను” రాహేలు దాసియైన బిల్హా ద్వారా యాకోబునకు జన్మించినవాడు. రాహేలు తనకు సంతానము కలుగకపోయినప్పుడు, తన దాసియైన బిల్లాను యాకోబునకు యిచ్చుట ద్వారా కుమారుని పొంది, దాను (దేవుడు తీర్పు తీర్చును) అను పేరు పెట్టెను (ఆదికాండం 30:1-6). యాకోబు దానును గూర్చి “దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును” (ఆదికాండం 49:16) అని చెప్పెను. దేవుడు యీ లోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చును (యోహాను 12:47, 48). ఆయన తీర్పు పక్షపాతము లేనిది (1 పేతురు 1:17; ప్రకటన 22:12) మరియు న్యాయమైనది (1 పేతురు 2:23). విశ్వాసులు దేవుని తీర్పు పొందకుండునట్లు తమను తాము తీర్పు తీర్చుకొనమని చెప్పబడిరి (1 కొరింథీ 11:28, 31).

యాకోబు యింకను “దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్ల పాముగాను వుండును. అది గుట్టిపు మడిమెలు కరచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును” (ఆదికాండం 49:17) అని చెప్పాడు. యాకోబు చెప్పిన ప్రకారము దాను గోత్రము ఎంతో అపాయకరమైన విషసర్పము గుట్జిమును, రౌతును పడగొట్టు రీతిలో ఇశ్రాయేలు సమాజమును విగ్రహారాధన” అను అడ్డుబండతో పడగొట్టెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయములో కేవలము అయిదుగురు దాను గోత్రపు సైనికులు మీకా యింటిలో వారు కనుగొనిన విగ్రహములను బలవంతముగా 118 తీసుకొని వచ్చి, ఆ గోత్రపు వంశస్థులందరూ ఎన్నో సంవత్సరములు ఆ విగ్రహములను పూజించుటకు కారకులైరి. రెండవదిగా యరొబాము సొలొమోను కుమారుడును, యూదారాజైన రెహబామునకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, రెండు బంగారు దూడలుచేయించి, ఒకటి బేతేలులో, ఒకటి దానులో వుంచుటను బట్టి దాను విగ్రహారాధన స్థలముగా చేయబడెను (1 రాజులు 12:29, 30; ఆమోసు 8:14). అయితే, న్యాయాధిపతి సంసోను దాను గోత్రము నుండి వచ్చిన వాడై, దేవుని ఉద్దేశ్యము నెరవేర్చుటలో “త్రోవలో సర్పము”గా ఉండెను. స్రీ వ్యామోహముతో తనకు దేవుడిచ్చిన బలమును కోల్పోయి, ఫిలిషస్తీయులచేత బంధించబడి, అంధుడుగా చేయబడిన సంసోను తన పూర్వపు బలమును చివరిగా ఒక్కసారి యిమ్మని దేవుని అడిగెను. ఆ బలమును పొందినవాడై, పిలిస్తీయులు చేరియున్న దాగోను గుడి స్తంభములను పడగొట్టుట ద్వారా, తన జీవితకాలమందు చంపిన వారందరికంటె అధికమైన సంఖ్యలో విలివ్రీయులను తన మరణము ద్వారా చంపెను (న్యాయాధిపతులు 17:23-30),

118చివరిగా మోషే దానును గూర్చి “దాను సింహపు పిల్ల. అది బాషాను నుండి దుమికి దాటును” (ద్వితీ. 33:22) అని చెప్పెను. సింహపుపిల్ల యొక్క దూకుడు స్వభావమును సూచిస్తూ దాను గోత్రమువారు తమ స్వాస్థ్యమును పెంచుకొనుటకు లెషెము మీద యుద్ధము చేసి, దానిని స్వాధీనపరచుకొనిరి (యెహోషువా 19:47, 48; న్యాయాధిపతులు 18:27-29). దాను గోత్రము యొక్క యుద్ధ స్వభావము, గట్టి తనమును సూచిస్తూ, ఈ గోత్రపు పేరు “రక్తవర్ణపు రాయి” (Chrysolite) మీద పొదగబడినది. ఈ రాయి ఎంతో గట్టిదిగా యెంచబడుతున్నది. సాతాను శక్తులను కూలదోయుటకు కావలసిన ఆత్మీయమైన గట్టితనము మనము కలిగియుందుముగాక.

xi) సులిమాని రాయి – ఆషేరు (Onyx – Asher)

ఆషేరు లేయా దాసియైన బిల్హాకును, యాకోబునకును పుట్టిన రెండవ కుమారుడు. ఆషేరు జన్మించినపుడు లేయా “నేను భాగ్యవంతురాలను. స్త్రీలు నన్ను భాగ్యవతి అందురుగదా” అని అతనికి “ఆషేరు” (సంతోషము) అను పేరు 119 పెట్టెను. మనయందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంతోషము వుండుట ద్వారా మన సంతోషము పరిపూర్ణమగునని వాక్యము సెలవిస్తున్నది (యోహాను 15:11). చెప్పనశక్యమును, మహిమాయుక్తమునైన సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించునని 1పేతురు 1:8లో చదువుచున్నాము.

119యాకోబు ఆషేరును ఆశీర్వదిస్తూ, “ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్ధములను అతడిచ్చును” అని చెప్పెను (ఆదికాండం 49:20). ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను జీవాహారముగా, జీవజలముగా దేవుని వాక్యములో బయలు పరచుకొనెను (యోహాను 6:35, 51, 58, 4:14, 7:37, 38). యేసుక్రీస్తను జీవాహారమును శ్రేష్టమైన ఆహారముగా కలిగియున్నపుడే సంతోషము, సంతృప్తిని కలిగియుందుమని తెలుసుకుంటున్నాము (కీర్తన 36:8, 9, 63:45).

మోషే ఆషేరును గూర్చి “ఆషేరు తన సహోదరుల కంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటె కటాక్షమునొందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు (పాదరక్షలు) ఇనుపవియు, ఇత్తడివియునైయుండును. నీవు బ్రదుకుదినములలో నీకు విశ్రాంతి కలుగును” (ద్వితీ. 33:24-25) అని చెప్పెను. ఈ వచనములలో తైలము ఆత్మాభిషేకమును, ఇనుము-ఇత్తడితో కూడిన పాదరక్షలు స్థిరమైన నడకను సూచిస్తున్నవి. అనగా, ప్రభువైన యేసుక్రీస్తును ేష్టమైన ఆహారముగా మనము కలిగియున్నపుడు ఆత్మచేత స్థిరమైన మార్గములలో నడిపించబడుతూ, ఆత్మీయబలము కలిగి, సంతోషించెదమని తెలుసుకుంటున్నాము (కీర్తన 119). ఆషేరు పేరు ‘సులిమాని రాయి’ అను రత్పము మీద పొదగబడినది. ఈ రత్నము యొక్క మూలపదమునకు “ప్రకాశించుచుండు స్వభావము” వున్నదని చెప్పబడుచున్నది. ఈ రాయి ఆషేరు గోత్రము యొక్క లక్షణమును తెలియజేయు చున్నదని గమనించగలము.

xii) సూర్యకాంతము – నఫ్తాలి (Jasper – Naphtali)

120నఫ్తాలి రాహేలు దాసియైన బిల్హాకును, యాకోబునకును పుట్టిన రెండవ కుమారుడు. నఫ్తాలి జన్మించినపుడు రాహేలు, “దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని” అతనికి నఫ్తాలి (నా పోరాటము) అను పేరు పెట్టెను(ఆదికాండం 30:7, 8). నిజానికి తన అక్క విషయములో రాహేలు చేసినది పోరాటము కాదు గానీ, శరీరానుసారమైన పోటీ అని చెప్పవచ్చును. అయితే, దేవుని వాక్యములో మనము అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నామని చెప్పబడుచున్నాము (ఎఫెసీ 6:12). యాకోబు దేవునితో పోరాడి గెలిచెనని ఆదికాండం 32:24-30లో చదువుచున్నాము. ఇది యెడ తెగని, పట్టుదలతో కూడిన “ప్రార్థనా పోరాటము”ను సూచిస్తున్నది. ఇదే సత్యమును తెలియజేయుచూ ప్రభువైన యేసుక్రీస్తు ‘అవసరములో ఉన్న స్పేహితుడు’ (లూకా 11:5-13) మరియు “గోజాడు చున్న విధవరాలు” (లూకా 18:1-8) అను ఉపమానములు చెప్పెను.

యాకోబు నఫ్రాలిని గూర్చి, “నఫ్తాలి విడువబడిన లేడి. అతడు యింపైన మాటలు పలుకును” అని చెప్పెను (ఆదికాండం 49:21). “ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును” అని దేవుని వాక్యము సెలవిస్తున్నది (2 సమూయేలు 2:34; కీర్తన 18:33; హబక్కుకు 3:19). ముళ్లపొదల ద్వారా ఉన్నత స్థలముల పైకి యెక్కి వేటగాని ఉరి నుండి తప్పించుకొనుటకు లేడి కాళ్లు అనువుగా వుండును. అదే విధముగా, యీ జీవితయాత్రలో కలుగు శ్రమల (ముళ్లపొదల) మధ్య, దేవునికి దగ్గరగా (ఉన్నత స్థలములపై), సాతాను ఉరినుండి తప్పించుకొని జీవించుటకు దేవుడు మనకు సహాయపడునుగాక! (ద్వితీ. 32:13; కీర్తన 91:3, 124:7; యెషయా 41:10; యూదా 24, 25). అట్లు జీవించినపుడు మోషే నఫ్రాలిని గూర్చి చెప్పినట్లు యెహోవా కటాక్షము చేత తృప్తిపొంది, ఆయన దీవెనలచేత దీవించబడుదుము (ద్వితీ. 33:23).

121నఫ్తాలి పేరు సూర్యకాంతపు రత్నము (Jasper) మీద పొదగబడినది. సూర్యకాంతపు రత్నము దేవుని మహిమను సూచిస్తున్నది. అపొస్తలుడైన యోహాను పరలోకము నుండి దిగివచ్చుచున్న “నూతన యెరూషలేము” పట్టణము యొక్క వెలుగు “ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యరత్నము”ను పోలినదిగా చూచెను (ప్రకటన 21:11). దేవునికి దగ్గరగా జీవించినపుడు యిటువంటి వెలుగును మనము కూడా కలిగియుందుమని నఫ్రాలిగోత్రము ద్వారా తెలుసు కుంటున్నాము.

e) తలపాగా (Turban)

(నిర్గమకాండం 28:39, 40, 39:27-29)

%..సన్ననారతో పాగాను నేయవలెను..... అహరోను కుమారులకు అలంకారమును, ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను” (నిర్గమకాండం 28:39, 40).

సన్ననార చొక్కాయిని, దట్టీని, నార లాగులను ధరించిన ప్రధాన యాజకుడు సన్ననార చొక్కాయి పై ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదు నిలువుటంగీపై ఏఫోదును ధరించినట్లు యిది వరకు చూచితిమి. చివరిగా తన తలపై సన్ననార పాగా (Linen Turban) ప్రధాన యాజకుడు ధరించుచున్నాడు. యాజకులు సన్ననార చొక్కాయి, దట్టీ, నార లాగులు ధరించిన తరువాత తలపాగా కాకుండా, సన్ననార కుళ్లాయి (Linen headband) లను ధరించు చున్నారు. సన్ననార తలపాగా, కుళ్లాయిలు మిగిలిన వస్త్రములతో కలిపి ప్రధాన యాజకునికి, యాజకులకు అలంకారమును, ఘనతయును కలుగజేయుచున్నవి (నిర్గమకాండం 28:39, 40).

ఈ సన్ననార తలపాగా, కుళ్లాయిలు మరొక సారి దేవుని నీతిని, పరిశుద్ధతను సూచిస్తున్నవి (కీర్తన 96:9). ఈ సత్యమును సన్ననార చొక్కాయిని గూర్చిన వర్ణనలో తెలుసుకొంటి మి. అనగా, దేవుని యెదుట నిలబడి, పరిచర్య చేయుటకు ప్రధాన యాజకుని మరియు యాజకుల శరీరమంతయు సన్ననార వస్త్రములచే (చొక్కాయి, లాగులు, తలపాగాగకుళ్లాయి), అనగా దేవుని నీతి చేత కప్పబడి 122 యుండవలెనన్న సత్యమును గమనించుచున్నాము. ప్రస్తుతకాలములో సంఘములో లేదా దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు యేసుక్రీస్తు ద్వారా ఆపాదించబడిన దేవుని నీతి కలిగియుండుట ద్వారా మాత్రమే సాధ్యమవునని దేవుని వాక్యము సెలవిస్తున్నది (రోమా 10:4-10, 5:18, 19; 1 కొరింథీ 1:30; 2 కొరింథీ 5:21). దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీతి అను పై బట్టను మనకు ధరింపజేసెననియు, ఈ నీతి వస్త్రము లేకుండా ఆయన సన్నిధిలో ప్రవేశింపలేమనియు వాక్యము ద్వారా తెలుసుకొనుచున్నాము (యెషయా 61:10; ప్రకటన 19:7-9; మత్తయి 22:11-18).

122సన్ననార తలపాగా, కుళ్లాయిలను గూర్చి యింకొక సంగతిని మనము గమనించిన యెడల, యివి యాజకుల తలంపులు దేవుని నీతితో కూడుకొన్నవై యుండవలెనని తెలియజేయుచున్నవి. సంవఫుము క్రీస్తు శరీరవునియు, సంఘమునకు శిరస్సు క్రీస్తేననియు, క్రీస్తు నాయకత్వమునకు సంఘము లోబడుననియు వాక్యము సెలవిస్తున్నది (ఎఫెసీ 5:23, 24). అలాగే, దేవుని యాజకులముగా మన తలంపులు దేవుని నీతితో ఆవరింపబడినపుడు, వాటి ప్రకారమే మన నోటి మాటలు, చేతలు, కాలి నడకయు వుండును (హెబ్రీ 4:12; 2 కొరింథీ 10:5; మార్కు 7:20-23). యోబు, “నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, పాగాయు ఆయెను” అని తన జీవితము ద్వారా సాక్ష్యమిచ్చెను (యోబు 29:14). కీర్తనాకారుడు దావీదు చెప్పినట్లు, “దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందునృదేమో చూడుము. నిత్యమార్గమున నన్ను నడిపింపుము” అని ప్రార్థించవలసిన అవసరత మనకెంతైనావున్నది (కీర్తన 139:23, 24).

f) పరిశుద్ధ కిరీట భూషణము (The sacred Diadem)

(నిర్గమకాండం 28:36-38, 39:30-31)

123చివరిగా ప్రధానయాజకుడు మేలిమి బంగారు రేకుతో చేయబడి, దానిమీద “యెహోవా పరిశుద్ధుడు” అని ప్రాయబడిన “పరిశుద్ధ కిరీట భూషణము”ను ధరించుచున్నాడు (నిర్షమ కాండం 28:36-38, 39:30, 31). ఇది తలపాగా ముందటి వైపున ప్రధాన యాజకుని నొసటి మీద వుండి, వెనుక వైపున నీలి సూత్రముతో కట్టబడుచున్నది. ప్రధానయాజకుడు ధరించిన యీ పరిశుద్ధ కిరీట భూషణము క్రింది సత్యమును సూచిస్తున్నది. i తన నొసటి మీద దేవుని నామము కలిగిన పరిశుద్ధ కిరీట భూషణము ధరించుట ద్వారా ప్రధాన యాజకుడు దేవుని కొరకై, ఆయన సేవకొరకై ముద్రింపబడి యున్నాడు. ఏడేండ్ల శ్రమల కాలములో లక్షా నలువది నాలుగు వేల మంది ఇశ్రాయేలీయులు దేవుని నామము చేత ముద్రింపబడుదురు (ప్రకటన 7:4). ప్రభువైన యేసుక్రీస్తు “నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముగా” ఉండుటకు దేవుని చేత ముద్రింపబడెను (యోహాను 6:27-29). “ప్రభువు తన వారిని ఎరుగును” అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్వీతినుండి తొలగిపోవలెను” అనునదియు దేవుని స్థిరమైన పునాదికి ముద్రగా ఉన్నదని 2 తిమోతి 2:19లో చదువు చున్నాము. అంతేగాక, విమోచన దినము వరకు ఆయన ఆత్మచేత ముద్రింపబడియున్నామని దేవుని వాక్యము సెలవిస్తున్నది (ఎఫెసీ 1:14, 4:30; 2 కొరింథీ 1:22). ii తన నొసటి మీద నున్న పరిశుద్ధ కిరీట భూషణము మీద వ్రాయబడిన “యెహోవా పరిశుద్ధుడు” అను మాట దేవుని పరిశుద్ధతను గూర్చి ప్రధానయాజకునికి యెల్లప్పుడు జ్ఞాపకము చేయుచూ, తానును, యితర యాజకులును తమ పరిచర్యలో పరిశుద్ధతను కనపరచవలెనన్న గమనములోనికి అతనిని నడిపిస్తున్నది (యెషయా 57:15; 1 థెస్స.4:7; 1 పేతురు 1:14-16). రాజైన ఉజ్జియా దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకముగా పాపము చేని, తన నొనట కుష్ము వ్యాధిని పాందెను (2 దిన.వృ.26:19-20). విస్తారమైన పాపములతో నిండికొనియున్న బబులోను 124 పట్టణము, తన నొసట, “మర్మము, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను” అని వ్రాయబడిన వేశ్యతో పోల్చబడెను (ప్రకటన 17:5). గర్వముతో విర్రవీగుతున్న ఫిలిష్తీయుడైన గొల్యాతు నొసటిలో దావీదు వడిసెలతో విసిరిన రాయి చొచ్చుకు పోవడంతో బోర్లపడి, చనిపోయెను (1 సమూ.17:49). నుదుటి భాగము దేవునికి వ్యతిరేకముగా మానవుడు కనబరచు కఠిన వైఖరిని సూచిస్తున్నది (యెహేజ్కేలు 3:7-9). iii పరిశుద్ధ కిదీట భూషణము వెనుకవైపు నీలి సూత్రముల ద్వారా ప్రధానయాజకుని నొసట కట్టబడుచున్నది. ఈ నీలి సూత్రము కృపను సూచిస్తున్నట్లు యిది వరకు చూచితిమి. ఇశ్రాయేలీయులను, వారి అర్పణముల యొక్క దోషమును ప్రధాన యాజకుడైన అహరోను భరించునట్లు యీ భూషణము అతని నొసటి మీద నిత్యమును ఉండవలెనని నిర్గమకాండం 8:88లో చదువుచున్నాము. ఈ మాట ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చొప్పున మన దోషములన్సిటిని భరించునన్న సత్యమును తెలియజేయుచున్నది (యెషయా 53).

124ఆమెన్