UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు
రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar
4. అపరాధ పరిహారార్థ బలి
The Trespass Offering · ముద్రిత పుటలు 76–81 · 892 పదాలు · ≈7 నిమిషాలు
ఈ అధ్యాయములో
- ·i) సత్యమును దాచి పెట్టుట
- ·ii) అపవిత్రత (లేవీ 5:2, 3)
- ·iii) వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనుట (లేవీ 5:4)
- ·iv) దేవునికి పరిశుద్ధమైనది యివ్వక పోవుట (లేవీ 5:15-16)
- ·v) దేవుని కట్టడలను గూర్చిన ఏమరుపాటు
- ·vi) తనకు అప్పగించబడిన దాని గూర్చి పాపము చేయుట
- ·vii) తాకట్టు ఉంచినదాని విషయములో పాపము చేయుట
- ·viii) తన పొరుగువానిని బలాత్కరించుట (లేవీ 6:2)
- ·ix) పొరుగు వానిని మోసగించుట
- ·x) పోయి, తనకు దొరికిన దానిని గూర్చి బొంకుట
(లేవీయ కాండం. 5:1-19, 7:1-10)
76“పాపపరిహారార్థ బలి”లో క్రింది సంగతులను గమనించితిమి.
a) యేసుక్రీస్తు మన పాపముల కొరకు “ప్రాయశ్చిత్తము” (Atonement) చేయబడెను. అనగా మన పాపముల యొక్క దోషమును తాను భరించెను (Expiation). మన పాపములకు రావలసిన దేవుని ఉగ్రతను పోగొట్టి, మన పాపములకు శాంతికరమాయెను (Propitiation). మన పాపములను బట్టి దేవుని నుండి వేరుచేయబడిన మనలను దేవునితో సమాధానపరచెను (Reconciliation). తన ప్రాణమును, తన రక్తమును క్రయముగా చెల్లించి, మన పాపబంధకముల నుండి మనకు విమోచన కలిగించెను (Redemption).
b) పాపపరిహారార్థ బలి విశ్వాసులు తాము పొరపాటున, తెలియకచేసిన పాపముల కొరకైన యేసుక్రీస్తు బలియాగమును సూచిస్తున్నది.
c) పాపపరిహారార్థ బలి పశువు యొక్క శేషము పాపముచే ఆవరింపబడినదై పాళెము వెలుపల దహించి వేయబడినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు మానవుల పాపమును మోసుకొని, పాళెమునకు వెలుపలికి వెళ్ళి, సిలువవేయబడి, శ్రమపడెను.
పాపమనగా దేవుని నీతి, పరిశుద్ధత లోపించియుండునది (1 యోహాను 5:17). అపరాధమనగా ఆజ్ఞను అతిక్రమించుట (1 యోహాను 3:4). అపరాధ పరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలో ఒక భాగమైనప్పటికీ, యీ రెంటికి మధ్య వ్యత్యాసమును గమనించినట్రైతే, పాపపరిహారార్థ బలి, స్వభావసిద్ధముగా పాపియైన మానవుని నీతిమంతునిగా తీర్చుట కొరకు యేసుక్రీస్తు చేసిన “ప్రాయశ్చిత్తము”ను సూచిస్తున్నది. అపరాధ పరిహారార్థ బలి పాపియైన మానవుని బట్టి దేవునికి దూరమైన ఆరాధన, మహిమను అదే మానవుడు నీతిమంతుడుగా చేయబడి, వాటిని తిరిగి దేవునికి చెల్లించుట కొరకు యేసుక్రీస్తు చేసిన “సమకూర్చుదల”ను (Restitution) సూచిస్తున్నది. అంతేగాక పాపియైన మానవుడు తాను పోగొట్టుకున్న జీవము, శాంతి, సమాధానము, దేవునితో సహవాసములను 77 యేసుక్రీస్తు బలిద్వారా వాటిని తిరిగి సమకూర్చుకున్నాడన్న సత్యమును అపరాధ పరిహారార్థ బలి ద్వారా గమనించగలము.
77అపరాధ పరిహారార్థ బలి వాక్యభాగము (లేవీ 5:1-19, 7:1-10) లో క్రింద తెలుపబడిన పది రకముల అపరాధమును గమనించగలము.
i) సత్యమును దాచి పెట్టుట
ఒకడు ఒట్టుపెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చిగాని, తనకు తెలిసిన దాని గూర్చిగాని సాక్షియైయుండి, దాని తెలియజేయక పాపము చేసిన యెడల అతడు తన దోషశిక్షను భరించును (లేవీ 5:1). ఆకాను చేసిన తప్పిదమును కప్పి పెట్టినందున అతని కుటుంబ సభ్యులు కూడా అతనితో పాటు రాళ్లతో కొట్టబడి, చంపబడిరని కొందరు చెప్పుదురు (యెహోషువా 77:24-26). యూదులు పౌలును చంపవలెనని తీర్మానము చేసుకున్నప్పుడు ఆ సంగతిని పౌలు మేనల్లుడు అతనికి తెలుపడం ద్వారా పౌలు రక్షింపబడెను (అపొ.కా. 23:12-24). ప్రభువైన యేసుక్రీస్తు జనులు తనపై అబద్ధసాక్ష్యము చెప్పినప్పుడు మౌనముగా వుండెను గానీ ప్రధానయాజకుడు నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని ఒట్టుపెట్టుకొని అడిగినప్పుడు ‘నీవనృట్టే అని సత్యమును బయలుపరచెను (మత్తయి?26:57-64). నేటి దినములలో సత్యమును చెప్పువారు కరువగుచున్నారు.
ii) అపవిత్రత (లేవీ 5:2, 3)
ఇశ్రాయేలీయులు అపవిత్ర వస్తువులను, అపవిత్ర కళేబరములను తాకినపుడు అపవిత్రులగుదురని లేవీ 5:2, 8లో చదువుచున్నాము. ఇంకను లేవీకాండం 12, 15, 21 అధ్యాయములలో యితర రకములైన అపవిత్రత గురించి వ్రాయబడినది. ఇవన్నియు దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రతి విధమైన పాపమునుండి పవిత్రులుగా వుండవలెనని సూచక ప్రాయముగా తెలియజేసెను. ప్రస్తుత కాలములో విశ్వాసులముగా మనము శుద్ధహృదయము (కీర్తన 24:4), పవిత్రమైన మనస్సాక్షి (1 కొరింధి8:7; 1 తిమోతి 3:9), నిర్మలమైన మనస్సు (2 పేతురు 3:2) కలిగి యుండవలెనని దీనిని బట్టి తెలుసుకుంటున్నాము.
iii) వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనుట (లేవీ 5:4)
78“మరియు కీడైనను, మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టుపెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును (లేవీ 5:4). దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనకూడదను ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్ళరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా యెంచడు (నిర్గమకాండం 20:7). దేవుని పరిచర్యలో వ్యర్థముగా, త్వరపడి మాటయిచ్చి, దానిని నిలబెట్టుకొనలేక పోవుట కంటె మౌనముగా వుండుట మేలు. మనమాట “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్లుగా వుండవలెనని వాక్యము సెలవిస్తున్నది (మత్తయి 5:33-37; యాకోబు 5:12). కీర్తనాకారుడు దావీదు కీర్తన 141:8లో “యెహోవా, నా నోటికికావలియుంచుము. నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము” అని చెప్పినట్లుగా మనమాటలు కాచుకొనే అవసరత మనకందరికీ వున్నది.
iv) దేవునికి పరిశుద్ధమైనది యివ్వక పోవుట (లేవీ 5:15-16)
ఇశ్రాయేలీయులు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటు చేసినప్పుడు అపరాధులుగా యెంచబడిరి. అట్టివారు తమ అపరాధమునకు సరిపడిన నష్టమునిచ్చుకొని, దానికి పైగా అయిదవ వంతు యాజకునికి యివ్వవలెను (లేవీ 5:15-16). దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన కొన్ని కట్టడలు గమనించిన యెడల:
✿ మనుష్యుల యొక్కయు, పశువుల యొక్కయు ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను (నిర్గమకాండం 13:2).
✿ ఇరువది సంవత్సరములకు పై వయస్సు గలిగినవారు అరతులము వెండిని ప్రాణపరిక్రయ ధనముగా అర్పింపవలెను (నిరమకాండం 30:11-16).
✿ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను (లేవీ 23:10-14).
79✿ భూధాన్యములు, వృక్ష ఫలములు, గోవులు, గొట్టి మేకలలో దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠితము చేయవలెను (లేవీ 27:30-32).
పైన చెప్పిన వాటిలో యేది నెరవేర్చకపోయినను అపరాధులుగా యెంచబడి, నష్టమునిచ్చుకొనవలెను. ప్రస్తుత కాలములో మనము కూడా మన ధనము, సమయము, బలము దేవుని పరిచర్యలో వాడుటకు వెనుకబడియుందుము. మనము దేవుని కట్టడలను గైకొనకుండా ఆయన యొద్ద దొంగిలుచున్నామని మలాకీ 3:7-9 లో చదువుచున్నాము.
v) దేవుని కట్టడలను గూర్చిన ఏమరుపాటు
చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై, తన దోషమునకు శిక్ష భరించును (లేవీ 5:17). పరిశుద్ధ జీవితము జీవించుటకు దేవుడు తన వాక్యమును మనకు బయలు పరచినప్పటికీ యెన్నో సార్లు వాక్యమునకు విధేయులై యుండుటలో ఏమరుపాటు కలిగి, తప్పిపోదుము.
vi) తనకు అప్పగించబడిన దాని గూర్చి పాపము చేయుట
(విశ్వాస ఘాతుకము)
ఇతరులు మనకు అప్పజెప్పిన వస్తువులు, ఆస్తి లేదా మనుష్యుల విషయములో తగిన జాగ్రత్త వహించకుండా నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించుట అపరాధము (విశ్వాస ఘాతుకము)గా యెంచబడుచున్నది (లేవీ 6:2). ఎలీషా శిష్యుడు తన గొడ్డలి ఊడి, నీటిలో పడిపోగా, “అయ్యో, నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని” ఎలీషాతో చెప్పుట ద్వారా తన శ్రద్ధను కనబరచెను (2 రాజులు 6:ర్),
vii) తాకట్టు ఉంచినదాని విషయములో పాపము చేయుట
తాకట్టు పెట్టబడినదాని విషయములో యితరులకు నష్టము, తనకు లాభము కలుగునట్లు ప్రవర్తించుట అపరాధము (లేవీ 6:2). అనగా యితరుల విషయములో స్వప్రయోజనము, స్వలాభమును ఆశించి, స్వార్థమును ప్రదర్శించుట అపరాధముగా వాక్యము సెలవిస్తున్నది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమేగాక 80 యితరుల కార్యములను కూడా చూడవలెను (ఫిలిప్పీ 2; 4),
viii) తన పొరుగువానిని బలాత్కరించుట (లేవీ 6:2)
80ఇతరుల పట్ల కఠినముగా వ్యవహరించుట, మాట్లాడుట, వారి ఆస్తులను బలవంతముగా స్వాధీనపరచుకొనుట మొదలగు వాటిని వాక్యము ఖండించుచున్నది. మనము జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ధశాంతమును ధరించుకొనవలెనని వాక్యములో హెచ్చరింపబడుచున్నాము (కొలొస్సీ 3:12). ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు, ఒకని నొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి (కొలస్సీ 3:13). జక్కయ్య మారుమనస్సు పొందినవాడై, యేసుక్రీస్తుతో, “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదల కిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని” ప్రభువుతో చెప్పాడు (లూకా 19:8).
ix) పొరుగు వానిని మోసగించుట
తన పొరుగువానితో బొంకి, దోచుకొని, మోసము చేయుట అపరాధము (లేవీ 6:2). పరిశుద్ధ గ్రంథములో అననీయ, సప్పీరాలు పరిశుద్దాత్మను మోసపరచుటకు ప్రయత్నము చేసి, పేతురుతో అబద్ధమాడుట ద్వారా తమ ప్రాణాలు కోల్పోయిరి (అపొ.కా. 5:1-11).
x) పోయి, తనకు దొరికిన దానిని గూర్చి బొంకుట
ఇతరుల వస్తువులు తమకు దొరికినపుడు వాటిని వాటి యజమానులకు చేరవేయు ప్రయత్నము చేయకుండా, వాటిని తమ యొద్దనే వుంచుకొని, వాటిని గూర్చి బొంకుట అపరాధముగా యెంచబడుచున్నది.
పైన చెప్పబడిన రీతులలో అపరాధులైన వారు తమ పాపమును ఒప్పుకొని, అపరాధ పరిహారార్థబలి అర్పించుచుండిరి (లేవీ 5:5). అంతేగాక, తన అపరాధమునకు సంబంధించిన మూలధనమునిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొౌత్తుదారునికి 81 ఇచ్చుకొనవలెను (లేవీ 6:4-5). ఇట్లు చేయుటద్వారా అపరాధమునకు సంబంధించిన నష్టము సమకూర్చబడి, దానికి పైగా అయిదవ వంతు చెల్లింపబడుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన అపరాధములకొరకైన పై విలువను మన పక్షమున తానే దేవునికి చెల్లించి, మన అపరాధములను తుడిచివేసి, దేవునితో మన సహవాసమును సమకూర్చెనని “అపరాధ పరిహారార్థబలి” ద్వారా తెలుసుకుంటున్నాము. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద బుణముగాను, మనకు విరోధముగాను వుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని యెత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను” (కొలొస్సి 2:14, 15).
81దహనబలి, పాప పరిహారార్థబలిలో చెప్పబడినట్లు అపరాధ పరిహారార్థబలిలో కూడా నిర్దోషమైన బలిపశువు యొక్క రక్తము ప్రోక్షింపబడుచున్నది (లేవీ 5:18, 7:2). నిరోషియైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన అపరాధముల పరిహారార్థము చిందింపబడినది (1 పేతురు 1:19). ప్రభువైన యేసుక్రీస్తుతో మన అనుదిన నడకలో మనకు కలుగు అపరాధములు క్రీస్తు రక్తములో కడగబడడం ద్వారా దేవునితో సహవాసమునకు తిరిగి సమకూర్చబడుదుము.