UECF.NETమోషే ప్రత్యక్షపు గుడారము
మోషే ప్రత్యక్షపు గుడారము

UECF.NETBooksమోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు

రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar

బలిపీఠపు అర్పణలు – పరిచయము

The Offerings: Introduction · ముద్రిత పుటలు 62–63 · 196 పదాలు · ≈2 నిమిషాలు

📄 PDF

62ప్రియులారా, యీ పుస్తకము యొక్క మొదటి భాగములో ప్రత్యక్షపు గుడారము యొక్క వర్ణనను తెలిసికొంటిమి. ఇప్పుడు బలిపీఠముపై యాజకులు అర్పించు అయిదు రకముల అర్పణలను గురించి రెండవ భాగములో ధ్యానింతుము. బలిపీఠమును గురించి మొదటి భాగము యొక్క రెండవ అధ్యాయములో చదివితిమి. ఈ బలిపీఠముపైన యాజకులు క్రింద తెలుపబడిన అర్పణలు అర్పించుచుండిరి.

1) దహన బలి (లేవీయకాండం మొదటి అధ్యాయము)

2) నైవేద్యము (లేవీయకాండం రెండవ అధ్యాయము)

3) సమాధాన బలి (లేవీయకాండం మూడవ అధ్యాయము) డ్త పాపపరిహారార్థ బలి (లేవీయకాండం నాలుగవ అధ్యాయము)

5) అపరాధ పరిహారార్థ బలి (లేవీయకాండం అయిదవ అధ్యాయము)

ఈ అయిదు అర్పణలు యేసుక్రీస్తు బబియాగము యొక్క విశిష్ట లక్షణములను తెలియజేయుచున్నవి (వీటిని యీ భాగములో ధ్యానింతుము). అంతేగాక, యీ అయిదు అర్పణలు యేసుక్రీస్తునందు విశ్వాసులకున్న ఆధిక్యతలు, బాధ్యతలను గురించి తెలియజేయుచున్నవి.

పైన చెప్పబడిన అర్పణలలో మొదటి మూడు అర్పణలు ఇశ్రాయేలీయులు యిష్టపూర్వకముగా సమర్పించు అర్పణలు. ఇవి వారి భక్తిని సూచిస్తున్నవి. వారు యిష్ట పూర్వకముగా యీ అర్పణలతో దేవుని యొద్దకు వచ్చిరి గనుక అవి యెహోవాకు “ఇంపైన సువాసన గల హోమమూు”లుగా చెప్పబడినవి (లేవీ 1:9, 13, 17; 2:2, 9; 3:5). చివరి రెండు అర్పణలు ఇశ్రాయేలీయుల పాపము క్షమించబడుటకు అర్పించునట్లు యెహోవా వారికి ఆజ్ఞాపించెను. అనగా యివి తప్పని సరిగా చేయవలసినవి. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును (లేవీ 4:20, 26, 31, 35; 5:10, 13, 18).

63ఈ అయిదు అర్పణలలో సమాధాన బలి మూడవదిగా లేవీయకాండం మూడవ అధ్యాయములో వర్ణించబడినప్పటికీ, దానిని ఆచరించు విషయములో చివరిదిగా వర్ణింపబడినది (లేవీ 7:11-21). అనగా దేవుని కట్టడలన్నీ నెరవేర్చినపుడు ఆయన సమాధానము మనతో వుండిపోవునన్న అర్థమిచ్చునట్లు సమాధాన బలి చివరిదిగా ఆచరింపబడినది. ఇదే క్రమములో యీ భాగములోని అయిదు అర్పణల వివరణ యివ్వబడినది.