UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు
రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar
2. నైవేద్యము
The Grain Offering · ముద్రిత పుటలు 67–70 · 632 పదాలు · ≈5 నిమిషాలు
(లేవీయకాండం 2:1-16, 6:14-18)
67ప్రియులారా, యిది వరకు చెప్పబడినట్లు బలిపీఠము మీద అర్పింపబడుచున్న అయిదు రకముల అర్పణలు యేసుక్రీస్తు బలియాగము యొక్క విశిష్ట లక్షణములను తెలియజేయుచున్నవి. దహనబలిని గూర్చి యీ క్రింది సత్యమును తెలిసికొంటిమి.
a) ప్రభువైన యేసుక్రీస్తు మానవుల పాపముల కొరకై ఒక బలిపశువువలె దహించబడదెను.
b) బలిపశువు యొక్క తల, ఆంత్రములు, కాళ్లు, క్రొవ్వు బలిపీఠము మీద దహించబడిన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు తన తలంపులు, హృదయము, వెలుపలి నడక, ఆరోగ్యమును తండ్రియైన దేవునికి, ఆయన సేవకు అర్పించుకొనెను.
c) పైన చెప్పబడిన విధానములో మనము కూడా మన స్వయమును దేవునికి అర్పించుకొనవలెను.
నైవేద్యమును గూర్చి పైన యివ్వబడిన వాక్యభాగములో నైవేద్యము గోధుమపిండి మరియు గోధుమపిండితో చేయబడిన అప్పడములు, పూరీలుగా అర్పించబడుచున్నది (లేవీ 2:1, 4,5, 7). దీనిని గూర్చిన సంగతులు క్రింద తెలుపబడినవి.
i) యేసుక్రీస్తు తన మరణ, పునరుత్థానములను గూర్చి తెలియజేయుచూ, తన్నుతాను ఒక గోధుమ గింజతో పోల్చుకొనెను (యోహాను 12:23, 24). ఈ గోధుమలు నలుగగొట్టబడుట ద్వారా గోధుమపిండి తయారుచేయబడును. ప్రత్యక్షపు గుడారములో నున్న బల్లమీది రొట్టెలు గోధుమపిండితో చేయబడినవని, గోధుమలు నలుగగొట్టబడి, పిండిచేయబడి, రొట్టెలుగా చేయబడిన విధానములో యేసుక్రీస్తు మన పాపముల కొరకు నలుగగొట్టబడి, మనము భుజించు రొట్టెగా (జీవాహారముగా) చేయబడియున్నాడని యిది వరకు చూచితిమి (లేవీ 24:5, యెషయా 52:14, 538; యోహాను 6:32-35).
68మనము భుజించు రొలట్టెగా చేయబడుటకు యేసుక్రీస్తు యెంతో శ్రమనొందెనని మనము తెలుసుకొంటున్నాము. అంతేగాక, పైన చెప్పబడిన నైవేద్యము గోధుమపిండిగాను (లేవీ 2:1), పొయ్యిలో కాల్చిన గోధుమపిండి అప్పడములు, పూరీలుగాను (లేవీ 2:4), పెనము మీద కాల్చబడిన గోధుమపిండిగాను (లేవీ 2:5), కుండలో వండిన గోధుమపిండిగాను (లేవీ 2:7) అర్పింపబడుతున్నది. ఇది యేసుక్రీస్తు శ్రమకు సూచనగావున్నది (1 పేతురు 2:21-23, 3:18; యెషయా 53, లూకా 24:26, 46).
అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు మనము కూడా యీ లోకములో అనేక శ్రమల నెదుర్కొనవలసి వచ్చునని (యెహాను 16:33; 2 తిమోతి 3:12; ఫిలిప్పీ 1:30; అపొ.కా. 14:22) దేవుని వాక్యము సెలవిస్తున్నది. అయితే, క్రీస్తు కొరకు శ్రమలననుభవించుట అపొస్తలులు ధన్యకరముగా యెంచుకొనిరి (అపొ.కా. 5:41). పౌలు క్రీస్తు శ్రమలలో పాలివాడై యుండగోరెను (ఫిలిప్పీ 3:10). ప్రస్తుత కాలపు శ్రమలు తాత్కాలికమనియు (1 పేతురు 5:10), అవి రాబోవు మహిమ యెదుట యెన్నదగినవి కావనియు (రోమా 8:18) వాక్యము తెలియజేయుచున్నది. ఈ శ్రమలు మన విశ్వాసములో మనలను బలపరచి, యేసుక్రీస్తు ప్రత్యక్షతలో మహిమకు, ఘనతకు కారణమగును (1 పేతురు 1:7).
ii) నైవేద్యమునకు వాడబడుతున్న గోధుమపిండి యెలాంటి నూకలు లేక స్వచ్చమైన పిండిగా వున్నది. ఈ మాట యేసుక్రీస్తు యెలాంటి పాపము, లోపము లేని వాడన్న సత్యమును తెలియజేయుచున్నది (హెబ్రీ 7:26).
iii) నైవేద్యమునకు వాడబడుతున్న గోధుమ పిండికి నూనె కలుపబడుతున్నది (లేవీ 2:1, 4,5, 7). ఈ నూనె ఆత్మాభిషేకమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై యున్నాడు (మార్కు 1:10; లూకా 4:1; యోహాను 1:32-34). క్రీస్తు మరియు ‘మెస్సీయ’ అను పదములకు “అభిషిక్తుడు” అని అర్థము. యేసుక్రీస్తు తన యొక్క ఆత్మాభిషే ఎకమును గురించి తెలుపుతూ, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని 69 విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు” అని యెషయా గ్రంథములోనుండి చదివెను (యెషయా 61:1-8; లూకా 4:18).
69యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివారును యీ ఆత్మాభిషేకము కలిగి, ఆత్మ ప్రత్యక్షత కలిగిన కొలదీ దేవుని పరిచర్యలో పాలు కలిగియుందురని దేవుని వాక్యము సెలవిస్తున్నది (యోహాను 77:88, 89; 2 కొరింథీ 1:21, 292; 1 యోహాను 2:27; 1 కొరింథీ 12:4-11).
iv) నైవేద్యమునకు వాడబడుతున్న గోధుమపిండి పొంగనిది లేదా పులియనిదై యుండవలెను (లేవీ 2:4, 5,11, 7:12). దేవుని వాక్యములో పులిసిన పిండి వేషధారణను (లూకా 12:1), అతిశయపడుటను (1 కొరింథీ 5:6), పాపమును (1 కొరింథీ 5:7, 8), తప్పుడు బోధను (గలతి 5:9) సూచిస్తున్నది.
v) నైవేద్యమునకు తేనెను వాడకూడదు (లేవీ 2:11). తేనె తీయగాఉండి, మన శరీరములకు తృప్తి కలుగజేయుచున్నది. ప్రస్తుత సందర్భములో యిది మానవునికి యిష్టమైనదిగా, మానవుని దృష్టిలో శ్రేష్టమైనదిగా యెంచబడుతున్నది. అయితే మానవునికి ప్రీతికరమైనది దేవుడు కోరుకొనుటలేదని, ఆయన తలంపులు మన తలంపుల కంటే భిన్బమైనవని, ఆయన నీతి ముందు మానవుని నీతి మురికి పేలికలవంటిదని దీనిని బట్టి తెలుసుకొనుచున్నాము (యెషయా 55:8, 9, 64:6).
vi) నైవేద్యమునకు వాడబడుతున్న గోధుమ పిండిపై సాంబ్రాణి వేయబడుచున్నది (లేవీ 2:1, 15). సాంబ్రాణి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవునితో కలిగియున్న ప్రార్ధన, ఆరాధన జీవితమును సూచిస్తున్నది. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తును దర్శించి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంట్రాణిని, బోతమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి (మత్తయి 2:11). ఈ వచనములో బంగారు ఆయన యొక్క దైవత్వమును, సాంబ్రాణి ఆయన స్తుతి, ప్రార్థన జీవితమును, బోళము తన శ్రమలను సూచిస్తున్నవి. అగ్నిలో వేయబడిన సాంబ్రాణి సువాసన పైకి లేచినట్లు తన శ్రమల మధ్య యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, స్తుతి దేవుని సన్నిధిలో పరిమళ వాసనగా వుండెను (ఎఫెసి 5:2).
70గోధుమ పిండిలో కొంతమాత్రమే దహించబడి, మిగిలినది యాజకునిచేత తీసుకొనబడుచున్నది. అయితే, సాంబ్రాణి అంతయు యాజకుడు దహించవలెను (లేవీ 2:16). దీనిని బట్టి మన స్తుతి అంతయు దేవునికి చెందవలెనని గ్రహించగలము. మన శ్రమల మధ్య దేవుని స్తుతించుట సాంబ్రాణి పొగవలె వుండును. ఇతరుల పట్ల క్రీస్తు నువాననగా వుండుటకు వునము పిలువబడియున్నాము (2 కొరింథీ 2:15, 16).
vii) చివరిగా, ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెనని లేవీ 2:13లో చదువుచున్నాము. ఉప్పునకు శుద్ధపరచే గుణమున్నది. ఇది క్రీస్తు రక్తము మనలను అపవిత్రతనుండి శుద్ధిచేయునన్న సత్యమును తెలియజేయుచున్నది. రెండవదిగా, ఉప్పు మన జీవితముల ద్వారా యితురులను క్రీస్తువైపు ఆకర్షించవలెనన్న సత్యమును తెలియజేయుచున్నది. కనుకనే వాక్యము, “మీరు లోకమునకు ఉప్పైయున్నారని (మత్తయి 5:13), మన సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను, కృపాసహితముగాను ఉండనియ్యుడనియు (కొలస్సి 4:6) సెలవిస్తున్నది. ఈ గుణములు ప్రభువైన యేసుక్రీస్తు కలిగియుండెను.