UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు
రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar
3. పాపపరిహారార్థ బలి
The Sin Offering · ముద్రిత పుటలు 71–75 · 768 పదాలు · ≈6 నిమిషాలు
(లేవీయకాండం 4:1-35, 6:24-30)
71నైవేద్యపు అర్పణలో యీ క్రింది సత్యమును తెలుసుకొంటిమి.
a) గోధుమపిండి, గోధుమ రొట్టెలు యేసుక్రీస్తు శ్రమనొంది, మన కొరకు జీవాహారముగా చేయబడెనన్న సత్యమును సూచిస్తున్నవి. సన్నని గోధుమ పిండి యేసుక్రీస్తులో యే లోపము లేదని తెలియజేయుచున్నది.
b) గోధుమపిండిలో కలుపబడిన నూనె యేసుక్రీస్తు అభిషేకమును సూచిస్తున్నది. మానవులకు సువార్త ప్రకటించి, రక్షణ కార్యము చేయుటకు యేసుక్రీస్తు దేవుని చేత అభిషేకింపబడెను.
c) గోధుమపిండితో పాటు అర్పింపబడుతున్న సాంబ్రాణి, యేసుక్రీస్తు బలియాగము దేవునికి ఒక పరిమళవాసనగా వుండెనను సత్యమును సూచిస్తున్నది.
d) గోధుమపిండిలో కలుపబడుతున్న ఉప్పునకు శుద్ధికలుగ చేయుగుణమున్నట్లు యేసుక్రీస్తు బబలియాగము ద్వారా చిందింపబడిన రక్తము మన పాపములనుండి మనలను శుద్ధిచేయును.
e) నైవేద్యమునకు తేనెను వాడకూడదన్న మాటద్వారా మానవునికిష్టమైన పద్దతులలో దేవుని ఆరాధించలేమన్న సత్యమును చూచితిమి.
పాపపరిహారార్థబలి ద్వారా యేసుక్రీస్తు మన పాపముల కొరకు “ప్రాయశ్చిత్తము” (Atonement) చేయబడెనన్న సత్యమును తెలుసుకొందుము (లేవీ 4:20, 26, 31, 35). యేసుక్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్శ్చిత్తముగా చేయబడుటలో యీ క్రింది సంగతులు యిమిడి వున్నవి.
i) యేసుక్రీస్తు మన పాపముల యొక్క దోషమును భరించాడు (Expiation) (యోహాను 1:29; యెషయా 53:4-6; 2 కొరింథీ 5:21; గలతీ 1:3, 4. 3:13; 2 పేతురు 2:24; 1 పేతురు 2:24; హెబ్రీ 9:28; 1 కొరింథీ 15:3). ఈ సత్యమును తెలియజేయుటకే పాపపరిహారార్థబలి అర్పించువారు కోడె లేదా మేక 72 యొక్క తలమీద తమ చేతులుంచబడిన తరువాత ఆ బలిపశువు వధించబడుచున్నది (లేవీ 4:4, 15, 24, 29),
72ii) యేసుక్రీస్తు మన పాపములకు రావలసిన దేవుని ఉగ్రతను పోగొట్టి, మన పాపములకు శాంతికరమైనాడు (Propitiation) (రోమా 5:8, 9; 1 థెస్స1:10; రోమా 38:24-25; 1 యోహాను 2;2, 4:10). అనగా మానవునిపై దేవునికున్న కోపమునుండి దేవుని శాంతింపజేశాడు. దీనిని గురించి “నిబంధన మందసము” లోని కరుణాపీఠము వివరణలో కూడా చెప్పబడినది.
iii) మన పాపములను బట్టి దేవుని నుండి వేరు చేయబడిన మనలను యేసుక్రీస్తు దేవునితో సమాధాన పరిచాడు (Reconciliation) (2 కొరింథీ 5:18, 19; ఎఫెసీ 2:16; రోమా 5:1, 10).
iv) యేసుక్రీస్తు తన ప్రాణమును, తన రక్తమును క్రయముగా చెల్లించి, మన పాపబంధకములనుండి మనకు విమోచన కలిగించాడు (Redemption) (1 పేతురు 1:19; అపొ.కా. 2; 28; 1 కొరింథీ 6:20, 7:23; ఎఫెసీ 1:7, కొలస్సీ 1:14; మార్కు 10:45; గలతీ 4:4-5; తీతు 2:14).
పైన చెప్పబడిన రీతిలో యేసుక్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తమును బట్టి మనము పాపక్షమాపణ పొందినవారమై (రోమా 4:7, 8; ఎఫెసీ 1:7; కొలొస్సీ 1:14) నీతిమంతులముగా తీర్చబడుదుము (రోమా 4:6; 1 కొరింథీ 6:11; రోమా 10:4; ఫిలిప్పీ 3:9). యేసుక్రీస్తు నందు మానవులకున్న పాపక్షమాపణ లేవీ 4:20, 26, 31, 35 వచనములలో ఛాయారూపకముగా చెప్పబడినది.
ఇంకను పాపపరిహారార్థబలి వాక్యభాగము (లేవీయకాండం 4వ అధ్యాయం)ను పరిశీలించిన యెడల యీ క్రింది సంగతులు తెలుసుకొనగలము.
✿ పాపపరిహారార్థబలి యాజకుడు, సమాజము, అధికారి, సామాన్యుడు పొరపాటున చేయరాని కార్యములు చేసి, పాపులైనప్పుడు అర్పింపబడుతున్నది (లేవీ 4:2, 3,13, 22, 27). అనగా ఏ భేదము లేకుండా అందరూ దేవునికి వ్యతిరేకముగా పాపముచేసి, తప్పిపోవుదురని దీనినిబట్టి తెలుసుకుంటున్నాము 73 (రోమా 3:23). పొరపాటున, తెలియక చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు వారు పాపపరిహారార్థబలి అర్పించుచున్నారు (లేవీ 4:14, 23, 28).
73పౌలు “పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసునకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక, అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని” అని చెప్పాడు (1 తిమోతి 1:12-18). అన్యజనులు అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిరి (ఎఫెసీ 4:18). లేఖనములను, దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారని సద్దూకయ్యులతో యేసుక్రీస్తు చెప్పాడు (మత్తయి 22:29). అయితే, తమ పాపములను గూర్చి ఒప్పించబడినవారు పాపపరిహారార్థబలియైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, క్షమాపణ పొందెదరు (ఎఫెసీ 1:13).
✿ దహనబలిలో లాగ పాపపరిహారార్థబలి అర్పించువారు బలిపశువు యొక్క తలమీద తమ చేతులుంచవలెను (లేవీ 4:4, 15, 24, 29). ఈ మాట మన పాపముల కొరకు యేసుక్రీస్తు బలిగా అర్పింపబడెనని, మన పాపములను యేసుక్రీస్తుపై మోపుచున్నామన్న సత్యమును తెలియజేయుచున్నదని చూచితిమి (యెషయా 53:4-6, 1 పేతురు 2:24; 2 కొరింథి 5:21).
✿ పాపపరిహారార్థ బలిపశువు యొక్క రక్తము ప్రత్యక్షపు గుడారములోని అడ్డతెర యెదుటను, ధూపవేదిక కొమ్ముల మీదను, బలిపీఠము కొమ్ముల మీదను ప్రోక్షింపబడుచున్నది (లేవీ 4:6, 7,16, 17, 18, 25, 30). ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము మన పాపములనుండి మనలను కడిగి, పవిత్రులను చేయునని (1 యోహాను 1:7; 1పేతురు 1:19; హెబ్రీ 9:14; రోమా 3:25, 26, 5:9), రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదనియు (హెబ్రీ 9:22) ‘దహనబలి’లో చూచితిమి.
✿ పాపపరిహారార్థ బలిపశువు నిరోషమైనదిగా వుండవలెను (లేవీ 4:3, 28, 28). యేసుక్రీస్తునందు యే పాపము లేదా లోపము లేదని యిది వరకు చూచితిమి (1 యోహాను 38:5; 2 కొరింథీ 5:21; 1 పేతురు 2:22; హెబ్రీ 4:15).
74✿ పాపపరిహారార్థ బలిపశువు యొక్క క్రొవ్వు బలిపీఠము మీద దహించబడుచున్నది (లేవీ 4:8, 9,10, 19, 20, 26, 31). దీనిని గూర్చి “సమాధాన బలి”లో ధ్యానించెదము.
క్రొవ్వు దహించబడిన తరువాత బలిపశువైన కోడెయొక్క శేషమంతటిని పాళెము వెలుపలికి తీసుకు వెళ్ళి, అక్కడ దానిని దహింపవలెను (లేవీ 4:11, 12, 6:30),
i) పాళెము వెలుపలికి చనిపోయిన వారి శవములు మోసుకొని పోబడుచున్నవి (లేవీ 10:5).
ii) కుష్టరోగులు అపవిత్రులుగా యెంచబడి, పాళెమునకు వెలుపల నివసింపవలెను (లేవీ 13:46).
iii) పాళెమునకు వెలుపల సకల అపవిత్రత వుంటున్నది (ద్వితీ 23:10-13).
iv) శపించిన వానిని పాళెమునకు వెలుపల రాళ్ళతో కొట్టి చంపవలెను (లేవీ 24:14).
ఈ రీతిగా, సకల అపవిత్రత పాళెమునకు వెలుపల ఉంటుండగా, అట్టి స్థలములోనే మానవుని పాపము కొరకై వధింపబడిన కోడె యొక్క శేషము దహింపబడుతున్నది. ఈ మాట, పాపమెరుగని ప్రభువైన యేసుక్రీస్తు మానవుల పాపము మోసుకొంటూ (2 కొరింథి 5:21), పాళెము వెలుపల (గవిని వెలుపల) శ్రమపొందెనని (పాపముగా చేయబడెనని) తెలియజేయుచున్నది (హెబ్రీ 13:12).
ఇట్లు, పైన చెప్పబడిన విధానములో యేసుక్రీస్తు మన ‘పాపపరిహారార్థబలి’ యాయెనని గ్రహించుచున్నాము. పాత నిబంధనలోని బలిపశువులు మానవుని పోలికలో సృష్టింపబడలేదు గనుక వాటితో అర్పించు బలులు పాపమును కప్పివేయుచుండెను గానీ, పాపమును శాశ్వతముగా తీసివేయలేకపోయెను. మరియు యాజకులు వాటిని దినదినము మాటిమాటికీ అర్పించుచుండిరి (హెబ్రీ 10:11). ధర్మశాస్త్రము మానవుని నీతిమంతునిగా తీర్చలేక పోయెను (గలతీ 2:16, 21, 8:11; అపొ.కా. 13:39; హెబ్రీ 7:19) గానీ అది మనలను క్రీస్తు నొద్దకు నడిపించు చున్నది (గలతీ 38:28-25) అని చెప్పబడిన ప్రకారము ధర్మశాస్త్రానుసారమైన 75 యీ బలులు యేసుక్రీస్తు బలియాగమును సూచిస్తున్నవి.
75యేసుక్రీస్తు బలి పాతనిబంధన బలులకంటె డ్రేష్టమైనదని హెబ్రీ పత్రికలో చదువుదుము (హెబ్రీ 1:4, 6:9, 7:19, 292, 8:6, 9:28, 10:1-4, 11:40, 12:24). యేసుక్రీస్తు మానవుని పోలికలో వచ్చి, తన శరీరము ఒక్కసారే అర్పించి, మేకలయొక్కయు, కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్కబలిని అర్పించెను (హెబ్రీ 9:192, 10:10, 192). యేసుక్రీస్తు యొక్క యీ బలియండదు విశ్వాసముంచుట ద్వారా ఉచితముగా మానవులు నీతిమంతులుగా తీర్చబడుదురు (రోమా 5:1).