UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు
రెండవ భాగము – బలిపీఠపు అర్పణలు · Part II — The Offerings of the Altar
5. సమాధాన బలి
The Peace Offering · ముద్రిత పుటలు 82–85 · 646 పదాలు · ≈5 నిమిషాలు
(లేవీయ కాండం 3:1-17, 7:11-21)
82అపరాధ పరిహారార్థబలిలో యేసుక్రీస్తు మన అపరాధముల కొరకు తన్నుతాను బలిగా అర్పించుకొని, తండ్రియైన దేవునితో మన సహవాసమును తిరిగి సమకూర్చెనన్న సత్యమును చూచితిమి. ఇది వరకు చెప్పబడినట్లు సమాధాన బలి మూడవదిగా వర్ణించబడినప్పటికీ, ఆచరణలో చివరిదిగా ఉన్నది(లేవీ 7:11-21). అనగా దేవుని కట్టడలను నెరవేర్చినపుడు చివరిగా మనకు మిగిలేది దేవుని సమాధానము (ఫిలిప్పీ 4:6, 7).
సమాధాన బలి ద్వారా మనము ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానమన్న గొప్ప సత్యమును గమనించెదము. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను (యెషయా 53:5). ఈ లోకస్తులు తమ ఆస్తిపాస్తులను గూర్చినట్టి తప్పుడు సమాధానము కలిగియుందురు. “లోకులు- నెమ్మదిగావున్నది. భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు” (1 థెస్స 5:3). అయితే ప్రభువైన యేసుక్రీస్తు, “శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకను గ్రపొంచుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి. వెరవనియ్యకుడి” (యోహాను 14:27) అని చెప్పెను.
యేసుక్రీస్తు యొక్క సమాధానబలి మనము దేవునితో సమాధానము కలిగి యుండునట్లు చేయును (రోమా 5:1). ఇది ఆయనయందలి విశ్వాసము ద్వారా కలుగునది (లూకా 8:48; యెషయా 26:3). ఆయన శిశువుగా జన్మించినపుడు పరలోక సైన్య సమూహము, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక” అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయన సమాధాన కర్త (యెషయా 9:6). యేసుక్రీస్తు ద్వారా సమస్తమును తనతో సమాధాన పరచుకొనుట తండ్రియైన దేవుని అభీష్టమాయెను (కొలొస్సీ 1:20). యెహోవా తన ప్రజలకు సమాధానము 83 కలుగజేసి, వారి నాశీర్వదించును (కీర్తనలు 29:11; యెషయా 26:12). ప్రభువైన యేసుక్రీస్త. మన సమాధానము (ఎఫెసీ 2:14). ఈ సమాధానమును వెంటాడవలెనని దేవుని వాక్యములో హెచ్చరింపబడుచున్నాము (2 కొరింథీ 13:11; 2 తిమోతి 2:22),
83సమాధాన బలి వాక్యభాగమును గమనించినట్లయితే, ఈ క్రింది సత్యమును తెలుసుకొందుము.
a) సమాధాన బలి కొరకు నిర్దోషమైన జంతువు తీసుకొనబడుతున్నది (లేవీ 3:1, 6). ఇది యేసుక్రీస్తు యొక్క నిర్దోషత్వమును సూచిస్తున్నది (హెబ్రీ 7:26).
b) మునుపటి బలులవలె సమాధాన బలి కొరకు గోవు, గొట్టె లేదా మేక తీసుకొనబడుచున్నవి. గోవు లేదా కోడె యేసుక్రీస్తు యొక్క బలమును సూచిస్తున్నది (యెషయా 9:6). గొట్టె యేసుక్రీస్తు యొక్క సాత్వికమును సూచిస్తున్నది (యెషయా 53:7; మత్తయి 11:28). మేక యేసుక్రీస్తు తృణీకరింపబడిన వాడన్న సత్యమును సూచిస్తున్నది (యెషయా 58:3; యోహాను 1:11).
c) సమాధాన బలి అర్పించువాడు తన చేతులు బలిపశువు తల మీద వుంచి, దానిని వధింపవలెను (లేవీ 3:2, 8,13). ఇది పాపపు ఒప్పుకోలును సూచిస్తున్నది. అంతేగాక, మన స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అర్పింపబడెనన్న సత్యమును దీని ద్వారా తెలుసుకుంటున్నాము (యెషయా 53:4-6; 1పేతురు 2:24; 2 కొరింథీ 5:21).
d) మునుపటి బలులలో వలె బలిపశువు యొక్క రక్తము బలిపీఠము చుట్టు ప్రోక్షింపబడుచున్నది (లేవీ 3:2, 8,13), రక్తప్రోక్షణలేకుండా పాపక్షమాపణ కలుగదు (హెబ్రీ 9:22).
e) సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల మీది క్రొవ్వు యెహోవాది. యాజకుడు దానిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు యింపైన సువాసనగల హోమము (లేవీ 3:3-5, 9-11, 14-16). శరీరములో క్రొవ్వు ఆరోగ్యమును సూచిస్తున్నది. అది బలిపీఠము మీద అతి త్వరగా కరిగిపోవును. అనగా దేవుడు 84 దానిని యెంతో యిష్టపడుచున్నాడు (లేవీ 7:23, 25). యౌవన కాలములో మన ఆరోగ్యము తన పరిచర్య కొరకు వాడవలెనన్న దేవుని ఉద్దేశ్యము దీనిని బట్టి బయలు పరచబడుతున్నది. “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే” (విలాప వాక్యములు 3:27).
84అలాగే దహన బలి పశువు యొక్క బోర (Breast) కుడి జబ్బ (Right shoulder) “అల్లాడింపబడు అర్పణము”గా యెహోవాకు అర్పింపవలెను (లేవీ 77:29-34). బోర మైమ, అనురాగములను, కుడి జబ్బ బలమును సూచిస్తున్నవి. మన ప్రేమానురాగములు, బలము యెహోవాకు ప్రతిష్ఠితము చేయవలెనని దీనిని బట్టి తెలుసుకుంటున్నాము. “నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీపూర్ణ బలముతోను నీదేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునది ప్రధానమైన ఆజ్ఞ” (మార్చు 12:30),
f) చివరిగా ఒక ప్రధానమైన సత్యమును సమాధాన బలిలో చూడగలము. అదేమనగా దేవునితో పాటు యాజకులు, అర్పణము అర్పించువాడు సమాధాన బలిలో పాలుగలిగి, సంతోషించుచున్నారు. దహనబలి, పాప పరిహారార్థబలి, అపరాధ పరిహారార్థబలిలో బలి అర్పించువారికి ఎలాంటి భాగములేదు. అయితే, సమాధానబలిలో, బలిపశువు యొక్క క్రొవ్వు దేవునికి (లేవీ 3:3-5, 9-11, 14-16), బోర మరియు కుడిజబ్బ యాజకునికి (లేవీయకాండం 77:29-34), మిగిలినది బలి అర్పించినవానికి (లేవీయకాండం 77:15-18) చెందుతున్నవి. పాపము పరిహరింపబడినవాడు సమాధానముతో యీ బలిని కృతజ్ఞతార్చణగా గానీ (లేవీయకాండం 7:12-15), మొక్కుబడిగా గానీ లేక స్వేచ్చార్చణగా గానీ (లేవీయకాండం 7:16) అర్పించుచున్నాడు. ఈ సమాధాన బలి దేవునికి, యాజకులకు, ప్రజలకు మధ్య ప్రత్యక్షపు గుడార ఆవరణములో సంతోషముతో జరిగెడు “విందు సహవాసము”గా అర్పించబడుచున్నది (ద్వితీయోపదేశకాండం 12:5-7). దీనిని సూచిస్తూ ద్వితీయోపదేశకాండం 12:17-18లో “నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసములోనేమి, నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి, నీ గొట్టెమేకల మందలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు 85 మొక్కుకొను మైొక్కుబడులలో దేనిని నీ స్వేచ్చార్చాణమును, ప్రతిష్టార్బ్హణమును నీ యింట తినక, నీ దేవుడైన యెహోవా యేర్చరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీయింటనుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్పిధిని సంతోషించుదువు” అని వ్రాయబడినది.
85ప్రస్తుతకాలములో మనము ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కార్యము ద్వారా మనకనుగ్రహించిన సమాధానమును బట్టి విశ్వాసులముగా ప్రభువు బల్ల చుట్టూ చేరి, తన కృపను తలపోసుకుంటూ ఆయనను పాటలతోను, మాటలతోను ఆరాధించుట ద్వారా ఆత్మీయమైన “విందు సహవాసము” కలిగియుందుము (కొలొస్సి 3:15-17). ఆయన నదివలె సమాధానమును పారజేయగల దేవుడు (యెషయా 66:12). పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను దేవుని కృప, సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోవు (యెషయా 54:10). ఆయన రాజ్యము భోజనమును, పానమును కాదుగాని, నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది (రోమా 14:17). ఇటువంటి దేవుని సమాధానము మన హృదయములను యేలుచుండును గాక!