UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము
మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము · Part I — The Tabernacle
3. గంగాళము
The Brazen Laver · ముద్రిత పుటలు 15–18 · 552 పదాలు · ≈5 నిమిషాలు
(నిర్గమకాండం 30:17-21, 38:8, 40:7)
15ప్రియులారా, వెలుపలి ఆవరణములో బలిపీఠమును దాటి, ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించుటకు ముందు, గంగాళము (ఇత్తడి పాత్ర) ఉంచబడి యున్నది. ఈ గంగాళము యొక్క ప్రాముఖ్యతను యీ అధ్యాయములో చూచెదము.
“మరియు యెహోవా మోషేతో యిట్లనెను-కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానినివుంచి, నీళ్ళతో నింపవలెను. ఆ నీళ్ళతో అహరోనును, అతని కుమారులును తమ చేతులను, కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును, సేవచేసి, యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును, తాము చావకయుండునట్లు నీళ్లతో తమ చేతులను, కాళ్ళను కడుగుకొనవలెను. అదివారికి, అనగా అతనికిని, అతని సంతతికిని, వారి తరతరములకును నిత్యమైన కట్టడగా నుండును” (నిర్గమకాండం 30:17-21)..
ప్రతి విశ్వాసి తన జీవితములో రెండురకములైన అనుభవము కలిగి యుండును. మొదటిది బలిపీఠపు అనుభవము. రెండవది గంగాళపు అనుభవము. బలిపీఠపు అనుభవము రక్తముతో కూడినది. గంగాళపు అనుభవము నీటితో కూడినది. రోమా సైనికుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రక్కలో పొడిచినపుడు రక్తమును, నీరును కారెను (యోహాను 19:34). నీళ్ళ ద్వారాను, రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక, నీళ్ళతోను, రక్తముతోను వచ్చెను (1 యోహాను 5:6). బలిపీఠపు అనుభవములో ఒకపాపి యేసురక్తము ద్వారా కడుగబడి, నీతిమంతుడుగా తీర్చబడి, సంఫుములో చేర్చబడును (హెబ్రీ 9:14, 28; 1యోహాను 1:7; ప్రకటన 1:6, 7:14, 22:14; 1 కొరింథీ 6:11; 2 కొరింథి 5:17). గంగాళపు అనుభవములో విశ్వాసిగా తీర్చబడిన పాపి, తన విశ్వాసజీవితములో, దేవుని వాక్యమను నీటిద్వారా శుద్ధిచేయబడు తున్నాడు (యోహాను 13:10). యేసుక్రీస్తు సంఘమును తన

17యొక్క వాక్యముతో ఉదకస్పానము చేత పవిత్రపరచుచున్నాడు (ఎఫెసీ 5:26). ఈ గంగాళమును గూర్చిన సత్యము క్రింద తెలుపబడినది.
a) గంగాళము, దాని పీట యిత్తడితో చేయబడినవి (నిర్గమకాండం 30:17). యిత్తడి ”పాపముపై తీర్పును సూచిస్తున్నదని గత అధ్యాయములలో చూచితిమి. విశ్వాసి తన విశ్వాస జీవితములో చేయు పాపముల కొరకు కూడా యేసుక్రీస్తు తీర్పు తీర్చబడెనని దీని ద్వారా మనము గమనించుదుము.
b) గంగాళము అద్దములతో చేయబడినది. “అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పీటను చేసెను” (నిర్గమకాండం 38:8). అద్దము మానవుని సహజత్వమును చూపించు రీతిలో దేవుని వాక్యము ప్రతి మనిషి యొక్క బలహీనతలను యెత్తి చూపించును. అద్దము వంటి దేవుని వాక్యము ద్వారా మనలను సరిజేసి కొనవలెను (యాకోబు 1:238, 24). “వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని. అయితే యిప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి, పశ్చాత్తాప పడుచున్నానని” యోబు చెప్పెను (యోబు 42:5, 6). దేవుని మహిమను చూచిన యెషయా, “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజును, సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని” అని చెప్పెను (యెషయా 86:5). యేసుక్రీస్తు శక్తిని చూచిన పేతురు తన మోకాళ్ళ మీద సాగిలపడి, “ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని” చెప్పెను (లూకా 5:8). దేవుని బలమైన వాక్యము మన పతనములను మనకు చూపించి, ఒప్పించ సమర్థమైనది (హెబ్రీ 412, 138).
c) యాజకులు గంగాళములోని నీటితో తమ చేతులు, కాళ్ళు కడుగుకొన్న తరువాత మాత్రమే వారు సేవచేయవలెను. “అహరోనును, అతని కుమారులును ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును, సేవచేసి, యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును, తాము చావకయుండునట్లు 18 గంగాళములోని నీటితో తమ చేతులు, కాళ్ళు కడుగుకొనవలెను. యిది అతనికిని, అతని సంతతికిని, వారి తరతరములకు నిత్యమైన కట్టడగా వుండును” (నిర్గమకాండం 30:17-21). గంగాళపు నీళ్ళతో చేతులు కడుగుకొని, సేవచేయడమనునది దేవుని యెదుట పరిశుద్ధత కలిగి, ఆయన పరిచర్య జరిపించవలెనన్న సత్యమును సూచిస్తున్నది. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి (యెషయా 52:11). మీ మనస్సులను పవిత్రపరచుకొని, ఒకనినొకడు హృదయపూర్వకముగా ప్రేమించుడి (1 పేతురు 1:22). యధార్ధహృదయముతో దేవుని సన్నిధానమునకు చేరెదము (హెబ్రీ 10:22). పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి (యాకోబు 4:8). మనము నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయము కలిగియుండవలెనని దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడుచున్నాము (కీర్తన 24:3, 4; 1 తిమోతి 2:8; యెషయా 1:15, 16).
18గంగాళపు నీళ్ళతో కాళ్ళుకడుగుకొనుటయనునది దేవుని యెదుట మనము శుద్ధమైన నడక కలిగియుండవలెనన్న సత్యమును తెలియజేయుచున్నది (కీర్తన 119:9; 2 కొరింథీ 7:1; ఎఫీసీ 4:1-3; హెబ్రీ 12:13; యోహాను 13:1-8).
గంగాళము యొక్క యెత్తు, వెడల్పు మొదలగు కొలతలు వాక్యములో తెలుపబడలేదు. దీనిని బట్టి దేవుని వాక్యము యొక్క కడుగుదల అపరిమితమైనదని మనము తెలుసుకొనవచ్చును. d చివరిగా గంగాళము దేవుని వాక్యము ద్వారా కలుగు ఒప్పుదలను సూచిస్తున్నది. వాక్యపు వెలుగులో మనలను మనము విమర్శించుకొనిన యెడల మనము తీర్పు పొందము (1 కొరింథీ 11:31). అశ్రద్ధతో, అపవిత్రతతో దేవుని పని జరిగించిన యెడల దేవుని తీర్పుకు పాత్రులగుదుము. నాదాబు, అబీహులు అశ్రద్ధతను బట్టి దేవుని ఉగ్రతకు గురియైరి (లేవీ 10:1, 2). కొరింథీ సంఘములో విశ్వాసులు అపవిత్రతను బట్టి, నిద్రావస్థలోను, రోగముతోను, బలహీనతతోను ఉండిరి. కొందరు మరణించిరి (1 కొరింథీ 11:27-32). దేవుని వాక్యపు వెలుగులో సరిచేయబడి, పవిత్రత కలిగియుండుటకు ప్రభువు మనకు సహాయముచేయును గాక.