UECF.NETమోషే ప్రత్యక్షపు గుడారము
మోషే ప్రత్యక్షపు గుడారము

UECF.NETBooksమోషే ప్రత్యక్షపు గుడారము › మూడవ భాగము – యాజకత్వము

మూడవ భాగము – యాజకత్వము · Part III — The Priesthood

1. యాజకత్వము

The Priesthood · ముద్రిత పుటలు 87–95 · 1,504 పదాలు · ≈13 నిమిషాలు

📄 PDF

87ప్రియులారా, యిది వరకు మొదటి భాగములో ప్రత్యక్షపు గుడార వర్ణనను, రెండవ భాగములో బలిపీఠపు అర్పణల గురించి యీ పుస్తకములో ధ్యానించితిమి. చివరిగా యీ మూడవ భాగములో ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయు యాజకులు, ప్రధాన యాజకులు, వారు ధరించు వస్త్రముల యొక్క ప్రాముఖ్యతలను గురించి తెలుసుకొందుము. దీని కొరకు మూడవ భాగము, క్రింద తెలుపబడిన రెండు అంశములుగా విభజింపబడినది.

యాజకుడనగా దేవుని యెదుట దేవుడు ఏర్పరచిన పరిచర్యా విధిని నెరవేర్చుటకు దేవుని చేత నియమింపబడిన వాడు. ప్రత్యక్షపు గుడారములో జరుగవలసిన పరిచర్య అంతయు ప్రధానయాజకుడు మరియు యితర యాజకులు, లేవీయులచేత జరిపించబడుచున్నది. యాజకత్వము లేకుండా ప్రత్యక్షపు గుడారము ఖాలీగా వుండును.

ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడుటకు ముందు హేబెలు, నోవహు, అబ్రహాము మొదలగువారు ఎవరికి వారే యాజకులుగా వ్యవహరించి, బలులు అర్పించుచుండిరి. తరువాత ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పస్మాబలి అర్పించునపుడు, కుటుంబయజమాని తనకుటుంబమునకు యాజకునిగా వ్యవహరించి, బలి అర్పించెను (నిర్గమకాండం 192:8-7),. ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి, తమ అరణ్య ప్రయాణము మొదలు పెట్టినపుడు దేవుడు వారికి ధర్మశాస్త్రము అనుగ్రహించి, యాజక ధర్మము నిర్వర్తించుటకు లేవీ గోత్రములో అహరోను వంశస్తులను యెన్నుకొనెను (నిర్గమకాండం 28:1), అహరోను ‘ప్రధానయాజకుడుగాను, తన కుమారులు యాజకులుగాను యెన్నుకొనబడిరి. అహరోను వంశపు ప్రధానయాజకత్వము యేసుక్రీస్తు దినముల వరకు కొనసాగెను (యోహాను 18:13). లేవీ గోత్రములో మిగిలిన వారు (అహరోను వంశస్యలు కానివారు) అహరోనుకు పరిచారకులుగా ప్రత్యక్షపుగుడారములో సేవచేయుటకు నియమించబడిరి (సంఖ్యాకాండం 3:5-9). వీరిని సాధారణముగా లేవీయులని పిలుతురు.

88యాజకత్వమును గురించి ధ్యానించు నిమిత్తము యీ అంశము క్రింద తెలుపబడిన మూడు భాగములుగా విభజింపబడినది.

a) యాజకుల పిలుపు, కడుగుదల, వస్త్రధారణ, ప్రతిష్ఠితము

b) యాజకులు మరియు లేవీయుల విధులు

c) అహరోను మరియు యేసుక్రీస్తు ప్రధానయాజకత్వపు పోలికలు, వ్యత్యాసములు.

పై మూడు అంశములు ధ్యానించుటకు ముందు ప్రత్యక్షపు గుడారము క్రైస్తవసంఘమును, ప్రధానయాజకుడు ప్రభువైన యేసుక్రీస్తును మరియు యాజకులు - లేవీయులు విశ్వాసులను సూచిస్తున్నారని గమనించగలము.

a) యాజకుల యొక్క పిలుపు, కడుగుదల, వస్త్రధారణ, ప్రతిష్ఠితము

i) యాజకుల పిలుపు (Calling)

“మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును, అతని కుమారులను పిలిపింపుము” (నిర్గమకాండం 28:1, హెబ్రీ 5:1, 4). ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రధానయాజకుడుగా వుండుటకు దేవునిచేత పిలువబడెను (హెబ్రీ 5:5). విశ్వాసులముగా మనము ఆత్మసంబంధమైన బలులర్చించుటకు యాజకులుగా పిలువబడితిమి (1 పేతురు 2:5; హెబ్రీ 13:15, 16; ఫిలిప్పీ 4:18; (ప్రకటన 1:6). ఈ పిలుపు పరలోక సంబంధమైనది (హెబ్రీ 3:1), పరిశుద్ధమైనది (2 తిమోతి 1:10), ఉన్నతమైనది (ఫిలిప్పీ 3:14), కృపతో కూడినది (గలతి 1:15), పశ్చాత్తాపపడనిది (రోమా 11:29). ఇట్టి పిలుపును నిశ్చయము చేసికొని (2 పేతురు 1:10), ఆ పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెనని (ఎఫెసి 4:3) వాక్యములో హెచ్చరింపబడుచున్నాము.

ఇంకను ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము చేయుటకును (1 కొరింథీ 1:9), పరిశుద్ధులుగా జీవించుటకును (1 థెస్స. 4:7), స్వతంత్రులుగా ఉండుటకును (గలతీ 5:13), సమాధానముగా వుండుటకును (1 కొరింథి 7:15), యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుటకును (2 థెస్స.2:14), నిత్యజీవమును పొందుటకును 89 (1 తిమోతి 6:12) మనము దేవుని చేత పిలువబడితిమని దేవుని వాక్యము సెలవిస్తున్నది.

ii) యాజకుల కడుగుదల (Cleansing)

89“మరియు నీవు అహరోనును, అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసికొని వచ్చి, నీళ్లతో వారికి స్పానము చేయించి...” (నిర్గమకాండం 29:4),

నీరు దేవుని వాక్యమును సూచిస్తున్నది. నీటితో కడుగుదల గురించిన సత్యము యీ పుస్తకము యొక్క మొదటి భాగములో “గంగాళము”ను గూర్చిన వర్ణనలో వివరింపబడినది. మన లోపములను దేవుని వాక్యముతో సరిజేసికొని, యాజకత్వము చేయవలెనన్న సత్యమును మనమిక్కడ గమనించగలము. ఈ సత్యమును సూచిస్తూ, పిలువబడిన యాజకునికి యెలాంటి శరీర కళంకము వుండకూడదని లేవీకాండం 21:17-28లో చదువుచున్నాము.

iii) యాజకుల వస్త్రధారణ (Clothing)

పిలువబడిన ప్రధానయాజకుడు, యాజకులును నీటితో కడుగబడిన తరువాత యాజకవస్త్రములను ధరించిరి (నిర్గమకాండం 29:5-9). ఈ వస్త్రముల యొక్క ప్రాముఖ్యత తరువాయి పేజీలలో వర్ణింపబడినది. ఇవి దేవుని పరిశుద్ధత మరియు యితర గుణములను సూచిస్తున్నవి.

iv) యాజకులను ప్రతిష్ఠించుట (Consecrating)

యాజక వస్త్రములు ధరించిన తరువాత ప్రధానయాజకుడు, యితర యాజకులు యాజకసేవ కొరకై ప్రతిష్ఠించబడిరి. దీనిని గూర్చిన వివరణ నిర్గమకాండం 29:90-87 వచనములలో యివ్వబడినది. ఈ వాక్యభాగము పరిశీలించిన యెడల, వారి కొరకు పాప పరిహారార్థబలిగా ఒక కోడె, దహనబలిగా ఒక పొట్టేలు, నైవేద్యముగా పొంగని అప్పడములు అర్పించబడుచున్నవి. వీటి ప్రాముఖ్యతను రెండవభాగములో ‘బలపీఠపు అర్పణలు’ అను అంశము క్రింద తెలుసుకొంటిమి.

90ఇంకను నిర్గమకాండం 29:19-21 వచనములలో యీలాగు వ్రాయబడినది: “మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలును వధించి, దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడి చెవి కొనమీదను, అతని కుమారుల కుడిచెవుల కొన మీదను, వారి కుడిచేతి బొట్టన (్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టన బ్రేళ్లమీదను చమిరి, బలిపీఠము మీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను, అభిషేకతైలములోను కొంచెము తీసి, అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములును, అతనితోనున్న అతని కుమారులును, అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితములగును.”

పై వాక్యభాగములో పొట్టేలు రక్తము యాజకుల కుడి చెవి కొనమీదను, కుడిచేతి బొట్టన ట్రేళ్ల మీదను, కుడి కాలి బొట్టన ట్రేళ్ల మీదను చమరబడుచున్నది. దీనిని బట్టి క్రింది సంగతులు గ్రహించుచున్నాము.

✿ యాజకులు దేవుని స్వరమును, సమాజములోని ప్రజల ప్రార్థనలను వినుటకు సున్నితమైన చెవి కలిగియుండవలెను. మందగించిన చెవులు (మత్తయి 13:15), అవిధేయతతో కూడిన చెవులు (యిర్మీయా 7:238, 24), లోబరచనొల్లని చెవులు (అపౌ.కా. 7:51), దురద చెవులు (2 తిమోతి 4:3, 4) కాకుండా దేవుని స్వరము విని, దానికి లోబడు చెవులు కలిగియుండవలెను.

✿ కుడిచేతి బొట్టన వ్రేలు యాజకత్వపు పరిచర్యకు సంబంధించిన పనులలో పటుత్వము కలిగించును. సాధారణముగా విల్లు ప్రయోగించుటకు చేతి బొట్టన వ్రేలు వాడబడును. అలాగే కాలి బొట్టన వ్రేళ్లు నడకలో స్థిరత్వమును కలిగించును. ఈ కారణముచేతనే అదోనీ బెజెకు డెబ్బదిమంది రాజులకు చేతుల బొట్టన వ్రేళ్లు, కాళ్ల బొట్టన ట్రేళ్లు కోసివేసి, తాను కూడా యూదా వంశస్థుల ద్వారా అదే శిక్షావిధికి గురియాయెను (న్యాయాధిపతులు 1:6, 7). పనులలో పటుత్వము (కీర్తన 137:5), నడకలో స్థిరత్వము (హెబ్రీ 12:12, 18) కలిగియుండవలెనను సత్యమును 91 తెలియజేయుటకు యాజకుల కుడిచేతి బొట్టన ట్రేళ్లు, కుడికాలి బొట్టన వ్రేళ్లు రక్తముతో చమరబడెనని తెలుసుకుంటున్నాము.

91✿ చివరిగా యాజకుల మీదను, వారి వస్త్రముల మీదను పొట్టేలు రక్తము ప్రోక్షింపబడుచున్నది. తద్వారా యాజకులును, వారి వస్త్రములును ప్రతిష్ఠితములగు చున్నవి (నిర్గమకాండం 29:21). ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తము చేత శుద్ధిచేయబడవలెనని హెబ్రీ 9:22లో చదువుచున్నాము. ప్రస్తుతకాలములో మనము సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన్నుతాను ప్రతిష్ట చేసికొనెను (యోహాను 17:17-19). మనము ప్రభువు అభిషేకము పొందిన వారముగా (1 యోహాను 2:20, 27), ఈ లోకము నుండి వేరై (2 కొరింథీ 6:14-18), సజీవయాగములుగా మన శరీరములను దేవుని పరిచర్యకు సమర్పించుకొనవలెనని (రోమా 12:1-2) వాక్యము సెలవిస్తున్నది.

b) యాజకులు మరియు లేవీయుల విధులు

ప్రధాన యాజకుడు సాధారణముగా తన పాపముల కొరకు, సమాజప్రజల పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించును (హెబ్రీ 5:1). దీని కొరకు సంవత్సరమునకు ఒకసారి ఒంటరిగా అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించి, ప్రాయశ్చిత్తము జరిగించును (లేవీ 16). అంతే గాక, ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట (1 సమూయేలు 23:9-12), ప్రజలను దీవించుట (సంఖ్యాకాండం 6:22-26), లేవీయులను ప్రతిష్ఠించుట (సంఖ్యాకాండం 8:11-21) మొదలగు విధులు నిర్వర్తించును.

యాజకులు యీ క్రింది విధులను నిర్వర్తించుచుండిరి (వీటిలో కొన్ని ప్రధాన యాజకుడు కూడా నిర్వర్తించును).

i) పరిశుద్ధస్థలమును కాపాడుట (సంఖ్యాకాండం 3:38).

ii) దీపవృక్షము యొక్క దీపములను వెలిగించుట (నిర్గమకాండం 227:20, 21).

iii) ధూపవేదిక మీద ధూపము వేయుట (నిర్గమకాండం 30:7, 8).

iv) బలిపీఠము మీద అగ్నిమండజేయుట (లేవీ 6:12, 18).

92v) బలిపీఠము మీద బలులనర్పించుట (లేవీ 1:1-17).

vi) సమాజము ప్రయాణమై పోవునప్పుడు ప్రత్యక్షపు గుడార ఉపకరణములను కప్పుట (సంఖ్యాకాండం 4:5-15),

vii) ప్రజలను దీవించుట (సంఖ్యాకాండం 6:22-226).

viii) అపవిత్రులైన వారిని పవిత్రపరచుట (లేవీ 15:15-31).

ix) కుష్టువ్యాధిని గురించి నిర్ణయించుట (లేవీ 13).

x) బూరలు ఊదుట (సంఖ్యాకాండం 10:1-10).

xi) నిబంధన మందసమును మోయుట (యెహోషువ 38:16-17).

xii) ధర్మశాస్త్ర విధులను ప్రజలకు బోధించుట (లేవీ 10:11).

లేవీయుల విధులు:

లేవీ గోత్రములో అహరోను వంశస్థులు యాజకులు-ప్రధానయాజకులుగాను, అహరోను వంశస్థులు కానివారు లేవీయులుగా (పరిచారకులుగా) నియమింప బడిరని చూచితిమి. లేవీయులు యీ క్రింది విధులను నిర్వర్తించిరి:

i) అహరోనుకు (ప్రధాన యాజకునికి) పరిచర్యచేయుట, ప్రత్యక్షపు గుడారమును కాపాడుట (సంఖ్యాకాండం 18:2, 3).

ii) యాజకులకు బలులను సిద్ధపరచుట (2 దినవృత్తాంతములు 35:10-14).

iii) ధర్మశాస్త్రమును బోధించుట (2 దినవృత్తాంతములు 17:8-11).

iv) సంగీతవాయిద్యములను వాయించుట (1 దినవృత్తాంతములు 25:1-7).

v) దేవుని స్తుతించుట (2 దినవృత్తాంతములు 20:19-21, 28). సంఖ్యా కాండంలో లేవీయుల ప్రతిష్ఠితము (8:9-14), వారి శుద్ధీకరణ (8:6, 7,21), వారి గుడారపు సేవ (3:5-10), వారి స్వాస్ట్రము (యెహోవా) (18:20)లను గూర్చి చదివెదము. ఇట్లు పైన చెప్పబడిన యాజకత్వపు పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తును ప్రధానయాజకుడు (హెబ్రీ 3:1, 4:14)గా గలిగిన సార్వత్రిక సంఘములో విశ్వాసులు జరిపించు పరిచర్యా విధులను సూచిస్తున్నది (1 పేతురు 2:4, 5,9).

c) అహరోను యొక్క మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వమునకు నున్న పోలికలు – వ్యత్యాసములు

93i) అహరోనును, ప్రభువైన యేసుక్రీస్తును ప్రధాన యాజకులుగా వుండుటకు దేవుని చేత పిలువబడిరి (నిర్గమకాండం 28:1; హెబ్రీ 5:1, 4,5).

ii) అహరోను బలహీనత గలిగి, పాపమునకు లోనైన మానవుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పాపము లేని, సంపూర్ణ సిద్ధి పౌందిన దేవుని కుమారుడు (హెబ్రీ 7:26-28).

iii) అహరోను మరణమునకు లోనైన మానవుడు గనుక ఆయన తరువాత కూడా యెంతో మంది ప్రధానయాజకులు వుండిరి. అయితే, యేసుక్రీస్తు నిరంతరము వున్న వాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను (హెబ్రీ7:28, 24),

iv) అహరోను భూసంబంధమైన పరిశుద్ధస్థలముకు ప్రధాన యాజకుడు (హెబ్రీ 9:1) అయితే, ప్రభువైన యేసుక్రీస్తు పరసంబంధమైన ప్రధాన యాజకుడు (హెబ్రీ 8:2),

v) అహరోను సేవా నియమములు గలిగిన మొదటి నిబంధన (మోషే నిబంధన)కు ప్రధానయాజకుడుగా వుండెను (హెబ్రీ 9:1). దీని ప్రకారము, అతడును, అతని కుమారులును జంతు బలులను మాటిమాటికి అర్పించుచుండిరి. ఈ బలులు పాపములను ఎన్నటికిని తీసివేయలేవుగాని అవి యేసుక్రీస్తునందున్న రక్షణను ఛాయారూపకముగా తెలియజేయుటకు తాత్కాలికముగా అర్పింపబడెను (హెబ్రీ 5:1; 8:5, 10:11). అంతే గాక, అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రధానయాజకుడుగా, తన పాపముల నిమిత్తము, సమాజ పాపముల నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములో ఒంటరిగా, రక్తముతో ప్రవేశించి, ప్రాయశ్చిత్తము చేయుచుండెను (లేవీ 16:11-17, 32-384; హెబ్రీ 9:7, 25),

అయితే, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకునిగా వచ్చిన తరువాత, పైన చెప్పబడిన జంతు బలులు పాతగిలి, ఉడిగిపోయిన వాయెను (హెబ్రీ 8:13). యేసుక్రీస్తు జంతు రక్తముతో కాకుండా, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో 94 ప్రవేశించెను (హెబ్రీ 9:11-12). ఆయన పాపములేని వాడు గనుక తన పాపముల కొరకు కాక, మానవులందరి పాపముల పరిహాము కొరకు అవసరమైన బలిగా తనను తాను అర్పించుకొనెను (హెబ్రీ 9:14, 26-28, 10:10, 12-13; 1 యోహాను1:9). ఈ రీతిగా, తన మరణము ద్వారా యేసుక్రీస్తు జంతుబలులకు సమాప్తి కలుగజేసి, వాటితో పని లేకుండా చేసెను. అంతేగాక, యేసుక్రీస్తు మరణము ద్వారా దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగి (మత్తయి 27:51), విశ్వాసులందరూ దేవుని సన్నిధికి ప్రవేశము కలిగినవారై, ఆత్మసంబంధమైన బలులనర్చ్పించుటకు యాజుకులుగా చేయబడిరి (హెబ్రీ 4:14-16, 10:19-22; 1 పేతురు 2:5). ఇదియే నూతన నిబంధన (హెబ్రీ 8:6-13; యిర్మీయా 31:31-34). ఇది యేసుక్రీస్తు బలియాగము ద్వారా మాత్రమే సాధ్యపడినది. కనుకనే యేసుక్రీస్తు బలి పాతనిబంధన బలులకంటే శ్రేష్టమైనదని వాక్యము సెలవిస్తున్నది (హెబ్రీ 1:4, 6:9, 7:19, 22, 8:6, 9:23, 10:1-4, 11:40, 192:24).

94vi) చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు “మెల్మీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజుకుడుగా వున్నాడని” దేవుని వాక్యములో ఆరుసార్లు వ్రాయబడినది (కీర్తన 110:4; హెబ్రీ5:6, 10, 6:20,?7:11, 17). ప్రభువైన యేసుక్రీస్తు మరియు అహరోనులను మెల్మీసెదెకుతో పోల్చిన యెడల యీ క్రింది సత్యమును గమనించగలము.

✿ మెల్కీసెదెకు “షాలేమురాజు” (అదికాండం 14:18). షాలేము ప్రాచీన యెరూషలేము పట్టణము. యేసుక్రీస్తు కూడా యూదా గోత్రంలో జన్మించి, రాజుగా దేవుని వాక్యములో వర్ణింపబడెను (యోహాను 18:37, 38; మత్తయి 2:6). అహరోను లేవీగోత్రంలో జన్మించాడు మరియు రాజరికపు చరిత్రలేనివాడు. అంతేగాక, ‘మెల్మీసెదెకు’ అను పేరునకు నీతికి రాజనియు మరియు సమాధానపు రాజనియు అర్థమిచ్చు ‘షాలేమురాజు’ అని అర్థమని హెబ్రీ 7:2, 8లో చదువుచున్నాము. యేసుక్రీస్తు కూడా నీతిరాజుగా (యిర్మీయా 33:15, 16; యెషయా 61:10, 11:4, 5), సమాధానపు రాజుగా (యెషయా 9:6, 7; యోహాను 14:27) వర్ణింపబడియున్నాడు.

95✿ మెల్మీసెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు (ఆదికాండం 14:18). యేసుక్రీస్తు కూడా అహరోను వంశస్థుల వలె పారంపర్యాచారమును బట్టి కాక రాజ వంశమునుండి వచ్చినవాడై, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడాయెను (హెబ్రీ 3:1; 4:14). అలాగే మనలను కూడా రాజులైన యాజక సమూహము”గా చేసెను (1 పేతురు 2:9).

✿ మెల్కీసెదెకు రాజుగా, యాజకునిగా ఉండి, అబ్రహామును ఆశీర్వదించెను (ఆదికాండం 14:19, 20). యేసుక్రీస్తు కూడా రాజుగా, ప్రధాన యాజకుడిగా సంఫుమును ఆశీర్వదించుచున్నాడు(ఎఫెసీ 1:3). అహరోనును, అతని కుమారులును యాజకులుగా ప్రజలను ఆశీర్వదింతురు (సంఖ్యాకాండం 6:22-26),

✿ మెల్కీసెదెకు అబ్రహామునుండి దశమభాగమును పొందెను (ఆదికాండం 14:20). సంఘము యేసుక్రీస్తునకు దశమభాగము అర్పించుచున్నది. లేవీయులు ఇశ్రాయేలీయులనుండి దశమభాగము పొౌందుచుండిరి (సంఖ్యాకాండం 18:21-24).

✿ మెల్కీసెదెకు తండ్రిలేనివాడును, తల్లి లేనివాడును, వంశావళిలేనివాడును జీవితకాలమునకు ఆదియైనను, జీవమునకు అంతమైనను లేనివాడునైయుండి, దేవుని కుమారుని పోలియున్నాడు (హెబ్రీ 7:3). ఈ మాట మెల్మీసెదెకు తల్లిదండ్రులు లేనివాడని చెప్పుటలేదు గాని, అది యేసుక్రీస్తు యొక్క నిత్యత్వమును సూచిస్తున్నది (యెషయా 9:6). అహరోను మరణమునకు లోనైనవాడు గనుక ఆయన తరువాత అనేక ప్రధానయాజకులుండిరి (హెబ్రీ 7:238, 24).

ఈ రీతిగా, ధర్మశాస్త్రానుసారమై, బలహీనమైన ఆజ్ఞగలదై, మార్పుగలిగిన అహరోను యాజకత్వమును తీసివేసి, ప్రభువైన యేసుక్రీస్తు మార్పులేని యాజకత్వమును ప్రవేశపెట్టెను (హెబ్రీ 7:18-24). అహరోను యాజకత్వము ఇశ్రాయేలీయులకే పరిమితమైతే, యేసుక్రీస్తు యాజకత్వము సకల జనులకు వర్తింపజేయబడినది (గలతీ 3:26-28). ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విషయములలో 96 మనవంటివాడై శ్రమపొందెను (హెబ్రీ 2:17, 18). సమస్త విషయములలో మనవలె శోధింపబడినను పాపములేనివాడుగా ఉండెను (హెబ్రీ 4:15). ఆయన మనపట్ల కనికరము కలిగినవాడై (హెబ్రీ 5:2; 4:16), తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచూ, మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు (హెబ్రీ 7:25).