UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము
మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము · Part I — The Tabernacle
1. వెలుపలి ఆవరణము – ఆవరణ ద్వారము
The Outer Court and its Gate · ముద్రిత పుటలు 2–9 · 827 పదాలు · ≈7 నిమిషాలు
a) వెలుపలి ఆవరణము (Outer court)
(నిర్గమ కాండం 27:9-19, 38:9-20)
2“మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరుమూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు పది. వాటి దిమ్మలు పది. తూర్పువైపున, అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు మూడు, వాటి దిమ్మలు మూడు. రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు మూడు, వాటి దిమ్మలును మూడు. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా వుండవలెను. వాటి స్తంభములు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు. ఆవరణము చుట్టుఉన్న స్తంభములన్నియు వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు నూరు మూరలు. దాని వెడల్పు ఏబది మూరలు. దాని యెత్తు అయిదు మూరలు. అవి పేనిన సన్ననారవి. వాటి దిమ్మలు యిత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణము లన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడి వైయుండవలెను” (నిర్గమకాండం 27:9-19).
ప్రియులారా, ప్రత్యక్షపు గుడార వర్ణనలో మొదటిదిగా వెలుపలి ఆవరణము, దాని ద్వారమును గురించి ధ్యానించెదము. పై వాక్య భాగమును పటము-2 తో

4కలిపి చదివిన యెడల, వెలుపలి ఆవరణము దీర్బచతురస్రాకారము కలిగి, ఉత్తర-దక్షిణముల వైపు 100 మూరలు (150అడుగులు), తూర్పు-పడమరల వైపు 50 మూరలు (75 అడుగులు) కలిగియున్నది. ఉత్తర-దక్షిణములవైపు 20 స్తంభములు, తూర్పు-పడమరల వైపు 10 స్తంభములు వున్నవి (మొత్తము 60 స్తంభములు). స్తంభము, దాని దిమ్మ యిత్తడితో చేయబడినవి, స్తంభము పై భాగమున బోదె వెండి రేకుతో పొదగ బడినది (నిర్గమకాండం 38:20). ప్రతిస్తంభము యిరువైపుల వెండివంకి కలిగియున్నది (నిర్గమకాండం 27:19). ఈ వంకులలో త్రాళ్ళు చేర్చబడి, శ్రాకృ్ళ యొక్క రెండవ కొన ఇత్తడి మేకులకు తగిలించబడి, ఆ మేకులు భూమిలో దిగ కొట్టబడుట ద్వారా ప్రతి స్తంభమునకు స్థిరత్వము కలుగుతున్నది. ప్రతి రెండు స్తంభములకు మధ్య వెండి పెండె బద్దలు తగిలించబడి, వాటి మీద సన్ననార యవనికలు వ్రేలాడదీయబడినవి. ఈ సన్న నార యవనికలు 5 మూరల (7.5 అడుగుల) యెత్తుగలిగినవి.
పైన చెప్పబడిన వర్జన యీ క్రింది ఆత్మీయ సత్యమును తెలియ జేయుచున్నది.
i) దేవుడు పరిశుద్ధుడు (1 పేతురు 1:14) గనుక ఆయన సన్నిధి (ఆవరణము) పాపముతో కూడిన యీ లోకమునుండి కంచె కలిగియుండుట ద్వారా వేరుచేయబడవలెను. యేసు క్రీస్తు పాపులలో (పాపములో) చేరక ప్రత్యేకముగా వున్నవాడు (హెబ్రీ 7:26) గనుక క్రీస్తు సంఘము కూడా ప్రత్యేకించబడిన జీవితము కలిగియుండవలెను (2 కొరింథీ 6:17).
ii) ప్రతి స్తంభము ఒక విశ్వాసిని సూచిస్తున్నది. పేతురు, యాకోబు, యోహానులు సంఘమునకు స్తంభములుగా యెంచబడిరి (గలతీ 2:9). క్రీస్తు సంఘము (విశ్వాసుల సమూహము) సత్యమునకు స్తంభమును, దానికి ఆధారమునైయున్వది (1 తిమోతి 3:15). ప్రతి స్తంభము ఇత్తడి దిమ్మపై ఉంచబడినది. ఇత్తడి ‘పాపముపై తీర్చు’ను సూచిస్తున్నది (దీనిని గూర్చిన వర్ణన రెండవ అధ్యాయమైన “బలిపీఠము”నందు ఇవ్వబడినది). అనగా ప్రతి విశ్వాసి యొక్క పాపములు యేసుక్రీస్తు నందు తీర్పు తీర్చబడినవి (గలతీ 93:12-14; కొలస్సి 2:13-15).

6ప్రతి స్తంభముపై వెండి బోదె, వెండి వంకులు చేయబడినవి. ప్రతి రెండు స్తంభములు వెండి పెండె బద్దల ద్వారా కలుపబడినవి. వెండి క్రీస్తునందు విశ్వాసి కలిగియున్న “పాపవిమోచనిను సూచిస్తున్నది (దీనిని గూర్చిన వర్ణన నాలుగవ అధ్యాయములో “ప్రత్యక్షపు గుడారపలకలు- అడ్డకట్టిలు” అను అంశమునండదు ఇవ్వబడినది). పటము-3 లో చూపబడిన ఇత్తడి దిమ్మ, ఇత్తడి మేకులు భూమి లోపల వుంచ బడినవన్నమాట విశ్వాసి యొక్క పాపములు క్రీస్తునందు తీర్పు తీర్చబడి, తుడిచివేయబడినవను సత్యమును తెలియజేయుచున్నది. ఇత్తడి మేకునుండి వెండి వంకీకి త్రాడు కలుపబడి, స్తంభము స్థిరపడుచున్నదనుమాట, విశ్వాసి మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడను సత్యమును తెలియజేయు చున్నది (యోహాను 5:24). ప్రతి రెండు స్తంభములు వెండి పెండె బద్దల ద్వారా స్థిరపరచబడుచున్న వనుమాట, క్రీస్తు సంఘములో విశ్వాసులు “పాపవిమోచని ద్వారా మాత్రమే సహవాసము కలిగియుందురన్న నత్యమును తెలియజేయుచున్నది (1యోహాను1:7). ఈ రీతిగా విశ్వాసులు వ్యక్తిగతంగా మరియు సహపాటి విశ్వాసుల సహవాసము ద్వారా స్థిరత్వము పొందుదురు. ప్రతి స్తంభము పైనున్న వెండి బోదె విశ్వాసి యొక్క “రక్షణ శిరస్రాణము”ను సూచిస్తున్నది (ఎపెసె 6:17). శిరస్రాణము మానవుని అపాయము నుండి కాపాడు రీతిలో యేసుక్రీస్తు విశ్వాసికిచ్చిన “రక్షణ” నిత్యనాశనమునుండి తప్పించును (యోహాను 3:16; 5:24).
iii) ప్రతి రెండు స్తంభముల మధ్య నున్న వెండి పెండె బద్దెలపై సన్ననార యవనికలు వ్రేలాడబడినవి. సన్ననార యవనికలు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు పొందిన “దేవుని నీతి” ని సూచిస్తున్నవి (రోమా 3:22; 2 కొరింథీ 5:21). ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు (యెషయా 61:10). పరలోకములో క్రీస్తు సంఘము సన్నపు నారబట్టలు (పరిశుద్ధుల నీతి క్రియలు) ధరించుకొనెను (ప్రకటన 7:14, 19:7-8).
విశ్వాసులు వ్యక్తిగత జీవితముల ద్వారా మరియు క్రీస్తు సంఘముగా దేవుని నీతిని అన్యజనుల యెదుట ప్రచురపరచవలెనన్న సత్యమును మనమిక్కడ గమనించెదము. ఆవరణమునకున్న కంచెను సమీపించిన వారు ముఖ్యముగా 7 తెల్లగానున్న సన్ననార యవనికలనే చూచెదరు. అట్లు చూచినవారు ఆవరణ ద్వారము వైపునకు నడిపించబడుదురు. ఆలాగున క్రైస్తవుల జీవితము కూడా యితరులను క్రీస్తువైపునకు (ఆవరణ ద్వారమునకు) నడిపించునట్లుండవలెనని గమనించు చున్నాము (1 పేతురు 2:12; మత్తయి 5:10).
7iv) చివరిగా ఆవరణము దేవునితో సహవాసము కలిగి, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు స్థలముగా మనము తెలుసుకొందుము. కృతజ్ఞతార్చణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణములలో ప్రవేశించుడి (కీర్తన 100:4). నైవేద్యము తీసికొని, ఆయన ఆవరణములలోనికి రండి (కీర్తన 96:8). నీతిమంతులు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు (కీర్తన 92:13). దేవుని ఆవరణములో ఉండువారు ధన్యులనియు (కీర్తన 65:4), ఆయన ఆవరణ సహవాసము కొరకు ఆశకలిగి యుండవలెననియు (కీర్తన 84:2, 10) దేవుని వాక్యము సెలవిస్తున్నది.
b) ఆవరణ ద్వారము (Gate)
(నిర్గమకాండం 27:16, 38:18-19)
“ఆవరణద్వారమునకు నీలధూమ్రరక్త వర్ణములుగల యిరువది మూరల తెరయుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగావుండవలెను. వాటి స్తంభములు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు” (నిర్గమకాండం 27:16),
ఆవరణపు వర్ణనలో ఆవరణమునకంతటికీ ఒకే ఒక్క ద్వారమున్నట్లుగా చెప్పబడినది. ఈ మాట, దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు యేసుక్రీస్తు మాత్రమే మార్గము అన్న సత్యమును తెలియజేయుచున్నది. యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నాద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని చెప్పెను (యోహాను14:6). మరి యెవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణపొందవలెను గాని, ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి యే నామమున రక్షణ పొందలేము (అపొ.కా. 4:12). యేసు క్రీస్తు తానే ద్వారమునని, గొర్రెలు పోవు ద్వారమునని చెప్పెను (యోహాను 10:7-10). ఆయన ఒక నీతి గుమ్మము (కీర్తన 118:19, 20), జీవపు ద్వారము (మత్తయి 7:13).

9ఆవరణద్వారపు తెర “నీలధూమ్ర రక్త వర్ణములు గలదియు, పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది” అని నిర్గమకాండం 38:18లో చదువుచున్నాము. నీలవర్ణము యేసుక్రీస్తుయొక్క దైవత్వమును (దేవుని కుమారుడు), రక్తవర్ణము యేసుక్రీస్తియొక్క మానవత్వమును (మనుష్యకుమారుడు), ధూమ్రవర్ధము యేసుక్రీస్తులో నున్న దైవ, మానవ స్వభావముల కలయికను సూచిస్తున్నవి. వీటిని గూర్చిన వివరణ నాల్లవ అధ్యాయములో “ప్రత్యక్షపు గుడార పైకప్పు తెరలు” అను అంశము క్రింద యివ్వబడినది. ఈ మూడు వర్ణములు చిత్రకారుని పనిగా పేనిన సన్న నారపై పొదగబడినవనుమాట (నిర్గమకాండం 27:16) యేసుక్రీస్తు పరిశుద్దుడు, నీతిమంతుడు గనుకనే ఆయన దేవుడు, మానవుడు, దైవ-మానవునిగా లోకములో బయలుపరచబడినాడని తెలియజేయుచున్నది.
ప్రియులారా, యేసుక్రీస్తనెడి యీ ద్వారముద్వారా దేవుని సన్నిధియందు ప్రవేశించుటకు దేవుడు మానవులందరినీ ఆహ్వానించుచున్నాడు (మత్తయి 11:28; యోహాను 5:24, 4:13, 14, 7:37). ఈ ఆహ్వానమును అనేకులు గైకొందురుగాక!