UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము › మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము
మొదటి భాగము – ప్రత్యక్షపు గుడారము · Part I — The Tabernacle
4. ప్రత్యక్షపు గుడారము
The Tabernacle: Boards, Coverings, Door and Veil · ముద్రిత పుటలు 19–35 · 2,341 పదాలు · ≈20 నిమిషాలు
ఈ అధ్యాయములో
19ప్రియులారా, గత మూడు అధ్యాయములలో వెలుపలి ఆవరణము, బలిపీఠము, గంగాళములను గూర్చి తెలుసుకున్నాము. వెలుపలి ఆవరణము పాపమునకు తీర్పు తీర్చబడు స్థలము. బలిపీఠము, గంగాళముల యొద్ద పాపమునకు తీర్చుతీర్బబడిన తరువాత మాత్రమే యాజకుడు పరిశుద్ధతనొంది, ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించి, పరిచర్య చేయుటకు యోగ్యుడగును.
పటము-2లో చూపబడినట్లు ప్రత్యక్షపు గుడారము పరిశుద్ధస్థలము, అతిపరిశుద్ధస్థలము అను రెండు భాగములుగా విభజింపబడినది. పరిశుద్ధస్థలము పొడవు ఇరవై మూరలు, వెడల్పు పది మూరలు. అతి పరిశుద్ధస్థలము పొడవు పది మూరలు, వెడల్పు పది మూరలు. పరిశుద్ధస్థలములో వుంచబడిన దీపవృక్షము, బల్ల, ధూపవేదికలను గూర్చియు, అతి పరిశుద్ధ స్థలములో వుంచబడిన మందసమును గూర్చియు రానున్న అధ్యాయములలో చూచెదము. ప్రత్యక్షపు గుడార నిర్మాణ క్రమము తెలుసుకొను నిమిత్తము ప్రస్తుత అధ్యాయము ప్రత్యక్షపు గుడార పలకలు-అడ్డకజ్టిలు, ప్రత్యక్షపు గుడార పై కప్పు తెరలు, ప్రత్యక్షపు గుడార ద్వారపు తెర, ప్రత్యక్షపు గుడారఅడ్డతెర అను నాలుగు భాగములుగా విభజింపబడినది. వీటి వివరణ క్రింద యివ్వబడినది.
a) ప్రత్యక్షపు గుడార పలకలు – అడ్డకర్రలు (Boards & bars)
(నిర్గమకాండం 26:15-29, 36:20-34)
“మరియు మందిరమునకు తుమ్మకజ్జతో నిలువుపలకలు చేయవలెను. పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరెడున్నర యుండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకలక్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తర దిక్కున, ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు, ఇరువది పలకలును, వాటి నలువది వెండి

21దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి, శిఖరమున మొదటిఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికీ ఉండవలెను. అవి రెండు మూలలకుండును. పలకలు ఎనిమిది, వాటి వెండి దిమ్మలు పదునారు. ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను. తుమ్మకజ్జతో అడ్డకట్టిలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డకట్టిలును, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకట్టిలును, పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకజ్టిలును ఉండవలెను. ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డకట్టి ఈ కొసనుండి ఆ కొస వరకు చేరియుండ వలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి, వాటి అడ్డకట్టిలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకట్టిలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండమీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను” (నిర్గమకాండం 26:15-29),
పై వాక్య భాగములో చెప్పబడిన నిలువు పలకలు, అడ్డకట్టిల అమరిక పటము-?7లో 0 చూపబడినది. వీటిని గూర్చి ధ్యానించిన యెడల, యీ క్రింది సత్యము బయలుపరచబడుచున్నది.
i) ప్రత్యక్షపు గుడార నిలువు పలకల అమరిక మొదటిదిగా ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నది. నిలువు పలకలు తుమ్మకజ్జతో చేయబడినవి. కట్టి లేదా చెక్క యేసుక్రీస్తు మానవత్వమును సూచిస్తున్నదని (హెబ్రీ 2:14), పుచ్చుపట్టని, మన్నిక కలిగిన తుమ్మకజట్టి యేసుక్రీస్తు యొక్క పాప రహిత మానవత్న్వమును సూచిస్తున్నదని (కీర్తన 16:10; హెబ్రీ 7:26) రెండవ అధ్యాయమైన “బలిపీఠము”లో చూచితిమి.
నిలువు పలకలు బంగారు రేకుతో పొదిగింపబడినవి. బంగారము వాడబారనిది మరియు శుద్ధమైనది (యోబు 23:10; 1పేతురు1:7; ప్రకటన 3:18, 21:21). కనుక యీ బంగారము యేసు క్రీస్తు యొక్క నిత్యత్వము మరియు దైవత్వమును సూచిస్తున్నది (యెషయా 9:6; యోహాను 1:1-3, 14-18; 22 1 తిమోతి 3:16; మత్తయి 16:13-17; యోహాను 6:67-69, 20:28, 29). దైవత్వము, మానవత్వమును కలిగియున్న దైవమానవుడైన యేసుక్రీస్తు దేవునికి, మానవునికి మధ్యవర్తిగా వచ్చెనని (1 తిమోతి 2:5, 6), దైవ,మానవులు కలియు దేవాలయముగా మనమధ్య వున్నాడని యీ ప్రత్యక్షపు గుడారము ద్వారా మనము తెలుసుకొనుచున్నాము (యోహాను 2:19-21; ఎఫెసీ 2:18). తుమ్మచెట్టు నరకబడి, దానినుండి నిలువు పలకలు చేయబడిన విధానములో యేసుక్రీస్తు కూడా లేతమొక్కవలె, యెండిన భూమిలో మొలిచిన మొక్కవలె నుండి (యెషయా 53:1), సజీవుల భూమిలోనుండి కొట్టివేయబడి (యెషయా 53:8), తండ్రియైన దేవుని కలుసుకొను దేవాలయముగా చేయబడెను.
22ii) రెండవదిగా ప్రత్యక్షపు గుడార నిలువు పలకలు-అడ్డకట్టిల అమరిక సార్వత్రిక సంఘ విశ్వాసుల సముదాయము, వారి మధ్య జరుగు పరిచర్యను సూచిస్తున్నది.
✿ ప్రతి విశ్వాసి ఒక నిలువు పలకను సూచిస్తున్నాడు. ఎడారి భూమిలో
✿
✿
✿
✿ వుంటున్న తుమ్మ చెట్టు నరకబడి, నిలువు పలకగా తీర్చబడి, యిసుకలో దిగబడి పోకుండా వెండి దిమ్మను పునాదిగా కలిగియున్నది. అదే విధానములో మునుపు అంధకారములో, పాపములో, దేవునికి దూరస్థులుగా జీవిస్తున్న మానవులు యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించుట ద్వారా క్రీస్తును పునాదిగా కలిగి, దేవుని కట్టడములో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వుందురు (ఎఫెసి 1:1-22; కొలొస్సీ 1:291-28, 2:6-7; 1 పేతురు 2:4-5; లూకా 6:46-49; యెషయా 28:16; కీర్తన 40:1-38).
✿ వెండి ప్రాణ పరిక్రయధనము” (నిర్గమకాండం 30:15). ఇది క్రీస్తు నందు
✿
✿
✿
✿ మానవులకున్న “పాపవిమోచనిను సూచిస్తున్నది. ఒకని ప్రాణ విమోచన ధనము బహుగొప్పదని, అది యెన్నటికి తీరక అట్లుండవలసినదేయని దేవుని వాక్యము సెలవిస్తున్నది (కీర్తన 49:9). ఎవరూ చెల్లించలేనంత యెక్కువగా వున్న మానవుల ప్రాణ విమోచన క్రయధనమును యేసుక్రీస్తు తన రక్తము కార్చి, చెల్లించాడు (1 తిమోతి 2:6; మార్కు 10:45; 1 కొరింథి 6:20; 1 పేతురు 1:18-21). యేసు క్రీస్తునందు మనకున్న యిట్టి పాపవిమోచనను స్వీకరించిన యెడల, మన పాపములు 23 తొలగించబడి, శాంతి, సంతోషములు కలిగియుందుము (యెషయా 35:10).
23దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులలో ఇరువదియేండ్లుగాని అంతకంటే యెక్కువగాని వయసు గలిగి, లెక్కింపబడిన వారిలో చేరువారు వారి 1ప్రాణపరిక్రయ ధనము”గా ఒక్కొక్కరు అరతులము వెండి యెహోవాకు సమర్పించవలెనని చెప్పెను. ఈ లెక్కలో ఆరులక్షల మూడువేల అయిదువందల యేబదిమంది చేర్చబడిరి. వారి వెండి మూడులక్షల ఒక్కవెయ్యి యేడు వందల డెబ్బదియెదు తులములాయెను. ఈ వెండితో ఒక్కొక్క దిమ్మకు మూడువేల తులముల చొప్పున నూరు దిమ్మలు (ఒక్కొక్క నిలువు పలకకు రెండు దిమ్మల చొప్పున నలబై ఎనిమిది పలకలకు తొంబది ఆరు దిమ్మలు మరియు అడ్డతెర యొక్క నాలుగు స్తంభములకు నాలుగు దిమ్మలు కలిపి మొత్తము నూరు దిమ్మలు) పోయబడెను. మిగిలిన ఒక వెయ్యి యేడు వందల డెబ్బదియొదు తులముల వెండి వెలుపలి ఆవరణపు స్తంభములకు బోదెలు, వంకులు, పెండెబద్దలు చేయుటయండదు వాడబడెను (నిర్గమకాండం 30:11-16, 38:25-28; సంఖ్యాకాండం 1:45-46). ఈ విధముగా ఇశ్రాయేలీయులు అర్పించిన వెండి ప్రత్యక్షపు గుడారమందు వాడబడినది. ధనవంతుడు అరతులము కంటె ఎక్కువ ఇవ్వకూడదు. బీదవాడు అరతులము కంటి తక్కువ ఇవ్వకూడదు (నిర్గమకాండం 30:15). అందరూ సమానమైన రీతిలో పాపబుణము దేవునికి అచ్చియున్నారు (రోమా 3:12-18, 23).
✿ నిలువు పలకలు మరియు అడ్డకట్టిలు బంగారు రేకుతో పొదగబడినవి.
✿
✿
✿
✿ ఈ మాట విశ్వాసులు దేవస్వభావమునందు పాలివారగుదురన్న సత్యమును తెలియజేయుచున్నది (2 పేతురు1:4).
✿ ప్రతి రెండు నిలువు పలకలు వెలుతురు కూడా దూరలేనంతగా అతకబడి, అమర్బబడినవి. క్రీస్తు సంఘములో విశ్వాసులు ఏకభావము, ఏకమనస్సు, ఆత్మయందు ఐక్యత కలిగియుండవలెనని దీనిని బట్టి తెలుసు కొనుచున్నాము (అపొ.కా. 1:14, 2:46, 4:24, 5:12; ఫిలిప్పీ 1:27, 2:2; 1 పేతురు 3:8; 2 కొరింథీ 13:11; కీర్తన 133:1; ఎఫెసీ 2:21-22).
✿ నిలువు పలకలన్నియు ఒక్కటే యెత్తు కలిగి, సమానముగానున్నవి. 24 క్రీస్తు సంఘములో విశ్వాసులు ఆస్తి పరమైన, కుల, ప్రాంతపరమైన విచక్షణ చూపక, సమానత కలిగి, ప్రేమను, ఐక్యతను కనపరచుదురని దీనిని బట్టి గమనించుచున్నాము (1 కొరింథీ 12:12-31, ఫిలిప్పీ 2:3), విశ్వాసులు అన్ని విషయములలోను యేసుక్రీస్తును మాదిరి కలిగి, ఆయనతోనే తమ్మును తాము పోల్చిచూచుకొనవలెను. అలాగాక, ఒకరితో ఒకరు పోల్చిచూచుకొనువారు గ్రహింపులేక యున్నారని దేవునివాక్యము సెలవిచ్చుచున్నది (2కొరింథీ 10:12).
24✿ మందిరమునకు పడమటివైపున రెండు మూలలకు వున్న మూలపలకలు
✿
✿
✿
✿ పైనా, క్రింద ఉంగరముతో ఉత్తర, దక్షిణ దిక్కునవున్న పలకలతో కట్టబడి, పలకల అమరికంతటికీ స్థిరత్వమునిచ్చుచున్నది. ఇది యేసుక్రీస్తు మూలరాయిగా వున్నాడన్న సత్యమును తెలియజేయుచున్నది (కీర్తన 118:22; యెషయా 28:16).
✿ చివరిగా పటము-? లో చూపబడినట్లు, ప్రత్యక్షపు గుడారమునకు వెలుపలి
✿
✿
✿
✿ మూడువైపులా, ఒక్కొక్క వైపు ఐదేసి చొప్పున అడ్డకట్టిలున్నట్లు గమనించుదుము. ఈ అడ్డకట్టిలు పై భాగములో రెండు, క్రింది భాగములో రెండు, మధ్య భాగములో ఒకటి అమర్బ్చబడినవి. ఈ అడ్డకట్టిలు, నిలువు పలకలు గాలికి పడిపోకుండా అమర్బ్చబడినట్లు తెలుసుకొనుచున్నాము. ఇందులో గొప్ప సత్యమును చూడగలము.
ఈ అయిదు అడ్డకజ్టిలూ క్రీస్తు సంఘము స్థిరపరచబడునట్లు దేవుడు యేర్చరచిన ఐదంతల పరిచర్యను సూచిస్తున్నవి. “పరిశుద్ధులు సంపూర్ణృలగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులుగాను నియమించెను” (ఎఫెసీ 4:13). క్రింది భాగములో వున్న రెండు అడ్డకజ్టిలు అపొస్తలులు, ప్రవక్తల పరిచర్యను సూచిస్తుండగా (ఎఫెసి 2:20), మధ్యలోనున్న అడ్డకట్టి యీ చివర నుండి ఆ చివరకు అమర్చబడి, సువార్తికుని, సువార్త సేవను సూచిస్తున్నది (మార్చు 16:15). పై భాగములో ఉన్న రెండు అడ్డకట్టిలూ కాపరులను, ఉపదేశకులను సూచిస్తున్నవి.
యేసుక్రీస్తును పునాదిగా గలిగిన సంఘము పైన చెప్పబడిన ఐదంతల 25 పరిచర్య ద్వారా స్థిరపరచబడుతున్నది. అడ్డకట్టిలను తొలగించిన యెడల నిలువు పలకలు పడిపోవునట్లు, పరిచర్య లేనియెడల సంఘము బలహీనమై, క్షీణించును. ఈ విధముగా, నిలువు పలకలు - అడ్డకట్టిల అమరిక యేసుక్రీస్తు సంఘమును, అందలి పరిచర్యను వర్ణించుచున్నది.
b) ప్రత్యక్షపు గుడార పైకప్పు తెరలు (Roof coverings)
(నిర్గమకాండం 26:1-14, 36:8-19)
25“మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్తవర్ధములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు. ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. తెరల కూర్చు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్చునందలి వెలుపలి తెర చివరను అట్లుచేయవలెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్చునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది బంగారు గుండీలను చేసి, ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరముపైని గుడారముగా మేకవెంట్రుకలతో తెరలు చేయవలెను. పదకొండు తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. పడకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను, ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్చవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్చునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను, రెండవ కూర్చునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది యిత్తడిగుండీలను చేసి, ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి, దాని కూర్చవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్క మీద 26 బ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను, ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద ట్రేలాడవలెను. మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళతో పై కప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్ళతో పై కప్పును చేయవలెను” (నిర్గమకాండం 26:1-14).
26ప్రత్యక్షపుగుడార నిలువు పలకలు, వాటి అడ్డకట్టిలు యేసు క్రీస్తు సంఘమును, అందలి పరిచర్యను సూచిస్తున్నవని తెలుసుకొంటిమి. పై వాక్యభాగమును గమనించిన యెడల పటము-8 లో చూపబడినట్లు నాలుగు రకములైన తెరలు నిలువు పలకల మీద కప్పబడినట్లుగా చూచెదము. వీటిని గూర్చిన వివరణ క్రిందయివ్వబడినది.
i) ప్రత్యక్షపు గుడారముపైన మొదటిగా నీల, ధూమ్ర, రక్తవర్ణములుగల పేనిన సన్నపునారతో చేయబడిన తెర కప్పబడినది. సన్నపు నార వస్త్రములు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు పొందిన దేవుని నీతిని సూచిస్తున్నవని “వెలుపలి ఆవరణము”ను గూర్చిన వివరణలో తెలుసుకొంటిమి (రోమా 3:22; 2 కొరింథీ 5:21; యెషయా 61:10; ప్రకటన 7:14, 19:7-8). ఈ సన్నపు నార వస్త్రములు తెల్లనివైయుండి, వాటియందు నీల, ధూమ్ర, రక్తవర్ణములు కలిగియున్నవి. తెలుపు, నీలము, ధూమ్రవర్ణము, రక్తవర్ణములు యేసుక్రీస్తు యొక్క నాలుగు ప్రధాన లక్షణములను సూచిస్తున్నవి. ఈ నాలుగు లక్షణములు నాలుగు సువార్తల ద్వారా బయలుపరచబడినవి.
✿
✿ తెలుపు రంగు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు గుర్తు. సన్నపు నార వస్త్రములు
✿
✿
✿ తెలుపు రంగు కలిగి, ప్రకాశమానములును, నిర్మలములునై, పరిశుద్ధుల నీతి క్రియలైయున్నవి (ప్రకటన 19:7-8). ఇవి యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులకు యివ్వబడినవి గనుక యేసుక్రీస్తు పరిశుద్దుడును, నిర్మలుడును, ప్రకాశవంతుడునై యున్నాడు (హెబ్రీ 7:26). లూకాసువార్త యేసుక్రీస్తు ఆదాము కుమారునిగా, పాపములేక, పరిశుద్ధతకలిగియున్నాడని తెలియజేయుచున్నది (లూకా 1:35).
✿
✿ నీలిరంగు యేసుక్రీస్తు యొక్క దైవత్వమునకు గుర్తు. నీలిరంగు ఆకాశమును
✿
✿
✿

28సూచిస్తున్నది. యేసుక్రీస్తు పైనుండి లేక ఆకాశమునుండి దిగివచ్చియున్నాడు. యోహాను సువార్త యేసుక్రీస్తు యొక్క దైవత్వమును, ఆయన దేవుని కుమారుడన్న సత్యమును తెలియజేయుచున్నది (యోహాను 38:81; 1 కొరింథి 15:47).
✿ రక్తవర్ణము యేసుక్రీస్తు యొక్క మానవత్వమునకు, బలియాగమునకు
✿
✿
✿
✿ గుర్తు. మానవునిగా ఆయన అనేక శ్రమలనొంది, ఒక దాసుని స్వభావము కలిగి, రక్తముగార్చి, పాపపరిహారార్థము తన్నుతాను బలిగా అర్పించుకున్నాడు (హెబ్రీ 2:17-18, 5:7, 8; మార్కు 9:12; ఎఫెసీ 1:7; ఫిలిప్పీ 2:5-8). మార్కు సువార్త యేసుక్రీస్తును మనుష్యుకుమారునిగా, దాసునిగా వర్ణిస్తున్నది.
✿ ధూమవర్ణము నీలము మరియు రక్తవర్ణముల కలయిక. ఇది యేసుక్రీస్తులో
✿
✿
✿
✿ దైవత్వము, మానవత్వము రెండూ కలిసియున్నవన్న సత్యమును సూచిస్తున్నది. కనుకనే యేసుక్రీస్తు మానవునికి, దేవునికి మధ్యవర్తిగాయున్నాడు (1 తిమోతి 2:5). అంతేగాక ధూమ్ర వర్ణము యేసుక్రీస్తు యొక్క రాజరికమును సూచిస్తున్నది. మత్తయి సువార్త యేసుక్రీస్తును దావీదు కుమారునిగా, ఒక రాజుగా అభివర్ణిస్తున్నది (మత్తయి 22:2, 6, 4:15-17, 21:5, 9, 22:44, 45, 26:64, 2?7:11, 27-8”77).
పై నాలుగు రంగుల కలయికతో సన్నపు నార తెరలు చిత్రకారుని పనియైన కెరూబులు కలిగియున్నవనుమాట యేసుక్రీస్తునందు బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు గుప్తములైయున్నవనియు, ఆయనయందు సర్వసంపూర్ణత నివసిస్తున్నదనియు తెలియజేయుచున్నది (కొలొస్సి 2:3; 1:19, 20).
ii) రెండవదిగా ప్రత్యక్షపు గుడారముపైన సన్నపు నారల తెరలపై మేక వెంట్రుకలతో చేయబడిన తెరలువేయబడినవి. మేకవెండ్రుకలు నలుపురంగు కలవి గనుక మేకవెండ్రుకలతో చేయబడిన తెరలు నల్లనివై, యేసుక్రీస్తు “పాపపరిహారార్థబలి”ని సూచిస్తున్నవి. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు పాపపరిహారార్థబలిగా మేకలను అర్పించుచుండిరి (లేవీకాండం 4:23, 5:6, 9:3, 16:5-11, 20-26), ఇవి సాధారణ ప్రజలకొరకు (లేవీకాండం 4:27, 28), యాజకులను ప్రతిష్ఠించుట కొరకు (లేవీకాండం 9:2, 3), బలిపీఠమును ప్రతిష్ఠించుట కొరకు (సంఖ్యాకాండం
7), ప్రతి నూతన నెలలోను (సంఖ్యాకాండం 28:11-15) వాడబడినవి. అంతేగాక 29 ఇశ్రాయేలీయుల పండుగలైన పస్మాపండుగలో (సంఖ్యాకాండం 28:22), పెంతెకోస్తు పండుగలో (సంఖ్యాకాండం 23:19), పర్ణశాలల పండుగలో (సంఖ్యాకాండం 29:11) మేకలు “పాపపరిహారార్థబలి”గా అర్పించబడినవి. ఇవన్నియు ప్రభువైన యేసుక్రీస్తు మానవులందరికొరకు పాపముగా చేయబడి, సిలువలో పాపపరిహారార్థ బలి”గా అర్పించబడినాడన్న సత్యమునకు సూచనగావున్నవి (2 కొరింథి 5:21; రోమా 8:3, 4; యెషయా 53:10; హెబ్రీ 9:26-28, 10:11, 14).
29iii) మూడవదిగా మేకవెండ్రుకల తెరలపై ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు కప్పబడి యున్నవి. పొట్టేలు లేక గొఱ్ఱెపిల్ల యేసుక్రీస్తును సూచిస్తున్నది. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తును చూచినపుడు, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల’ అని చెప్పెను (యోహాను 1:29, 36). యేసుక్రీస్తు “మన పాపముల నిమిత్తము” తన్నుతాను అప్పగించుకొనెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (1 కొరింథి 15:3; గలతి 1:4). అనగా “మనకు బదులుగా” తానే సిలువలో మరణించెను (యెషయా ర్38:5),
ఈ పొట్టేళ్ల తోళ్లు ఎఱ్ఱరంగు వేయబడియున్నవి. ఇది యేసుక్రీస్తు రక్తమును సూచిస్తున్నది. అమూల్యమైన రక్తముచేత అనగా నిర్లోషమును, నిష్కకంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడుదుము (1 పేతురు 1:19; ప్రకటన 7:14). పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు గొఱ్ఱెలను అపరాధ పరిహారార్థబలిగాను (లేవీకాండం ర్: 15), దహనబలిగాను (లేవీకాండం 8:18), సమాధాన బలిగాను (లేవీకాండం 9:4) అర్పించిరి. (వీటి వివరణ యీ పుస్తకము యొక్క రెండవ భాగములో యివ్వబడినది).
iv) చివరిగా పొట్టేళ్ల తోత్లమీద సముద్రవత్సల తోళ్లు కప్పబడినవి. సముద్రవత్సల తోళ్లు చూచుటకు నిరాకారముగా వుండును. యివి యేసుక్రీస్తు సురూపములేక, మనుష్యుల చేత విసర్దింపబడి, తృణీకరింపబడిన వాడాయెనన్న సత్యమును సూచిస్తున్నవి. “అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. మనమతనిని చూచి అపేక్షించునట్లుగా అతనియందు సురూపములేదు. అతడు తృణీకరింపబడినవాడును 30 ఆయెను. మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను వుండెను (యెషయా 53:2, 3).
30పైన చెప్పిన విధముగా ప్రత్యక్షపు గుడారము మీద కప్పబడిన నాలుగు రకముల తెరలు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సత్యమును తెలియజేయుచున్నవి.
c) ప్రత్యక్షపు గుడార ద్వారపు తెర (Door curtain)
(నిర్గమ కాండం 26:36, 37)
“మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకజ్టతో చేసి, వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను” (నిర్గమ కాండం 26:836, 87),
పైన చెప్పబడిన ప్రత్యక్షపుగుడార ద్వారపు తెరను గురించి యీ క్రింది విషయములు గమనించవచ్చును.
i) ప్రత్యక్షపుగుడార ద్వారపు తెర నీల ధూమ్రరక్త వర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైయున్నది. ఈ సన్ననార, దాని నాలుగు రంగుల ప్రాముఖ్యతను “ప్రత్యక్షపుగుడార పై కప్పు తెరలు” అను అంశము క్రింద చూచితిమి.
ii) ప్రత్యక్షపుగుడార ద్వారపు తెరకు తుమ్మకజ్ఞతో చేయబడి, బంగారు రేకుతో పొదగబడిన అయిదు స్తంభములున్నవని పై వాక్య భాగములో చదివి యున్నాము. తుమ్మకజ్టి యేసుక్రీస్తు యొక్క పాపరహిత మానవత్వమును, బంగారం యేసుక్రీస్తు యొక్క దైవత్వమును సూచిస్తున్నవని ప్రత్యక్షపుగుడార నిలువు పలకల వర్ణనలో చూచితిమి.
iii) ప్రత్యక్షపుగుడార అయిదు స్తంభములకు అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయబడినవి. పరిశుద్ధస్థలము, అతి పరిశుద్ధస్థలము యొక్క ఉపకరణములు, నిలువు పలకలు, వాటి అడ్డకట్టిలన్నియు బంగారును కలిగియున్నవి. నిలువు

32పలకలు వెండి దిమ్మలను కలిగియున్నవి. వెలుపలి ఆవరణములో బలిపీఠము, గంగాళము, వెలుపలి ఆవరణ స్తంభముల యొక్క దిమ్మలు ఇత్రడిని కలిగియున్నవి. అయితే, ప్రత్యక్షపుగుడార ద్వారపు స్తంభములు బంగారు రేకుతో పొదగబడి, ఇత్తడి దిమ్మలు కలిగియున్నవి. ఇచ్చట బంగారు, ఇత్తడియొక్క కలయికను గమనించుచున్నాము. దీనిని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడతో బలులు, ఆచారములకు సంబంధించిన ధర్మశాస్త్రపు కాలము సమాప్తమై, యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముననైన నీతిని కలిగియున్న కృపాకాలము (సంఘకాలము) మొదలైనదని తెలుసుకుంటున్నాము (రోమా 38:22). ప్రత్యక్షపుగుడార ద్వారమునకున్న బంగారు స్తంభములు ఇత్తడి దిమ్మలను కలిగియున్నవనుమాట యేసుక్రీస్తు మన పాపములకొరకు తీర్చుతీర్చబడి, మరణమును, సమాధిని జయించాడన్న సత్యమును తెలియజేయుచున్నది. కనుకనే, యేసుక్రీస్తు ఇత్తడి పాదములు కలిగియున్నట్లుగా దేవుని వాక్యము వర్ణిస్తున్నది (ప్రకటన 1:15).
iv) ప్రత్యక్షపుగుడార ద్వారపు తెర పరిశుద్ధ స్థలము లోనికి నడిపించును. పరిశుద్ధ స్థలము పదిమూరల వెడల్పు, ఇరవై మూరల పొడుగు, పది మూరల యెత్తు కలిగి, మొత్తము రెండు వేల మూరల ఘనపరిమాణము కలిగియున్నది. యిది పైన చెప్పబడినట్లుగా రెండు వేల సంవత్సరముల సంఘకాలమును సూచిస్తున్నది. పరిశుద్ధస్థలములో యాజకులు యాజకత్వమును నిర్వర్తించుదురు. అలాగే, దేవుడు మనలను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించి, సార్వత్రిక సంఘములో రాజులైన యాజక సమూహముగా చేసియున్నాడు (1 పేతురు 2:9; ప్రకటన 1:6). యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా వుండుటకు మనము పిలువబడియున్నాము (1 పేతురు 2:5).
d) ప్రత్యక్షపు గుడార అడ్డతెర (Veil)
(నిర్గమకాండం 26:31-35)
“మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులుగలదిగా చేయవలెను. తుమ్మకజ్టతో చేయబడి, బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభముల

34మీద దానివేయవలెను. దాని వంకులు బంగారువి. వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి, సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును, అతి పరిశుద్ధస్థలమును వేరుచేయును. అతి పరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్లయెదుట దక్షిణపు వైపునున్న మందిరముయొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను” (నిర్గమ కాండం 26:31-35).
పై వాక్యభాగములో ప్రత్యక్షపుగుడార అడ్డతెరను గురించి యీ క్రింది విషయములు గమనించవచ్చును.
i) ప్రత్యక్షపుగుడార అడ్డతెర నీల ధూమ్ర రక్త వర్ణములుగల పేనిన సన్ననారతో చేయబడి, చిత్రకారుని పనియైన కెరూబులుగలదని పై వాక్యభాగములో చదివితిమి. దీని ప్రాముఖ్యతను “ప్రత్యక్షపుగుడార పై కప్పు తెరలు” అను అంశము క్రిందచూచితిమి.
ii) తుమ్మకజ్జతో చేయబడి, బంగారు రేకు పొదగబడిన స్తంభములు యేసుక్రీస్తు యొక్క పాపరహితమానవత్వమును, దైవత్వమును సూచిస్తున్నవి. వాటి వెండి దిమ్మలు యేసుక్రీస్తునందున్న పాపవిమోచనను సూచిస్తున్నవి.
iii) ప్రత్యక్షపుగుడార అడ్డతెర పరిశుద్ధస్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయుచున్నది. పరిశుద్ధ స్థలములో యాజకులు నిత్యము సేవచేయుచుందురు. అయితే, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధానయాజకుడొక్కడే, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే రక్తము చేతపట్టుకొని ప్రవేశించి, ఆ రక్తము తన కొరకును, ప్రజల అజ్ఞానకృతముల కొరకును అర్పించును (హెబ్రీ 9:6, 7). అయితే, యేసుక్రీస్తు రాకడతో యీ యాజకత్వపు పనులు సమాప్తమైనవి. యేసుక్రీస్తు సిలువ వేయబడినపుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు చినిగిపోయినది (మత్తయి 27:51; మార్కు 15:38; లూకా 23:45). దీని అర్థము ఆయన ఒక ప్రధాన యాజకునిగా మన మధ్యకు వచ్చి (హెబ్రీ 414, 6:20, 7:26), పరిశుద్ధ స్థలములోనికి ఒక్కసారే ప్రవేశించి, పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలినిఅర్పించి, మానవులకందరికీ రక్షణ మార్గమునేర్చరచాడు (హెబ్రీ 9, 10), 35 ఆయన రక్తము వలన పరిశుద్ధస్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది (హెబ్రీ 10:19-20).
35ఇట్లు చేయుట ద్వారా యేసుక్రీస్తు ధర్మశాస్త్రసంబంధ క్రియలు, ఆచారముల మూలముగా కాకుండా, తనయందు విశ్వాసముంచుట ద్వారా మనము రక్షింపబడి, నీతిమంతులముగా తీర్చబడతామని తెలియజేయుచున్నాడు (రోమా 3:21, 22, 7:6; కొలొస్సి 2:20-23).
iv) చివరిగా అతిపరిశుద్ధ స్థలము పదిమూరల పొడవు, పది మూరల వెడల్పు, పదిమూరల యెత్తుగలిగి, వెయ్యిమూరల ఘనపరిమాణము కలిగియున్నది. ఇది యేసుక్రీస్తు రాజుగా యీ భూమి మీద జరగబోవు “వెయ్యేండ్ల పాలనిను సూచిస్తున్నది. ప్రస్తుత సంఘకాలము (రెండువేల సంవత్సరములు) ముగిసిన వెంటనే, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలన మొదలవును.
ప్రియులారా, యిట్టి దేవుని రాజ్యపాలనలో మనము వుండగోరిన యెడల యేసుక్రీస్తును సొంతరక్షకునిగా అంగీకరించి, పాప క్షమాపణ పొందవలయును. ఈ పుస్తకము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్న యెడల, రక్షణానుభవము లేనివారైతే, “యేసు ప్రభువా, నేను పాపిని. నా పాపముల కొరకు మీరు తీర్చు తీర్చబడి, మరణించి, తిరిగి లేచారని విశ్వసిస్తున్నాను. నా పాపములు క్షమించి, మీ రాజ్యములో నన్ను కూడా చేర్చుకొనుము” అని ప్రార్థించిన యెడల దేవుని రక్షణ మీరు పొందినవారవుదురు. నిత్యసత్యములోనికి దేవుడు మనలను నడిపించునుగాక!