పరిచయము
కలలు కనుట అను వరము
దేవుడు నాకు కల క్తెస్తవ రీతిగా వివరించుటకు బోధించుట ఆయన కరుణనను
చూపించి నా జీవితములోనికి రెవ.హెర్ మన్ ops Rev. Herman Riffel)» పంపెను.నేను పరిశుద్ధ గ్రంధములో ప్రాముఖ్య మైనదిగా ఎంచనివాటిలో ఇదికూడ ఒకటి. ఎందుకంటే కలలు హేతుబద్దమైన చర్చకు తావునిచ్చును. కావున మన సంప్రాదాయము వాటిని OF SHOS నిన్నటి దినమున జీర్ణముకాని రొట్టేలవలె మిగిలిపోయిన వాటిగా వాటిని చూచెదరు. నిశ్చయముగా ఈ లేఖనములలో ఇవి ఈ విధముగా పరిగణీంచబడలేదు, కాని పరిశుద్ధ గ్రంధము మాటిమాటికి ఏ హేతువులేకుండ ,దేవుడే కలల ద్వారా మనతో మాట్లాడుచున్నాడని ప్రకటించుచున్నది(సంఖ్యా 12: 6, ఆది.కా 2:17). మరియు మనకు దేవుడే రాత్రిజామున ఆలోచన చెప్పును(కీర్తనలు 10:7).
అయితే దేవుడు మనకు ప్రతి రాత్రి ఈ విధముగా ఆశ్చర్యకరముగా మరియు ఆద్బుత రీతిలో ఉచితమైన ఆలోచనాజ్ఞానమును ప్రసాధించుట ఎంత చక్కని ఆధిక్యత. దేవుడు మనకను[గ్రహించిన కలలు దర్శనములను తీసికొని దాని వివరణ కొరకు ఆయన యొద్దకు వెళ్లుట ఎంత భాగ్యము. అయితే 10,000 క్తెంస్తవులలో కనీసము ఒక్కడును కలలకు అర్ధము చెప్పుటకు తర్పీదుపొందలేదు. ఇది ఆశ్చర్యకరము సందేహములేదు.
నేను కలల ద్వారా దేవుని స్వరమును వినుట నాకు రెవ.హెర్ మన్ రిఫెల్స్
(Rev. Herman Riffel) నాకు నేర్చించెను. SH నాకు వచ్చు కలలను అర్దము చేసుకొనుటకు మరియు ఇతరులకు సలహచెప్పుటకు,దేవుడు కలలకు అర్ధముచెప్పు పద్దతిని మరియు ఆయన వాటిద్వారా పనిచేయు పద్ధతిని నేను కనుగొనునిమిత్తము నేను లేఖనములను వెదకుటకు ఆయన నాకు సహయము చేసెను. ఎంత ఉత్తమమైన వరమిది.
ఒన్ Boar(OntariolsSd wrod టో (Terente) దగ్గర మొట్ట మొదటిసారిగా నేను రెవ. హెర్ మన్ రిఫెల్స్( Rev. Herman Riffel) ను కలుసుకున్నాను.నేను వారితో దేవునితో సహవాసము(106%977624402 with god fo ఒక సమావేశమును ఏర్పాటు
చేయుచున్నాను. మరియు అదే సమయములో "క్తెస్తవ రీతిలో కలల వివరణ చెప్పుట " అను సమావేశమును ఏర్పాటుచేసెను. నా సమావేశము త్వరగా సమాప్త మైనందున,నేను వెళ్లి చివరి అంశములోనికి వచ్చిన తమ సమావేశములో చేరి నన్ను అతనికి పరిచయముచేసుకొంటిని. ఆ సమావేశము తరువాత నుండి మేము మంచి స్నేహితులమైతిమి. తరువాత ఒకసారి BIOS రీతితో కలల వివరము చెప్పుట మై సూత్రములను పండ్రెండు గంటల కాల పరిమితిగల బోధనను విడియోలో రికార్డుచేయుటకు మా సంఘములో ఉన్న బైబిల్ పాఠశాలకు సిలిసించితిమి. ఈ విడియోలో ఆయన విధ్యార్థుల మౌళిక పరీక్ష తీసుకొని వారి కలలకు
అర్ధము చెప్పెను. ఆహ. మన మధ్య ఒక దానియేలు ఉన్నాడు. మనము ఒక సంఘముగా మన జీవితాంతము ఈ జ్ఞానములో కొనసాగుటకు ఈ గొప్ప వ్యక్తి విడియో మరియు ఆడియో రూపములో మన యొద్ద ఉన్నాయి. క్రీస్తు శరీరమునకు ఎంత చక్కని ఆశీర్వాదమిది.
ఇప్పుడు నేను నా పుస్తకమును నా పడక ప్రక్కను ఉంచుకొని నాకు మెలకువ వచ్చినపుడు నా కలలను వ్రాయచూ, తరువాత ఈ కలలకు అర్ధము చెప్పవలసినదిగా దేవుడిని కోరవచ్చును. నేను దేవుని స్వరమును వినుట నేర్చుకున్నప్పుడు కనుగొన్న నాలుగు సూత్రములను ఉపయోగించి, ఆయన స్వరము వినుటకు మాటలాడక నెమ్మదిగా ఉండెదను. నేను కదలక, నా కలకు చిత్రరూపనిచ్చి ఆకస్మిక ప్రవాహమునకు సిద్ధముగా ఉండి, ఒక వార్తను గురుతుల వలె చూపించిన కల యొక్క మర్మమును తెలుపుమని దేవుని వేడెదను. కలను చూచుటకు మనకు వివేచను కలుగజేయు సూత్రములను హెర్ మన్ బోధించిన అధ్బుతమైన కొన్ని బైబిల్ సూత్రములు క్రింద వివరించబడినవి.
క్రైస్తవరీతిగా కలలకు అర్థము చెప్పుటకు సూత్రములు : కల మరియు దర్శనము యొక్క అర్థము :
1. కల ” నిద్రించుచున్న వ్య 8 మనస్సు ద్వారా సాగుచున్న కొన్ని చిత్రముల, లేక ఇతర రూపముల యొక్క వరుస క్రమము
2. దర్శనము : "మనసుకు కనిపించు ఒక చిత్రము "
3. "కలలోరాత్రి కలుగు స్వప్నములో(దర్శనములో)... "(యోబు 33 1 15)
ఈ వచనములో కలలు మరియు దర్శనముల మధ్య హెబ్రీయులు గమనించిన దగ్గర సంబంధమును గమనించెదము. ఈ రెండు పదములను పరస్పరం ఒకదానికి ఒకటి మనము ఉపయోగించబడినవి.
కలలు మరియు దర్శనములు రెండింటిలోను మనము మనస్సుతో గురుతులను లేక చిత్రములను ఒక తెరపై చూచెదము. కల అనగా మనము నిద్రించినపుడు వచ్చు చిత్రరూపములు మరి ఈ ప్రకారమే దర్శనము అనగా మెలకువగా ఉన్నపుడు వచ్చు చిత్రరూపముల క్రమము.
4. పగటి కలలు కనుట అంటే మనుష్యుడు దర్శన కార్యక్రమమును ఉపయోగించుట. ప్రసంగి 5:7 లో చెప్పబడినట్లు ఇది ప్రోత్సహించదగినది కాదు. మన హృదయ నేత్రములను దేవునికి అర్పించి వాటిని దేవుడు తన దివ్వమైన కలలతోను, దర్శనము లతోను మరియు దైవికమైన ఉహలతోను నింపమని కోరుట ఉత్తమము.
కలలను గూర్చి కొన్ని శాస్త్రసంబంధమైన గమనికలు :
ప్రతి ఒక్కరు తాము నిద్రించు ఒక సమయములో, wojS$ అంటే కునుపాటు సమయములో సుమారు ఒకటి లేక రెండు గంటలసేపు కలలు కనెదరు అని నిద్రపై పరిశో ధనలు తరువాత నిర్దారించిరి. ప్రతి తోంబై నిమిషముల నిద్ర అను చక్రము అల్పతో మొదలై,
కొంతసేపు తరువాత "తీటా" అనబడు దానిలోకిజారి చివరికి “డెల్టా” అను గాఢ నిద్రలోనికి చేరును.
ఆ విధముగా 90 నిమిషముల చక్రము పూర్తి అయిన తరువాత ప్రతి రాత్రి ఆ వ్యక్తి కొద్ది కాలము కొనసాగిన 5 నిమిషముల పాటు కల కనిన wor) పరిధిలోకి చేరుతాడు. తాను ఈ చక్రములో weryS$ మళ్లి చేరినపుడు కల 10 నిమిషములు కొనసాగును. మూడవ సారి అల్పాదశలో 15 నిమిషాలు ఈ కల కొనసాగును. ఒకడు 8 గంటల సేపు నిద్రించినట్లయితే చివరి గంట అంతా అల్బాదశ కొనసాగును. ఆ విధముగా ఆ వ్యక్తి 8 గంటలు నిద్రించినట్లయితే ప్రతి రాత్రి తాను సుమారు ఒకటి లేక రెండు గంటలసేపు కలలు కనును.
స్వప్నములు మరియు దర్శనములు
అల్ఫాదశలోని నిద్రను "రాపిడ్ ఐ మూవ్ మెంట్ "(Rapid Eye Mevement)
అని పిలిచెదరు ( REM >. రాపిడ్ ఐ మూవ్ మెంట్ అంటే కలలు కనుచున్న వారి కలలు అతి త్వరగా కదలుట ప్రారంభమగును. తాను వాస్తవానికి, కలలో కొన్ని ఘట్టములను చూచుచున్నాడు గనుక తన రెప్పలు అలా కదలుట మనము గమనించెదము. అల్బాదశలో ఈ రాసిడ్ ఐ మూవ్ మెంట్ ను చూచుట ద్వారా శాస్త్రజ్ఞులు ఒక వ్యక్తి కలలు కంటున్నాడని గ్రహించి సుమారు ప్రతి రాత్రి ఒక వ్యక్తి కలలు కనుటకు ఎంతసేపు గడుపునో తెలుసుకొంటాడు.
వారు దీని ద్వారా కనుగొన్నదేమనగా ఈ REM సమయము ప్రారంభమయిన ప్రతి సారి ఒక వ్యక్తిని నిద్రలేపినట్లయితే ఈ కలలు ఆటంకపరచబడి మూడు రాత్రుల తరువాత ఆ వ్య క్తి నరాల బలహీనత యొక్క సూచనలు చూపును. స్పష్టముగా చెప్పవలెనంటే అంతరంగమందు విడుదల చేయబడు ఉదేకములే కలలు మన మానసిక మరియు ఉదేకముల యొక్క సమతుల్యమే కలలు అని చెప్పవచ్చును.
మన కలలను చెప్పుచున్నట్లు వినాలి అనుటకు ఏడు కారణములు :
1. దేవుడు పాత నిబంధనలో, ఆయన కలలు మరియు దర్శనముల ద్వారా మాటలాడునని చెప్పుచున్నాడు.( సంఖ్యా కాండము 12:6) ను గమనించుము.
2. దేవుడు కలలు మరియు దర్శనముల ద్వారా మాటలాడియున్నాడని పాతనిబంధనలో చెప్పుచున్నాడు. ( సమూయేలు 12: 10) ను గమనించుము
3. దేవుడు కలలు మరియు దర్శనముల ద్వారా సంభాషించునని క్రొత్త నిబంధనలో ప్రకటించెను.( అపొ.కా 21 : 7) ను గమనించుము.
4. మనకు రాత్రి జాములో ఆయన ఆలోచనను (గ్రహించునని దేవుడు ప్రకటించుచున్నాడు. (కీర్తనలు 16: 7 ) ను గమనించుము.
5. మన కలలు మనలను భయభ్రాంతులను చేయునట్లుగా ఉండక, మనము నశించకుండా ఉండుటకు మనలను మార్చునట్టివిగా ఉన్నవి.(యోబు 33 14-18) ను గమనించుము.
6. దేవుడు కలలో ప్రాముఖ్య మైన క్రియలను చేయును. ఉదాహరణకు ఆయన కలలో అ(బ్రాహముతో నిబంధనను ఏర్పాటు చేసుకొనెను.(ఆది.కా15 :12,13,18 ) ను గమనించుము.
7. దేవుడు కలల ద్వారా ఆత్మీయ వరములను అనుగ్రహించును.
