Part 9 of 14

యోహాను శుభవార్త – భాగము 8 (పుటలు 45–50)

యోహాను శుభవార్త – భాగము 8 (పుటలు 45–50)

యాజి. అతడు వారితో అన్నాడు “మీకేమీ తెలీదు. 50 సర్వజాతి నాశనం కాకుండా ప్రజలకోసం ఒకే మనిషి చావడం మనకు మేలని మీరు ఆలోచించరు.”

51 ఈ మాట తనంతట తానే చెప్పలేదు గానీ ఆ సంవత్సరం అతడు ప్రముఖ యాజి అయి ఉండి యేసు ఆ (ప్రజకోసం చనిపోతాడని భవిష్యద్వాక్కు పలికాడు. 52 ఆ (ప్రజకోసమే కాదు గాని బయట చెదరి ఉన్న దేవుని పిల్లలందరినీ ఆయన ఒకటిగా సమకూరుస్తాడని కూడా భవివ్యద్వాక్షు వలికాడు. 58 అందుచేత ఆ రోజునుంచి ఆయనను చంపడానికి వారు కుట్ర పన్నుతూ వచ్చారు. 54 కాబట్టి యేసు అప్పటినుంచి యూదులలో బహిరంగంగా సంచరించలేదు గాని అక్కడనుంచి ఎడారి దగ్గర ఉన్న (ప్రాంతానికి, ఎ'ప్రాయిం అనే ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ తన శిష్యులతోకూడా ఆగాడు. 55 యూదుల పస్కా పండుగ దగ్గర పడింది గనుక పస్కా పండుగకు మునుపు తమను శుద్ధి చేసుకోవడానికి చాలామంది పల్లెటూళ్ళనుంచి జెరుసలం వెళ్ళారు. 56 వారు యేసును వెతుకుతూ దేవాలయంలో నిలుచుండి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఆయన పండుగకు రానే రాడా? ఏమనుకొంటున్నారు?” 57 అయితే ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవాలని

ఆయన ఎక్కడ ఉన్నది తెలిసినవారెవరైనా తమకు తెలియజేయాలని ఆజ్ఞ జారీ చేశారు.

19 లమ యేసు పస్కాపండుగకు ఆరు రోజులు ముందుగా బేతనీకి వచ్చాడు. అక్కడ లాజరు మృతి చెందాడు, యేసు చనిపోయిన వారిలోనుంచి అతణ్ణి లేపాడు. £ వారు ఆయనకు అక్కడ విందు చేశారు. మార్త పరిచర్య చేస్తూ ఉంది, లాజరు యేసుతో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఒకడు. 8 మరియ అయితే చాలా విలువైన అత్తరు సుమారు సగం కిలో బరువు తెచ్చింది. అది స్వచ్చమైన జటామాంసి. ఆమె యేసు పాదాలను అభిషేకించి తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఇల్లంతా పరిమళ సువాసనతో నిండిపోయింది.

4 ఆయన శిష్యులలో ఒకడూ సీమోను కుమారుడూ ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వనై ఉన్నవాడైన ఇస్కరియోతు యూదా ర్‌ “ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారాలకు అమ్మి బీదలకివ్వలేదు?” అన్నాడు. 6 అతడు ఇలా అన్చది బీదలమీద (శ్రద్ధ ఉండి కాదు. అతడు దొంగ, అతని దగ్గర శిష్యుల డబ్బుసంచి ఉండడంచేత దానిలో వేసినది సొంతానికి తీసుకొనేవాడు.

(గ్రహించలేదని కయప అంటున్నాడు. వారు చేయవలసినదాని గురించి తన అభిప్రాయాన్ని తరువాతి వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు.

11:50 ఇక్కడ తెగువగా తన నిర్ణయాన్ని వినిపిస్తున్నాడు - “ఒకే మనిషి చావడం” - క్రీస్తు రోమ్‌వారిని యూదజాతిపై చర్య తీసుకునేలా రేపే తంటాలమారి అనీ ఆయన్ను చంపడం అవసరం అనీ అతని అభిప్రాయం. పరిసయ్యులకు, పొంతి పిలాతుకు (18:38) సత్యమంటే ఎంత నిర్ణక్ష్యం ఉందో ఇతనికీ అంతే.

11:51,52 ఇది చాలా వింతైన విషయం. నమ్మకం, పాపవిముక్తి లేనివాడు, క్రీస్తును తిరస్కరించినవాడు ఆధ్యాత్మిక విషయాన్ని గురించి భవిష్యద్వాక్కు పలికాడు. క్రీస్తు సంఘం ఏర్పడుతుందన్న భవిష్యద్వాక్కు ఇది. ఇలా దేవుని మూలంగా పలికేందుకు దేవుడు అతణ్ణి వాడుకుంటున్నట్టుగా అతనికి తెలియదన్నది స్పష్టం. తన హృదయంలోని అపనమ్మకం, దుర్మార్గతల మూలంగా అతడు ఈ విధంగా పలికాడు. అయితే అతడు ఊహించిన దానికంటే అతడి మాటలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి. దేవుని ప్రజలైన ఇస్రాయేల్‌వారి ప్రముఖ యాజిగా అతడు మాట్లాడాడు. దేవుడు తన కుమారుణ్ణి గురించి ఆలోచన చెప్పేందుకు అతని పదవిని బట్టి అతణ్ణి వాడుకున్నాడు. ఆ ఆలోచనవల్ల గొప్ప ఫలితాలు కలగనున్నాయి. దుర్మార్గులు దేవుని మూలంగా పలకడం గురించి ఇతర ఉదాహరణలకు సంఖ్యా 23,24 అధ్యాయాలు; 1 సమూ 11:9-11నూ వాటి నోట్స్‌నూ చూడండి. దేవుడు తాను ఎన్నుకున్న ఏ సాధనాన్నైనా తన సంకల్ప సిద్ధికి వాడుకోగలడు.

11:58 ఇంతకుముందు వారు యేసుప్రభువును చంపడానికి ప్రయత్నం చేశారు (5:18; 8:59). అయితే అప్పుడు వారు అకస్మాత్తుగా వచ్చిన ఉద్రేకంలో అలా చేయబోయారు. ఇప్పుడైతే అలా చేసేందుకు సరైన విధానమేదోనని కుట్ర పన్నసాగారు. 11:54 యేసు ఇలా చేసినది భయంవల్ల కాదు. తన మరణ సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు (7:30). అది రాకముందు ఆయన చేయవలసిన పనులింకా ఉన్నాయి.

11:56 ఆ సమయంలో యేసుకు ఉన్న పేరుప్రఖ్యాతులకు ఇది సూచన. ఇస్రాయేల్‌ దేశమంతటినుంచీ పండుగకు వచ్చిన వారందరూ ఆయన్ను గురించే చర్చించుకుంటున్నారు.

12:1 పస్కా గురించి నోట్స్‌ నిర్ణమ 12వ అధ్యాయం; లేవీ 28:48. క్రీస్తు సిలువ మరణానికి ముందు వారంలో జరిగిన సంగతులు ఇక్కడ నుంచి ఆరంభమౌతున్నాయి. లోక పాపాల కోసం ఆయన చనిపోవలసిన సమయం వచ్చింది. దేవుడే ఆ సమయాన్నీ (ఈ పస్కా దినం), స్థలాన్నీ (జెరుసలం) నిర్ణయించాడు. యేసుప్రభువు ఆ పరమ తండ్రి చిత్తం ప్రకారం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉన్నాడు.

12:2 మత్తయి £26:6-138; మార్కు 14:19 పోల్చి చూడండి. మత్తయి, మార్కు శుభవార్తలో రాసి ఉన్న సంఘటనా ఇదీ వేరువేరని కొందరు పండితుల అభిప్రాయం.

12:4 ఈ మాట అన్నది యూదా అని మత్తయి, మార్కు రాయలేదు.

12:5 ఒక దేనారం సాధారణంగా ఒక పనివాడికి ఒకరోజు కూలీ (మత్తయి 20:2). స్వార్ధంకోసం గాక క్రీస్తుకోసం (ప్రేమతో చేసిన పనులను ఇతరులు అపార్థం చేసుకుని విమర్శించవచ్చని గమనించండి. డబ్బును కూడబెట్టడం, స్వార్థానికి వాడుకోవడం యూదాకు తెలుసు గానీ కేవలం తనలోని (ప్రేమ మూలంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా మరియ అంత ఖరీదైనదాన్ని క్రీస్తు పాదాలపై ఒలకబోయడం యూదాకు అర్థం కాలేదు.

12:6 యూదా ఒకసారి దుష్‌ప్రేరణకు లొంగి, ఏదో దొంగిలించి తరువాత పశ్చాత్తాపపడి తన బలహీనతలను జయించిన రకం కాదు. దేవుని ప్రజలు దేవుని పనికోసం ఇచ్చిన డబ్బును అతడు కావాలని, అలవాటుగా తనకోసం తీసుకుంటూ వచ్చాడు. ఘనమైన, యోగ్యమైనవాటి కంటే, సత్యం లేక క్రీస్తు కంటే అతడికి డబ్బునే ఎక్కువ ప్రీతి. క్రీస్తును శత్రువులకు పట్టివ్వడంలో అతని ముఖ్యోద్దేశం డబ్బు (మత్తయి 26:14-16). అతణ్ణి పిశాచంగా చేసిన లక్షణాల్లో (యోహాను 6:70,71) డబ్బంటే అతనికి ఉన్న ప్రీతి ఒకటి. ఈ దురాశకు లోబడినవారికి ఏం సంభవించగలదో తెలిపే భయానకమైన ఒక ఉదాహరణ 7 కనుక యేసు “ఆమెను ఇలా చేయనివ్వండి. ఆమె ఈ అత్తరు ఉంచినది నా అంత్యక్రియలరోజు కోసమే. 8 బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు గానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అన్నాడు.

9 ఆయన అక్కడ ఉన్నాడని యూదులలో చాలామందికి తెలియవచ్చింది. వారు యేసునే కాదు, ఆయన చనిపోయిన వారిలోనుంచి లేపిన లాజరును కూడా చూద్దామని వచ్చారు. 10 లాజరు కారణంగా యూదులలో అనేకులు తమను విడిచి యేసుమీద నమ్మకం ఉంచినందుచేత 11 ప్రధాన యాజులు అతణ్ణి కూడా చంపాలని కుట్రపన్నారు.

12 మరుసటి రోజున యేసు జెరుసలం వస్తున్నాడని పండుగకు వచ్చిన మహా సమూహానికి వినవచ్చింది. 13 వారు ఖర్జూర మట్టలు చేతపట్టుకొని ఆయనకు ఎదురు వెళ్ళి “జయం! (ప్రభువు పేరట వచ్చేవాడు, ఇస్రాయేల్‌ ప్రజల రాజు ధన్యజీవి!” అని కేకలు వేయడం ఆరంభించారు. 14 ఇలా ప్రాసి ఉంది: సీయోను కుమారీ, భయపడకు! మీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని ఉండి వస్తున్నాడు.

15 దీనిప్రకారమే యేసు ఒక గాడిదపిల్లను కనుక్కొని దానిమీద కూర్చున్నాడు. 16 ఈ విషయాలు మొట్టమొదట ఆయన శిష్యులకు అర్ధం కాలేదు గాని యేసు మహిమాస్థితి

పొందిన తరువాత అవి ఆయనను గురించి వ్రాసి ఉన్నవనీ వారు ఆయనపట్ల అలా జరిగించారనీ శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.

17 ఆయన లాజరును చనిపోయినవారిలో నుంచి లేపి సమాధినుంచి పిలిచినప్పుడు ఆయనతో ఉన్న ప్రజలు ఆయనను గురించిన సాక్ష్యం చెపుతూ వచ్చారు. 18 ఆయన ఈ సూచకమైన అద్భుతం చేశాడని వినడంచేత ఆ ప్రజలు ఆయనకు ఎదురు వెళ్ళారు.

19 అందుచేత పరిసయ్యులు తమలో తాము ఇలా చెప్పుకొన్నారు: “చూశారా, మీరు చేసినదానిలో నెగ్గినది ఏమీ లేదు. ఇదిగో, లోకమంతా ఆయన వెంట వెళ్ళింది.”

20 పండుగలో ఆరాధించడానికి వచ్చినవారిలో గ్రీసు దేశస్థులు కొందరు ఉన్నారు. 21 వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు (అతడు గలలీలోని బేత్‌సయిదా నివాసి). వారు “అయ్యా, యేసును చూడాలని మా ఆశి అని అతణ్ణి కోరారు. 22 ఫిలిప్పు వచ్చి అంద్రెయకు చెప్పాడు. అంద్రెయ, ఫిలిప్పు యేసుకు చెప్పారు.

£28 యేసు వారికిలా సమాధానం చెప్పాడు:

“మానవ పుత్రుడు మహిమాస్థితి పొందే గడియ వచ్చింది. 24 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గోధుమ గింజ భూమిలో

యూదా (1 తిమోతి 6:5,9,10 చూడండి). క్రీస్తు సంఘంలోపలా బయటా కూడా ధన లాభం కోసం తమ జీవితాలను పాడు చేసుకుని, దేవుణ్ణి అగౌరవపరచి, తమ ఆత్మలను నాశనానికి గురి చేసుకున్న అనేకమందిలో యూదా ఒకడు. క్రైస్తవ సేవలో ఉన్నవారిలో కూడా చాలామందిని డబ్బు విషయంలో నమ్మడానికి వీలు లేదు. ఎంత విచారం! యూదాలాగా వీరు కూడా తాము దొంగలమని రుజువు చేసుకుంటారు. అయితే ఇతర శిష్యులు యూదాను ఎలా ఎంచారో చూడండి. ఆతణ్ణి నమ్మి తమ గుంపుకు కోశాధికారిగా పెట్టుకున్నారు. ఈ వచనంలో యూదా కపటాన్ని కూడా గమనించండి. పేదలంటే అతనికేమీ శద్ధ లేదు గానీ ఉన్నట్టు నటిస్తున్నాడు. అతని ఉద్దేశమేమిటంటే 'పేదలకియ్యవలసిన డబ్బు భద్రం చేయమని తన చేతికే ఇస్తారు. అందులో కొంత తన సొంతానికి వాడుకోవచ్చు అని. డబ్బు వాసన తగిలింది, అంతే! దేవుని కుమారుడు, ఆయన ఆశ్చర్యకరమైన ఉపదేశాలు, అద్భుత క్రియలు, ఆయన ఇస్తున్న శాశ్వత జీవం ఇవన్నీ యూదాకు వట్టివి, తృణప్రాయమయ్యాయి. ఇంకా ఇంకా డబ్బు సంపాదించే మార్గంగా తప్ప వేరే ఉద్దేశంతో పైవాటిని ఎన్నడూ చూడలేదు యూదా. ఈ విషయం గురించి యేసుప్రభువు చేసిన ఉపదేశాలను పూర్తిగా పెడచెవిన బెట్టాడు (మత్తయి 6:19-21,24; లూకా 6:20,24; 12:20,21,33). మనం కూడా అలానే వాటిని నిర్లక్ష్యం చేస్తే యూదాలాగా అయిపోగలం. అబద్దాలు, మోసం, దొంగతనం ఇలాంటివన్నీ చేయడంకన్నా పేదవారుగా ఉండడం ఎంతో మేలు - సామెత 19:22.

12:7,8 మత్తయి 26:10-18.

12:10,11 ఈ అవిశ్వాసుల స్వభావం (మొత్తంగా అవిశ్వాసులందరిదీ) ఇక్కడ మరోసారి బయట పడుతున్నది. యేసు లాజరును సజీవంగా లేపిన సంగతిని వారు కాదనలేకపోయారు. అందుకు బలమైన స్పష్టమైన రుజువు ఉంది. కానీ ఈ రుజువు చూపించిన దిశగా వెళ్ళవలసింది పోయి ఆ రుజువునే రూపుమాపాలని నిర్ణయించుకున్నాడు. యిర్మియా 36:1-26 పోల్చి చూడండి.

12:12-15 మత్తయి 21:4-9; మార్కు 11:9,10; లూకా 19:37,38. నాలుగు శుభవార్తల్లోనూ ఆ జనసమూహం అన్నమాటలు వేరువేరుగా రాసి ఉన్నాయి. వీటిల్లో ఏవీ సరైనవి? అన్నీ సరైనవే. ఏ ఒక్క శుభవార్తలో జనసమూహం అన్న మాటలన్నీ రాసిలేదు. ప్రతి ఒక్కటీ ఆ గుంపులు అన్న మాటల్లో కొన్ని రాసి ఉన్నాయి. 19:19 పోల్చి చూడండి. మార్కు 4:1-20 గురించిన నోట్స్‌ చూడండి.

12:14 మత్తయి 21:1-3.

12:16 యేసు మరణం, పునర్జీవితం తరువాత (“మహిమాస్థితి పొందిన తరువాత”) శిష్యులు చాలావరకు అర్థం చేసుకున్నారు. లూకా 24:45 పోల్చి చూడండి.

12:18 “సూచన” - 2:11.

12:19 ఈ సంఘటనతో వారు భయపడుతూ వచ్చినదే నిజమైనట్టు అనిపించింది (11:47,48).

12:20 పస్కా యూదుల పండుగ, గ్రీకులు (ఇతర దేశస్థులెవరూ కూడా) యూద మతంలోకి మారితే తప్ప యూద పండుగల్లో ఏవిధంగానైనా పాల్గొనే అవకాశం ఉండదు. (గ్రీకుల్లో ఇలాంటివారు ఉన్నారని అపొ కా 17:4 వంటి వచనాల ద్వారా తెలుస్తున్నది.

12:21 ముందు కాలంలో ఈ విధంగా ఆశించబోయే అనేకమంది (గ్రీకులు, ఇతర జాతీయులందరిలోకి ఈ గుంపు మొదటివారు. వారు క్రీస్తులో నమ్మకం పెట్టుకుంటే వారి కోరిక నెరవేరుతుంది (ప్రకటన 7:9; 22:4).

12:22 ఇలాంటి కోరిక గురించి నిర్ణయం తీసుకోవాలంటే సాటి శిష్యుడు మరొకణ్ణి సంప్రదించడం అవసరమని ఫిలిఫ్పు అనుకున్నాడు. ఈ (గ్రీకుల కోరిక తీరిందో లేదో రాసి లేదు. కానీ యేసు ఈ సందర్భాన్ని తన మరణం గురించి మాట్లాడేందుకు వాడుకున్నాడు. (గ్రీకులు గానీ వేరెవరైనా గానీ పరలోకంలో స్థలం సంపాదించుకోవాలన్న9ా దేవుణ్ణి చూడాలన్నా ఇది ముందుగా నెరవేరవలసి ఉందని ఆయనకు తెలుసు.

12:28 వ 16; 17:1,5 చూడండి.

12:24 “ఖచ్చితంగా” - 151.

పడి చావకపోతే అది ఒంటిరిగానే ఉండిపోతుంది. అది చస్తే సమృద్ధిగా ఫలిస్తుంది. 25 తన ప్రాణం అంటే ప్రీతి ఉన్నవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న తన (ప్రాణం అంటే ద్వేషం ఉన్నవాడు దానిని శాశ్వత జీవంకోసం సంరక్షిస్తాడు.

26 “ఎవరైనా నాకు సేవ చేస్తే నన్ను అనుసరిస్తూ ఉండాలి. నేనెక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటారు. ఎవరైనా నాకు సేవ చేస్తే అతణ్ణి నా తండ్రి ఘనపరుస్తాడు. 27 ఇప్పుడు నా ప్రాణానికి ఆందోళనగా ఉంది. నేనేమి అనాలి? తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు అనాలా? కానీ,

“అది చస్తే. . .ఫలిస్తుంది” - ఇది మనం చల్లే విత్తనాల విషయంలోనూ నిజమే, లోకంలో ఉన్న మనుషులపట్ల దేవుడు అనుసరించే విధానంలోనూ నిజమే, యేసుప్రభువు విషయంలోనూ నిజమే. ఆయన ఇక్కడ తన మరణం గురించి, దానిద్వారా కలిగే ఫలితాల గురించి మాట్లాడుతున్నాడన్నది నిస్సందేహం. మనుషుల కోసం చనిపోయేందుకు ఆయన సమ్మతించకపోతే ఎవరికీ శాశ్వత జీవం అనేది ఉండేది కాదు. అలాంటప్పుడు యేసుప్రభువు ఒక్కడే మిగిలిపోయి ఉండేవాడు. ఆయన పోలికలో తయారైన అనేకమంది “సహోదరులు” ఆయనకు లభించేవారు కాదు (రోమ్‌ 8:29; హీబ్రూ 2£:10-15). ప్రపంచంలో దేవుని సేవకులెవరికైనా కూడా వర్తించే నియమం ఇది. “నేను” అనేది మరణించకపోతే నిజమైన ఫలితం, ఇతరులకు ఆధ్యాత్మిక జీవం కలగవు. £ కొరింతు 4:8-12£2 పోల్చి చూడండి.

12:25 (ప్రభువు ఇదే సత్యాన్ని కొద్దిగా వేరే మాటల్లో అనేక సందర్భాల్లో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఇది ఆయన చెప్పిన అతి ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒకటి. దీన్ని నిర్లక్ష్యం చెయ్యడం మనకే హానికరం. మత్తయి 10:39; 16:25; మార్కు 8:35; లూకా 9:24; 17:38. ఇక్కడ యోహాను శుభవార్తలో ఆయన “ద్వేషం” అనే మాట వాడడం ద్వారా దీన్ని మరింత నొక్కి చెప్తున్నాడు. లూకా 14:26 పోల్చి చూడండి. అంతేగాక “శాశ్వత జీవం” అనేమాట వాడడం ద్వారా నిజంగా మనం క్షణికమైన ఈ లోకాన్నో దేవుని సన్నిధిలో అనంత జీవితాన్నో ఎంచుకోవలసి ఉందని స్పష్టం చేశాడు. ఈ లోకమా, రాబోయే లోకమా మనం

దేనికి విలువ ఇస్తామో, దేనికోసం ప్రతుకుతామో నిర్ణయించుకోవాలి. 12:26 10:27. తన సొంత విషయాన్ని తన సొంత

విధానంలో చేసేవారెవరూ క్రీస్తును సేవించడం లేదు. క్రీస్తును అనుసరించేవారు ఈ లోకంలో ఆయనెక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆయన వారి కాపరి. వారెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు. ఇలా చెయ్యడంలో పరీక్షలు, ప్రమాదాలు, అపాయాలు, బాధలు, క్రీస్తుకోసం చనిపోవడం సంభవించినా దానంతటిలో ఆయన వారితో, వారు ఆయనతో ఉంటారు. ఆయన్ను అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా అనంత కాలం ఆయనతో ఉంటారు. వారి గురించి ఆయన చేసిన ప్రార్థన ఇదే (17:24) గనక వారికి చేకూరబోయేది ఇదే.

"క్రీస్తు సేవకులకు ఈ లోకంలో ఎంతో అన్యాయం, హింస, అవమానం, అప్రతిష్ట ఎదురు కావచ్చు. వారి ప్రభువును చేసినట్టు వారిని కూడా మనుషులు తృణీకరించి నిరాకరించ వచ్చు. వారికి కలగవలసిన గౌరవాలు ముందున్నాయి. శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తు సేవకులను హెచ్చించి, మెచ్చుకుని, గౌరవించి, బహుమతులిస్తాడు (5:44; మత్తయి £5:21; రోమ్‌ £:6-10; 8:18; హీబ్రూ 6:10; 1 పేతురు

నేను ఈ గడియకు వచ్చినది ఇందుకే. £28 తండ్రీ, నీ పేరుకు మహిమ చేకూర్చుకో!”

అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నేను దానికి మహిమ చేకూర్చుకొన్నాను, మళ్ళీ చేకూర్చుకొంటాను.”

29 అక్కడ నిలుచుండి అది విన్న జనం “ఉరిమింది” అన్నారు. ఇతరులు “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.

80 అందుకు యేసు “ఈ స్వరం వచ్చినది నాకోసం కాదు గాని మీకోసమే. 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది.

5:1,4; ప్రకటన 22:12). వారికిక్కడ జరిగిన నష్టమేదైనా ఉంటే దానంతటికీ ఆయన పుష్కలంగా పరిహారం చెల్లిస్తాడు. అందువల్ల ఏ గౌరవాన్ని మనం ఆశించాలి, ఎవరి మెప్పును కోరాలి - మనుషులవల్ల కలిగేదాన్నా లేక దేవునినుంచి వచ్చేదాన్నా అని ఎన్నుకోవాలి.

12:27 “ఘడియ” - అంటే ఆయన బాధలు, మరణం కలిగే సమయం. లోక పాపాలకు బలిగా, మనుషుల దోషాలను భరిస్తూ, వాటికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాన్ని అనుభవించాలన్న ఆలోచన క్రీస్తుకు మనోవేదనలు కలిగించింది. మత్తయి 2£26:37,38; లూకా 22:42-44 పోల్చి చూడండి. అయినా అది దేవుని సంకల్పం అయితే తప్ప, దానినుంచి తప్పించుకోవాలని మాత్రం ఆయన ప్రార్ధన చేసేవాడు కాదు. అది దేవుని సంకల్పం కాదని ఆయనకు తెలుసు.

12:28 కొన్ని రోజుల తరువాత గెత్‌సేమనే తోటలో ఆయన ప్రార్ధించినట్టుగానే ఆయన కోరినదల్లా తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలనే, తనకు కాదు; తండ్రి సంకల్పం నెరవేరాలనే, తనది కాదు. తండ్రికి మహిమ కలిగేలా తాను సిలువ బాధలు భరించడానికి ఆయన సిద్ధమే. ఆయన్ను అనుసరించేవారంతా ఇలా ప్రార్ధించడం నేర్చుకోవాలి. మత్తయి 6:9,10 చూడండి. శుభవార్త గ్రంథాల్లో ఈ విధంగా పైనుంచి దేవుడు మాట్లాడ్డం ఇది మూడో సారి (మత్తయి 3:17; 17:5). పాత ఒడంబడిక (గ్రంథంలో వర్ణించిన సంభవాల మూలంగా, యేసుప్రభువు జీవితమూ, పరిచర్యా అంతటిద్వారా దేవుడు తన పేరును మహిమపరచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు మరణం, పునర్జీవితం ద్వారా ఆయన దాన్ని మహిమపరచుకుంటాడు. 12:29 నిర్ణమ 19:16-19; కీర్తన 29:3.

“దేవదూత” - ఆది 16:7. ఈ మాటలు కొందరికి అర్థం

అయినట్టున్నాయి. కొందరికి అర్థం కాలేదు. కానీ ఏదో అసాధారణమైనది జరిగిందని మాత్రం అందరికీ తెలిసింది. 12:30 క్రీస్తుకు అంత బాగా తెలిసిన విషయాన్ని వేరొకరు మళ్ళీ ఆయనకు చెప్పనవసరం లేదు. మనుషులకు మాత్రం చాలా గట్టిగా నొక్కి చెప్పాలి. 12:31 దోషులైన మనుషుల స్థానంలో లోక పాపాలను మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు చనిపోబోతున్నాడు (1:29). అంటే మానవజాతి అంతా మరణానికి పాత్రులని అర్ధం. సిలువ మనుషుల పాపాలకు తీర్పు చెప్పినట్టుంది. దేవుడు లోకులతో ఇలా అంటున్నాడన్నమాట: “నీ పాపాల కారణంగా నువ్వు మరణం పొందవలసినవాడివి. నీ స్థానంలో నా కుమారుని మరణం ద్వారా నేను ఈ తీర్చును ప్రకటిస్తున్నాను. నా కుమారుణ్ణి సిలువ వేయడంద్వారా నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటావు. ఆ విధంగా నా నిర్ణయం సరైనదేనని రుజువు చేసుకుంటావు” (3:18,19).

“లోక పాలకుణ్ణి” - అంటే సైతానును 14:30; 16:11; ఇప్పుడు లోక పాలకుణ్ణి బయటికి త్రోసివేయడం జరుగుతుంది. 3£2 నన్ను భూమినుంచి పైకెత్తడం జరిగితే నేను నావైపుకు అన్ని జనాలనూ ఆకర్షించుకొంటాను” అన్నాడు. 33 ఆయన ఎలాంటి మరణానికి గురి కాబోతున్చాడో సూచించడానికి ఆ మాట చెప్పాడు.

384 ప్రజలు ఆయనకు జవాబిస్తూ “అభిషిక్తుడు ఎప్పటికీ మాతోనే ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. 'మానవపుత్రుణ్ణి పైకెత్తడం జరగాలని మీరు అంటున్చారేం? అసలు ఈ మానవ పుత్రుడు ఎవరు?” అన్నారు.

35 అందుచేత యేసు వారితో ఇలా అన్చాడు: “మీ మధ్య వెలుగు ఉండేది ఇంకా కొంత కాలమే. చీకటి మిమ్ములను కమ్మకుండా వెలుగు మీ మధ్య ఉండగానే దానిలో నడుచుకోండి. చీకటిలో నడుస్తున్నవానికి తాను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో తనకు తెలియదు. 36 మీ మధ్య వెలుగు ఉండగానే మీరు వెలుగు సంతానం అయ్యేలా ఈ వెలుగును నమ్మండి.” ఈ సంగతులు చెప్పి యేసు వెళ్ళి వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొన్నాడు.

37 ఆయన వారి ఎదుట సూచనకోసమైన అద్భుతాలు

ఇన్ని చేసినా వారు ఆయనమీద నమ్మకం ఉంచలేదు. 88 యెషయాప్రవక్త చెప్పిన ఈ వాక్కు నెరవేరేలా అది జరిగింది: “ప్రభూ, మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు? (ప్రభు హస్తం ఎవరికి వెల్లడి అయింది?” 39 ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే, యెషయా ఇంకా ఇలా చెప్పాడు: 40 వారు తమ కండ్లతో చూడకుండా, తమ హృదయాలతో అర్థం చేసుకోకుండా, నావైపు తిరిగి నావల్ల బాగుపడకుండా ఆయన వారి కండ్లకు గుడ్డితనం కలిగించాడు, వారి హృదయాలను కఠిన పరిచాడు. 41 యెషయా యేసు మహిమ చూచి ఆయన విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నాడు.

42 అయినా అధికారులలో కూడా అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు గాని పరిసయ్యుల కారణంగా అది ఒప్పుకోలేదు. తమను సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందేమో అని భయవడ్డారు. 48 దేవుని మెప్పుకంటే మనుషుల మెప్పు వారికి ఎక్కువ ప్రీతిపాత్రమైనదన్న మాట.

44 అప్పుడు యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నామీద నమ్మకం ఉంచేవాడు నామీద కాదు, నన్ను పంపినవాని మీద

2 కొరింతు 4:4; ఎఫెసు 2:2; 6:12 చూడండి. మనుషులకు చాలా ఇష్టమైన చీకటిలో (8:19), ఏకైక నిజ దేవుణ్ణి ఎరుగని పాపుల హృదయాల్లో వాడు రాజ్యమేలుతుంటాడు. సైతాను గురించి నోట్స్‌ 8:44; 1 దిన 21:1; మత్తయి 4:1-10.

“బయటికి త్రోసివేయడం” అంటే లోకంలో నుండి వెళ్ళగొట్టడమని కాదు యేసుప్రభువు ఉద్దేశం. ఎందుకంటే సైతాను ఇంకా నిక్షేపంగా ఈ లోకంలోనే ఉన్నాడు (1 పేతురు 5:8). క్రీస్తు మళ్ళీ వచ్చేవరకు వాణ్ణి లోకంలోనుంచి బయటికి వెళ్ళగొట్టడం జరగదు (ప్రకటన 20:13). కాబట్టి ఇక్కడ దీని అర్ధం ఇది కావచ్చు - సిలువ ద్వారా యేసు క్రీస్తు మనుషులకు విముక్తిని సాధిస్తాడు. దీని ఫలితంగా సైతాను చివరికి పూర్తిగా ఓడిపోతాడు. అన్ని దేశాల్లోనూ ఇంతకుముందు సైతాను పరిపాలన కింద ఉన్న మనుషులు దేవునివైపు తిరుగుతారు, చివరికి లోకమంతా దేవుని పరిపాలనకు లోబడి, ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది (యెషయా 11 అధ్యాయం; మొ!!). దీనంతటికీ సిలువ ఆధారం. తాత్కాలికంగా సైతాను విజయంగా అనిపించిన సిలువ వాడి సమూల నాశనానికి దారి తీసేది. 12:32 3:14 8:28 పోల్చి చూడండి.

“పైకెత్తడం” - సిలువను సూచించే మాట. మనుషులందరినీ తనవైపుకు ఆకర్షించుకోవడం అంటే మనుషులంతా పాపవిముక్తి పొందుతారని కాదు (8:24; మత్తయి /7:138,14; 25:46; ప్రకటన £21:8 చూడండి) యేసు యూద జాతినుంచి మాత్రమే గాక అన్ని జాతులు, జనాలు, వంశాలనుంచి మనుషులను తనవైపుకు ఆకర్షించుకుంటాడని అర్థం (ప్రకటన 7:9).

12:38 మొదటినుంచీ కూడా తాను సిలువపై మరణిస్తానని ఆయనకు తెలుసు.

12:34 వారు బహుశా కీర్తన 89:86; 110:4; యెషయా 9/7; దానియేలు ?7:14వంటి వచనాల గురించి అడుగుతున్నారు. యేసు తనను తాను తరచుగా “మానవ పుత్రుడు” అంటున్చాడని వారికి తెలుసు. ఈ పేరుకు అర్థమేమిటో అనీ పాత ఒడంబడిక (గ్రంథంలో చెప్పిన అభిషిక్తుడే ఈ మానవ పుత్రుడా అనీ సందేహించారు. “మానవ పుత్రుడు” గురించి నోట్‌ మత్తయి 8:20.

12:35 “వెలుగు” - అంటే తానే అని (ప్రభువు ఉద్దేశం. వ 46; 8:12; 9:5. అంతటా చాలామంది ప్రజల విచారకరమైన

పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది - వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.

12:36 అంటే క్రీస్తుపై నమ్మకం ఉంచి “వెలుగు” అయి ఉన్న దేవుని పిల్లలుగా మారాలని దీని అర్థం (1 యోహాను 1:5). వెలుగు అయి ఉన్న క్రీస్తును స్వీకరించి ఆయన పేరుమీద నమ్మకం పెట్టుకోవడం ద్వారా మాత్రమే ఎవరైనా దేవుని పిల్లలు కాగలరు (1:12,18). “వెలుగు సంతానం” అనేమాట వెలుగు లక్షణం ఉన్నవారినీ, వెలుగులోకి వచ్చి వెలుగును అమూల్యమైనదిగా భావించేవారనీ, వెలుగును ఇతరులకు అందించేవారినీ సూచిస్తున్నది. మత్తయి 5:14-16; ఎఫెసు 5:8; 1 తెస్స 5:5 పోల్చి చూడండి.

12:37-40 శుభవార్త పుస్తకాలన్నిటిలో అనేకమంది యూదుల అపనమ్మకం కనబడుతున్నది. క్రీస్తు వారికి చూపిన సాక్ష్యాధారాలూ రుజువులూ ఏవీ వారిని నమ్మించలేకపోయాయి. వారి అపనమ్మకానికి అర్థం లేదు. ఇది చాలా వింతగా విపరీతంగా ఉంది. అయితే ఇక్కడ దానికొక కారణం కనిపిస్తున్నది. వారు పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కులను నెరవేరుస్తున్నారు. యెషయా 58:1; 6:10 చూడండి. వారి అపనమ్మకం వారి పాపాలకు దేవుని తీర్చు. ఆ జాతి ఇంతకుముందు ఎప్పుడో అపనమ్మకం మార్గాన్ని ఎన్నుకున్చది. దేవుడిప్పుడు వారిని ఆ మార్గంలో విడిచిపెట్టాడు. మత్తయి 18:14,15 నోట్‌ చూడండి.

12:41 యెషయా 86:1-8లో తాను ప్రభువును (హీబ్రూలో “యెహోవా”) చూశాననీ, భూమి అంతా ప్రభువు గయెహావా”) మహిమతో నిండి ఉందనీ యెషయా రాశాడు. ఇక్కడ యెషయా యేసు మహిమను చూశాడని యోహాను రాస్తున్నాడు. అంటే యేసు యెహోవాదేవుని అవతారం అన్నమాట. 8:24,58; 10:11; లూకా 2:11 మొ! కూడా చూడండి.

12:42,43 వీరి నమ్మకం నిజమైనదేనా? బహుశా నిజ విశ్వాసం అంకురం వారిలో ఉందేమో. అది తరువాత మొలకెత్తి వారిని మరింత ధైర్యవంతులుగా చేసిందేమో. అయితే నమ్మకం ఉంచామని చెప్పుకుంటూ భయానికి లొంగిపోతూ, మనుషుల మెప్పుదల కోసం ఆశించేవారిని చూచి వారి గురించి సందేహించకుండా ఉండలేము.

12:44,45 తండ్రి అయిన దేవునితో తన ఐక్యతను ఇంతకన్న నమ్మకం ఉంచుతున్నాడు. 45 నన్ను చూచేవాడు నన్ను పంపినవాణ్ణి చూస్తున్నాడు. 46 నామీద నమ్మకం ఉంచేవారు చీకటిలో ఉండిపోకుండా నేను వెలుగుగా లోకానికి వచ్చాను. 47 నా మాటలు ఎవరైనా విని నమ్మకపోతే నేను వానికి తీర్పు చేయడం లేదు. లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు గాని లోకానికి విముక్తి కలిగించడానికే వచ్చాను. 48 నా మాటలు అంగీకరించక నన్ను నిరాకరించేవానికి తీర్పు తీర్చేది ఒకటి ఉంటుంది. చివరి రోజున వారికి తీర్పు తీర్చేది నేను చెప్పిన వాక్కే 49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడలేదు. నేనేమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నన్ను ఆదేశించాడు. 50 ఆయన ఆదేశం శాశ్వత జీవమని నాకు తెలుసు. అందుచేత నేను ఏ సంగతులు చెప్పినా తండ్రి నాకు చెప్పినట్టే చెపుతున్నాను.”

3 అప్పుడు, పస్కాపండుగకు ముందు ఈ లోకాన్ని క్షే విడిచి తండ్రిదగ్గరకు వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని యేసుకు తెలుసు. లోకంలో ఉన్న తన సొంతవారిని ఆయన ప్రేమిస్తూ వారిని అంతంవరకూ (ప్రేమతో చూశాడు. 2 ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వాలనే ఉద్దేశం అపనింద పిశాచం ఇంతకుముందే సీమోను కొడుకైన ఇస్కరియోతు

స్పష్టంగా యేసు వెల్లడించగలడా? 10:30; 14:9 పోల్చి చూడండి. యేసును నమ్మడమంటే దేవుణ్ణి నమ్మడమే. ఆయన్ను చూస్తే దేవుణ్ణి చూచినట్టే. 12:46 వ 35,86; 8:12; 9:5. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మత్తయి 5:17 నోట్‌ చూడండి. 12:47 8:17. 12:48 చివరి రోజు అంటే దేవుడు నియమించిన తీర్పు రోజు. మత్తయి 10:15 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. ఆ సమయంలో తెరిచే పుస్తకాల్లో (ప్రకటన 20:12) ఒకదానిలో క్రీస్తు చెప్పిన మాటలు ఉంటాయన్నమాట. అంటే ఈ నాలుగు శుభవార్తల్లో మనం చూస్తున్న మాటలు, వాటి (ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనమీదికి మనమే శిక్ష తెచ్చిపెట్టుకున్న వారమౌతాం. 77:21-23 పోల్చి చూడండి. 12:49 5:19; 4:84 పోల్చి చూడండి. యేసుప్రభువు ఉపదేశాలన్నీ దేవుడు నియమించిన ఖచ్చితమైన మాటల్లో, భాష తీరులో, వ్యక్తికరణలో ఉన్నాయి. వాటిని ఎదిరించబూనుకునే వాడు వాటిని ఇచ్చిన ఏకైక నిజ దేవునితోనే పోరాడుతున్నాడన్న మాట. 12:50 “జీవానికి” - ఈ శుభవార్త అంతటా కొనసాగే ముఖ్యాంశం జీవం (1:4; 3:16,36; 4:14; 5:24; 6:47; 10:10). తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన మాటలనే అక్షరాలా మాట్లాడేందుకు క్రీస్తు జాగ్రత్త వహించాడు. ఆ మాటల్లో వెలిబుచ్చిన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీస్తు బహిరంగ పరిచర్యలో ఆయన పలికిన ఆఖరు పలుకులివి. ఆయన చెప్పిన మాటలన్నిటిపై ఇవి దేవుని అధికార ముద్ర వేస్తున్నాయి. దేవుని వాక్కు ఆయనే (1:1), ఆయన దేవుని వాక్కులనే పలికాడు. 18:1 “పస్కా” - నిర్గమ 12వ అధ్యాయం; లేవీ £28:4-8. చివరికి క్రీస్తు వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. 7:30 చూడండి.

“టేమించి” - ఆయన జీవితం, పరిచర్య అంతా ఆయన [ప్రేమ పప్రదర్శనమే. ఇప్పుడాయన తన (ప్రజలకు తన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు చూపించబోతున్నాడు (ఎఫెసు 8:18).

యూదా హృదయంలో పుట్టించాడు. అప్పటికి సాయంకాల భోజనం చేయడం ముగిసింది. 8 వరమ తండ్రి సమస్తమూ తన చేతికి అప్పగించాడనీ తాను దేవుని దగ్గరనుంచి వచ్చి దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతాననీ యేసుకు తెలినీకూడా 4 ఆయన భోజనపంక్తిలోనుంచి లేచి తన పైవస్తాలు విడిచి అవతల పెట్టి తువాలు తీసుకొని దానిని నడుముకు చుట్టుకొన్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ నడుముకు చుట్టుకొన్న తువాలుతో తుడవసాగాడు.

6 అలాగే ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అతడు ఆయనతో “ప్రభూ! నా పాదాలు కడుగుతావా?” అన్నాడు.

7 అందుకు యేసు జవాబిస్తూ “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కావడం లేదు గాని తరువాత నీకు తెలిసిపోతుంది” అని అతనితో చెప్పాడు.

8 పేతురు “నీవు నా పాదాలు ఎన్నడూ కడగవు!” అని ఆయనతో అన్నాడు.

యేసు “నేను నిన్ను కడుగకపోతే నీకు నాతో భాగం లేదు” అని అతనికి బదులు చెప్పాడు.

9 సీమోను పేతురు “ప్రభూ! నా పాదాలు మాత్రమే గాక

13:2 “అపనింద పిశాచం” - మత్తయి 41.

“యూదా” - 6:70,71; 12:6; మత్తయి 26:14-16. 18:3 “తన చేతికి అప్పగించాడని” - 38:85; 10:18; 17:2; మత్తయి 28:18 పోల్చి చూడండి.

18:4,5 తాను కుమారుడైన దేవుణ్ణని, తండ్రి అయిన దేవుని దగ్గరనుంచి వచ్చానని, అక్కడికే తిరిగి వెళ్ళనున్నానని ఆయనకు తెలుసు. అయినా ఇక్కడ ఆయన అల్ప స్థితిలోని దాసుడు చేసే పనికి సమకట్టాడు. ఇది ఆయన అణకువను వెల్లడి చేస్తున్నది. సేవలు పొందడానికి మారుగా సేవించడానికి ఆయన మనసును ఇది తెలియజేస్తున్నది. మత్తయి 11:29; 20:25-28; ఫిలిప్పీ 2:68 చూడండి. ఈ రోజుల్లో సేవకులం, శిష్యులం అని చెప్పుకునే చాలామందికి ఆయనకూ ఎంత తేడా!

18:6-8 క్రీస్తు అనీ సజీవుడైన దేవుని కుమారుడనీ తనకు తెలిసిన వ్యక్తి (మత్తయి 16:16) సాధారణ సేవకుడు చేసే పని చేయడం తగినపని కాదని పేతురుకు అనిపించింది. ఆ పనిలోని అర్థాన్ని అతడు తరువాత గ్రహిస్తాడని యేసు అతనితో చెప్పినప్పటికీ అలా జరగనివ్వడానికి పేతురు అంగీకరించలేదు. పేతురు మాటల్లో వినయం ఉట్టిపడుతున్నట్టు అనిపిస్తున్నది గానీ వాటిలో కొంత గర్వం కూడా వెల్లడి అవుతున్నది. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో యేసుప్రభువు కంటే తనకు బాగా తెలుసని

పేతురు అనుకున్నాడా? (మత్తయి 16:22; యెషయా 40:18,14 కూడా చూడండి). దేవుని కుమారుడు తనకు చేయబోతున్నదాన్ని నిరాకరించేందుకు మానవుడు

ఎంతటివాడు? ఆయన మన విషయంలో చేసే పనులనేకం ఇప్పుడు మనకు అర్ధం కాకపోవచ్చు (రోమ్‌ 11:38,34). కానీ ఆయన ఇష్టప్రకారం మనం అణకువతో ఆయన్ను మనకు పరిచర్య చేయనివ్వాలి. ఒక దినాన ఆయన మనకు చేసేదంతా, మనకోసం, మనతో, మనలో చేసేదంతా మనకు అర్థం అవుతుంది.

“నీకు నాతో భాగం లేదు” అన్నమాటల్లో ఒక ఆత్మ సంబంధమైన అర్థం ఉంది. ఆయనతో శిష్యులకు సహవాసం కావాలంటే ఆయన వారి పాపాలను కడిగివేయడం తప్పనిసరి.

నా చేతులూ నా తల కూడా కడిగేయండి!” అని ఆయనతో అన్నాడు.

10 యేసు అతనితో ఇలా అన్నాడు: “స్పానం చేసినవాడు తన పాదాలు మాత్రమే కడగాలి. వాడు కేవలం శుద్ధుడు. మీరు శుద్ధులే గాని మీలో ప్రతి ఒక్కడూ తుద్ధుడు కాదు.”

11 తనను శత్రువులకు పట్టి ఇవ్వబోయే వాడెవడో ఆయనకు తెలుసు. కనుకనే “మీలో (ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు” అన్నాడు.

12 వారి పాదాలు కడిగి తన పైవస్రాలు వేసుకొని మళ్ళీ కూర్చున్న తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు: “నేను మీకు చేసినదాని భావం మీకు తెలుసా? 18 మీరు నన్ను గురువు, ప్రభువు అంటారు. మీరలా అనడం సరిగానే ఉంది - అలాగే ఉన్నాను. 14 (ప్రభువుగా గురువుగా ఉన్న నేను మీ పాదాలు కడిగితే మీరూ ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. 15 నేను మీకు చేసిన ప్రకారం మీరూ చేయాలని మీకు ఆదర్భాన్ని చూపాను. 16 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, దాసుడు తన యజమానిని మించినవాడు కాడు. పంపేవాని కంటే పంపబడ్డవాడు మించినవాడు కాడు. 17 మీరు ఈ విషయాలు తెలుసుకొంటే వీటి (ప్రకారం చేస్తే మీరు ధన్యజీవులు. 18 మీలో ప్రతి ఒక్కణ్ణి గురించి నేను చెప్పడం

లేదు. నేను ఎన్సుకొన్నవారు నాకు తెలుసు. అయితే ఈ విధంగా లేఖనం నెరవేరాలి: రొట్టె నాతో తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు. 19 ఇది జరిగినప్పుడు నేనే “ఉన్నవాడును” అని మీరు నమ్మాలని ఇది జరగకముందే మీకు చెపుతున్నాను. £20 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నేను పంపేవారిని స్వీకరించేవాడు నన్నూ స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపినవాళణ్జీ స్వీకరిస్తున్నాడు.”

21 ఈ మాటలు చెప్పిన తరువాత యేసు తన ఆత్మలో ఆందోళన చెందాడు. “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అని సాక్ష్యం చెప్పాడు.

22 ఆయన ఎవళణ్టి గురించి చెప్పాడో అని అనుమానంతో శిష్యులు ఒకరివైపు ఒకరు చూచుకోసాగారు. 23 ఆయన శిష్యులలో ఒకడు - యేసు ట్రేమించినవాడు యేసు ఛాతీని ఆనుకొని ఉన్నాడు. 24 అతనికి సీమోను పేతురు సైగ చేసి ఆయన ఎవణ్ణ్టి గురించి చెప్పాడో అడగమని సూచించాడు. 25 అతడు యేసు ఛాతీని ఆనుకొని ఉండి ఆయనను ఇలా అడిగాడు: “ప్రభూ, అతడెవడు?”

26 అందుకు యేసు “ఎవరికి రొట్టె ముక్క ముంచి ఇస్తానో అతడే” అని జవాబిచ్చాడు.

ఆ ముక్క ముంచి సీమోను కొడుకైన ఇస్కరియోతు

1 యోహాను 1:7-9 చూడండి.

18:10 ఈ విశ్వాసులు మొదట క్రీస్తుపై నమ్మకం ఉంచి నప్పుడు వారి పాపాన్ని పూర్తిగా కడిగివేయడం జరిగింది. పౌలు దీన్ని “కొత్త జన్మ అనే స్నానం” అన్నాడు - తీతు 3:5; యోహాను 3:5 చూడండి. ఇది అనుభవించినవారు. మళ్ళీ మళ్ళీ దీన్ని పొందనక్కర లేదు. నిజానికి ఒకటికంటే ఎక్కువ సార్లు దీన్ని పొందడం అసాధ్యం. అయితే పాపంతో నిండిన ఈ లోకంలో వారి క్రైస్తవ నడతలో వారి ఆధ్యాత్మికమైన “పాదాలు” మురికి కావచ్చు. వారికి పాపం అంటుకోవచ్చు. దాన్ని కడుక్కోవలసిన అవసరం వస్తుంది (లూకా 11:4 కీర్తన 51:4; రోమ్‌ 7:18,19). ఇది ఎన్ని సార్లు అవసరమైతే అన్ని సార్లు క్రీస్తు చేస్తాడు (ఎఫెసు 5:25,26 పోల్చి చూడండి). వారిలో “ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు”, అంటే ఈ కొత్త జన్మ అనే స్నానాన్ని యూదా ఎన్నడూ అనుభవించి ఉండేవాడు కాదని యేసు ఉద్దేశం. అతడు ఇప్పటికీ హృదయంలో, మనస్సులో, ఆత్మలో మురికిగానే ఉన్నాడు.

18:11 2:24,25.

18:12 (ద్రోహి అయిన యూదా పాదాలతో సహా క్రీస్తు అందరి పాదాలూ కడిగాడు. శత్రువులతో ఎలా ప్రవర్తించాలో ఇది ఒక ఉదాహరణ. మత్తయి 5:43,44; రోమ్‌ 12:17-21 పోల్చి చూడండి. ప్రభువు అడిగిన ప్రశ్న తాను చేసిన పనిలోని ఆధ్యాత్మిక అంతరార్థం గురించినదే. కాళ్ళు కడగడం అనేదాన్ని అర్థం చేసుకున్నారా అని వారిని అడగవలసిన పని లేదు. 13:18 “నన్ను గురువు...” - అలాగైతే పేతురులాగా ఎవరూ ఆయనకు బుద్ధి చెప్పేందుకూ, ఏం చేయ్యాలో నేర్చేందుకు ప్రయత్నించకూడదు.

18:14 బాప్తిసం, ప్రభురాత్రి భోజన ఆచారాల్లాగా యేసు తన సంఘానికి మరో ఆచారాన్ని ఇక్కడ నియమిస్తున్నాడని ఈ నోట్స్‌ రచయిత నమ్మడం లేదు. సాధారణ జీవిత విషయాల్లో అక్షరాలా కాళ్ళు కడగడం గానీ మరి ఏ ఇతర సేవ గానీ వినయంతో ఇతరులకు చేయడానికి ప్రతి విశ్వాసీ సిద్ధంగా ఉండాలి. ఇలాంటి సేవ గురించి యేసు ఇక్కడ చెప్తున్నాడు. అంతే కాకుండా ఇతర

విశ్వాసులకు వారి అనుదిన క్రైస్తవ జీవితాల్లో అంటుకునే పాపాలను శుద్ధి కలగడానికి సహాయపడేందుకు ప్రవర్తించాలని కూడా ఈ మాటలు సూచించవచ్చు. అలాంటివారికి దేవుని వాక్కు ఉపదేశించడం ద్వారా (15:3), యేసుప్రభువు ద్వారా అలా శుద్ధి పొందేలా వారిని ప్రోత్సాహించడం ద్వారా (1 యోహాను 1:9) అలా చెయ్యవచ్చు.

13:15 అన్నిటిలో లాగానే ఇందులో కూడా క్రీస్తు మనకు ఆదర్శం - 1 పేతురు £2:21-23; 1 యోహాను 2:6. 13:16 మత్తయి 10:24,25.

18:17 క్రీస్తు చెప్పేది చెయ్యడం వల్ల మాత్రమే దేవునినుంచి కలిగే ఆశీర్వాదం ఒకటి ఉంది - లూకా 11:28. వినడం మాత్రమే చాలదు (యాకోబు 1:22,28). ధన్యత, దీవెనల

గురించి నోట్స్‌ ఆది 12:1-3; సంఖ్యా 6:22-27; కీర్తన 1:1; 119:1; మత్తయి 5:3-12. 13:18 6:70,71; కీర్తన 41:9. 13:19 “ఉన్నవాడను” - 8:24,28,58. క్రీస్తు కేవలం

దుర్మార్గుల కుతంత్రాలకు బలైపోలేదనీ, ఆయనకు జరగబోయేది తెలుసనీ, పరిస్థితులు ఆయన అదుపులోనే ఉన్నాయనీ తరువాతి కాలంలో శిష్యులకు అర్థం అయింది. అప్పుడు వారి నమ్మకం స్థిరపడి, బలపడి పెరిగింది.

13:20 మత్తయి 10:40; మార్కు 9:37; లూకా 9:48; 10:16. క్రీస్తు పంపేవారు ఆయన రాయబారులు, ఆయన ప్రతినిధులు (£ కొరింతు 5:20). వారిని స్వీకరించడమంటే వారిని పంపిన పరమ తండ్రిని, కుమారుణ్ణి స్వీకరించినట్టే. 13:21 11:38; 12:27. ఏం జరగబోతున్నదో ముందుగానే తెలిసినందువల్ల యేసు నిర్లక్ష్యంగా నిరుత్సాహంగా నిర్లిప్తంగా అయిపోలేదు.

18:22 యూదా తప్ప మిగతా వారంతా పూర్తిగా నిర్ణాంతపోయారు. వారిలో ఎవరూ కూడా యూదాను క్షణమాత్రమైనా సందేహించినట్టు లేదు.

18:28 ఇతడు బహుశా శిష్యుడైన యోహాను, ఈ శుభవార్త రచయిత. 19:26; 20:2; 21:7,20 కూడా చూడండి.

↑ Back to top

↑