యోహాను శుభవార్త – భాగము 5 (పుటలు 27–32)
ఆశ్చర్యపడ్డారు.
16 యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “నేను చేసే ఉపదేశం నాది కాదు గాని నన్ను పంపినవానిది. 17 దేవుని ఇష్టప్రకారం చేయడానికి ఎవరైనా ఇష్టపడితే ఈ ఉపదేశం ఆయనదో, లేక నా అంతట నేనే చెపుతున్నానో తెలుసుకొంటారు.
18 “తనంతట తానే మాట్లాడేవాడు సొంత గౌరవం చేకూరాలని చూస్తూ ఉంటాడు, గాని తనను పంపినవానికే గౌరవం చేకూరాలని చూచేవాడు సత్యవంతుడు. ఆయనలో అన్యాయం ఏమీ లేదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు గదా. అయినా మీలో ఎవరూ ధర్మశాస్త్రం ఆచరణలో పెట్టడం లేదు. మీరెందుకు నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు?”
20 “దయ్యం పట్టినవాడివి నీవు. నిన్ను చంపడానికి ఎవరు చూస్తున్నారు?” అని ఆ ప్రజలు జవాబిచ్చారు. 21 యేసు వారికి ఇలా బదులు చెప్పాడు: “నేను ఒక క్రియ చేసినందుకు
మీరంతా ఆశ్చర్యపడతూ ఉన్నారు. £22£2 మోషే మీకు సునృతి అనే సంస్కారం నియమించాడు. అది మోషే నుంచి వచ్చినది కాదు గాని పూర్వికుల ద్వారా కలిగినది. మీరు విశ్రాంతి దినాన ఒక మనిషికి సున్నతి జరిగిస్తారు. 28 మోషే ధర్మశాస్త్రం మీరకూడదని విశ్రాంతి దినాన ఒక మనిషి సునృతి పొందితే విశ్రాంతి దినాన నేను ఒక మనిషిని పూర్తిగా బాగు చేసినందుకు మీరు నా మీద కోపపడుతున్నారేమిటి? 24 బయటికి కనిపించేదాన్ని బట్టి నిర్ణయానికి రాకండి. న్యాయ సమ్మతంగా నిర్ణయం చేసుకోండి.”
£25 అప్పుడు జెరుసలం వారిలో కొందరు ఇలా చెప్పుకొన్నారు: “వాళ్ళు చంపాలని చూస్తున్నవాడు ఈయనే గదా! 26 ఇడుగో! ఆయన బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు గాని వాళ్ళు ఆయనను ఏమీ అనరు! ఈయన నిజంగా అభిషిక్తుడు అని అధికారులకు తెలిసిపోయిందా ఏమిటి? £7 కానీ ఈ మనిషి ఎక్కడివాడో మనకు తెలుసు. అభిషిక్తుడు
యూద మత పాఠశాలల్లో మతోపదేశకుల దగ్గర చదువుకోలేదని వారి భావం. వారు ఆయన్ను (ఆ దేవుని కుమారుణ్ణి, వాక్కును, విశ్వానికి సృష్టికర్తను) ఒక చదువు లేనివాడుగా భావించారు. ఎంత విచిత్రం! అపొ కా 4:13 పోల్చి చూడండి. 7:16 యేసు తన ఉపదేశాలను తానే కల్పించలేదు. అది ఇతర మనుషుల నుంచి రాలేదు. అది తండ్రి అయిన దేవుని నుంచే వచ్చింది. 12:49; 17:8 కూడా చూడండి. యేసు యథార్థవంతుడు కాబట్టి దీని విషయంలో ఆయన మాటలు నమ్మాలి. ఆయన ఉపదేశాలను సాక్షాత్తూ దేవుని వాక్కులుగా స్వీకరించాలి. ఈ శుభవార్తలో 40 సార్లు యేసు తాను తండ్రి అయిన దేవుని దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చిన సంగతిని నొక్కి చెప్పాడు (3:16,17; 4:84; ర5:24,87; 6:39,44,57; మొ!!). 7:17 యేసు దేవుని సత్యాన్ని పలికాడో లేదో ఎవరైనా విచారించి చూడగల ఒక మార్గాన్ని ఆయన చూపుతున్నాడు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే విశ్వాన్ని సృష్టించిన దేవుని సంకల్పం (ప్రకారం చేయాలన్న హృదయ పూర్వకమైన నిర్ణయం చేసుకోవడం ఒక్కటే మార్గం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరె అలా చేస్తే యేసు సాక్షాత్తూ దేవుని సత్యాన్ని నేర్పించాడని తప్పక తెలుసుకొంటారు. ఇన్ని వివిధ మతాలూ, శాఖలూ, వేదాంతాలూ ఈ ప్రపంచంలో ఉన్నాయి గదా సత్యమేమిటో తెలిసేదెలా అని కొన్ని సార్లు ప్రశ్న వస్తుంది. ఈ వచనంలో ఈ మార్గం వెల్లడి అయింది. మత్తయి 6:22 పోల్చి చూడండి. 'మనుషులతో వచ్చిన సమస్య వారి బుద్ధికి సంబంధించిన అడ్డంకి కాదు గాని వారి సంకల్పం, ఉద్దేశాలకు సంబంధించిన అడ్డంకే. దేవుని సంకల్పం (ప్రకారం చెయ్యడం వారికి ఇష్టం లేదు గనకనే వారు సత్యం తెలియకుండా ఉండిపోతారు (8:19,20). దేవుని సంకల్పం ఏదైనా సరే నిజంగా దాని ప్రకారం చెయ్యడానికి మనం సిద్ధమేనా? కాదు అని దీనికి జవాబైతే మనకు సత్యం తెలియకపోవడం ఆశ్చర్యమేమీ లేదు. 7:18 యేసు ఇక్కడ రెండు వేరువేరు రకాల మతోపదేశకుల గురించి మాట్లాడుతున్నాడు. తమకే గౌరవ ప్రతిష్టలు కలగాలని చూచేవారు. తమ ఉపదేశం సత్యమో కాదో దాని గురించి పట్టించుకోరు. మనుషులకు నచ్చి, తద్వారా వారు తమను గౌరవిస్తారనుకుంటే మనుషులు కల్పించిన సిద్ధాంతాలను నేర్పించేందుకు వారు సిద్ధమే. కానీ దేవునికే ఘనత "కలగాలని చూచేవారికి ఆ సత్య దేవునికి సత్యమే ఘనత కలిగించగలదని తెలుసు (కీర్తన 81:5). మనుషులకు నచ్చినా నచ్చకపోయినా
దేవుని సత్యాన్ని నేర్పించాలనే నిర్ణయం వారు తీసుకుంటారు (గలతీ 1:10). యేసుప్రభువుకు తాను ఈ రెండో కోవకు చెందిన ఉపదేశకుణ్ణని తెలుసు (8:49,50).
7:19 తాము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని ఈ యూదులకు గర్వం. అయితే వారిలో ఏ ఒక్కడు కూడా నిజంగా దాన్ని పాటించలేదు. యేసుప్రభువును చంపాలని కుట్ర పన్చడం ద్వారా వారు దాన్ని పాటించలేదని రుజువౌతున్నది. ఇది ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరడం (నిర్గమ 20:18). తాను నేర్పిన సత్యాన్ని వారు అంగీకరించకపోవడానికి కారణం అతి ప్రాథమికమైన విషయాల్లో కూడా దేవుని సంకల్పం ప్రకారం చేయడం వారికి ఇష్టం లేకపోవడమేనని యేసు అంటున్నాడు.
7:20 ఇక్కడ వీరు అబద్ధమాడుతున్నారు. తాము ఆయన్ను చంపడానికి చూస్తున్నామని వారికి బాగా తెలుసు (వ 382; 5:18). దేవుని కుమారునికి విరుద్ధంగా అతి హీనమైన దూషణ పాపాన్ని వారిక్కక మూట గట్టుకొంటున్నారు (8:48; 10:20 కూడా చూడండి). మత్తయి 12:24,31,32 నోట్స్ చూడండి. 7:21-28 5:1-9లో రాసివున్న అద్భుతాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన విశ్రాంతి దినాన ఒక మనిషిని బాగు చేశాడని ఈ యూదులు ఆయనకు వ్యతిరేకంగా తీవ్రంగా ఫిర్యాదు చేశారు (5:10,16. మత్తయి 12:9-14 కూడా చూడండి). అయితే ఒక పిల్లవాడు పుట్టిన తరువాత అతనికి సున్చతి సంస్కారం జరిగించవలసిన దినం విశ్రాంతి దినాన వస్తే వారు విశ్రాంతి దినాన్నే దాన్ని జరిగించేవారు (ఆది 17:9-14; లేవీ 12:3 చూడండి). విశ్రాంతి దినాన గాయం చెయ్యడం ఫర్వాలేదు గాని బాగు చేస్తే వారికి కోపం!
7:24 వారి నిర్ణయాలు చేసే సామర్థ్యంలో లోపాలున్నాయి కాబట్టి ఎవరికైనా శిక్ష విధించడానికి వారు ఉరకలు వేసేవారు. 7:25-27 ఈ సామాన్య ప్రజలు యేసుప్రభువును గురించి ఎటూ తేల్చుకోలేక పోయేవారు. ఆయన ఉపదేశాలు వారి మీద ప్రభావితం చేశాయి. యూదుల అధికారులు ఆయన్ను చంపుదామన్ష ఆలోచన మానుకుని ఇస్రాయేల్ అభిషిక్తునిగా ఆయన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారేమోనని ప్రజలకు అనిపించింది. అయితే యేసు "గలలీ నుంచి వచ్చాడు కాబట్టీ, అభిషిక్తుడు ఎక్కడనుంచి వస్తాడో ఎవరికీ తెలిసే అవకాశం లేదని వారు అనుకున్నారు కాబట్టీ వారే ఈ సంగతి నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో వారనుకునేది పొరపాటు (మీకా 5:2; మత్తయి £2:1-6).
వచ్చేటప్పుడు ఆయన ఎక్కడనుంచి వస్తాడో ఎవరికీ తెలీదు.”
28 అందుచేత యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు : “నేను మీకు తెలుసు, నేనెక్కడినుంచి వచ్చానో అది కూడా మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయనను మీరెరుగరు. 29 నేనైతే ఆయనను ఎరుగుదును. నేను వచ్చినది ఆయన దగ్గరనుంచే. నన్ను పంపినది ఆయనే.”
30 అందుచేత వాళ్ళు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన సమయం ఇంకా రాకపోవడం వల్ల ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు. 81 ప్రజలలో అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు, “అభిషిక్తుడు వచ్చేటప్పుడు ఈయనకంటే ఎక్కువ సూచకమైన అద్భుతాలు చేస్తాడా?” అన్నారు. 82 ఆయనను గురించి ఈ విషయాలు ప్రజల గుంపు గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు గనుక (ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవడానికి భటులను పంపారు.
38 యేసు వారితో “ఇంకా కొద్ది కాలమే నేను మీతో ఉంటాను. తరువాత నన్ను పంపినవాని దగ్గరికి వెళ్ళిపోతాను. 34 మీరు నన్ను వెదుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు” అన్నాడు.
85 అందుకు యూదులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “మనం ఇతణ్ణి కనుక్కోకుండా ఎక్కడికి
7:28,29 ఈ అవకాశాన్ని పురస్కరించుకుని తాను ఎక్కడనుంచి వచ్చాడో ఆ సత్యాన్ని వారికి చెప్తున్నాడు యేసు. ఆయన గలలీనుంచి లేదా నజరేతునుంచి వచ్చాడని వారు చెప్పి ఉంటారు. యేసు మరో సారి తాను దేవుని నుంచి వచ్చిన సంగతిని నొక్కి చెప్తున్నాడు. వారు దేవుణ్ణెరిగి ఉంటే దీన్ని గుర్తించగలిగేవారు. అయితే వారు దేవుణ్ణి ఎరిగినవారు కారు. 7:30 యేసు మరణించేందుకు, మనుషుల పాపాలకోసం తనను తాను అర్పించుకునేందుకూ పరలోకంనుండి వచ్చాడు. అంతేగాక ఆయన అలా చెయ్యవలసిన ఘడియ కూడా నిర్ణయమైపోయింది. ఆ ఘడియ ఇంకా రాలేదు.
7:31 “అద్భుతాలు” - 2:11. కొంతమంది కనిపిస్తున్న సాక్ష్యాధారాలూ రుజువుల కారణంగా యేసుప్రభువుపై నమ్మకం ఉంచారు.
7:32 “పరిసయ్యులు” - మత్తయి 8:7.
7:38 వ 16.
7:34 వారి అవకాశం చెయ్యి దాటిపోతుంది. సామెత 1:24-28; హోషేయ 5:6,15; ఆమోసు 8:11,12 పోల్చి
చూడండి. తాను పరలోకంలో ఉంటాననీ వారు అక్కడికి రాలేరనీ ఆయన మాటలకు అర్థం. 7:35,36 ఎప్పటిలాగానే నమ్మకం లేనివారికి ఆయన మాటలు అర్థం కాలేదు. ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించడం మాత్రమే వారికి చేతనైంది. 7:37,88 4:10,18,14 పోల్చి చూడండి. ఈ అద్భుతమైన వాగ్దానం అందరికోసం. యేసు బిగ్గరగా దృఢంగా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. వ 37ను వ 38తో పోల్చి చూస్తే “దప్పి తీర్చుకోవడం” అంటే క్రీస్తులో నమ్మకం ఉంచడమని అర్ధం అవుతుంది (ఇది 6:58-56 విషయంలో కూడా నిజమని (గ్రహించండి).
“లేఖనాలు” - యెషయా 44:3; ర్5:1,2; ర58:11లో ఈ సత్యం సూచించబడింది. అపొ కా గ్రంథంలో యేసు క్రీస్తు రాయబారులనుంచి సేవకులనుంచి ఈ జీవజల ప్రవాహాలు
వెళ్ళిపోవాలని ఉద్దేశిస్తున్నాడు? గ్రీస్ దేశస్థుల మధ్య చెదరిపోయిన యూదుల దగ్గరికి వెళ్ళి గ్రీస్వారికి ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడా ఏమిటి? 86 'మీరు నన్ను వెతుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు” అని అతడు చెప్పిన మాట ఏమిటి?”
87 ఆ పండుగలో చివరి రోజున - ఆ మహా దినాన యేసు నిలబడి బిగ్గరగా ఇలా చెప్పాడు: “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. 38 నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి అంతరంగంలో నుంచి జీవ జల నదులు పారుతాయి. ఇది లేఖనాలు చెప్పిన ప్రకారమే.”
389 ఆయనమీద నమ్మకం ఉంచుతునృవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అప్పటికి యేసు ఇంకా మహిమాస్థితి పొందలేదు గనుక పవిత్రాత్మను అనుగ్రహించడం ఇంకా జరుగలేదు.
40 ఆ మాటలు విని జనసమూహంలో అనేకులు “నిజంగా ఈయనే ఆ ప్రవక్త” అన్నారు. 41 మరి కొందరు “ఈయనే అభిషిక్తుడు” అన్నారు. మరి కొంతమంది “కానీ అభిషిక్తుడు గలలీలోనుంచి రాడు గదా! 42 అభిషిక్తుడు దావీదు సంతానంలో నుంచి వస్తాడనీ దావీదు ఉండిన బేత్లెహేం (గ్రామం నుండి వస్తాడనీ లేఖనం చెప్పలేదా?” అన్చారు. 43 ఈ విధంగా ప్రజలలో ఆయనను గురించి విభేదం పుట్టింది.
రావడం కనిపిస్తున్నది. క్రీస్తు సంఘ చరిత్రలో ఈ ప్రవాహాల గురించి మనం చదవవచ్చు. మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళి దప్పితీర్చుకుంటే ఈ (ప్రవాహాలు మనలోనుంచి కూడా పారడం అనుభవించనారంభిస్తాం. లూకా 11:18; అపొ కా 5:82; ఎఫెసు 5:18 చూడండి.
7:39 14:16,17 మొదలైన చోట్ల పవిత్రాత్మను గురించి నోట్స్. ఇది ఆయన పట్ల నమ్మకం గల హృదయాలనుంచి ప్రవహించే ఆధ్యాత్మిక జీవం. పాత ఒడంబడిక కాలంలోను, క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడూ పవిత్రాత్మ చురుకుగా పని చేస్తూనే వచ్చాడు (ఆది 1:2; నిర్ణమ 31:3; సంఖ్యా 11:25; 24:2; న్యాయాధి 3:10; 6:34 11:29; 1 సమూ 16:12; £2 సమూ 23:2). క్రీస్తు మరణం, పునర్జీవితం, ఆరోహణం తరువాత తండ్రి, కుమారుడు కలిసి ఆయన్ను ఆయన సంపూర్ణతతో ఈ లోకానికి పంపించారు (14:16,17,26; అపొ కా 1:4,5; £2:1-4). క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఉన్న ఈ యుగానికి మనం “పవిత్రాత్మ యుగం” అని పేరు పెట్టవచ్చు.
“మహిమాస్థితి” - మహిమ అని తర్జుమా చేసిన గ్రీకు పదం ఈ శుభవార్తలో 28 సార్లు ఉంది. క్రొత్త ఒడంబడిక (గ్రంథంలోని మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు కనిపించదు. అన్ని చోట్లా ఇది యేసుప్రభువుకు, తండ్రి అయిన దేవునికి మాత్రమే వర్తిస్తున్నది. యేసు తన మరణం, పునర్జీవితం జరిగిన తరువాతే పవిత్రాత్మను పంపాడు. కల్వరిలో జరిగిన కార్యం లేకపోతే పెంతెకొస్తు సంఘటన ఉండేది కాదు. దేవుని ఆత్మయొక్క జీవప్రదమైన (ప్రవాహాలు పారగలిగేది సిలువ మూలంగానే.
7:40 ద్వితీ 18:15-18.
7:41 “అభిషిక్తుడు” - మత్తయి 1:1.
7:42 వారు అన్నది నిజమే (మీకా 5:2). కానీ యేసు ప్రభువు జన్మించినది అక్కడ అన్న విషయం వారికి తెలియదు (మత్తయి 2:1; లూకా £2:4-7).
7:48 ఎక్కడ చూచినా ఇప్పటికీ యేసుప్రభువు మనుషుల 44 వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని కోరారు గాని ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు.
45 ఆ భటులు ప్రధాన యాజుల దగ్గరకీ పరిసయ్యుల దగ్గరకీ వచ్చినప్పుడు వీరు “అతణ్ణి మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు. 46 భటులు “ఈ మనిషి మాట్లాడే విధంగా ఏ మనిషీ ఎన్నడూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.
47 అందుకు పరిసయ్యులు వారికి ఇలా బదులు చెప్పారు: “మీరు కూడా మోసపోయారా ఏమిటి? 48 అధికారులలో గానీ పరిసయ్యులలో గానీ ఎవరూ అతణ్ణి నమ్మలేదు గదా. 49 అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ మూకమీద శాపం ఉందన్నమాట!”
50 రాత్రివేళ ఆయన దగ్గరకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు వారితో 51 “ఒక మనిషి ప్రతివాదం విని ఆయన చేసేది ఏమిటో తెలుసుకోకముందే మన ధర్మశాస్త్రం ఆయనకు తీర్పు తీర్చదు గదా!” అన్నాడు.
52 వారు “నువ్వు కూడా గలలీవాడివా? లేఖనాలను విచారించి చూడు - గలలీలో ప్రవక్త ఎవ్వడూ బయలు దేరలేదు” అని అతనికి బదులు చెప్పారు. 58 అప్పుడు ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.
ర్ యేసు ఆలివ్కొండకు వెళ్ళాడు. £2 ప్రొద్దున పెందలకడ ఆయన దేవాలయంలోకి తిరిగి వచ్చాడు. ఆయన దగ్గరికి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. 8 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకువచ్చారు. ఆమె వ్యభిచార క్రియలో పట్టుబడింది. వారు ఆమెను మధ్యలో నిలబెట్టి 4 ఆయనతో ఇలా అన్నారు: “ఉపదేశకా! ఈ స్ర్తీని వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది. 5 ధర్మశాస్త్రంలో మోషే ఇలాంటి (్ర్రీలను రాళ్ళు రువ్వి చంపాలని మనకాజ్ఞ ఇచ్చాడు. అయితే మీరేమంటారు?”
6 ఆయనమీద నేరం మోపడానికి కారణం కనుక్కోవాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. అయితే యేసు తాను ఆలకించనట్టు వంగి ప్రేలితో నేలమీద ఏదో వ్రాశాడు. 7 వారు పట్టు విడువకుండా ఆయనను అడుగుతూ వచ్చారు గనుక ఆయన లేచి “మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చు” అన్నాడు. 8 అప్పుడాయన మళ్ళీ వంగి నేలమీద వ్రాశాడు.
9 ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయి - మొదట పెద్దలు నుండి చివరివాడి వరకు - ఒకరి తరువాత ఒకరు బయటికి వెళ్ళారు. చివరికి మధ్య
మధ్య విభేదాలకు కారణం. ఆయనపై నమ్మకం పెట్టుకున్నవారు అలా నమ్మనివారికి వేరైపోతారు. మత్తయి 10:34-36 పోల్చి చూడండి.
7:45,46 వ 8£లో ఈ భటులను పంపడం ఉంది. వారు క్రీస్తు ఉపదేశంలోని ప్రభావానికి తబ్బిబ్భైపోయారు గనక పరిసయ్యుల ఆదేశాల (ప్రకారం చేయలేకపోయారు. మత్తయి 7:28,29 పోల్చి చూడండి.
7:47 వ12.
7:48 తమ అపనమ్మకమే యేసు మోసగాడనేందుకు రుజువు అని ఈ బండబారిపోయిన అపనమ్మకస్థులు నమ్మారు! ఆయన మాటలపై తమ ఆమోద ముద్ర లేదు గనక యేసు సత్యం చెప్పడం లేదు అని వారి ఉద్దేశం!
7:49 మోషే ధర్మశాస్త్రంతో సరిగా పరిచయం లేనివారే యేసును నమ్మగలరని వారనుకున్నారు! ఆ ధర్మశాస్త్రం, మొత్తం పాత ఒడంబడిక (గ్రంథమంతా యేసువైపుకు చూపిస్తున్నదని వారికి తెలియదు (5:39,46; 1:45; లూకా £24:27,45,46). అసలు ఆ మాటకొస్తే మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినదీ, పాత ఒడంబడిక (గ్రంథం మొత్తాన్నీ (వ్రాయించినదీ ఆయనే. అసలు తెలియని మూకంటే ఆ పరిసయ్యులే.
7:50 ఏ పరిసయ్యుడు గానీ యూద నాయకుడు గానీ యేసుపై నమ్మకం ఉంచలేదనుకున్నారు వారు. ఇందులో కూడా వారిది పొరపాటే. అలా నమ్మిన ఒక వ్యక్తి వారి మధ్యలోనే ఉన్నాడు. 19:39-42 చూడండి (12:42 కూడా చూడండి). నీకొదేము ధైర్యంగా బయటికి సాక్ష్యం చెప్పకపోయినందువల్ల ఇతర పరిసయ్యులకు ఇది తెలియదు.
7:51 ఇది బుద్ధికి అనుగుణమైన ప్రశ్నే ధర్మశాస్తానికి అనుగుణమే. నీకొదేము ధైర్యంగా నిలబడకపోయినప్పటికీ మొత్తానికి వారికి వ్యతిరేకంగా నిలబడగలిగాడు, ఒంటరిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇది ఆ గర్విష్టులైన అపనమ్మకస్థుల అజ్ఞాన పూరితమైన తిరస్కారాన్నే రేకెత్తించగలిగింది.
7:58 అప్పటికీ యేసును ఏమీ చెయ్యలేమని గ్రహించి
వారంతా వెళ్ళిపోయారు.
8:1-11 ఈ వచనాలు గ్రీకు మూల ప్రతుల్లో లేవని కొందరు పండితులు అభిప్రాయం. ఇవి గ్రీకు మూలంలో ఉన్న వచనాలేనని ఈ నోట్స్ రచయిత నమ్ముతున్నాడు.
8:3 “పరిసయ్యులు” - మత్తయి 3:7. ఈ స్తీ వాళ్ళకెలా దొరికిందో రాసిలేదు. యేసుమీద నేరం మోపే కారణం వెదకాలని (వ 6) వారు కావాలనే ఆమెను కపటోపాయం చేత చిక్కించుకుని ఉండవచ్చు.
8:4 వారాయన్ను “ఉపదేశకా” అని పిలుస్తున్నారు. గాని ఆయన ఉపదేశించిన వాటిల్లో దేన్నీ అంగీకరించలేదు. లూకా 6:46 పోల్చి చూడండి.
8:5 ధర్మశాస్త్రం ఇలా చెప్పిన సంగతి నిజమే గాని మగవాణ్ణి కూడా చంపాలని కూడా చెప్పింది (ద్వితీ 22:22-24; లేవీ 20:10). దోషి అయిన ఆ మగవాణ్ణి వారు తీసుకు రాకపోవడంలో ఏదో మోసం ఉంది. బహుశా వాడు వాళ్ళ మనిషే కావచ్చు. ధర్మశాస్త్రం విధిస్తున్న శిక్షనుంచి యేసు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడని బహుశా వారు గట్టిగా నమ్మి ఉండవచ్చు. ఆయన గనక అలా చేస్తే అది ఆయన్ను ధర్మశాస్త్రానికి విరోధంగా నిలబెడుతుంది. గదా అని వారి దురాలోచన.
8:6 ఆయన్ను అలా బుట్టలో వేయజూసినది ఇదొక్క సారే కాదు. మత్తయి 22:15 చూడండి. యేసు రాస్తూ ఉన్నదేమిటో ఎందుకు రాశాడో ఊహాగానాలు అనవసరం. ఇది ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మికమైన మేలు కలిగించే స్పష్టమైన విషయాలు బైబిల్లో కోకొల్లలు. వాటిని ప్రధానంగా నేర్చుకుందాం.
8:7 ఈ ఆశ్ళర్యకరమైన జవాబు పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ స్త్రీకి, యేసుకూ విరోధంగా గుమిగూడినవారు ఓడిపోయి యుద్ధరంగం వదిలి జారుకోవలసి వచ్చింది. వారాయన కోసం గొయ్యి తవ్వారు గానీ వారే దాన్లో పడ్డారు. కీర్తన 7:14,15; 57:6; సామెత 26:27.
8:9 పరిసయ్యుల్లో అనేకమంది స్వనీతిపరులూ, ఇతరులకన్న తామే మంచివారమని భావించే వారైనప్పటికీ (లూకా నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే.
10 యేసు లేచి ఆ స్త్రీ తప్ప మరెవరినీ చూడకుండా “అమ్మా, నీ మీద నేరం మోపినవారు ఎక్కడ? ఎవరూ నీకు శిక్ష విధించలేదా?” అని అడిగాడు. 11 ఆమె “లేదు ప్రభూ” అంది. యేసు “నేనూ నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి అపరాధం చేయకుండా ఉండు” అన్నాడు.
12 తరువాత యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును. నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడవరు గాని వారికి జీవ కాంతి ఉంటుంది.”
18 అందుచేత పరిసయ్యులు “నీ విషయం నీవే సాక్ష్యం చెప్పుకొంటూ ఉన్నావు. నీ సాక్ష్యం నిజం కాదు” అని ఆయనతో అన్నారు.
14 యేసు వారికిలా జవాబు చెప్పాడు: “నా విషయం నేను
సాక్ష్యం చెప్పుకొన్నా నా సాక్ష్యం నిజమే. ఎందుకంటే, నేను వచ్చినది ఎక్కడనుంచో, వెళ్ళేది ఎక్కడికో నాకు తెలుసు. అయితే నేను ఎక్కడనుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్ళిపోతానో మీకు తెలియదు. 15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేనెవరికీ తీర్చు తీర్చడం లేదు. 16 ఒక వేళ నేను తీర్పు తీర్చినా నా తీర్పు నిజమైనది. ఎందుకంటే అందులో నేను ఒంటరిగా లేను. నేనూ నన్ను పంపిన తండ్రీ ఉన్నాం. (| ఇద్దరు మనుషుల సాక్ష్యం నమ్మతగినదని మీ ధర్మశాస్త్రంలో కూడా ట్రాసి ఉంది. 18 నా విషయం నేను సాక్ష్యం చెపుతున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా నా విషయం సాక్ష్యం చెపుతున్నాడు.”
19 అందుకు వారు “నీ తండ్రి ఎక్కడున్నాడు?” అని ఆయననడిగారు.
18:9-12), వారిలో ఒక్కడు కూడా తాను పాపం లేని వాణ్ణని ధైర్యంగా చెప్పగలవాడు లేడు. పాత ఒడంబడిక గ్రంథం వారికి తెలుసు (ఆది 8:21; కీర్తన 51:5; యిర్మీయా 17:9). అనేక సార్లు వారు తమ అంతర్వాణిని అణచివేసుకున్నప్పటికీ వారిలోని ఆ స్వరం పూర్తిగా చచ్చిపోలేదు, మౌనం దాల్చలేదు. 8:10 ఆమెపై నేరం మోపినవారంతా వెళ్ళిపోయారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారెవరూ ఇక లేరు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని బట్టి చూచినా ఆమెను వెళ్ళిపోనివ్వడమే న్యాయం. ద్వితీ 17:6,7; 19:15 చూడండి. 8:11 38:17 చూడండి. యేసు పాపులను నేరస్థులుగా తీర్చి వారికి శిక్ష విధించేందుకు గనక వచ్చివుంటే అందరూ - అంటే ఈ స్రీ, పరిసయ్యులు, మొత్తం (ప్రజలంతా, ఆయన శిష్యులు కూడా నేరస్థులుగా తీర్చబడి శిక్షకు గురై ఉండేవారే. ఎందుకంటే అందరూ పాపులే (రోమ్ 8:9,19,23; మత్తయి 7:11). కానీ యేసు దారి తప్పిన వారిని వెతికి పాపవిముక్తుల్ని చేసి రక్షించేందుకు వచ్చాడు గానీ నేరం మోపి శిక్షించాలని కాదు (లూకా 19:10). అంటే పాపం చేసినా ఫర్వాలేదని యేసు అంటున్నట్టా? ఎంతమాత్రం కాదు. పాపం బహు భయానకమైనదని ఆయనకు తెలుసు. పాపాన్ని తీసివేసే బలి అర్చణగా బాధలు అనుభవించి చనిపోవడానికే ఆయన వచ్చాడు (1:29; 3:14; ర6:53-58; 10:11). ఈ స్రీతో ఆయన ఏమంటున్నాడో చూడండి - “ఇకనుంచి అపరాధం చేయకుండా ఉండు”. 5:14; మత్తయి 4:17; లూకా 138:2,8 కూడా చూడండి. పాపం చేసినా ఫర్వాలేదని దీని అర్ధంలా అనిపిస్తున్నదా? యేసుప్రభువు మన పాపాలను క్షమించాడంటే మనం అలాగే పాపాలు చేస్తూ ఉండవచ్చని కాదు, పాపం చెయ్యడం మానుకోవాలనే. మత్తయి 1:21; కీర్తన 180:4 రోమ్ 6:14; 1 యోహాను 2:1. 8:12 “వెలుగును” - 1:4; మత్తయి 4:16; లూకా 1:79; 2 కొరింతు 4:6; 1 యోహాను 1:5; 2:8. దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన వెలుగు యేసుప్రభువు. ఈ భూమికి సూర్యగోళం ఎలానో, మానవాళికి యేసు అలా. ఆయన జీవితం, చర్యలు, ఆయన వాక్కులు దేవుణ్ణి గురించీ, మనిషి పాపవిముక్తి గురించీ దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏం చెయ్యాలో దాన్ని గురించీ సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైనవాటికీ, వాస్తవం కానివాటికీ, సత్యానికీ అసత్యానికీ ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది. అది పరలోకానికి మార్గం చూపుతుంది.
అయితే క్రీస్తును అనుసరించేవారికే ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడమంటే నమ్మిక ఉంచి విధేయత
3:19,20; 12:85,86;
చూపడం. మనం ఆయన్నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ ఆజ్ఞానంలోనూ ఉండిపోతాం. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నదీ వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు (అందువల్ల వారు చేయగలిగినదల్లా వెలుగును నిరాకరించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చెయ్యడమే). వారు శాశ్వత అంధకారంలోకి వెళ్ళిపోతారు (మత్తయి 8:12; 22:13; £ పేతురు 2:17; యూదా 13).
“జీవ కాంతి” అనే మాటకు బహుశా జీవం అయిన కాంతి (లేక సజీవమైన వెలుగు), లేదా జీవాన్సిచ్చే కాంతి, లేదా జీవంనుండి ప్రసరించే కాంతి, లేక పై అర్థాలన్నీ కూడా కావచ్చు. ఇక్కడ అతి (ప్రాముఖ్యమైన (ప్రశ్న ఉంది. క్రీస్తు ఇచ్చే కాంతిని నిజంగా మనం కోరుతున్నామా, లేక మన చీకటితో తృప్తిపడి
ఊరుకుంటున్నామా? 8:18 వీరు యేసు మాటల్ని తిప్పి ఆయనమీదే (ప్రయోగించాలని చూస్తున్నారా (5:31)? కాంతిని గురించి
వారేమీ నోరు విప్పడం లేదన్న సంగతి గమనించండి. వారి చీకటి వారికి చాలు. విరోధ భావంతో, అపనమ్మకంతో వారు యేసును ఆయనే వెలుగు అనేందుకు రుజువు అడుగుతున్నారు. నిజానికి సహజంగా చూస్తే వెలుగు తానున్నానని ఎలాంటి రుజువులూ చూపనకృర్రేదు. అది వెలుగుతూ ఉంటే చాలు. వెలుగుతూ ఉండడమే కాంతికి రుజువు. వెలుగనేది లేదని చీకటి అనవచ్చు. అయితే అలా అనడం వెలుగు లేదనడానికి రుజువు కాదు, చీకటి ఉందని మాత్రమే అనడానికి అది రుజువు. 8:14-18 5:381లో తాను గాక వేరే సాక్షులెవరూ లేకుండా తనగురించి తానే సాక్ష్యం చెప్పుకుంటే అది చాలదని యేసుప్రభువు చెప్పాడు. అలాంటి సాక్ష్యాన్ని ఏ కోర్టూ అంగీకరించదు. ఇక్కడ ఆయన రెండు విషయాలను బట్టి తన సాక్ష్యం సత్యం అంటున్నాడు. తానెక్కడనుంచి వచ్చినదీ ఎక్కడికి వెళ్తున్నదీ తనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు ఆయనకు సాక్షి 5:36,87 కూడా చూడండి.
8:15,16 7:24; 8:17.
8:17 ద్వితీ 19:15. ధర్మశాస్త్రం (ప్రకారం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం అంగీకారమే. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అంగీకరించవద్దా?
8:19 10:30; 14:9 పోల్చి చూడండి. దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడు స్వభావంలోనూ గుణశీలాల్లోనూ మనస్సు, ఉద్దేశాల్లోనూ ఎంత ఐక్యంగా ఉన్నారంటే ఒకర్ని ఎరిగితే యేసు “మీరు నన్ను ఎరుగరు, నా తండ్రిని కూడా ఎరుగరు. ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉండేవారు” అని జవాబిచ్చాడు.
20 దేవాలయంలో కానుకలు ఉంచే స్థలంలో ఆయన ఉపదేశం చేస్తూ ఆ మాటలు చెప్పాడు. అయితే ఆయన గడియ ఇంకా రాకపోవడం చేత ఆయనను ఎవరూ పట్టుకోలేదు. 21 గనుక ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు:
“నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను వెతుకుతారు గాని మీ పాపాలలోనే చనిపోతారు. నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.”
£22 అందుకు యూదులు “ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి? నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు" అని ఇతడు చెప్పడం అందుకేనా?” అని చెప్పుకొన్నారు.
£28 ఆయన “మీరు క్రిందివారు, నేను పైనుంచి వచ్చినవాణ్ణి. మీరు ఈ లోకానికి చెందినవారు, నేను ఈ లోకానికి చెందేవాణ్ణి కాను. 24 అందుచేత మీరు మీ పాపాలలో చనిపోతారని చెప్పాను. నేను 'ఉన్నవాడను” అని నమ్మకపోయారా, మీరు మీ పాపాలలోనే చనిపోతారు” అని వారితో అన్నాడు.
మరొకర్ని ఎరిగినట్టే. 1:18; హీట్రూ 1:3 కూడా చూడండి. క్రీస్తు దేవత్వం గురించి ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి. ఈ పరిసయ్యులకు క్రీస్తు తెలియదు. వారయన్ను చూశారు. ఆయన మాట్లాడినప్పుడు విన్నారు. అయితే వారి దురభిమానం, అపనమ్మకం ఆయన నిజంగా ఎవరో అర్ధం చేసుకోనియ్యకుండా చేశాయి.
8:20 ?7: 30.
8:21 7:33,84. ఇక్కడ యేసు “మీ పాపాలలోనే చనిపోతారు” అనే భయంకరమైన మాటను కలుపుతున్నాడు. పాపంలో చనిపోవడం అంటే శాశ్వతంగా నశించిపోవడమే గనక ఇవి భయానకమైన మాటలు. చావు తరువాత పాపవిముక్తి పొందే అవకాశాలు ఉన్నాయని బైబిలు చెప్పడం లేదు. మనుషులు ఈ భూమిపై తిరిగి తిరిగి జన్మిస్తూ ఉండరు. 9:3; హీబ్రూ 9:27; లూకా 16:19-81 చూడండి.
8:22 7:35,86. యేసు ఆత్మహత్య చేసుకుంటాడని వీరు నిజంగా అనుకోగలిగారా? ఆయన్ను గురించీ ఆయన తండ్రిని గురించీ వారెంత అజ్ఞానంలో ఉన్నారో ఇది తెలియజేస్తున్నది (వ 19).
8:28 ఇక్కడ యేసుప్రభువు తనకూ, ఇతరులందరికీ మధ్య ఉన్న తేడా చెప్తున్నాడు. మనం ఈ లోకానికి చెందినవారం. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు (3:18; 6:33,38,50,51). 1 కొరింతు 15:45-47 కూడా చూడండి. 8:24 పాపాల్లోనే చనిపోయి నశించిపోకుండా తప్పించు కొనేందుకు ఏకైక మార్గం యేసులో నమ్మకం పెట్టడమేనని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. 3:36 పోల్చి చూడండి.
“నేను ఉన్నవాడను” - ఇది పాత ఒడంబడిక (గ్రంథంలో దేవుడు తానే మాట్లాడిన రీతి - నిర్ణమ 3:14; యెషయా 43:10. పాత ఒడంబడికలో యెహోవాగా వెల్లడి అయిన దేవుణ్ణి తానే అని యేసు ఇక్కడ చెప్పుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. వ 58లో ఇది మరీ స్పష్టంగా ఉంది. మనుషులు దీన్ని నమ్మకపోతే వారు తమ పాపాల్లోనే చనిపోతారని చెప్తున్నాడు. యేసు యెహోవా అవతారమని తెలియజేసే ఇతర రిఫరెన్సులు లూకా 2:11 నోట్లో ఉన్నాయి.
8:25 దేవుడు తన తండ్రి అని యేసుప్రభువు పదేపదే
£25 అందుకు వారు “నీవెవరివి?” అని ఆయననడిగారు. యేసు వారితో అన్నాడు “మొదటినుంచి నేనెవరినని చెపుతున్నానో ఆయననే నేను. 26 మీ విషయం చెప్పడానికీ విమర్శించడానికీ ఇంకా అనేక సంగతులున్నాయి. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన చెప్పగా నేను విన్న సంగతులే లోకానికి చెపుతూ ఉన్నాను.”
£27 దేవుడైన తండ్రిని గురించి ఆయన తమతో చెపుతున్నాడని వారు (గ్రహించలేదు.
28 కనుక యేసు వారితో “మీరు మానవపుత్రుణ్ణి పైకెత్తేటప్పుడు నేను “ఉన్నవాడను'” అని మీరు (గ్రహిస్తారు. నా అంతట నేనే ఏమీ చేయడం లేదనీ తండ్రి నాకు నేర్చిన విషయాలే చెపుతున్నాననీ కూడా (గ్రపౌస్తారు. 29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఆయనకు ఇష్టమైనవే నేనెప్పుడూ చేస్తూ ఉన్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు” అన్నాడు.
80 ఈ మాటలు చెపుతూ ఉండగానే ఆయనమీద చాలామంది నమ్మకం ఉంచారు.
31 అందుచేత, తనను నమ్మిన యూదులతో యేసు ఇలా
చెప్పాడు (2:16; 3:16,18; 5:19-28,26; 6:40). అంటే తాను దేవుణ్ణని ఆయన చెప్పుకుంటున్నట్టు వారు అర్ధం చేసుకున్నారు. వారి ఆలోచన సరిగానే ఉంది. కుమారునికి తండ్రి స్వభావమే ఉంటుంది గదా.
8:26 ఆయన లోకానికి తీర్పు తీర్చేందుకు రాలేదు, అంటే దానిపై అంతిమ తీర్పు వినిపించి శిక్షించేందుకు రాలేదన్నమాట (8:17). కానీ ఇతరుల ప్రవర్తనను ఆయన గమనించాడు. వారి గురించిన సత్యం మాట్లాడ్డానికి ఆయనకు అధికారం ఉంది. 8:27 మళ్ళీ ఇక్కడ అపనమ్మకంలోని గుడ్డితనం కనిపిస్తున్నది. 8:28 “మానవపుత్రుడు” - మత్తయి 8:20.
“పైకెత్తేటప్పుడు” - సిలువను గురించి ఆయన మాట్లాడుతున్నాడు (3:14), కానీ పైకెత్తడం అని అనువదించిన (గ్రీకు మాటకు “హెచ్చించడం”, “గొప్ప చేయడం” అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన మాటలో ఆయన సజీవంగా తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళిపోవడం కూడా ఇమిడి ఉండవచ్చు. ఈ సంఘటనల తరువాతే చాలమంది యూదులు, యూదుల నాయకులు కొందరు కూడా ఆయనెవరో తెలుసుకొని, ఆయన్ను అనుసరించసాగారు (అపొ కా 2:41; 4:4 6:7; 21:20). ఇంకా చాలా మందికి ఆయన్ను అనుసరించాలని తెలుసు గాని అలా చెయ్యడం ఇష్టం లేదు.
“నేర్చిన” - 7:16; 12:49,50. యేసు ఉపదేశించినదంతా నేరుగా తండ్రి అయిన దేవునినుంచి వచ్చినదే.
8:29 ఆయన జీవితం ముఖ్యోద్దేశం తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగించడమే. దాన్ని ఆయన లోపరహితంగా నెరవేర్చాడు (4:34 నోట్).
8:30 తరువాత వస్తున్న వచనాలను బట్టి వారి నమ్మకం ఎంత అల్పమైనదో చూడవచ్చు. 2£2:23-2ర్; 12: 42,48 చూడండి. యేసును గురించి కొన్ని విషయాలు వారు నమ్మారు. అయితే ఈ నమ్మకం వారి హృదయాల లోతుల్లోకి పోయి వారి (బ్రతుకుల్చి మార్చలేదు.
8:31 శిష్యులంటే యేసుప్రభువు తమ ఏకైక ఉపదేశకుడుగా అంగీకరించినవారే, ఆయన్నుండి నేర్చుకుని ఆయనకు లోబడుతూ తమను ఆయన ఎటు తీసుకు వెళ్తే అటు వెళ్ళేవారే. అలా చేస్తూ ఉండేవారే నిజమైన శిష్యులని ఇక్కడ ఆయన అన్చాడు: “మీరు నా వాక్కులో నిలిచి ఉంటే నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు. 82 అప్పుడు మీరు సత్యం (గ్రహిస్తారు, సత్యం మీకు విడుదల కలిగిస్తుంది.”
88 అయితే వారు “మేము అబ్రాహాము సంతానం. మేమెప్పుడు ఎవరికీ బానిసలం కాము. మాకు విడుదల కలుగుతుందని అంటావేం?” అని ఆయనకు జవాబు చెప్పారు.
84 యేసు వారికిలా బదులు చెప్పాడు: “పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిస అని మీతో ఖచ్చితంగా చెపుతున్నాను. 385 బానిస యజమాని ఇంట్లో ఎల్లప్పుడూ ఉండడు గానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లో ఉంటాడు. 386 కనుక కుమారుడు మిమ్ములను విడుదల చేస్తేనే మీరు నిజంగా విడుదల పొందినవారై ఉంటారు. 87 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. కానీ నా మాటలకు మీలో చోటు లేదు గనుక
నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. 38 నా తండ్రి దగ్గర చూచిన విషయాలే చెపుతూ ఉన్నాను. మీ తండ్రి దగ్గర చూచిన విషయాలు మీరూ చేస్తున్నారు.”
39 అందుకు వారు ఆయనకు “అబ్రాహాము మా తండ్రి” అన్నారు.
యేసు “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము క్రియలు చేస్తారు. 40 అయితే దేవుడు చెప్పగా నేను విన్న సత్యం మీకు చెప్పిన మనిషినయిన నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు. అబ్రాహాము ఇలా చేయలేదే! 41 మీరు మీ తండ్రి క్రియలే చేస్తూ ఉన్నారు” అని వారితో చెప్పాడు.
ఆయనతో వారు “మేము వ్యభిచారం మూలంగా పుట్టలేదు. మాకు తండ్రి ఒక్కడే. ఆయన దేవుడే” అన్నారు.
42 యేసు వారితో అన్నాడు “దేవుడే గనుక మీ తండ్రి
చెప్తున్నాడు. శిష్యులనడానికి రుజువు వారు శిష్యులుగా ఉండిపోవడమే. కొంతమంది ఆరంభం బాగానే ఉన్నట్టుంది గాని త్వరలోనే క్రీస్తు ఉపదేశాలను విడిచిపెట్టి తమ సొంత దారుల్లో వెళ్ళిపోతారు. అలాంటివారు నిజమైన శిష్యులు ఎన్నడూ కాలేదు. 1 యోహాను 2:19 పోల్చి చూడండి. 8:32 క్రీస్తు మనుషుల్ని విడుదల చేయడానికే వచ్చాడు (లూకా 4:18). ఈ విడుదల ఏమిటి? ఇది రాజకీయ స్వేచ్ళ గానీ అక్షరాలా బానిసత్యం నుంచి స్వేచ్చ గానీ కాదు. పాప బంధకాల నుంచీ విడుదల (వ 34). దానితోబాటు అపరాధులమనే తీర్పు నుంచీ శిక్ష నుంచి దేవుని పవిత్ర ధర్మశాస్త్రం చేసే నేరారోపణ నుంచీ చావు భయం నుంచీ భవబంధాల నుంచీ ఆస్తిపాస్తుల కట్లనుంచీ క్రీస్తును అనుసరించకుండా దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడే అన్ని సంకెళ్ళ నుంచీ ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. అయనిచ్చేది ఆత్మ సంబంధమైన విడుదల. క్రీస్తు ఈ విడుదలను ఎలా ప్రసాదిస్తాడు? మనం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే. నిజమైన శిష్యుడు సత్యస్వరూపి అయిన క్రీస్తును (1:17; 14:6), ఆయన్ను గురించిన సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆయనెవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఇక్కడ ఆయన సాధించినదేమిటో తెలుసుకుంటాడు. అంతేగాక అతడు తన గురించీ పాపవిముక్తి గురించీ యేసు చేసిన ఇతర గొప్ప ఉపదేశాల గురించీ సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. సత్యం గురించిన ఈ జ్ఞానం ఒక్కటే విడుదలకు మార్గం. పాపం, అపనమ్మకం, సత్యాన్ని ఎరగకపోవడం మనుషుల్ని బానిసత్వంలో ఉంచుతున్నాయి. 15:21; మొ॥ నోట్స్ చూడండి. వారికి విడుదల ప్రసాదించే సత్యం క్రీస్తు సత్యం ఒక్కటే. 8:38 మత్తయి 38:9 చూడండి. ఇది జాతి గురించిన అహంకారం. యూద జాతి వంశకర్త అబ్రాహాము గొప్పవాడు కాబట్టి తాము కూడా గొప్పవారమని వారు అనుకున్నారు. కానీ వారు ఆత్మ సంబంధంగా అబ్రాహాము సంతతి కాదని 39,40 వచనాలు చూపిస్తున్నాయి. కుటుంబ సంబంధంగా జాతి సంబంధంగా గర్వించడం మనల్ని దేవుని ఛాయలకు కూడా తీసుకువెళ్ళదు.
“విడుదల” - ఎప్పటిలాగానే యేసుప్రభువును వారు అపార్థం చేసుకున్నారు. శారీరికంగా బానిసత్వం నుంచి విడుదల గురించి ఆయన మాట్లాడుతున్నాడని అనుకున్నారు.
8:34 ఎవరూ కూడా అపార్థం చేసుకోవడానికి వీలులేకుండా అతి స్పష్టంగా యేసు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు విధిస్తున్న కట్టుబాట్లు తెంచుకొని, తమ సొంత దారుల్లో సాగిపోవడం స్వేచ్చ అనుకునేవారు ఎంతమందో ఉన్నారు.
అయితే తమ ఇష్టప్రకారం చేసేందుకూ తనివితీరా పాపం చేసేందుకూ స్వేచ్ళ కావాలని వారి ప్రయత్నాలవల్ల వారు తమ సొంత బంధకాలను తయారు చేసుకుంటున్నారు, చాలా క్రూరమైన యజమానికి - అంటే పాపానికి బానిసలౌతున్నారు. 8:35 ఏ కుటుంబం విషయంలోనైనా చివరికి దేవుని కుటుంబం విషయంలో కూడా ఇది సత్యమే. పాపానికి దాసులైన వారికి కుమారునికి ఉన్నట్టుగా అందులో నిజమైన స్థానం, హక్కు లేవు.
8:36 బానిసలు తమను తాము విడిపించుకోలేరు. అలా విడిపించుకోగలిగితే వారు బానిసలే కాదు. వారిని విడిపించాలనంటే వారు గాక వేరొకరు, బానిస కానివాడు అవసరం. దీన్ని క్రీస్తు చేశాడు. చేస్తూనే ఉన్నాడు (మత్తయి 1:21;
అపొ కా 26:17,18; రోమ్ 6:16-18,22; 8:2,21; గలతీ 5:1). 8:37 సంతానం అంటే శారీరికంగా సంతానం అని యేసు
ఉద్దేశం. తనను చంపడానికి వారు పన్నుతున్న కుట్రల సంగతంతా యేసుకు తెలుసు - 5:18. 8:38 క్రీస్తు ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాడు - వ 28; 1:1; 5:19,20.
“మీ తండ్రి” - అంటే సైతాను (వ 41,44). 8:39,40 అబ్రాహాము తమ తండ్రి అని వారు నొక్కి చెప్పారు. బహుశా అది శరీరికంగా, ఆధ్యాత్మికంగా కూడా వాస్తవమే అని వారి ఉద్దేశం కావచ్చు. ఇది నిజం కాదని వారి ప్రవర్తనే తెలియజేస్తూ ఉన్నదని యేసు అంటున్నాడు. అబ్రాహాము ఎలాంటివాడో బైబిలు తెలియజేస్తున్నది. (ఆది 12-24 అధ్యాయాలు). ఈ యూదులు ఎంతమాత్రం అతని లాంటివారు కాదు. 8:41 ఈ యూదులు ఇలా ఎందుకన్నారో స్పష్టంగా తెలియదు. తాము భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా అబ్రాహాము సంతానమనీ, నిజ దేవుణ్ణి ఆరాధించేవారమనీ వారి ఉద్దేశం కావచ్చు (పాత ఒడంబడిక (గ్రంథంలో పర దేవత పూజ వ్యభిచారం వంటిదని చెప్పడం జరిగింది (యిర్మీయా 2:1; యెహె 16:81-34; 28:2,8; హోషేయ 1:2 నోట్స్). ఇ(స్రాయేల్ జాతికి దేవుడే తండ్రి అని వారికి తెలుసు (యెషయా 64:8; మలాకీ 2:10). ఇక్కడ వ్యక్తిగతంగా తమకు కూడా దేవుడే తండ్రి అని చెప్పుకుంటున్నారు. కానీ కేవలం అలా చెప్పినంత మాత్రాన అలా అయిపోదు. 8:42 చాలామంది తాము దేవుని పిల్లలమనుకుంటారు. అలా చెప్పుకుంటారు. కానీ వారికి యేసుప్రభువంటే (శ్రేమ ఉందా? లేని పక్షంలో వారు అనుకునేది ఏమైనప్పటికీ వారు దేవుని
