యోహాను శుభవార్త – భాగము 12 (పుటలు 69–74)
ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు అతనితో “ఎవరికీ మరణశిక్ష విధంచడానికి మాకు అధికారం లేదు” అన్నారు. 32 తాను ఎలాంటి మరణానికి గురి అవుతాడో దాని విషయం యేసు సూచించి చెప్పిన మాట నెరవేరేలా అది జరిగింది.
38 అప్పుడు పిలాతు అధిపతి భవనంలోకి మళ్ళీ వెళ్ళి యేసును పిలిపించి ఆయనను ఇలా అడిగాడు: “యూదులకు రాజువు నీవేనా?”
34 “మీ అంతట మీరే ఆ మాట అంటున్నారా? లేదా, ఇతరులు నా విషయం మీతో చెప్పారా?” అని యేసు అతనికి జవాబిచ్చాడు.
385 “నేను యూదుడినా ఏం! నాకు నిన్ను అప్పగించినది నీ సౌంత ప్రజలే, ప్రధాన యాజులే గదా. నీవు చేసినది ఏమిటి?” అని పిలాతు బదులు చెప్పాడు.
36 యేసు ఇలా జవాబిచ్చాడు: “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే గనుక అయితే నన్ను యూదులకు పట్టి ఇవ్వడం జరగకుండా నా సేవకులు పోరాడేవారే. కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడిది కాదు.”
87 అందుకు పిలాతు “అయితే నీవు రాజువా?” అని ఆయనను అడిగాడు.
యేసు జవాబిస్తూ “నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే. సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను, ఈ కారణం చేత ఈ లోకానికి వచ్చాను. నేను
చెప్పేదానిని సత్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నా స్వరం వింటారు” అన్నాడు.
38 అందుకు పిలాతు “సత్యం అంటే ఏమిటి?” అని ఆయనతో అన్నాడు. అలా అని బయటికి యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి “అతనిలో ఎలాంటి దోషమూ నాకు కనిపించలేదు. 39 అయితే పస్కా పండుగలో నేను ఎవడైనా ఒక ఖైదీని మీకు విడుదల చేసే వాడుక మీకు ఉంది గదా. నేను యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకిష్టమా?”
40 అందుకు వారు “ఈ మనిషిని కాదు, బరబ్బను విడుదల చేయండి” అని మళ్ళీ అరిచారు. బరబ్బ బందిపోటు దొంగ.
10% పిలాతు యేసును స్వాధీనపరచుకొని కొరడాలతో కొట్టించాడు. £2 సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమిద పెట్టారు. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. 8 అప్పుడు “యూదుల రాజా, శుభం!” అన్నారు. ఆయనను చేతులతో కొట్టారు.
4 మరోసారి పిలాతు బయటికి వెళ్ళి యూదులతో ఇలా అన్నాడు: “చూడండి. ఇతనిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించలేదని మీరు తెలుసుకోవాలి, గనుక ఇతణ్ణి బయటికి మీ దగ్గరికి తెప్పిస్తున్నాను.”
5 ముండ్ల కిరీటం, ఊదారంగు వస్త్రం ధరించినవాడై యేసు బయటికి వచ్చినప్పుడు వీలాతు వారితో అన్నాడు “అడుగో ఈ మనిషి!”
6 ఆయనను చూడగానే ప్రధాన యాజులూ యూదుల
నేరస్థుల్ని సిలువ వేసే అధికారం ఇవ్వలేదు. రోమ్వారు యేసును నేరస్తుడుగా తీర్చి సిలువ మరణశిక్ష ఆయనకు విధించాలని ఈ యూదులు కోరారు.
18:32 38:14 8:28; 12:32,38.
18:38 యేసు తనను తాను రాజుగా నిలుపుకొని యూదయలో రోమ్ పరిపాలనకు వ్యతిరేకంగా తిరగబడే ప్రయత్నం చేస్తున్నాడని యూదులు ఆయనపై నేరం మోపారు (లూకా 2£23:1,2). అందుకే ఈ (ప్రశ్న వేశాడు పిలాతు.
18:34 పిలాతు తన ప్రశ్న మరింత స్పష్టంగా వెయ్యాలని యేసు ఉద్దేశం. పిలాతు అడిగినది యేసు రోమ్ పాలనను కూల ద్రోసే ఉద్దేశంతో ఇహలోక సంబంధంగా రాజయ్యే ప్రయత్నం చేస్తున్న విషయమా, లేక వేరొక రకంగా రాజయ్యే ప్రయత్నం చేస్తున్న విషయమా?
18:35 యూదులు తనకు చెప్పినది తప్ప తనకు మరేమీ తెలియదని పిలాతు అంటున్నాడు - రుజువు ఏమీ లేకుండా వారి నేరారోపణను అంగీకరించడం అతనికి ఇష్టం లేదు గనుక ఈ విధంగా యేసును ప్రశ్నిస్తున్నాడు.
18:36 “నా రాజ్యం” - తన రాజ్యం పరలోకానికి చెందినది, ఆత్మ సంబంధమైనదే గానీ రాజకీయ, సైనిక రాజ్యం కాదని యేసు చెప్తున్నాడు (మత్తయి 4:17 నోట్ చూడండి). అందుకు ఆధారంగా యూదులు తనను పట్టి బంధిస్తూ ఉంటే తన శిష్యులేమీ అడ్డుపడలేదన్న సంగతి చెప్తున్నాడు. అంతేగాక యూదులే తనను బంధిస్తే తాను యూదులపై రాజకీయ నాయకుడెలా కాగలడు?
“ఇప్పుడు” - ప్రకటన 19:11-16 పోల్చి చూడండి. 18:37 దేవుని ఆధ్యాత్మిక రాజ్యంలో రాజుగా ఆయన తన సత్యాన్ని పంపిస్తాడు. సైన్యాన్ని కాదు. ఆధ్యాత్మిక (ప్రభావంతో మనుషుల హృదయాలను ఆయన స్వాధీనం చేసుకోగోరు తున్నాడు
గానీ సైనిక బలాన్ని ఉపయోగించి వారి దేశాలను కాదు.
“సత్యం” - యోహాను శుభవార్త అంతటా సత్యాన్ని ఈ విధంగా నొక్కి చెప్పడం కనిపిస్తున్నది (1:14,18; 8:21; 4:24; 8:32; 14:6,17].. 16:13; 17:17). ఇక్కడ ప్రభువు చెప్తున్నది. చూడండి - సత్యాన్ని కోరేవారంతా, సత్యమంటే ప్రీతి కలిగి ఆచరించేవారంతా క్రీస్తు మాటలు విని ఆయన చెప్పేది చేస్తారు. ప్రతి ఒక్కరూ అలా చేస్తారు. దీనికి వ్యతిరేకం కూడా నిజమే. సత్యమంటే ఇష్టం లేనివారు ఆయన మాట వినరు. 8:47; 22 తెస్స 2:10 పోల్చి చూడండి. 18:38 పిలాతు జవాబుకోసం ఎదురు చూడలేదు. అసలు ఈ (ప్రశ్నకు జవాబు అతనికి అక్కరేదు. సత్యం గురించి అతనికేమన్నా పట్టింపు ఉందనుకోవడానికి కారణమేమీ లేదు. పిలాతు విషయంలో విచారకరమైన సంగతి ఇదే ( ఈ నాడు అనేకమంది విషయంలో కూడా). యేసు ఏ నేరమైనా చేశాడనేందుకు రుజువేమీ లేదని పిలాతుకు బాగా తెలుసు (19:4,6; మత్తయి 27:18,23; లూకా 23:4,13,14).
18:39,40 మత్తయి 27:15-21; లూకా 28:19 చూడండి. 19:1 పిలాతుకు సత్యం పట్ల ఉన్న శ్రద్ధ ఎంతో ఇక్కడ కనిపిస్తున్నది. పూర్తిగా నిర్దోషి అని తానెరిగిన వ్యక్తికి శిక్ష అమలు జరిపాడు.
19:2,8 మత్తయి 27:27-30.
19:5 రోమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు నడుపుతున్నాడని యేసుపై నేరం మోపడం ఎంత అర్థంలేని పనో అందరికీ చూపించాలని పిలాతు ఉద్దేశం. కాబట్టి యేసును బలహీనుడుగా, నిస్సహాయుడుగా వారి 'ఎదుట ప్రదర్శించి, ఆయనపై జాలి పడేలా గాని, నేరం మోపి సిలువ వేయడం తగదని చూపించే (ప్రయత్నం చేస్తున్నాడు.
19:6 జాలి చూపేందుకూ న్యాయాన్ని కోరేందుకూ ఆ అధికారులూ “సిలువ వెయ్యండి! అరిచారు.
పిలాతు “మీరే అతణ్ణి తీసుకుపోయి సిలువ వేయండి. నాకు అతనిలో ఏ దోషమూ కనబడలేదు” అని వారితో చెప్పాడు.
7 అందుకు యూదులు “మాకో చట్టం ఉంది. మా చట్టం (ప్రకారం అతడు చావాలి. ఎందుకంటే, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకొన్నాడు” అని జవాబిచ్చారు.
8 ఆ మాట విని పిలాతు మరి ఎక్కువగా భయపడ్డాడు. 9 అధిపతి భవనంలోకి తిరిగి వెళ్ళి “నీవు ఎక్కడనుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. యేసు అతడికి ఏ జవాబూ ఇవ్వలేదు. 10 పిలాతు ఆయనతో అన్నాడు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?”
11 అందుకు యేసు “ఆ అధికారం పైనుంచి నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు. కనుక నన్ను నీకు అప్పగించినవానికే ఎక్కువ పాపం ఉంది” అని జవాబిచ్చాడు.
12 అప్పటినుంచి ఆయనను విడిపించడానికి పిలాతు (ప్రయత్నం చేశాడు, గానీ యూదులు ఇలా అరిచారు: “ఒకవేళ
సిలువ వెయ్యండి!” అని
మీరు ఈ మనిషిని విడుదల చేస్తే మీరు సీజరుకు స్నేహితులు కారన్నమాటే! తాను రాజునని చెప్పుకొనేవాడెవడైనా చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడేవాడే!”
18 ఈ మాటలు విని పిలాతు యేసును బయటికి తెప్పించి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఆ స్థలానికి “రాళ్లు పరచిన స్థలం” అని పేరు. హీబ్రూ భాషలో గబ్బతా అంటారు. 14 ఆ రోజు పస్కా పండుగను సిద్ధం చేసే రోజు. ఉదయం సుమారు ఆరు గంటలయింది.
“ఇడుగో మీ రాజు!” చెప్పాడు.
15 అందుకు వారు “ఇతణ్ణి చంపండి! చంపండి! అతణ్ణి సిలువ వేయండి!” అని అరిచాడు.
“నేను మీ రాజును సిలువ వేయాలా?” అని పిలాతు వారిని అడిగాడు.
అందుకు ప్రధాన యాజులు “సీజరు తప్ప మాకు వేరే రాజు లేడు” అని జవాబిచ్చారు.
16 అప్పుడు సిలువ వేయడానికి ఇతడు ఆయనను వారికి అప్పగించాడు. అందుచేత వారు యేసును పట్టుకొని బయటికి తీసుకుపోయారు. 17 తన సిలువను తానే మోసుకొంటూ
అని వీలాతు యూదులతో
కఠినాత్ములైన పాపుల మనస్సులను ఏదీ కరిగించలేదు. మీరే యేసును సిలువ వేసుకోండి అన్న పిలాతు మాటల్లో కోపం, వ్యంగ్యం ధ్వనిస్తున్నాయి. ఎవర్నైనా సిలువ వేసేందుకు వారికి అధికారం లేదని పిలాతుకు తెలుసు, వారికీ తెలుసు (18:31). 19:7 సత్యాన్ని గడ్డిపోచలాగా తీసిపారేసేవారి గుణం దీన్ని బట్టి కూడా అర్ధమౌతున్నది. ఇక్కడ వారు చెప్తున్న ధర్మశాస్త్రం అంశాన్ని వక్రం చేసి చెప్తున్నారు (లేవీ £4: 16). యేసు (వేరెవరైనా కూడా) నిజంగా తాను దేవుని కుమారుడు కాకపోయినా అలా చెప్పుకుంటే అతడు దేవదూషకుడనీ, మరణానికి తగినవాడన్నదీ నిజమే కానీ యేసు నిజంగా దేవుని కుమారుడని సాక్ష్యాధారాలన్నీ రుజువు చేస్తున్నాయి. అది నిజం కాబట్టి ఆయన చెప్పుకోకూడదని నిషేధించే చట్టమేమీ లేదు. 5:18; 10:31-36; మత్తయి 26:63-66 కూడా చూడండి. 19:8 మొత్తంగా రోమ్వారు మూఢ నమ్మకాలున్న వ్యక్తులు. అనేకమంది దేవుళ్ళలో వారికి నమ్మకం. దేవుళ్ళు కొన్ని సార్లు మనుషుల్లాగా వచ్చి ఈ లోకంలో తిరుగుతుంటారని, అలాంటి సందర్భాల్లో వారిని గుర్తుపట్టడం అంత తేలిక కాదని నమ్మేవారు. నిరోషియ్ మౌనంగా, సహనంతో, గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్న యేసు ఎవరో ఒక దేవుడేమోనని పిలాతు భయపడనారంభించి ఉండవచ్చు.
19:10 పిలాతు అహానికి దెబ్బ తగిలినట్టుంది. తరచుగా ఈ లోకాన్ని పరిపాలించేవారు తామేదో గొప్పవారమనీ (ప్రభావం గలవారమనీ తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చనీ అనుకోవడానికి ఇష్టపడుతుంటారు.
19:11 పిలాతు తప్పుగా అర్ధం చేసుకొన్న విషయాలను గురించి యేసు మౌనం వహించలేదు. “పై పైనుంచి” అంటే పరలోకంనుంచి, దేవుని నుంచి అని అర్ధం. భూమి అంతటికీ మహారాజు దేవుడే. ఆయన అనుమతిస్తేనే గాని పిలాతు ఏమీ చెయ్యలేడు. కీర్తనలు 2వ అధ్యాయం; 47:1,2; యెషయా 40:21-28; దానియేలు 4:34,35 పోల్చి చూడండి. దీనంతటిలో పిలాతు గొప్ప పాపం ఒడిగట్టుకున్నాడు. కానీ పిలాతుకు యేసును అప్పగించినవాడు (ప్రముఖ యాజి కయప - 18:28) మరింత ఘోర పాపం చేశాడు. పాపాల్లో కొన్ని మిగతావాటి కంటే చెడ్డవి. లూకా 12:47,48 పోల్చి చూడండి.
19:12 యేసు కనీసం దేవుని మనిషి ఒకడని పిలాతుకు నమ్మకం కుదిరినట్టుంది. ఆయనకు మరణశిక్ష విధించే విషయంలో ఆందోళన పడుతున్నాడు. పిలాతును యూదయ ప్రాంతానికి అధిపతిగా నియమించినది రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి సీజరు. పిలాతు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడని గానీ ఏదైనా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నాడని గానీ సీజరుకు తలంపు వచ్చిందంటే అంతటితో పిలాతు పని ఆఖరు. పిలాతుకు ఈ సంగతి బాగా తెలుసు.
19:15 “సజరు తప్ప. . .రాజు లేడు” - ఈ యూదుల నాయకుల కపట బుద్ది, (థ్రష్ట మనసు మళ్ళీ బయట పడుతున్నాయి. తమ దేశంపై రోమ్వారి పరిపాలన వారికి అసహ్యం. అదీగాక తమ ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేల్పై రాజు దేవుడేనని వారికి తెలుసు (నిర్ణమ 19:3-6; ద్వితీ 88:5; 1 సమూ 8:7, కీర్తన 10:16; 149:2). యేసుప్రభువును సిలువ వేయించేందుకు ఎంత విపరీతమైన మాట అయినా పలికేందుకు వారు సిద్ధమే. అయితే ఇలా అనడంలో వారికి తెలియకుండా వారే ఒక సత్యాన్ని పలుకుతున్నారు. తమ జీవితాల్లో వారు దేవుని పరిపాలనను పూర్తిగా విసర్దించారు. వారి హృదయాల్లో దేవుడు రాజు కాడు.
19:16 యేసు నిర్దోషి అని పిలాతుకు తెలుసు. తానొక భయంకరమైన తప్పు చేస్తున్నానేమో అని భయపడ్డాడు. న్యాయంగా తీర్పు తీర్చడం అతని బాధ్యత, కానీ అతని తెలివితేటలు, భయాలు, బాధ్యత అంతా అతనికి ఉన్న మరో భయం ఎదుట దిగదుడుపు అయిపోయాయి. అదేమంటే సీజరుకు అభ్యంతరం కలిగించి తన పదవికి ముప్పు వస్తుందేమోనన్న భయం. ఆ భయం గుప్పెట్లో ఉన్న పిలాతు మనసులో సత్యానికి, న్యాయానికి నిలువ నీడలేకుండా పోయింది (సామెత £29:25 పోల్చి చూడండి). అలాంటి భయాన్ని దూరం చేసే దేవుని భయం పిలాతులో లేదు. దేవునికంటే మనుషులకు ఎక్కువగా భయపడే వారెవరైనా, సత్యం న్యాయాల కన్నా తన పదవికే ఎక్కువ (ప్రాధాన్యతనిచ్చే వారెవరైనా భయంకరమైన ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నారు. దేవుని తీర్పుకూ శిక్షకూ గురి అయ్యే అపాయంలో ఉన్నారు.
19:17-22 మత్తయి 27:31-38. యేసు తన సిలువను 'కపాలస్థలం" అనే చోటికి ఆయన వెళ్ళాడు. హీబ్రూ భాషలో దానిని గొల్గొతా అంటారు. 18 అక్కడ వారు ఆయనను సిలువ వేశారు. యేసును మధ్యలో ఉంచి ఆయనకు ఇరుప్రక్కల ఇంకా ఇద్దరిని సిలువ వేశారు. 19 పిలాతు ఈ (వ్రాత వ్రాయించి సిలువకు పైగా పెట్టించాడు:
“నజరేతువాడైన యేసు, యూదుల రాజు”
£20 అది హీబ్రూ, (గ్రీకు, రోమన్ భాషలలో ప్రాసి ఉంది. యేసును సిలువ వేసిన స్థలం నగరానికి దగ్గరగా ఉంది, గనుక యూదులు అనేకులు ఆ పై వ్రాతను చదివారు.
£21 అప్పుడు యూదుల ప్రధాన యాజులు పిలాతుతో ఇలా అన్నారు: “యూదుల రాజు అని వ్రాయకండి. నేను యూదుల రాజునని అతడు అన్చాడు అని ప్రాయండి.”
£2£2 పిలాతు “నేను రాసినదేదో రాశాను” అని బదులు చెప్పాడు.
£28 యేసు సిలువ వేసిన తరువాత సైనికులు ఆయన బట్టలు తీసుకొన్నారు. ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు. ఆయన అంగీ కూడా తీసుకొన్నారు గాని అది కుట్టు లేకుండా పైభాగంనుంచి పూర్తిగా నేసినది కావడంచేత £24 వారు “మనం దానిని చింపెయ్యకూడదు. అది ఎవడికి రావాలో దానికోసం చీట్లు
వేద్దాం” అని చెప్పుకొన్నారు. “నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీకోసం చీట్లు వేస్తున్నారు” అనే లేఖనం నెరవేర్పు ఇలా జరిగింది. సైనికులు అలా చేసినది అందుకే.
£25 యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ ఆయన సిలువ దగ్గర నిలుచున్నారు. 26 యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండడం చూచి “అమ్మా! అడుగో, నీ కొడుకు” అని తన తల్లితో అన్నాడు. 27 అప్పుడు ఆ శిష్యుడితో “అదిగో, నీ తల్లి” అన్నాడు. ఆ కాలంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొన్నాడు.
£28 ఆ తరువాత, సమస్తమూ అప్పటికే అయిపోయిందని తెలిసి లేఖనం నెరవేరడానికి యేసు “నాకు దప్పి అవుతూ ఉంది” అన్నాడు. 29 పులిసిపోయిన (ద్రాక్షరసంతో నిండిన ఒక పాత్ర అక్కడ ఉంది. కాబట్టి వారు ఒక స్పంజి నిండా పులిసిపోయిన (్రాక్షరసాన్ని పట్టించారు. దానిని హిస్సోపు మొక్ట కాడకు తగిలించి ఆయన నోటికి అందజేశారు.
80 ఆ పులిసిపోయిన (ద్రాక్షరసం తీసుకొన్న తరువాత యేసు “సమాప్తమయింది” అన్నాడు. అప్పుడు తల వంచి ప్రాణం విడిచాడు.
81 ఆ రోజు పస్మాను సిద్ధం చేసే రోజు. మరుసటి రోజు
తానే మోసుకువెళ్ళాడని యోహాను రాశాడు. ఆ విధంగా మోస్తూ బయలు దేరాడు గానీ దారిలో సిలువను మరో వ్యక్తి మోసేలా సైనికులు అతణ్ణి బలవంతపెట్టారు. యేసుపై మోపిన నేరం మూడు భాషల్లో రాసి ఉన్న సంగతి, అందులో ఉపయోగించిన మాటలకు యూదులు అభ్యంతరం తెలియజేసిన సంగతి యోహాను మాత్రమే రాశాడు. పిలాతుకే అర్థం కాని ఒక సత్యాన్ని దేవుడు అతనిచేత రాయించాడు. యేసు నిజంగా ఇస్రాయేల్వారి అభిషిక్తుడు. పాత ఒడంబడిక (గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన రాజు (మత్తయి 1:1 నోట్),
19:23,24 “చీట్లు వేద్దాం” - కీర్తన 22:18.
19:25 బహుశా సోదరి అంటే మార్కు 15:40లో చెప్పిన సలోమి, మత్తయి £7:56లో చెప్పిన జెబెదయ కొడుకుల తల్లి కావచ్చు - అంటే యోహాను తల్లి అన్నమాట.
“మగ్దలేనే” - 20:10-18; లూకా 8:2; మత్తయి 28:1. 19:26,27 “తాను ప్రేమించిన శిష్యుడు” - 18:28. యేసు
ఘోర బాధలు అనుభవిస్తూ, లోక పాపాలకోసం మరణిస్తూ ఉన్న ఆ సమయంలో కూడా వేరొకరి అవసరాల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. “అదిగో నీ తల్లి” అని ఆయన ఈ శిష్యుడితో అనడంలో అర్థం మరియ దేవుని ప్రజలందరికీ “మాత”, లేదా “ఉపకార మాత”, “ఆశ్రయ మాత” అని కాదు. మరియకు ఇల్లు, పోషణ అవసరమని ఆయనకు తెలుసు. నమ్మకస్థుడైన ఒక శిష్యుని ఆశ్రయం కింద ఆయన ఆమెను ఉంచుతున్నాడు అంతే. అప్పటికి మరియ భర్త యోసేపు చనిపోయినట్టుంది.
19:28,29 కీర్తన 69:21. క్రీస్తు సిలువ బాధలలో, మరణంలో పాత ఒడంబడిక (గ్రంథంలోని భవిష్యద్వాక్కులు అనేకం నెరవేరాయి. ఏదీ అకాలంగా, అకస్మాత్తుగా, యాదృచ్చికంగా జరగలేదు. ప్రతిదాని వెనకా దేవుడు ఉద్దేశించిన ప్రయోజనమొకటి ఉంది. యేసు పాపుల స్థానంలో బాధలు పడుతూ వారి శిక్షను భరిస్తున్న సంగతి గుర్తుంచుకోండి (వ 30 దగ్గర రిఫరెన్సులు). సిలువపై ఆయనకు దాహం వేయడం అందులోని భాగమే. లూకా 16:22-24 పోల్చి చూడండి.
విశ్వాసులకు జీవజలం దొరకాలనీ (4:14; 7:87, 88; (ప్రకటన 22:17), అనంత కాలం వారికి దాహం వేయకుండా ఉండాలనీ (ప్రకటన ?7:16,17) యేసు దప్పిగొన్నాడు. 19:30 సమాప్తమైనదేమిటి? తాను ఈ లోకానికి రావడంలో గల ఉద్దేశమంతా సిద్ధించిందని ఆయన భావమై ఉండాలి (4:34). ఈ ఉద్దేశాన్ని ఆయనే ఆయా సమయాల్లో వెల్లడి చేశాడు _ 83:14-17; 6:51; 10:10,11,15,17; 12:23,24,81-88; 17:4 18:11 (మత్తయి 26:39) మత్తయి 20:28. బాప్తిసమిచ్చే యోహాను దీన్ని ఈ విధంగా తెలియజేశాడు - “ఇడుగో లోక పాపాన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల” (1:29). క్రొత్త ఒడంబడిక చేశారు. రోమ్ 3:25,
రచయితలు దీన్నే వేరే మాటల్లో వెల్లడి 5:8; 1 కొరింతు 15:3; 2 కొరింతు 5:15,19; గలతీ 1:4 ఎఫెసు 5:2; ఫిలిప్పీ 2:8; కొలస్సయి 1:20,22; 1 తిమోతి 1:15; హీబ్రూ 1:3; 2:14,17; 9:12,14,15; 10:10,14; 18:12; 1 పేతురు 2:24; 3:18; 1 యోహాను 4:9,10; (ప్రకటన 1:5,6 చూడండి. సమాప్తమైంది అంటే పాపం కోసం తాను పడవలసిన బాధలు, చేయవలసిన బలి అర్పణ పూర్తి అయింది అని అర్ధం. లోక పాపాన్ని ఆయన తీసివేశాడు. తన ప్రజలను తన రక్తంతో విమోచించాడు. ప్రతి ఒక్కరికి పాపం నుంచి విడుదల, రక్షణ అందుబాటులోకి తెచ్చాడు. ఈ పని సంపూర్తి అయింది. పాపవిముక్తి పొందేందుకు పాపి చేయవలసిందల్లా పశ్చాత్తాపపడి శుభవార్తను విశ్వసించి యేసుప్రభువుమీద నమ్మకం పెట్టుకోవడమే (మార్కు 16:15,16; 24:46,47).
తాను అక్కడ చేయడానికి వచ్చిన పని పూర్తి అయిపోయింది కాబట్టి సిలువపై బాధలు అనుభవిస్తూ ఉండిపోవలసిన అవసరం ఇక లేదు. కాబట్టి స్వచ్చందంగా తనకు తానే తన ప్రాణం విడిచాడు. 10:17,18; లూకా 23:46 పోల్చి చూడండి. 19:31 వ 14 ద్వితీ 21:22,238. మృతదేహం సిలువపై రాత్రంతా ఉండడం ద్వారా భూమి అశుద్ధం కాకూడదని వారి
లూకా యూదులకు మహా విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మృత దేహాలు సిలువమీద ఉండకూడదనీ వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని సిలువనుంచి తీయించాలనీ యూదులు పిలాతును అడిగారు. 32 కనుక సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడ్డ మొదటివాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగ్గొట్టారు. 33 గానీ యేసు దగ్గరకు వచ్చి, అప్పటికే ఆయన చనిపోవడం చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. 34 అయితే సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. వెంటనే రక్తమూ నీళ్ళూ కారాయి. 85 అది చూచినవాడు సాక్ష్యం చెప్పాడు. అతని సాక్ష్యం నిజం. మీరు కూడా నమ్మేలా అతడు సత్యం చెపుతున్నాడని అతనికి తెలుసు.
36 ఈ లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి: “ఆయన ఎముకలలో ఒకటైనా విరగగొట్టబడదు” 37 మరో లేఖనం ఇలా అంటుంది.: “తాము పొడిచినవానివైపు వారు చూస్తారు.”
88 ఆ తరువాత అరిమతయి (గ్రామం వాడైన యోసేపు యేసు మృత దేహాన్ని తీసుకుపోవడానికి పిలాతును అడిగాడు. పిలాతు అనుమతించాడు. యోసేపు యేసుకు శిష్యుడు గాని యూదులకు భయపడి రహస్యంగా శిష్యుడుగా ఉన్నాడు. అతడు వచ్చి యేసు మృత దేహాన్ని తీసుకువెళ్ళాడు.
89 నీకొదేము కూడా వచ్చాడు. ఈ నీకొదేము అంతకు ముందు రాత్రివేళ యేసుదగ్గరకు వచ్చినవాడు. అతడు బోళంతో కలిపిన అగరు సుమారు నలభై అయిదు కిలోగ్రాములు తెచ్చాడు. 40 వారు యేసు దేహాన్ని తీసుకొని యూదుల భూస్థాపన ఆచారం (ప్రకారం ఆ సుగంధ (ద్రవ్యాలు పెట్టి అవిసెనార గుడ్డలు చుట్టారు. 41 ఆయనను సిలువ వేసిన స్థలంలో తోట ఉంది. తోటలో కొత్త సమాధి ఉంది. దానిలో అదివరకు ఎవరినీ ఉంచడం జరుగలేదు. 42 ఆ సమాధి దగ్గరగా ఉండడంచేత, ఆ రోజు యూదులకు వస్యాను తయారు చేసే రోజు గనుక వారు ఆయనను దానిలో పెట్టారు.
ఆదివారం నాడు పెందలకడ ఇంకా చీకటిగా 90 మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసివేసి ఉండడం చూచింది. 2 గనుక ఆమె సీమోను పేతురు దగ్గరకూ యేసు (్రేమించిన ఆ మరో శిష్యుని దగ్గరకూ పరుగెత్తి వెళ్ళింది. “వారు ప్రభువును సమాధిలో నుంచి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు”
అంది. 3 అందుచేత పేతురు, ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు
ఉద్దేశం. దేవుని కుమారుణ్ణి హత్య చేసే తామే అతి నీచంగా మైలబడిపోయిన సంగతి వారికి పట్టింపు లేదు. 18:28; మత్తయి 23:24 చూడండి. సాధారణంగా రోమ్వారు సిలువ మరణం పొందినవారి శవాలను ఇతరులకు హెచ్చరికగా అలానే వదిలేసేవారు.
“తీయించాలని” - సిలువపై ఉన్నవారి కాళ్ళు విరగ్గొడితే మరణం త్వరగా వస్తుంది. కాళ్ళకు పట్టులేక దేహాలు వేళ్ళాడి రొమ్ము కుంచించుకుపోతుంది. ఇందువల్ల ఊపిరి తీసుకోవడం
చాలా కష్టమై మరణం సంభవిస్తుంది. యేసు ఆ సాయంత్రంలోగా చనిపోయేలా చూడాలని యూదుల ఉద్దేశం. 19:33 అందరూ ఊహించినదానికంటే ముందుగానే
యేసుప్రభువు చనిపోయాడు. మార్కు 15:44,45 చూడండి. 19:34 యేసులో ఏ మూలనో కాస్త కొన ఊపిరి మిగిలి ఉన్నట్టు సైనికులకు అనుమానం కలిగినట్టుంది. ఆయన మరణించాడని రూఢి చేసుకోవాలనుకున్నారు. ఒక వేళ అంతకుముందే ఆయన చనిపోకపోయినా ఇలా శఈటెతో పొడవడంతో ఆయన తప్పక చనిపోతాడు.
ఇక్కడ చెప్పినట్టు మృతదేహం నుంచి రక్తం, నీరు కారడం మామూలు సంగతి కాదు. ఈ సంఘటన యేసు ఇచ్చే జీవజలాన్నీ (1:34; 7:37,88), సిలువపై ఆయన కార్చిన రక్తం మాత్రమే ఆ జలాన్ని మనకు అందుబాటులోకి తెస్తుందనీ జ్ఞాపకం చేయవచ్చు. అంతేగాక పాత ఒడంబడికలో రక్తం ప్రాయశ్చితానికి (లేవీ 17:11), నీరు శుద్ధీకరణకు (సంఖ్యా 19:11; మొ॥) ఉపయోగించారని కూడా మనం గ్రహించాలి. 1 యోహాను 5:6-8 కూడా పోల్చి చూడండి. 19:35 ఈ శుభవార్త రచయిత తన గురించే ఈ మాట రాస్తున్నట్టుంది. జరిగిన దాన్ని (ప్రత్యక్షంగా చూచినవాడుగా యేసు చనిపోయాడనీ, ఈ అసాధారణ సంఘటన జరిగిందనీ ప్రకటిస్తున్నాడు. 19:36 నిర్ణమ 12:46; 19:37 జెకర్యా 12:10. 19:38-42 మత్తయి 27:57-60; మార్కు 15:42-46;
సంఖ్యా 9:12; కీర్తన 34:20.
లూకా 28:50-54 చూడండి. యేసు జీవించిన కాలంలో యోసేపు తన నమ్మకాన్ని రహస్యంగా ఉంచుకున్చాడని యోహాను మాత్రమే రాశాడు.
“నీకొదేము” - 8:1,2; 7:50,51. క్రీస్తు సన్నిహిత శిష్యులెవరూ ఆ ఛాయలకు కూడా రాలేదు (వ 19 పోల్చి చూడండి). కానీ తమ నమ్మకాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినవారు. ఇప్పుడు బయటికి వచ్చారు. యేసు సిలువపై ఉన్న సమయంలో వారు చూచినవీ విన్నవీ యేసులో వారి నమ్మకాన్ని అభివృద్ధి చేసి ఉండవచ్చు.
పెద్ద మొత్తంలో తెచ్చిన ఈ సుగంధ (ద్రవ్యాలు చాలా ఖరీదైనవి (వ 39). యేసుప్రభువు పట్ల నీకొదేముకున్న (పేమకూ అపారమైన గౌరవానికీ ఇది సూచన.
20:1 అన్ని శుభవార్తల రచయితలు క్రీస్తు చనిపోయి సజీవంగా లేచిన ఘన సత్యాన్ని రాశారు. అయితే నలుగురూ ఒకే విధమైన మాటలు ఉపయోగించలేదు. అందరూ ఒకే వివరాలు రాయలేదు. ఒక శుభవార్తలో కనిపించే వ్యక్తులందరి గురించీ అందరు శుభవార్త రచయితలూ రాయలేదు. ఉదాహరణకు ఇక్కడ మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి రావడం గురించి యోహాను రాశాడు. మత్తయి అయితే వేరొక మరియ ఆమెతో ఉందని రాశాడు. సలోమి కూడా వెంట వెళ్ళిందని మార్కు రాశాడు. లూకా కొందరు స్త్రీలు వచ్చారని రాస్తూ యోహన్న అనే ఆమె పేరు కూడా చెప్పాడు. వీటిలో ఏది నిజం? అన్నీ నిజమే. వారిలో ఒకామె సమాధి దగ్గరికి వచ్చిందని రాస్తే మరి ఇతరులెవరూ రాలేదని అర్ధం కాదు.
20:2 “మాకు” - ఆమెతో వచ్చిన ఇతర స్త్రీలతో కలుపుకుని మాట్లాడుతున్నది. యేసుప్రభువు సజీవంగా లేస్తాడని వారు అర్ధం చేసుకోలేదు. ఎవరో శత్రువులు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనుకున్నారు. నిజానికి ఆయన శిష్యుల్లో ఎవరూ ఆయన మాటల్ని గానీ ఆయన పునర్జీవితం గురించి పాత ఒడంబడిక లేఖనాలలను గానీ అర్థం చేసుకోలేదు.
20:8 యేసు దేహాన్ని శిష్యులు ఎత్తుకు పోలేదని వారికి తెలుసు, కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుతగా వెళ్ళడానికి బయలుదేరారు. 4 ఇద్దరూ కలిసి పరుగెత్తుతూ ఉన్నారు గాని ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి మొదట సమాధి చేరాడు. 5 అతడు వంగి సమాధిలో ఆ అవిసెనార గుడ్డలు ఉండడం చూశాడు గాని లోపలికి వెళ్ళలేదు. 6 అప్పుడు అతడి వెనకాలే సీమోను పేతురు వచ్చాడు. అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అవిసెనార బట్టలు చూశాడు. 7 యేను తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు. అది ఆ అవిసెనార బట్టలతో గాక వేరే చోట చుట్టిపెట్టి ఉంది. 8 అప్పుడు, మొదట సమాధి దగ్గరికి చేరిన ఆ మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మాడు. 9 ఆయన చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అనే లేఖనం అప్పటికి వారు (గ్రహించలేదు.
10 అప్పుడు ఆ శిష్యులు మళ్ళీ తమ ఇండ్లకు వెళ్ళారు. 11 మరియ సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ వంగి సమాధిలోకి చూచింది. 12 తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారు. యేసు మృతదేహం మునుపు ఉన్న స్థలంలో తలవైపు ఒకరూ కాళ్ళవైపు మరొకరూ కూర్చుని ఉన్నారు. 18 వారు ఆమెతో ఇలా అన్నారు:
“అమ్మా! ఎందుకు ఏడుస్తూ ఉన్నావు?”
ఆమె “వారు నా ప్రభువును తీసుకుపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అంది.
14 ఆమె అలా చెప్పి వెనక్కు తిరిగింది. యేసు అక్కడ నిలుచుండడం ఆమెకు కనిపించింది గాని యేసని ఆమె గుర్తుపట్టలేదు.
15 యేసు ఆమెతో “అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని వెదకుతున్నావు?” అన్నాడు.
ఆయన తోటమాలి అనుకొని ఆమె ఆయనతో ఇలా అంది: “అయ్యా, ఆయనను మోసుకుపోయినది మీరే గనుక అయితే ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి. నేను ఆయనను తీసుకుపోతాను.”
16 అప్పుడు యేసు ఆమెతో “మరియా” అన్నాడు.
ఆమె ఆయనవైపు తిరిగి ఆయనతో “రబ్బోనీ!” అంది. ఆ మాటకు “గురువు” అని అర్ధం.
17 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నన్ను అంటి పెట్టుకొని ఉండబోకు. ఎందుకంటే నేను ఇంకా నా తండ్రిదగ్గరకు పైకి వెళ్ళలేదు. అయితే నా సోదరుల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా
ఉన్నారు. ఇప్పుడు దీన్ని గురించిన యథార్థాన్ని తెలుసుకునేందుకు అందరు కూడా ఆసక్తి కలిగి ఉండాలి.
20:6-8 యేసు దేహానికి యోసేపు, నీకొదేము ఆ బట్టలు చుట్టారు. (19:40). ఎవరైనా ఆయన మృత దేహాన్ని దొంగిలించేందుకు వస్తే ఆ గుడ్డలన్చిటినీ ఓపిగ్గా విప్పరు. ఆయన తలకు చుట్టిన గుడ్డ మళ్ళీ చుట్టిపెట్టరు. అలాంటివారు హడావుడిగా అలానే గుడ్డలు చుట్టిన దేహాన్ని అదే విధంగా ఎత్తుకుపోయేవారు, లేదా ఆ గుడ్డలను గబగబా చింపేసి ఎక్కడ పడితే అక్కడ పారేసేవారు గదా. యోహాను దీన్ని చూచిన వెంటనే అర్థం చేసుకున్నాడు. యేసు సజీవంగా లేచిన సంగతి గురించిన నోట్ కోసం మత్తయి 28:6 చూడండి.
20:9 కీర్తన 16:10; యెషయా 58:10-12; 1 కొరింతు 1ర్:4. 20:11 ఈమె మగ్దలేనే మరియ (వ 18). శిష్యుల వెనకే
ఆమె మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చింది. యేసుప్రభువు చనిపోయి సజీవంగా లేచిన తరువాత మొదటిసారిగా ఆయన్ను చూచినది ఆమె. ఆయన మొట్టమెదటిగా తన తల్లికి గానీ తన శిష్యుల్లో ఎవరికైనా గానీ కనిపించకుండా ఆమెకు కనిపించడం వింతగా అనిపిస్తుంది. తక్కువ తెలిసి, నమ్మకం బలహీనంగా ఉండి, [ప్రేమ మాత్రం బలంగా ఉన్న ఆ స్రీ పై ఆయనకు జాలి కలిగింది. 20:12 మొదట మరియతో వచ్చిన స్రీలు ఒకే దేవదూతను చూశారు. అతడు సమాధి బయట రాయిపై కూర్చుని ఉన్నాడు. (మత్తయి 28:1-7). మరియ చూచిన ఇద్దరు దేవదూతలు సమాధి లోపల ఉన్నారు. పేతురు, ఈ మరో శిష్యుడు లోపలికి వెళ్లినప్పుడు వారక్కడ లేరు. వారి ఆకారం బహుశా మనుషుల్లాగా ఉందేమో. దేవదూతల గురించి నోట్ ఆది 16:7 చూడండి. 20:18 చనిపోయినవారిని తగిన విధంగా సమాధి చేయడం గురించి యూదులకు బాగా పట్టింపు. సమాధి దొంగలు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోవడం ద్వారా ఆయన దేహానికి ఇవ్వవలసిన మర్యాదను భంగపరిచారని అనుకుని మరియ దుః ఖపడుతుంది.
20:14 21:4; మత్తయి 28:17, లూకా £24:16,38. యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన ఆకారం చనిపోకముందు ఆకారానికి కొంత భిన్నంగా ఉన్నట్టుంది. అందువల్ల మరియ వెంటనే ఆయన్ను గుర్తించలేదు. అంతేగాక
తాను ఆయన్ను అలా చూస్తానని ఎంతమాత్రం ఊహించి ఉండదు. పైగా ఆమె తల వంచుకుని ఏడుస్తూ ఉండడంవల్ల ఆయన ముఖంకేసి చూడలేదోమో.
20:15 దీనికి జవాబు యేసుకు బాగా తెలుసు. 6:5,6; 11:34 పోల్చి చూడండి. ఈ (ప్రశ్నలో సున్నితమైన మందలింపు ధ్వనించడం లేదా? లూకా 24:5 పోల్చి చూడండి. (దేవుడేమి చేస్తున్నాడో తెలియక కొన్ని సార్లు క్రీస్తు శిష్యులు ఆనందించవలసిన సందర్భాల్లో ఏడుస్తుంటారు).
“తోటమాలి” - ఆ సమాధి ఒక తోటలో ఉంది (19:41). ఆ ప్రాంతాల్లో తోటమాలి ఉంటాడని మరియ అనుకొని ఉంటుంది. 20:16 ఆమె ఆయన్ను గుర్తుపట్టలేదు గానీ ఆయన స్వరం తెలుసు. పరిచయం లేని వ్యక్తి ఎవరూ తననలా పేరుతో పిలవరని కూడా ఆమెకు తెలుసు. ఆయనవైపు తిరిగి మరింత శ్రద్ధగా ఆయన వంక చూచినప్పుడు ఆయన్ను గుర్తు పట్టింది. 20:17 “అంటిపెట్టుకొని ఉండబోకు” - బహుశా మరియ నేలపై పడి ఆయన పాదాలు పట్టుకొని ఉండవచ్చు. మత్తయి £28:9 పోల్చి చూడండి. యేసు ఇచ్చిన జవాబుకు అర్థం ఇదై ఉండవచ్చు- “నన్ను నీవు గట్టిగా పట్టుకోనక్కర్తేదు. నేను ఇంత త్వరలో ఎక్కడికీ వెళ్ళిపోను. నన్ను మళ్ళీ చూచే అవకాశం నీకు కలుగుతుంది”, లేదా “నన్ను ఈ లోకంలోనే ఉంచెయ్యాలని చూడవద్దు. మనుషుల విముక్తి కోసం దేవుడు చేసిన ఏర్పాటు పూర్తిగా నెరవేరాలంటే నేను పరలోకానికి వెళ్ళిపోవలసి ఉంది” అని ఆయన అర్థం కావచ్చు.
“సోదరులు” - శారీరకంగా తన తమ్ముళ్ళ (2:12; 7:3,5,10) గురించి కాదు గాని తన శిష్యులను ఉద్దేశించే ఈ మాట చెప్పాడని అనుకోవడంలో సందేహం లేదు. మత్తయి 12:47-50; హీబ్రూ £2:10-12 పోల్చి చూడండి.
“వెళ్ళిపోతున్నాను” - 14:28; మార్కు 16:14; 24:51; అపొకా 1:9-11.
“నా తండ్రి. . .మీ దేవుడు” - “మన తండ్రి, మన దేవుడు” అనలేదు యేసు. దేవుడు విశ్వాసులకు తండ్రి గానీ యేసుకు వేరే విధంగా తండ్రి. యేసు శాశ్వతుడైన దేవకుమారుడు (1:1,14,18). విశ్వాసులు దుర్బలులైన మానవమాత్రులే. వారు నూతన జన్మద్వారా, దేవుని కృపవల్ల మాత్రమే దేవుని సంతానం అయ్యారు (1:12,13).
లూకా చెప్పు: నా తండ్రి, మీ తండ్రి దగ్గరకు, నా దేవుడు, మీ దేవుని దగ్గరకు పైకి వెళ్ళిపోతున్నాను.”
18 మగ్దలేనే మరియ వెళ్ళి తాను ప్రభువును చూశాననీ ఆయన తనతో ఆ విషయాలు చెప్పాడనీ శిష్యులకు తెలియజేసింది.
19 ఆ రోజు - ఆ ఆదివారం నాడు - సాయంకాల సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు. యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడియ వేసుకొని ఉన్నాయి. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో “మికు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. 20 అలా చెప్పి వారికి తన చేతులనూ ప్రక్కనూ
చూపెట్టాడు. (ప్రభువును చూచి శిష్యులు ఆనందించారు.
21 యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “మీకు శాంతి కలుగుతుంది గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుతున్నాను.” £2£2 ఆ విధంగా చెప్పి ఆయన వారిమీద ఊది “పవిత్రాత్మను స్వీకరించండి. 28 మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమాపణ పొందారు. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి” అన్నాడు.
£24 యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా లేడు. (ఇతణ్ణి “దిదుమ” అంటారు.) 25 కాబట్టి తక్కిన శిష్యులు “మేము ప్రభువును చూశాం” అని అతనితో చెప్పారు.
అతడైతే వారితో “ఆయన చేతులలో మేకుల మచ్చ నేను
20:18 యేసు సజీవంగా లేవడం గురించి ఇతరులకు తెలియపరచిన మొదటి సాక్షి మగ్దలేనే మరియ.
20:19 “భయం కారణంగా” - అంతకుముందే యేసును శత్రువులు సిలువ వేయడం వారు చూశారు. యేసుప్రభువు సంగతి ఏమౌతున్నదో వారికి తెలియదు. ఇది వారిలోని భయాన్ని తొలగించివేసి గొప్ప దైర్యాన్నిచ్చే సంఘటన, అంటే వారిలో పవిత్రాత్మ నిండడం అన్నది ఇంకా జరగలేదు.
“యేసు వచ్చి” - చనిపోయి లేచిన క్రీస్తు దేహం మూసి తాళం వేసి ఉన్న తలుపుల గుండా కూడా పోగలదు. ఆ దేహం అంతకుముందున్న దేహమే (వ 20,27), కానీ చాలా మార్పు చెందిన దేహం. ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యక్షం అయ్యాడు, మాయం అయ్యాడు (లూకా £24:31,836,837). 1 కొరింతు 15:42-44; ఫిలిప్పీ 3:21 చూడండి.
“శాంతి” - ఆయన ఈ లోకానికి రావడంలోని ఉద్దేశానికి అనుగుణమైన పదం (లూకా 2£2:13,14; 14:27).
20:20 వ £27. తాను నిజంగా వారి యేసుప్రభువునేననీ సిలువ మరణం అనుభవించిన తన దేహంతోనే సజీవంగా లేచానని ఆయన వారికి రుజువు చేస్తున్నాడు. లూకా 24:36-43 పోల్చి చూడండి. వారాయన్ను చూచినప్పుడు వారికి కలిగిన ఆనందం ఆయన 16:20-2£22లో వారికి చెప్పిన మాటలకు నెరవేర్చు. ఆయన మరణంలో వారి ఆనందం, ఆశాభావమంతా మరణించింది (లూకా 24:21) ఆయన సజీవంగా లేవడంలో వాటికి ఊపిరి వచ్చింది. 1 పేతురు 1:8 పోల్చి చూడండి.
20:21 “పంపుతున్నాను” - 17:18, మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-48 చూడండి. ఆయన తాను తండ్రికి ప్రతినిధిగా వచ్చినట్టే, తన శిష్యులను తనకు ప్రతినిధులుగా అధికారమిచ్చి పంపుతున్నాడు. ఆయన (ప్రకటించిన శుభవార్తనే వారు తీసుకు వెళ్తారు. ఆయనలాగే వారు దేవుని ఆత్మతో వెళ్తారు (వ 22).
20:22 ఒక సంకేతంగా ఉన్న ఈ పని వారికి జీవం, బలప్రభావాలు, పవిత్రాత్మ సన్నిధి వచ్చేది యేసునుంచే అని సూచిస్తున్నది. ఆయన వారిని పంపుతున్నాడు. వారు చేయవలసిన పనికి ఆత్మ సంబంధమైన సామర్థ్యతను వారికిస్తాడు. ఈ వచనాన్ని ఆది £2:7తో పోల్చి చూస్తే బావుంటుంది. వీరు ఇక్కడ ఒక విధంగా పవిత్రాత్మను పొందారన్నట్టు అనిపిస్తున్నది. అంటే అంతకు ముందు వారితో పవిత్రాత్మ లేడని కాదు. పాత ఒడంబడిక కాలంలో సైతం దేవుని ఆత్మ సన్నిధిని గురించీ పని గురించీ విశ్వాసులకు కొంత తెలుసు (నిర్ణమ 31:8; న్యాయాధి 3:10; 1 సమూ 10:6; 16:18; £2 సమూ 28:2; కీర్తన 51:11; మొ). అయితే ఇప్పుడు యేసుప్రభువు ఒక కొత్త రీతిలో దేవుని ఆత్మను వారికిస్తున్నాడు. ఈ సమయంలో వారికి
ప్రత్యేకమైన జ్ఞానాన్ని, లేఖనాల విషయంలో (గ్రహింపును ఇచ్చాడని అనుకోవచ్చు (లూకా 24:45 పోల్చి చూడండి). ఆయన పవిత్రాత్మను వారిలో నివాసముండే సన్నిధిగా ఇచ్చాడని అనుకోవచ్చు (7:39; 14:17). తన ప్రతినిధులుగా పరిచర్య చేసేందుకు వారికి అధికారాన్ని ఇస్తున్నాడన్నది స్పష్టమే. తరువాత ఆయన వారికి ఆత్మను మరింత ధారాళంగా ఇవ్వనున్నాడు (అపొ కా 1:4,5; £2:1-4). 20:28 మత్తయి 16:19, 18:15-18 పోల్చి చూడండి. యేసుప్రభువు తన సంఘ స్థాపకులతో (అంటే మానవపరంగా), (ప్రతినిధులతో మాట్లాడుతున్నాడు. అంటే భూమిపై ఉన్న ఆయన సంఘం (క్రీస్తు విశ్వాసులందరితో ఏర్పడిన సంఘం) దేవుని ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో, ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతుంది. పాపాలను క్షమించేదీ, క్షమించకపోయేదీ దేవుడే (మార్కు £:7 నోట్. కీర్తన 103:3; 180:4 కూడా చూడండి). ఎలాంటివారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో నిర్ణయించేది కూడా దేవుడే. ఆయన దీన్ని ఇదివరకే నిర్ణయించాడు - లూకా £4:46,47; అపొ కా 10:48; 18:38,89; ఎఫెసు 1:7; 1 యోహాను 1:9. పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం పెట్టుకునేవారినే దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ ఆయన ఉచితంగా ఇచ్చేదే. ఈ సత్యాన్ని (ప్రకటించడం క్రీస్తు సంఘం చెయ్యవలసిన పని. పాత ఒడంబడిక (గ్రంథంలో ఇలాంటిదాని కోసం 2 సమూ 12:18 చూడండి.
పాత ఒడంబడిక ప్రవక్తలు ఫలానా విషయాలు చేస్తారని దేవుడు చెప్పినప్పుడు వారు వాటిని ప్రకటిస్తారని అర్ధం. క్రీస్తు రాయబారులు చేసినది సరిగ్గా ఇదే. క్రీస్తు శుభవార్తను ప్రకటించడం ద్వారా నమ్మేవారందరికీ క్షమాపణ ద్వారాన్ని వారు తెరిచారు. నమ్మని వారందరికీ దాన్ని మూసివేశారు. పాపాలను క్షమించే దేవుని వైపుకు వ్యక్తులను మళ్ళించారు. మత్తయి 6:12; లూకా 11:4లో మనం పాపక్షమాపణ కోసం ఎవర్ని అడగాలో యేసు నేర్పించాడు.
క్రీస్తుంఘం గానీ అందులోని సభ్యుడెవరైనా గానీ ఈ భూమిపై ఎవరితోనైనా ఇలా అనవచ్చు “నీవు యేసుప్రభువుపై నమ్మకం ఉంచితే నీ పాపాలన్సిటికీ క్షమాపణ ఉంది”. విశ్వాసులందరితో వారు ఇలా అనవచ్చు, “మీ పాపాలను మీరు ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించి అన్యాయమంతటి నుంచీ మిమ్మల్ని శుద్ధి చేస్తాడు”. క్రీస్తు క్రైస్తవుల్లో నుంచి ఏ ప్రత్యేక గుంపునూ గురువులుగా, యాజులుగా నియమించలేదు, ఇలాంటి సత్యాన్ని కేవలం వారే ప్రకటించాలని ఎవరినీ ఎన్నుకోలేదు. 20:25 అందుకే ఇతణ్ణి కొన్నిసార్లు “సందేహి అయిన తోమా” అంటారు. ఇతర శిష్యుల సాక్ష్యాన్ని అతడు నమ్మేందుకు సమ్మతించి ఉండవలసింది.
