యోహాను శుభవార్త – భాగము 7 (పుటలు 39–44)
సొంత గొర్రెలకు నేను తెలుసు. 15 తండ్రికి నేను తెలుసు. అలాగే నాకు తండ్రి తెలుసు. నా గొర్రెలకోసం నా ప్రాణం ధారపోస్తాను. 16 ఈ దొడ్డిలో లేని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఒకే మంద ఉంటుంది, ఒకే కాపరి ఉంటాడు. 17 నా ప్రాణం మళ్ళీ తీసుకొనేలా దానిని ధారపోస్తాను, గనుక నేనంటే నా తండ్రికి ప్రేమ. 18 నా నుంచి నా ప్రాణం ఎవరూ తీయరు. నా అంతట నేనే దానిని ధారపోస్తాను. దానిని ధారపోయడానికీ దానిని మళ్ళీ తీసుకోవడానికీ నాకు అధికారం ఉంది. నా తండ్రి నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు.”
19 ఆ మాటల కారణంగా యూదులలో మళ్ళీ విభేదం పుట్టింది. 20 వారిలో చాలామంది ఇలా అన్నారు: “అతడు దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు. అతడు మాట్లాడితే మీరు ఎందుకు వింటున్నారు?” 21 మరి కొందరైతే “అతడివి దయ్యం
పట్టినవాడి మాటలు కావు. తెరవగలదా ఏమిటి?” అన్నారు.
22 అప్పుడు జెరుసలంలో ప్రతిష్ట మహోత్సవం జరిగింది. £28 అది చలికాలం. యేసు దేవాలయంలో ఉన్న 'సౌలొమోను మంటపంలో నడుస్తున్నాడు. 24 యూదులు ఆయన చుట్టు పోగై ఆయనతో “ఎంతవరకు మమ్మల్ని ఇలా అనుమానంలో ఉంచుతావు? నీవే అభిషిక్తుడివి గనుక అయితే మాకు తేటగా చెప్పు!” అన్నారు.
£25 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీకు చెప్పాను గానీ మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేర నేను చేస్తూ ఉన్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. £26 అయితే మీరు నమ్మడం లేదు. ఎందుకంటే నేను మీతో చెప్పినట్టే మీరు నా గొర్రెలు కారు. 27 నా గొర్రెలు నా స్వరం వింటారు. వారు నాకు తెలుసు. వారు నన్ను అనుసరిస్తారు. £28 నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను. వారు ఎన్నడూ నశించరు. వారిని నా
దయ్యం గుడ్డివాళ్ళ కండ్లు
ఆయనలో నమ్మకం ఉంచి లోబడుతూ ఉండగా క్రమేణా పెరుగుతూ ఉండే జ్ఞానం అది (ఎఫెసు 1:17; ఫిలిప్పీ 3:10; £2 పేతురు 38:18). యేసు ఇక్కడ ఉపదేశిస్తున్నది. తన గొర్రెలందరికీ తాను తెలుసునన్న సత్యమే. ఇది ఆయనెవరో కేవలం తెలిసి ఉండడం మాత్రమే కాదు. ఆరంభంలో ఆయన్ను కలుసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం వీటిని ఇది సూచిస్తున్నది (1 యోహాను 1:3). ఇది ఆత్మ సంబంధమైన కలయిక, సహవాసం అని వేరే చెప్పనవసరం లేదుగా. 10:16 తరువాతి కాలంలో ఆయనమీద నమ్మకం ఉంచబోయే ఇతర దేశప్రజలు, జాతుల మనుషుల గురించి యేసు ఇక్కడ చెప్తున్నాడు. వారు ఇప్పటిదాకా శుభవార్త వినకపోయినా, నమ్మకపోయినా, భవిష్యత్తులో వారలా చేస్తారని ఆయనకు తెలుసు. 6:37 పోల్చి చూడండి. అలాంటివారిని తన ప్రజల గుంపులోకి చేరుస్తానంటున్నాడు. ఈ కృప యుగమంతటిలో తన సేవకుల ద్వారా ఆయన ఇది చేస్తున్నాడు. “ఒకే కాపరి” - ఈ యుగంలో “ఒకే మంద” అంటే యేసుక్రీస్తు సంఘం. యూదులు మాత్రమే గాక అన్ని జాతులవారూ అందులో ఉన్నారు. ఆయనొక్కడే సంఘానికి నిజమైన అధిపతి (ఎఫెసు 2:11-22 చూడండి). 10:17 మూడోసారి యేసు తన ప్రాణాన్ని ధారపోయడం గురించి చెప్తున్నాడు (వ 11,15). ఆయన తన గొర్రెలకోసం చేసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఇదే. ఇంతకన్నా స్పష్టంగా గొర్రెల కోసం తన (ప్రేమను ప్రదర్శించడం సాధ్యం కాదు (15:13; రోమ్ 5:6-8; 1 యోహాను 4:10). తండ్రి అయిన దేవుడు అనంత కాలంనుంచి కుమారుణ్ణి (ప్రేమిస్తున్నాడు (5:20; 17:24). అయితే తన ప్రజలకోసం క్రీస్తు ప్రాణత్యాగం చేయడం తండ్రి ఆయన్ను (ప్రేమించడానికి గల ప్రత్యేక కారణం. ఈ కారణాన్ని బట్టే తండ్రి ఆయన్ను అత్యున్నతంగా ఘనపరిచాడు (ఫిలిప్పీ 2:8,9). 10:18 యేసు తాను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవడం గురించి మాట్లాడుతున్నాడు (మత్తయి 16:21; 28:6). ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరూ ఆయన ప్రాణం తీసుకోలేకపోయారు (19:10,11; మత్తయి 26:58). మరణించి తిరిగి సజీవంగా లేవకుండా ఆయన్నెవరూ ఆపలేకపోయారు. ఈ రెండూ కూడా ఆయన విషయంలో దేవుని సంకల్పమే. యేసుకు ఈ రెంటిమీద అధికారం ఉంది. 10:19 ?7:12,43; 9:16.
10:20 97:20; 8:48,52; మత్తయి 4:24. తాను ఏమై
ఉన్నానని ఆయన చెప్పుకున్నాడో దాన్ని వారు నమ్మలేదు గనక ఆయన పిచ్చివాడనుకున్నారు. మతి ఉన్న ఏ మనిషీ కూడా అవి సత్యం అయితేనే తప్ప యేసు తన గురించి చెప్పుకున్న సంగతులను చెప్పుకోలేడన్నది పచ్చి నిజం. యేసు పలికినది సత్యమై ఉండాలి. లేదా ఆయన నిజంగా పిచ్చివాడై ఉండాలి. దేన్ని నమ్మాలో ప్రతి వ్యక్తీ స్వయంగా నిశ్చయించుకోవాలి. యేసును దయ్యం పట్టినవాడని, పిచ్చివాడని చెపితే, ఆయన చూపిన సాక్ష్యాధారాలనూ రుజువులనూ పట్టించుకొనే అవసరం లేదనుకున్నారు ఆ యూదులు (వ 25; 5:81-47). ఎదుటివాడి వాదననుంచి బయట పడాలంటే ఇది సులభ మార్గం.
10:21 కొందరు ఇతరులకన్నా కొంచెం తెలివైనవారు. అయితే వీరు కూడా యేసుప్రభువును అనుసరించడానికి ముందుకు రాలేదు. ఆయన పక్షంగా రెండు మూడు మాటలు మాట్లాడ్డం ఆయన కోరుతున్న నమ్మకం, భక్తిశ్రద్ధలు, అభినివేశం కావు.
10:22 ఆలయం శత్రువుల చేతిలో పడి ధ్వంసమైన తరువాత క్రీ.పూ. 165లో దాన్ని తిరిగి ప్రతిష్టించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఏటేటా జరిపేదే ఈ ప్రతిష్ట మహోత్సవం. 10:24 “అభిషిక్తుడు” గురించి మత్తయి 1:1 నోట్. ఆయన్ను స్పష్టంగా మాట్లాడమంటున్నారు - ఆయన్ను నమ్మాలని కాదు, గాని తన గురించి చెప్పుకున్నది అబద్ధమని చెప్పి ఆయనపై నేరం మోపాలని.
10:25 “నేనే క్రీస్తును, ఇస్రాయేల్ వారి అభిషిక్తుణ్ణి” అనే మాటలు యేసు వాడలేదు. అయితే ఆయన మాటల్లో కొన్ని స్పష్టంగా ఈ అర్థాన్నే ఇస్తున్నాయి. 5:16-47; 6:32-58; 8:12,28-29; 10:7-18 వంటి మాటలను ఆ అభిషిక్తుడు తప్ప వేరెవరూ యథార్థంగా పలకలేరు. ఆయన చూపిన రుజువుల్లో ఆయన చేసిన అద్భుతాలు కూడా భాగమే - వ 38, 5:36. 10:26 8:44.
10:27 ఈ సత్యాలను ఆయన ఇంతకుముందే చెప్పాడు (వ 3,14,16). కొత్తగా ఆధ్యాత్మికంగా జన్మించినవారే క్రీస్తుకు చెందిన గొర్రెలు (8:3-8). వారిలో ఒక నూతన ఆధ్యాత్మిక స్వభావం ఉంది. గనకనే క్రీస్తు స్వరాన్ని విని ఆయన వెంట వెళ్ళగలుగుతారు. ఆయన వెంట వెళ్ళడమంటే ఆయనపై నమ్మకం పెట్టి ఆయనకు లోబడడం. ఆయన ప్రజల జంట లక్షణాలు నమ్మకం, విధేయత. అవి రెండూ లేకుండా మనుషులు నిజమైన క్రైస్తవులు కాలేరు.
10:28 “శాశ్వత జీవం” - ఇది ప్రస్తుతం విశ్వాసులకు ఉన్నది చేతిలో నుంచి ఎవరూ ఎత్తుకుపోరు. 29 వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతిలోనుంచి వారిని ఎవరూ ఎత్తుకుపోలేరు. 380 నేను, నా తండ్రి ఒకటే.”
81 యూదులు మళ్ళీ ఆయన మీద రువ్వడానికి రాళ్ళు చేతపట్టుకొన్నారు. 32 అయితే యేసు “నా తండ్రి నుంచి అనేక మంచి పనులు నేను మీకు చూపాను. ఆ పనుల్లో చేని కారణంగా మీరు నామీద రాళ్ళు రువ్వుతున్నట్టు?” అని వారికి బదులు చెప్పాడు.
38 “మంచి పనికి కాదు గానీ దేవదూషణకే మేము నీ మీద రాళ్ళు రువ్వుతాం. నీవు మనిషివే అయినా నిన్ను దేవుడుగా చేసుకుంటున్నందుకే” అని యూదులు ఆయనకు బదులు చెప్పారు.
84 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీ ధర్మశాస్త్రంలో “మీరు దేవుళ్ళని నేను గదా చెప్పాను” అని వ్రాసి ఉంది గదా. 85 లేఖనం అర్థ రహితం కానే కాదు. దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చిందో ఆయన వారిని దేవుళ్ళు అన్నాడూ అంటే,
(8:36; 5:24). క్రీస్తును అనుసరించడం మూలంగా వారికి శాశ్వత జీవం కలగదు. వారిలో శాశ్వత జీవం ఉంది కాబట్టి వారు క్రీస్తును అనుసరిస్తారు.
“ఎన్నడూ నశించవు” - తన గొర్రెలన్నీ ఎప్పటికీ క్షేమంగా భద్రంగా ఉన్నారని క్రీస్తు బహు స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు. 6:39,40,54,56; 1%7:11,15; రోమ్ 5:9,10; 8:30-39; ఫిలిప్పీ 1:6; హీట్రూ 7:25; 1 పేతురు 1:3-5 చూడండి. వ 27,28లోని మాటల కూర్పును జాగ్రత్తగా గమనించండి. ఇలా రాసి లేదు - “నా గొర్రెలు నా స్వరం వింటే, నన్ను అనుసరిస్తే నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను. అప్పుడు అవి ఎన్నడూ నశించవు”. క్రీస్తు మాటల్లో “వింటే”, “అనుసరిస్తే” అన్నవి లేవు. అలాంటి షరతులు కూడా లేవు. గొర్రెల భద్రత అవి యేసు గొర్రెలే అన్న విషయంపై ఆధారపడేది గాని మరి ఏ ఇతర షరతుపైనా ఆధారపడి లేదు. గొర్రెల లక్షణం తను కాపరి స్వరం విని అతణ్ణి అనుసరించడమే. అవి అలా చెయ్యకపోతే అవి గొర్రెలే కాదన్నమాట. నిజమైన గొర్రెలు మంచి కాపరి కాపుదలలో ఉండడం వల్లే క్షేమంగా, భద్రంగా ఉన్నారు.
కానీ విశ్వాసులు క్రీస్తులో తమ నమ్మకాన్ని వదులుకుని ఆయన్ను శాశ్వతంగా విడిచిపెట్టడం సాధ్యం కాదా? అలా చేసేవారు నశించిపోతారు. కానీ తన గొర్రెలు ఎన్నడూ నశించరని క్రీస్తు చెప్తున్నాడు. మొదట్లో వారికి నమ్మకాన్ని దయచేసిన దేవుడు (ఫిలిప్పీ 1:29; ఎఫెసు 2:8; హీబ్రూ 12:2) వారిని ఆ నమ్మకంలో చివరిదాకా కొనసాగేలా చేస్తాడని దీని భావం (లూకా £22:31,32; రోమ్ 5:9,10, 8:87; ఫిలిప్పీ 1:6; 1 పేతురు 1:5 చూడండి). యిర్మీయా 82:40 పోల్చి చూడండి. అలాగైతే గొర్రెలు కొన్నిసార్లు దారి తప్పి ఎటో వెళ్ళిపోవచ్చు గదా. తాత్కాలికంగా అలా జరగవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో తానేమి చేస్తాడో యేసుప్రభువు తెలియజేశాడు (మత్తయి 18:12-14; లూకా 15:3-7).
అయితే ఇలా భద్రత ఉందన్న ఉపదేశం పాపాన్ని ప్రోత్సహించదా? తాము శాశ్వతంగా క్షేమంగా ఉన్నామనుకుని గొర్రెలు తమకిష్టం వచ్చినట్టు చేయరా? ఈ ఆలోచనా విధానం నిజమైన గొర్రెల మనస్తత్వం కాదు. వారికిష్టమైనదాన్నే ఇప్పుడు చేస్తున్నారు. అంటే క్రీస్తును అనుసరించడం వారికి ఇష్టం. ఇప్పుడు అనుసరిస్తున్నదాని కంటే మరింత సన్నిహితంగా అనుసరించలేకపోతున్నామే అన్నదే వాళ్ళ విచారం. అలా కాకపోతే వారు ఆయన గొర్రెలు కాదన్నమాట. తాము భద్రంగా ఉన్నామన్న జ్ఞానం వారిలో పవిత్రతను పెంపొందిస్తుంది. ఈ పవిత్రత తప్పిపోతామేమోనన్న భయంపై ఆధారపడేది కాదు గాని మంచి కాపరిని ప్రేమించడంపై, ఆయన ప్రేమ, ప్రభావాలపై ఉన్న నమ్మకంమీద ఆధారపడే పవిత్రత అది.
“నా చేతిలో నుంచి” - ఆయన చేతిలోనుంచి గొర్రెలను లాక్కోవాలంటే ఆయనకన్న బలమైన చెయ్యి కావాలి. ఏ దుర్మార్గుడూ, సాక్షాత్తూ సైతాను అయినా క్రీస్తు గొర్రెలను ఆయననుంచి ఎత్తుకుపోలేడు. క్రీస్తు మంచి కాపరి. ఏ కాపరి
అయినా తన గొరైలను క్షేమంగా ఉంచుకోవాలంటే రెండు విషయాలు అవసరం - అలా ఉంచుకోవాలన్న పట్టుదల, అందుకు కావలసిన శక్తిసామర్థ్యాలు. క్రీస్తుకు ఈ పట్టుదల, సామర్థ్యం రెండూ పరిపూర్ణంగా ఉన్నాయి. ఆయన ఎవరో, ఏమిటో దాన్నిబట్టే గొర్రెలు క్షేమంగా ఉన్నారు.
క్రీస్తుకు చెందిన ప్రజలు తండ్రినుంచి ఆయనకు లభించిన ప్రత్యేక (ప్రేమ బహుమానం (6:37; 17:6). ఈ బహుమానాన్ని కాపాడుకోవడానికి ఆయన తన శక్తినంతటినీ ఉపయోగిస్తాడు. ఆయన శక్తి అమితం. 10:29 రెండు అమిత శక్తిగల హస్తాలు క్రీస్తు గొర్రెలకు కాపుదలగా ఉన్నాయి. ఇది రెట్టింపు భద్రత. కొలస్సయి 38:2 చూడండి. విశ్వాసుల జీవం దేవుని లోపలే దాచబడి ఉంది. దాన్ని అక్కడనుంచి తొలగించగలిగేదెవరు?
“అందరికంటే గొప్పవాడు” - 14:28 చూడండి. 10:30 తండ్రీ, కుమారుడూ ఒకే వ్యక్తి అని ఇది చెప్పడం లేదు. అలాంటి అర్థం దీనికి రాదు. గ్రీకులో ఈ “ఒకటే” అనే పదం ఇద్దరూ ఒకే తత్వంలో ఐక్యమై ఒకే స్వభావంలో భాగస్వాములై ఉన్నారని సూచిస్తున్నది. 1:1 చూడండి. ఫిలిప్పీ 2:6; లూకా £2:11 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు చూడండి. త్రిత్వం గురించి 5:30; మత్తయి 38:16,17; 28:19; 2 కొరింతు 18:14; ఎఫెసు 4:6 చూడండి. ఇక్కడ ఉన్న యేసు ఉపదేశం అద్వైత వేదాంతం వంటిది ఏమాత్రమూ కాదు. మనుషులంతా దేవునితో ఏకమైన వారేననీ, మనిషి ఆత్మ, దేవుని ఆత్మ ఒకటేననీ అద్వైతం నేర్చుతూవుంది. యేసు చెప్పినది ఇది కానే కాదు. తాను అంటే దేవుని ఏకైక కుమారుడు తండ్రితో ఏకంగా ఉన్నానని చెప్తున్నాడు. తాను ప్రత్యేకమైన వ్యక్తిననీ, కొన్ని ప్రాముఖ్య విషయాల్లో ఇతర మనుషుల్లాంటివాడు కాదని పదే పదే చెప్పాడు - 3:15; 8:28,24; మొ. 10:31 5:18 చూడండి. 10:32 వ 380లో ఆయన చెప్పిన సత్యాన్ని సూచించేవే ఆయన అద్భుతాలు. మొద్దుబారిపోయిన ఈ అవిశ్వాసులు తన గురించి ఆయన చెప్పిన దాన్నంతటినీ, చూపిన రుజువులన్నిటి నీ నిరాకరించి ఆయన మానవ మాత్రుడే అన్నారు. కానీ రెండు విషయాల్లో వాళ్లు చెప్పినది నిజమే - ధర్మశాస్త్రం (ప్రకారం దేవదూషణకు శిక్ష మరణమే. మనవ మాత్రుడు తాను దేవుణ్ణని చెప్పుకోవడం దేవదూషణే. అది మరణశిక్షకు తగిన భయంకరమైన పాపం (లేవీ 24:16; సంఖ్యా 15:30). రాబోయే న్యాయవిరోధి చేసే పాపం సరిగ్గా ఇదే ( 2 తెస్స £2:3,4). బైబిల్లో నిజ దేవుడు మనుషులందరినీ సృష్టించినవాడుగా, వారికంటే అన్ని విధాలా ఉన్నతుడుగా తనను తాను వెల్లడి చేసుకున్నాడు (ఆది 2:7; సంఖ్యా 23:19; కీర్తన 9:19,20; యెషయా 40:22-26). కానీ యేసు మానవమాత్రుడు అనుకోవడంలో ఈ యూదులు ఘోరమైన పొరపాటులో ఉన్నారు. 10:34 కీర్తన 82:6. ఆ కీర్తన గురించి నోట్స్ చూడండి. 10:35 పూర్తి పాత ఒడంబడిక (గ్రంథం (లేఖనం)
36 తండ్రి ప్రత్యేకించి లోకానికి పంపినవాడు నేను దేవుని కుమారుణ్ణి” అని చెప్పినందుచేత “నీవు దేవదూషణ చేస్తున్నావు” అని మీరు అంటారా? 87 నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి. 38 అవి నేను చేస్తూ ఉంటే, నన్ను నమ్మకపోయినా తండ్రి నాలో ఉన్నాడనీ నేను తండ్రిలో ఉన్నాననీ మీరు తెలుసుకొని నమ్మేలా ఆ క్రియలే నమ్మండి. ”
39 మరోసారి వారు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన వారి చేతికి చిక్కకుండా వెళ్ళాడు. 40 అప్పుడాయన యొర్దాను అవతలికి, యోహాను మొట్టమొదట బాప్తిసం ఇచ్చిన స్థలానికి తిరిగి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు.
41 చాలామంది ఆయన దగ్గరికి వచ్చి “యోహాను అద్భుతమైన సూచన ఏదీ చేయలేదు గాని ఈయన విషయం అతడు చెప్పినదంతా నిజమే” అని చెప్పుకొన్నారు. 42 అక్కడ చాలామంది ఆయనమీద నమ్మకం ఉంచారు.
క్ట క్ట బేతనీ (గ్రామం వాడైన లాజరుకు జబ్బు చేసింది. ఆ (గ్రామంలోనే మరియ, ఆమె సోదరి మార్త
ఉండేవారు. 2 ఈ మరియ అత్తరుతో ప్రభువును అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాల తుడిచింది. జబ్బుగా ఉన్న లాజరు ఈమె సోదరుడు. 8 అందుచేత అక్కచెల్లెండ్లు యేసుకు ఇలా కబురంపారు: “ప్రభూ! నీవు ప్రేమతో చూచే వాడికి జబ్బు చేసింది.”
4 అది విని యేసు “ఆ రోగం రావడం మరణం కోసం కాదు గాని దాని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమకోసమే వచ్చింది” అన్నాడు.
5 యేసుకు మార్త, ఆమె సోదరి, లాజరు అంటే ప్రేమ. 6 అతడు జబ్బుగా ఉన్నాడని విని కూడా ఆయన ఉన్న చోట ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. 7 ఆ తరువాత ఆయన శిష్యులతో అన్నాడు “యూదయకు తిరిగి వెళ్లాం, పదండి.”
8 శిష్యులు “గురువర్యా, ఇటీవలే యూదులు నీమీద రాళ్ళు రువ్వాలని చూశారు! తిరిగి అక్కడికి వెళ్తావా?” అని ఆయనతో అన్నారు.
9 యేసు ఇలా జవాబిచ్చాడు: “పగటికి ఉన్నవి పన్నెండు గంటలు గదా. ఎవరైనా పగటివేళ నడిస్తే అతనికి ఈ లోకం వెలుగు కనిపిస్తుంది గనుక తడబడడం అంటూ ఉండదు.
రాయించినది దేవుడే అనీ అది దేవుని అధికారం గలదనీ యేసుప్రభువు ఇక్కడ స్థిరపరుస్తున్నాడు. మత్తయి 4:4,7,10; 5:17,18; 15:3; 22:43; మార్కు 12:36; లూకా 24:44 కూడా చూడండి. ఆయన దృష్టిలో పాత ఒడంబడిక (గ్రంథం దేవుని వాక్కు
10:36 యేసు వారికిచ్చిన జవాబు స్పష్టంగా, చాలా ప్రభావం గలదిగా ఉంది. దేవుడే మానవమాత్రులను కీర్తన 82:6లో దేవుళ్ళు అనీ, సర్వాతీతుని కుమారులు అనీ అన్నాడు. ఇది దేవదూషణ కాదు. అలాగైతే సాక్షాత్తూ ఒక్కడే అయిన దేవుని కుమారుడే తాను ఆ కుమారుణ్ణి అని "చెప్పుకోవడం దేవదూషణ ఎలా అవుతుంది? 8£2వ "కీర్తనలో దేవుడు ఇస్రాయేల్ నాయకులకు వారి ఉన్నత పదవులకు అనుగుణంగా బిరుదులు ఇవ్వడం ద్వారా వారిని గౌరవిస్తున్నాడు. అయితే దేవుడు క్రీస్తును ప్రత్యేకించి ఈ లోకానికి ద్వారా ఆయనను గౌరవించాడు (8:18-17; 6:57; 8:29 కూడా చూడండి).
10:37,38 తాను దేవుని కుమారుణ్ణనీ, తండ్రితో ఏకమై ఉన్నాననీ చెప్పడమే కాదు, అందుకు ఆధారాలూ రుజువులూ ప్రదర్శించాడు. ఆయన అద్భుతాలు ఆయన మాటల్ని బలపరచాయి (2:11; 5:36; మత్తయి 8:1; 11:4,5). 10:39 యేసు చెప్పగలిగినదేదీ కఠినులు, దురభిమానులు, బుద్ధికి వ్యతిరేకులు అయిన ఈ మనుషుల్ని ఒప్పించలేదు.
పంపడం ర్:87;
10:40 1:28. ఇది యొర్దాను నదికి తూర్పున ఉంది. 10:41 “చెప్పినదంతా” - 1:26,27,29,34. 10:42 జెరుసలంలో గాఢమైన యూద మతనిష్ట
వాతావరణానికి దూరంగా ఉన్నవారు క్రీస్తు ఉపదేశాలను అంత తేలికగా నిరాకరించక, నమ్మడానికి మరింత సుముఖంగా ఉన్నారు.
11:1 లాజరు అనే పేరు ఎలియాజరు అనే పేరులోనుంచి వచ్చింది. దీని అర్ధం “దేవుడు సహాయం చేశాడు”. జెరుసలంకు తూర్పు దిక్కున ఆలివ్ కొండపై బేతనీ గ్రామం ఉంది.
11:2 12:3. శుభవార్తల్లో మరియ అనే పేరున్న స్రీలు కొందరు కనిపిస్తారు - 19:25; మత్తయి 1:18; 27:56. 11:3 కష్టకాలంలో విశ్వాసులంతా చేయవలసినది ఇదే.
యేసుకు ఈ కుటుంబ సభ్యులంతా బాగా తెలుసు. వారిపట్ల ఆయన ప్రత్యేక వాత్సల్యం చూపించాడు. లాజరు అక్కచెల్లెళ్ళు అతని పేరును కూడా యేసుకు చెప్పనవసరం లేదు.
11:4 యేసు ప్రత్యేకంగా అభిమానించిన వ్యక్తికి కూడా జబ్బు చేసింది. చూడండి. ప్రభువు ఆ వ్యాధిని రాకుండా చేయలేదు, అంతకు ముందు ఆయన అనేక వ్యాధులను బాగుచేసినా అతణ్ణి బాగు చెయ్యలేదు. యోబు 2:48; £2 కొరింతు 12:7-10; 1 తిమోతి 5:23; £2 తిమోతి 4:20 కూడా చూడండి.
“మహిమ కలిగేలా” - 9:8 పోల్చి చూడండి. దేవుని కుమారునికి మహిమ కలిగితే దేవునికి మహిమ కలుగుతుందని గమనించండి. లాజరు మరణం యేసుప్రభువు తన కృప, (ప్రభావాలను ప్రదర్శించేందుకు మరో అవకాశం అతణ్ణి తిరిగి (బ్రతికించడమనే మహా అద్భుతం. ఆయన దేవుని కుమారుడైన అభిషిక్తుడనడానికి మరో సూచన (2:11).
11:6 యేసుప్రభువుకు వారంటే (ప్రేమ ఉన్నప్పటికీ వారికి సహాయం చేసేందుకూ ఓదార్చేందుకూ పరుగెత్తుకుంటూ వాళ్ళ ఊరు వెళ్ళలేదు. అంతకన్నా (శ్రేష్టమైన కార్యం ఒకటి, దానికి అనువైన సమయంలో చేయాలని ఆయన మనస్సులో ఉంది. తమ సమస్యను ఆయన చేతుల్లో వదిలి ఆయన సమయం కోసం ఎదురు చూచేవాళ్ళకు సరైన సమయంలో తమకు లభించగల అన్ని మేలుల్లోకీ గొప్ప మేలు ఆయన్నుంచి లభిస్తుంది. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే మన మనవి నిరాకరించాడని కాదు. ఆయన ఉద్దేశంలో అందుకు మంచి కారణాలు ఉండబట్టి కొన్ని సార్లు మనల్ని బాధలు పడనిస్తాడు (2 కొరింతు 4:17; 12: 7-10, ప్రకటన 2:10; యోబు 38:20). లాజరు విషయంలో ఆయన ఇలా జాగుచేయడం బహుశా అతని అకృచెల్లెళ్ళకూ, తన శిష్యులకూ విశ్వాస పరీక్షగా ఆయన ఉద్దేశించాడేమో. 1 పేతురు 1:6,7.
11:7 జెరుసలం ముఖ్య పట్టణంగా ఉన్న ప్రాంతం యూదయ. 11:8 “గురువర్యా” - 1:38.
11:9,10 9:4; 12:35 పోల్చి చూడండి. ఒక పనిని పూర్తి చేయడానికి దేవుడు ఒక సమయాన్ని నియమిస్తాడు; దేవుడిచ్చిన వెలుగులో నడుచుకునేవారు దేనికీ భయపడనవసరం లేదు; తాను చేస్తున్నదేమిటో తనకు బాగా తెలుసు; వెలుగులో 10 కానీ రాత్రివేళ నడిచేవాడిలో వెలుగు లేకపోవడంచేత తడబడుతాడు.”
11 ఇలా చెప్పిన తరువాత ఆయన “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి మేల్కొలపడానికి వెళ్తాను” అని వారితో చెప్పాడు.
12 అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడుతాడు” అన్నారు.
18 యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు గాని సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారనుకొన్నారు. 14 కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు:
“లాజరు చనిపోయాడు. 15 నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ నంతోషం మీ మేలు విషయమే. అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతనిదగ్గరకు వెళ్లాం, పదండి.” 16 అప్పుడు తోమా (అతణ్ణి 'దిదుమ” అని కూడా అంటారు) సాటి శిష్యులతో అన్చాడు “ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్లాం.”
17 యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు. 18 బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరన ఉంది. 19 కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు. 20 యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది. 21 మార్త యేసుతో ఇలా అంది:
“ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు. £22 ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
£23 యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
24 “చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
£25 అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు.
ఆయనతోబాటు వారు సాగిపోవాలి అని యేసు ఇక్కడ చెప్తున్నాడు.
11:11 “స్పెహితుడు” 15:14,15 చూడండి. ఇక్కడ “నిద్రపోయాడు” అంటే అర్ధం “చనిపోయాడు” (వ 14). శరీరం మరణించడానికి పాత, క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో రెండు పుస్తకాలలోనూ ఈ విధంగా వర్ణించడం జరిగింది (ద్వితీ 31:16;
దానియేలు 12:2; మత్తయి 27:52; అపొ కా 7:60; 18:36; 1 కొరింతు 7:39; 11:80; 15:6-18; 1 తెస్స 4:18,14. ఈ తర్ణుమాలో సాధారణంగా ఇది “కన్ను
మూయడం” అని అనువదించాం). ఈ మాట మరణం తరువాతి జీవితం, మరణించినవారి మధ్యనుంచి లేవడం అనేవాటిని సూచిస్తున్నది - నిద్రపోయిన వారు తెల్లారినప్పుడు తిరిగి లేస్తారు గదా (దానియేలు 12:2). ఈ సందర్భంలో నిద్రపోవడం అంటే చనిపోయినవారికి స్పృహ, చైతన్యం ఉండదని అర్ధం కాదు - లూకా 16:22-26; ప్రకటన 6:9,10 చూడండి. నిద్రపోయేది ఆత్మ కాదు దేహమే. “మేల్కొలపడానికి” అంటే చనిపోయినవాణ్ణి తిరిగి సజీవంగా లేపడానికి అని అర్ధం.
11:12,18 ఇంతకుముందు తరచుగా జరిగినట్టుగానే మనుషులు యేసు మాటలను అక్షరాలా తీసుకుని వాటిని పొరపాటుగా అర్ధం చేసుకున్నారు.
11:14 8:4. 411,15,82; 6:52; మత్తయి 16:6 పోల్చి చూడండి. క్రీస్తుకున్న మానవాతీతమైన జ్ఞానానికి మరో ఉదాహరణ. లాజరుకు జబ్బు చేసిందని మాత్రమే ఆయనకు కబురు వచ్చింది. కానీ అతడు చనిపోయాడని యేసుకు తెలుసు. 1:48-50; £2:24,25 కూడా చూడండి.
11:15 యేసుప్రభువు ఒక మహా అద్భుతాన్ని చేయనున్నాడు. దాని ఫలితంగా ఆయన శిష్యుల నమ్మకం అభివృద్ధి చెందుతుంది. సంతోషించడానికి కారణం ఇదే గానీ లాజరు చనిపోవడం కాదు.
11:16 “తోమా” - మత్తయి 10:8. “దిదుమొ అన్నా “తోమా” అన్నా అర్థం ఒకటే - “కవల”. యేసు గనక యూదయ (ప్రాంతానికి తిరిగి వెళ్తే తప్పక హతమౌతాడనీ ఆయనతోబాటు తాము కూడా హతమవుతామన్న విషయంలో ఇతడికి ఏమాత్రం సంశయం ఉన్నట్టు లేదు. ప్రతిదానిలోనూ కీడు ఉందేమో అని తలంచే స్వభావం ఇతనిది. నమ్మకం ఉంచవలసిన సందర్భంలో సందేహించే మనస్తత్వం అతనికి ఉంది. (14:5; 20:24-27).
11:17 లాజరు అక్కచెల్లెళ్ళు యేసుకు వార్త పంపిన కొద్ది సమయానికి లాజరు చనిపోయి ఉండాలి (వ 3). వార్త యేసుకు చేరడానికి ఒక రోజు పట్టి ఉంటుంది. ప్రయాణం కట్టకముందు ఆయన రెండు రోజులు ఆగాడు. ప్రయాణమై బేతనీ చేరడానికి మరో రోజు పట్టింది.
11:19 ఈ కుటుంబం ఊళ్ళో మంచి పరువు మర్యాదలుగల కుటుంబం అయి ఉండాలి.
11:20 ఇద్దరిలోనూ మార్త చురుకైనది. మరియ నెమ్మదిగా ఉండేది (లూకా 10:38-42).
11:21 యేసు గనక అక్కడున్నట్టయితే లాజరును బాగుచేసి ఉండేవాడే అని ఆమె ఉద్దేశం. లాజరు విషయంలో ఇది నిజమో కాదో చెప్పలేము. అందరి విషయంలోనూ ఇది నిజం కాదని మనకు తెలుసు. ప్రభువు ఎప్పుడూ తన విశ్వాసులతో ఉండేవాడు (మత్తయి 28:20), నిజంగా వారిలో ఉండేవాడు (17:28; £ కొరింతు 18:5; కొలస్సయి 1:27). అయినప్పటికీ ఇన్ని శతాబ్దాలుగా వారంతా చనిపోతూనే ఉన్నారు. వారిలో అనేకులు చాలా నొప్పులు, ఆయా వ్యాధులతో బాధపడుతూ చనిపోయారు.
11:22 (ప్రభువు ఆళ్ళర్య క్రియలు చేయగలడని ఆమెకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆయన లాజరును సజీవంగా లేపుతాడని ఆమె అనుకున్నదా అన్నది సందేహమే. వ 39 చూడండి. చనిపోయిన వారందరూ తిరిగి లేచే రోజున లాజరు లేస్తాడని ఆమె నమ్మింది (వ 24). అయితే అది వేరే విషయం. యేసు ఒకవేళ లాజరును ట్రతికిస్తాడేమోనన్న ఆలోచన ఆమెలో మొలకెత్తడానికి ప్రయత్నిస్తూ ఉండగా, దాన్ని నమ్మడానికి ఆమె కొట్టుమిట్టాడుతున్నదేమో. £28,25,26 వచనాల్లో ఆమెతో యేసు చెప్పిన మాటలు దాన్ని నమ్మేందుకు ఆమెను (ప్రోత్సహించడం కోసమేమో.
11:25 5:21-29 చూడండి. యేసుప్రభువులో సాక్షాత్తూ దేవుని జీవం ఉంది. విశ్వాసుల జీవం ఆయనే (కొలస్సయి 3:3,4). ఆయనలో, ఆయనలో మాత్రమే మనుషులు శాశ్వత జీవాన్ని పొందగలరు (38:16,86; ర6:53,54; 14:6). పునర్జీవితం ఆయనే. పునర్జీవితం అంటే పునర్జన్మ కానే కాదు. పునర్జన్మ అనే సిద్ధాంతం బైబిలు ఉపదేశానికి విరుద్ధం. 9:3 నోట్ చూడండి. తనకు ఇష్టమైనప్పుడు ఎవరినైనా, తనను సహా సజీవంగా లేపే అధికారం, శక్తి తనకున్నదని ఆయన చెప్తున్నాడు 26 బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
£7 ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
28 ఇలా చెప్పి ఆమె వెళ్ళి తన సోదరి మరియను పిలిచి రహస్యంగా “గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు” అంది. 29 ఆమె ఆ మాట విని గబాలున లేచి ఆయన దగ్గరికి తరలివెళ్ళింది. 80 యేసు ఇంకా (గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు. 81 ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియ గబాలున లేచి బయటికి వెళ్ళడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడ్వడానికి వెళ్తుందని చెప్పి ఆమె వెంట వెళ్ళారు. 8£ యేసు ఉన్న స్థలానికి మరియ చేరి ఆయనను చూచి ఆయన పాదాలదగ్గర సాగిలపడి “ప్రభూ! ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు” అంది.
88 ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్వడం యేసు చూచి ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు: 84 “అతణ్ణి మీరెక్కడ ఉంచారు?” వారు “ప్రభూ, వచ్చి చూడండి” అని ఆయనతో అన్నారు.
85 యేసు కన్నీళ్ళు విడిచాడు. 86 అందువల్ల యూదులు “ఇదిగో అతడంటే ఈయనకు ఎంత (ప్రేమో చూశారా!” అని చెప్పుకొన్నారు.
37 అయితే వారిలో కొంతమంది “ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేక పోయేవాడా?” అన్నారు.
388 మళ్ళీ తనలో పరితపిస్తూ యేసు సమాధి దగ్గరికి వచ్చాడు. అది గుహ. దానిమీద బండ ఉంది. 839 యేసు “బండ తీసివేయండి” అన్నాడు. చనిపోయినవాని సోదరి మార్త “ప్రభూ, అతడు నాలుగు రోజులు నిర్జీవంగా ఉన్నాడు, గనుక కంపుకొడతుంది” అని ఆయనతో చెప్పింది.
40 యేసు “నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా?” అని ఆమెతో అన్నాడు.
(5:21; 10:17,18). క్రీస్తులో విశ్వాసులు దేవుని సన్నిధిలో అనంత కాలం జీవిస్తారు (14:3; 1 తెస్స 417). వారికి మరణం జీవితానికి అంతం కాదు. మరింత (శ్రేష్టమైన జీవితానికి అది ఆరంభం మాత్రమే (2 కొరింతు 5:6-8; ఫిలిప్పీ 1:21-23),.
11:26 5:24; 6:50,51. విశ్వాసులు శరీర సంబంధంగా మరణిస్తారు గాని శాశ్వతంగా జీవిస్తారు. ఆత్మ సంబంధమైన మరణం (ఎఫెసు 2:1) వారిని ఎన్నడూ తాకదు. తనమీద నమ్మకం ఉంచడం ఎంత (ప్రాముఖ్యమో యేసు నొక్కి చెప్తున్న సంగతి మళ్ళీ గమనించండి. 38:15,16,18; 6:40; 8:24; 10:37,38 చూడండి.
11:27 “అభిషిక్తుడు” - మత్తయి 1:1.
“దేవుని కుమారుడు” - 1:34,49; 6:68; 20:31; మత్తయి 3:17; 16:16. మార్తకున్న నమ్మకం నిజమైనది, స్థిరమైనది. 11:30 మరియను ఒంటరిగా కలుసుకుని ఓదార్చి ఆమె నమ్మకాన్ని (ప్రోత్సహించాలని (ప్రభువు అక్కడ ఉండిపోయి నట్టుంది. కానీ యూదులు ఆమె వెంట రావడంతో అందుకు ఎక్కువ సమయం లేకపోయింది.
11:32 వ 21. వ్యాధి నయం కావాలంటే యేసు శారీరికంగా ఆ ప్రదేశంలో ఉండాలన్నట్టు మార్త, మరియ ఇద్దరూ మాట్లాడారు. కానీ 4:47-58; మత్తయి 8:5-18 చూడండి.
11:38 ఆయన అంత పరితపించడం, అంత ఆందోళన చెందడం ఎందుకు? బహుశా బాధపడుతున్న తన స్నేహితుల దుఃఖాన్ని సంపూర్ణంగా ఆయన పంచుకున్నాడేమో (యెషయా 68:9 పోల్చి చూడండి). బహుశా లాజరు భవిష్యత్తులో మరోసారి చనిపోయేలా అతడు ఉన్న (ప్రశాంత స్థితినుండి వెనక్కు తీసుకురావాలని అతడి గురించి దుఃఖపడ్డాడేమో. లేక ఒకవేళ యేసు మరణం గురించీ అది పాపం మూలంగా లోకంలో ఎలా ప్రవేశించిందీ, శత్రువుగా మానవ జాతినంతటినీ ఎలా అణగద్రొక్కి బానిసలుగా చేసుకున్నదీ (రోమ్ 5:12,21; హీబ్రూ 2:14,15) ఆలోచిస్తున్నాడేమో. లేక మరణమనే ఈ శత్రువును ఓడించేందుకు త్వరలో తాను చెల్లించబోయే వెలను - అంటే లోక పాపాల కోసం సిలువపై ఘోర యాతనతో తాను మరణించవలసిన సంగతి గుర్తు చేసుకుంటున్నాడేమో. లేక తన బలి అర్చణవల్ల ఎలాంటి లాభమూ పొందకుండా పాపంలోనే
చనిపోయి శాశ్వతంగా నశించిపోయే అనేకమందిని గురించి తలపోస్తున్నాడేమో. ఒకవేళ ఈ సమయంలో లాజరు సజీవంగా లేవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడేమో (వ 41). ఆయన (ప్రార్ధనలు చల్లగా నిర్లిప్తంగా ఉండవు (హీబ్రూ 5:7 పోల్చి చూడండి. విశ్వాసుల కోసం క్రీస్తు ఆత్మ చేస్తున్న ప్రార్థనలు కూడా పోల్చి చూడండి - రోమ్ 8:27).
11:34 ఇలా అడగడంలో యేసుకు తెలియదని కాదు. ఆయనకున్న మానవాతీతమైన జ్ఞానానికి ఉదాహరణ వ 14లో చూడండి. ఆది 8:9లో దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న గమనించండి.
11:35 బైబిల్లో అన్నిటికన్నా చిన్న వచనం ఇది. కానీ భావంలో మాత్రం పెద్ద వచనాల్లో ఒకటి. విశ్వాన్ని చేసినవాడు, మనుషుల ముక్తి ప్రదాత సానుభూతీ కదలికా వ్యక్తిత్వమూ లేని రాతిగుండె దైవం కాడు. ఆయన ప్రేమిస్తాడు, మన బాధల్ని పట్టించుకుంటాడు, మనుషుల కష్టాల్లో వారి గురించి రోదిస్తాడు (లూకా 21:41-44; యిర్మీయా 48:31,82; నిర్ణమ 2:24,25). 11:37 వ 21, 8£. వారంతా అనది నిజమే. యేసు లాజరును చనిపోకుండా ఉంచగలిగేవాడే. అయితే ఆయన మదిలో వేరొక ఉద్దేశం ఉంది (వ 4). అది వారికింకా అర్థం కాలేదు.
11:38 వ398.
11:39 లాజరును సజీవంగా లేపినవాడు సమాధి రాయి దానంతట అది దొర్లిపోయేలా కూడా చేయగలడు. అయితే చనిపోయిన వ్యక్తిని లేపడంలో వారిని కూడా కొద్దిగా చెయ్యి వెయ్యనిచ్చాడు. ఆ రాయిని తాము తొలగించామనీ ఆ రాయి మూసి ఉన్న సమాధిలో లాజరు మృతదేహం ఉందనీ వారు తరువాత సాక్ష్యం చెప్పగలరు. యేసు చెయ్యబోతున్నది మార్తకు అర్థం కాలేదన్నది స్పష్టం. అందుకనే ఆ రాయిని తొలగించడం ఆమెకు అర్ధం లేని పనిగా అనిపించింది. లాజరు ఏదో స్మృతి తప్పి మైమరచిన స్థితిలో ఉండడం కాదని, అతడు చనిపోయినది ఖాయమనీ మాత్రం ఆమెకు తెలుసు. శరీరం కుళ్ళిపోవడం కూడా మొదలయింది.
11:40 వ 4 ఇంతకుముందు క్రీస్తుకూ మార్తకూ మధ్య జరిగిన సంభాషణలో ఈ మాటలు కనిపించలేదు. అయితే ఆయన అన్న (ప్రతి మాటా ఇక్కడ రాసి ఉంది అనుకోలేము. లేక 41 అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్ధన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 42 నీవు ఎప్పుడూ నా ప్రార్ధనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న (ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
43 ఇలా చెప్పి ఆయన “లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.
44 చనిపోయినవాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్ళకూ చేతులకూ కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టివేసి ఉంది. యేసు వారితో “ఆ కట్లు విప్పి అతణ్ణి వెళ్ళనియ్యండి” అన్నాడు.
45 ఈ కారణంగా, మరియ దగ్గరికి వచ్చిన యూదులలో అనేకులు ఆయన చేసినవి చూచి ఆయనమీద నమ్మకం ఉంచారు.
46 కానీ వారిలో మరి కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు చేసినది వారికి తెలియజేశారు. 47 కనుక ప్రధాన యాజులూ పరిసయ్యులూ సమాలోచన సభను సమకూర్చారు. అప్పుడు వారు ఇలా చెప్పుకొన్నారు:
“ఈ మనిషి అనేక సూచకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు గానీ మనం ఏం చేయాలి? 48 మనం ఇలాగే అతణ్ణి చేయనిస్తే అందరూ అతణ్ణి నమ్ముతారు. అప్పుడు రోమ్వాళ్ళు వచ్చి మన స్థలాన్నీ దేశాన్నీ పూర్తిగా స్వాధీనం చేసుకొంటారు.”
49 వారిలో ఒకడు కయప. అతడు ఆ సంవత్సరం (ప్రముఖ
£25,26లోని మాటల గురించి చెప్పాడేమో. ఈ వచనంలో నమ్మకం ముందు, చూడడం తరువాత రావడం గమనించండి. మనుషులు ఈ క్రమాన్ని తలకిందులు చేయాలనుకుంటారు - చూచి నమ్మాలనుకుంటారు - 4:48. 11:41 “పైకి చూస్తూ? - 17:1. ప్రార్ధనలో మనం ఏ భంగిమలో ఉన్నాం అనది కాదు గాని హృదయ స్థితే ప్రాముఖ్యం. “విన్నందుచేత” - లాజరు సజీవంగా లేవాలని ఆయన ప్రత్యేకించి ప్రార్ధించాడన్నమాట.
“కృతజ్ఞత” - మత్తయి 14:19; లేవీ 7:12,18; కీర్తన 7:17; ఎఫెసు 5:20; 1 తెస్స 5:18. 11:42 యేసు తండ్రియైన దేవుని సంకల్చం ప్రకారమే
ఎప్పుడూ ప్రార్ధించాడు కాబట్టి దేవుడు తన ప్రార్ధనలకు ఎప్పుడూ జవాబిచ్చాడని ఆయనకు తెలుసు (1 యోహాను 5:14,15 పోల్చి చూడండి). తన ప్రార్థన విన్నందుకు బహిరంగంగా ఆయన తన తండ్రికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాడంటే అక్కడ నిలిచి ఉన్న యూదులు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్చుకోవాలి. తాను లాజరును తన స్వశక్తిచేత బ్రతికించడం లేదు, లేక తనకు తానే కోరి అలా చేయడం లేదు. దేవుడు ఆయన్ను పంపాడనడానికి ఆ అద్భుతం ఒక సూచన.
11:43 ఆయన బిగ్గరగా పిలిచినది లాజరు వినాలని కాదు, చుట్టూ ఉన్నవారు వినాలని. ఇక్కడ మాయ గానీ ఇంద్రజాలం గానీ మంత్రం గానీ లోలోపల గొణుక్కునే మంత్రవిద్య గానీ లేవు. చనిపోయిన వ్యక్తికి యేసు స్పష్టమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు అంతే. వ 5:21-27లో ఆయన చెప్పిన ప్రకారం చనిపోయినవాడు తిరిగి బ్రతికాడు.
11:44 పట్టపగలు అనేకమంది నిలబడి చూస్తుండగా బహిరంగంగా జరిగిన మహా అద్భుతం ఇది. యేసుప్రభువుకు జీవన్మరణాలపై అధికారం ఉందని ఇది వెల్లడి చేస్తున్నది. 5:21-27లో తనకు అలాంటి అధికారం ఉందని ఆయన చెప్పాడు. ఇక్కడ దాన్ని రుజువుపరచాడు. భౌతిక లోకంలో ఆయనకు అధికారం ఉంది. నాలుగు దినాల క్రితం మరణించి కుళ్ళి వాసన గొడుతున్న శరీరంలో ఆయన (ప్రాణం పోశాడు. ఆధ్యాత్మిక లోకంలో కూడా ఆయనకు అధికారం ఉంది. చనిపోయిన మనిషి ఆత్మను దాని విశ్రాంతి స్థలం నుంచి వెనక్కు పిలిచి శరీరంలో తిరిగి లీనం చేశాడు.
“ఆ కట్లు విప్పి”? - తన పనిలో మనుషులకు మరోసారి భాగం ఇచ్చాడు. ఈ విధంగా వారు లాజరుకు దగ్గరగా వచ్చి చూచి అతని శరీరానికి చుట్టిన సమాధి బట్టలు తొలగించి, ఇంతకుముందు కుళ్ళిపోయి ఇప్పుడు ఆరోగ్యవంతంగా తాజాగా ఉన్న అతని దేహాన్ని తాకి చూడవచ్చు. తమ కళ్ళెదుట జరిగినది ఏదో బూటకం లేక మాయ కాదని తెలుసుకోవచ్చు.
11:45 రుజువును చూచి వారు యేసును నమ్మారు. ఆ వాస్తవాలనుంచి వారు ఎలా తప్పించుకోగలరు? దేవుని బల ప్రభావాల్ని ఆయన ప్రదర్శించాడు. అది వారికి తెలుసు.
11:46 కొందరైతే ఈ అద్భుతాన్ని చూచి కూడా యేసును అభిషిక్తుడని ఒప్పుకోలేదు. పరిసయ్యులు ఈ సందర్భంలో ఏం చేస్తారో చూద్దామని వెళ్ళారు. ఇంత (పబ్రహ్మాండమైన అద్భుతం కూడా పాపంలో బండబారిపోయిన వారి విరోధ భావాన్నీ దురభిమానాన్నీ అపనమ్మకాన్నీ తొలగించలేదు (లూకా 16:31
చూడండి). తరువాత ' వస్తున్న వచనాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.
11:47 “సమాలోచన సభ” - మత్తయి 5:22. యేసు సూచనకోసమైన ఈ అద్భుతాలు చేస్తున్నాడని వారు ఒప్పుకున్నారు. వారు కొట్టిపారఠవేయలేనంత బలంగా
సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయి (అపొ కా 4:15-17 పోల్చి చూడండి). కానీ అవి చూపిస్తున్న దిశకు వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. వారు కోరేది సత్యాన్ని కాదు కాబట్టి ఆ రుజువులు చూపిస్తున్న వైపుకు వెళ్ళలేకపోయారు. (5:44 చూడండి). క్రీస్తుమీద నమ్మకం ఉంచమని నిశ్చయించుకున్నవారికి ఎన్ని సాక్ష్యాధారాలు చూపినా ఎంత బలమైన రుజువులున్నా నమ్మరు. 11:48 క్రీస్తును నిరాకరించేందుకు వారెలాంటి సాకు చెప్తున్నారో చూడండి. వారి భయమేమిటంటే జనమంతా క్రీస్తులో నమ్మకం ఉంచితే వారు ఆయన్ను తమ నాయకుడుగా చేసుకుని రోమ్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తారు (ఆ కాలంలో వారిని పరిపాలిస్తున్నది రోమ్వారే). అలాంటప్పుడు రోమ్వారు గొప్ప బలగంతో వచ్చి జెరుసలంకు, దేవాలయానికి, జాతి అంతటికీ గొప్ప విధ్వంసాన్ని కలిగిస్తారని వారి భయం. ఈ పరిసయ్యులకు మనుషులంటే భయం గాని దేవుడంటే భయం లేదు. (రోమ్ 3:18). ఇలా రోమ్వారికి భయపడడంలో అర్ధం లేదు. యేసుప్రభువు రాజకీయ నాయకుడుగా ఉండేందుకు ఇంతకుముందే నిరాకరించాడు (6:15). ఆయన రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు (18:36). మనుషుల హృదయాల్లో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం స్థాపించడం గాని రోమ్పై రాజకీయంగా తిరుగుబాటు లేవదీయడం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఈ పరిసయ్యుల కపటబుద్ధి, దుర్మార్గత చూడండి. ఆ జాతిని కాపాడేది తామేనని ఒక పక్క చెప్తూనే మరో పక్క దేవుని కుమారుణ్ణి చంపాలని ఆశిస్తున్నారు. చివరికి వారు భయపడినదంతా జెరుసలం మీదికి వచ్చిపడింది. ఆ జాతి యేసుప్రభువుపై నమ్మకం ఉంచినందుకు కాదు, ఆయన్ను తిరస్కరించినందుకే ఇలా జరిగింది. మత్తయి 28:37-39; £24:1,2; లూకా 19:41-44 చూడండి.
11:49 ఆ సందర్భంలో చేయవలసినదేదో వారు
