యోహాను శుభవార్త – భాగము 3 (పుటలు 15–20)
వచ్చేటప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేస్తాడు.”
26 “నీతో మాట్లాడుతున్న నేను ఆయనను” అని యేసు ఆమెతో అన్నాడు.
27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చారు. ఒక స్త్రీతో ఆయన మాట్లాడడం చూచి వారు ఆశ్చర్యపడ్డారు. అయితే “నీకేం కావాలి” అని గానీ “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గానీ ఎవడూ అడగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అక్కడి మనుషులతో ఇలా అంది:
£29 “నేను చేసినవన్నీ ఓ మనిషి నాకు చెప్పాడు. రండి, ఆయనను చూడండి. ఆయన అభిషిక్తుడు కాడా?”
80 వారు ఊరినుంచి బయలుదేరి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.
31 ఈలోగా ఆయన శిష్యులు “గురువర్యా, తినండి” అని ఆయనను కోరారు.
82 అందుకాయన వారితో “తినడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉంది” అన్చాడు.
38 కనుక శిష్యులు “ఈయనకు తినడానికి ఎవరైనా ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని ఒకనితో ఒకడు చెప్పు కొన్నారు.
84 యేసు వారితో “నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చి ఆయన పని ముగించడమే నా ఆహారం! 85 ఇంకా నాలుగు నెలల తరువాత కోతకాలం వస్తుందని మీరు అంటారు గదా. ఇదిగో వినండి, నేను మీతో అంటున్నాను, మీ తలలెత్తి పొలాలను చూడండి. ఇప్పటికే అవి తెల్లబారి కోతకు తయారయ్యాయి. 36 విత్తనాలు వేసేవాడూ వంట కోసేవాడు కలిసి సంతోషించాలని ఇప్పుడే కోసేవాడు జీతం పుచ్చుకొంటున్నాడు. శాశ్వత జీవం కోసం ఫలం సమకూర్చు కొంటున్నాడు. 87 విత్తనాలు చల్లేవాడొకడు, కోసేవాడు ఇంకొకడు అనే మాట ఈ విషయంలో నిజమే. 38 మీరు కష్టపడనిదాని వంట కోయడానికి నేను మిమ్ములను పంపాను. ఇతరులు కష్టపడ్డారు. వారి కష్ట ఫలితంలో మీరు ప్రవేశించారు” అన్నాడు.
39 “నేను చేసినవన్నీ ఆయన నాకు చెప్పాడని ఆ స్త్రీ
సమరయవారు కూడా రానున్న అభిషిక్తుని కోసం ఎదురు చూచేవారు. యేసు ఆ అభిషిక్తుడై ఉండవచ్చన్న తలంపు ఈ స్త్రీలో ఆరంభమైందేమో. అలా కాకపోయినా ఆయన మాటలు మాత్రం ఆమె మనస్సులో బలంగా నాటుకున్నాయి (వ £9).
4:26 అంతా ఎదురు చూస్తున్న అభిషిక్తుడు తానే అని యేసు తేటతెల్లంగా చెప్పాడు. 1:49,50; 9:37 10:24,25; మత్తయి £26:63,64 కూడా చూడండి.
4:27 ఆ రోజుల్లో యూదుల ఉపదేశకులు ఒక స్త్రీతో అంత సేపు మాట్లాడరు, ఆమెతో ఒంటరిగా ఉండడం ఎవరైనా చూచే (ప్రమాదం కొనితెచ్చుకోరు. యేసుప్రభువైతే ఆ స్త్రీని చిన్నచూపు చూడడం లేదు. వారి అవసరతలో వ్యక్తులందరినీ సమానంగా ఆయన చూచేవాడు. తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న ఆందోళన ఆయనకు లేదు. శిష్యులు ఆయన్నేమీ ప్రశ్నించలేదు. ఆయన చేసే ప్రతి పనికీ సరైన కారణాలు ఉంటాయని వారికి ముందే తెలుసు.
4:29 వ 25.
4:30 ఆమె సాక్ష్యం ఆ ఊళ్ళో పెద్ద కుతూహలం, ఆసక్తి రేపింది. మనుషులను క్రీస్తు చెంతకు తీసుకురావడానికి దేవుడు ఇప్పటికీ ఉపయోగించే పద్ధతి ఇలా సాక్ష్యం చెప్పడం. 4:32,38 ఆధ్యాత్మిక ఆహారం అని యేసు ఉద్దేశం. కానీ వారు ఆయన మాటలను అక్షరాలా అర్ధం చేసుకున్నారు. చెప్పిన ప్రతి మాటనూ ఈ విధంగా అక్షరార్థంగా తీసుకునేవారికి యేసు చెప్పిన అనేక మాటలు అభ్యంతరకరంగా అనిపిస్తాయి (ఉదాహరణగా 6:52-58 చూడండి).
4:34 దేవుని సంకల్పం (ప్రకారం ఆయన పని చెయ్యడంలోనే యేసుకు అసమానమైన సంతృప్తి ఉంది (5:30; 6:38; 8:29; 9:4 14:31; 15:10; 17:4 పోల్చి చూడండి. దేవునికి విధేయత చూపుతూ, హృదయ పూర్వకంగా ఆయన పనిలో నిమగ్నమై, ఇతరులను క్రీస్తుపై నమ్మకంలోకి నడిపిస్తూ ఉండడంలో ఉన్న ఆనందంతో ఈ లోకంలో ఉన్న అన్ని శ్రేష్టమైన పదార్థాలతో విందుల్లో మునిగి తేలడం సాటి రాదు.
4:85 ఇస్రాయేల్ దేశంలో విత్తనాలు చల్లే కాలం ముగిసిన తరువాత కోతకాలం ఆరంభం కావడానికి ముందు నాలుగు నెలల వ్యవధి ఉంది. వారు అంత కాలం వేచి ఉండనక్కర్తేదని యేసు అంటున్నాడు. అప్పుడే అక్కడే కోసుకోవడానికి పంట కోతకు వచ్చి సిద్ధంగా ఉంది. సత్యాన్ని విన్నప్పుడు తనలో
నమ్మకం ఉంచడానికి అక్కడ సిద్ధంగా ఉన్న కొందరు సమరయమవారి గురించి (ఇతరుల గురించి కూడా) ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ రోజుల్లో కూడా పంట ఎక్కడో ఒక చోట సిద్ధంగానే ఉంటుంది. యేసుప్రభువును స్వీకరించడానికి దేవుడు సిద్ధపరచిన మనుషులు ఎప్పుడూ ఉంటారు. దేవుని సేవకులు ఆసక్తితోను, దేవునిపై నమ్మకంతోనూ అలాంటివారి కోసం వెతకాలి. క్రీస్తు కాలం నుంచి ఇప్పటివరకు ఉన్న ఈ రెండు వేల సంవత్సరాలూ ఈ భూమిపై ఆగకుండా ఆత్మ సంబంధమైన పంటకోత జరుగుతూనే ఉంది. 4:36-88 (ప్రభువు ఇక్కడ దేవుని సేవ గురించి కొన్ని సాధారణ సత్యాలు తెలియజేస్తున్నాడు. కోత పనివారికి (క్రీస్తు చెంతకు అనేకమందిని తీసుకువచ్చేవారు) జీతాలుంటాయి (వ 36). అవేమిటో ఇక్కడ చెప్పలేదు గాని వారు “ఇప్పుడే” జీతం పుచ్చుకుంటున్నారు. అని రాసి ఉంది కాబట్టి క్రీస్తుకోసం ఇతరుల్ని సంపాదించడంలోని సంతృప్తి సంతోషాలనూ, (ప్రేమ సహవాసాలనే అనుబంధాలనూ సూచించేందుకు జీతం అనేమాట వాడుతున్నాడని అనుకోవచ్చు (ఫిలిప్పీ 4:1 చూడండి). అయితే వారి జీతాలు పరలోకంలో అనంత కాలంలో కూడా కనిపిస్తాయి (దానియేలు 12:8; 1 తెస్స £2:19,20; 1 పేతురు 5:4; (ప్రకటన 22:12). ఈ పంట (అంటే కోత పనివారి ప్రయత్నాలవల్ల క్రీస్తుపై నమ్మకంలోకి వచ్చేవారు) అంటే కేవలం ఈ లోకంలో ఈ కొద్ది కాలానికి మాత్రమే కాదు. అది ఎప్పటికీ ఉంటుంది. (వ 36).
పంట కోతకు రావాలంటే ముందు ఎవరో ఒకరు దేవుని వాక్కు అనే మంచి విత్తనాలు చల్లాలి. చల్లేదీ పంట కోసేదీ ఒకే వ్యక్తి కావచ్చు గాని తరచుగా వేరువేరు వ్యక్తులు ఈ పనులు చేస్తారు (వ 87,88; 1 కొరింతు 8:5,9). విత్తనాలు చల్లేవాడు పంట కోసేవాణ్ణి చూచి అసూయపడకూడదు. ఇద్దరూ కలిసి సంతోషించాలి (వ 36). పరలోకంలో ఆ పంట కోత విషయంలో క్రీస్తుకు ఉన్న ఆనందంలో వారిద్దరూ శాశ్వతంగా పాలుగొంటారు. ఇదంతా చక్కగా (గ్రహించి మనం కూడా జ్ఞానం కలిగి (సామెత 11:30), మనకు అవకాశం ఉన్నప్పుడే పట్టుదలతో ప్రయాసపడదాం (9:4). 4:39 ఒక్క స్రీ సాక్ష్యంవల్ల కలిగిన ఫలితం ఎంతో చూడండి. క్రీస్తు పక్షంగా మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుని సేవకులంతా ఆయనకు చెప్పిన సాక్ష్యం కారణంగా ఆ ఊరిలో సమరయవారు అనేకులు ఆయనమీద నమ్మకం పెట్టారు. 40 అందుచేత ఆ సమరయవారు ఆయనదగ్గరకు వచ్చినప్పుడు తమ దగ్గర ఉండాలని ఆయనకు విన్నవించుకొన్చారు గనుక రెండు రోజులు ఆయన అక్కడ ఉండిపోయాడు. 41 ఆయన మాటల కారణంగా ఇంకా అనేకులు ఆయన్ను నమ్ముకొన్నారు. 42 వారు ఆ స్త్రీతో “మేమిప్పుడు నమ్మడం నీవు చెప్పిన దాన్నిబట్టి కాదు. మా మట్టుకు విన్నాం, ఆయన నిజంగా అభిషిక్తుడు, లోకరక్షకుడని తెలుసుకొన్నాం” అన్నారు.
43 ఆ రెండు రోజుల తరువాత ఆయన అక్కడనుంచి గలలీకి వెళ్ళిపోయాడు. 44 స్వదేశంలో ప్రవక్తకు గౌరవం ఉండదు అని యేసు తానే సాక్ష్యం చెప్పాడు. 45 ఆయన గలలీకి వచ్చినప్పుడు గలతీ ప్రజలు ఆయనను స్వీకరించారు. ఎందుకంటే, జెరుసలంలో వస్తా పండుగ సమయంలో ఆయన చేసినవన్నీ వారు చూశారు. వారు కూడా ఆ పండుగకు వెళ్ళారు.
46 మరో సారి ఆయన గలలీలోని కానాకు వచ్చాడు. ఆయన అక్కడే నీళ్ళును (ద్రాక్షరసంగా చేశాడు. అక్కడ ఒక రాజ్యాధికారి ఉండేవాడు. కపెర్నహూంలో అతని కొడుకుకు జబ్బు చేసింది. 47 యేసు యూదయనుంచి గలలీకి వచ్చాడని విన్నప్పుడు ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు, తన కొడుకును బాగు చేయడానికి రావాలని మనవి చేసుకొన్నాడు. ఎందుకంటే అతని కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు.
48 యేసు అతనితో “మీరు సూచనలూ అద్భుతాలూ చూడకపోతే ఎంత మాత్రమూ నమ్మరు” అన్నాడు.
49 రాజ్యాధికారి ఆయనతో “స్వామీ, నా కొడుకు చనిపోకముందు రండి” అన్చాడు.
50 యేసు అతనితో “నీ దారిన వెళ్ళు! నీ కొడుకు బ్రతుకుతాడు” అన్నాడు. తనతో యేసు చెప్పిన మాట నమ్మి ఆ మనిషితన దారినవెళ్ళాడు.
51 అతడు వెళ్ళిపోతూ ఉండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కొడుకు ట్రతికాడని చెప్పారు. 52 అతడు బాగుపడడం మొదలైనప్పుడు ఎన్ని గంటలైందని వారిని అడిగాడు. వారు అతనితో “నిన్న ఒంటి గంటకు అతని జ్వరం పోయింది” అన్నారు.
53 “నీ కొడుకు బ్రతుకుతాడు” అని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ తండ్రికి తెలుసు, గనుక అతడూ అతని ఇంటివారంతా యేసును నమ్ముకొన్నారు.
54 యూదయనుంచి గలలీకి వచ్చి యేసు చేసిన అద్భుతమైన సూచనలలో ఇది రెండోది.
ఆ తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు జెరుసలం వెళ్ళాడు. £2 జెరుసలంలో “గొర్రెల ద్వారం” దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతెస్థ. దానికి అయిదు మంటపాలు ఉన్నాయి. 8 వాటిలో రోగులూ గుడ్డివారూ కుంటివారూ కాళ్ళు చేతులు
సాక్షులుగా ఉండాలి (అపొ కా 1:8 చూడండి).
4:42 క్రీస్తే ముక్తి ప్రదాత అని మొత్తంగా యూదులు నమ్మడానికి నిరాకరించగా (1:11), యూదుల దృష్టిలో అంటరాని వారైన ఈ సమరయవారు సత్యాన్ని (గ్రహించిన ధన్య స్థితిలోకి వచ్చారు. “ముక్తిప్రదాత”, “రక్షకుడు” గురించి నోట్ లూకా 1:47 చూడండి. యేసులో నమ్మకం ఉంచిన వారందరికీ, వారు ఏ జాతి, ఏ దేశం వారైనప్పటికీ, ఆయన ముక్తిప్రదాతే
(1 తిమోతి £:3-6; రోమ్ 1:16,17; అపొ కా 4:12; మార్కు 16:15,16). క్ష;శ4 మత్తయి 18:57; మార్కు 6:4 లూకా 424
4:45 ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి ఆయన్ను వారు స్వీకరించారు గానీ అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా, లోక రక్షకుడుగా గౌరవించలేదు.
4:46 2:1-11.
4:47,48 ఈ అధికారి యేసును ప్రవక్తగా ఎంచినట్టున్నాడు. గానీ దేవుని కుమారుడుగా లోకరక్షకుడుగా ఆయన్ను నమ్మలేదు. యేసు అతనితో అన్న మాటలు ఒక మందలింపులాంటివి. మత్తయి 12:38,39; 16:4 1 కొరింతు 1:22 పోల్చి చూడండి. నిజమైన విశ్వాసం సూచనల, అద్భుతాల అవసరమేమీ లేకుండా క్రీస్తు వ్యక్తిత్వం, మాటల మీద నమ్మకం ఉంచుతుంది. వ 41 పోల్చి చూడండి.
4:49 ఈ అధికారి తనలో లోపం లేదని తనను తాను సమర్ధించుకోలేదు. కేవలం క్రీస్తు జాలి కోసం వేడుకున్నాడు. విశ్వాసం బలహీనంగా ఉన్నా యేసుప్రభువు ఈ లోకంలో పరిచర్య చేసిన రోజుల్లో ఇలాంటి విన్నపాలను ప్రతి సారి ఆయన ఆలకించి అనుగ్రహించాడు.
4:50 వ 48లో యేసు మందలింపునుంచి ఈ అధికారి పాఠం నేర్చుకున్నాడు. ఎలాంటి సూచనా అవసరం లేకుండానే ఆయనలో నమ్మకం ఉంచడానికి సిద్ధమయ్యాడు.
4:51,52 యేసు సాక్షాత్తూ ఒక ప్రదేశంలో ఉండడం ఎంత శక్తింతమో ఆయన మాట అంత శక్తివంతమైనది. కీర్తన 107:20 పోల్చి చూడండి. చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లవాణ్ణి బాగుచేయాలంటే యేసు అక్కడికి వెళ్ళాలని మొదట్లో ఆ అధికారి అనుకున్నాడు. అయితే యేసుకు తన ఎదుట ఉన్నవారిని బాగు చెయ్యడం ఎంత తేలికో దూరాన ఉన్న వారిని బాగు చేయడమూ అంతే. ఆయన శరీరంతో ఈ లోకంలో ఉన్నట్టుగానే ఇప్పుడు పరలోకంనుంచి కూడా మనుషుల్ని బాగు చెయ్యగలడు. ఆయన ప్రతి సారి అలా చెయ్యకపోతే అందుకు కారణం అడిగేవారికి నమ్మకం లోపం కావచ్చు, లేదా అలాంటివారి విషయంలో వారిని బాగుచేయకపోవడానికి ఆయనకు వేరే జ్ఞానయుక్తమైన ఉద్దేశాలు ఉండడం కారణం కావచ్చు.
క్తీ;ర్3 “నమ్ముకొన్నారు” - అంటే బహుశా యేసు అభిషిక్తుడని నమ్మారు అని అర్థం. ఈ మనిషి నమ్మకం అభివృద్ధి చెందిన దశలు చూడండి. అతడు యేసు దగ్గరికి వచ్చిన్చుడు ఆయన వ్యాధి నయం చేయగలడన్న నమ్మకం కొంత అతనిలో ఉంది. ఆ నమ్మకం యేసు చేసిన అద్భుతాలమీద ఆధారపడింది. అది కొంచెం పెరిగి సూచన ఏదీ అవసరం లేకుండానే యేసు మాటపై నమ్మకం ఉంచగలిగాడు. తరువాత అతని నమ్మకం స్థిరపడి అభివృద్ధి చెంది అతని కుటుంబమంతటి మీదా ప్రభావం చూపింది. క్రీస్తు ఆ పిల్లవాడి జ్వరాన్ని, ఆ అధికారిలోని బలహీనమైన నమ్మకమనే ఆధ్యాత్మిక జ్వరాన్నీ కుదిర్చాడు. క;ర్4 “సూచనలు” - 2:11; మత్తయి 8:1 నోట్స్. యేసు వ్యాధులు బాగు చేసి (ప్రాణాన్ని సంరక్షించే యెహోవాదేవుని అవతారం (కీర్తన 108:1-4), తన ప్రజల్లో సజీవమైన గట్టి నమ్మకాన్ని సృష్టించేవాడు (హీబ్రూ 12:2),
5:1 “పండగ” - లేవీ 28వ అధ్యాయం.
ర్:2 “బెతెస్థ” - దీని అర్థం “కరుణగృహం” కావచ్చు
ర5్:3,4 ఇది వ్యాధులు నయం కావడం పరలోకంనుంచే ఊచబారిపోయినవారూ గుంపులుగా పడి ఉన్నారు. వారు నీళ్ళ కదలికకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 4 ఎందుకంటే, ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్ళు కదలించిన తరువాత మొట్టమొదట నీళ్ళలో దిగిన రోగి - ఎలాంటి రోగంతో ఉన్నా - పూర్తిగా నయం కావడం జరిగేది. ర్ అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్భలత ముప్ఫయి ఎనిమిదేళ్ళ నుంచి ఉంది. 6 అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలంనుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు.
“నీకు బాగుపడాలని ఇష్టం ఉందా?” అని ఆయన అతణ్ణి అడిగాడు.
7 ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు: “అయ్యా, నీళ్ళను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు గనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు.”
8 యేసు అతనితో “లేచి నీ పడక ఎత్తుకొని నడువు” అన్నాడు.
9 వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు. 10 ఆ రోజు విశ్రాంతి దినం గనుక యూదులు బాగుపడిన ఆ మనిషితో “ఇది విశ్రాంతి దినం. నువ్వు నీ పడక మోయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం” అన్నారు.
11 అందుకు అతడు “నన్ను బాగు చేసినవాడు “నీ పడక ఎత్తుకొని నడువు” అని నాతో చెప్పాడు” అన్నాడు.
12 “నీ పడక ఎత్తుకొని నడవమని నీతో చెప్పినదెవరు?” అని వాళ్ళు అతణ్ణి అడిగారు.
18 ఆయన ఎవరో బాగుపడినవానికి తెలియదు. ఎందుకంటే, అక్కడ ఉన్న పెద్ద గుంపులోనుంచి యేసు తప్పుకొన్చాడు.
14 తరువాత యేసు అతణ్ణి దేవాలయంలో చూచి అతనితో “ఇదిగో విను, నీవు బాగయ్యావు. మునువటి కంటే ఎక్కువ కీడు నీ మీదికి రాకుండా ఇకనుంచి అపరాధం చేయకు” అన్నాడు.
15 ఆ మనిషి వెళ్ళి తనను బాగు చేసినవాడు యేసు అని యూదులకు తెలియజేశాడు.
16 యేసు విశ్రాంతి దినాన ఈ పనులు చేసినందుచేత యూదులు ఆయనను హింసించారు, చంపడానికి చూశారు. 17 అయితే యేసు వారికిలా బదులు చెప్పాడు: “ఇప్పటి వరకు నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేనూ పని చేస్తూ ఉన్నాను.”
18 ఈ కారణంచేత యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా కోరారు - ఆయన విశ్రాంతి దినాచారాలు మీరడం మాత్రమే గాక, దేవుణ్ణి తన తండ్రి అంటూ తనను దేవునితో సమానుడుగా చేసుకొన్నాడు.
జరుగుతుందనీ, తానింకా వారిని బాగు చేసే దేవుడుగానే ఉన్నాననీ (నిర్ణం 15:26) దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్న విధానం కావచ్చు. ప్రభువు వ్యాధులు నయం చేయడంలో నీటిని ఉపయోగించిన ఇతర సందర్భాల గురించి
9:7; £2 రాజులు 5:138,14 చూడండి.
5:5 7వ వచనాన్ని బట్టి ఇతడికి పక్షవాతమో కుంటితనమో ఉన్నట్టుంది.
5:6 యేసుప్రభువు ఒక అద్భుతం చేయబోతుంటే కొన్నిసార్లు
తానే చొరవ తీసుకునేవాడు గానీ అన్ని సార్లూ కాదు. ఇక్కడ ఆయన ఈ ప్రశ్న అడగడంలో ఆ మనిషిలో ఆశాభావాన్ని రేకెత్తించడం ఆయన ఉద్దేశం కావచ్చు. 38 సంవత్సరాలు, అనేక నిరాశల తరువాత ఈ ఆశ బాగా అడుగంటిపోయి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా క్రీస్తు మనందరినీ ఇదే ప్రశ్న అడుగుతాడు “నీకు నీ పాపాలనుంచి బాగుపడాలని ఇష్టం ఉందా? పాపవిముక్తి పొందాలని కోరిక ఉందా?” దేవుడిచ్చే పాపవిముక్తి గురించిన ఆకలి, దాహం ఉన్నవారే దాన్ని స్వీకరిస్తారు. ఆయన మనకు ఇవ్వదలచుకున్నదాని విషయం మనలో కోరిక కలిగేలా ఆయన చేస్తాడు.
5:7 పేదలు, రోగులు, అనాథలు అనేకమందిలో ఉండే నిస్సహాయత ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. మానవ స్వభావంలోని స్వార్ధ బుద్ధిని కూడా ఇది చూపిస్తున్నది. ప్రతివాడూ కోనేట్లోకి అందరికన్నా ముందు తానే దిగాలని తాపత్రయపడుతున్నారు. బైబిలులోని దేవుడైన యేసుప్రభువు నిస్సహాయులకు సహాయుడు, స్నేహితులు లేని వారికి స్నేహితుడు (కీర్తన 10:14; 544; 72:12,18; 118:5-7; యెషయా 40:29; 41:17). ఆయన చేసిన అద్భుతాలు చాలా వరకు పేదల పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల కరుణా క్రియలే. 5:8,9 రోగాలు నయం చేసే ప్రభావం యేసు మాటలో ఉందని గమనించండి. మత్తయి 8:8 చూడండి. నిస్సత్తువగా ఉన్నవాడు తన పడక తీసుకుని నడవడం అసాధ్యం. కానీ యేసు అలా చేయమని అతణ్ణి ఆజ్ఞాపించినప్పుడు అలా చేయగలిగే శక్తిని
కూడా ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడడంలోనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. మార్కు 3:5; లూకా 17:14 పోల్చి చూడండి.
5:10 యూదులకు ఇలాంటి సూత్రాలు, నిషేధాలు చాలా ఉన్నాయి. మత్తయి 12:2; 15:2 చూడండి.
5:18 నమ్మకం లేని ఆ యూదులతో వాదించాలని గానీ తన పేరు అంతటా ప్రచారం కావాలని గానీ యేసుకు ఎంతమాత్రం కోరిక లేదు (4:3).
5:14 యేసుప్రభువు తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తున్నాడు. పాపవిముక్తి విషయంలోనూ ఇదే చేస్తున్నాడు (ఫిలిప్పీ 1:6). ఆ మనిషి ఆధ్యాత్మిక స్థితిని గురించి శ్రద్ధ కలిగి అతణ్ణి వెదికాడు (లూకా 19:10 పోల్చి చూడండి). అతనితో మాట్లాడిన మాటల్లో ఈ క్రింది భావం ధ్వనిస్తూ ఉంది - అతనికి ఉండిన వ్యాధి అతని పాప ఫలితం; అతడు పాపంలో అలానే కొనసాగే ప్రమాదం ఇప్పటికీ ఉంది; అతనికి (ఎవరికైనా) అతని వ్యాధి నయం కావడం కంటే అతనికి పాపాల నుంచి విముక్తి కలగడం మరింత ప్రాముఖ్యం.
5:15 ఈ మనిషి తెలివితక్కువగా ప్రవర్తించాడు. ఇదంతా యూదులకు చెప్పడం వల్ల యేసుప్రభువుకు ఇబ్బంది వస్తుందని అతడు గ్రహించలేకపోయాడా?
5:16 యేసు విశ్రాంతి దినాన్ని మీరడం లేదు. దాని విషయంలో మనుషులు చేసిన నియమాలను మాత్రమే మీరాడు. మత్తయి 12:1-8 నోట్స్ చూడండి. అందరూ విశ్రాంతి దినం గురించి వారు చేసిన సూత్రాల్ని పాటిస్తూ ఉంటే ఎంతమంది వ్యాధులతో, సహాయం లేకుండా, తమ పాపాల్లో సాగిపోతూ ఉన్నా వారికి ఫర్వాలేదు. వారి గుణశీలాలను మత్తయి 28 అధ్యాయంలో చూడవచ్చు.
5:17 తండ్రి అయిన దేవుడు విశ్రాంతిదినంలో సహా ఎప్పుడూ చేతులు ముడుచుకుని కూర్చుని ఉండడు. దేవుని కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (మత్తయి 12:8). మనుషులు చేసిన నియమాలకు ఆయన కట్టుబడడు.
5:18 దీన్ని గురించి యూదుల ఆలోచన సరైనదే. దేవుడు 19 అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. 20 కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. 21 తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే (ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని టబ్రతికిస్తాడు. 22 తండ్రి ఎవరికీ తీర్చు తీర్చడు గాని తీర్పు తీర్చే
అధికారమంతా కుమారునికి అప్పగించాడు. 23 అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
24 “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
25 “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే
ఏమై ఉన్నాడో తానే అదై ఉన్నాననీ దేవుని తత్వంలో, ఆయన స్వభావంలో తనకూ భాగం ఉందనీ యేసు అంటున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, వేరెవరికీ వర్తించని రీతిలో తన తండ్రి అని చెప్పుకొంటున్నాడు (8:16; మత్తయి 3:17). 10:30-37 పోల్చి చూడండి. ఆయన సాక్షాత్తూ దేవుని కుమారుడని వారు నమ్మకపోవడంవల్ల ఆయన దేవదూషణ చేస్తున్నాడన్న నేరం మోపారు. మనుషులు తాము దేవుణ్ణని చెప్పుకోవడం అన్నిటికన్నా ఘోరమైన దేవదూషణ అనీ దీనికి శిక్ష మరణమే అనీ వారికి తెలుసు (మత్తయి 26:65 చూడండి) 5:19-47 ఈ భాగంలో యేసుప్రభువు తాను దేవుని కుమారుణ్ణి అన్న విషయాన్ని వివరిస్తున్నాడు (వ 19,20), తాను చేయగలిగిన, చేయబోయే కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు (వ 21-380), తాను దేవుని కుమారుణ్ణే అని చెప్పుకునేందుకు కొన్ని ఆధారాలను చూపి, ఆ యూదులు తననెందుకు నమ్మలేదో చెప్తున్నాడు (వ 38-47). ఇక్కడ అతి గంభీరమైన, (ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. 5:19 “మీతో. -చెపుతున్నాను” - 151 చూడండి. స్వభావం, సంకల్పం, ఉద్దేశాలలో యేసు పరమ తండ్రితో ఎంత ఐక్యంగా ఉన్నాడంటే తనకు తాను సొంతగా ఏ పనులైనా చేయడం అసాధ్యమని నేర్పుతున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ చెయ్యలేనిది ఎందుకంటే ఏమీ చెయ్యడు కాబట్టే. ఆయన అలా చేస్తాడన్నది కనీసం ఆలోచనకు కూడా అందరానిది. అయితే తండ్రి అయిన దేవుడు చేసేదంతా ఆయన చేస్తాడు. అంటే అన్ని చోట్లా ఏకకాలంలో ఉండి పని చేసేందుకు కావలసిన ప్రభావం, జ్ఞానం, శక్తిసామర్థ్యాలు తండ్రియైన దేవునిలో లాగే కుమారుడైన యేసులో కూడా ఉన్నాయన్నమాట. అలా లేని పక్షంలో తండ్రి చేసేదంతా చేయడం ఆయనకు సాధ్యం కాదు. యేసుకు దేవుని స్వభావంలో సంపూర్ణ భాగస్వామ్యం ఉందనీ, ఆయన దేవుని అవతారమనీ ఇందువల్ల తెలుస్తున్నది (ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి). ఈ విశ్వంలో ఏది జరిగినా తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఐక్యంగానే జరిగిస్తారు. త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16,17; 28:19; 22 కొరింతు 19:14. 5:20 38:35; 17:24. క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో తరచుగా తండ్రి, కుమారుల మధ్య ఉన్న పరస్పర (ప్రేమను చూడవచ్చు. లోకం సృష్టించడానికి ముందే ఆ (ప్రేమ ఉంది. అది అనంత కాలం కొనసాగుతూ ఉంటుంది. తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తూ లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు కుమారుని దృష్టి ఎప్పుడూ తండ్రి మీదే ఉంటుంది. తండ్రి కుమారుడి నుంచి దేన్నీ దాచిపెట్టడు. “వీటికంటే గొప్ప పనులు” - అంటే తాను ఇంతవరకు చేసిన అద్భుతాలకంటే గొప్పవి అని అర్థం. 5:21 ఇది చనిపోయిన వ్యక్తులను ట్రతికించిన సంగతి గురించి చెప్పిన మాట కావచ్చు (11:43,44; మార్కు 5:35-48; లూకా 77:11-15). అయితే ఆయన ఆధ్యాత్మికంగా శాశ్వత జీవాన్ని ఇచ్చి పాపంలో చనిపోయిన వారిని ట్రతికిస్తాడన్న
సంగతి కూడా నిజమే. 5:22 మనుషులనందరి తీర్పు యేసుప్రభువు చేతిలోనే ఉంటుంది. అలాగని తండ్రికి ఇందులో ఎలాంటి జోక్యమూ లేదని కాదు (అపొ కా 17:31). అన్నిటిలోనూ వారిద్దరూ కలిసే పని చేస్తారు. 5:28 తీర్పును యేసుప్రభువు చేతుల్లో పెట్టడంలో తండ్రి ఉద్దేశం చూడండి. తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచినట్టుగానే మనుషులు యేసును ఘనపరచాలి. కుమారుడిలో దేవుని తత్త్వం, స్వభావం పరిపూర్ణంగా లేకపోతే తండ్రి గానీ కుమారుడు గానీ ఎన్నడూ ఇలా కోరరు. దేవునికి మాత్రమే చెందే ఘనతను సృష్టించబడిన ఎవరికీ దేనికీ మనుషులు ఇవ్వరాదు. యేసు ఇక్కడ చెప్తున్నదాన్ని గమనించండి. మనుషులు దేవుని కుమారుణ్ణి ఘనపరచకపోతే వారు దేవుణ్ణి అసలు ఘనపరచడం లేదన్నమాట. అలా చేస్తున్నామని వారు అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు గానీ వాస్తవంగా అలా చేయడం లేదు. 5:24 దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను” అనే గంభీరమైన వాక్కులు ఈ వాగ్షానానికి ముందు ఉన్నాయి. శాశ్వత జీవం గురించి నోట్స్ 3:16,36. శాశ్వత జీవం అనేది విశ్వాసికి ఇప్పుడే ఉందని గమనించండి. 3:386లో కుమారునిలో నమ్మకం ఉంచినవారికి ఇది లభిస్తుందని రాసి ఉంది. ఇక్కడైతే అయన్ను పంపిన తండ్రిలో నమ్మకం ఉంచినవారికి అది లభిస్తుందని రాసి ఉంది. ఇందులో మళ్లీ తండ్రి, కుమారుల ఐక్యతను చూస్తున్నాం. వారిలో ఒకరిమీద నమ్మకం ఉంచడమంటే మరొకరిమీద ఉంచడమే. మనుషుల పాపాలను బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. విశ్వాసులందరి పాపాలకూ క్షమాపణ ఉంది. క్రీస్తే వారి శిక్షను భరించాడు. అందువల్లే వారికి శిక్షావిధి లేదు. 3:18; రోమ్ 8:1 చూడండి. ఇది శాశ్వత భద్రతను సూచిస్తున్నది. అలాగని వారు విశ్వాసులైన తరువాత చేసిన పనులకు తీర్పు ఉండదని కాదు. 2 కొరింతు 5:10 చూడండి. అయితే ఈ తీర్పు బహుమతులు ఇవ్వడం, ఇవ్వకపోవడం, వీటికి సంబంధించి ఉంటుంది. (1 కొరింతు 33:10-15).
వారి పాపాల కారణంగా మనుషులంతా ఆత్మసంబంధమైన మరణ స్థితిలో ఉన్నారు (ఆది 2:17; ఎఫెసు 21-38). మనుషులు క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా ప్రతికిస్తాడు (1:12,18; ఎఫెసు 2:5). తక్షణమే వారు మరణ స్థితినుంచి జీవంలోకి మార్పు చెందుతారు. “దాటారు” అనే ఈ మాట భూతకాలంలో ఉండడం గమనించండి. ఈ ఒక్క వచనంలో శాశ్వత జీవాన్ని పొందడం, నిర్బోషుల లెక్కలోకి రావడం, నూతన జన్మ, ఇదంతా నమ్మకం మూలానే అని తెలుస్తున్నది. మనుషుల ముక్తిదాతగా రక్షకుడుగా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తండ్రిలో నమ్మకం ఉంచడం మూలానే అన్నమాట. 5:25 ఇక్కడ “చనిపోయినవారు” అంటే బహుశా వ £24లో లాగానే ఆధ్యాత్మిక జీవం లేనివారు అనే అర్థం కావచ్చు, వారి వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. 26 ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు. 27 ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
28 “ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. £29 వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి
లేస్తారు. 80 నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినే ప్రకారం తీర్పు తీరుస్తాను. నన్ను పంపినవారి ఇష్టప్రకారమే చేయాలని కోరుతూ ఉన్నాను గాని నా ఇష్టప్రకారం కాదు గనుక నేను తీర్చే తీర్చు న్యాయమైనది.
81 “నా విషయం నేనే సాక్ష్యం చెప్పుకొంటే నా సాక్ష్యం నిజమైనది కాదు. 8£2 నా విషయం సాక్ష్యం చెప్పేవాడు ఇంకొకడు ఉన్నాడు. నా విషయం ఆయన చెప్పే సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
38 “మీరు యోహాను దగ్గరకు మనుషులను పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. 34 అయినా,
అంతరంగాలలో క్రీస్తు స్వరాన్ని వారు వింటారు. ఆ స్వరాన్ని నమ్మి విధేయులౌతారు (10:3,4,16,27 పోల్చి చూడండి). అలాంటివారే ఆధ్యాత్మికంగా బ్రతుకుతారు. దేవుని కుమారుడు అనే ఈ పేరును యేసు మూడు సార్లు ఈ శుభవార్తలో తనకు ఉపయోగించుకున్నాడు. - ఇక్కడ; 10:36; 11:4లో. 5:26 “స్వయంగా జీవం గల” - అంటే దేవుడు వేరొకరి సహాయం, (ప్రమేయం లేని స్వతంత్రమైన ఉనికి గలవాడని అర్థం. “నేను ఉన్నవాడను” అనేది తన పేరుగా ఆయన చెప్పుకున్నాడు. (నిర్గమ 38:14 నోట్ చూడండి). దేవుడు సృష్టించబడిన జీవులన్నిటికీ జీవ ప్రదాత. ఆయన అనాది కాలం నుంచి సజీవుడు. మనుషుల సంగతి పూర్తిగా వేరుగా ఉంది. వారి జీవం వారిలో నుంచి గాక వేరొక మూలాధారంనుంచి వచ్చేది. యేసు కేవలం మానవ స్వభావం ఉన్న మానవ మాత్రుడు కాదు. తండ్రి అయిన దేవునికి ఉన్నట్టుగానే తనలో తనకు స్వయంగా జీవం ఉన్న దేవ కుమారుడు. యేసు ఇతరులకు కూడా జీవాన్చిచ్చే మూలాధారం (వ 12). ఆయన స్వభావ రీత్యా దేవునితో సమానుడు అని చెప్పే వేరొక పద్ధతి ఇది. 5:27 “మానవ పుత్రుడు” - మత్తయి 8:20. యేసు తనను తాను తగ్గించుకొని, మనిషిగా మనుషుల మధ్య ట్రతికి మనిషిని గురించి కూలంకషంగా ఎరిగినవాడు కాబట్టి మనుషులకు న్యాయాధిపతిగా ఉండడానికి ఎంతైనా తగినవాడు. దేవుడే ఆయన్ను మనుషులందరికీ న్యాయాధిపతిగా ఉండడానికి వారికంటే ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు (అపొ కా 17:31). 5:28,29 దేవుడు చనిపోయిన మనుషులందరినీ తిరిగి టబ్రతికిస్తాడని ఇక్కడ క్రీస్తు చెపుతున్నాడు. వ 28లో “సమాధులలో” అనే మాట గమనించండి. వ £24లో చెప్పినట్టు ఆధ్యాత్మిక జీవం ఇవ్వడం గురించి ఇక్కడ చెప్పడం లేదు. “బయటికి వస్తారు” అంటే అర్ధం చనిపోయినవారి ఆత్మలూ తిరిగి వారి మృతదేహాలతో కలిసి, ఆ దేహాలు తిరిగి లేస్తాయన్నమాట. దానియేలు 12:2; అపొ కా £24:15; 1 కొరింతు 15:20-22; (ప్రకటన £20:4-6, 11-15 కూడా చూడండి. రెండు రకాల మనుషులకు రెండు రకాల పునర్జీవితాలు ఉంటాయని యేసు చెప్తున్నాడు. రెండు రకాల మనుషులంటే ఆయనలో నమ్మకం ఉంచినవారు, నమ్మకం ఉంచనివారు అని ఆయన చెప్తాడని మనం అనుకోవచ్చు (8:386లో లాగా). ఇది నిజమే గానీ మనకొక ముఖ్యమైన సత్యాన్ని నేర్పేందుకు ఆయన దీన్నే వేరే విధంగా చెప్పాడు. అదేమిటంటే ఇతరులకు మేలు చేయడం విశ్వాసి లక్షణం, చెడు చేయడం అవిశ్వాసి లక్షణం. విశ్వాసులు కొత్త జన్మం పొందినవారు (1:18), ఇతరులకు పూర్తిగా భిన్నంగా ఉండే కొత్త సృష్టి (£ కొరింతు 5:18). ఇందుకు రుజువు ఏమిటంటే వారు మేలు చేస్తుంటారు (మత్తయి ₹7:17,18); 25:31-46; రోమ్ £2:6-11). అవిశ్వాసులు కొన్ని సార్లు తమకు మంచి పనులుగా తోచినవాటిని చేస్తారు.
కానీ అలా చెయ్యడంలో వారి ఉద్దేశాలు మంచివి కావు. అంతేగాక అస్తమానం దేవుని కుమారుణ్ణి నిరాకరించి, దేవుని వాక్కుకు లోబడకుండా, తమ పతితమైన (భ్రష్ట స్వభావం అనుసరించి నేరమయమైన జీవితం జీవిస్తూనే ఉంటారు. తీర్పుకు గురై శిక్ష అనుభవించడం కోసమే వారిని మళ్ళీ బ్రతికించడం జరుగుతుంది. విశ్వాసులు శాశ్వత జీవాన్ని అనుభవించేందుకు లేస్తారు. మంచివారు, చెడ్డవారు. ఒకే సమయంలో మళ్ళీ ట్రతికి లేస్తారని యేసు అనలేదు గానీ రాబోయే కాలంలో ఎప్పుడో ఈ రెండు రకాల మనుషులు తప్పకుండా మళ్ళీ ట్రతికి లేస్తారని మాత్రం చెప్పాడు. ఈ రెండు రకాలు లేచే సమయాలు వేరువేరని (ప్రకటన £20:4,5 సూచిస్తున్నది. 1 తెస్స 418-177, 1 కొరింతు 15:51-58లో విశ్వాసుల పునర్జీవితం గురించి మాత్రమే ఉంది. దీనికి కారణం బహుశా ఆ సమయానికి విశ్వాసులు మాత్రమే లేస్తారు. ఫిలిప్పీ 8:11 కూడా చూడండి. 5:30 వ 19-80లో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపాడనీ, తాను చేసేదాన్ని ఆయన కుమారునికి చూపిస్తాడనీ (వ 20), కుమారునికి అధికారం ఇచ్చాడనీ (వ 22,27) గమనించండి. దేవత్వంలోని ముగ్గురు వ్యక్తులూ (తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ) ఒకే స్వభావంలో సమానంగా పాల్గొన్నవారు. ముగ్గురూ దేవుడే. అయితే వారి విధుల్లో ఒక క్రమం ఉంది. కుమారుని కంటే తండ్రికి ఉన్నత స్థానం ఉంది (10:29; 14:28). తండ్రి, కుమారుడు కలిసి పవిత్రాత్మను పంపించారు (14:26; 15:26; 16:7). ఇది బహుశా పవిత్రాత్మ మిగతా ఇద్దరి అధికారానికి లోబడి ఉన్నాడని సూచించవచ్చు. అయితే తత్వంలో, మనసులో, (ప్రేమలో, ఉద్దేశాల్లో ఈ ముగ్గురూ కేవలం ఒకే దేవుడు. 5:31 యూదుల న్యాయమైన చట్టంలో ఒక మనిషి తన గురించి చెప్పుకునే సాక్ష్యం కోర్టులో అంగీకారం కాదు. ఇతరులెవరన్నా అతణ్ణి గురించి సాక్ష్యం చెప్పాలి. ఒక వ్యక్తిని నేరస్థుడుగా నిర్ణయించాలన్న్కా నిర్దోషిగా తీర్చాలన్నా ఇద్దరు ముగ్గురు సాక్షులు అవసరం (8:17; ద్వితీ 19:15 చూడండి). యేసు తన గురించి చెప్పుకునే విషయాలకు తన సొంత మాటలు తప్ప వేరే ఆధారాలేవీ లేని పక్షంలో యూదులు తనను నమ్మనవసరం లేదంటున్నాడు. తరువాత తన గురించి సాక్ష్యమిచ్చే ఇతరుల విషయం చెపుతున్నాడు. అది వారికోసమే, తన కోసం కాదు (వ 34). తానెవరో ఏమిటో ఆయనకు బాగా తెలుసు. నలుగురు సాక్షులున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను (వ 38), యేసు చేస్తున్న కార్యాలు (వ 36; 8:18), తండ్రి అయిన దేవుడు (వ 37), పాత ఒడంబడికలోని వ్రాతలు (వ 39,46). 5:32 బహుశా తండ్రి అయిన దేవుడు అని యేసు ఉద్దేశం కావచ్చు (వ 387). కానీ బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయనిలా అన్చాడని కొందరి అభిప్రాయం (వ 338). 5:33 11:19-34 చూడండి.
మనుషుల సాక్ష్యం నేను చేకూర్చుకోను గాని మీకు పాపవిముక్తి కలగాలని నేను ఈ మాటలు చెపుతున్నాను. 85 అతడు వెలుగుతూ (ప్రకాశిస్తూ ఉన్న దీపం. అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి మీరు ఇష్టపడ్డారు.
36 “కానీ యోహాను సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం నాకు ఉంది. నెరవేర్చడానికి తండ్రి నాకిచ్చిన పనులు - నేను చేస్తూ ఉన్న పనులే - తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. 87 ఇది గాక, నన్ను పంపిన తండ్రి తానే నా విషయం సాక్ష్యమిచ్చి ఉన్నాడు. ఆయన స్వరం మీరెన్నడూ వినలేదు. ఆయన స్వరూపాన్ని చూడలేదు. 88 మీలో ఆయన వాక్కు నిలిచి ఉండడం లేదు. ఎందుకంటే, ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడం లేదు. 39 మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు. వాటి మూలంగా మీకు శాశ్వత జీవం ఉందని మీ ఆలోచన. అవి నా విషయమే సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. 40 అయినా
మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీకు ఇష్టం లేదు.
41 “మనుషులు ఇచ్చే ఘనత నేను స్వీకరించను. 42 మీరు నాకు తెలుసు - మీలో దేవుని ప్రేమ లేదు. 43 నేను నా తండ్రి పేర వచ్చాను, మీరు నన్ను స్వీకరించడం లేదు. వేరొకడు తన పేరునే వస్తే వాణ్ణి మీరు స్వీకరిస్తారు.
44 “మీరు ఒకరిచేత ఒకరు ఘనత స్వీకరిస్తూ, ఒకే ఒక దేవునినుంచి వచ్చే ఘనత వెదకకుండా ఉంటే నన్ను ఎలా నమ్ముతారు? 45 తండ్రిదగ్గర మీమీద నేరం మోపుతానని తలంచకండి. మీరు మోషే షేమీద నమ్మకం ఉంచుతున్నారు. మీమీద నేరం మోపేవాడు అతడే. 46 ఎందుకంటే, మోషే నన్ను గురించి వ్రాశాడు. మీరు అతని మాటలు నమ్మితే నన్ను కూడా నమ్ముతారు. 47 అతడు ట్రాసినది మీరు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతారు?”
5:35 “వెలుగు” - మత్తయి 5:14-16 పోల్చి చూడండి. యోహాను చేసినది ఇదే.
5:36 మనుషులను వారు చేసే పనులను బట్టి తెలుసుకోవచ్చు (మత్తయి 77:15-20). యేసు చేసిన పనులు ఆయన ఎవరో, ఎలాంటివాడో సాక్ష్యంగా ఉన్నాయి (2:11; 3:2; 10:25,87,88; మత్తయి 8:1; 11:4-6).
5:37 8:18; 1 యోహాను 5:9. తండ్రి పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కుల ద్వారా కుమారుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంతేగాక కుమారుడు జన్మించకముందే దేవదూత ద్వారా (మత్తయి 11:20-28; లూకా 1:26-385), ఆయన బాప్తిసం, కొండపై ఆయన రూపం మార్పు చెందిన సందర్భాల్లో కంఠ ధ్వనిద్వారా (మత్తయి 8:17; 17:5), ఆయన జీవిత కాలమంతా ఆయన చేసిన అద్భుత కార్యాల్లో ఆయనతో కలిసి పని చేయడం ద్వారా (14:10; అపొ కా 10:38) తండ్రి ఆయనకు సాక్ష్యం పలుకుతున్నాడు.
5:38 వారికి దేవుని వాక్కు (పాత ఒడంబడిక (గ్రంథం) అందుబాటులో ఉంది. దాన్ని శ్రద్ధగా పఠించారు (వ 39) గనక అది వారి మనసుల్లో ఉంది. కానీ అది వారి అంతరంగాల్లో లేదు. అది వారిలో సజీవంగా ఉండి వారిని జీవింపజేయలేదు (కీర్తన 119:11 పోల్చి చూడండి).
5:39 లేఖనాలు (లేక లేఖనం) క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో తరుచుగా (58 సార్లు) కనిపించే మాట. దీనికి అర్ధం “రాసివున్నవి”. పాత ఒడంబడిక పుస్తకాలను ఉద్దేశించి లేఖనాలు అన్నారు (కానీ 2 పేతురు 8:16 చూడండి). పాత ఒడంబడిక (గ్రంథం నిండా యేసుప్రభువును గురించిన భవిష్యద్ వాక్కులూ సాదృశ్యాలూ సూచనలూ చిహ్నాలూ సంకేతాలూ ఉన్నాయి. వ 46; లూకా 24:27,45,46 చూడండి.
5:40 తమకు శాశ్వత జీవం ఉందని వారనుకున్నారు గాని అది వారిలో లేదు. అలాంటి ఆధ్యాత్మిక జీవాన్ని వారికివ్వగల ఒకే ఒక వ్యక్తి దగ్గరికి నమ్మకంతో రావడానికి వారికి ఇష్టం లేదు (వ £21; 3:36). ఈ నాటికీ అనేకమంది ఇంతే.
5:41 అనేక మంది మత నాయకుల్లాగా కాక (వ 44), మనుషులు ఇవ్వగల ఘనత, గొప్పతనం అంటే ఆయనకు ఎంతమాత్రం లెక్కలేదు. మనుషులు తనను పొగడాలని వారికి ఇష్టమైన విధంగా ప్రవర్తించేందుకు ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన గురి అంతా 8:29లో చూడవచ్చు. ఇందులోనూ, మిగతా అన్ని విషయాల్లోనూ మనకు ఆదర్శం ఆయనే.
5:42 మనిషిలో ఏముందో యేసుకు తెలుసు - 2:24,25.
వారికి దేవుడంటే (ప్రేమ ఉంటే వారు క్రీస్తును కూడా (ప్రేమించేవారేనని ఆయనకు తెలుసు (8:42). తనను వారు ద్వేషించడం దేవునిపట్ల వారికున్న ద్వేషాన్ని బట్టబయలు చేసింది (15:24). దేవుణ్ణి తాము ్రేమిస్తున్నామని వారు చెప్పుకుంటూ ఉండేవారు గానీ నిజానికి ఆయనంటే వారికున్నది ద్వేషమే. యిర్మియా 17:9 చూడండి.
5:48 తండ్రి పేర రావడం అంటే తండ్రి అయిన దేవుని అధికారంతో వచ్చాడనీ ఆయనకు సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహించాడనీ అర్థం. తన పేరునే రావడమంటే తన సొంత అధికారంతో తన్ తరుఫున తానే రావడం (అలాంటివారు క్రీస్తు పక్షంగా వచ్చామని చెప్పుకోవచ్చు). ఇలా చేసేవారు చాలామంది ఉన్నారు. మత్తయి £24:24 చూడండి. ఇలాంటి వారందరికీ ప్రధాని క్రీస్తువిరోధి (2 తెస్స £2:3,4).
5:44 ఇక్కడ వర్ణించబడిన వారి గుణాలు వారు క్రీస్తులో నమ్మకం ఉంచడం అసాధ్యం చేస్తాయి. వారి జీవితానికి, ఉనికికి వారే కేంద్రాలు. మనుషులు తమను పొగడాలన్చదే వారి ఆశ, వారి హృదయాల్లో దేవునికి ఇసుమంతయినా స్థ స్థలం లేదు. గలతీ 1:10లో దీనికి వ్యతిరేకమైన పరిస్థితి చూడండి.
5:45 యేసు నేరాలు మోపడానికి గానీ తీర్పు తీర్చడానికి గానీ రాలేదు (8:17). వారిపై నేరాలు మోపేవాడు మోషే అంటే దేవుడు మోషేచేత రాయించిన లేఖనాలు (బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు) వారిని నేరస్థులుగా నిర్ణయిస్తున్నాయన్నమాట. అతడు రాసినవాటిని వారు నిజంగా నమ్మలేదు కాబట్టి ఇలా జరుగుతుంది (నమ్ముకుంటున్నామని వారు అనుకునేవారు గాని నిజంగా నమ్మలేదు). అతడు రాసిపెట్టిన సత్యాన్ని వారు ఆచరణలో పెట్టలేదు.
ర5్:46 1:17, 7:19; లూకా £24:27,45,46 పోల్చి చూడండి. మోషే పుస్తకాలనబడిన వాటిని రాసినది మోషేనేననీ, అతడు క్రీస్తును గురించి రాశాడనీ (వ 39) తేటతెల్లం చేస్తున్న మాట ఇది. నిర్ణమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:9 చూడండి.
5:47 ఇది వారు గానీ వేరెవరైనా గానీ జవాబు చెప్పలేని ప్రశ్న పై వచనాలను బట్టి తాను దేవుని కుమారుణ్ణని క్రీస్తు చెప్పుకొన్న మాటలకు అమోఘమైన, ఆశ్చర్యకరమైన గొప్ప సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయని మనం నేర్చుకోవాలి. మానవజాతి చరిత్ర అంతటిలో మరెవరికీ ఇలాంటి సాక్ష్యాధారాలూ రుజువులూ లేవు. ఈ సాక్ష్యం మార్గదర్శిగా మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నదో అక్కడికి అందరం పోదాం. ఆవిధంగా యేసుప్రభువును మన ప్రభువుగా రక్షకుడుగా
