యోహాను శుభవార్త – భాగము 13 (పుటలు 75–78)
చూడకపోతే, ఆ మేకుల మచ్చలో నా ట్రేలు పెట్టకపోతే, ఆయన ప్రక్కన నా చేయి పెట్టకపోతే నేను నమ్మను” అన్నాడు.
26 ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. 27 అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
£28 అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
29 యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు” అన్నాడు.
30 యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో (వ్రాసినవి కావు. 31 కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ
అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి ప్రాసి ఉన్నాయి.
ల క్ ఆ తరువాత తిబెరియ సరస్సు ఒడ్డున యేసు తనను
తన శిష్యులకు మరోసారి ప్రత్యక్షం చేసుకొన్నాడు. (ప్రత్యక్షమైన విధం ఏమంటే, £2 సీమోను పేతురు, దిదుమ అనే పేరు ఉన్న తోమా, గలలీలోని కానావాడైన నతనియేలు, జబదయి కొడుకులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు అంతా పోగయ్యారు.
3 సీమోను పేతురు వారితో “చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను” అన్నాడు.
వారు “మేము నీతో కూడా వస్తాం” అన్నారు.
వెంటనే వారు వెళ్ళి పడవ ఎక్కారు. ఆ రాత్రి వారు పట్టినది ఏమీ లేదు. 4 ప్రొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డున నిలుచున్నాడు గాని ఆయన యేసని శిష్యులు గుర్తుపట్టలేదు.
5 కనుక యేసు “అబ్బాయిలూ! తినడానికి మీదగ్గర ఏమైనా
20:26 వ 19.
20:27 బలహీనమైన నమ్మకం గలిగి సందేహించే శిష్యులపట్ల కూడా ప్రభువు ఎంత జాలి, (ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. ఆయన తోమాకు (వారందరికీ) సిలువ మరణం అనుభవించిన నిజమైన దేహాన్ని చూపించాడు. ఆ దేహం సిలువ వేయబడిందని దానిలో స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. ఆయన సజీవంగా లేచాడని ఆ సాక్ష్యాధారాన్నీ ఆ రుజువునూ తోమా నమ్మాలని గట్టిగా చెప్పాడు. “అవిశ్వాసాన్ని విడిచిపెట్టి నమ్ము” అని ఈ రోజున కూడా మనందరికీ ఆయన చెప్తున్నాడు. 20:28 తన ప్రజల తప్పులను దేవుడు మేలుగా మారుస్తాడు. తోమా సందేహం మూలంగా క్రీస్తు తనను తాను వెల్లడి చేసుకొన్నందువల్ల తోమా ఈ విధంగా తన నమ్మకాన్ని ప్రకటించిన ఈ ఉత్తమమైన మాటలు మనకు లభించాయి. తోమా యూదుడు. పాత ఒడంబడిక (గ్రంథాన్ని అభ్యసించాడు. యేసుప్రభువు ఉపదేశాలను మూడేళ్ళపాటు విన్నాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడనీ ఇతర దేవుళ్ళెవరైనా ఒక వ్యక్తికి ఉండడం అన్ని పాపాల్లోకీ అతి హీనమైనదనీ అతనికి బాగా తెలుసు (మత్తయి 4:10; నిర్ణమ 20:1-4 ద్వితీ 6:4,5; యెషయా 49:11; 44:6; 45:5 చూడండి). అతడు యేసును “నా ప్రభూ, నా దేవా” అన్నప్పుడు యేసు పాత ఒడంబడిక (గ్రంథంలో వెల్లడైన సత్యయేక దేవుడు యెహోవా అవతారమని తన దృఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడన్న మాట. 1:1,14,18; 5:17,18; 8:24,58; 10:30-88 చూడండి. లూకా 2:11; ఫిలిప్పీ 2:6 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు చూడండి.
20:29 యేసుప్రభువు అతని మాటలకు అంగీకరించాడు. తాను ప్రభువనీ దేవుడనీ యేసుకు తెలిసి ఉండని పక్షంలో ఆయన ఇలా ఏమాత్రమూ అంగీకరించేవాడు కాదు. మానవమాత్రులు వారు మంచివారై న్యాయవంతులై ఉంటే ఇలా దేవునికే చెందవలసినవాటిని స్వీకరించరు (అపొ కా 14:18-15 పోల్చి చూడండి).
“ధన్యులు” - తోమా నమ్మినట్టు, యేసు చనిపోయి సజీవంగా లేచాడనీ, ఆయనే ప్రభువు, నిజ దేవుడనీ, ఆయన మన దేవుడనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ కూడా ఈ నాడు ఈ ధన్యత కలుగుతుంది (రోమ్ 10:9,10 పోల్చి చూడండి). ధన్యత గురించి ఆది 12:8; సంఖ్యా 6:23-27; కీర్తన 1:1-8; 119:1; మత్తయి 5:3-10 నోట్స్ చూడండి. దీనికి వ్యతిరేకం కూడా నిజమే. నమ్మనివారు ధన్యులని దేవుడు చెప్పడు. 8:18,86; మార్కు
16:16 చూడండి. 20:30 “అనేక” - 21:25. వీటిలో కొన్ని ఇతర శుభవార్త పుస్తకాల్లో రాసి ఉన్నాయి. యేసు చేసిన సూచకమైన అద్భుతాల్లో కొన్నింటిని యోహాను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఏరి ఇందులో పొందుపరచాడు. ఇలాంటి సూచనల గురించి నోట్ 2:11. 20:31 ఇక్కడ మూడు అతి ప్రధాన సత్యాలున్నాయి.
మొదటిది, నమ్మడానికి చాలా అద్భుతమైనది ఇక్కడ కనిపిస్తున్నది. - ఇస్రాయేల్ వారి అభిషిక్తుడుగా, లోకానికి ముక్తిప్రదాతగా దేవుడు అభిషేకించినది యేసునే; ఆయన దేవుని కుమారుడు, దేవుని స్వభావంలో భాగస్వామి (మత్తయి 1:1 మొదలైన చోట్ల నోట్స్ చూడండి).
రెండోది దీన్ని నమ్మేందుకు చక్కని ఆధారాలు ఉన్నాయి - చనిపోయి సజీవంగా లేవడంతో సహా యేసు చేసిన సూచకమైన అద్భుతాలు.
మూడోది దీన్ని నమ్మడం వల్ల కలిగే ఫలితాలు - జీవం, ఆయన పేర శాశ్వత జీవం (3:16,86; 5:24; 6:47). ఈ విధంగా యోహాను ఈ శుభవార్తలోని అతి ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలను టూకీగా రాశాడు. 21:1 “తిబెరియ” - గలలీ సరస్సు. యేసు తన శిష్యులను గలలీ వెళ్ళాలని చెప్పాడు (మత్తయి 2£28:7,10). చనిపోయి సజీవంగా లేచిన తరువాత యేసు నలభై రోజులు తన శిష్యులతో ఆయా ప్రదేశాల్లో గడిపాడు (అపొ కా 1:3). 21:2 జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను (మత్తయి 10:2). 21:3 ఆ రోజుల్లో యేసు శరీరంతో అస్తమానం వారితో లేడు. శిష్యులు పని చేసి పొట్టపోసుకోవలసిన పేదలు (మత్తయి 4:18-22; అపొ కా 3:6). యేసుప్రభువు తమకు కనిపించాలని ఎదురుచూస్తున్న సమయంలో తమ ఖర్చుల నిమిత్తం కొంచెం డబ్బు సంపాదించడం పేతురు ఉద్దేశం కావచ్చు. (ప్రభువు అప్పగించిన పనిని విడిచి పెట్టెయ్యాలన్న తలంపు వీరిలో ఎవరికైనా ఉన్నట్టు ఎలాంటి ఆధారమూ ఈ వచనాల్లో కనిపించదు. శుభవార్త ప్రకటించేవారు తమ పోషణకోసం వేరే పని చేసుకోవడం పొరపాటేమీ కాదు. అసలు, అది మంచి పద్ధతే (అపొ కా 18:3; 20:34,85; 2 తెస్స 3:7-10). 21:4 20:15; లూకా 24:17. 21:5 “అబ్బాయిలారా” - 13:38 పోల్చి చూడండి.
ఉందా?” అని వారితో అన్నాడు.
“లేదండి” అని వారు ఆయనకు బదులు చెప్పారు.
6 అప్పుడాయన “పడవ కుడిప్రక్క వల వేయండి. మీకు చేవలు దొరుకుతాయి” అని వారితో చెప్పాడు. వారలా వల వేసినప్పుడు బోలెడన్ని చేపలు వడడం చేత వల లాగలేక పోయారు.
7 అందుచేత యేసు (ప్రేమించిన ఆ శిష్యుడు “ఆయన ప్రభువే!” అని పేతురుతో చెప్పాడు.
ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే, మునువు తీసివేసిన తన పై బట్ట వేసుకొని సరస్సులో దూకాడు. ఒడ్డు అక్కడికి చాలా దూరంలో లేదు - సుమారు రెండు వందల మూరల దూరం. 8 కనుక తక్కిన శిష్యులు చేపలున్న వల లాక్కొంటూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9 ఒడ్డుకు చేరగానే అక్కడ నిప్పు, దానిమీద చేపలూ రాట్టెలూ వారికి కనిపించాయి.
10 యేసు “ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్నిటిని ఇటు తీసుకురండి” అని వారితో అన్నాడు. 11 సీమోను పేతురు వడవ ఎక్కి వల ఒడ్డుకు లాగాడు. వల పెద్ద చేపలతో నిండి ఉంది - మొత్తం నూట యాభై మూడు చేపలు. ఇన్ని ఉన్నా వల పిగలలేదు.
12 యేసు “వచ్చి భోం చేయండి” అని వారితో అన్నాడు. ఆయన ప్రభువని శిష్యులకు తెలుసు గనుక “మీరెవరు?” అని ఆయనను అడగడానికి ఎవరూ తెగించలేదు. 18 యేసు వచ్చి రొట్టెలు చేతపట్టుకొని వారికి పంచి ఇచ్చాడు, అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14 చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచిన తరువాత యేసు తన శిష్యులకు కనుపరచుకోవడం ఇది మూడో సారి.
15 వారు భోజనం చేసిన తరువాత సీమోను పేతురుతో యేసు ఇలా అన్నాడు: “యోనా కొడుకెన సీమోనూ! నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”
21:6 ఇలాంటి అద్భుతమే లూకా 5:4-10లో ఉంది. సముద్రంలో (ప్రతి చేప ఎక్కడుందో, ఆకాశంలో ప్రతి నక్షత్రం ఎక్కడుందో యేసుప్రభువుకు తెలుసు (యెషయా 40:26). మనుషుల్ని పట్టే జాలరులకు (మత్తయి 4:19) ఇక్కడొక మంచి పాఠం ఉంది. క్రీస్తు వారి ప్రయత్నాలకు మార్గదర్శకుడుగా ఉంటూ దీవించకపోతే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. రాబోయే కాలంలో విశ్వాసులయ్యే వారంతా ఎక్కడున్నారో వారిని చేరుకోవడమెలాగో ఆయనకు తెలుసు.
21:7 గతంలో జరిగిన ఆ అద్భుతం తరువాత పేతురులో కనిపించిన మనస్తత్వానికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది (లూకా ర్: 8). ఈ మధ్య కాలంలో తన గురించీ యేసుప్రభువు గురించీ అతడెన్నో సంగతులు నేర్చుకున్నాడు.
21:9 పరలోకంనుంచి వచ్చిన ప్రభువు తన శిష్యుల కోసం ఆహారం సిద్ధం చేశాడు. 18:8-5; మత్తయి 20:28 పోల్చి చూడండి. లూకా 12:35-87 కూడా చూడండి.
21:11 శిష్యులు ఆ చేపలను అమ్మి ఖర్చులకు డబ్బు సంపాదించుకోగలిగేవారు. ప్రభువు ఆ వల పిగిలిపోకుండా చేశాడు కూడా. అప్పటినుంచి అన్ని తరాల్లోనూ, అద్భుతమైన రీతుల్లో ప్రభువు తన సేవకులను పోషించాడు. మత్తయి 6:31-38; ఫిలిప్పీ 4:19 ఎప్పటికీ నిలిచివుండే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. 1 రాజులు 17:3-9 కూడా చూడండి. 21:12 “భోం చేయండి” - ప్రకటన 3:20 పోల్చి చూడండి. చనిపోయి సజీవంగా లేచిన దేవుని కుమారుని సమక్షంలో
శిష్యులు అద్భుతాశ్చర్యాలతో తల మునకలైపోతూ, ఏమి మాట్లాడాలో తోచక మిన్నకుండి ఉంటారు. 21:18 (ప్రభువు భోజనం వండడమే కాదు, వారికి
వడ్డించాడు కూడా. మనుషులకు పరిచర్య చేయాలన్న ఆయన అభిలాష ఆయన మరణించి సజీవంగా లేవడంతో అంతమైపోలేదు (హీబ్రూ 18:8).
21:14 “మూడో సారి” - తన ఆది శిష్యుల గుంపుకు కనిపించాడన్నమాట. స్త్రీలకు, ఇతరులకు కనిపించిన సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి.
21:15-17 పేతురు ప్రభువును మూడుసార్లు ఎరగనని అబద్ధం చెప్పాడు (18:17,25,27). అందుకు అతడెంత వేదనపడ్డాడో మత్తయి £26:75ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అతని (ప్రేమను గురించి మూడుసార్లు అతణ్ణి యేసు (ప్రశ్నిస్తున్నాడు. తాను యేసెవరో తెలియదని చెప్పిన మూడుసార్లు పేతురుకు గుర్తుకు వచ్చి ఉండాలి. అతడు
తనను తాను ఎదుర్కొని తన బలహీనతను, అజ్ఞానాన్ని పాపాన్ని గుర్తించగలిగితే అతనికి మంచిది. సైతాను “జల్లించినది” ప్రత్యేకంగా పేతురునే (లూకా 22:31). అందువల్ల (ప్రభువు (ప్రత్యేకంగా పేతురు సంగతి చూస్తున్నాడు. పేతురుతో ఇలా మాట్లాడ్డం ద్వారా ఆయన ఇతర శిష్యులకు (మనకు కూడా) చాలా ప్రాముఖ్య సత్యాన్ని నేర్పిస్తున్నాడు. పేతురు దుఃఖాన్ని ప్రభువు తిరిగి మేల్కొల్చినప్పటికి అది ఆయన ముఖ్యోద్దేశం కాదు. ఆయన ముఖ్యోద్దేశం పేతురును బలపరచి తిరిగి అతనికి తన పనిని అప్పగించడం.
“వీరికంటే” - గ్రీకులో (ఇంగ్లీషులో కూడా) ఈ మాటను బట్టి యేసు “వీరికంటే” అంటున్నాడా “వీటికంటే” అంటున్నాడా అని తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఈ మాటను మూడు విధాలుగా వివరించవచ్చు. “ఈ శిష్యులు (ప్రేమించినంతకంటే ఎక్కువగా నీవు నన్ను (ప్రేమిస్తున్నావా?”, లేక “ఈ శిష్యులను నీవు (ప్రేమించినదానికంటే నన్ను ఎక్కువగా (్రేమిస్తున్నావా”, లేక “చేపలు, చేపలు పట్టడం కంటే నన్ను ఎక్కువ (ప్రేమిస్తున్నావా?” ఈ మూడింటిలో మొదటిది సరైన వివరణ అనుకునే అవకాశం ఉంది. క్రీస్తు పట్ల తనకున్న (ప్రేమానురాగాలను ఇతరులందరికంటే పేతురే ఎక్కువగా చెప్పాడు (13:87), ఇతర శిష్యులకంటే తాను గొప్పవాణ్ణి అన్నట్టు పోలిక చెప్పాడు (మత్తయి 26:33). “సరే, నీ చేదు అనుభవం తరువాత, నీ బలహీనత నీకు తెలిసివచ్చిన తరువాత ఇప్పుడు వీరందరికంటే నీవే నన్ను ఎక్కువగా (పేమిస్తున్నావని చెప్పగలవా?” అని ఈ ప్రశ్నకు అర్థం అన్నట్టుంది.
రెండో వివరణకు అంత అవకాశం కనిపించదు. కానీ మత్తయి 10:37,38 పోల్చి చూడండి. పరలోకం ప్రభువును (ప్రేమించినదానికంటే ఇహలోకంలో స్నేహితులను ఎక్కువగా (ప్రేమించడం కూడా సాధ్యమే.
పైన ఇచ్చిన మూడో వివరణను తీసుకుంటే ఇలా చెప్పుకోవచ్చు : “నాకంటే, నా విధానాల కంటే నీ పాత జీవితం, దాని విధానాలే నీకెక్కువ ఇష్టమా?” (వ 19; మత్తయి 4:18-20; 19:27).
ఏ అర్ధం మనం తీసుకున్నా ఒకటి మాత్రం స్పష్టమే. యేసు ప్రభువుతో ఒక శిష్యునికి ఉండే సంబంధంలో ఒకటి మాత్రం అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యం - ఆయనపట్ల (ప్రేమ. 1 కొరింతు 138:1-3; 16:22 పోల్చిచూడండి. ఆయనపై మనకున్న (ప్రేమకు అనుగుణంగానే మనం ఆయనకిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగలం అతడు “అవును, ప్రభూ! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని ఆయనతో చెప్పాడు.
ఆయన అతనితో “నా గొర్రెపిల్లలను మేపు” అన్నాడు. 16 మళ్ళీ ఆయన “యోనా కొడుకైన సీమోనూ! నీవు నన్ను (ప్రేమిస్తున్నావా?” అని రెండో సారి అతనితో అన్నాడు.
అతడు “అవును, ప్రభూ! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని ఆయనతో చెప్పాడు.
ఆయన అతనితో “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17 ఆయన అతనితో మూడో సారి ఇలా అన్నాడు: “యోనా కొడుకైన సీమోనూ! నీవు నన్ను ట్రేమిస్తున్నావా?”
“నీవు నన్ను క్రేమిస్తున్నావా?” అని మూడో సారి తనతో చెప్పినందుచేత పేతురు నొచ్చుకొని ఆయనతో “ప్రభూ! అంతా నీకు తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలిసే ఉంది” అన్నాడు.
యేసు అతనితో ఇలా అన్నాడు: “నా గొర్రెలను మేపు. 18 నేను నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నీ యువప్రాయంలో నీ నడుము నీవే బిగించుకొని నీ ఇష్టప్రకారం తిరిగేవాడవు. కానీ, ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాపుతావు. వేరొకడు
నీ నడుము బిగించి నీకు ఇష్టం కాని స్థలానికి నిన్ను తీసుకుపోతాడు.” 19 అతడు ఎలాంటి చావుకు గురి అయి దేవునికి మహిమ కలిగిస్తాడో దానిని సూచించడానికి ఆయన ఆ మాటలు చెప్పాడు. ఆయన అలా చెప్పి “నన్ను అనుసరిస్తూ ఉండు” అని అతనితో అన్నాడు.
20 పేతురు వెనక్కు తిరిగి, యేసు ప్రేమించిన ఆ శిష్యుడు తమ వెంట రావడం చూశాడు. వస్తా భోజన సమయంలో యేసు ఛాతీని ఆనుకొని “ప్రభూ, నిన్ను ఎవడు పట్టి ఇస్తాడు?” అని చెప్పినవాడు ఇతడే. 21 అతణ్ణి చూచి పేతురు యేసుతో “ప్రభూ, ఇతని నంగతి ఏమిటి?” అన్చాడు.
£2£2 యేసు “నేను తిరిగి వచ్చేంతవరకు అతడు ఉండిపోవడం నాకిష్టమైతే అది నీకేమిటి? నీ మట్టుకు నీవు నన్ను అనుసరిస్తూ ఉండు” అని అతనితో చెప్పాడు.
28 అందుచేత ఆ శిష్యుడు చనిపోడనే మాట సోదరులలో ప్రాకిపోయింది. అయినా అతడు చనిపోడని యేసు అతనితో చెప్పలేదు గానీ “నేను తిరిగి వచ్చేంతవరకు అతడు ఉండిపోవడం నాకిష్టమైతే అది నీకేమిటి?” అన్నాడు. 24 ఈ సంగతులను గురించి సాక్ష్యం చెపుతున్నది, వాటిని వ్రాసినది
“మేపు” - దేవుని వాక్కుతో పేతురు కొత్తగా విశ్వాసులైన వారిని, అనుభవం లేనివారిని పోషించాలన్నమాట. (ప్రేమ కార్యరూపంలో బయట పడాలి. 14:15,28 చూడండి. మనం క్రీస్తును (ప్రేమిస్తే ఆయన ప్రజలను కూడా ప్రేమిస్తాం (1 యోహాను 4:20).
21:16 “కాపరిగా ఉండు” - కేవలం “మేపడం” కంటే మరింత ఎక్కువ అర్థం ఇందులో ఉంది. క్రీస్తు ప్రజలను (ప్రేమగల కాపరిగా ఉండి, అన్నివిధాలా వారి సంక్షేమాన్ని ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో చూచుకుంటూ ఉండాలని దీని అర్థం. ఇలా చెప్పడంలో యేసు పేతురును ఇతర శిష్యులకంటే అధికంగా హెచ్చిస్తున్నాడా? లేదు. వారు, ఇంకా అనేకమంది కూడా, ఉపదేశకులుగా కాపరులుగా దేవుని మందను మేపేవారుగా ఉండాలి - అపొ కా 20:28; ఎఫెసు 4:11-18%; 1 పేతురు 5:1-4. క్రీస్తు ఒక్కడే ప్రముఖుడైన కాపరి.
21:17 “మూడో సారి” - ప్రభువును మూడుసార్లు ఎరగననడం గుర్తుకు వచ్చి పేతురు ఇలా నొచ్చుకొన్నాడనడంలో మనకు సందేహం ఉందా?
“అంతా నీకు తెలుసు” - £2:24,25; హీబ్రూ 4:18 పోల్చి చూడండి. ఇలా అనడంలో యేసు దేవుని అవతారమని పేతురు పూర్తిగా నమ్మి ఉండాలి. దేవుడు తప్ప అంతా తెలిసిన వారెవరున్నారు?
“గొర్రెలను” - వ 15తో సరిచూడండి. వీరు అనుభవం ఉన్న
విశ్వాసులు కావచ్చు. ఆహారం అవసరం లేనంతగా ఏ విశ్వాసీ ఎదిగిపోడు. 21:18,19 పేతురు ముసలివాడైపోయి చనిపోతాడని ప్రభువు సూచిస్తున్నాడు. ఆ ఆది శిష్యులు ట్రతికివున్న కాలంలోనే ఏ క్షణంలోనైనా క్రీస్తు తిరిగి రాగలిగేవాడని కొంతమంది బోధించే సిద్ధాంతంతో దీన్నీ పొసగేలా చెయ్యడం తేలిక కాదు. ఈ భవిష్యద్వాక్కు పలికిన తరువాత ప్రభువు పేతురు వృద్ధుడై చనిపోకముందే తిరిగి రాగలిగేవాడా?
“దేవునికి మహిమ” - ఇంతకు ముందు యేసును తానెరుగనన్నాడు పేతురు. కానీ మరణంలో అతడు స్థిరంగా ఉండి చివరికి తన మాట నిలుపుకుంటాడు (13:37). పారంపర్యంగా వచ్చిన విషయాన్ని బట్టి పేతురు సిలువ మరణం
పొందాడంటారు. ఇక్కడ క్రీస్తు పేతురుతో చెప్పిన చివరి మాట అతనితో చెప్పిన మొదటి మాటలాగానే ఉంది (మత్తయి
4:18,19). శిష్యుడుగా అతణ్ణి పిలిచిన సత్యాన్ని ఇది స్థిరపరచింది. 21:20 18:28. “యేసు (ప్రేమించిన శిష్యుడు” కూడా చేపలు
పట్టేందుకు వెళ్ళిన ఏడుగురిలో ఉన్నాడు (వ 2,8). ఇతడు పేతురు కాదని మనకు తెలుసు. యోహాను తప్ప ఇతడు వేరే ఎవరైనా అయి ఉండే అవకాశం ఉన్నట్టు లేదు.
21:21 “ఇతడి భవిష్యత్తు ఏమిటి? ఇతడు కూడా ముసలివాడైపోతాడా? ఇతనికిష్టం లేనిచోటికి ఇతణ్ణి కూడా తీసుకువెళ్తారా? నేను బలాత్మరంగా మరణం పొందితే నా సోదరుడు యోహాను కూడా అలాంటి మరణమే పొందుతాడా?” అని ఈ ప్రశ్నలో భావంలా ఉంది.
21:22 దేవుని సేవకులందరికీ హెచ్చరికగా ఉండవలసిన మందలింపు మాటలివి. (ప్రభువుపట్ల పేతురుకు ఉన్న ఇప్పటి బాధ్యతే అతడు చూచుకోవాలి గాని వేరొకరి భవిష్యత్తు సంగతి కాదు. సహ విశ్వాసుల పట్ల (ప్రేమపూర్వకమైన ఆసక్తి మనకు ఉండకూడదని యేసు చెప్పడం లేదు (18:34; 1 కొరింతు 12:25,26; గలతీ 6:2 పోల్చి చూడండి). అయితే ఇతరుల పట్ల క్రీస్తుకున్న ఉద్దేశాలను తెలుసుకోవాలని మనకు తగని ఆశ కలగవచ్చు. ఇతరులు ఏమి చేస్తున్నారో చూడడంతోనే పొద్దుపుచ్చుతూ, కేవలం ప్రభువునే అనుసరించాలన్న మన బాధ్యత నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదు.
21:23 “అన్నాడు” - యేసు మాటలకు అర్థం చెప్పడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గదా! యేసుప్రభువు మామూలుగా చెప్పిన ఒక మాటను కొందరు ఎంతగా అపార్థం చేసుకుంటారో, అక్కడ లేని తలంపులు దానికి కలిపి దాని అర్థాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో ఇదొక మంచి ఉదాహరణ. సరిగ్గా యేసు పలికిన మాటనే యోహాను ఎలా నొక్కి చెప్తున్నాడో గమనించండి. సామెత 80:5,6 పోల్చి చూడండి.
21:24 యేసు ట్రేమించిన శిష్యుడెవరో (వ 20) ఇక్కడ మనకు తెలిసిపోతున్నది. అతడు ఈ శుభవార్త రచయిత. ఇతడు క్రీస్తూరయబారి యోహాను అనేందుకు సాక్ష్యాధారాలున్నాయి గానీ మరి ఏ ఇతర శిష్యుడనుకునేందుకూ ఆధారాలు లేవు.
ఆ శిష్యుడే. అతని సాక్ష్యం సత్యమని మాకు తెలుసు. £25 యేసు చేసిన ఇతర కార్యకలాపాలు అనేకం. ఒకవేళ
వాటిలో ప్రతిదానినీ వివరంగా ప్రాస్తే, వ్రాసిన పుస్తకాలను పెట్టడానికి ఈ లోకమే చాలదనుకొంటాను. తథాస్తు.
“మాకు” - ఇక్కడ బహువచనంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో చెప్పలేము. యోహాను రాసినదానికి మరో శిష్యుడు ఈ వాక్యాన్ని గనక కలిపి ఉంటే ఆ శిష్యుడెవరో మనకు తెలియదు. అదెలాగైనా ఇది కూడా దేవుని వాక్కే అని మా నమ్మకం.
21:25 “ఇతర కార్యకలాపాలు” - 20:30; మత్తయి 8:16, 9:35; మొ! “పుస్తకాలు” - అలాంటివి ఎంతో విలువగలవి అయినా,
అవన్నీ మనకు అవసరం లేదని దేవునికి తెలుసు. మనకేది అవసరమని ఆయన భావించాడో అదంతా మనకు ఉంది. ఆయన మనసులో ఉన్న ఉద్దేశానికి ఆయన మనకిచ్చినది సరిపోతుంది. ఆయన ఇచ్చినదాని కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పి మన జీవిత కాలమంతా మన పఠనంలో దాన్ని ముఖ్య భాగంగా చేసుకుని ఆయన కృపవల్ల దాన్ని ఆచరణలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంటే చాలు.
