యోహాను శుభవార్త – భాగము 9 (పుటలు 51–56)
యూదాకు ఇచ్చాడు. £27 ఆ ముక్క తీసుకొన్న తరువాత సైతాను వానిలో చొరబడ్డాడు. అప్పుడు యేసు వానితో “నీవు చేసేది త్వరగా చెయ్యి!” అన్నాడు.
28 ఆయన ఏ కారణంచేత వానికి అది చెప్పాడో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఎవరికీ తెలియదు. 29 డబ్బుసంచి యూదాదగ్గర ఉంది గనుక పండుగకోసం తమకు కావలసినవి కొనమని గానీ బీదలకు ఏమైనా ఇమ్మని గానీ యేసు వానితో చెప్పాడేమో అని కొందరు అనుకొన్నారు. 30 వాడు ఆ ముక్క తీసుకోగానే బయటికి వెళ్ళాడు. అది రాత్రివేళ,
381 వాడు బయటికి వెళ్ళినతరువాత యేసు ఈవిధంగా అన్నాడు: “ఇప్పుడు మానవ పుత్రునికి మహిమ చేకూరుతుంది,
ఆయనమూలంగా దేవునికి కూడా మహిమ చేకూరుతుంది. 82 ఆయనమూలంగా దేవునికి మహిమ చేకూరితే దేవుడు తనమూలంగా ఆయనను మహిమపరుస్తాడు, వెంటనే ఆయనను మహిమపరుస్తాడు. 88 చిన్నపిల్లలూ! ఇంకా కొంత కాలమే మీతో ఉంటాను. మీరు నన్ను వెదకుతారు గాని నేను యూదులకు చెప్పినట్టు మీకూ చెవుతున్నాను, నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు. 84 ఒక క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను - మీరు ఒకరినొకరు (ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను (ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు (్రేమతో చూచుకోవాలి. 85 మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.” 36 సీమోను పేతురు “ప్రభూ! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?”
18:27 లూకా 22:3. ఇంతకు ముందే సైతాను యూదా మనసులో యేసును (్రోహంతో శత్రువులకు పట్టివ్వాలన్న ఆలోచనను ప్రవేశపెట్టాడు. (వ £2). యూదా ఎప్పటినుంచో సైతాను దారుల్లో వెళ్తున్నాడు (6:70; 12:6). ఇప్పుడైతే సైతాను అతణ్ణి పూర్తిగా వశపరచుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన యూదాను భయంకరమైన అంతానికి తెచ్చింది (మత్తయి £27:38-7). యేసు యూదాతో చెప్తున్న మాటలు ఆయన సమయం వచ్చిందనీ, యూదా చేసే ద్రోహ కార్యానికి ఆయన పూర్తిగా సన్నద్ధుడై ఉన్నాడని తెలియజేస్తున్నాయి. ఇక యూదా కాలయాపన చెయ్యవలసిన పని లేదు (7:30; 12:1).
13:29 12:6 శిష్యుల్లో కనిపించే మందబుద్ధి కొన్ని సార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది.
18:30 ఇతర శిష్యులకు అర్థం కాకపోయినా యేసు అన్చదేమిటో యూడాకు తెలుసు. అది రాత్రివేళ, యూదాలో అది ఆధ్యాత్మికంగా రాత్రి సమయం, ఈ భూమిపై అంధకార సమయం ఆరంభం (లూకా 22:58). మత్తయి £26:26-29లోని సంగతులు జరిగాక యూదా బయటికి వెళ్ళినట్టుంది. లూకా 22: 20,21 చూడండి.
18:31 “మానవ పుత్రుడు” - మత్తయి 8:20. యేసుప్రభువు సిలువపై ఘోరమైన మరణాన్ని పొందవలసిన ఘడియ ఆసన్నమైనది. ఆయన్ను పట్టియివ్వబోయేవాడు అలా చేసేందుకు బయటికి వెళ్ళాడు. మరుసటి రోజు యేసు మరణిస్తాడు. దీన్నంతటినీ ఆయన ఎలా భావిస్తున్నాడు? తనకు మహిమగా భావిస్తున్నాడు. అది మహిమ ఎలా కాగలదు? ఆయనకు అన్నిటికన్నా ఎక్కువ గౌరవాన్ని చేకూర్చే ఆయనలోని లక్షణాలను ఆ సిలువ బాధలు బయట పెట్టబోతున్నాయి. దేవునిపట్ల, మనుషులపట్ల ఆయన అమర (ప్రేమ, ఆయన అణకువ, ఆయన పవిత్రత, తదితర శ్రేష్ట గుణాలు అవి. యేసు సిలువ మరణంలో మహిమ పౌందినంతకంటే మరే సమయంలోనూ ఎక్కువ మహిమ పొందలేదు. ఎందుకంటే ఆయన స్వభావం, లక్షణాలు అతి స్పష్టంగా వెల్లడి అయినది అక్కడే. అంతేగాక జరిగిన దానంతటిలో తండ్రికీ కుమారునికీ సంపూర్ణ ఐక్యత ఉంది గనుక క్రీస్తులో తండ్రి అయిన దేవుడు కూడా మహిమ పొందాడు. 18:32 క్రీస్తు చనిపోయి సజీవంగా లేవడం గురించిన మాట ఇది. యేసు మనసారా సమ్మతించి సిలువ మరణాన్ని సహించాడు కాబట్టి దేవుడు ఆయన్ను లేపి పరలోకంలో తన కుడివైపున అత్యున్నతంగా హెచ్చించాడు (అపొ కా £2:32,88; 38:13-15; ఫిలిప్పీ 2:6-11).
18:38 యేసు తన శిష్యులను “చిన్నపిల్లలారా” అని పిలిచినది ఇక్కడొక్క చోటనే. వారి పట్ల ఆయనకున్న వాత్సల్యాన్ని ఇది సూచిస్తున్నది. (1 యోహాను 2:1,12,13,18,28;
3:7,18; 44 5:21 పోల్చి చూడండి. మత్తయి 18:2,8 కూడా చూడండి. 18:34 ఆయన మరణించే రోజు ముందురాత్రి ఆయన
మనసులో ప్రధానంగా ఉన్న తలంపు తన శిష్యులంతా ఒకరినొకరు (ప్రేమించుకోవలసిన అవసరమే. అలా చెయ్యాలని కేవలం వారికి విన్నవించుకోలేదు, సలహా ఇవ్వలేదు. ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ మూడు సార్లు ఇచ్చాడు (15:12,17). రోమ్
18:8; గలతీ 5:138,14 ఎఫెసు 5:2; ఫిలిప్పీ 2:2; కొలస్సయి 2:2; 1 తెస్స 3:12; 49; హీటబ్రూ 13:1; యాకోబు 2:8; 1 పేతురు 1:22; 2:17; 8:8;
1 యోహాను 3:11,18,23; 4:7 కూడా చూడండి.
“క్రొత్త” - తనను ప్రేమించుకొన్నట్టే తన సాటి మనిషిని (పేమించాలన్నది దేవుని ధర్మశాస్త్రమంతట్లోనూ ఉన్న రెండు గొప్ప ఆజ్ఞల్లో ఒకటి (మత్తయి 22:35-40). అలాగైతే ఇది కొత్త ఆజ్ఞ ఎలా అయింది? యేసుప్రభువు ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనదీ, శ్రేష్టమైనదీ అయిన ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. క్రీస్తు సంఘం అనే పేరుతో పిలవబడే విముక్తులైన ఒక కొత్త గుంపును ఆయన సృష్టించాడు. అందులో ప్రతి సభ్యుడూ ఇతర సభ్యులందరి పట్లా చూపవలసిన (ప్రేమ ప్రత్యేకమైనది, సాటి మనిషి పట్ల చూపవలసిన (ప్రేమ, ఆదరాలకంటే ఉన్నతమైనది. వారిపట్ల క్రీస్తు చూపిన (ప్రేమను ఆధారం చేసుకున్న (ప్రేమ అది. విశ్వాసులు కేవలం తమను తాము (ట్రేమించుకొన్చట్టే సాటి విశ్వాసులను ట్రేమిస్తే సరిపోదు. క్రీస్తు తమను ప్రేమించినట్టుగా వారిని ప్రేమించాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడు? అంతం వరకు, సంపూర్ణంగా మనసారా, తన ప్రాణం ధారపోసేంతగా (ప్రేమించాడు. 1 యోహాను 38:16 చూడండి. ఆయనది సంపూర్ణంగా పవిత్రమైన (ప్రేమ, స్వార్ధం లేనిక్రేమ, ఎన్నడూ తప్పని ప్రేమ 1 కొరింతు 18:1 నోట్ చూడండి.
13:35 క్రైస్తవులు ఒకరినొకరు (ఫ్రేమించుకొంటే, తమకూ సంఘం వెలుపల ఉన్న (ప్రజలకూ వారు నిజమైన క్రైస్తవులనీ, క్రీస్తును నిజంగా అనుసరించేవారనీ అది రుజువుగా ఉంటుంది - 1 యోహాను 3:14. క్రైస్తవులు ఒకరినొకరు కరుచుకుంటూ దిగమింగివేస్తూ ఉంటే (గలతీ 5:15), ఒకరినొకరు మోసగిస్తూ ఉంటే (1 కొరింతు 6:8) (ప్రజలకు వారు నిజమైన క్రైస్తవులని నమ్మకం కుదరదు.
13:36 లూకా 2445లో రాసిన సంఘటన జరగకముందు శిష్యులు ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవడంలో చాలా మందమతులు. తనకు కలగబోతున్న మరణం గురించి ఆయన వారికి ఒకటికన్నా ఎక్కువ సార్లు చెప్పాడు (మత్తయి 16:21; మొ). ప్రేమించాలని యేసు ఇచ్చిన ఆజ్ఞను పూర్తిగా పక్కకు నెట్టి అంతకు ముందు ఆయన చెప్పిన సంగతి గురించి పేతురు అని ఆయననడిగాడు.
యేసు “నేను వెళ్ళే స్థలానికి నీవిప్పుడు నా వెంట రాలేవు. తరువాత నా వెంట వస్తావు” అని సమాధానం చెప్పాడు.
87 పేతురు “ప్రభూ, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకోసం నా ప్రాణం ధారపోస్తాను” అని ఆయనతో జవాబిచ్చాడు.
88 యేసు “నీ ప్రాణం నాకోసం ధారపోస్తావా? నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నన్ను 'ఎరగనిని నీవు మూడు సార్లు చెప్పకముందే కోడి కూయదు” అన్నాడు.
14న హృదయం ఆందోళన పడనియ్యకండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. నామీద
కూడా నమ్మకం ఉంచండి. 2 నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. ఇది నిజం కాకపోతే మీతో చెప్పి ఉండేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్త స్థలం సిద్ధం చేస్తే, నేను ఎక్కడ ఉంటానో మీరూ అక్కడ ఉండేలా తిరిగి 1 వస్తాను, నా దగ్గర మిమ్ములను చేర్చుకొంటాను. 4 నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అది మీకు తెలుసు, ఆ మార్గం కూడా మీకు తెలుసు.”
5 అందుకు తోమా “ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదే! మార్గం మాకెలా తెలుసు?” అని ఆయననడిగాడు.
6 యేసు అతనితో ఇలా చెప్పాడు: “నేనే మార్గాన్ని సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు
'ప్రశ్నిస్తున్నాడని గమనించండి. ఇప్పుడు కూడా అనేకమంది క్రైస్తవులు క్రీస్తు ఏం చేస్తాడో ఊహగానాలతో పొద్దుపుచ్చుతారే గానీ తాము ఏం చెయ్యాలో దాన్ని ఆసక్తితో అభ్యసించరు. క్రీస్తు
ఇక్కడ తాను పరలోకానికి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. 18:37 క్రీస్తు మాటల్లోని భావాన్ని పేతురు ఇంకా అర్ధం
చేసుకోలేదల్లే ఉంది. తన స్వభావాన్ని అతడు అసలే అర్ధం చేసుకోలేదు. మత్తయి 26:31-85 చూడండి. దీన్నిబట్టి క్రీస్తు (ప్రధాన శిష్యులకు సైతం హృదయాల గురించి ఎక్కువ అజ్ఞానం ఉండవచ్చని మనం నేర్చుకోగలం. మన (భ్రష్ట స్వభావంలో అన్ని పాపాల విత్తనాలూ లోతుగా నాటి ఉన్నాయని మనలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది ధూళిలో అణుకువతో వంగి ఉండవలసింది పోయి, స్వశక్తి మీద ఆధారపడుతూ, తమ గురించి గొప్పలు చెప్పుకొంటూ ఉంటున్నారు? యిర్మీయా 17:9; 1 కొరింతు 10:12; సామెత 16:18 చూడండి.
18:38 మనుషులకు తమలో ఏముందో తెలియకపోయినా, క్రీస్తుకు తెలుసు - 2:24,25.
14:1 వారు ఆందోళన చెందడానికి చాలినంత కారణాలు ఉన్నాయి. వారి యజమాని వెళ్ళిపోతున్నాడు. ఆయన్ను ఎరగనని పేతురు అబద్ధాలు పలకపోతున్నాడు. ఏం జరబోతున్నదో వారిలో ఎవరికీ "తెలియదు. ఏదో వింతైన, కష్టతరమైన సంగతి జరగబోతున్నదని మాత్రం తెలుసు. అయితే ఆందోళన పడవద్దని వారికి చెప్తున్నాడు యేసు. అలా ఆందోళన లేకుండా నిబ్బరంగా ఉండడానికి ఈ ఆధ్యాయంలో కొన్ని కారణాలు ఇస్తున్నాడు. మొదటిదేమిటంటే ఆయన నమ్మదగినవాడు. జరుగుతున్న పరిస్థితుల గురించి అందోళన, చింత, కంగారులను ఆయన ప్రజలు ఎప్పుడైనా జయించదగిన మార్గం ఇదే - దేవునిలో క్రీస్తులో నమ్మకం ఉంచాలి. మత్తయి 6:25-27; ఫిలిప్పీ శ, 7 1 పేతురు 5:7 చూడండి. అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకంలో మనశ్శాంతి కావాలంటే ఇప్పటికీ క్రీస్తులో నమ్మకం ఉంచడమే మార్గం.
14:2 వారు ఆందోళన చెందకుండా ఉండడానికి మరో కారణం - వారికి పరలోకంలో దివ్యమైన, శాశ్వతమైన భవిష్యత్తు ఉంది. అలాంటి మహా భాగ్యం తమకోసం కాచుకుని ఉండగా ఈ కాలానికీ, ఇహలోకానికీ చెందిన పరిస్థితులు వారి మనసుల్లో భారంగా ఎందుకుండాలి? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని పేతురు అడిగాడు (18:36). యేసు ఇక్కడ స్పష్టంగా, సూటిగా దానికి జవాబు చెప్తున్నాడు. వారికోసం పరలోకంలో చెయ్యవలసిన పని ఆయనకు ఉంది.
14:3 17:24; 1 తెస్స 4:17. వారు ఎందుకు ఆందోళన
చెందకుండా ఉండాలో మరో కారణం - ఆయన
వెళ్ళిపోతున్నప్పటికీ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు కూడా. మత్తయి 24:26,27; 25:31; 26:64 అపొకా 1:11; 1 తెన్స 4:16-5:4; (ప్రకటన 1:7, 19:11-16; 22:12.
14:4 శిష్యులు తమకు మార్గం తెలియదనుకున్నారు. కానీ నిజానికి వారికి తెలుసు ఎందుకంటే ఆ మార్గమైన యేసు వారికి తెలుసు. పరలోకానికి తీసుకుపోయే మార్గానికి వారు ఇంతకు
ముందే వచ్చారు. అది ఆయనపై నమ్మకం ఉంచడమే (1:12,18; 3:16,86; 5:24 6:47). 14:5 2£20:24,25లో ఉన్నదాన్ని బట్టి ఈ శిష్యుణ్ణి తరచుగా
సందేహి అయిన తోమా అని కైస్తవులు పిలుస్తుంటారు. అయితే ఇతడు ముక్కుసూటిగా పోయేవాడు, ఏదీ దాచుకోనివాడు, కపటం లేనివాడు, తనకు తెలియని సంగతులు తెలుసునని నటించేవాడు కాదు, తాను నమ్మని సంగతులు నమ్ముతున్నానని చెప్పేవాడు కాదు.
14:6 యేసుప్రభువు పలికిన మాటలన్నిటిలోకి ప్రసిద్ధికెక్కిన అత్యంత ప్రాముఖ్యమైన మాటల్లో ఇదొక్కటి.
“మార్గాన్ని? - ఒక మార్గం కాదు; ఉన్న ఏకైక మార్గం. పరలోకానికీ, దేవుని సన్నిధికీ ఆయనొక్కడే మార్గమని నొక్కి చెప్పినది మొదట స్వయంగా ఆయనే, ఆయన శిష్యులెవరూ కాదు. ఆయనపట్ల ఆయన మాటలపట్ల ఆయన శిష్యులు నమ్మకంగా ఉండాలంటే అదే ప్రకటించాలి (3:36; అపొ కా 4:12) 1 తిమోతి 2:5 పోల్చి చూడండి). చాలా మందికి యేసు చెప్పిన ఈ ఉపదేశం నచ్చదు. నచ్చకపోయినంత మాత్రాన ఇది మారుతుందా? ఆయనే సత్యం, ఆయన అబద్ధమాడడు కాబట్టి ఈ మాట మనకు నచ్చేలా చేసుకోవడం ఎంతో మంచిది. తాను దేవుని ఏకైక కుమారుణ్ణని ఆయన చెప్పాడు (8:16). ఆధ్యాత్మిక జీవం తనను స్వీకరిస్తేనే వస్తుందనీ (6:53), శాశ్వతంగా నశించిపోకుండా ఉండాలంటే మనుషులు నమ్మకం పెట్టవలసినది తన పైనే అనీ (8:24), దేవుని ప్రజలకు తానొక్కడే ద్వారమనీ, తానే కాపరి అనీ (8:24) ఆయన తానే చెప్పాడు. ఆయన ఎవరో దాన్నిబట్టీ, ఆయన చూపించిన రుజువులు, సాక్ష్యాధారాలను బట్టి ఆయన్ను నమ్ముదాం.
“సత్యాన్ని” - యేసుప్రభువు ప్రత్యక్షమైన దేవుని సత్యం, సత్య దేవుని అవతారం. ఆయనలో మోసం, కపటం, చీకటి మచ్చుకైనా లేవు. నేనే సత్యాన్ని అని చెప్పిన ఆయన నేనే మార్గాన్ని అని కూడా చెప్పాడు.
“జీవాన్ని” - 11:25. భౌతిక ప్రాణం అని కాదు దీని అర్థం. మనుషులందరికీ, జీవులంతటికీ ప్రాణం తానే అని ఏదో 'ఒక వేదాంతాన్ని ఆయనిక్కడ చెప్పడం లేదు. ఏకైక నిజదేవుని జీవంలో తాను భాగస్వామిననీ (5:26), మనుషులకు శాశ్వత జీవాన్నిచ్చేది తానేనని (5:21; 17:2), ఆ జీవం తనలో మాత్రమే రారు. 7 నేనెవరినో మీరు తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవారే. ఇప్పటినుంచి మీరు ఆయనను తెలుసుకొంటున్నారు. ఆయనను చూశారు.”
8 ఫిలిప్పు ఆయనతో “ప్రభూ, తండ్రిని మాకు కనపరచు. అది మాకు చాలు” అన్నాడు.
9 యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పు, నేను మీతో ఇంత కాలం ఉన్నా ఇంకా నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు. “తండ్రిని మాకు కనపరచు” అని నీవు అడుగుతున్నావేమిటి? 10 నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి నాలో ఉన్నాడు. ఇది నీవు నమ్మడం లేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు.
11 నేను తండ్రిలో ఉన్నాననీ తండ్రి నాలో ఉన్నాడనీ అనుకుంటే నన్ను నమ్మండి. లేదా, ఈ పనుల కారణంగానైనా నన్ను నమ్మండి. 12 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నేను చేస్తున్న పనులు నామీద నమ్మకం ఉంచేవాడు కూడా చేస్తారు, వీటికి మించిన పనులు చేస్తారు. ఎందుకంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. 18 కాబట్టి నా పేర మీరు ఏది అడిగినా సరే, కుమారుని మూలంగా తండ్రికి మహిమ కలిగేందుకు అది నేను చేస్తాను. 14 నా పేర మీరు ఏది అడిగితే అది చేస్తాను.
15 “నా మీద మీకు (ప్రేమ గనుక ఉంటే నా ఆజ్ఞలను ఆచరించండి. 16 నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు
ఉందనీ (1 యోహాను 5:11,12) చెప్తున్నాడు.
నమ్మకం ద్వారా యేసుప్రభువును మన హృదయాల్లో స్వీకరిస్తే ఆయన ఏమై ఉన్నాడో అదంతా మనది అవుతుంది. అప్పుడు మనం పరలోకానికి మార్గంలో ఉంటాం, సత్యాన్ని నమ్ముతాం, జీవాన్ని కలిగి ఉంటాం. యేసును నిరాకరిస్తే దేవుణ్ణి చేరే మార్గంలో ఎన్నటికీ ఉండము, సత్యంపట్ల నమ్మకం కలగదు, శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవం మనకు లభించదు, పరలోకంలో దేవుని సన్నిధికి శాంతితో చేరుకోము. సాక్షాత్తూ దేవుని కుమారుడే ఇది చెప్పాడు కాబట్టి ఇందులో ఇక సందేహమకృ్కరలేదు. 14:7 తానెవరో, ఏమిటో వారు నిజంగా అర్థం చేసుకుని ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా వారు తెలుసుకుని ఉండేవారు. 1:14,18; ఫిలిప్పీ 2:6; లూకా £2:11 నోట్స్‌ను చూడండి. కానీ అప్పటివరకు వారి నమ్మకం, ఆధ్యాత్మిక జ్ఞానం బలహీనంగా ఉన్నాయి. 14:8 ఫిలిప్పు అడిగినది నిర్గమ 38:18లో మోషే కోరికలాగా ఉన్నదేమో - దేవుణ్ణి కళ్ళతో చూడాలని. 14:9 “తండ్రిని చూచారు” - 10:30; 12:44,45; 1:18; హీబ్రూ 1:3 పోల్చి చూడండి. యేసును చూస్తే దేవుణ్ణి చూచినట్టే. 14:10 దేవత్వంలో తండ్రి, కుమారుల పరిపూర్ణమైన, సంపూర్ణమైన ఐక్యతను ఈ మాటలు సూచిస్తున్నాయి. యేసు ఇంతకుముందే ఉపదేశించిన సత్యాన్ని బట్టి ఫిలిప్పు దీన్ని ఇప్పటికే నమ్మి ఉండవలసింది. యేసు మాటలూ పనులూ దేవుని మాటలు, పనులే (7:16; 12:49). 14:11 క్రీస్తు మాటలు ఫిలిప్పును తృప్తిపరచకపోతే, ఆయన చూపిన రుజువులను బట్టి అయినా నమ్మాలి. 10:37,38 చూడండి. 14:12 క్రీస్తు చేసిన పనులకన్నా మించినవి ఎలాంటివి? ఆయన తన అద్భుత కార్యాల గురించి మాట్లాడుతున్నాడని అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే తరువాతి కాలంలో వారు చేసినవి ఆయన చేసినవాటికన్నా గొప్పేమీ కాదు. వారు చేసిన ఒక్క పని మాత్రం ఆయన చేసిన వాటికంటే మించినదని చెప్పవచ్చు - యూదులు, యూడదేతరుల్లో అనేకమందిని నిజ దేవునివైపుకు తిప్పేందుకు వారికి శుభవార్త (ప్రకటించడం (మార్కు 16:15), అన్ని జాతులవారినీ శిష్యులుగా చెయ్యడం (మత్తయి 28:19). క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్యను చాలా కొద్ది ప్రాంతానికే పరిమితం చేసుకున్నాడు. ఆ పరిచర్య ద్వారా తనపై నిజమైన నమ్మకం కలిగినది తక్కువమందికే. ఆయన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తన శిష్యులు తనను మించిన పనులు చేయగలిగేలా, తన శుభవార్తను భూమి కొనలవరకు వ్యాపింపజేయగలిగేలా వారికి సామర్థ్యాన్ని కలిగించేందుకు పవిత్రాత్మను పంపించాడు.
14:18,14 శిష్యులు ఎందుకు ఆందోళన చెందకూడదో (వ 1) ఇది మరో కారణం. ఇది చాలా విశాలమైన పరిధి గల వాగ్దానం, గానీ దీనికి ఖచ్చితమైన షరతులున్నాయి. సఫలమైన ప్రార్థన క్రీస్తు పేరట చేసేదే. ఏ ఇతర నామం, ఏ ఇతర మధ్యవర్తీ అవసరం లేదు. ఆయన పేర చేసే ఎలాంటి ప్రార్ధనకైనా ఆయన తానే జవాబిస్తాడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం పరలోకంలో గానీ భూమిపై గానీ మరెవరి సహాయమూ మనకు అవసరం లేదన్నది స్పష్టమే. ఇక్కడ “పేరు” ఆయనలోని సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని లక్షణాన్ని, అధికారాన్ని సంకల్పాన్ని సూచిస్తున్నది. ఆయన సంకల్పం (ఆయనను గురించి మనకు తెలిసినదంతా) ఆయన ఉపదేశాల్లో వెల్లడి అయింది. అందువల్ల మన ప్రార్థన దానికి అనుగుణంగా ఉండాలి. ఆయనకు విన్నవించుకున్నవి అనేకం మనకు దొరకవు. ఎందుకంటే దీన్ని మనం పాటించము. యేసుప్రభువు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రార్ధనలకు జవాబులు ఇస్తాడు. పరమ తండ్రికి మహిమ కలగాలనే ఆ ఉద్దేశం. మనం కూడా అదే ఉన్నతమైన ఉద్దేశంతో మన ప్రార్థనలకు జవాబులు ఆశించాలి. మత్తయి 6:9,10 పోల్చి చూడండి. మన ఉద్దేశాలు సరైనవైతే గొప్ప విషయాల కోసం అడిగి గొప్ప ఫలితాలు చూడవచ్చు.
15:7; 1 యోహాను 5:14,15 కూడా చూడండి. యిర్మీయా 38:3; లూకా 11:5-18; 18:1-8; ఎఫెసు 6:18; హీబ్రూ 4:16; యాకోబు 5:16 పోల్చి చూడండి.
14:15 దీన్ని మూడుసార్లు చెప్పడం కనిపిస్తుంది. - వ 21,28. పైన ఇచ్చిన వాగ్దానానికి తప్పకుండా ఈ వచనంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ, వాటిప్రకారం చెయ్యకుండా ఉంటే ఆయన పేరున ప్రార్థనెలా చేస్తా? ఆయన్ను ్రేమిస్తున్నామని ఎలా చెప్పుకుంటాం? (ప్రేమకు రుజువు మాటలు కావు, చేతలే. కన్నీళ్ళు, ఉత్తమ మనోభావాలు, ప్రేమను గురించిన జ్ఞానం కావు, విధేయతే. మనం క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకునే విధానం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ పరిశీలించి చూస్తూ మనం వాటిని పాటిస్తున్నామా లేదా అని చూచుకోవడమే. ఎలాంటి ఆజ్ఞలంటే 18:18-17,34; మత్తయి 5:16,28,2£24,
84,39-42, 44; 6:1-6,19,20,25; 7:1; 9:38; 16:24; 18:15,21,22; . 19:4-6; 20:25-27; 24:42,44; 28:19.
14:16 క్రీస్తు శిష్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు మరో కారణం (వ 1). పరలోకంలో క్రీస్తు తన ప్రజల కోసం పరమ తండ్రిని ప్రార్ధిస్తూ ఉన్నాడు. (రోమ్ 8:34; హీట్రూ 7:25). “ఆదరణకర్త” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి పెద్ద అర్థం ఉంది. “సహాయపడేందుకు దగ్గరికి పిలవబడినవాడు” అని తోడుగా ఉంటాడు. 17 ఈయన సత్యాత్మ. లోకం ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడం అసాధ్యం. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. 18 నేను మిమ్ములను అనాథలనుగా విడిచివెళ్ళను. మీ దగ్గరకు వస్తాను. 19 ఇంకా కొద్ది కాలం అయిందంటే లోకం నన్ను చూడనే చూడదు. మీరైతే నన్ను చూస్తారు. నేను బ్రతుకుతున్నాను గనుక మీరూ (బ్రతుకుతారు. £20 నేను నా తండ్రిలో ఉన్నాననీ మీరు నాలో ఉన్నారనీ నేను మీలో ఉన్నాననీ ఆ రోజున మీరు
తెలుసుకొంటారు. 21 నా ఆజ్ఞలు కలిగి వాటిని ఆచరించేవాడే నన్ను (ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి (ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమిస్తాను. అతనికి నన్ను వెల్లడి చేసుకొంటాను.”
£2£2 ఇస్కరియోతు కాని యూదా “ప్రభూ, దేనివల్ల లోకానికి కాక, మాకే నిన్ను వెల్లడి చేసుకుంటావు?” అని ఆయనను అడిగాడు.
23 యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “నన్ను (ప్రేమించేవారెవరైనా నా మాట ఆచరిస్తాడు. అలాంటి వాణ్ణి
దీని అర్థం. తరచుగా ఈ మాట చట్టానికి సంబంధించిన వ్యవహారాల్లో సహాయపడేవాడు, లేక ఒకరి పక్షంగా వాదించే మరో వ్యక్తి, బహుశా ఒక మధ్యవర్తి, ఒకరి గురించి విజ్ఞాపన చేసేవాడు అని కూడా అర్ధం ఇస్తుంది. క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో వాడిన ఈ మాట నీతిన్యాయాలకూ పాపానికీ సంబంధించిన అన్ని విషయాల్లో విశ్వాసులకు సలహాలిచ్చే మిత్రుడు, వారికి బుద్ధి చెప్తూ, సహాయపడుతూ, ఓదారుస్తూ ఉండేవాడు, దేవుని ఎదుట వారికి ప్రతినిధిగా మాట్లాడేవాడు అని అర్థమిస్తున్నది. 17,26 వచనాలను బట్టి యేసుప్రభువు ఈ మాటలు చెప్తున్నది పవిత్రాత్మను గురించి అని స్పష్టంగా ఉంది. “మరో ఆదరణ కర్త” అంటున్నాడు. అప్పటివరకూ ఆయనే వారి ఆదరణకర్త (గ్రీకు భాషలో 1 యోహాను £:1లో యేసుప్రభువుకు ఇదే మాట వాడబడింది. యెషయా 9:6 కూడా చూడండి). ఇప్పుడు తనలాంటి మరొకరిని పంపుతానని వాగ్దానం చేస్తున్నాడు. 7:39; లూకా 24:49; అపొ కా 1:4,5,8; 2:1-4 కూడా చూడండి. ఈ ఆదరణకర్త, విశ్వాసుల దివ్య స్పేహితుడు వారితో “ఎప్పటికీ” ఉంటాడు. వారినెన్నడూ వదిలిపోడు, చెయ్యి విడిచిపెట్టడు. 14:17 “ఈయన సత్యాత్మ” - దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడు (కీర్తన 81:5; తీతు 1:2). యేసుప్రభువు తానే సత్యం (1:17; 14:6). పవిత్రాత్మ సత్య ఆత్మ (15:26; 16:18). ఆయన తత్వమే సత్యం. సత్యాన్ని (ప్రేమిస్తాడు, సత్యమే పలుకుతాడు, సర్వసత్యంలోకి విశ్వాసులను నడిపిస్తాడు (16:13).
“లోకం” అంటే అపనమ్మకంతో, పాపం, అంధకారంలో ఉన్న ఈ లోకం అని యేసు ఉద్దేశం. దైవాత్మ, దివ్యాత్మ, జీవాత్మ, పరమాత్మ వంటి పదాలను ఈ లోకం ఉపయోగించవచ్చు గానీ దానికి ఏకైక నిజ దేవుని పవిత్రాత్మ తెలియదు. ఆయన్ను అది స్వీకరించదు. యేసు శిష్యులకు ఈ పవిత్రాత్మ తెలుసు. పవిత్రాత్మ మూలంగానే వారు కొత్త జన్మ అనుభవించారు (1:12,13). యేసు పరిచర్యలో, తమ సేవల్లో పవిత్రాత్మ నిర్వహించిన పని వారికి తెలుసు (మత్తయి 10:1,19,20; 12:28). ఆయన వారితో ఉండేవాడు. ఆయన వారిలో ఉండబోయే సమయం దగ్గర పడింది. వారి భౌతిక దేహాల్లో ఆయన నివాసం చేస్తాడు (1 కొరింతు 6:19). ఇది మనుషులందరి విషయంలో నిజం కాదు. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచినవారికే ఇది జరుగుతుంది. రోమ్ 8:16; గలతీ 3:2; ఎఫెసు 4:18; యూదా 19 చూడండి. (ప్రతి మనిషిలోనూ పుట్టుకనుంచి ఉండే ఆత్మ దైవాత్మ కాదు. అది దేవుడు సృష్టించిన ఆత్మ. ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ శాశ్వతమైన ఆత్మ, సృజించబడని ఆత్మ యేసు ప్రభువును తమ ప్రభువుగా, ముక్తిదాతగా స్వీకరించినవారిలో మాత్రమే నివసించేందుకు ఆ పవిత్రాత్మ వస్తాడు - గలతీ 3:1-5,14. లోకానికి ఆత్మ ఉంది గాని అది దేవుని ఆత్మ కాదు. ఎఫెసు 2:2 చూడండి.
యేసు దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన “ఉంటాడు” అంటూ వ్యక్తిగత నామవాచకం వాడడం గమనించండి. పవిత్రాత్మ
అంటే కేవలం దేవునినుంచి వెలువడే ఒక దివ్య (ప్రభావం కాదు. తండ్రి, కుమారుల్లాగానే ఆయనొక దైవిక వ్యక్తి. స్వభావంలోనూ, లక్షణాల్లోనూ వారితో ఐక్యంగా ఉన్నవాడు. మనం యేసును “అది” అని ఎలా అనమో దేవుని ఆత్మను కూడా “అది”, “వచ్చింది”, “ఉంది” అంటూ మాట్లాడకూడదు.
14:18 యేసు మరణించి తిరిగి లేచిన తరువాత వారిదగ్గరికి వచ్చాడు (20,21 అధ్యాయాలు). పెంతెకొస్తు దినాన దేవుని ఆత్మ వారిమీదికి వచ్చినప్పుడు ఒక విధంగా యేసు వారిదగ్గరికి వచ్చినట్టే (రోమ్ 8:9లో పవిత్రత్యాను క్రీస్తు ఆత్మ అని పౌలు అన్నాడు). అయితే ఒక వేళ ఇక్కడ ఆయన తన రెండో రాకడ గురించి చెప్తూ ఉండవచ్చు (వ 3).
14:19 ఆయన సజీవంగా లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన్ను చూశారు (20:20,29; 1 కొరింతు 15:5-8). తాను ఎవరినని యేసు చెప్పుకున్నాడో నిజంగా ఆయనే అనడానికీ, ఆయన ఉపదేశాలన్నీ సత్యమనడానికీ ఇది బలమైన ఆధారం. మత్తయి 28:6 నోట్ చూడండి.
“మీరూ బ్రతుకుతారు” - రోమ్ 5:9,10; కొలస్సయి 3:3,4 పోల్చి చూడండి. ఆయన శిష్యుల జీవాన్ని గురించిన ఆశాభావానికి ఆధారం ఆయన సజీవంగా లేవడంతోనే ముడిపడి ఉంది - 5:21,2£26; 6:47,54; 11:25,26.
14:20 “ఆ రోజున” - ఆయన సజీవంగా లేచిన వెంటనే వచ్చే సమయం అని అర్థం. ఆయన తమను ఎలాంటి ఐక్యతలోకి తీసుకురానున్నాడో వారప్పుడు గ్రహిస్తారు. - వ 10; 17:21-28. విశ్వాసుల్లో క్రీస్తు, ఆయనలో వారు - ఇది క్రీస్తు రాయబారి పౌలు రాసిన లేఖల్లో అంతటా కనిపించే అంశం.
రోమ్ 6:3-8; 8:9-11; 2 కొరింతు 13:5; గలతీ 2:20; ఎఫెసు 1:1). 14:21 వ 15. తన విశ్వాసులకు తనతో, తండ్రి అయిన
దేవునితో ఉన్న సంబంధాన్ని నొక్కి చెపుతున్నాడు. ఇది (ప్రేమ సంబంధం. తమ విధేయత మూలంగా విశ్వాసులూ తనను తాను స్పష్టంగా వెల్లడి చేసుకోవడం ద్వారా దేవుడూ ఈ సంబంధాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని అనుభవించిన వారికే అదేమిటో తెలుస్తుంది. తనపట్ల (ప్రేమ విధేయతలు గల పిల్లలంటే దేవునికి ఒక ప్రత్యేకమైన (ప్రేమ ఉంది. ఇది కుటుంబ సంబంధమైన (ప్రేమబంధం, (ప్రేమ చూపడంలో ఆనందం. లోకం పట్ల ఆయనకున్న (ప్రేమకు ఇది భిన్చమైనది. అది నశించిపోయిన భ్రష్ట స్థితిలో ఉన్న లోకం పట్ల జాలి, కనికరాలతో కూడిన (ప్రేమ, 14:22 లూకా 6:16; అపొ కా 1:18. యేసు ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడుగా గొప్ప మహిమతో యూద జాతికీ, లోకానికీ తనను తాను కనపరచుకుంటాడనీ, అధికారాన్ని హస్తగతం చేసుకుని పరిపాలిస్తాడనీ ఇతడు, మిగతా శిష్యులు ఆశించారు. లూకా 24:25,26 చూడండి.
14:23 ఇక్కడ మళ్ళీ విధేయత (ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు. - వ 15,21. ఈ సత్యాన్ని ప్రభువు ఎంత ప్రధానమైనదిగా ఎంచాడన్న సంగతి ఆ ఒకే సమయంలో దీన్ని నా తండ్రి ప్రేమిస్తాడు. అతని దగ్గరకు మేము వస్తాం, అతనితో నివాసం చేస్తాం.
£24 “నన్ను (ప్రేమించనివాడు నా మాటలు ఆచరించడు. మీరు వింటున్న మాట నాది కాదు. నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీతో ఉంటూ ఈ విషయాలు చెప్పాను. 26 తండ్రి నా పేర పంపబోయే ఆదరణకర్త మీకు అన్ని విషయాలు ఉపదేశిస్తాడు. ఆయన పవిత్రాత్మ. నేను మీతో చెప్పినవన్నీ మీ జ్ఞప్తికి తెస్తాడు.
27 “శాంతిని నేను మీకిచ్చి వెళ్ళిపోతాను. నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే ప్రకారం నేను మీకివ్వడం లేదు. మీ హృదయం ఆందోళన పడనియ్యకండి, భయపడనివ్వకండి. 28 “నేను వెళ్ళి మీ దగ్గరకు వస్తాను” అని నేను మీతో చెప్పినది
విన్నారు గదా. నేనంటే మీకు ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నానని నేను చెప్పినందుకు మీరు ఆనందించి ఉంటారు. ఎందుకంటే తండ్రి నాకంటే పైవాడు. 29 ఇప్పుడు ఇది జరిగేముందే మీతో చెప్పాను. ఇది జరిగేటప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం. 80 మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే, లోక పాలకుడు వస్తున్నాడు. వాడికి నాలో ఏమీ లేదు. 81 అయినా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలిసిపోయేలా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చే ప్రకారమే నేను చేస్తున్నాను. లేవండి ఇక్కడనుంచి వెళ్లాం.”
క్ ర్ నిజమైన (థ్రాక్షచెట్టును. నా తండ్రి వ్యవసాయదారుడు. 2 నాలో ఫలించని ప్రతి తీగెనూ
మూడుసార్లు చెప్పడంలోనే అర్థమౌతున్నది. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానం ' బైబిలంతటిలోకీ గొప్ప వాగ్దానాల్లో ఒకటి. తన ప్రజలతో నివాసం చేయాలన్న దేవుని కోరికను ఇది తెలుపుతున్నది. నిర్గమ 25:8 నోట్లో రిఫరెన్సులు చూడండి. యేసుప్రభువును ్రేమించేవారికి ఇప్పుడు ఆయన అలా చేస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి దగ్గరికీ తానూ, తండ్రి అయిన దేవుడూ ఇద్దరూ వచ్చి నివాసం చేస్తామని ఆయన చెప్తున్న మాట గమనించండి. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. స్వభావరీత్యా యేసు తండ్రి అయిన దేవుని వంటివాడే. అయితే ఇక్కడ మరోసారి తనను ఒక ప్రత్యేక వ్యక్తిగా తండ్రికి వేరుగా ఉన్న విషయం సూచిస్తున్నాడు. ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు ఉన్నాయి. 14:24 బైబిలును కేవలం చదువుతూ, బైబిలు నుంచి మంచి (ప్రసంగాలు మాత్రం వింటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ అసలు బైబిలు చెప్తున్నదానికి లోబడనివారి నిజ స్థితి ఏమిటో దీన్నిబట్టి మనం తెలుసుకోవచ్చు. 14:26 క్రీస్తు ఆది శిష్యులకు ఇది ప్రత్యేకమైన వాగ్దానం. యేసు ఉపదేశించినదాన్నే ఉపదేశించేలా పవిత్రాత్మ వారికి సామర్థ్యం ఇస్తాడు (దాన్ని రాయగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు కూడా - ఇలా అని ఇక్కడ రాయకపోయినా ఇది కూడా ఈ మాటల్లో ఉంది). వారు తెలుసుకోవలసినదంతా ఆయన వారికి నేర్పిస్తాడు. యేసు చెప్పినదంతా వారికి జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఆత్మ విశ్వాసులందరికీ నేర్పిస్తాడన్నది కూడా నిజమే (1 కొరింతు 2:10-138; 1 యోహాను 2:27). దేవుడే ఉపదేశకుడుగా ఉండడం గురించి కీర్తన £5:4,5 చూడండి.
దేవుని ఆత్మకు ఇక్కడ ఉన్న పేరును జాగ్రత్తగా గమనించండి. ఆయన “పవిత్ర” ఆత్మ, పవిత్ర దేవునితో ఐక్యతగల ఆత్మ. “పవిత్రత” గురించి నోట్స్ 17:17-19; లేవీ 20:7. పవిత్రాత్మ అంటే తండ్రి గానీ కుమారుడు గానీ కాదని గమనించండి. తండ్రి ఆయన్ను, క్రీస్తు పేరట పంపుతాడు (వ 16). త్రిత్వం గురించి మత్తయి 38:16 నోట్ చూడండి. 14:27 మనుష్యులు ఆందోళన చెందకుండా ఉండడానికి కారణం - యేసు శాంతి కర్త (మెషయా 9:6). దేవునికీ మనిషికీ మధ్య శాంతి కుదర్బాలని ఆయన వచ్చాడు (2 కొరింతు 5:19,20; కొలస్సయి 1:20,22). ఇక్కడైతే విశ్వాసులకు తానిచ్చే మనశ్శాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు (16:33; ఫిలిప్పీ 4:6,7; కొలస్సయి 3:15; 2 తెస్స 3:16). చాలామంది దేన్సైతే కోరుతూ అనుభవించలేకపోతున్నారో దాన్ని తన శిష్యులకు ఉచితంగా ఇచ్చి భయ కారణాలన్నింటినీ తొలగిస్తాడు.
14:28 వారాయన్ను (ప్రేమించారు. కానీ వారి ప్రేమ
ఉండవలసిన రీతిలో ఉంటే వారు తమ గురించి కాక ఆయన గురించీ ఆయన నెరవేర్చడానికి వచ్చిన పని ముగింపు గురించీ ఆలోచించేవారు. తండ్రి సన్నిధిలో ఆయనకు లభించనున్న ధన్యస్థితిని బట్టి ఆనందించేవారు. యేసు తనను తండ్రి అయిన దేవునికి వేరుగా ఎలా చెప్తున్నాడో చూడండి. స్వభావం, లక్షణాలలో తండ్రి కుమారునికన్నా అధికుడే కాదు. ఎందుకంటే ఇద్దరూ ఈ విషయంలో సమాన భాగస్తులు (వ 9; 8:24,58; 1:1; 10:30). అయితే హోదాలోనూ, అధికారంలోనూ తండ్రి అధికుడు 55:19-27; 12:49 చూడండి. చూపడం, ఇవ్వడం, పంపడం, ఆజ్ఞాపించడం తండ్రి బాధ్యత. చూడడం, పుచ్చుకోవడం, తండ్రికి విధేయుడై రావడం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం కుమారుని బాధ్యత.
14:29 13:19 చూడండి.
14:30 “లోక పాలకుడు” - 12:81. యేసుప్రభువు పాపరహితుడు. సైతాను మాటకు గానీ (ప్రేరణకు గానీ ఎప్పుడూ లొంగలేదు. తనది అని సైతాను అనగలిగినది యేసులో ఏమీ లేదు. ఆయన జీవితంపై సైతాను ఏవిధంగానూ ప్రభావం చూపే విధానం ఏమీ లేదు.
14:31 క్రీస్తుపై సాతానుకు కొంత పట్టు ఉన్నట్టుగానే అనిపించే సమయం త్వరలో రానున్చది. “అంధకార సమయం” (లూకా 22:53) వచ్చింది. మనుషులు యేసుపై దేవదూషణ నేరం మోపి నేరస్థుడిలాగా ఆయనకు మరణ శిక్ష అమలు జరపబోతున్నారు. లయితే ఇదంతా సైతాను ఆయనపై ఏదో పట్టు సంపాదించినందువల్ల కాదు గానీ యేసు తండ్రి సంకల్పానికి లోబడినందువల్లే (10:17,18). (ప్రేమకు రుజువు విధేయతేనని యేసు తన శిష్యులతో చెప్పాడు (వ 15,21,28). ఇక్కడ తన సొంత జీవితంలో ఆందుకు ఈ రుజువు చూపిస్తున్నాడు. ఒకటి బోధించి మరొకటి చేస్తూ ఉండే అనేకమంది గురువుల్లాగా కాదు ఆయన.
15:1 పాత ఒడంబడికలో దేవుడు ఇస్రాయేల్ జాతిని
్రాక్షచెట్టుకు పోల్చాడు. కీర్తన 80:8-17; యెషయా 5:1-7; యిర్మీయా 2:21; యెహెజ్కేలు 15:1-8; 19:10-14
హోషేయ 10:1,2 చూడండి. కానీ అది పెరిగి పెద్దయ్యేసరికి పిచ్చి (ద్రాక్షకాయలు కాసింది. దేవుడు ఆశించిన పండ్లు కాయలేదు. అది కపటమైన, పిచ్చి (ద్రాక్ష చెట్లులాగా ప్రవర్తించింది. యేసు “నేను నిజమైన (్రాక్ష చెట్టును” అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికీ, ఫలభరితమైన జీవితానికీ మూలం తానేననీ, ఆ చెడిపోయిన జాతి కాదనీ చెప్తున్నాడు. భూమిపై ఆయన్ను నాటినవాడు, “కొమ్మల” విషయం శ్రద్ధ తీసుకునేవాడు అంటే పరమ తండ్రియైన దేవుడే.
15:2 ఈ ఉదాహరణలో వివరించిన అంశం విశ్వాసుల ఆయన తుంచివేస్తాడు. ఫలిస్తూ ఉన్న (ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించేలా రెమ్మలు కత్తిరించి దిద్దుతాడు. 8 ఇంతకుముందే నేను మీతో చెప్పిన వాక్కువల్ల మీరిప్పుడు శుద్ధులయ్యారు. 4 నాలో నిలిచి ఉండండి. నేను మీలో నిలిబి ఉంటాను. తీగె
దానంతట అదే ఫలించదు - అది డ్రాక్షచెట్టులో నిలిచి ఉండాలి. అలాగే నాలో నిలిచి ఉండక పోతే మీరు ఫలించలేరు.
5 “ద్రాక్షచెట్టును నేను, తీగెలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా
సఫలత, గానీ వారి పాపవిముక్తి, రక్షణ కాదు (వ 4,5,8). దేవునికి ఎలాంటి ఫలాలు కావాలో యేసు ఇక్కడ వర్ణించడం లేదు. బైబిలులో ఇతర ప్రదేశాల్లో అది కనిపిస్తున్నది (మత్తయి 3:8; రోమ్ 6:22; గలతీ 5:22,23; ఎఫెసు 5:9; ఫిలిప్పీ 1:11; హీబ్రూ 6:7-10; సామెత 11:30). తమ ఉద్దేశంలో విజయవంతమైన తమ పరిచర్యను చూపుతూ ఉండే అనేకమంది కైస్తవ సేవకులు గర్విష్టులు, అపవిత్రులు, వంచకులు, నిర్ణయులు, ఆధ్యాత్మికత లేనివారు. విజయవంతంగా కనిపిస్తున్న వారి పరిచర్యలను క్రీస్తు “ఫలం” అనడు. దేవుడు తన విశ్వాసుల్లో కనబడాలని ఆశించే ఫలం వారు క్రీస్తు పోలికలోకి మారాలని.
“తుంచివేస్తాడు” - నిజమైన విశ్వాసులు ఏదో ఒక సమయంలో ఫలించకపోతే తమ రక్షణను, పాపవిముక్తిని కోల్పోతారని యేసు ఇక్కడ చెప్పడం లేదు. 5:24; 6:37-40,54,56; 10:27-29 పోల్చి చూడండి. యేసుప్రభువు ఒక ఉదాహరణలో లేక ఉపమానంలో ఉపయోగించిన మాటలను వాడుకొని వేరొక చోట స్పష్టమైన భాషలో ఆయన చెప్పిన మాటలను కొట్టివేసేందుకు ఎన్నడూ ప్రయత్నించకూడదు. “తుంచివేస్తాడు” అంటే అర్థమేమిటో ఆయన ఇక్కడ వివరించలేదు. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా చెప్పలేదు. ఫలించవలసిన అవసరత గురించి మాత్రమే ఇక్కడ సందేహానికి ఎంతమాత్రం తావియ్యని మాటల్లో నొక్కి చెప్తున్నాడు (వ 6). ప్రతి విశ్వాసీ కొద్దిగానైనా ఫలించేలా అతని విషయంలో పని చేస్తాడనీ చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక క్రైస్తవుడికి నమ్మకం లేకపోతే అతడు నిజమైన క్రైస్తవుడు కాడు. అలాగే ఒకడు ఫలించకపోతే అతడు నిజంగా క్రీస్తులో ఉన్న కొమ్మ కాదన్న మాట. తుంచివేసిన కొమ్మకు యూదా ఇస్కరియోతు ఒక ఉదాహరణ అని మనం చెప్పలేమా? అతడు నిజమైన విశ్వాసి కాదు (6:70,71; 18:10). నిజానికి ఆధ్యాత్మిక జీవితానికి ఏకైక రుజువు సాఫల్యతే. ఒక వ్యక్తిలో పండే ఫలాలు అతడెలాంటివాడో వెల్లడిస్తాయి. మత్తయి 3:10; 77:15-20; 12:38; 18:18-28; లూకా 138:6-9. ఏ వ్యక్తి అయినా కొమ్మగా ఉండి దేవునికోసం ఏమీ ఫలాలు కాయకపోతే, అతడు నిజ క్రైస్తవుడేనా అని మనం సందేహించవలసి వస్తుంది. ఈ
(ద్రాక్షబెట్టు, కొమ్మలు ఉదాహరణంతా మంచివారైతేనేమీ, చెడ్డవారైతేనేమీ, క్రైస్తవులమని చెప్పుకునే వారందరితోనూ
ఏర్పడిన దృశ్య సంఘాన్ని సూచించవచ్చు. పాత ఒడంబడికలో (ద్రాక్షచెట్టు అంటే మంచివారని, చెడ్డవారని లేకుండా, నమ్మకం ఉన్నవారు, లేనివారు అందరితో కూడివున్న ఇస్రాయేల్ జాతికి సూచన. పౌలు రోమ్ 11:16-21లో ఆలీవ్ చెట్టు గురించి రాసినదాన్ని పోల్చి చూడండి.
“కత్తిరించి దిద్దుతాడు” - దేవుడు దీన్నెలా చేస్తాడు? ఆయన ఉపయోగించే కత్తెర ఏమిటి? ఈ కత్తెర అంటే క్రమశిక్షణ, దిద్దుబాట్లు, కష్టాలు, ఇబ్బందులు, రకరకాల బాధలు అన్నమాట. ఆయన మన హృదయాల్లో మనసుల్లో, పరిస్థితుల్లో, అనుభవాల్లో పని చేస్తూ అనవసరమైన వాటిని కత్తిరించి పారేస్తూ, మనం ఎలా ఉండాలో అలా సరిదిద్దుతూ ఉంటాడు. £ కొరింతు 12: 7-12; హీబ్రూ 12:4-11; కీర్తన 66:10-12 చూడండి. బాధలు కష్టాల గురించి యోబు 3:20 నోట్ చూడండి. 15:3 13:10; 17:17; ఎఫెసు 5:26; 1 పేతురు
1:22; కీర్తన 119:9,11. దేవుని వాక్కును మనసులకు, హృదయాలకు, సంకల్పాలకు, మనోభావాలకు సరైన రీతిలో ఉపయోగిస్తే అది వాటిని శుద్ధి చేస్తుంది. 15:4 వ 9,10 పోల్చి చూడండి. నిలిచి ఉండడమంటే ఒకే చోట ఉండడం. వ 4-10లో పది సార్లు ఈ మాట కనిపిస్తుంది. ఈ సందర్భానికి ఈ మాట ఎంత (ప్రాముఖ్యమో దీనివల్ల తెలుస్తున్నది. విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే చోటు క్రీస్తులో. ఆయన (ప్రేమ అనే నేలలో మొక్కల్లాగా నాటుకుని ఉండాలి (ఎఫెసు 38:17), ఆయన శరీరంలో అవయవాల్లాగా (1 కొరింతు 12:12,18), ఆయన ఆలయంలో రాళ్ళలాగా (ఎఫెసు 2:20-22), ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా (హీబ్రూ 3:6), (్రాక్షబెట్టలున ఆయనలో కొమ్మల్లాగా నిలిచి ఉండాలి. తనలో నిలిచి ఉండాలని ఆయన విశ్వాసులతో చెప్తున్నాడు. అంటే విశ్వాసులు బహుశా నిలిచి ఉండరేమోనని అర్థమా? అలా అనుకోనక్కర్తేదు. దేవుడు వారలా ఉండేందుకు బలమిస్తాడని దీని భావం. అలా కాకపోతే ఈ ఆజ్ఞ ఇచ్చి ఉండేవాడు కాదు.
అంతేగాక వారికున్న స్వేచ్చ గురించి కూడా వారు తెలుసుకోవాలని దీని భావం. క్రీస్తులో నిలిచి ఉండడం విశ్వాసులు ఇష్టపూర్వకంగా, కావాలని చేసేది. వారు
తోలుబొమ్మలు, మరమనుషులు కాదు. క్రైస్తవలుగా ఉండడం అనే విషయంలో వారు తమ మనస్సు, సంకల్పం, దేవుడిచ్చేబలం ఉపయోగించాలని దేవుని కోరిక. నిజ క్రైస్తవ్యం యాంత్రికం కాదు, జీవ సంబంధమైనది, ఆధ్యాత్మికమైనది. అది క్రీస్తుకు, ఆయన (ప్రజలకు పరస్పరం బలవంతాన్ని బట్టి జరిగేది కాదు, పరస్పర (ప్రేమ మూలంగా సాగిపోయేదే.
విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు, ఆయనలో నిలిచి ఉంటారు ఎందుకంటే అలాగని వారి కోరిక ఆయన వారిని ఎన్నుకున్నాడు. వారు ఆయన్ను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. వారాయన్ను (ట్రేమిస్తారు. వారి స్వేచ్చ క్రీస్తును విడిచి పెట్టిపోయేలా వారిని చెయ్యదు, ఆయనలో నిలిచి ఉండేలా చేస్తుంది. 6:67,68 పోల్చి చూడండి. ఒక విధంగా క్రీస్తుకుచెందిన నిజ శిష్యులు కూడా ఇతరులు ఆయన్ను విడిచి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవడానికి స్వతంత్రులు. కానీ వారలా వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలన్న దృఢ నిశ్చయాన్ని వారిలో కలిగించినది దేవుని పనే. ఫిలిప్పీ 1:6; £2:12,18 చూడండి. దేవుడు వారిలో చేసినదాన్నే తన విశ్వాసులందరిలోనూ చేస్తున్నాడు.
మనం క్రీస్తులో తప్పక నిలిచి ఉండాలని కోరుతున్నామా? ఆ మార్గం 1 యోహాను £2:24లో కనిపిస్తున్నది. ఆయన సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో కొనసాగాలి. 15:5 “సమృద్ధిగా ఫలిస్తారు” - వారిగుండా క్రీస్తు జీవం, ప్రభావం (ప్రవహిస్తాయి కాబట్టి ఇలా జరుగుతుంది. నిజంగా ఆయనలో నిలిచి ఉండకుండా ఆయన్ను సేవించాలన్న ఏ (ప్రయత్నమైనా, మత సంబంధమైన ఎన్ని కార్య కలాపాలైనా విజయవంతంగా కనిపించేవి ఎన్ని అయినా నిష్పలమైపోతాయి. “చేయగలిగేదేమీ లేదు” అంటే ఆధ్యాత్మికమైనది, నిజంగా దేవుడు కోరుకునేది ఏదీ చేయలేరన్నమాట. నేడు సంఘాల్లో చాలా కార్యక్రమాలు (బయట మతం పేరుతో లోకంలో జరిగేవాటిని అలా ఉంచండి) వ్యర్ధం అయిపోతాయి. ఎందుకంటే అవి క్రీస్తులో
