యోహాను శుభవార్త – భాగము 2 (పుటలు 9–14)
మనిషి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు దేవుని దగ్గరనుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు. ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు.”
8 అందుకు యేసు జవాబిస్తూ “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని
రాజ్యాన్ని చూడలేరు” అని అతనితో చెప్పాడు.
4 నీకొదేము ఆయనతో “ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.
5 యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా
ఒడంబడికలో దేవుడు వెల్లడించినదానికి ఆయువుపట్టు.
“ఉపదేశకుడా (రబ్బీ)” - 1:88 నోట్. యేసును దేవుని
నుంచి వచ్చిన ఉపదేశకుడుగానే నీకొదేము ఎంచినట్టుంది గాని అభిషిక్తుడుగా దేవుని కుమారుడుగా కాదని తెలుస్తున్నది. అయితే యేసు చేసిన అద్భుతాలు ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయని అతడు గుర్తించగలిగాడు. 2:11; మత్తయి 8:1 నోట్స్ చూడండి. 8:8 యేసు జవాబు చాలా ముక్తసరిగా టూకీగా ఉంది. “నీవు అలా నిజంగా అనుకొంటున్నావా? అయితే నీవు నేర్చుకోవలసిన సంగతి ఒకటి నీకు నేర్పుతాను” అన్నట్టుగా ఉంది ఆయన జవాబు. యేసు దేవుని నుంచి వచ్చిన ఉపదేశకుడని ఇప్పుడు మనం అంటున్నామా? అలాగైతే మనక్కూడా ఆయన్ను బోధించనివ్వాలి. బైబిల్లో ఆయన చెప్పిన ప్రతి మాటనూ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
“మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అనే మాట గురించి 1:51
నోట్ చూడండి. కొత్తగా జన్మించడం గురించి 1:18 నోట్ చూడండి. “కొత్తగా” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి “మళ్ళీ” లేక “పైనుంచి” అని కూడా అర్థం ఉంది. కొత్తగా జన్మించడమంటే పునర్జన్మ కాదు. మనుషులు శరీరంతో భౌతికంగా ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారనే సిద్ధాంతం బైబిలు ఉపదేశానికి విరుద్ధం (9:1-3; యోబు 11:12 నోట్స్ చూడండి). ఒక వేళ మనుషులు మళ్ళీ మళ్ళీ పుట్టడం సాధ్యమైనప్పటికీ దానివల్ల నూతన ఆధ్యాత్మిక జన్మ సాధ్యం కాదు. మనుషులంతా పాపులే. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండడమంటే పాప భరిత జీవితాలను మళ్ళీ మళ్ళీ గడుపుతూ ఉండడమే. ఇది మనుషుల దోషాన్ని విపరీతంగా పెంచుతూ పోతుంది. నూతన జన్మ అంటే ఈ జీవితంలోనే ఇక్కడే జరిగేది. పరలోకం నుంచి దేవుడు చేసే నూతన సృష్టి కార్యమది. దేవుని ఘనమైన కార్యం మనుషులను నూతన సృష్టిగా, ఆధ్యాత్మిక జీవం గలవారుగా హృదయంలో అధ్భుతమైన మార్పు పొందినవారుగా చేస్తుంది. అది మరణం నుంచి జీవం లోకి వెళ్ళినట్టే (5:24; £2 కొరింతు 5:17,18; ఎఫెసు £2:1-5). ఇది లేకుండా దేవుని రాజ్యంలో ఎవరికీ భాగం లేదు. యూదుడుగా పుట్టి, ఆచారాలన్నీ పాటిస్తూ, మతనిష్టతో ఉండడం ఇదంతా నూతన జన్మ లేకుంటే వ్యర్థమే అని యేసు నీకొదేముతో చెప్తున్నాడు. దేవుని రాజ్యం గురించి మత్తయి 4:17 నోట్ చూడండి. 3:4 యేసు చెప్తన్నదేమిటో నీకొదేముకు అర్థం కాలేదు. లేదా, అది అసంభవం అంటూ “ముసలివారిలో అంత గొప్ప మార్చు కలగడం సాధ్యమా?” అని అడుగుతున్నాడు. ఇప్పటికీ మతనాయకులు అనేకమంది నీకొదేము ఉన్న స్పితిలోనే ఉన్నారు. 8:5-8 నూతన జన్మ ఎలా జరుగుతుందో ఈ వచనాల్లో యేసుప్రభువు వెల్లడిస్తున్నాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా ఇది కలుగుతుంది. “ఆత్మమూలంగా జన్మించడం” గురించి ఇక్కడ 8 సార్లు కనిపిస్తున్నాయి (వ 5,6,8).
వ 5లో “నీళ్ళ మూలంగా” అనే మాటల విషయంలో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. పాత ఒడంబడిక (గ్రంథంలో తరచుగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నీళ్ళు శుద్ధీకరణకు గుర్తుగా
ఉన్నాయని కొందరన్నారు. నిర్ణమ 30:17-21; సంఖ్యా 19:9; 81:23; కీర్తన 51:7-10; యెషయా 44:3; యిర్మీయా ఉడత యెహెజ్కేలు 87:25 చూడండి. యెహెక్కేలు 36:25,26ను “నీళ్ళమూలంగా దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే” అనేమాటలతో పోల్చి చూడండి. యెహెక్కేలులో నీళ్ళు చిలకరించడం దేవుడు చేసే పనే గానీ మనుషులది కాదని గమనించండి. అందువల్ల హృదయంలో నుంచి పాపాల కల్మషాన్ని కడిగివేయడం గురించే గానీ నీటి బాప్తిసం గురించి అది చెప్పడం లేదని స్పష్టం అవుతున్నది. తీతు 3:5 పోల్చి చూడండి. అక్కడ కొత్త జన్మాన్ని “స్నానం” అని రాసి ఉంది. నీరు శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తుందో అలానే కొత్త జన్మం హృదయాన్ని శుభ్రపరుస్తుందన్న మాట. తీతు 8:5లో నీటి బాప్తిసం గురించిన మాట లేనే లేదు.
నీళ్ళమూలంగా అంటే దేవుని వాక్కుమూలంగా అని మరి కొందరు భావించారు. ఇక్కడ నీరు దేవుని వాక్కుకు సూచనగా ఉందని వారి అభిప్రాయం. దీనికి ఆధారంగా 15:3; ఎఫెసు 5:26; యాకోబు 1:18; 1 పేతురు 1:28 మొదలైన వచనాలను వీరు చూపిస్తారు.
మరి కొందరు ఇక్కడ నీళ్ళు 7:37-89లో లాగే దేవుని ఆత్మకు గుర్తుగా ఉందంటారు. “నీళ్ళమూలంగా, ఆత్మమూలంగా” అనడం ఒకే సంగతిని మరింత నొక్కి చెప్పిన విధానం అని వీరి ఉద్దేశం.
మరి కొందరు నీళ్ళు ఈ లోకంలో శారీరికంగా పుట్టడానికి గుర్తు అంటారు. “మనిషి మొదటి పుట్టుక సరిపోదనీ, దేవుని రాజ్యంలో (ప్రవేశించాలంటే దేవుని ఆత్మమాలంగా కూడా జన్మించడం అవసరం” అని ఇక్కడ యేసు చెప్తున్నాడని వీరి అభిప్రాయం.
మరి కొందరు పశ్చాత్తాపాన్నీ పాపాలను ఒప్పుకొనే సంగతినీ గురించి చెప్పేందుకు “నీళ్ళమూలంగా” అనేమాట యేసు ఉపయోగించాడంటారు. వాటికి చిహ్నం నీటి బాప్తిసం గదా (మత్తయి 3:6 నోట్స్ చూడండి).
మరి కొందరు ఇక్కడ నీళ్ళు అంటే నీటి బాప్తిసం అనీ, నూతన జన్మకు నీటి బాప్తిసం తప్పనిసరి అని బల్లగుద్ది వాదిస్తారు. నీటి బాప్తిసం జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ దాన్ని ఉపయోగిస్తూ దాని ద్వారా పని చేస్తూ దాన్ని తీసుకున్నవారిలో నూతన జీవం కలిగిస్తాడని వారంటారు.
ఈ చివరిది తప్ప పైన చెప్పిన వివరణలన్నిటిలో ఏదైనా నిజం కావచ్చునని ఈ నోట్స్ రచయిత అభిప్రాయం. నూతన జన్మకు బాప్తిసం అవసరమని యేసుప్రభువు ఎక్కడా చెప్పలేదు. వ్యక్తులు నమ్మకం ద్వారా యేసుప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది (1:12,18) గానీ బాప్తిసం ఆచారంలో పాల్గొన్నప్పుడు కాదు. నూతన జన్మ తరువాత బాప్తిసం తీసుకోవాలి గానీ బాప్తిసంవల్ల నూతన జన్మ కలగదు. దేవుడు మాత్రమే నూతన జన్మ అనే అద్భుతాన్ని చేయగలడు. మనుషులు యేసుప్రభువును నమ్మినప్పుడే వారిలో ఆయన ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. పాపవిముక్తీ దేవుని రాజ్యంలో (ప్రవేశించడమూ ఇది లేకుండా సాధ్యం కాదు (వ 7).
జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. 6 శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ. 7 మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. 8 గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన (ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”
9 “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము ఆయనకు చెప్పిన జవాబు.
10 యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “మీరు ఇస్రాయేల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు (గ్రహించరా? 11 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మాకు
తెలిసినవే చెపుతాం, చూచినవాటిని గురించే సాక్ష్యం చెపుతాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు. 12 నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెపితే ఎలా నమ్ముతారు? 18 పరలోకంనుంచి వచ్చినవాడు, అంటే పరలోకంలో ఉన్న మానవ పుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు.
14 “ఎడారిలో మోషే కంచు పామును పైకెత్తినట్టే మానవపుత్రుణ్ణి పైకెత్తడం తప్పనిసరి. 15 ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.
16 “దేవుడు ఈ లోకాన్ని ఎంతో (ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం
3:6 ఇక్కడ శరీరం అంటే మనిషి స్వభావసిద్ధంగా ఏమై ఉన్నాడో అదంతా అన్నమాట. రోమ్ ?7:5,18 నోట్స్ చూడండి. మనిషి తన పోలికలో పిల్లల్ని పుట్టించగలడు గానీ నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ఇవ్వలేడు. అలా చెయ్యాలన్న అతని ప్రయత్నాలన్నీ వ్యర్థమే. దేవుని ఆత్మ మాత్రమే (“నీళ్ళమూలంగా” అనే మాటలు ఈ వచనంలో లేవు, చూడండి) ఎవరిలోనైనా ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించగలడు.
8:8 దేవుని ఆత్మ కార్యం, ఆత్మమూలంగా జన్మించినవారి అంతరంగ జీవితం రెండూ చాలా నిగూఢమైనవి. గాలి కనిపించదు. దాని కదలికలు మనుషుల ఊహకు అందకుండా ఉంటాయి. గాలి వల్ల కలిగే ఫలితాల మూలంగా మాత్రమే అది మనుషులకు తెలుసు. దేవాత్మ వల్ల జన్మించినవారి సంగతి కూడా అంతే.
8:9 నీకొదేము ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అతడు అడిగిన ప్రశ్నను బట్టి మనం సంతోషించాలి, ఎందుకుంటే దీనికి జవాబు చెప్పడంలో యేసుప్రభువు ఒక మనోహరమైన, ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేశాడు.
8:10 ఇ|స్రాయేల్వారికి ఉపదేశకుడుగా, పాత ఒడంబడికతో పరిచయం ఉన్నవాడుగా నీకొదేముకు ఈ సంగతులు ఇంత వింతగా అనిపించనవసరం లేదు. పాత ఒడంబడిక (గ్రంథంలో అనేక చోట్ల చెప్పినట్టు మనుషుల థ్రష్ట స్థితి అతనికి తెలిసి ఉండాలి. అంతేగాక హృదయంలోను, (బ్రతుకులోను మౌలికమైన మార్పులు వారికి అవసరమని కూడా తెలిసి ఉండాలి (ఆది 8:21; క్రీర్తన ర్1:ర్; యిర్మియా 17:9), యిర్మీయా 31:31-88; యెహెజ్కేలు 11:19; 18:81; 86:26 మొదలైన వచనాలు తప్పకుండా అతనికి తెలుసు. అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని తాము తెలుసుకోకుండా ఇతరులకు బోధించడానికి బయలుదేరేవాళ్ళు దురదృష్టవశాత్తూ అనేకమంది ఇప్పటికీ ఉన్నారు. పాండిత్యం, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిలో కూడా ఎంతో ఆత్మసంబంధమైన అజ్ఞానం పేరుకుపోయి ఉండవచ్చు!
8:11 యేసుప్రభువు ఉపదేశిస్తున్నప్పుడు కేవలం మత విషయాలపై ఏవేవో తన అభిప్రాయాలను తెలియజేయడం లేదు. తాను మాట్లాడుతున్నదేమిటో ఆయనకు తెలుసు. దైవికమైన అధికారంతో ఆయన మాట్లాడాడు. (7:16,17; 8:38; 12:49,50; మత్తయి 7:28,29). మనం ఆయన మాటలు వినకపోతే ఆ నష్టం మనదే.
8:12 యేసు నీకొదేముతో నీటిని గురించీ గాలిని గురించీ, ఈ భూమిపైన, భూనివాసులైన మనుషుల్లో జరిగే నూతన జన్మను గురించీ మాట్లాడాడు. పరలోక సంబంధమైన విషయాల గురించి
ఈ క్రింది వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు - పరలోకంలో తన శాశ్వత నివాసం (వ 18), తాను స్వయంగా బలి కావడంద్వారా మనుషుల పాపాన్ని తీసివేయడం (వ 14), శాశ్వత జీవం (వ 15), దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఆయనచేత చేయించిన సంగతి (వ 16) మొదలైనవి పరలోక సంబంధమైన విషయాలు.
3:18 ఈ వచనంలో యేసు తాను అంత అధికారంతో పరలోక సంబంధమైన విషయాల గురించి ఎలా మాట్లాడ గలుగుతున్నాడో వెల్లడిస్తున్నాడు. అత్యున్నతమైన పరలోకంలో దేవుని సొంత నివాసంలో దేవుని చెంతనే నివసించిన ఏకైక వ్యక్తి యేసు. అక్కడినుంచి మనుషులకోసం దేవుణ్ణి గురించిన సత్యం తెలియజేసేందుకు ఆయన దిగివచ్చాడు. వ 381; 1:1,1డ 6:38; 8:23 పోల్చి చూడండి.
“పరలోకంలో. . .తప్ప” - 1:18 పోల్చి చూడండి. యేసు పరలోకంనుండి దిగివచ్చి మనుషుల్లో మనిషిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన పరలోకంలోనూ ఉన్నాడు. దేవుని విషయంలో తప్ప ఇది మరెవరి విషయంలోనూ నిజం కాదు, ఎందుకంటే ఒక సమయంలో ఒకటికంటే ఎక్కువ చోట్ల ఉండడం దేవునికి మాత్రమే సాధ్యం.
“మానవ పుత్రుడు” గురించిన నోట్ మత్తయి 8:20. 8:14,15 సంఖ్యా 21:4-9 నోట్స్‌ను చూడండి. మోషే కంచు పామును పైకెత్తినప్పుడు చనిపోతున్నవారు (బ్రతికారు. పాపంలో చనిపోయిన మనుషులు (ఎఫెసు 2:1) ఆత్మ సంబంధంగా తిరిగి (బ్రతకాలంటే యేసును పైకెత్తడం జరగాలి. ఇలా పైకెత్తడం సిలువ మీదికే (12:32,88 పోల్చి చూడండి). ఈ వచనాల్లో యేసుప్రభువు మనుషుల పాపాలకోసం తాను చేసే బలికీ వారి నూతన జన్మకూ ఉన్న సంబంధాన్ని చూపుతున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్లగా లోకమంతటి పాపాలను మోసుకుపోయాడు గనకనే మనుషులు నూతన జన్మ, శాశ్వత జీవం పొందడానికి సాధ్యం అయింది. పాపం మనుషుల్ని పాడు చేసి వారిని శిక్షకు గురి చేస్తుంది. అయితే ఎవరైనా పశ్చాత్తాపపడి క్రీస్తులోను, తమకోసం ఆయన చేసిన బలిలోను నమ్మకం ఉంచితే దేవుని ఆత్మ వారిలో నూతన జీవాన్ని ఇస్తాడు (వ 5). ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది.
38:16 యోహాను శుభవార్తకూ, మొత్తం బైబిలంతటికీ ప్రాణం అనదగిన వచనం ఇది. తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషులపట్ల దేవునికి జాలి, కనికరం ఉన్నాయి. మనుషులు మంచివారనీ తన (ప్రేమకు యోగ్యులనీ కాదు ఆయన వారిని ్రేమిస్తున్నది. ఆయన (్రేమ గలవాడు కాబట్టే (ప్రేమిస్తున్నాడు (నిర్గమ 34:6,7; 1 యోహాను 4:8).
ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.
17 “తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకంలోకి పంపాడు గాని లోకానికి శిక్ష విధించడానికి కాదు. 18 ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు. 19 ఆ
శిక్షావిధికి కారణం ఇదే - వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు. 20 దుర్మార్గత చేస్తూ ఉన్న (ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు. 21 గానీ సత్యాన్ని అనుసరించి చేసేవాడు తన పనులు దేవుని మూలంగా జరిగాయని వెల్లడి అయ్యేలా వెలుగు దగ్గరికి వస్తాడు.”
ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. తన కుమారుణ్ణి ఇచ్చివెయ్యడంద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువు పరచుకున్నాడు. (రోమ్ 5:8; తీతు 8:3-5; 1 యోహాను 3:16; 4:9,10). దేవుని [ప్రేమ ఒక్క జాతికే పరిమితం కాదు (చాలామంది యూదులు ఇలా అనుకున్నారు). మానవాళినంతటినీ ఆయన ్రేమించాడు (2 కొరింతు 5:19; 1 యోహాను 2:2; 1 తిమోతి £2:8,4).
“ఒక్కగానొక్క” - క్రీస్తుకు పోలిక అంటూ ఎవరూ లేరు. ఆయన సాటి లేని వ్యక్తి. దేవుని స్వభావమంతటిలో ఆయన భాగస్వామ్యం గలవాడు (1:18; మత్తయి 3:17; ఫిలిప్పీ 2:6). లోకంకోసం చనిపోవడానికి దేవుడు అనేక మంది కుమారుల్లో ఒకర్ని ఇవ్వలేదు. తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. గొప్పతనంలోనూ, విలువలోను వర్ణనాతీతమైన ఉచిత వరం ఇది (2 కొరింతు 9:15).
యేసుప్రభువును పంపడంలో దేవుని ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా వెల్లడి అయింది. మనుషులు పాపంలో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. శాశ్వత జీవం కేవలం ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాదు. అది మామూలు జీవానికి భిన్నంగా ఉత్తమంగా ఉన్నది. శాశ్వత జీవమంటే పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. అది పాపం, మరణం నీడ కూడా లేకుండా దేవునితో సహవాసంలోని జీవం. ఆ జీవాన్ని పొందాలంటే ఒకటే మార్గమని యేసుప్రభువు ఇక్కడ మరోసారి అతి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనలో నమ్మకముంచడమే ఆ మార్గం (వ 36; 1:12; 5:24; 6:47; 8:24 కూడా చూడండి). శాశ్వతంగా నరకంలో నశించిపోవడానికీ, దేవునితో అనంతకాలం జీవించడానికీ ఉన్న తేడా క్రీస్తులో నమ్మకం ఉంచడంలోనే ఉంది. 8:17 12:47. దేవుడు ఈ విశ్వానికంతటికీ న్యాయమైన తీర్చరి. తీర్పుకోసం ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడవలసిన సమయం రాబోతున్నది (ఆది 18:25; ద్వితీ 32:36; 1 సమూ 2:10; కీర్తన 7:8; 9:8; 82:8; 96:13; అపొ కా 17:30,81; £ కొరింతు 5:10; (ప్రకటన 20:11-13). అయితే దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపిన ఉద్దేశం పూర్తిగా వేరు. వారి పాపాలకు న్యాయంగా రావలసిన శిక్షనుంచి వారిని విడిపించి రక్షించడమే ఆ ఉద్దేశం. మనుషుల పాపాలనూ శిక్షనూ తానే భరించడంద్వారా క్రీస్తు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు (1:29; 8:15; £ కొరింతు 5:21; 1 పేతురు 2:24). దేవుడు తనను పంపించాడని యేసు యోహాను శుభవార్తలో 40 సార్లు చెప్పాడు. 3:18 రోమ్ 8:1. క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన పాపక్షమాపణ దొరికింది. క్రీస్తు బలి అర్చణగా చనిపోవడం వల్ల వారి పాపాలు సమసిపోయాయి. ఆయనెంత నిర్దోషో, న్యాయవంతుడో దేవుని లెక్కలో వారూ అంతే (రోమ్ 3:24,2ర; 5:1; ఎఫెసు 1:7; కొలస్సయి 2:13; 1 యోహాను 2:12). అందువల్ల వారికిక శిక్షావిధి లేదు. క్రీస్తును నమ్మనివారి సంగతి
దీనికి పూర్తిగా వ్యతిరేకం. వారి పాపాలకు దేవుడు చూపిన ఏకైక నివారణను వారు నిరాకరిస్తున్నారు. దేవుని అతి (శ్రేష్టమైన ఉచిత వరాన్ని విసర్జించడం ద్వారా తమ పాపాల జాబితాలో పాపాలను ఇంకా కలుపుతూ, తమ అపనమ్మకం మూలంగా దేవుణ్ణి అబద్ధికుడుగా చేస్తున్నారు (1 యోహాను 5:10). ఇలాంటివారికి శిక్ష విధించడం తప్ప మరేదీ మిగలదు. బైబిలు ఉపదేశంలో నమ్మకానికి ఉన్న (ప్రాధాన్యతను మళ్ళీ గమనించండి. 8:19,20 మొత్తం లోకం ఇప్పటికీ దేవుని ఎదుట దోషిగా తీర్చబడి శిక్షావిధికి గురై ఉంది (రోమ్ 1:18-20; 38:9,19). క్రీస్తును నమ్మనివారు తమ ప్రవర్తన చెడ్డదని చెప్పే తీర్పు కోసం దేవుని మహా తీర్చుదినం వరకు ఎదురు చూడనవసరం లేదు. ఈ రెండు వచనాల్లో ఈ తీర్పు రాసి ఉన్నది. వారు ఎలాంటివారో, తీర్చుకూ శిక్షకూ ఎంత అర్హులో తమ క్రియల ద్వారానే బయట పెడుతున్నారు. క్రీస్తు అనే వ్యక్తి రూపంలో వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. 1:4-9; 8:12 పోల్చి చూడండి. దేవుణ్ణి గురించి మనుషుల గురించి పాపవిముక్తి గురించి అద్భుతమైన సత్యాలను ఆయన లోకంలోకి తెచ్చాడు. కానీ మొత్తం మీద మనుషులు ఆయన్ను గానీ ఆయన తెచ్చిన సత్యాన్ని గానీ ఇష్టపడలేదు. వారికి వేరొకటి ప్రీతిపాత్రంగా ఉంది - చీకటి. చీకటి దాపరికానికీ కపటానికీ అజ్ఞానానికీ అసత్యానికీ దుర్మార్గతకూ సూచన. అలాంటి చీకటిని అంటే ఇష్టమున్చవారికి వెలుగు అంటే ఇష్ట ముండదు.. వారు నరకానికి పాత్రులైన పాపులనీ, క్రీస్తు మాత్రమే వారిని దాని నుంచి తప్పించగలడనీ వారి స్థితిని ఉన్నదున్నట్టుగా ఆ వెలుగు బయటపెడుతుంది. అంతేగాక వారు చేయడానికి ఇష్టపడే చెడు కార్యాల్లో మునిగి తేలుతూ ఉండకుండా వెలుగు అడ్డుపడుతుంది. అందువల్ల వెలుగంటే వారికి ద్వేషం. అంటే వారు క్రీస్తునా, ఆయన సత్యాన్నీ ద్వేషిస్తున్నారు. (ఇది అతిశయోక్తి, అతివాదం కాదు. యేసు అనేకసార్లు చెప్పిన గంభీర సత్యమిది - 7:7; 15:18,23-25). దీన్ని బట్టి మనం (్రహించవలసినది ఏమంటే, మనుషుల అపనమ్మకానికి కారణం అందుకు సరైన హేతువులు వారికి ఉండడం కాదు. లేక, వారి బుద్ధి ఎంతో ఎక్కువ గనక నమ్మలేకపోతున్నారనీ కాదు. వారిలోని పాపం, చీకటి కారణంగానే వారు నమ్మరు. ఈ పొరపాటుకు మూలం వారి ఆలోచనల్లో లేదు గాని వారి ఆశల్లో, అంతరంగంలోనే. క్రీస్తులో నమ్మకం అనేది చీకటికి బదులు మంచితనాన్ని, పవిత్రతను, సత్యాన్ని నీతిని ఎన్సుకోవడమే. చాలామంది ఇలా ఎన్నుకునేందుకు ఇష్టపడరు. పవిత్రత కంటే పాపాన్నీ క్రీస్తుకంటే స్వార్థాన్నీ వారు కోరుకుంటారు.
3:21 అయితే సత్యాన్ని కోరుకుని, దాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారు. కొందరున్నారు. వారు దేవుని వాక్కుకు కొంతవరకైనా విధేయత చూపుతారు. దేవుడు అలాంటి వారి హృదయాల్లో పని చేస్తున్నాడు. వెలుగుకు వారు భయపడరు. దాని దగ్గరకు వస్తారు. అందుచేత వీరు శుభవార్తను నమ్మి క్రీస్తును స్వీకరిస్తారు. నాలుగు శుభవార్తల్లోనూ శిష్యులు, £22 ఆ తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ (ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆయన వారితో కొంత కాలం గడుపుతూ బాప్తిసం ఇప్పిస్తూ ఉన్నాడు. £28 సాలీము దగ్గర ఉన్న ఐనోనులో చాలా నీళ్ళు ఉన్నాయి గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ప్రజలు అక్కడికి వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. 24 యోహానును ఇంకా చెరసాలలో వేయడం జరగలేదు. £5 యోహాను శిష్యులకూ యూదులకూ మధ్య శుద్ధి ఆచారాల గురించిన వివాదం పుట్టింది. 26 వారు యోహాను దగ్గరికి వచ్చి “గురువర్యా! మునువు యొర్దాను అవతల నీతో ఉన్నవాడు - నీవు సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి - ఇప్పుడు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు” అన్నారు.
27 యోహాను ఇలా సమాధానం చెప్పాడు: “పరలోకం నుంచి ఇవ్వడం జరిగితే తప్ప ఏ మనిషికీ ఏమీ లభించదు. 28 నేను క్రీస్తును కాననీ ఆయనకు ముందుగా పంపబడ్డవాణ్ఞనీ నేను చెప్పినట్టు మీరే సాక్షులు. 29 పెండ్లి కుమారునికే పెండ్లి కుమార్తె ఉంటుంది. అయితే పెండ్లి కుమారుని స్నేహితుడు
నిలబడి పెండ్లి కుమారుని స్వరం విన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి అధికంగా సంతోషిస్తాడు. అలాగే నా సంతోషం సంపూర్ణం అయింది. 80 ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.
81 “పైనుంచి వచ్చినవాడు అందరికీ పైవాడే. భూమినుంచి వచ్చినవాడు భూమికి చెందినవాడు, భూమి నుంచి వచ్చినట్టు మాట్లాడుతాడు. పరలోకం నుంచి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నాడు. 82 ఆయన చూచినవాటిని, విన్చవాటిని గురించి సాక్ష్యం చెప్తాడు గానీ ఆయన సాక్ష్యం ఎవరూ అంగీకరించడం లేదు. 38 ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు తద్వారా దేవుడు సత్యవంతుడని రూఢి చేస్తున్నాడు. 34 దేవుడు పంపిన ఆయన దేవుని వాక్కులు పలుకుతాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు పరిమితంగా ఆత్మను ఇచ్చేవాడు కాడు. 85 కుమారుణ్ణి తండ్రి (ప్రేమిస్తున్నాడు, సమస్తమూ ఆయన చేతికి అప్పచెప్పాడు. 36 కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద
ఇతరులు మరికొందరు ఇందుకు ఉదాహరణలు. (ప్రపంచంలో ఈనాడు ఇలాంటివారు అనేకమంది ఉన్నారు.
3:22 4:1,2.
8:28 “సాలీము” ఖచ్చితంగా ఎక్కడున్నదీ తెలియదు. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్చాడని చెప్పడంలో గల కారణం అతడు ముంచడం ద్వారా బాప్తిసమిచ్చేవాడని సూచిస్తున్నది (మత్తయి 3:6).
3:24 మత్తయి 14:1-12.
3:25 మార్కు 7:1-4.
8:26 “గురువర్యా” - 1:38. క్రీస్తుకు సాక్షిగా ఉండేందుకు యోహాన్ను దేవుడు పంపాడు (1:6-8). తరువాతి వచనాల్లో ఎంత అద్భుతంగా అతడీ పని చేస్తూ ఉన్నాడో చూడగలం. యోహాను క్రీస్తును గురించి అసూయపడేవాడు కాదు, పైగా ప్రజలు క్రీస్తును గుర్తించినందుకు ఉప్పొంగిపోతున్నాడు. తన పరిచర్య అంతటి నెరవేర్చును అందులో చూడగలిగాడు. తనవైపుకు ప్రజలను ఆకర్షించుకోవడం అతని ఉద్దేశం ఎన్నటికీ కాదు. వారికి యేసుప్రభువును చూపించడమే అతని పని, ఇందులో ఇతడు మనకందరికీ ఆదర్శం.
3:27 తన ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఒక స్థానాన్ని ఒక పరిచర్యను దేవుడు ఏర్పాటు చేశాడని యోహానుకు బాగా తెలుసు. ఒకడు మరొకటి స్థానంకోసం ప్రాకులాడ్డం గానీ మరొకణ్ణి చూచి అసూయ చెందడం గానీ తగదనీ, తనకోసం దేవుని ఏర్పాటుతో తృప్తిపడాలనీ కూడా అతనికి తెలుసు. సంఖ్యా 11:26-29); కీర్తన 75:6,7, యిర్మీయా 45:5 పోల్చి చూడండి.
38:28,29 యోహానుకు తన స్థానమేమిటో తెలుసు. దాన్నిబట్టి అతనికెంతో సంతోషం. 1:19-£7లో తన పరిచర్య ఏమిటో స్పష్టంగా అతడు చెప్పాడు. ఇక్కడ క్రీస్తును పెళ్ళికుమారుడుగా, ఆయన (ప్రజలను పెళ్ళికూతురుగా అతడు వర్ణిస్తున్నాడు. తనను పెళ్ళికుమారునికి ఒక స్నేహితుడుగా మాత్రమే వర్ణిస్తున్నాడు. పెళ్ళిలో వధూవరులే ప్రాముఖ్యమైన వ్యక్తులు. పెళ్ళికొడుకు స్నేహితునికి అంత ప్రాముఖ్యత లేదు. పాత ఒడంబడిక (గ్రంథంలో ఇస్రాయేల్జాతిని యెహోవాదేవుని భార్యగా వర్ణించిన సంగతి యోహానుకు తెలుసు (యెషయా 545; 62:45; యిర్మీయా 2:2; 3:20; యెహె 16:8; హోషేయ 2£:19,20).
క్రొత్త ఒడంబడిక గ్రంథంలో క్రీస్తు తనను తాను పెళ్ళికుమారునిగా చెప్పుకున్నాడు (మార్కు 2:19). ఆయన సంఘం పెళ్ళి కుమార్తెకు పోల్చబడింది (2 కొరింతు 11:2; ఎఫెసు 5:32; ప్రకటన 19:7).
3:80 క్రీస్తుపట్ల ప్రేమ, నిస్వార్థ త్యాగం, అణకువ చూపడం యోహాను జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ సుగుణాలు దేవుని దృష్టిలో అతి విలువ గలవి (మత్తయి 3:11; 10:37-89;
18:4; 20:25-28). 8:31 పైనుంచి వచ్చినవాడు యేసుప్రభువు - వ 13; 8:28; 1 కొరింతు 15:47. భూమికి చెందినవాడు యోహాను.
యేసుప్రభువుకూ మిగతా మనుషులందరికీ ఉన్న ఒక తేడా ఇదే. 3:32 వ 11-18. 8:38 మనం క్రీస్తు మాటలపై నమ్మకం ఉంచితే దేవుడు సత్యవంతుడని చెప్తున్నామన్న మాట. అలా నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికుడు అని చెప్పినట్టే (1 యోహాను 5:10). 8:34 7:16,17; 8:38; 12:49,50 పోల్చి చూడండి. ఇక్కడ “ఆత్మ” అంటే పవిత్రాత్మ - 1:32; మత్తయి 38:16; యెషయా 11:1,2; 61:1. దేవుని ఆత్మ గురించి నోట్స్ 14:16,17. 8:35 తండ్రి అయిన దేవునికీ, కుమారుడైన దేవునికీ మధ్య ఉన్న పరస్పర (ప్రేమ, అంటే దేవత్వంలోని వ్యక్తుల మధ్య ఉన్న (ప్రేమ శుభవార్తలన్నిటిలోనూ కనిపిస్తున్నది గానీ మిగతావాటిలో కన్నా యోహాను శుభవార్తలో మరింత తేటగా ఇది వెల్లడి అయింది (మత్తయి 3:17; మార్కు 1:11; లూకా 38:22; యోహాను 5:20; 10:17; 14:81; 15:9,10; 17:23,24,26). తండ్రి అధికారమంతా కమారునికి ఇచ్చాడు. 5:22-27; 17:2,6; మత్తయి 28:18; అపొ కా 2:36; హీట్రూ 1:2; కీర్తన £2:6-12 చూడండి. 8:36 పైనున్న వచనాల తరువాత సహజంగానే ఈ మాటలు వస్తున్నాయి. క్రీస్తులో నమ్మకం ఉంచినవారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయనాొక్కడే. పొందవలసిన మార్గమూ ఇదొక్కటే. వ 16లో శాశ్వత జీవం గురించి నోట్ చూడండి. “విధేయులు కానివారికి” - ఈ “నిరాకరించినవారికి”, లేక
గ్రీకు పదాన్ని “తిరగబడినవారికి” అని కూడా ఎప్పుడూ ఉంటుంది.”
యేసు యోహానుకంటే ఎక్కువమందిని శిష్యులుగా
చేసుకొన్నట్టు, వారికి బాప్తిసం ఇస్తున్నట్టు పరిసయ్యులకు వినవచ్చింది. ఈ సంగతి ప్రభువుకు తెలిసింది. 2 (యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు - ఆయన శిష్యులే ఇస్తూ ఉండేవారు.) 8 అప్పుడు ఆయన యూదయను విడిచి గలలీకి తిరిగి వెళ్ళాడు.
4 ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసివచ్చింది. 5 సమరయలో సుకారు అనే ఊరికి ఆయన వచ్చాడు. అది యాకోబు తన కొడుకైన యోసేపుకు ఇచ్చిన భూమిదగ్గర ఉంది. 6 యాకోబు బావి అక్కడ ఉంది. కనుక యేసు (ప్రయాణంవల్ల అలసి అలాగే బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలయింది.
7 సమరయ స్ర్త్రీ ఒకతె నీళ్ళు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమెతో యేసు “నాకు త్రాగడానికి నీళ్ళివ్వు” అన్నాడు. 8 ఎందుకంటే, ఆయన శిష్యులు భోజన పదార్థాలు కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు.
9 “నేను సమరయ స్త్రీని. మీరు యూదులై ఉండి తాగడానికి నీలళ్ళిమ్మని నన్ను అడుగుతారేమిటి?” అని ఆ సమరయ స్రీ ఆయనతో అంది. (యూదులు సమరయ దేశస్థులతో సహవాసమేమీ చేయరు.)
10 యేసు ఆమెతో ఇలా సమాధానం చెప్పాడు: “నీకు దేవుని కృపావరం తెలిసి ఉంటే, త్రాగడానికి నీలళ్ళిమ్మని నిన్చు అడిగినది ఎవరో అది కూడా తెలిసి ఉంటే ఆయనను అడిగి ఉండేదానివే. ఆయన నీకు జీవ జలం ఇచ్చి ఉండేవాడు.”
11 ఆ స్త్రీ ఆయనతో “అయ్యా, ఈ బావి లోతైనది. చేదుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు. మీకు ఆ జీవజలం ఎక్కడ
అనువదించవచ్చు. క్రీస్తును నిరాకరించడమంటే, ఆయనకు విధేయత చూపకపోవడమంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీదా పాపులందరి మీదా దేవుని కోపం ఎప్పుడూ నిలిచే ఉంటుంది (మత్తయి 3:7; రోమ్ 1:18; ఎఫెసు 5:6; 1 తెస్స 1:10; (ప్రకటన 6:16,17, 19:15. సంఖ్యా 25:3; ద్వితీ 4:25; కీర్తన 90:7-11 నోట్స్ చూడండి.) పవిత్రమైన న్యాయ బద్ధమైన ఆయన స్వభావం దుర్మార్గతనంతటినీ అసహ్యించుకోవడమే ఆయన కోపానికి కారణం. ప్రతి వ్యక్తీ శాశ్వత జీవాన్ని పొందాలి, లేదా దేవుని కోపాన్ని అనుభవించాలి. మనుషుల ఎదుట ఈ రెండు మాత్రమే ఉన్నాయి.
4:1 “పరిసయ్యులు” - మత్తయి 38:7. ఇక్కడ యోహాను యేసుకు “ప్రభువు” అనే బిరుదు వాడుతున్నాడు. క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో యేసును (ప్రభువని వందల సార్లు అనడం కనిపిస్తున్నది. అనేక చోట్ల ఈ మాటకు అర్థం మనుషులందరికి ఏకైక ప్రభువు, విశ్వానికంతటికీ మహామహుడైన (ప్రభువు అని (1 కొరింతు 8:6; ప్రకటన 1:16). పాత ఒడంబడిక (గ్రంథం (గ్రీకు అనువాదంలో “ప్రభువు” అనే పదానికి గ్రీకు పదం కురియొస్ను యెహోవా అనే పేరును అనువదించడానికి ఉపయోగించారు. (యెహోవా - నిర్గమ 3:14,15 నోట్ చూడండి.) పాత ఒడంబడికలో యెహోవాను ప్రభువు అన్నారు, కొత్త ఒడంబడికలో యేసును ప్రభువు అన్నారు. లూకా 2:11 నోట్ చూడండి.
4:2 శుభవార్త పుస్తకాల్లో పరిసయ్యులు దాదాపు ఎప్పుడూ యేసుప్రభువుకు విరోధులుగానే కనిపిస్తారు. చివరికి వారు ఆయన్ను హతమార్చేందుకు కుట్ర పన్నారు (7:32; 11:57, 18:3). యేసుకు వారి హృదయాలు తెలుసు (2:24,25). పాపులకోసం తాను జెరుసలంలో చనిపోవలసిన సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. అందువల్ల వారితో అనవసరమైన వివాదాలెందుకని యూదయ ప్రాంతం విడిచి వెళ్ళిపోయాడు.
4:4 యూదయ, గలలీ ప్రాంతాలమధ్య ఉన్న (ప్రాంతం సమరయ. ఆ (ప్రాంతం (ప్రజలను యూదులు సాధారణంగా అసహ్యించుకునేవారు (వ 9. సమరయవారి గురించి నోట్ £ రాజులు 17:24; మత్తయి 10:5). యూదయనుంచి గలలీ (ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళేది దగ్గర దారి. కానీ చాలామంది యూదులు సమరయ (ప్రజలను తప్పించు కొనేందుకు ఆ ప్రదేశం బయటగా చుట్టు దారిన ప్రయాణించే వారు. యేసు సమరయ మీదుగా “వెళ్ళవలసి వచ్చింది” అంటున్నాడు యోహాను. హడావుడిగా గలలీకి చేరుకోవలసి
ఉంటే, లేక సమరయలో చెయ్యవలసిన పనేదైనా ఉంటే ఈ విధంగా ప్రయాణించడం అవసరం. వ 40లో యేసు తొందరగా ప్రయాణం చేయడం లేదని కనిపిస్తుంది. అయితే ఈ అధ్యాయం మిగతా భాగమంతా సమరయ ప్రాంతంలో చెయ్యాలనుకున్న ఒక పని ఆయనకు ఉందని తెలియజేస్తున్నది. ఎంత మంచి పని అది! అలా (ప్రయాణం చెయ్యడానికి మరో కారణం బహుశా ఆ (ప్రజలపై యూదులకు సామాన్యంగా ఉండే ద్వేషం తనకు లేదని చూపించుకోవడానికి కావచ్చు.
4:5 ఆది 38:19; 48:22; యెహో 24:82.
4:6 యేసు ఇలా అలసిపోవడం ఆయనలోని నిజమైన మానవ స్వభావాన్ని తెలియజేస్తున్నది. దేవుడుగా ఆయనకు అలసట ఉండదు (యెషయా 40:28). మనిషిగా కాలినడకన సుదీర్ధ ప్రయాణం వల్ల ఆయన అందరిలాగే అలసిపోయాడు. క్రీస్తుకున్న రెండు స్వభావాల గురించి 1:14; హీట్రూ £2:14-17 చూడండి.
4:7 ఇక్కడ మళ్ళీ ప్రభువులోని మానవ స్వభావం బహిర్గతమైంది. దాహం మనుషులకే వేస్తుంది గాని దేవునికి కాదు.
4:9 మొదట్లో ఈమె యేసును దాహంతో ఉన్న ఒక యూదుడుగానే చూచింది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయనెవరో అన్న విషయం ఆమెకు మరింతగా తెలుస్తూ రావడం చూడవచ్చు - గొప్ప వాగ్దానాలు చేసేవాడు (వ 10-15), ఒక (ప్రవక్త (వ 19), చివరగా అభిషిక్తుడు (వ 25,26,29). (క్రీస్తు ఎవరో దశలవారీగా అర్థం కావడం అన్నది విశ్వాసులంతా ఎరిగిన అనుభవమే.
4:10 ఈ స్త్రీని దేవుని రాజ్యంలో చేర్చాలన్నదే క్రీస్తు ఉద్దేశం. తన మాటల్లో ఆమెకు ఏవిధంగా ఆసక్తి పెరిగేలా చేశాడో చూడండి. “జీవజలం” అంటే ఆయనిచ్చే నూతన జీవం. ఇందులో నూతన జన్మ (3:5), శాశ్వత జీవం (3:16), విశ్వాసుల హృదయాల్లో నివసించే దేవుని ఆత్మ (7:37-89) మొదలైన భావాలన్నీ ఇమిడివున్నాయి. ఇది యేసు ఉచితంగా ఇచ్చేదే అన్న విషయం గమనించండి (ప్రకటన 22:17). యేసుప్రభువును అడగడం ద్వారా దీన్ని పొందగలమని కూడా గమనించండి. నిజానికి దాన్ని ఇవ్వగలిగినది ఆయనొక్కడే. పాత ఒడంబడిక (గ్రంథంలో కూడా నీరు ఆధ్యాత్మిక జీవానికి సూచనగా ఉంది - కీర్తన 36:9; యెషయా 55:1; యిర్మీయా 2:18; 17:18. 4:11,12 ఈ స్రీ యేసు మాటను పూర్తిగా అపార్థం చేసుకున్నట్టుంది. ఇది అప్పుడూ ఇప్పుడూ కూడా తరుచుగా జరుగుతూ ఉంది. ఆయన మాటలను అక్షరాలా అర్థం దొరుకుతుంది? 12 మన పూర్వికుడు యాకోబు ఈ బావి మాకిచ్చాడు. తాను తన పశువులు, తన కొడుకులు ఈ నీళ్ళు తాగారు. ఆయనకంటే మీరు గొప్పవారా?” అంది.
18 యేసు జవాబిస్తూ “ఈ నీళ్ళు త్రాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం అవుతుంది. 14 గానీ నేను ఇచ్చే నీళ్ళు త్రాగే ఎవరికైనా మరెన్నడూ దాహం కాదు. నేను వారికిచ్చే నీళ్ళు వారిలో ఉండి శాశ్వత జీవితానికి ఊరుతూ ఉండే ఊట అవుతుంది” అని ఆమెతో అన్నాడు.
15 “అయ్యా, నాకు దప్పిక కాకుండా, చేదుకోవడానికి ఇక్కడికి రాకుండా ఆ నీళ్ళు నాకివ్వండి” అని ఆ స్రీ ఆయనతో అంది.
16 ఆయన ఆమెతో “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని ఇక్కడికి రా!” అన్నాడు.
17 “నాకు భర్త లేడు” అని ఆమె జవాబిచ్చింది.
యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నాకు భర్త లేడు” అని నీవు చెప్పినది సరిగానే ఉంది. 18 నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడున్చవాడు నీ భర్త కాదు. దాని గురించి నిజం
చెప్పావు.”
19 అప్పుడా స్త్రీ ఆయనతో “అయ్యా, మీరు ప్రవక్తలని గ్రహిస్తున్నాను. 20 మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు, గానీ ఆరాధన చేయవలసిన స్థలం జెరుసలంలోనే ఉందని మీరు అంటారు” అంది.
21 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా, నన్ను నమ్ము. ఒక కాలం వస్తూ ఉంది. అప్పుడు ఈ కొండ మీద గానీ జెరుసలంలో గానీ వరమ తండ్రిని మీరు ఆరాధించరు. £22 మీరు ఆరాధించేది మీకే తెలియదు. మేము ఆరాధించేది మాకు తెలుసు. విముక్తి యూదులలోనుంచే వస్తుంది. 238 నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. అలాంటి వారు తనను ఆరాధించాలని తండ్రి వారిని వెదకుతూ ఉన్నాడు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి.”
£25 ఆ స్త్రీ ఆయనతో ఇలా అంది: “అభిషిక్తుడు వస్తాడని నాకు తెలుసు. ఆయనను "క్రీస్తు అంటారు. ఆయన
చేసుకుందామె. అప్పటి వాడుకలో జీవజలం అంటే వాగు లేక నదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండే నీరు. యేసు ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించినట్టు లేదు. 4:138,14 ఇప్పుడు యేసు తాను మామూలు నీళ్ళ గురించి కాక, ఆధ్యాత్మిక విషయాల గరించి మాట్లాడుతున్నానని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. శాశ్వతంగా దాహాన్ని తీసివేసి, శాశ్వత జీవాన్ని కలిగించే మామూలు నీరు ఎక్కడా లేదు. “దాహం కాదు” - అంటే విశ్వాసులు దేవుణ్ణి మరింత లోతైన అనుభవంకోసం ఆశించరని గానీ సత్యం, నీతిన్యాయాల కోసం దాహం అనుభవించరని గానీ అర్థం కాదు (కీర్తన 40:1,2; 119:181; మత్తయి 5:6). దీని అర్థం కొత్త జన్మనూ కొత్త జీవాన్నీ దేవుని ఆత్మమాలంగా అనుభవించిన తరువాత వాటికోసం మళ్ళీ దప్పిగొనక్కర్తేదు. వారిలోని లోతైన అభిలాషలను సంతృప్తి పరచగలిగే ఒక ఊట వారిలో ఉంటుంది. యేసు ఇచ్చే జీవం జలజల పారే నీటిలాంటిది. విశ్వాసి హృదయంలో పెల్లుబికే ఊటలాంటిది. అది సమృద్ధి జీవం (10:10). ఈ నీరు త్రాగడమెలా? నమ్మకంతో క్రీస్తుచెంతకు వచ్చి అయన్ను (ప్రభువుగా ముక్తిదాతగా రక్షకుడుగా మన హృదయాల్లోకి స్వీకరించడమే. 4:15 యేసు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడు తున్చాడని ఈ స్రీ (గ్రహించిందా? (గ్రహించినట్టయితే బయట పెట్టడం లేదు. అయితే ఆధ్యాత్మిక జీవం గురించిన ఆశ బహుశా ఆమె మనుసులో మొగ్గ తొడిగింది. 4:16 ఈ మాటలకూ ఇంతవరకు మాట్లాడినదానికీ ఎక్కడా పొంతన ఉన్నట్టు కనిపించదు. కానీ తప్పకుండా సంబంధం ఉంది, సందేహం లేదు. తాను సాధారణ వ్యక్తిని కానని ఆమె గ్రహించేలా చేస్తున్నాడు యేసు. ఆమె పాపభరితమైన జీవితం ఆమెకు గుర్తు చేస్తున్నాడు కూడా. ఆ జీవజలం కావాలంటే ఆ జీవితాన్ని విడిచి పెట్టేందుకు ఆమె ఇష్టపడాలి. 4:19 “ప్రవక్త” గురించి నోట్ ఆది 20:7. దేవుడు కొన్నిసార్లు ఇతరుల గురించిన సత్యాలను తన ప్రవక్తలకు వెల్లడి చేసిన సంగతి ఆమెకు తెలుసు (లూకా 7:39 కూడా చూడండి). 4:20 తన జీవితంలోని అనేకమంది మగవాళ్ళ గురించి మాట్లాడ్డం ఆమెకు ఇష్టం లేదు. అందుకని మాట మారుస్తున్నది. 44:21-24 “మీరు అంటారు” - అంటే సాధారణంగా యూదులు ఇలా అంటారు. ఆమె మాట మార్చడంవల్ల ఆరాధన
గురించిన ఒక గంభీర సత్యాన్ని ఆమెకు తెలిపే అవకాశం యేసుకు లభించింది. దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించవచ్చు (వ £1). ఇప్పుడు ఆరాధన స్థలానికి ప్రాధాన్యత ఏమీ లేదు (ఒకప్పుడు కొంతవరకు అలాంటి ప్రాధాన్యత ఉండేది - ద్వితీ 12:5; 2 దిన 6:6,7 చూడండి.
దేవుణ్ణి పరమ తండ్రిగా ఆరాధించాలి (వ £1,238; మత్తయి 5:16 నోట్). సమరయవారు (అంటే యూదేతర ప్రజలంతా అని అర్థం చేసుకోవచ్చు) తాము దేన్ని ఆరాధిస్తున్నదీ నిజంగా ఎరుగరు (వ 22). అపొ కా 17:28; రోమ్ 1:21-2£28. దేవుడు తన గురించి వెల్లడించిన సత్యాల (ప్రకారం వారు ఆరాధించడం లేదు.
“విముక్తి. . .వస్తుంది” - దేవుడు లోకానికి తన గురించి వెల్లడించడానికీ, తాను సిద్ధం చేసిన పాపవిముక్తిని తేవడానికి యూద జాతే కాలువలాంటిది. యేసుప్రభువు యూదుడుగా జన్మించాడు. దేవుడు కోరుతున్న ఆరాధనకు భౌతిక వస్తువులు, గుడులు, స్థలాలు, ప్రదేశాలతో ఎలాంటి సంబంధమూ లేదు (వ 23,24; అపొ కా 17:24,25).
నిజమైన ఆరాధన ఆత్మలో చెయ్యవలసినదే. దేవుని ఆత్మమూలంగా తిరిగి జన్మించినవారి హృదయాల్లో నుండే అది రావాలి (8:5. దేవునికి అర్పించదగ్గ నిజమైన ఆరాధన ఏదో వేరెవరికీ తెలియదు). దేవుడు ఆత్మ గనక భౌతిక వస్తువులేవీ నిజంగా ఆయనకు ప్రతినిధులుగా ఉండలేవు. ఏకైక శాశ్వతాత్మ దేవుణ్ణి ఆత్మ ద్వారా మాత్రమే నిజంగా ఆరాధించడం సాధ్యం.
అలాంటి ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉండాలి. అంటే దేవుడు తన గురించి వెల్లడి చేసిన దానికి అనుగుణంగా ఉండాలి. మనఃపూర్వకంగా, వాస్తవంగా కపటం లేకుండా అది ఉండాలి. దేవుడు ఇలాంటి అరాధకుల కోసమే చూస్తున్నాడు. దేవుడు (ప్రేమామయుడు గనకే ఇలా వెదకుతున్నాడు (1 యోహాను 4:8). ఆయన మనుషుల్ని ప్రేమిస్తూ వారి (ప్రేమను ఆశిస్తున్నాడు. వారికి ఉన్నతమైన మేలు జరగాలనే ఆయన కోరిక. నిజ దేవుని నిజ ఆరాధకులయితేనే ఇది సాధ్యం.
లోకంలో అంతటా కనిపించే ఆచారపరమైన శూన్య ఆరాధనకంటే మరింత శ్రేష్టమైన ఆరాధనను ఆయన
కోరుతున్నాడు. కీర్తన 50:8-15; యెషయా 1:11-17 పోల్చి చూడండి. 4:25 “అభిషిక్తుడు” -
మత్తయి 1:1. యూదుల్లాగే
