Part 5 of 14

యోహాను శుభవార్త – భాగము 4 (పుటలు 21–26)

యోహాను శుభవార్త – భాగము 4 (పుటలు 21–26)

86 ఆ తరువాత యేసు గలలీ సరస్సు (ఇది తిబెరియ నరస్సు) దాటి అవతలికి వెళ్ళాడు. 2 రోగులకు ఆయన చేసిన సూచన కోసమైన అద్భుతాలు చూచి చాలామంది ఆయన వెంట వచ్చారు. 8 అక్కడ యేసు ఒక కొండెక్కి తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. 4 పస్కా అనే యూదుల పండుగ దగ్గర పడింది. 5 యేసు తలెత్తి పెద్ద గుంపు తనవైపుకు రావడం చూచి ఫిలిప్పుతో ఇలా అన్నాడు: “వీరు తినడానికి రొట్టెలు మనం ఎక్కడ కొనాలి?” 6 అతణ్ణి పరీక్షించడానికి ఆయన అలా అన్నాడు - తాను ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు.

7 ఫిలిప్పు “వీళ్ళలో ఒక్కొక్కరికి కొంచెం దొరకాలన్నా రెండు వందల దేనారాల రొట్టెలు కూడా ఏమీ చాలవు” అని ఆయనకు జవాబిచ్చాడు.

8 ఆయన శిష్యులలో ఒకడు - సీమోను పేతురు సోదరుడు అంద్రెయ - యేసుతో ఇలా అన్నాడు: 9 “ఇక్కడ ఓ అబ్బాయి ఉన్నాడు. వాని దగ్గర అయిదు యవల రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి. అయితే ఇంతమందికి అడేపాటిది?”

10 “ప్రజలను కూర్చోబెట్టండి” అని యేసు అన్నాడు. ఆ చోట పచ్చిక విస్తారంగా ఉంది గనుక పురుషులు కూర్చున్నారు. వారి సంఖ్య సుమారు అయిదు వేలు. 11 అప్పుడు యేసు ఆ రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు, శిష్యులకు పంచి ఇచ్చాడు. శిష్యులు కూర్చుని ఉన్నవారికి వడ్డించారు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతమట్టుకు వడ్డించారు. 12 వారు కడుపారా తిన్న తరువాత ఆయన తన శిష్యులతో “మిగిలిన ముక్కలు ఎత్తండి - ఏమీ నష్టం కాకూడదు” అన్చాడు. 18 అలాగే వారు వాటిని ఎత్తారు, ఆ అయిదు యవల రొట్టెలు ప్రజలు తినగా మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నింపారు.

14 యేసు చేసిన అద్భుతమైన ఈ సూచన చూచి ప్రజలు “నిజంగా, లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే!” అన్నారు.

15 వారు వచ్చి తనను రాజుగా చేయడానికి బలవంతంగా తీసుకుపోతారని యేసుకు తెలుసు, కనుక ఆయన మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాడు.

16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సరస్సు ఒడ్డుకు వెళ్ళి 17 పడవ ఎక్కి అవతల ఉన్న కపెర్‌నహూంకు దాటిపోసాగారు. అంతలో చీకటి పడింది. యేసు వారిదగ్గరికి ఇంకా రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి వీస్తూ ఉండడంచేత సరస్సు అల్లకల్లోలం కాసాగింది. 19 వారు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం తెడ్లతో పడవ నడిపిన తరువాత యేసు సరస్సు మీద నడుస్తూ పడవకు దగ్గరగా రావడం చూశారు. వారికి భయం వేసింది. 20 అయితే ఆయన వారితో “నేనే, భయపడకండి!” అన్నాడు.

21 అప్పుడు ఆయనను పడవలో చేర్చుకోవడం వారికి ఇష్టం అయింది. వెంటనే పడవ వారు వెళ్ళిపోతున్న స్థలం చేరింది.

£2£2 మరుసటి రోజున సరస్సు అవతల నిలిచి ఉన్న ప్రజలకు ఈ విషయం తెలిసింది: ఆయన శిష్యులు ఎక్కిన పడవ తప్ప మరొకటి అక్కడ లేదు, యేసు తన శిష్యులతో కూడా ఆ పడవ ఎక్కలేదు. శిష్యులు మాత్రమే వెళ్ళిపోయారు. £28 అవ్వడు వేరే పడవలు తిబెరియ నుంచి వచ్చాయి. యేసు కృతజ్ఞత అర్పించిన తరువాత వారు తిన్న స్థలం దగ్గరికి అవి వచ్చాయి. £24 ఆ గుంపుకు యేసు గానీ ఆయన శిష్యులు గానీ అక్కడ కనబడకపోవడం చేత వారా పడవలెక్కి యేసును వెదకుతూ కపెర్‌నహూం వచ్చారు. 25 సరస్సు అవతల ఆయన కనబడ్డప్పుడు వారు ఆయనను “గురువర్యా! మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు?” అని అడిగారు.

నమ్ముకుందాం. అలా చెయ్యకపోతే ఆ గొప్ప నష్టం మనదే. 6:1-14 యేసు మరణించి సజీవంగా తిరిగి లేచిన సంఘటన మినహాయిస్తే నాలుగు శుభవార్త పుస్తకాల్లోనూ రాసి ఉన్న అద్భుత కార్యం ఇదొక్కటే. దీన్ని బట్టి ఈ అద్భుతానికి ఉన్న గొప్ప అంతరార్ధం, (ప్రాముఖ్యత అర్ధం అవుతున్నాయి. మత్తయి 14:18-21 నోట్స్‌ చూడండి. పస్కాపండుగ దగ్గర పడిన విషయం (వ 4), ఈ అద్భుతం “సూచన” అన్న విషయం యోహానొక్కడే రాశాడు. ఈ అధ్యాయంలో తరువాత కనిపించే క్రీస్తు మాటలు ఇందుకు కారణాన్ని తెలియజేస్తున్నాయి.

6:2 మత్తయి 9:35. 6:4 “పస్కా” - నిర్గమ 12 అధ్యాయం, లేవీ £28:4-8. 6:6 మన విషయంలో కూడా ఏం చెయ్యాలో ప్రభువుకు

అంతా ముందే తెలుసు. కానీ మన నమ్మకాన్ని, (ప్రేమను,

విధేయతను పరీక్షిస్తుంటాడు. ఆది £22:1; కీర్తన 66:10-12;

1 పేతురు 1:68,7 చూడండి.

6:7 మార్కు 6:37. ఆ సమస్యకు పరిష్కారం ఫిలిప్పుకు తెలిసి

ఉంటే అదేమిటో బయటికి చెప్పలేదు. యేసుప్రభువుకు

అసాధ్యమంటూ ఏదీ లేదన్న సంగతి అతనికింకా అర్ధం

అయినట్టు లేదు. “దేనారం” - 12:5;

చూడండి.

6:11 “కృతజ్ఞత” - మత్తయి 14:19 చూడండి.

6:14 “సూచన” - 2:11. ఈ అద్భుతం దేనికి సూచన? ద్వితీ

18:15-18లో రాసి ఉన్న ఆ గొప్ప (ప్రవక్త తమ మధ్యకు

మత్తయి 18:28; 20:2 నోట్స్‌

వచ్చాడనడానికి ఇది సూచన అని ప్రజలు అనుకున్నారు. ఇది నిజమే, యేసు ఆ ప్రవక్తే, కానీ ఆ అద్భుతం యేసు పరలోకంనుంచి దిగివచ్చినవాడనీ (88), జీవాహారమనీ (వ 35), తన ప్రజల పస్కా విందు అనీ (వ 58-56) సూచిస్తున్నది. 6:15 ఆయన ఉద్దేశం, నెరవేర్చవలసిన పని గురించి వారికెలాంటి గ్రహింపూ లేదు. దేవుని కుమారుడుగా ఆయనలో నమ్మకం లేదు. వారు తమ దేశంలోనుంచి రోమ్‌ పరిపాలనను తొలగించి శాంతి సౌభాగ్యాలను తెచ్చే ఇహలోక రాజ్యం గురించే ఆలోచిస్తున్నారు. యేసుకు అలాంటిదానితో నిమిత్తం లేదు. అప్పట్లో ఏ రాజకీయ వ్యవస్థనూ స్థాపించాలన్న ఆశ ఆయనకు లేదు. ఇప్పుడూ అంతే. ఆయన లోక పాపాల కోసం చనిపోయేందుకు వచ్చాడు. పతనమైన ట్రష్ట స్థితిలో ఉన్న మనుషులకు క్షమాపణ, ఆధ్యాత్మిక జీవం తేవడానికి వచ్చాడు. 6:16-21 ఈ అద్భుతం మత్తయి, మార్కు శుభవార్తల్లో కూడా ఉంది. మత్తయి 14:22-38 నోట్స్‌ చూడండి.

6:21 (ప్రకృతి శక్తులకు కట్టుబడకుండా, వాటిపై పూర్తి అదుపు కలిగి ఉన్న వ్యక్తిని ఈ సూచన చూపుతున్నది. కీర్తన 107:28-80; మత్తయి 8:23-27 చూడండి.

6:22 యేసు సరస్సు దాటి ఎలా రాగలిగాడో జనసమూహానికి అర్థం కాలేదు (వ 25),

6:24 వారు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినది ఆయనెవరో వారికి తెలిసి కాదు, లేదా అలాంటి ఆధ్యాత్మిక కారణం ఏదైనా ఉండి కాదు.

6:25 “గురువర్యా” - 1:38.

26 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు నన్ను ఎందుకు వెదుకుతున్నారంటే, సూచనకోసమైన అద్భుతాలు చూచినందుకు కాదు గానీ మీరు కడుపారా ఆ రొట్టెలు తిన్నందుకే. 27 చెడిపోయే ఆహారం కోసం కష్టపడకండి. శాశ్వత జీవానికి నిలిచి ఉండే ఆహారంకోసం కష్టపడండీ. ఇది మానవ పుత్రుడు మీకు (ప్రసాదిస్తాడు. ఎందుకంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు.”

£28 అందుకు వారు ఆయనను “దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి?” అని అడిగారు.

£29 “దేవుని క్రియ అంటే ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడమే” అని యేసు వారికి బదులు చెప్పాడు.

30 అందుచేత వారు ఆయనతో ఇలా అన్నారు: “అలాంటప్పుడు మేము చూచి మిమ్మల్ని నమ్మడానికి మీరు సూచనగా ఏ అద్భుతం చేస్తారు? ఏ క్రియ జరిగిస్తారు?

81 మన పూర్వికులు ఎడారిలో మన్నా తిన్నారు. 'ఆయన ఆకాశంనుంచి వారికి ఆహారం ప్రసాదించాడు” అని రాసి ఉంది గదా.”

382 అందుకు యేసు “మీకు ఖచ్చితంగా చెపుతున్నాను, ఆకాశంనుంచి మీకు ఆహారమిచ్చినది మోషే కాదు గానీ నా తండ్రి పరలోకంనుంచి నిజమైన ఆహారం మీకిస్తున్చాడు. 38 దేవుడు ఇచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు. 84 కనుక వారు ఆయనతో “ప్రభూ! ఆ ఆహారం మాకు ఎప్పటికీ ఇస్తూ ఉండండి” అన్నారు.

85 యేసు వారికిలా చెప్పాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు, నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు. 86 అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను.

37 “తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు.

6:26 యేసుప్రభువుకు వారి హృదయాలు తెలుసు (2:24,25 చూడండి). తనను వెతకడంలో వారి ఉద్దేశాల పట్ల ఆయనకేమీ ఆనందం లేదు. వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానం గానీ ఆసక్తి గానీ లేదు, తమ భౌతిక అవసరాలకు ఏమైనా దొరుకుతుందన్న తాపత్రయం మాత్రమే ఉంది. నేడు క్రైస్తవ సంఘాల్లోనూ, బయట కూడా సరికాని కారణాలను బట్టి కైస్తవులుగా ఉందామని ప్రయత్నించే అనేకమంది వీరివంటి వారే. 6:27 అన్నిటికంటే ముఖ్యంగా వారికి దేన్ని గురించి శ్రద్ధ ఉండాలో (ప్రభువు చెప్తున్నాడు. ఈ క్షణికమైన జీవితావసరాల కోసం కాదు, శాశ్వత జీవం కోసమే, శరీరం కోసం కాదు ఆత్మకోసమే వారు పాటుపడాలి. మత్తయి 6:31-388; 16:26; యెషయా ర55:1,2 కూడా చూడండి.

“శాశ్వత జీవం” - 8:16. మానవ పుత్రుడే (మత్తయి 8:20) ఆ ఆహారం ప్రసాదిస్తాడు గానీ దానికోసం వారు కష్టపడాలన్న సంగతి గమనించండి. అంటే పాపవిముక్తి అనేది కష్టపడి మంచి పనులు చేస్తే వస్తుందని కాదు. క్రీస్తు ఇచ్చేదాన్ని మనుషులు ఆయనలో వెదికేందుకూ క్రీస్తులో నమ్మకం ఉంచి ఆ ఈవిని పొందేందుకూ అన్ని ప్రయత్నాలూ చెయ్యాలని దీని భావం (వ 29). మత్తయి 11:12; హీబ్రూ 4:11; 2 పేతురు 1:10 చూడండి. 6:28 కష్టపడాలన్న క్రీస్తు మాటను వారు సరిగా అర్ధం చేసుకున్నట్టు లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడంవల్ల పాప విముక్తినీ శాశ్వత జీవాన్నీ మంచి పనుల ద్వారా సంపాదించుకో వచ్చని వారు అనుకున్నారు. కానీ 4:10; రోమ్‌ 6:28; ఎఫెసు £2:8,9; తీతు 3:5 చూడండి. 6:29 వారి పొరపాటు అభిప్రాయాన్ని ప్రభువు సవరిస్తున్నాడు. మనుషులు తమ పాపవిముక్తి కోసం క్రీస్తులోనే నమ్మకం ఉంచాలని దేవుని ఆదేశం (1:12; 38:15,16,36; 5:24). క్రీస్తులో నమ్మకం ఉంచడం బుద్ధికి అనుగుణమైన యోగ్యమైన పని, ఎందుకంటే దేవుడు ఆయన్ను ఈ లోకానికి పంపించాడు. యోహాను శుభవార్త ఒక్కదాన్లోనే దేవుడు తనను పంపాడని యేసుప్రభువు 40 సార్లు చెప్పాడు. మనుషులు ఆయన మాటలు నమ్మాలంటే ఒక విషయాన్ని ఆయన ఎన్ని సార్లు చెప్పాలి? 6:30,81 మత్తయి 16:1-4; 1 కొరింతు 1:22. తన గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్న సూచనలను యేసుప్రభువు ఇంతకుముందే చూపించాడు. అయితే ఆ (ప్రజలు ఆయన్ను నమ్మలేదు. వ 31లో వారు ఎడారిలో మన్నా గురించి మాట్లాడారు (నిర్గమ 16:11-18,85). యేసు చేసినదానిని మన్నాతో

పోలుస్తున్నట్టున్నారు. యేసు 5 వేల మందికి ఒక పూట భోజనం పెట్టాడు. మోషే కాలంలోనైతే దేవుడు ఆ జాతి నంతటినీ 40 సంవత్సరాలు పోషించాడు. యేసు వారికి మామూలు రొట్టెలు తినిపించాడు. మోషే కాలంలో దేవుడు ఆకాశంనుంచి మన్నా కురిపించాడు. అభిషిక్తుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆకాశంనుంచి మన్నా కురిపిస్తాడని యూదులు నమ్మారు. కానీ యేసు అలా చెయ్యలేదు.

6:32 మన్నా కురిపించినది దేవుడే. శాశ్వత జీవాన్ని కలిగించే పరలోక సంబంధమైన ఆహారాన్ని వారికి మోషే ఇవ్వడం అసాధ్యం. దేవుడు మాత్రమే అలా చెయ్యగలడు. తన సొంత కుమారుణ్ణి పంపడం ద్వారా దేవుడు అలా చేశాడు. దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారానికి మన్నా ఒక సాదృశ్యం, ఒక చిహ్నం మాత్రమే. ఆధ్యాత్మిక జీవాన్ని కలిగించే నిజమైన ఆహారం ఇదే.

6:38 దేవుడిచ్చే ఆహారం ఒక వ్యక్తి అని గమనించండి. పరలోకంనుంచి వచ్చి మానవజాతికి ఆత్మ సంబంధమైన జీవాన్నిచ్చే వ్యక్తి ఆయన (వ 35).

6:34 4:15 పోల్చి చూడండి. ఆయన చెప్తున్న దాని గురించి ఆత్మ సంబంధంగా వారికేమీ అర్ధం కాలేదు, వారాయన్ను నమ్మలేదు (వ 36).

6:85 వారు పోగు చేసుకుని తినగల మన్నావంటి పదార్థం గురించి తాను మాట్లాడ్డం లేదని యేసు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన తన గురించే మాట్లాడుతున్నాడు (వ 48,51). తనను తాను ఆహారంగా చెప్పుకొంటూ ఉన్నప్పుడు మానవ దేహానికి ఆహారం ఎలానో, మనుషుల మనుసులకు, హృదయాలకు, ఆత్మలకు తాను అలా అని పోల్చుకుంటున్నాడు అన్నమాట. 6:36 వ 64 5:38; 8:45; 10:25.

6:87 ఇది మరో గొప్ప వాగ్దానం. యేసుప్రభువు దగ్గరికి రావడంద్వారా మనం జీవాహారంలో భాగం పంచుకుంటామని ఇది తెలియజేస్తున్నది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గం (8:36; 5:40; 14:6; (ప్రకటన 22:17). ఆయన దగ్గరికి రావడం అంటే ఆయనలో నమ్మకం ఉంచడం; వారిలాగా అపనమ్మకంతో, వేరే ఉద్దేశాలతో రావడం కాకుండా నమ్మకంతో రావడం (వ 24,26). రావడమంటే మన హృదయాలు ఆయనకు దగ్గర కావడం, ఆత్మలో ఆయన వైపుకు తిరగడం. అలా వచ్చినవారిని ఆయన ఎప్పుడూ పంపివెయ్యడు. ఈ మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరైనా, ఎక్కడ ఉన్నా అతడు లేక ఆమె క్రీస్తు దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని క్రీస్తు నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి శత్రోసివేయను. 38 నన్ను పంపినవాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగివచ్చాను గాని నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు. 89 నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే. 40 నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”

41 తాను పరలోకంనుంచి దిగివచ్చిన ఆహారాన్ని అన్నందుకు ఆయనను గురించి యూదులు సణుక్కొన్నారు. 42 “ఈ యేసు యోసేపు కొడుకు గదా. అతని తల్లిదండ్రులు మనకు తెలిసినవారే గదా. ఇప్పుడితడు “నేను పరలోకంనుంచి

దిగివచ్చాను” అంటాడేమిటి!” అన్నారు.

48 యేసు వారికిలా బదులు చెప్పాడు: “మీలో మీరు సణుక్కోకండి. 44 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరు. వారిని చివరి రోజున సజీవంగా లేపుతాను. 45 'వారందరికీ దేవుడు ఉపదేశిస్తాడు” అని ప్రవక్తల లేఖనంలో (వ్రాసి ఉంది. అందుచేత తండ్రివల్ల విని నేర్చుకొనే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు. 46 దేవుని నుంచి వచ్చినవాడు తప్ప ఇంకెవరూ తండ్రిని చూడలేదు. ఆయన తండ్రిని చూశాడు. 47 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నామీద నమ్మకముంచినవారికి శాశ్వత జీవం ఉంది. 48 జీవాహారాన్ని నేనే. 49 ఎడారిలో మీ పూర్వికులు మన్నా తిని కూడా చనిపోయారు. 50 కానీ ఈ ఆహారం తిన్చవారు చావరు. పరలోకం నుంచి ఈ ఆహారం దిగివచ్చిన కారణం అదే.

స్వీకరిస్తాడు.

దేవుడు తనను ఎన్నుకోలేదేమోనని, కాబట్టి క్రీస్తు తనను స్వీకరించడేమోనని ఈ వచనం మొదటి భాగం విషయం ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. అతడు క్రీస్తు దగ్గరికి రావడమే దేవుడు అతణ్ణి ఎన్నుకున్నాడని రుజువు. దేవుడు మానవాళిలో నుంచి కొందరు వ్యక్తులను క్రీస్తుకు ఇచ్చాడన్నది నిజమే (10:29; 17:6). ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాకముందు అతడు, లేక ఆమె అలాంటి కోవకు చెందినవారో కాదో ఎవరూ చెప్పలేరు. అయితే దేవుడెన్నుకున్న వారందరూ మాత్రం నమ్మకంతో క్రీస్తు దగ్గరికి వస్తారు. అలా రావడం ద్వారా దేవుడు తమను క్రీస్తుకు ఇచ్చాడని రుజువు చేస్తారు. రోమ్‌ 8:29,80 నోట్స్‌ చూడండి. పాపవిముక్తి కోరుతున్న పాపి దేవుని రహస్య ఉద్దేశాల గురించి ఆందోళన పెట్టుకోవడం మాని, ఉన్నట్టుగా క్రీస్తు చెంతకు రావాలి (మత్తయి 11:28). రాదలచుకున్న వారంతా రావచ్చు (ప్రకటన 22:17). 6:38 4:34 నోట్‌. ఈ ఒక అధ్యాయంలో తాను పరలోకంనుంచి దిగివచ్చానని ఐదు సార్లు యేసుప్రభువు చెప్పాడు (వ 398,88,50,51,58). మనమంతా ఆయన్ను నమ్ముదాం. మనం ఈ ఒక్క సత్యం నమ్మితే ఆయన చెప్పిన వేరే విషయాల గురించి తొట్రుపాటు, ఆందోళన చెందనవసరం లేదు.

యేసు లోకానికి వచ్చిన ఇంకా కొన్ని కారణాలకోసం మత్తయి 5:17 నోట్‌ చూడండి. 6:39 ఇక్కడ చివరి రోజున అంటే ఈ యుగాంతంలో విశ్వాసులు సజీవంగా తిరిగి లేచే రోజున (5:28, £29 నోట్‌). విశ్వాసులు తన తండ్రి తన కిచ్చిన బహుమానమనీ ఈ బహుమానాన్ని గురించి తాను శ్రద్ధ తీసుకుంటూ దానిలో ఏ చిన్న భాగాన్ని కూడా పోగొట్టుకోననీ యేసు ఇక్కడ చెపుతున్నాడు. వ 40, 44లో యేసు ఖచ్చితంగా ఎలాంటి షరతులూ మినహాయింపులూ లేకుండా విశ్వాసులందరినీ సజీవంగా లేపుతానంటున్నాడు. అంటే ఆయన ఆరంభించిన రక్షణ కార్యాన్ని వారందరి విషయంలో ఆయన ముగిస్తాడన్న మాట. ఏ ఒక్క విశ్వాసి విషయంలో కూడా ఆయన విఫలం కాడు. ఇందులో విశ్వాసులకు పరిపూర్ణమైన భద్రత, క్షేమం ఉంది. దేవుని కుమారుని (ప్రేమ, బలప్రభావాలపై, తండ్రి సంకల్పంపై ఇది ఆధారపడి ఉంది (10:28-80, రోమ్‌ 5:9,10; ఫిలిప్పీ 1:6; హీబ్రూ 7:25 పోల్చి చూడండి.) 6:40 కుమారునివైపు చూచి ఆయనపై నమ్మకం ఉంచడ మంటే ఆయన చెంతకు రావడమే (వ 87). “శాశ్వత జీవం” గురించి నోట్‌ 3:16.

6:41 యేసు వారికి ఈ భూమిపై ఇంతకుముందు ఎవరూ వినని మనోజ్ఞమైన ఉపదేశం, అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. అందుకు ప్రతిగా వారు చేసినదల్లా సణుక్కొవడం, అభ్యంతరాలు లేవదీయడం. విశ్వాసం లేని (భ్రష్టమైన మానవ హృదయం అలాంటిదే. 6:42 మత్తయి 18:55; మార్కు 6:3 కూడా చూడండి. క్రీస్తు ఎలా జన్మించాడో వారికి తెలియదు (మత్తయి 1:18-28; లూకా 1:26-85). ఆయన పరలోకంనుంచి వచ్చిన సంగతి వారికి తెలియదు. తెలుసుకోవాలన్న కోరికా లేదు. 6:48 సత్యాన్ని (గ్రహించాలంటే సణుగుడు సరైన మార్గం కాదు. అది కేవలం మనుషుల పాపాన్ని పెంచుతుంది. 6:44 వ 87 చూడండి. దేవుని తోడు లేకుండా పాపులైన మనుషులకు క్రీస్తు మాటలు అర్థం కావు, ఆయనపై నమ్మకం కలగదు. ఆయన చెంతకు రావడం అసాధ్యం. అవిశ్వాసులు జవాబుదారులు, దోషులుగా ఉన్నారు, శిక్షావిధికి గురైనవారు (38:18-20).

చివరి రోజున విశ్వాసులందరినీ సజీవంగా లేపుతానని యేసు నాలుగు సార్లు చెప్పాడు (వ 39,40,54). ఈ సత్యం ఎంత నిశ్చయమో తెలియజేసేటందుకు ఈ మాటలను చాలా గట్టిగా మనస్సులో నాటుకునేలా చెప్తున్నాడు. 6:45 యెషయా 54:18; యిర్మీయా 31:34. దేవుడు ఉపదేశకుడు అనే సత్యం గురించి నోట్స్‌ కీర్తన 25:45. దేవునినుంచి నేర్చుకునే ప్రతివాడూ క్రీస్తు దగ్గరికి వస్తాడు. సందేహం లేదు. క్రీస్తును తన రక్షకుడుగా ప్రభువుగా నమ్మకుండా దేవుడు తన ఉపదేశకుడు అని ఎవరన్నా అనడం వ్యర్థం. 6:46 1:18. దేవత్వంలో ఈ ఇద్దరు వేరువేరు వ్యక్తులని మరోసారి గమనించండి - ఒకరిని మరొకరు చూశారు. 6:47 యేసు ఈ విషయాన్ని ఇంకా కొన్ని సార్లు చెప్పాడు (వ

అయినా

40, 3:15,16; 5:24). నమ్మి ఆనందించండి. 6:48 వ 35. 6:49-51 నమ్మకం లేని యూదులు యేసుకన్నా మోషే

గొప్పవాడనుకున్నారు. (వ 30-32). కానీ నిజం దీనికి వ్యతిరేకంగా ఉందని క్రీస్తు ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఇస్రాయేల్‌ వారు తినిన మన్నా వారికి ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వలేదు. లేక చాలా కాలం ఈ లోకంలో ట్రతికేలా చెయ్యలేదు (వ 49). కానీ పరలోకంనుంచి వచ్చి ఆహారం అయిన క్రీస్తు ఎప్పటికీ నిలిచివుండే ఆత్మసంబంధమైన జీవాన్ని ఇస్తాడు. మన్నా ఒక్క జాతివారికే లభ్యం అయింది. కానీ క్రీస్తు ఇచ్చేది ఈ లోకంలోని వారందరికోసం (వ 51).

51 పరలోకంనుంచి దిగివచ్చిన సజీవమైన ఆహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే శాశ్వతంగా జీవిస్తారు. లోకానికి జీవంకోసం నేను ఇవ్వబోయే ఆహారం నా శరీరమే!”

52 అప్పుడు యూదులు “ఈ మనిషి తన శరీరాన్ని తినడానికి మనకు ఎట్లా ఇవ్వగలడు?” అంటూ ఒకరితో ఒకరు వాదించుకొన్నారు.

58 కనుక యేసు వారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మానవ పుత్రుని శరీరం తినకపోతే, ఆయన రక్తం త్రాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54 నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడెవడైనా

పరలోకంనుంచి వచ్చిన ఆ ఆహారాన్ని ఒక వ్యక్తి గనక తింటే అతడు చనిపోడని వ 50లో యేసు అంటున్నాడు. 11:26 కూడా చూడండి. మరి క్రీస్తులో నమ్మకం ఉంచినవారు శారీరికంగా చనిపోరా? అవును చనిపోతారు గాని ఆత్మసంబంధంగా ఎప్పుడూ చనిపోరు. వారు మరణం నుంచి జీవంలోకి వెళ్ళిపోయారు (5:24). క్రొత్త ఒడంబడిక (గ్రంధంలో విశ్వాసుల మృతిని కూడా సాధారణంగా మరణం అనలేదు, “నిద్ర” అన్నారు. 11:11-18; అపొ కా 7:60; 1 కొరింతు 15:6; 1 తెస్స 4:18 చూడండి. మరణం గురించి నోట్స్‌ ఆది £2:17 చూడండి. 6:51 లోకమంతటి పాపాల పరిహారం కోసం తన దేహం బలి అర్చణ అనీ (1:29; 3:15 చూడండి), ఆయనమీద నమ్మకం ఉంచడంద్వారా మనుషులకు ఆత్మ సంబంధమైన జీవం కలుగుతుందనీ యేసు ఉద్దేశం. 6:52 ఎప్పటిలాగానే నమ్మకం లేని ఈ మనుషులకు ఆయన చెప్పినది బోధపడలేదు. ఆధ్యాత్మికమైన వివేచన వారికి లేదు. ఆయన మాటలను తఅక్షరార్థంగా తీసుకున్నారు. 8:4; 4:15 పోల్చి చూడండి. యేసు తరుచుగా అలంకారికమైన భాషను ఉపయోగించాడు. దాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకూడదు (వ 35; 4:10; 8:12; 10:7, 15:1; మొ!!). తరువాత వస్తున్న వచనాల విషయంలో కూడా ఇది గుర్తుంచుకోవాలి. 6:58-58 ఈ భాగంలో యేసు తన శరీరం, రక్తం గురించి నాలుగు సార్లు మాట్లాడాడు. మనుషులు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని తాగాలని చెప్పాడు. అదే “నిజమైన” ఆహారం అన్నాడు. తానే ఆహారం అనీ, మనుషులు తనను తినాలనీ చెప్పాడు.

విన్నవారు. ఆ మాటలను ఉన్నవి ఉన్నట్టు అర్థం చేసుకోకూడదన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. వ 63 చూడండి. ఆయన వారి ఎదుట నిలబడి ఉన్నాడు. హత్య, నరమాంస భక్షణ అనే ఘోర నేరాలు చేయకుండా ఆయన్ను అక్షరాలా తినడం వారికి అసాధ్యం. ఈ రెంటిలో దేనినీ యేసుప్రభువు కలలోనైనా బోధించలేదు. ఆయన అక్షరాలా మనకు ఆహారం అని ఎలా భావించకూడదో అలానే ఆయన శరీరాన్ని అక్షరాలా తిని, రక్తాన్నీ తాగాలని మనం అనుకోకూడదు.

ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించేందుకు ఆయన భాషాలంకారాన్ని వాడుతున్నాడు. తాను అక్షరాలా ఒక తలుపు అనీ (10:7), లేక అక్షరాలా ఒక ద్రాక్షతీగె (15:1) అనీ ఆయన ఉద్దేశం కానట్టే ఆయన్ను అక్షరాలా తినాలని కూడా ఆయన ఉద్దేశం కాదు. పాత ఒడంబడిక (గ్రంథంలో రక్తాన్ని తాగడం తినడం నిషేధం (ఆది 9:4; లేవీ 17:10-14; 19:26).

యేసు ఏ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తున్నాడు? వ 51లో చెప్పిన సత్యాన్నే ఇక్కడ తన రక్తాన్ని కూడా చేర్చి నేర్పిస్తున్నాడు. “రక్తం” అంటే సిలువపై కారనున్న ఆయన రక్తం; మనుషుల

శాశ్వత జీవం గలవాడు. చివరి రోజున నేను అతణ్ణి లేపుతాను. 55 నా శరీరం నిజంగా ఆహారం, నా రక్తం నిజంగా పానీయం. ర56 నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు. నేను అతనిలో ఉంటాను. 57 జీవం గల తండ్రి నన్ను ఎలా పంపాడో, నేను తండ్రి మూలంగా ఎలా జీవిస్తూ ఉన్నానో అలాగే నన్ను తిన్నవాడు నామూలంగా జీవిస్తూ ఉంటాడు. 58 పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే! మీ పూర్వికులు మన్నా తిని చనిపోయినట్టు కాదు - ఈ ఆహారం తిన్చవాడు ఎప్పటికీ జీవిస్తాడు.

59 ఆయన కపెర్‌నహూంలో ఉపదేశిస్తూ సమాజ

పాపాలకు పరిహారబలిగా ఆయన ఇవ్వనున్న తన (ప్రాణమన్న మాట (మత్తయి £26:27,28; రోమ్‌ 8:25 చూడండి). ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడమంటే ఏమిటి? ఆయన చేసిన బలి అర్పణ నిజంగా మన కోసమేననీ, అది మన పాపాలను తీసివేస్తుందనీ నమ్మడమే(రోమ్‌ 8:25; ఎఫెసు 1:7; హీబ్రూ 9:12-14; 1 యోహాను 1:7). నమ్మకం ద్వారా ఆయన్ను మన హృదయాల్లోకి స్వీకరించడమే. ఇది ఆత్మ సంబంధంగా తిని త్రాగడం. ఇది ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇస్తుంది.

ఈ భాగమంతా ప్రభురాత్రి భోజన ఆచరణను సూచిస్తున్నదని కొందరు అనుకుంటున్నారు (మత్తయి 26:26-29; 1 కొరింతు 11:28-32). దీనికి చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. (ప్రభురాత్రి భోజన ఆచరణలోని ఆధ్యాత్మిక అర్థాన్ని ఈ వచనాలు వివరిస్తూ ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవం కలగాలంటే మనుషులు ఈ ఆచరణ పాటించాలని క్రొత్త ఒడంబడిక (గ్రంథంలో ఎక్కడా రాసి లేదు. అదే నిజమైతే మరి సిలువ మీద నమ్మకం ఉంచిన దొంగ సంగతి ఏమిటి (లూకా 20:40-43)? ప్రభురాత్రి భోజనం ఎప్పుడూ పుచ్చుకోని ఇతర విశ్వాసుల, చిన్నపిల్లల సంగతి ఏమిటి? యేసు వ ర58లో చాలా ఖచ్చితంగా తన శరీరం తినకపోతే, తన రక్తం త్రాగకపోతే వారిలో జీవం ఉండదని చెప్పాడు. ఇక్కడ ఆయన ఆత్మ సంబంధమైన వాస్తవాలను గురించి మాట్లాడుతున్నాడన్నది తేటతెల్లమే. ప్రభురాత్రి భోజన ఆచరణలో భాగం పుచ్చుకుంటూ కూడా ఆత్మ సంబంధంగా నమ్మకం ద్వారా ఎప్పుడూ ఆయన శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని త్రాగకుండా ఉండడం సాధ్యమేనని మనం అర్ధం చేసుకోవాలి. అలాగే ఆధ్యాత్మికంగా నమ్మకం ద్వారా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో భాగం పుచ్చుకోకుండా ఉండడం కూడా సాధ్యమే. 6:58 “తినకపోతే”, “త్రాగకపోతే” అంటూ మాట్లాడడంలో పాపవిముక్తికి అత్యంత అవసరమైన విషయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. 3:3; మత్తయి 18:3; లూకా 18:3 కూడా చూడండి. ఇవన్నీ లేకుండా ఏ మనిషికీ ఆత్మ సంబంధమైన జీవం, పాపవిముక్తి, దేవుని రాజ్యంలోకి (ప్రవేశం, పరలోకం లేవు. యేసుక్రీస్తు చెప్పిన అతి గంభీరమైన వాక్కులే ఇందుకు ఆధారం.

6:56 విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు (రోమ్‌ 6:11; 8:1; 1 కొరింతు 1:2; ఎఫెసు 1:1-4); క్రీస్తు విశ్వాసిలో ఉన్నాడు (2 కొరింతు 18:5; కొలస్సయి 1:27; 3:11; ప్రకటన 38:20). ఒకరు పరస్పరం మరొకరిలో ఉన్నారు - 17:20-28. వారి జీవితాలు ఎప్పటికీ ఏకంగా పెనవేసుకొని ఉన్నాయి.

6:57 తండ్రి అయిన దేవునిమూలంగా క్రీస్తుకు జీవం ఉన్నదన్న సంగతి ఎంత వాస్తవమో క్రీస్తుమూలంగా విశ్వాసులకు జీవం ఉన్న సంగతి అంత వాస్తవం. జీవం ఉన్న తండ్రి, జీవం ఉన్న కుమారుడు, జీవం ఉన్న విశ్వాసులు - వీరంతా అతి కేంద్రంలో ఆ మాటలు చెప్పాడు. 60 ఆయన శిష్యులలో చాలమంది అది విని “ఈ మాట కఠినమైనది. ఇది ఎవరు వినగలరు?” అన్నారు.

61 తన శిష్యులు దానిని గురించి సణుగుకొంటూ ఉన్న నంగతి యేసుకు తెలుసు. కనుక ఆయన వారితో ఇలా అన్నాడు: “మీకు ఇది అభ్యంతరమా? 62 అయితే మానవ పుత్రుడు మునుపున్న చోటికి పైకి వెళ్ళడం మీరు చూస్తే మీకెలా ఉంటుందో! 63 జీవమిచ్చేది దేవుని ఆత్మ మాత్రమే. శరీరం ప్రయోజనమేమీ లేనిది. మీతో నేను చెప్పే మాటలు ఆత్మ నంబంధమైనవి, జీవం ఇచ్చేవి. 64 కానీ మీలో కొందరు నమ్మడం లేదు.” నమ్మనివారెవరో తనను శత్రువులకు పట్టి

ఇచ్చేవాడెవడో మొదటి నుంచి యేసుకు తెలుసు. 65 ఆయన ఇంకా అన్చాడు “తండ్రి వారిని అనుగ్రహించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరని నేను చెప్పినది అందుకే.”

66 అప్పటినుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కు తగ్గి ఆయనతో మరెన్నడూ తిరగలేదు.

67 అప్పుడు యేసు తన పన్నెండుమందితో “మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా?” అన్నాడు.

68 సీమోను పేతురు ఆయనకు ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మేము ఎవరిదగ్గరికి వెళ్తాం? నీవు శాశ్వత జీవ వాక్కులు గలవాడవు. 69 అంతేకాక, అభిషిక్తుడవూ సజీవుడైన దేవుని కుమారుడవూ నీవే అని మేము నమ్ముతూ

సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. 6:60 క్రీస్తు శత్రువులైన యూదులు కాదు ఈ మాటలనృది. ఆయన శిష్యులే కొందరు అన్నారు. ఆయనకు సన్నిహితులైన పన్నెండుమంది కాదు. ఆయన ఉపదేశాలు వినేందుకు అప్పుడప్పుడు ఆయన వెంట వెళ్తూ ఉండేవారు కొందరు ఇలా అన్నారన్నమాట. ఇలా అన్నవారిలో కొందరు నిజంగా ఆయనపై నమ్మకం ఉంచినవారు కారు (వ 64). ఆయన్ను వదిలి వెళ్ళిపోవడం ద్వారా వారి అవిశ్వాసాన్ని వారు బయట పెట్టుకున్నారు (వ 66. 1 యోహాను 2:19 పోల్చి చూడండి).

58-58 వచనాల్లో యేసు నేర్చినది ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఆయనలో నమ్మకం ఉంచినవారికి దివ్యంగా కనిపిస్తుంది. అయితే నమ్మకం లేనివారికి నిజంగా అది “కఠినమైన” మాటే. వారి పాపవిముక్తికి ఏకైక మార్గం వారికోసం క్రీస్తు చేసిన బలి అర్పణేననీ, నమ్మకంద్వారా వారు ఆయనతో సంబంధం పెట్టుకోవాలనీ, లేదా వారు నశించిపోతారనీ వినడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇది కఠినమైన మాట అనడంలో తాము అంగీకరించేందుకు అది చాలా కష్టమైన మాట అని వారి ఉద్దేశం. నిజమైన విశ్వాసికి యేసు చెప్పినవి కొన్ని అర్ధం చేసుకోవడానికి కష్టమైనప్పటికీ అంగీకరించేందుకు మాత్రం ఏదీ కష్టమైనది కాదు. ఇక్కడ క్రీస్తు ఉపదేశం ఆయన నిజ శిష్యులనూ కపట శిష్యులనూ వేరు చేసింది (యూదా ఇస్కరియోతు ఒక్కడు మాత్రం మరి కొంత కాలం వేరు కాకుండా అలానే ఉన్నాడు). 6:61 వక41. 6:62 మార్కు 16:19; లూకా 2451; అపొ కా 1:9. క్రీస్తు పరలోకానికి పైకి వెళ్ళిపోతుండగా చూస్తే వారికి మరింత అభ్యంతరం కలుగుతుందా లేక ఆయన్ను నమ్ముతారా అని ఈ ప్రశ్నకు అర్థం కావచ్చు. “మునుపున్న చోటు” అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడున్నచోటు అని అర్థం (వ 38; 1:1, 3:13). 6:68 “ఆత్మ” - దేవుని ఆత్మ ఆ ఆత్మ మాత్రమే ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇవ్వగలడు (3:5-8; £2 కొరింతు 8:6). అక్షరాలా తన శరీరాన్ని తినడం ఎలాంటి మేలూ కలిగించదని క్రీస్తు ఇక్కడ సూచిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవం ఏ వ్యక్తిలోకీ నోటి గుండా ప్రవేశించదు. అది నేరుగా మనిషి ఆత్మలోకి వెళ్తుంది.

“శరీరం ప్రయోజనమేమీ లేనిది” అనే మాటలు అక్షరాల క్రీస్తు శరీరాన్ని తినడంవల్ల ఏమీ ప్రయోజనం ఉండదనే అర్ధం మాత్రమే కాకుండా ఎవరి శరీరమూ, శారీరికంగా ఎవరి ప్రయత్నాలూ ఆధ్యాత్మిక జీవాన్ని ఇవ్వలేవని కూడా దీని అర్థం కావచ్చు. అంటే మానవ స్వభావంతో సంబంధం ఉన్నదేదీ అలా చెయ్యడం అసాధ్యం (1:13).

“మీతో నేను చెప్పిన మాటలు” అంటే పై వచనాల్లో చెప్పిన మాటలు అని అర్థం. కానీ క్రీస్తు చెప్పిన మాటలన్నిట్రికీ ఇది సరిపోతుంది. అయితే మాటలు ఆత్మ సంబంధమైనవిగా జీవం

ఇచ్చేవిగా ఉండడం ఎలా? దేవుని ఆత్మ ఈ మాటలను ఆత్మ సంబంధమైన జీవాన్ని ఇచ్చేందుకు వాడుకుంటాడన్న మాట. క్రీస్తు మాటలను మనుషులు అర్ధం చేసుకుని, నమ్మకం ఉంచి, ఆ ప్రకారం చేసి, జీవాన్ని పొందగలిగేలా దేవాత్మ చేస్తాడు. క్రీస్తు మాటల మూలంగా మనుషులు తమ అవసరతను గుర్తించేలా, క్రీస్తు చేసిన వాగ్దానాలపై ఆశపెట్టుకునేలా, తమ హృదయాలు తెరిచి ఆయన జీవాన్ని స్వీకరించేలా పవిత్రాత్మ చేస్తాడు.

6:64 £2:24,25. యూదా ఇస్కరియోతును క్రీస్తు తన శిష్యుల్లో ఒకడుగా ఎన్నుకోకముందే అతడు తనను శత్రువులకు పట్టి ఇస్తాడని ఆయనకు తెలుసు (70,71). అలాగైతే అతణ్ణి ఎన్నుకోవడం ఎందుకు? బైబిలు లేఖనాలు, దేవుని ఉద్దేశాలు నెరవేరాలని. మత్తయి £26:24 చూడండి.

6:65 యేసుప్రభువు గొప్ప అద్భుతం చేశాడు, అద్భుతమైన మాటలు చెప్పాడు. అయితే చాలామంది తమ అపనమ్మకంలోనే ఉండిపోయారు. ఇందుకు కారణాన్ని ప్రభువు ఇక్కడ మరో సారి చెప్తున్నాడు (వ 44). ఇది వ 87లో ఉన్న విషయాన్నే మరో రీతిలో చెప్పడం. తండ్రి క్రీస్తుకు ఇవ్వని వారంతా ఆయన దగ్గరికి రారు.

6:66 వ 15లోని మనస్తత్వం నుంచి కొందరు ఎంత త్వరగా ఈ స్థితికి మారిపోతారో గదా! వారు కోరేది తాము అదుపు చేయగలిగిన యేసును, తమ ఉద్దేశాల ప్రకారం చేసే యేసును, తమకు ఏది మంచిదని వారనుకుంటారో దాన్ని వారికిచ్చే యేసును. ఉన్న యేసును వారు కోరలేదు. ఆయన చెప్పిన “కఠినమైన” మాటల్ని (వ 60) వారు అంగీకరించలేకపోయారు. యేసు వారి అపనమ్మకాన్ని బట్టబయలు చేశాడు కూడా. అందువల్ల ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. యేసును మనం సరియైన కారణాలవల్ల అనుసరించాలి. అలా కాకపోతే ఎప్పటికైనా మనం కూడా ఆయన్ను వదిలి వెళ్లిపోతాం.

6:67 పన్నెండుమంది శిష్యులూ తనను వదిలి వెళ్ళరని యేసుకు తెలుసు. వారి మనసుల్లో ఏమున్నదో వారు నోరు తెరచి చెప్పాలని ఆయన ఉద్దేశం. ఇది వారికి పరీక్ష సమయం అనడంలో సందేహం లేదు.

6:68 శిష్యులందరి తరుఫునా ప్రతినిధిగా పేతురు మాట్లాడేవాడు (మత్తయి 16:15,16; 17:4; మొ). వారందరి మనుసుల్లో (ఇస్కరియోతు యూదా తప్ప) ఉన్న సంగతిని ఇతడు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. క్రీస్తును అనుసరించడంలో గల సరైన కారణం చెప్తున్నాడు. వారు క్రీస్తు మాటలను విశ్వసించారు. తాను ఏమిటని ఆయన చెప్పుకున్నాడో అదేనని వారికి నమ్మకం కుదిరింది. వారాయన్ను వదిలిపోలేరు. నిజమైన విశ్వాసికి క్రీస్తును విడిచి వెళ్ళిపోదగిన ఇతర ప్రదేశమేదీ లేదు, ఆశ్రయించదగిన వేరొక వ్యక్తి ఎవరూ లేరు.

6:69 “అభిషిక్తుడు” - యేసు ఎవరో శిష్యులు చాలా వరకు తెలుసుకొన్నాం.”

70 “పన్నెండుగురైన మిమ్ములను ఎన్నుకొన్నాను గదా. మీలో ఒకడు పిశాచం” అని యేసు వారికి బదులు చెప్పాడు. 71 ఆయన సీమోను కొడ్తుకెన ఇస్కరియోతు యూదాను గురించి చెప్పాడు. ఎందుకంటే అతడు పన్నెండుగురిలో ఒకడై ఉండి, ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వబోయేవాడు.

ఆ తరువాత యేసు గలలీలో సంచారం చేస్తూ ఉన్నాడు. యూదులు తనను చంపడానికి చూస్తూ ఉండడంచేత ఆయనకు యూదయలో సంచారం చేయడం ఇష్టం లేకపోయింది. 2 అయితే యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడ్డప్పుడు 8 ఆయన తమ్ముళ్ళు ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు చేస్తూ ఉన్న పనులు నీ శిష్యులు చూచేట్టు ఇక్కడనుండి యూదయకు వెళ్ళిపో. 4 ఎవడైనా బహిరంగంగా ప్రసిద్ధికెక్కాలంటే రహస్యంగా పనులు జరిగించడు. నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటే నిన్ను నువ్వు లోకానికి కనపరచుకో!” 5 ఎందుకంటే, ఆయన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన మీద

నమ్మకం ఉంచలేదు. 6 అందుచేత యేసు వారికిలా చెప్పాడు: “నా సమయం

ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధమే. 7 లోకం మిమ్ములను ద్వేషించడం అసాధ్యం. కానీ నేను దాని క్రియలు చెడ్డవని దానిని గురించి సాక్ష్యం చెపుతూ ఉన్నాను, గనుక దానికి నా మీద ద్వేషం ఉంది. 8 మీరు ఈ పండుగకు వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్తి కాలేదు గనుక ఇప్పుడే ఈ పండుగకు వెళ్ళను. 7

9 ఆయన పవారికిలా చెప్పిన తరువాత గలలీలో ఉండిపోయాడు. 10 ఆయన తమ్ముళ్ళు పండుగకు వెళ్ళిన తరువాతే ఆయన కూడా వెళ్ళాడు - బహిరంగంగా కాదు గాని రహస్యంగా. 11 ఆ పండుగలో యూదులు “ఆయనెక్కడ ఉన్నాడు?” అని అడుగుతూ ఆయనను వెతుకుతూ ఉన్నారు. 12 ప్రజలలో ఆయనను గురించి చాలా సణుగుడు ఉంది. కొంతమంది “ఆయన మంచివాడు” అన్నారు, మరి కొందరు “కాదు. (ప్రజల్ని మోసగించి తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు” అన్నారు. 18 అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు.

14 పండుగ రోజుల మధ్య యేసు దేవాలయానికి వెళ్ళి ఉపదేశం చేయసాగాడు. 15 “విద్యాభ్యాసం లేని ఈ మనిషికి పాండిత్యం ఎక్కడిది?” అంటూ యూదులు చాలా

అర్థం చేసుకున్నట్టే - ఆయన ఏ కల్మషమూ లేని పాపరహితుడు, దేవుడు ప్రత్యేకించి ఈ లోకానికి పంపినవాడు, దేవునికి ప్రతినిధి, ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడు.

6:70,71 యూదా అక్షరాలా పిశాచం కాదు. కానీ తన జీవితంపై అతడు సైతానుకు ఎంతగా అధికారం ఇచ్చాడంటే

పిశాచంలాగానే అతడు ప్రవర్తించసాగాడు. 12:4-6; 13:2,26,27 కూడా చూడండి. 7:1 వ32; 5:16,18; 8:87,40; 10:81. చావంటే

యేసుప్రభువుకు భయం లేదు. అసలు ఆయన వచ్చినదే అందుకు (3:15; 10:17,18; 12:27, 18:11; మత్తయి 20:28). కానీ అందుకు తగిన సమయం ఇంకా రాలేదు (వ 30).

7:2 లేవీ 28:38-48 నోట్స్‌. ఈ పండుగ జెరుసలంలో ఏటేటా జరిగేది.

7:3-5 ఆయన అద్భుతాలు చేయగలడని వారికి తెలుసు. అయితే ఆయన దేవుని కుమారుడనీ అభిషిక్తుడనీ వారింకా నమ్మలేదు. కాబట్టి ఆయనకు తాము సలహాలు ఇవ్వగలం అని వ్యర్థంగా అనుకున్నారు. ఆయన యూదుల మత జీవనానికి కేంద్ర స్థానమైన యూదయలోని జెరుసలం వెళ్ళి, బహిరంగంగా యూదులపై నాయకత్వం వహించడానికి ప్రయత్నించాలన్నదే ఆ సలహా. ఆ సమయంలో వారు ఆయన ఉద్దేశాలనూ, పనినీ పూర్తిగా అపార్థం చేసుకున్నారు. తరువాతి కాలంలో వారిలో కనీసం ఇద్దరు యాకోబు, యూదా (మత్తయి 18:55) యథార్థ్ధంగా అయనను అనుసరించారు (అపొ కా 1:14; యాకోబు 1:1; యూదా 1).

7:6 పండుగకు వారు ఏ సమయంలో వెళ్ళినా ఫర్వాలేదు గాని తాను మాత్రం మరి కొంత కాలం ఆగడం మంచిదని యేసు మాటలకు అర్ధం (వ 8).

7:7 ఇక్కడ మొట్టమొదటి సారి యేసు ఈ లోకం (నమ్మకం లేని మనుషులు) తనను ద్వేషిస్తారని చెప్తున్నాడు (15:18,23,24 కూడా చూడండి. 38:20లో ఈ విషయాన్ని సూచించాడు). ఈ ద్వేషానికి కారణం కూడా ఇక్కడ చెప్తున్నాడు. మనుషులకు వారి క్రియలు చెడ్డవని చెప్తే ఇష్టం ఉండదు. వారి నిజ స్థితిని ఎవరన్నా బయటపెడితే వారికి కోపం. యేసుప్రభువు

తమ్ముళ్ళను లోకం ద్వేషించదు, ఎందుకంటే అప్పటికి వారింకా లోకానికి చెందినవారే కాబట్టి దాన్ని వ్యతిరేకించరు.

యోహాను శుభవార్తలో “లోకం” అనే మాట 70 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు కనిపించదు. లోకం నశించిన స్థితిలో ఉన్నదనీ (8:16), చీకటిలో ఉన్నదనీ (3:19), దేవుణ్ణి ద్వేషిస్తున్నదనీ (7:7) 15:18,28), సైతాను పరిపాలనలో ఉన్నదనీ (8:44; 12:31), దేవుని ఆత్మను స్వీకరించలేని స్థితిలో ఉన్నదనీ (14:17), పాపభరితంగా, అపనమ్మకంగా ఉన్నదనీ (16:8-11) దాని గురించి యేసు చెప్పాడు. యోహాను తన మొదటి లేఖలో రెండు వచనాల్లో లోకాన్ని వర్ణించాడు (1 యోహాను 2:16; 5:10). రోమ్‌ 12:2; యాకోబు 4:4 1 యోహాను 2:16 నోట్స్‌ కూడా చూడండి. 7:10 ఒక పనిని సరిగ్గా ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో యేసుకు చక్కగా తెలుసు. 7:11 క్రీస్తు జెరుసలంకు వస్తాడని ఆయన శత్రువులు ఎదురు చూశారు. ఆయన కనిపించకపోవడం వారికి తికమక పెట్టింది. 7:12 యేసును గురించి పరస్పరం పూర్తి విరుద్ధమైన రెండు అభిప్రాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన మంచివాడైతే ప్రజలను మోసగించడు. అలా మోసగిస్తూ ఉంటే ఆయన మంచివాడు కాదన్నమాట. ఆయన మంచివాడై, (ప్రజలను మోసగించకుండా ఉన్న పక్షంలో ఆయన ఉపదేశాలు సత్యమన్న మాట. ఆయన శత్రువులు ఆయన్ను మోసగాడన్నారు (మత్తయి 27:68). కానీ దానికి సాక్ష్యాధారాలూ రుజువులూ ఏవీ వారు చూపించలేకపోయారు. ఆయన మంచివాడనీ, మోసగాడు కాదనీ నిరూపించే ఆధారాలూ రుజువులూ ఎన్నో ఉన్నాయి (5:31-40 పోల్చి చూడండి). 7:18 మరి కొందరు కూడా (క్రీస్తు శిష్యులు సైతం) కొన్ని సార్లు ఇదే భయాన్ని కనపరిచారు (9:22; 12:42; 19:38; 20:19). ఇలాంటి భయమే బానిసత్వం. సామెత 29:25 పోల్చి చూడండి. 7:14 సరైన సమయం వచ్చినట్టు గ్రహించగానే ఆయన బహిరంగంగా వారికి ఉపదేశించసాగాడు. 7:15 మత్తయి 7:28,29; లూకా £2:47. అంటే ఆయన

↑ Back to top

↑