Part 12 of 14

యోహాను శుభవార్త – భాగము 11 (పుటలు 63–68)

యోహాను శుభవార్త – భాగము 11 (పుటలు 63–68)

వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. £2 నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ (ప్రకారం ఇచ్చావు. 3 ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం.

4 చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. 5 తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.

6 “లోకంనుంచి నీవు నాకిచ్చినవారికి నీ పేరును వెల్లడి చేశాను. పూర్వం వారు నీవారు. వారిని నాకు ఇచ్చావు. వారు నీ

రెండో కారణం, తండ్రికి తాను మహిమ చేకూర్చగలిగేలా తండ్రిని తనకు మహిమ చేకూర్చవలసిందని అడుగుతున్నాడు. తన సొంత మహిమను తనకోసం ఆయన కోరలేదు. తండ్రికి మహిమ చేకూర్చలేని ఎలాంటి మహిమనూ ఆయన తనకు కలగాలని ఎన్నటికీ కోరేవాడు కాదు (7:18; 8:50). తన కుమారుని శత్రువులు ఆయన్ను ఓడిస్తే, మరణం ఆయన్ను సమాధిలో బంధిస్తే అది తండ్రికి ఏమాత్రం మహిమ కలిగించదు.

మూడోదిగా, దేవుడు క్రీస్తుకిచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించి దేవుని పని (వ 2) సాధించాలంటే తండి ఆయనకు మహిమ చేకూర్చడం అవసరం. తండ్రి ఆయన్ను సజీవంగా లేపి దేవుని కుడివైపున కూర్చోబెట్టకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు. అందువల్ల కేవలం తండ్రికోసం మాత్రమే గాక, విశ్వాసులందరి కోసమూ కూడా ఆయనకు మహిమ చేకూరాలని కోరాడు. దేవుని మహిమ, క్రీస్తు మహిమ, ఆయన (ప్రజల మేలు - ఈ మూడూ ఒకదానికొకటి దగ్గర సంబంధం గలవి.

17:2 “అధికారం” - 38:85; మత్తయి 28:18. ఆయనకు అధికారం ఇవ్వడంలో గల ఉద్దేశం చూడండి (విశ్వాసులకు శాశ్వత జీవాన్ని ఇవ్వడం - 3:16; 5:21;6:40). ఈ లోకంలో యేసుప్రభువుకున్న అపరిమిత అధికారం చూడండి. తండ్రి తనకు ఇచ్చినవారందరికీ శాశ్వత జీవం కలగడం అనే ఫలితాన్ని సాధించడం కోసం ఆయన ఈ లోకంలోని అన్ని దేశాల్లో, జాతులమధ్య పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. మనుషుల హృదయాల్లో మనసుల్లో పని చేయగలడు.

17:3 “శాశ్వత జీవం” - 8:16. ఇదేమిటో యేసు చెప్పినది ఇక్కడ ఒక్క చోటే. దేవుణ్ణి తెలుసుకోవడంవల్ల కలిగే ఫలితం శాశ్వత జీవం అనలేదు ఆయన. దేవుణ్ణి తెలుసుకోవడమే శాశ్విత జీవం అన్నాడు. ఈ జ్ఞానం ఎవరిలోనూ సహజంగా లేదు (15:21; 16:8; £ కొరింతు 4:4; ఎఫెసు 417,18). మనుషులకు శాశ్విత జీవాన్ని ఉచితంగా ఇవ్వడంలో యేసుప్రభువు వారికి తండ్రి అయిన దేవుణ్జీ, తననూ తెలుసుకునేలా చేస్తున్నాడు (మత్తయి 11:27 పోల్చి చూడండి). శాశ్వత జీవమంటే కేవలం అనంతకాలం జీవించడం మాత్రమే కాదు. ఇదొక విశేషమైన జీవం - అంటే దేవునితో సహవాసం చేయడం, ఆయన్ను ఎరిగి ఉండడం, ఆయనకు విధేయత చూపుతూ, ఆయనను నమ్ముతూ, ఘనపరుస్తూ, (ప్రేమిస్తూ, సేవిస్తూ ఉండడం (ప్రకటన 21:38; £2£2:3-5 పోల్చి చూడండి). ఇలా దేవుణ్ణి తెలుసుకోవడం అనే ఈ జ్ఞానం దేవుని నుంచి నేరుగా వచ్చెది. ఇది మనోవికాసం, జ్ఞానప్రకాశాలను కలిగించే అనుభవం (2 కొరింతు 4:6).

“ఏకైక సత్యదేవుడనైన” ఇక్కడ యేసు తనను, పవిత్రాత్మను దేవత్వంలో నుంచి వేరు చేయడం లేదు. అబద్ధ దేవుళ్ళనూ, మనుషులు చేసిన విగ్రహాలనూ మాత్రమే ఆయన వేరు చేస్తున్నాడు (కీర్తన 115:8-8; యెషయా 44:6,8; 45:18).

దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా శాశ్వత జీవమో తనను తెలుసుకోవడం కూడా అలానే శాశ్వత జీవమని అనడంలోనే ఆయన తనను కూడా దేవునితో కలిపి మాట్లాడుతున్నాడు

(8:19; 14:8,9 చూడండి). శాశ్వత జీవం యేసులో ఉంది (1 యోహాను 5:11). అసలు శాశ్వత జీవమంటే యేసే (11:25; 14:6; 1 యోహాను 5:20). ఈ జీవం మనకు కలగాలంటే ఆయన్ను మనం తెలుసుకోవాలి. సరైన వ్యక్తిని తెలుసుకోవడమే నిజ క్రైస్తవానికి ఆయువుపట్టు - ఎఫెసు 4:17,18; 2 పేతురు 1:3; 3:18.

యేసుప్రభువు చెప్తున్న ఈ జ్ఞానం అద్వైత వేదాంతం చెప్తున్న ఆత్మజ్ఞానం లాంటిదేదీ కాదు (15:21 మొదలైన చోట్ల నోట్స్‌ చూడండి). ఏకైక నిజ దేవుణ్ణి నిజంగా ఎరిగినవారు. తాము కేవలం మనుషులమేనని, దేవునిచేత సృష్టించబడినవారమేననీ అన్ని విధాలా దేవునికంటే చెప్పరాని రెట్లు అల్పులమేననీ తెలుసుకుని ఉంటారు.

17:4 క్రీస్తు ఉద్దేశం ఎప్పుడూ పరమ తండ్రికి మహిమ కలిగించడమే. దీన్ని ఆయన నెరవేర్చాడు (4:84; (2) 8:29).

17:5 (ప్రపంచం ఉనికిలోకి రాకముందే తానున్నానని యేసు తానే ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు (1:1-8; మీకా 5:2 చూడండి). క్రీస్తు తండ్రికి వేరుగా ఉన్న ఒక ప్రత్యేక వ్యక్తి అని ఇది తేటతెల్లం చేస్తున్నది కూడా.

దేవుడు తన కుమారుడు చేసిన ఈ ప్రార్థనకు జవాబిచ్చాడు. అపొ కా 2:32,38; 38:18-15; ఫిలిప్పీ 2:9-11 చూడండి. 17:6 “నీవు నాకిచ్చినవారు” - తనలో నమ్మకం ఉంచినవారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వ 6-10లో వారి గురించి తొమ్మిది సంగతులు చెప్పాడు. వ 14,18లో మరో మూడింటిని జోడించాడు. ఈ విషయాలన్నీ విశ్వాసులందరి విషయంలోనూ నిజమే. వారి పాపం, అల్ప విశ్వాసం, అసంపూర్ణమైన విధేయత గురించి ఆయన ఇక్కడ మాట్లాడ్డం లేదు. తన ప్రజల నేరాలు తండ్రికి చెప్పడు. తండ్రి ఎదుట వారి పక్షంగా వాదిస్తాడు (రోమ్‌ 8:38,84; 1 యోహాను 2:1). వీలైనంతవరకు వారిని గురించి క్రీస్తు ఉన్నతమైన ఆలోచనలు కలిగి తండ్రి ఎదుట వారిని సాధ్యమైనంత ఉత్తములుగా నిలబెడతాడు.

“వారికి నీ పేరును వెల్లడి చేశాను” - 1:18; మత్తయి 11:27. అంటే దేవుని స్వభావాన్నీ ఆయన లక్షణాలనూ పూర్తిగా తెలియజేశాడు. నిర్గమ 384:6,7 చూడండి. దేవుడు ఎలాంటివాడో కేవలం మాటలతో గాక చేతలతో జీవితం ద్వారా యేసుప్రభువు వారికి వెల్లడి చేశాడు. దేవుడు ఈ లోకంలో నుంచి వారిని ఎన్నుకున్నాడు. విశ్వాసులు స్వభావ సిద్ధంగా ఇతరులకన్న మంచివారేమీ కాదు. వారందరూ థట్రష్ట మానవజాతికి చెందినవారే. దేవుడు వారిని ఎన్నుకునేందుకు వారిలో మంచి గానీ పవిత్రత గానీ ఏమీ లేదు (రోమ్‌ 8:9,19; ఎఫెసు £2:1-38). కానీ దేవుడు వారిని ఈ లోకం విడిచి క్రీస్తు వెంట రమ్మని పిలిచాడు (గలతీ 1:3). వారు ఇక ఈ లోకానికి చెందినవారు కాదు (వ 14; ఫిలిప్పీ 3:20). మొదట వారు తండ్రి అయిన దేవునికి చెందినవారు.

ఒక విధంగా చూస్తే దేవుడు అందరినీ సృష్టించినందువల్ల మనుషులంతా ఆయనకు చెందినవారే (యెహెజ్కేలు 18:4). కానీ విశ్వాసులు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని సొత్తు - అపొ కా 18:10; 1 కొరింతు 6:19,20; ఎఫెసు 14 వాక్కును పాటించారు. 7 నీవు నాకిచ్చిన మాటలు వారికిచ్చాను. వారు వాటిని అంగీకరించారు, నేను నీ దగ్గరనుంచి వచ్చానని వారు రూఢిగా తెలుసుకొన్నారు, నీవు నన్ను పంపావని నమ్ముకొన్నారు, 8 కాబట్టి నీవు నాకిచ్చినవన్నీ నీనుంచి వచ్చినవని ఇప్పుడు వారికి తెలుసు.

9 “వీరికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు ఇచ్చినవారు నీవారే గనుక

వారికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. వీరిమూలంగా నాకు మహిమ కలిగింది. 11 ఇకమీదట నేను లోకంలో ఉండను గానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, మనం ఒక్కటిగా ఉన్నట్టే నీవు నాకిచ్చినవారు ఒక్కటిగా ఉండేలా నీ పేర వారిని కాపాడు. 12 నేను లోకంలో వారితో ఉన్నప్పుడు నీ పేర వారిని కాపాడాను. నీవు నాకిచ్చినవారిని నేను

1 పేతురు 1:2 (నిర్ణమ 19:4-6; ద్వితీ 7:6 పోల్చి చూడండి). లోకం ఉనికిలోకి రాకమునుపు ఆయన వారిని ఎన్నుకున్నాడు. దేవుడు వారందరినీ యేసుప్రభువుకు ఇచ్చాడు. విశ్వాసులు దేవుడు తన కుమారునికి ఇచ్చిన ప్రేమ బహుమతి. ఆయన తనతో ఉంచుకుంటూ, చూస్తూ, ఆనందిస్తూ ఉండడానికి దేవుడిచ్చిన విశేషమైన నిధి.

అలాంటప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ క్షేమంగా పరలోకంలో

చేరేవరకు వారిని జాగ్రత్తగా సంరక్షించడా? అవును. సంరక్షిస్తాడు - వ 11,12; 10:28 చూడండి. విశ్వాసులు దేవుని వాక్కుకు “విధేయులయ్యారు”

అంటున్నాడు క్రీస్తు. అక్షరాలా దేవుని మాటలు అయిన క్రీస్తు మాటను వారు విన్నారు. ఆయనకు లోబడ్డారు. వారు లోపం లేనివారు కారు. లోపం లేకుండా దేవుని వాక్కుకు విధేయత చూపలేదు. కానీ వారి కోరిక, జీవితాశయం పూర్తిగా విధేయత చూపడమే. క్రీస్తు వారి తప్పులను పట్టించుకోకుండా వారు “విధేయులయ్యారు” అంటున్నాడు. విశ్వాసులందరి విషయంలోనూ ఇది నిజమే. విశ్వాసులమని చెప్పుకొని కనీసం కొన్ని ముఖ్యమైన విషయాల్లోనైనా దేవుని వాక్కుకు లోబడని వారి సంగతేమిటి? వారు నిజ విశ్వాసులు కారు (8:31,47; 10:26,27; మత్తయి 7:21; 1 యోహాను 2:3,4). 17:7,8 విశ్వాసులందరి గురించి ఈ రెండు వచనాలు మరి కొన్ని విషయాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని సత్యాలను వారు (గ్రహిస్తారు, స్వీకరిస్తారు, నమ్ముతారు. దేవుడు యేసును పంపాడనీ, యేసు చేసినవీ చెప్పినవీ అన్నీ దేవుని మూలంగానేననీ వారికి తెలుసు. క్రీస్తు చెప్పిన మాటలు పరమ తండ్రినుంచి వచ్చాయని వారు వాటిని సంతోషంతో అంగీకరిస్తారు. తాము నమ్మినవన్నీ యేసుక్రీస్తు తిరుగులేని అధికారాన్ని బట్టి నమ్ముతారు. వాటన్నిట్రికీ మార్పు చెందని ఆధారం ఆయనే అని వారికి తెలుసు. 17:9 విశ్వాసుల గురించి ఇక్కడ చెప్పిన సత్యాలలో ఏడోది - క్రీస్తు వారిని తన ప్రత్యేక ప్రార్ధన అంశంగా చేసుకుంటాడు. వారికోసం ప్రార్ధించిన రీతిలో అవిశ్వాసులకోసం పప్రార్థించలేడు, ప్రార్ధించడు. 17:10 విశ్వాసుల గురించిన ఎనిమిదో సత్యం ఇది. వారిద్వారా క్రీస్తుకు మహిమ చేకూరుతుంది. ఆయన ప్రేమ, కరుణలకు ఆయన వారికోసం మరణించడం మూలంగా మహిమ కలుగుతుంది. వారికి పాపవిముక్తి ప్రసాదించి వారిని మార్చడంలో ఆయన ప్రభావం, కృపలకు మహిమ కలుగుతుంది. వారి బలహీనతలను సహించి ఊరుకోవడంలో ఆయన సహనానికి మహిమ చేకూరుతుంది. లోకానికి వారు చెప్తున్న సాక్ష్యంలో ఆయన పేరుకు మహిమ చేకూరుతుంది. వారిలో బలహీనత, (్రష్ట స్వభావం ఉన్నాయి. అయినప్పటికీ క్రీస్తుకు వారి మూలంగా మహిమ కలుగుతుంది. వారిని ఎన్నుకోవడంలో దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశాల్లో ఇది ఒకటి - ఎఫెసు 1:5,6,12. విశ్వాసుల మూలంగా తండ్రికి, కుమారునికి కూడా మహిమ చేకూరుతుంది.

మనం ఈ సత్యాన్ని మనసులో పెట్టుకుని అన్నిటిలోనూ

వారిద్దరికీ మహిమ కలిగేందుకు సంతోషంతో పూనుకోవాలి (1 కొరింతు 10:31).

17:11 దేవుడు యేసుకు తన సొంత “పేరును” ఇచ్చాడు (5:26,27 పోల్చి చూడండి). దేవుడు తన స్వభావం, అధికారం, ప్రభావం యేసుక్రీస్తియొక్క మానవ దేహంలో ఉండేలా దయచేశాడు (కొలస్సయి 2:9).

ఈ వచనంలో యేసు విశ్వాసుల కోసం చేసిన మొదటి విన్నపం కనిపిస్తున్నది. వ 15లో దీన్నే వేరే మాటల్లో మళ్ళీ చెప్పాడు. వారు యూదా ఇస్కరియోతులాగా నశించిపోకుండా (వ 12) దేవుడు వారిని కాపాడాలనీ, దుర్మార్గతనుంచి సంరక్షించాలనీ ఆయన్ను వేడుకుంటున్నాడు. దేవుడు విశ్వాసులను కాపాడుతూ ఉండవలసిన కారణం ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది. వారింకా “లోకంలో ఉన్నారు”. దేవుడు వారిని లోకంనుంచి ఎన్నుకున్నాడు (వ 6). వారు లోకానికి చెందినవారు కాదు (వ 4), కానీ వారు ఇంకా లోకంలోనే ఉన్నారు. లోకం వారినింకా ద్వేషిస్తూ ఉంది. (వ 14). లోకంనిండా విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలు, మోసపుచ్చే ఆత్మలు, అపాయాలు (1 పేతురు 5:8) ఉన్నాయి. లోకం సత్యానికీ, నమ్మకానికీ, దేవుణ్ణి (ప్రేమించడానికీ, విశ్వాసికి అమూల్యమైన వాటన్నిట్రికీ విరోధి. 1 యోహాను 5:19 చూడండి. ఆధ్యాత్మికంగా చూస్తే అది చీకటితో, మురికితో నిండిన ప్రదేశం దాన్లో మనం అశుద్ధమైపోవడం, దారి తప్పడం తేలిక, విశ్వాసులైతే తరచుగా బలహీనులుగా, తెలివితక్కువవారుగా ఉండి తమ (భ్రష్ట స్వభావాలతో పెనుగులాడుతూ ఉంటారు (రోమ్‌ 7:18; గలతీ 5:17; 1 యోహాను 1:8) - వారిని లోకానికీ సైతానుకూ పట్టియివ్వబూనుకునేదేదో వారిలోనే ఉంది (రోమ్‌ 7:23).

ఇలాంటప్పుడు విశ్వాసులు భద్రంగా ఎలా ఉండగలుగుతారు? తన కుమారుని ప్రార్థనలకు జవాబుగా దేవుడు వారిని కాపాడుతాడు కాబట్టి వారికి పూర్తి భద్రత ఉంది. లూకా 22:31; రోమ్‌ 5:10; హీబ్రూ 7:25 చూడండి. ఆయన సర్వశక్తి వారి పక్షంగా పని చేస్తున్నది - 1 పేతురు 1:45; సామెత 18:10. ఆయన వారిలో మంచి పని ఆరంభించాడు. దాన్ని ఆయనే సమాప్తం చేస్తాడు ఫిలప్పీ 1:6. విశ్వాసులను భద్రంగా ఉంచడంలో కుమారుడైన యేసు పరమ తండ్రితో కలిసి పని చేస్తున్నాడు. యేసుప్రభువు వారిని భద్రంగా తనతో ఉంచుకోవాలన్నది దేవుని తిరుగులేని సంకల్పం (6:39). ఈ విషయంలో దేవుని సంకల్పాన్ని యేసు నెరవేర్చకుండా ఉంటాడా? 4:34 పోల్చి చూడండి. విశ్వాసులు ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెలు. ఆయన వారిని కాపాడకుండా ఉంటాడా? 10:28 చూడండి. ఆయన వారికోసం అస్తమానం ప్రార్ధిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలను దేవుడు వినడా? 11:42 చూడండి.

క్రీస్తు ప్రార్ధనలకు దేవుడు జవాబియ్యడమన్నది విశ్వాసుల మంచి (ప్రవర్తనపై ఆధారపడదు. వారి మంచి ప్రవర్తన, విశ్వాసంలో కొనసాగడం అన్నది ఆయన ప్రార్థనలపై ఆధారపడి ఉంది.

17:12 ఈ భూమిపై ఉన్నప్పుడు యేసుప్రభువు తన కాపాడాను. వారిలో ఎవరూ నశించలేదు. అయితే లేఖనం నెరవేరేందుకు నాశనానికి తగినవాడే నశించాడు.

18 “ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. వీరిలో నా ఆనందం పూర్తిగా ఉండాలని ఈ మాటలు లోకంలో చెపుతున్నాను. 14 నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. 15 లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను

నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. 16 నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. 17 నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. 18 నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. 19 వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.

విశ్వాసులందరినీ భద్రంగా కాపాడాడు. ఆయన వారిని బలహీనతనుంచి బుద్ధి హీనతనుంచి, చెడు విషయాల గురించిన (టేరేపణలు, విషమ్‌ పరీక్షలనుంచీ, ఆ మాట కొస్తే పాపం చేయడానికి అవకాశాలన్నిటి నుంచీ వారిని రక్షించలేదు (18:10,11; 19:25; లూకా £2:24,31,82; £4:25; మత్తయి 16:22,28; 26:69-75). వారు ఘోరమైన తప్పుల్లో పడుతూ ఉన్నప్పటికీ యేసు వారిని కాపాడుతున్నాడు. అంటే వారు పాపం చేసినా కూడా ఆయన వారిని రక్షణ స్థితిలో, ముక్తిమార్గంలో ఉంచుతూ వచ్చాడు. వారిలో బలహీనమైన నమ్మకం, అప్పుడప్పుడూ అపనమ్మకం ఉన్నా కూడా తనపై నమ్మకం చెదరకుండా ఉన్న స్థి స్టితిలోనే ఉంచాడు. యేసు తాను వారిని కాపాడిన విధంగానే కాపాడవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు.

యూదా ఇస్కరియోతును (“నాశనానికి తగినవాడే”) కాపాడలేకపోయాడా? విశ్వాసులను కాపాడ్డంలో ఒక్క యూదాను ఆయన మినహాయించాడా? అతణ్ణి విశ్వాసంలో ఉంచలేక పోయాడా? అలా కాదు. యూదాలో నిజమైన విశ్వాసం ఎప్పుడూ లేదు. దేవుడు యూదాకు పాపవిముక్తి కలిగించి అతన్ని తనకు ఇచ్చాడనీ, తాను యూదాను పోగొట్టుకున్నాననీ యేసు అనడం లేదు. వ 6-10లో నిజ విశ్వాసుల వర్ణన చూడండి. యేసుకు దేవుడిచ్చిన వారు ఎలాంటివారో చూడండి. యూదాకు ఆ వర్ణన సరిపోవడం లేదు. మొదటినుంచి కూడా యూదా గుణాలు అతణ్ణి నాశనానికి పాత్రుడుగా చేశాయి. 6:70 చూడండి. అతడొక సారి పాపవిముక్తి పొంది రక్షించబడిన తరువాత తప్పిపోయినవాడు కాదు. అందరిలోకి ఘోరమైన పాపిగా మారిపోయిన నిజ విశ్వాసి కాదు. అతడు ఎప్పుడైనా నిజ విశ్వాసిగా ఉన్నాడనడానికి ఏ ఆధారమూ లేదు. విశ్వాసులమని చెప్పుకునే వారందరినీ, విశ్వాసుల్లాగా కనిపించే వారందర్నీ యేసు కాపాడడు. నిజంగా విశ్వాసులైనవారినే కాపాడుతాడు.

“నెరవేరేందుకు” - 18:18; కీర్తన 41:9; 109:4-18; జెకర్యా 11:12,18. 17:18 “ఆనందం” - 15:11; లూకా 10:21. యేసు

చేసిన ఈ ప్రార్ధనను సరిగా అర్ధం చేసుకొగలిగితే విశ్వాసుల హృదయాలకు ఇదెంతో ఆనందం కలిగిస్తుంది. పౌలు £2 తిమోతి

1:12; 4:18లో చెప్పిన ఆనందం, నిబ్బరం మనకు కూడా ఉండాలి. 17:14 15:18,19. యేసుప్రభువు, ఆయన విశ్వాసులు

కూడా దేవుని రాజ్యానికీ పరలోకానికీ చెందినవారే గానీ ఈ లోకానికి చెందినవారు కాదు. 17:15 విశ్వాసులను లోకంలోనే ఉంచాలని ఎందుకు అడుగుతున్నాడు? వ 18%; 15:27, 2 కొరింతు 4:17; 1 పేతురు 1:7; 2:9 చూడండి.

“కాపాడుమని” - వ11. 17:17-19 యేసుప్రభువు విశ్వాసుల కోసం చేస్తున్న రెండో విన్నపం. “ప్రత్యేకించు” అని తర్థుమా చేసిన (గ్రీకు పదానికి చాలా విస్తారమైన అర్థం ఉంది. దీన్ని పవిత్రపరచు అని కూడా అనువదించవచ్చు. సాధారణంగా మంచి ఉద్దేశం కోసం, లేక

మత కర్మల కోసం వేరు చేయడం అని దీనికి అర్థం. పాత ఒడంబడిక (గ్రంథంలో పవిత్రంగా చేయడం, ప్రత్యేకించడం అని తర్జుమా చేసిన హీబ్రూ పదం లాంటిదే ఇది కూడా (లేవీ 20:7 నోట్‌ చూడండి). దీనికి ప్రతిష్టించడం, అంకితం చేయడం అనీ, శుద్ధం చేయడం అని కూడా అర్థాలు స్థిరపడ్డాయి. యేసు ఏ భావంతో ఇక్కడ ఈ పదం వాడాడు? ఈ భావాలన్నీ ఆయన మనస్సులో ఉండి ఉండవచ్చు. కానీ బహుశా విశ్వాసుల కోసం చేసిన ఈ ప్రార్ధనకు ముఖ్యమైన అర్ధం దేవుడు వారిని ప్రతిష్టించుకోవాలనీ, తనకోసం, ఈ భూమిపై తన పనికోసం ప్రత్యేకపరచాలనీ కావచ్చు. వ 19లో ఈ అర్ధం స్పష్టంగా కనిపిస్తున్నది (10:36 కూడా చూడండి). యేసును శుద్ధీకరించి, పవిత్రపరచవలసిన అవసరత లేదు గాని ఈ లోకంలో దేవుని సంకల్పం (ప్రకారం చేసేందుకు తనను తాను (ప్రతిష్టించు కున్నాడు. ఇదే రీతిలో దేవుడు విశ్వాసులను ప్రత్యేకించి ప్రతిష్టించాలని (ప్రార్థించాడు. 18:10; 15:8లోని మాటలు చూడండి - యేసు "కన శిష్యులకోసం ఇలా పప్రార్ధించకముందే వారు శుద్ధులు. విశ్వాసులు దేవుని సంకల్పం (ప్రకారం చేసేందుకు సంసిద్ధుల్ని చెయ్యాలంటే వారి ఆలోచనల్లో, ఉద్దేశాల్లో శుద్ధీకరణ జరగాలన్నది నిజమే. కనక ఈ విషయం 'కూడా వారికి జరగాలని యేసు ఈ ప్రార్ధనలో అడిగాడేమో. అయితే దీని (ప్రధానమైన భావం ఇదే అనిపిస్తున్నది - తన సంఘం మొత్తాన్ని అంటే తాను శిరస్సు అయి ఉన్న విశ్వాసుల గుంపంతటినీ (ఎఫెసు 1:22; 4:15; 5:23; కొలస్సయి 1:18) దేవుని పవిత్ర ప్రజగా (1 పేతురు 2:9) ఆయన ప్రత్యేకించాలి. 17-19 వచనాల్లో ఈ ప్రత్యేకత గురించి ఏడు విషయాలు మనం నేర్చుకోవచ్చు.

మొదటిది, అది క్రీస్తు ప్రార్ధనకు జవాబుగా దేవుడు చేసే పని. అందువల్ల మరి తిరుగులేకుండా ఆయన దాన్ని జరిగిస్తాడు (11:42),

రెండోది, తన పిల్లల్లో కొందరి విషయంలో క్రీస్తు చేసిన ఈ ప్రార్థనను దేవుడు వింటే అందరి విషయంలోనూ ఆయన దాన్ని వింటాడు. కొందరి విషయంలో జవాబిచ్చి వారిని ప్రత్యేకించితే అందరినీ అలా ప్రత్యేకిస్తాడు.

మూడోది, విశ్వాసులను ప్రత్యేకించడం క్రీస్తు తనను తాను ప్రత్యేకించుకొన్నదాని ఫలితం (వ 19). పాపాన్ని తీసివేసే అర్పణగా క్రీస్తు తనను ప్రత్యేకించుకున్నాడు (1:29). దాని మూలంగా విశ్వాసులు ప్రత్యేకించబడ్డారు, ఇతరులందరినుంచీ వేరై దేవునికి ప్రత్యేక ప్రజ అయ్యారు - హీబ్రూ 10:10; 18:12. పాత ఒడంబడిక ఉదాహరణ కోసం లేవీ 8:10-15,30 చూడండి.

నాలుగోది, విశ్వాసులను (ప్రత్యేకించడం యేసు ప్రత్యేకించు కోవడం వంటిదే (వ 19). యేసు తనను ఎప్పుడు ప్రత్యేకించు కొన్నాడు? 10:36-88; హీబ్రూ 10:5-7 చూడండి. విశ్వాసులు ఎప్పుడు ప్రత్యేకించబడ్డారు? భూమిపై దేవుని ఆలయంగా మారేందుకు నమ్మకంద్వారా క్రీస్తుతో ఐక్యమైనప్పుడు (ఎఫెసు 2:21; 1 కొరింతు 3:16).

ఐదోది, విశ్వాసులను ప్రత్యేకించడానికీ, ఈ లోకంలో 20 “నేను ప్రార్థన చేస్తున్నది వీరికోసం మాత్రమే కాదు గాని వీరి మాటల మూలంగా నామీద నమ్మకం ఉంచబోయేవారి కోసం కూడా. 21 వారందరూ ఒక్కటిగా ఉండాలని నా (ప్రార్ధన. తండ్రీ, నీవు నన్ను పంపావని లోకం నమ్మేలా నేను నీల, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒక్కటిగా

ఉండాలని ప్రార్థిస్తున్నాను. 22 మనము ఒక్కటిగా ఉన్మట్టే

అగా టు వారు ఒక్కటిగా ఉండేందుకు నీవు నాకిచ్చిన మహిమ వారికిచ్చాను. 238 నీవు నన్ను పంపావనీ నన్ను (ప్రేమించినట్టే వారిని (ప్రేమించావనీ లోకం తెలుసుకోవాలి గనుక వారిలో నేను, నాలో నీవు ఉండడంవల్ల వారు సంపూర్ణంగా ఒక్కటి

క్రీస్తుసంఘం పనికీ సంబంధం ఉంది (వ 18; 20:21). వారిని లోకంలోనుంచి పిలవడం జరిగింది. (వ 6). వారు లోకానికి చెందినవారు కారు (వ 14). కానీ దేవుడు వారిని ప్రత్యేకించి తిరిగి లోకంలోకి పంపుతాడు.

ఆరోది, విశ్వాసులను దేవుడు ప్రత్యేకించడం సత్యంలో (లేక సత్యం వల్ల. ఇక్కడున్న (గ్రీకు పదానికి ఈ రెండు భావాలూ ఉన్నాయి). సత్యం అంటే ఏమిటో ఇక్కడ గమనించండి. అది దేవుని వాక్కు దేవుని వాక్కు ఎక్కడుంటుంది? బైబిల్లో మాత్రమే. దేవుడు విశ్వాసులను ప్రత్యేకించేందుకు వాడే సాధనం సత్యం, వారు ఉంటున్న నివాసం సత్యం. మన అంతరంగంలో క్రీస్తు కోరుతున్న శుద్ధత, పవిత్రత గురించి నోట్స్‌ కోసం మత్తయి ర: 8;

రోమ్‌ 6:11-14; 8:12,13; £ కొరింతు 7:1; ఎఫెసు 4:22-24; ర5:3-7; హీబ్రూ 12:14; 1 పేతురు 1:14-16,22; 1 యోహాను 38:8 చూడండి.

ఏడోది, క్రీస్తు తన విశ్వాసులకు జరగాలని ప్రార్ధించిన ఈ (ప్రత్యేకత అత్యంత అవసరం. అలా కాకపోతే క్రీస్తు ఈ విధంగా ప్రార్థించేవాడు కాదు. విశ్వాసులకు ఏది అవసరమని దేవుడు నియమించాడో వాటికోసమే ఆయన ప్రార్ధించాడు.

17:20 అన్ని తరాలలో విశ్వాసులందరి కోసమూ యేసుప్రభువు ముందుగానే ప్రార్ధించాడు. అప్పట్లో తన శిష్యులకు ఏది ఉండాలని ఆశించాడో ఇప్పుడున్న మనకూ అదే ఉండాలని ఆయన కోరిక.

17:21-28 వ 11. నిజ విశ్వాసులందరి గురించి ఆయన చేసిన మూడో విన్నపం - ఐక్యత. వ 20-23లో దీన్ని గురించి ఈ క్రింది సంగతులను మనం నేర్చుకోవచ్చు.

మొదటిది, ఇది క్రీస్తు ప్రార్థనకు జవాబుగా దేవుడు ఇచ్చేది (11:42). ఇది మనుషులు చేకూర్చేది కాదు. క్రైస్తవ సంఘాల నాయకులు కలిసి స్థాపించగలది కాదు. అలా చెయ్యాలని ఆ నాయకులకు క్రీస్తు చెప్పలేదు.

రెండోది, ఇది ఒకే కోవకు చెందినవారి ఐక్యత మాత్రమే. వ 6-10లో వర్ణించబడిన నిజ విశ్వాసులకే ఈ ఐక్యత ఉందన్నమాట. ప్రతి దేశంలోనూ క్రైస్తవ సంఘాల్లో ఉండే నామకార్థ క్రైస్తవుల సమూహాలన్నిట్రీనీ కలిపి మనుషులు సమకూర్చి సంస్థాగతమైన ఐక్యత కాదు.

మూడోది, విశ్వాసులు ఏ తరంలో జీవించినవారైనా, ఏ సంఘానికి చెందినవారైనా, ఏ దేశానికి ఏ జాతికి చెందిన వారైనా వారందరినీ ఒకటి చేసే ఐక్యత ఇది (వ £21 - “వారందరూ”). నాలుగోది, కొన్ని విషయాల్లో తండ్రి అయిన దేవునికీ కుమారునికీ ఉన్న ఐక్యత లాంటిదే ఈ ఐక్యత (వ 21). అంటే అది పరిపూర్ణమైన ఐక్యం, జీవంలో, స్వభావంలో ఏకత్వం.

ఐదోది, ఈ ఐక్యత నిజానికి తండ్రిలోనూ, కుమారునిలోనూ ఉంది. ఇది సంస్థాగతమైన ఐక్యతకు పూర్తిగా భిన్చమైనది. దానికంటే అంతు లేనంత ఉత్తమమైనది. దేవుడు క్రీస్తులో, క్రీస్తు దేవునిలో ఉన్నట్టు విశ్వాసులంతా వీరిద్దరిలో ఉన్నారు (వ 21. 1 తెస్స 1:1; రోమ్‌ 6:5 చూడండి). క్రీస్తు ఇక్కడ ప్రార్థించిన ఐక్యత ఈ ఐక్యత మాత్రమే.

ఆరోది, క్రీస్తు తన విశ్వాసుల్లో ఉన్నాడు కాబట్టే ఈ ఐక్యత ఉంటుంది (వ 23). విశ్వాసులు అనంత కాలం ఆయనతో,

ఒకరితో ఒకరు ఏకమై ఉంటారు. ఆయన వారిలో లేకపోతే ఆయన (ప్రార్ధించిన ఐక్యతను సాధించేందుకు మనుషులేమీ చేయలేరు. ఏడోది, ఈ ఐక్యత లోపరహితమైనది, పరిపూర్ణమైనది (వ 22).

ఎనిమిదోది, క్రీస్తు విశ్వాసులకు ఇచ్చిన మహిమతో ఇది ముడిపడి ఉంది (వ £22£2). ఈ మహిమ ఏమిటో ఆయన వివరించలేదు గాని దేవుని పిల్లలుగా భూమిపై ఆయన ప్రతినిధులుగా ఉండగలిగిన ఘనత కావచ్చు. లేదా, మహిమ పొందిన క్రీస్తులో వారు ఉండడం కారణంగా వారికి కలిగిన ఘనత కావచ్చు (వ 1,5. ఎఫెసు 2:5,6; కొలస్సయి 3:3,4 చూడండి). విశ్వాసులకు తనలో మహిమ కలిగించాలని వారిని క్రీస్తు ఎన్నుకొన్నాడు. ఈ సత్యమే వారు ఒక్కటిగా అయ్యేలా సాధ్యం చేసింది. క్రీస్తు చేసిన ఈ ప్రార్థనకు దేవుని జవాబు కోసం 1 కొరింతు 12:12,18 చూడండి. (1 కొరింతు 6:15,17; రోమ్‌ 12:5; ఎఫెసు 1:22; 4:15,16; 5:29-82 కూడా చూడండి). పవిత్రాత్మ వచ్చి విశ్వాసులందరినీ క్రీస్తు ఆధ్యాత్మిక దేహంలోకి బాప్తిసమిచ్చి, ఆయనతో వారందరిని ఐక్యత గలవారుగా చేశాడు. ఒక వ్యక్తి క్రీస్తుపై నమ్మకం పెట్టినప్పుడు క్రీస్తు చేసిన ఈ ప్రార్ధనకు జవాబు మళ్ళీ వస్తుంది. పవిత్రాత్మ ప్రతి విశ్వాసినీ ఇప్పటికీ క్రీస్తుతో, సజీవ దేవుని నిజ సంఘమనే క్రీస్తుశరీరంతో ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఈ ఐక్యతను మనుషులు గుర్తించగలరు గానీ సృష్టించలేరు, మెరుగుపరచలేరు, చెడగొట్టలేరు, నాశనం చేయలేరు.

తొమ్మిదోది, ఈ ఐక్యత కొన్ని ఫలితాలను చూపుతుంది (వ 21,28). “లోకం నమ్మేలా”, “తెలుసుకోవాలి” - దేవుడు అంతకు ముందు విశ్వాసుల విషయంలో సృష్టించిన ఐక్యత ఫలితం ఇది కాదనీ, దీని కోసం వేరే రకమైన ఐక్యత అవసరమనీ అనేకమంది అభిప్రాయపడ్డారు. (ప్రపంచ క్రైస్తవులంతా (వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా) ఒకే క్రైస్తవ సంఘ సంస్లలో బహిరంగ ఐక్యం కావడం అవసరమని వారి ఉద్దేశం. కానీ ఇలా జరిగితే దేవుడు క్రీస్తును పంపాడని లోకం నమ్ముతుందని అనుకోవడానికి సరైన కారణం ఏదీ లేదు. అయితే క్రీస్తు చేసిన ఈ ప్రార్థన ఫలితం అంతరంగ ఐక్యం. ఆయన ఈ మాటలు పలికినప్పుడు ఇస్రాయేల్‌ తప్ప బయటి (ప్రపంచం ఆయన్ను గురించి విన్నది చాలా తక్కువ. ఒక్క తరంలో ఆయన శిష్యులు రోమ్‌ సామ్రాజ్యమంతటా, ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల్లో శుభవార్త ప్రచారం చేశారు. క్రీస్తును నమ్మిన మనుషులు గొప్ప సమూహాలుగా ఉన్నారు. సత్యాన్ని బోధించడానికి క్రీస్తు ప్రజలు కలిసి నిలిచిన చోటెల్లా ఈ రోజుకూ ఇది కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా ముగిసిపోలేదు. ఆయన రెండో రాకడ సమయంలో లోకానికి తెలియాలని ఆయన అనుకున్నదంతా పూర్తిగా వెల్లడి అవుతుంది.

పదోది, విశ్వాసులు తమకున్న ఈ ఐక్యతను గుర్తించి దాన్ని ప్రదర్శించాలి. ఈ సత్యం ఇక్కడ చూచాయగా మాత్రమే కనిపిస్తున్నది గాని వేరే చోట్ల మరింత స్పష్టంగా నేర్పించడం

జరిగింది. - ఎఫెసు 4:1-6 చూడండి. అపొ కా 4:32; 1 కొరింతు 31:10-12; 8:1-4% 12:12-27 కూడా చూడండి.

17:28 దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కావాలని ఆ మహిమ వారికిచ్చాను. 24 తండ్రీ, నీవు నాకు ఇచ్చినవారు నీవు నాకిచ్చిన మహిమను చూచేలా నేను ఎక్కడ ఉంటానో వారు నాతో అక్కడే ఉండాలని నా కోరిక, ఎందుకంటే, జగత్తు పునాదికి మునుపే నీవు నన్ను ప్రేమించావు.

25 “న్యాయవంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసు కోలేదు, గానీ నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీరు తెలుసుకొన్నారు. £26 నామీద నీకు ఉన్న (ప్రేమ వారిలో ఉండాలనీ నేను కూడా వారిలో ఉండాలనీ నీ పేరును వారికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”

క్‌ (వి యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో

కూడా కెద్రోను లోయ దాటివెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉంది. ఆయన, ఆయన శిష్యులు దానిలోకి వెళ్ళారు. £2 యేసు ఆయన శిష్యులను తరచుగా అక్కడ కలుసుకొనేవాడు గనుక ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చే యూదాకు ఆ స్థలం తెలుసు.

8 అప్పుడు యూదా, సైనికుల గుంపునూ ప్రధాన యాజులూ పరిసయ్యులూ పంపిన దేవాలయ ఉద్యోగులనూ కొందరిని అక్కడికి తీసుకువచ్చాడు. వారికి దివిటీలతో, దీపాలతో, ఆయుధాలు ఉన్నాయి. 4 తనమీదికి జరగబోయేది

అంతా తెలిసి యేసు ముందుకు వెళ్ళి “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని వారితో అన్నాడు.

5 “నజరేతువాడైన యేసును” అని వారు ఆయనకు జవాబిచ్చారు.

యేసు వారితో “నేనే ఆయనను” అన్నాడు.

ఆయనను పట్టి ఇచ్చే యూదా వారి మధ్య నిలబడి ఉన్నాడు. 6 యేసు “నేనే ఆయనను” అనగానే వారు వెనక్కు తగ్గి నేలమీద పడిపోయారు.

7 “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని ఆయన వారిని మళ్ళీ అడిగాడు.

వారు “నజరేతువాడైన యేసును” అన్నారు.

8 “నేనే ఆయనని మీకు చెప్పాను గదా. నన్నే గనుక మీరు వెదకుతూ ఉంటే వీరిని వెళ్ళిపోనియ్యండి” అని యేసు బదులు చెప్పాడు. 9 నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరినీ పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరేందుకు అలా అన్నాడు.

10 సీమోను పేతురు దగ్గర ఖడ్గం ఉంది. దానిని ఒరనుంచి దూసి అతడు ప్రముఖయాజి సేవకుణ్ణి కొట్టి అతడి కుడిచెవి తెగనరికాడు (ఆ సేవకుడి పేరు మల్కు).

11 “ఖడ్గం ఒరలో పెట్టు. తండ్రి నాకు ఇచ్చిన గిన్చెలోది నేను త్రాగనా?” అని యేసు పేతురుతో చెప్పాడు.

(ప్రేమించినంతగా విశ్వాసులను కూడా క్రేమిస్తున్నాడు! రోమ్‌ 5:8; ఎఫెసు 2:4 1 యోహాను 38:1,16 చూడండి. 17:24 విశ్వాసుల పక్షంగా క్రీస్తు చేస్తున్న నాలుగో విన్నపం ఇది. విశ్వాసులంతా భద్రంగా తన సన్నిధి చేరి ఆయన మహిమను చూడగలిగేలా చెయ్యవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు. క్రీస్తు చేసిన ఇతర ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించినట్టుగానే ఈ (ప్రార్థన కూడా అంగీకరించాడు, దాని ప్రకారం చేస్తాడు. క్రీస్తు ప్రార్థనలంటే నెరవేరేందుకు గానీ నెరవేరకపోయేందుకు గానీ అవకాశం ఉన్నవి కాదు. ఇలా జరిగితే బావుణ్ణు అని వెలిబుచ్చిన ఆశలు కావు. అవి దేవుని సంకల్పానికి అనుగుణంగా ఆయన (ప్రియ కుమారుడు చేసిన విన్నపాలు, గనక తప్పక నెరవేరుతాయి.

“మహిమ” - ఇది విశ్వాసుల రక్షణ విధానంలో ఆఖరు మెట్టు. క్రీస్తు దీనికోసం ప్రార్ధించాడు కాబట్టి అది జరిగిపోయినట్టే దేవుడు లెక్కిస్తున్నాడు. రోమ 8:29,30; ఎఫెసు 2:6. ఈ వచనంలో లోక సృష్టికి మునుపే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ప్రేమించిన విషయం చూడండి. తండ్రి, కుమారుడు వేరువేరు వ్యక్తులనీ, వారి మధ్య శాశ్వత (ప్రేమ ఉందనీ మళ్ళీ చూస్తున్నాం.

17:25 బైబిలంతటా కనిపించే రెండు సత్యాలను క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు కేవలం న్యాయవంతుడు, మనుషులకు సాధారణంగా ఆయనను ఎరుగరు (1:10; 8:19,55; 15:21; 16:3).

17:26 క్రీస్తు తన విశ్వాసుల్లో నివసించడానికీ, తండ్రి అయిన దేవుని గురించి ఆయన వారికి వెల్లడించిన దానికీ సంబంధం ఉంది. ఒకటి లేకుండా వేరొకటి లేదు. ఇలా వెల్లడి చేసిన విషయం గురించి వ 6; మత్తయి 11:27 చూడండి. క్రీస్తు పట్ల దేవునికున్న (ప్రేమ విశ్వాసుల్లో కూడా ఉన్న సంగతి కూడా గమనించండి (రోమ్‌ 5:5; 2 కొరింతు 5:14; 1 యోహాను 2:5; 4:12,16).

18:1 కెద్రోను లోయ జెరుసలంకు తూర్పున నగరానికీ,

ఆలీవ్‌ కొండకూ మధ్యన ఉంది. ఇక్కడ చెప్పిన తోట గెత్‌సెమనే తోట (మత్తయి 26:36). అక్కడ జరిగిన ఇతర సంఘటనల కోసం మత్తయి 26:86-40 చూడండి. 18:3 మత్తయి 26:47. మత్తయి £26:48,49లో చెప్పిన సంఘటన ఇప్పుడైనా జరిగి ఉండాలి, లేదా 8వ వచనంలో యేసు పలికిన మాటల తరువాతైనా జరిగి ఉండాలి. 18:4 “తన మీదికి” - 3:14; 6:64 18:1,3,11,18; మత్తయి 16:21. 18:5 ఆయన పారిపోయే ప్రయత్నమేమీ చెయ్యలేదు. ధైర్యంగా తన శత్రువుకు ఎదురు నిలిచాడు. తన సమయం వచ్చిందని ఆయనకు తెలుసు (7:30; 17:1). ఆయన స్వచ్చందంగా తనకు తాను తన ప్రాణాన్ని ఇస్తున్నాడు (10:17,18).

“నేనే ఆయనను” - మూల భాషలో “నేను ఉన్నాను”, లేదా “నేను ఉన్నవాడను.” 8:24, 58 నోట్స్‌ చూడండి. 18:6 క్రీస్తుతో దేవుని బలప్రభావాలు ఉండి సైనికులను వెనక్కు పడవేయకపోతే వారలా పడిపోయేవారు కాదు. యేసు తాను తలచుకుంటే శత్రువులను అవలీలగా ఓడించి తప్పించుకోగలిగేవాణ్ణిని ఇక్కడ చూపించాడు. మత్తయి 26:58 పోల్చి చూడండి. 18:8 ఈ గొప్ప పరీక్ష సమయంలో ఆయన తన శిష్యుల గురించి శ్రద్ధ వహించాడు (13:1 పోల్చి చూడండి). 18:9 6:39; 17:12 చూడండి. అక్కడ ఆయన మాటలకు అర్ధం వారిని ఆధ్యాత్మికంగా కాపాడడం, వారు దారి తప్పి నాశనం కాకుండా చూడడం. ఇక్కడైతే శారీరకమైన ప్రమాదం, పరీక్షనుంచి ఆయన వారిని కాపాడిన అర్థం వస్తుంది. కానీ ఇదేమీ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. తన ప్రజలను ఆధ్యాత్మికంగా తప్పిపోయి నాశనం కాకుండా ఉంచడం కోసం వారు సహించలేనంత విషమ పరీక్షలు, దుష్‌పేరణలనుంచి కాపాడుతుంటాడు (1 కొరింతు 10:13). 18:10 మత్తయి 26:51-54. 18:11 మత్తయి £6:39,42.

12 అప్పుడు ఆ సైనికుల గుంపు, వారి అధిపతి, యూదుల ఉద్యోగులు ఆయనను పట్టుకొని బంధించారు. 18 మొట్టమొదట క్రయపకు మామ అయిన అన్నా అనేవాడి దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళారు. ఆ సంవత్సరం కయప (ప్రముఖ యాజిగా ఉన్నాడు. 14 (ప్రజలకోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకు సలహా చెప్పినది ఈ కయపే.

15 సీమోను పేతురు, మరో శిష్యుడు యేసువెంట వెళ్ళారు. ఆ శిష్యుడు ప్రముఖ యాజికి తెలుసు, గనుక ప్రముఖయాజి ముంగిటిలోకి యేసు వెంట వెళ్ళాడు. 16 పేతురైతే బయట ద్వారం దగ్గర నిలిచాడు. అందుచేత (ప్రముఖ యాజికి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారానికి కాపలా ఉన్న ఆమెతో మాట్లాడి పేతురును లోపలికి తెచ్చాడు. 17 ద్వారం కావలి కాస్తున్న ఆ పనిపిల్ల పేతురుతో “మీరు కూడా ఆ మనిషి శిష్యులలో ఒకరు కదూ!” అంది.

అతడు “కాను” అన్నాడు.

18 దేవాలయం ఉద్యోగులూ పని మనుషులూ అక్కడ నిలబడి ఉన్నారు. చలిగా ఉంది గనుక మంట వేసుకొని చలికాచుకొంటున్నారు. పేతురు వారితో నిలుచుండి చలికాచుకొంటున్నాడు.

19 ఇంతలో, ప్రముఖయాజి ఆయన ఉపదేశాన్ని గురించీ శిష్యులను గురించీ యేసును ప్రశ్నించాడు.

£20 యేసు అతడికిలా జవాబిచ్చాడు: “నేను బాహాటంగా లోకానికి చెప్పాను. యూదులు ఎప్పుడూ సమకూడే సమాజ కేంద్రాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా నేనేమీ చెప్పలేదు. 21 మీరు నన్ను ప్రశ్నించడమెందుకు? నా బోధ వినృవారిని నేను వారికి చెప్పిన దాని గురించి అడుగు. నేను చెప్పినది వారికి తెలుసు.

£22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, దగ్గర నిలుచున్న అధికారి ఒకడు ఆయనను అరచేతితో చెంపదెబ్బ కొట్టి “ప్రముఖ యాజికి ఇలా జవాబిస్తున్నావేమిటి!” అన్నాడు.

28 యేసు జవాబిస్తూ “నేను చెప్పినదానిలో దోషం ఉంటే ఆ దోషం ఏదో సాక్ష్యం చెప్పు. అది సరిగా ఉంటే నన్ను కొట్టడం ఎందుకు?” అన్నాడు.

£24 అప్పుడు అన్నా ఆయనను కట్లతోనే ప్రముఖయాజి అయిన కయప దగ్గరకు పంపాడు.

£25 సీమోను పేతురు ఇంకా నిలచుండి చలి కాచుకొంటున్నాడు. అక్యడున్నవారు అతనితో “మీరు కూడా ఆయన శిష్యులలో ఒకరు కారా?” అన్నారు.

అతడు ఒప్పుకోలేదు, “నేను కాదు” అన్నాడు.

26 పేతురు ఎవడి చెవి నరికివేశాడో అతడి చుట్టాల్లో ఒకడు (ప్రముఖయాజికి సేవకుడుగా ఉన్నాడు. అతడు పేతురుతో “మీరు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27 మరోసారి పేతురు కాదన్చాడు. తక్షణమే కోడి కూసింది.

28 యూదులు యేసును కయప దగ్గరనుంచి రోమన్‌ అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు. అప్పటికి ఉదయం అయింది. వారు మాత్రం అపవిత్రం కాకుండేలా భవనంలో (ప్రవేశించలేదు. ఎందుకంటే, పస్కాను తినాలని ఉన్నారు. £29 అందుచేత రోమన్‌ అధివతి పిలాతు బయటికి వారిదగ్గరకు వచ్చి “ఈ మనిషిపై మీరు మోపే నేరం ఏమిటి?” అని అడిగాడు.

80 “ఇతడు నేరస్థుడు కాకపోతే ఇతణ్ణి మీకు అప్పగించేవారం కాము” అని వారు అతనికి బదులు చెప్పారు.

31 పిలాతు వారితో “మీరే అతణ్ణి తీసుకువెళ్ళి మీ

18:12,18 యేసును కయప దగ్గరికి తీసుకుపోకముందు అన్నా దగ్గరికి తీసుకువెళ్ళిన సంగతి యోహాను మాత్రమే రాశాడు. అన్నా కూడా ప్రముఖ యాజిగా ఎంచబడ్డాడు (లూకా 3:2; అపొ కా 4:6).

18:14 11:49-52 చూడండి.

18:15 ఈ మరో శిష్యుడెవరో బైబిలు మనకు చెప్పడం లేదు. కానీ ఇతడు యోహానని అనేకమంది బైబిలు పండితులు నమ్ముతారు. 20:2,3,4,8 చూడండి.

18:17 18:38; మత్తయి 26:69-75.

18:19 యేసుపై నేరం మోపేందుకు ఏదో ఒక వంకకోసం చూస్తున్నాడు. ఈ ప్రముఖ యాజి యూద ధర్మశాస్త్రం ప్రకారం ఈ న్యాయ విచారణ జరపడం లేదు. ముందుగా నేరం మోపబడినివాని పక్షంగా సాక్ష్యం పలికేవారిని పిలవాలి. ఆ పైన నేరం మోపేందుకు సహకరించే సాక్షులను పిలవాలి. 18:20,21 వారు యూద న్యాయ నియమానికి కట్టుబడి సాక్షులను పిలవాలని యేసు ఉద్దేశం. ఆయన బహిరంగంగానే ఉపదేశించాడు. చాలమంది విన్నారు. ఆయన తన శిష్యులకు మాత్రమే ఏకాంతంగా చెప్పిన సంగతులు కూడా ఆయన బహిరంగంగా చెప్పినవాటికి భిన్నమైనవి కావు.

18:22 ఇది కూడా చట్టానికి వ్యతిరేకమే.

18:28 ధర్మశాస్త్రానికి సంరక్షకులమని చెప్పుకొనేవారు. దాని (ప్రకారంగానే విచారణ జరిపించాలని యేసుప్రభువు మళ్ళీ చెప్తున్నాడు.

18:24 కయప అదే భవనంలో వేరొక భాగంలో ఉండి ఉంటాడని అనుకోవచ్చు. ఆ భవనం (ప్రముఖ యాజి నివాసం

(వ 15). 18:25-27 మత్తయి 26:71-75. 18:28 మత్తయి 27:1,2.

“పస్యా” - నిర్గమ 12 అధ్యాయం. ఈ యూదుల కపట బుద్ధి చూడండి. వారు దేవుని కుమారుణ్ణి హతమార్చడానికి కుట్ర పన్నారు. ఆయనపై నేరం రుజువు చేసేందుకు తమ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించారు. కానీ ఇక్కడేమో యూదుడు కానివాడింట్లో ప్రవేశిస్తే మైలబడిపోతామని కంగారు పడుతున్నారు (యూదులు రోమ్‌వారినీ యూదేతరులందరినీ వారి గృహాలనూ “అశుద్ధం”గా ఎంచేవారు. అపొ కా 10:28 పోల్చి చూడండి). హృదయంలోని పాపం మూలంగా అంటుకునే భయంకరమైన అశుద్ధతకన్నా ఇలాంటిదాని గురించే వారికి ఎంతో ఎక్కువ (శ్రద్ధ (మత్తయి 15:1,2,16-20; 23:25-28 పోల్చి చూడండి). సరిగ్గా ఇలాంటివారే నేడు చాలామంది మతస్థులు ఉన్నారు. ఆచారాల విషయంలో బహు నిష్టగా ఉంటారు. కానీ నీతి నిజాయితీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. యెషయా 1:11-17 కూడా చూడండి.

18:29 “నేరం ఏమిటి” - తీర్చుకోసం వారు యేసును పిలాతు దగ్గరికి తెచ్చారు. గనక పిలాతు ఇలా అడగడం సమంజసమే.

18:30 ఇది అర్థం లేని జవాబు. ఇసుమంతైనా రుజువు లేకుండా ఈ కపట భక్తులు యేసుప్రభువును ఏమంటున్నారో చూడండి - “నేరస్తుడు”.

ఛి

18:31 దేశాన్ని పరిపాలించే రోమ్‌వారు కొన్ని రకాల నేరస్థులను యూదులే విచారించే అధికారం వారికి ఇచ్చారు గానీ

↑ Back to top

↑