Part 11 of 14

యోహాను శుభవార్త – భాగము 10 (పుటలు 57–62)

యోహాను శుభవార్త – భాగము 10 (పుటలు 57–62)

ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు చేయ గలిగేదేమీ లేదు. 6 ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగెలాగా పారవేయబడి ఎండిపోతాడు. అలాంటి తీగెలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి.

7 “మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు. అది మీకు చేయబడుతుంది. 8 మీరు సమృద్ధిగా ఫలిస్తూ ఉండడంవల్ల నా తండ్రికి మహిమ చేకూరుతుంది. అలా మీరు నా శిష్యులుగా ఉంటారు.

9 “తండ్రి నన్ను (ప్రేమించినట్టే నేను మిమ్ములను (ప్రేమించాను. నా (ప్రేమలో నిలిచి ఉండండి. 10 నా తండ్రి

ఆజ్ఞలు పాటిస్తూ నేను ఆయన (ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే నా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు. 11 నా ఆనందం మీలో ఉండాలనీ మీ ఆనందం సంపూర్ణంగా ఉండాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను. 12నా ఆజ్ఞ ఇదే: నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు (ప్రేమించుకోవాలి. 18 తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం ధారపోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు. 14 నేను మీకిచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు. 15 ఇకమీదట మిమ్ములను దాసులని పిలవను. ఎందుకంటే, తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు. నేను నా తండ్రిచేత వినేదంతా మీకు తెలియజేశాను గనుక

లేవు, ఆయన జీవం వాటిద్వారా ప్రవహించడం లేదు.

15:6 (ద్రాక్షతీగెనుంచి కత్తిరించి తీసివేసిన కొమ్మలు ఏమవుతాయో చెప్తున్నాడు. కొందరు విశ్వాసులు తనలో నిలిచి ఉండకపోవచ్చుననీ, వారు నరకాగ్నిలో కాలిపోతారనీ ఆయన అనడం లేదు. నరకం అవిశ్వాసులకు పట్టే గతి. మత్తయి 3:10,12; (ప్రకటన 21:8 చూడండి. ఏ విశ్వాసి అయినా అది తనకు సంభవిస్తుందేమోనని భయపడితే అతడు క్రీస్తు ఉపదేశించిన సత్యాన్నంతటినీ గట్టిగా చేపట్టి ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు అతడు పడిపోయే అవకాశం ఉండదు. 15:7 “మీకేది ఇష్టమో” - 14:13,14; కీర్తన 37:4 పోల్చి చూడండి. విశ్వాసులు లోకం దృష్టిలో లక్ష్యాన్ని సాధించినవారుగా కనిపించేందుకూ, ధనికులైపోయేందుకూ, ఈ భూమిపై ఉన్న విలాసాలూ, సౌఖ్యాలు అన్నిటినీ అనుభవించేందుకు అనుసరించవలసిన పద్ధతిని యేసు ఇక్కడ చెప్పడం లేదు. ఆధ్యాత్మిక విజయానికీ, కార్యసాధకమైన (ప్రార్థనకూ మార్గాన్ని సూచిస్తున్నాడు. ఒక విశ్వాసి హృదయంలో క్రీస్తు మాటలు ఏలుతూ ఉంటే అతని కోరికలు పవిత్రాత్మ అధీనంలో ఉంటాయి. క్రీస్తు అతనికి ఏం కలగాలని కోరుకుంటాడో అతడు కూడా అదే కోరుకుంటాడు. క్రీస్తు మాటలు ఎవరినైతే పరిపాలిస్తున్నాయో ఆ విశ్వాసులు క్రీస్తు నేర్పినట్టుగానే ప్రార్ధిస్తారు (ఉదాహరణకు మత్తయి 6:9-138). కొలస్సయి 3:16,17; 1 యోహాను 5:14,15 పోల్చి చూడండి.

15:8 ఫలించడం ఫలించేవాడి గౌరవంకోసం కాదు, దేవుని మహిమ నిమిత్తమే. వేరే మాటల్లో చెప్పాలంటే విశ్వాసుల్లో తన పనిద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. మత్తయి 5:16; 1 కొరింతు 1:31; 4:7; 10:31; ఫిలిప్పీ 1:11 పోల్చి చూడండి. ఎవరైనా తన సాఫల్యతగా ఎంచినదాన్ని బట్టి మనుషుల గౌరవాన్ని వెదికితే దేవుడు కోరుతున్న ఫలాలను అతడు ఇవ్వడం లేదన్నమాట.

15:9 5:20 చూడండి.తన (ప్రజలపట్ల క్రీస్తు (ప్రేమ ఆయనపట్ల తండ్రి (ప్రేమవంటిది గనక అది లోతైనది, వాస్తవమైనది, శాశ్వతమైనది, వర్ణించశక్యం గానంత

అద్భుతమైనదని నిస్సందేహంగా భావించవచ్చు.

“నా (ప్రేమలో నిలిచి ఉండండి” - యూదా £21. కావాలని మనసులో నిర్ణయం చేసుకుని ఆయన ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా విధేయత చూపడం అనేదాన్ని ఇది నిస్సందేహంగా తెలియజేస్తున్నది. విశ్వాసుల అనుదిన జీవితాల్లో దేవుడు న్యాయంగా వారిపట్ల తన (ప్రేమను ప్రదర్శించే రీతిలో వారు ప్రవర్తించాలని దీని అర్థం.

15:10 1415,21,28. క్రీస్తును ప్రేమించేవారు. ఆయన ఆజ్ఞలు పాటిస్తారు. అలా పాటించేవారు ఆయన (ప్రేమలో నిలిచి ఉంటారు. ఈ (ప్రేమ వలయంలో ఉన్నవారికి ఇది చాలా

అర్థవంతంగా అనిపిస్తుంది. బయట ఉన్నవారికి ఇదేమీ అర్థం కాదు. దేవుని ప్రేమ అనే ఈ నివాసంలో విశ్వాసులు స్థిరపడిపోవాలి, ఆ నివాసానికి యజమాని అయిన దేవుడు చెప్పినది చేస్తూ ఉండడం ద్వారా ఆయనతో రోజురోజుకూ పరిచయం పెంచుకుంటూ ఉండాలి. క్రీస్తే విధేయత మూలంగా తండ్రి ప్రేమలో నిలిచాడన్న సంగతి గమనించండి. విశ్వాసులు కూడా ఇదే మార్గాన ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. కొందరు విశ్వాసులు ఇతరులకన్న ఎక్కువ విధేయత చూపుతుంటారు అనడంలో సందేహం లేదు. బహుశా ఎవరూ కూడా ఎల్లప్పుడూ సంపూర్ణ విధేయత కనపరచరు, అలాగని పూర్తి అవిధేయతా కనపరచరు (యాకోబు 38:2). వారెంతవరకు విధేయత చూపుతారో ఆ మేరకు క్రీస్తు (ప్రేమను అనుభవించి ఆనందించగలుగుతారు.

15:11 యేసు దుఃఖానికి గురి అయినవాడు (యెషయా 58:3). శుభవార్తల్లో ఆయన ఏడ్చాడని రాసి ఉంది (11:35; లూకా 11:41) గానీ నవ్వాడని మాత్రం ఎక్కడా రాసిలేదు. ఆయనలో ఆనందం ఉందా? తప్పకుండా బయటి పరిస్థితులతో ఏమీ సంబంధం లేని లోతైన ఆనందం ఆయన అంతరంగంలో ఉంది (17:13; లూకా 10:21). దేవుని సంకల్పానికి పరిపూర్ణ విధేయత మూలంగా కలిగిన అనందం అది (4:34 చూడండి). తన ప్రజలంతా ఈ ఆనందాన్ని అనుభవించాలని ఆయన కోరిక. అందుకు విధేయత ఒక్కటే మార్గం. అవిధేయతను బట్టి మీ అంతర్వాణి అస్తమానం మిమ్మల్ని ఖండిస్తూ ఉంటే ఇక

ఆనందమెక్కడిది?

15:12 18:34. వారి హృదయాల్లో నాటుకొనేందుకు మళ్ళీ చెప్తున్నాడు.

15:18 స్వయంగా తానే ఏమి చెయబోతున్నాడో దాన్ని

గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 10:11,17,18 చూడండి. ఆయన శత్రువుల కోసం కూడా చనిపోయాడు (రోమ్‌ 5:6-10). కానీ ఇక్కడి విషయం అది కాదు. ఆయన తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. వారిపట్ల ఆయనకున్న (ప్రేమకు తన (ప్రాణాన్ని ధారపోయడమే అన్నిటికన్నా ఖచ్చితమైన రుజువు అని చెప్తున్నాడు. 1 యోహాను 3:16 చూడండి.

15:14 అవతారమెత్తిన దేవుడు స్నేహితుల కోసం చూస్తున్నాడు. తనతో నిజమైన స్నేహం ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. అది విధేయతే. అంటే ఇది సమానుల మధ్య స్నేహం కాదు. ఒకరు పరలోకనుంచి వచ్చిన (ప్రభువు, మరొకరు ఆయన్ను అనుసరించేందుకు పిలవబడిన మానవ మాత్రులు. తిరుగుబాటు, అవిధేయత ఇవి స్పేహానికి కాక దేవునితో శత్రుత్వానికే గుర్తులు. యేసు వివరిస్తున్న స్నేహంలో ఏక మనసు, ఏక హృదయం, ఏక ఉద్దేశం అవసరం.

15:15 క్రీస్తు శిష్యులు తప్పక లొంగి ఉండవలసిన మిమ్ములను మిత్రులు అన్నాను.

16 “మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను మిమ్ములను ఎన్న్సుకొన్నాను, మిమ్ములను నియమించాను. మీరు వెళ్ళి ఫలించాలనీ మీ ఫలం నిలిచి ఉండాలనీ నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకివ్వాలనీ నా ఉద్ధేశం. 17 ఇవి మీకు అదేశిస్తున్నాను: మీరు ఒకరినొకరు (ప్రేమించుకోవాలి.

18 “లోకం మిమ్ములను ద్వేషిస్తే, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు. 19 ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది. కానీ మీరు లోకానికి చెందినవారు కారు. మిమ్ములను లోకంలోనుంచి

ఎన్నుకొన్నాను. లోకం మిమ్ములను ద్వేషించే కారణం ఇదే. 20 నేను మీతో చెప్పిన ఈ మాట జ్ఞాపకముంచుకోండి - “దాసుడు తన యజమానికంటే మించినవాడు కాడు.” వారు నన్ను హింసించారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు. £21 అయితే నన్ను పంపినవాణ్ణి వారు ఎరుగరు గనుక నా పేరుకారణంగా అవన్నీ మీపట్ల జరిగిస్తారు. 22 ఒకవేళ నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. ఇప్పుడైతే వారికి పాపం విషయం సాకు ఏమీ లేదు. 28 నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24 మరెవరూ చేయని క్రియలు వారిమధ్య నేను చేసి ఉండకపోతే వారికి పాపం

పామరులైన బానిసలవంటివారు కారు. లోబడాలని కోరుతున్న జ్ఞానమున్న స్నేహితులు. తన ఉపదేశాలు తండ్రి అయిన డేవునినుంచి నేరుగా వచ్చినవని క్రీస్తు మళ్ళీ చెప్తున్నాడు - 7:16,17; 12:49; 17:6-8.

15:16 “ఎన్నుకొన్నాను” - మార్కు 1:16-20; 2:14; 3:18,14 చూడండి. ఎఫెసు 1:4 పోల్చి చూడండి. కానీ క్రీస్తు అలా వారిని ఎన్నుకోవడానికి వారు ఇష్టపడ్డారు.

“నిలిచి ఉండాలని” - దేవుని నిజ సేవకులంతా కోరేది ఇదే. కీర్తన 90:17 చూడండి. క్రీస్తు ఆదేశాలానుసారంగా ఆయనలో ఫలించేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

“నా పేర” - 14:138,14.

15:17 వ 12; 18:34. ఇది చాలా (ప్రాముఖ్యమైనదని నొక్కి చెప్పేందుకు మరోసారి చెప్తున్నాడు.

15:18,19 “లోకానికి” - అంటే నిజ దేవునికి విధేయత చూపని అవిశ్వాస లోకం. 1 యోహాను 2:16; 5:19 చూడండి. ఆ లోకం చీకటిలో ఉంది, అక్కడే ఉండిపోవాలనుకుంటున్నది.

“ద్వేషిస్తే” - లోకం ద్వేషిస్తూ ఉన్న క్రీస్తు వెలుగును క్రీస్తు శిష్యులు తీసుకువెళ్ళేవారు (8:19,20; మత్తయి 5:14). వారు దేవునికి చెందినవారు, లోకానికి చెందినవారు కారు. ఏకైక నిజ దేవుణ్జీ ఆయనకు చెందిన అందరినీ అన్నిట్రినీ ద్వేషించడమే పాపానికున్న అసలు స్వరూపం. కాబట్టి క్రీస్తు శిష్యులు పట్ల లోకం విరోధ భావంతో వైరంతో ఉండడం ఆశ్చర్యం కాదు. అలా లేకపోతేనే ఆశ్చర్యపడవలసి వస్తుంది. కీర్తన 37:12; సామెత 29:27; ఆమోసు 5:10; 1 యోహాను 3:12. దేవుణ్జీ, ఆయన కుమారుణ్జీ ద్వేషించే లోకం దేవుని సొంత ప్రజలను [ప్రేమించదు. మనం క్రీస్తు వారమని చెప్పుకుంటుంటే లోకం మనల్ని ప్రేమిస్తే మనం కంగారు పడాలి. ఎందుకంటే మనం నిజంగా క్రీస్తుకు చెందినవారం కామనీ, లోకానికి చెందిన వారమేననీ అనుకోవడానికి ఇది ఆధారం. కానీ మనం క్రీస్తు వారమని లోకం మనల్ని ద్వేషిస్తే దాన్ని ఒక గౌరవంగా ఎంచుకోవాలి (1 పేతురు 4:14-16). లోకం మనల్ని ఏ కారణాన్ని బట్టి అయితే ద్వేషిస్తున్నదో, దేవుడు ప్రత్యేకమైన ప్రేమ మనపట్ల చూపడానికి అదే కారణం అని మనం తెలుసుకోవాలి. 15:20 18:16 చూడండి. క్రీస్తు భరించినదాని కన్నా మంచి స్థితి తమకుండాలని తలంచే హక్కు క్రీస్తు సేవకులకు లేదు (1 పేతురు 4:1). దేవుని (ప్రజలను హింసించడం ద్వారా లోకం కొన్ని సార్లు దాని ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటుంది. కానీ లోకంలో కొందరు వ్యక్తులు మాత్రం క్రీస్తు ఉపదేశాలను శిరసావహిస్తారు. అపొ కా (గ్రంథంలో ఈ రెండు సత్యాలను కూడా ఉదాహరణలు చూడవచ్చు.

15:21 లోకంలో దేవుళ్ళు, ప్రభువులు పుష్కలంగా ఉన్నారు గాని ఏకైక నిజ దేవుడు లోకానికి తెలియదు (8:19,55;

16:3; అపొ కా 17:22,23; 1 కొరింతు 1:21; ఎఫెసు 4:18). ఇలా తెలియకపోవడం అద్వైత వేదాంతంలో చెప్పిన అజ్ఞానం వంటిది కాదు. అద్వైత వేదాంతంలో మనిషి ఆత్మ, దేవుని ఆత్మ ఒకటేననీ, ఇది తెలియక మనుషులు ఆత్మసంబంధమైన దాస్యంలో ఉన్నారనీ, ఆ జ్ఞానమే వారికి విముక్తి ఇస్తుందనీ సిద్ధాంతం. ఈ ఉపదేశమంతా బైబిలు సత్యానికి పూర్తిగా విరుద్ధం. 10:30 మొ! కూడా చూడండి. 15:22 “పాపం ఉండేది కాదు” - క్రీస్తు వచ్చినా రాకపోయినా మనుషులు పాపులే (రోమ్‌ 3:9-19,28; 5:12). ఆయన్ను తృణీకరించిన యూదులు పాపంతో నిండి ఉన్నవారు (8:24,40,44; మత్తయి £28:3,18-15,25,28,82-86). కానీ తన కుమారుణ్ణి గనక వారు నిరాకరించకపోతే వారి పాప దోషాన్ని దేవుడు తన కరుణ చొప్పున చూచీ చూడనట్టు దాటివెళ్ళగలిగి ఉండేవాడు (రోమ్‌ 8:25). క్రీస్తును నిరాకరించడ మంటే క్షమాపణకు ఏకైక మార్గాన్ని నిరాకరించడమే. దేవుని ప్రత్యేక ప్రజ అయిన యూద జాతి (ద్వితీ 7:6) గురించి ఆయనిక్కడ మాట్లాడుతున్నాడు. వారి పాపాలనుంచి దాటిపోయి వారిని క్షమించేందుకు ఆయన కొన్ని బలి అర్చణలను నియమించాడు (లేవీ 17 అధ్యాయాలు). కానీ ఆయన దాటిపోలేని పాపమేమంటే వారు బుద్ధిపూర్వకంగా తననే తిరస్కరించడం (లేవీ 26:18,21,28; సంఖ్యా 15:30,81; ద్వితీ 80:15-20). క్రీస్తు వారిదగ్గరికి రావడం మరింకేది బయట పెట్టలేనంత స్పష్టంగా వారి గుణాన్ని బయటపెట్టింది. చీకటంటే వారికున్న ఇష్టం, దేవునిపట్ల వారి ద్వేషం తేటతెల్లమయ్యాయి (8:19,20). వారి మతం అనే ముసుగు వారి దుర్మార్గతను దాచి ఉంచలేకపోయింది. తాము చేస్తున్నది తమకు తెలియదనేందుకు వారికి ఎలాంటి సాకూ లేదు.

వెలుగును నిరాకరించడమంటే చాలా ప్రమాదకరమైన సంగతి అని మనం నేర్చుకోవాలి. సామెత 1:24-81; లూకా 12:47,48; 22 తెస్స 2:10-12. 15:28 ఇక్కడ తండ్రి అయిన దేవునికీ, దేవుని ఏకైక కుమారునికీ ఉన్న సంపూర్ణ ఐక్యత గురించి క్రీస్తు మళ్ళీ చెప్తున్నాడు - 10:80; 18:20; 14:9,10. వారిలో ఒకరిని (ప్రేమించి సేవించేవారు. మరో వ్యక్తిని కూడా ప్రేమించి సేవించినట్టే. అలానే ఒకర్ని తిరస్కరించి ద్వేషించేవారు, రెండోవ్యక్తిని తిరస్కరించి ద్వేషించినట్టే. 15:24 మోషే పాత ఒడంబడిక (ప్రవక్తలూ గొప్ప అద్భుతాలు చేశారు గానీ యేసు చేసినవి ఎవరూ చెయ్యలేదు. అంటే గుడ్డివారికి చూపు ఇవ్వడం, పిడికెడు ఆహారంతో గొప్ప జనసమూహాలకు ఆకలి తీర్చడం, నీళ్ళమీద నడవడం మొదలైనవన్నమాట. ఆయన పరలోకంనుంచి వచ్చిన దేవుని కుమారుడని ఘోషిస్తున్న రుజువులూ సాక్ష్యాధారాలన్నీ ఉండి ఉండేది కాదు. ఇప్పుడైతే వారు నన్నూ నా తండ్రినీ చూచి ద్వేషించారు. 25 వారి ధర్మశాస్త్రంలో ఇలా ప్రాసి ఉంది: “వారు నన్ను నిష్కారణంగా ద్వేషించారు.” ఈ మాట నెరవేరేలా ఈ విధంగా జరుగుతూ ఉంది.

£26 “నేను ఆదరణకర్తను మీ దగ్గరకు తండ్రినుంచి పంపుతాను. ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెపుతాడు. ఆయన తండ్రినుంచి బయలుదేరే సత్యాత్మ. 27 మీరు మొదటినుంచి నాతో ఉన్నారు గనుక మీరు కూడా సాక్ష్యం చెపుతారు.

16 తొట్రుపడకూడదని నేను ఈ విషయాలు మీతో చెప్పాను. 2 వారు మిమ్ములను సమాజ కేంద్రాలనుంచి వెలివేస్తారు. మిమ్ములను ఎవరైనా చంపితే తాను

దేవునికి సేవ చేస్తున్నట్టు అనుకొనేకాలం కూడా వస్తూ ఉంది. 3 వారు తండ్రినీ నన్నూ తెలుసుకోలేదు గనుక ఆ విధంగా మీకు చేస్తారు. 4 ఆ కాలం వచ్చేటప్పుడు ఈ విషయాలు మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వీటిని గురించి మీతో చెపుతున్నాను. మొదట్లో ఈ విషయాలు మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను.

5 “ఇప్పుడైతే నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్ళి పోతున్నాను గానీ నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?” అని మీలో ఎవరూ నన్ను అడగడం లేదు. 6 అయితే నేను ఈ విషయాలు మీతో చెప్పినందుచేత మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 అయినా నేను మీతో చెప్పేది సత్యమే - నేను వెళ్ళిపోవడం మీకు మేలు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిపోతే ఆయనను మీకు

కూడా (5:31-40) యూదులు ఆయన్ను తిరస్కరించారు. ఈ ఒక్క పాపం కారణంగానే వారి ఇతర పాపాలను దేవుడు క్షమించగలగడం అసాధ్యం అయింది. తరచుగా మనుషుల (భ్రష్ట హృదయాల్లో దేవునిపై ఉండే ద్వేషం దాగి ఉంటుంది గానీ వీరి విషయంలో అది బయటపడింది.

15:25 కీర్తన 85:19; 69:4. వారికి ఆయన ఏవిధంగానూ హాని చేయలేదు. మనుషుల్ని విమోచించి వారిని దేవుని శాశ్వత దీవెనల్లోకి తీసుకురావడమే ఆయన వచ్చిన కార్యం, యేసుప్రభువును తిరస్కరించి ద్వేషించడానికి సరైన కారణం ఎన్నడూ ఎవరికీ ఉండదు గదా.

15:26 “ఆదరణకర్త” - 14:16,17.

“పంపినప్పుడు” - క్రీస్తు దేవుడనడానకి ఇది మరో రుజువు. దేవుని ఆత్మను దేవుడు తప్ప వేరెవరు పంపగలరు? ఈ వచనంలోని త్రిత్వాన్ని గమనించండి. 14:26 పోల్చి చూడండి. మత్తయి 3:16 నోట్‌ చూడండి.

“సాక్ష్యం చెపుతాడు” - 16:14; రోమ్‌ 8:16; 1 యోహాను 5:6. దేవుని ఆత్మ మనుషుల మనసుల్లో హృదయాల్లో, అంతరాత్మల్లో సాక్ష్యం చెపుతాడు. అంతేగాక ఇతరులకు సాక్ష్యం చెప్పే వారితోనూ, వారిలోనూ పని చేస్తూ వారి సాక్ష్యాన్ని కార్య సాధకం చేస్తాడు (మత్తయి 10:20; 1 పేతురు 1:12). 15:27 “మీరు కూడా” - క్రీస్తు తన శిష్యులను ఎన్నుకుని వారిని ఈ లోకంలో వదిలిపెట్టిన ముఖ్య కారణాల్లో ఇది ఒకటి. అపొ కా (గ్రంథంలో దీని నెరవేర్పు చూడండి (అపొ కా 1:8; 2:32; 38:15; 5:82; 10:39,41; 18:31). 18-21 వచనాల్లో ఆయన చెప్పిన ద్వేషానికీ హింసకూ వారు భయపడకూడదు. మొదటి నుంచి ఆయన చేసినదంతా వారు చూశారు, చెప్పినదంతా విన్నారు. సాక్షులుగా ఉండేందుకు వారు పూర్తిగా తగినవారు (అపొ కా 1:21,22; 2 పేతురు 31:16-18).

ఈ 1ర్‌వ అధ్యాయంలో క్రీస్తు శిష్యుల అధిక్యతలు, బాధ్యతలు ఇక్కడ మూడు సంబంధాల రూపంలో చూస్తున్నాం - వారు క్రీస్తులో నిలిచి ఉండాలి (వ 4), ఒకరినొకరు ప్రేమించాలి (వ 12), లోకానికి సాక్ష్యం చెప్పాలి.

16:1 బాధలు వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోకుండా తమ నమ్మకంలో తొట్రుపడకుండా ఉండాలని వారికి ఏమి జరగనున్నదో ఆయన ముందే తెలియజేస్తున్నాడు. వ 33; అపొ కా 14:22; 2 తిమోతి 3:12; 1 పేతురు 4:1. ఈ హెచ్చరికలు మనకోసం కూడా.

16:2 9:22; 12:42 చూడండి.

“సమాజ కేంద్రం” - మత్తయి 4:28. క్రీస్తు సేవకులను హతమార్చడం దేవునికి సేవ చెయ్యడంతో సమానంగా మతస్థులు భావించడం సాధ్యమేనా? మనుషుల తలంపులు అంత వక్రంగా అయిపోవడం సంభవమేనా? అవును. యూదులు ఏమి చేస్తారని యేసు చెప్పాడో సరిగ్గా అదే చేశారు. మత్తయి 28:84; అపొ కా 7:54-60; 8:38; £26:9-11; 1419. నాటి నుంచి ఇదే సంగతి అనేక మార్లు జరగలేదా? లెక్కలేనన్ని సార్లు జరిగింది - ఇంకా జరుగుతూనే ఉంది.

16:8 మతం పేరట జరిగిన అనేకమైన నేరాలకు మూల కారణం ఇదే - నిజ దేవుణ్ణి ఎరుగకపోవడం. 8:19,41-44; 15:21. అనేకమందికి దేవుడు తెలియక పోయినా తెలుసుననుకుంటారు. కొందరైతే దేవుణ్ణి గురించి తమ తప్పుడు అభిప్రాయాలను నిలబెట్టుకునేందుకు ఆ అభిప్రాయాలను ఎదిరించి సత్యం చెప్పేవారిని చంపేసేటంత దూరం వెళ్తారు. ఈ విధంగా తాము దేవుణ్ణి సేవిస్తున్నామనుకుంటారు! యిర్మీయా 17:9; మత్తయి 15:19; తీతు 1:16 చూడండి.

16:4 ఆయన వారితో ఉన్నంత కాలం మనుషులు తమ కోపాన్న్నీ, ద్వేషాన్నీ ఆయనమీదికి (ప్రయోగించారు. ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తరువాత ఆ కోపం, ద్వేషం అంతా ఆయన శిష్యులమీదికి తిరుగుతుంది.

16:5 “నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?” అని పేతురు అడిగాడు (13:36) గానీ యేసు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడన్న ఆశ్చర్యం మాత్రమే ఆ ప్రశ్నలో ఉంది. యేసు వెళ్తున్నదెక్కడికో తెలుసుకోవాలన్న విచారణ ఆ ప్రశ్నలో లేదు. అతడు (ఇతర శిష్యులు కూడా) యేసుతో ఎడబాటు గురించి (వ 6) మనసులో నెమ్మది లేకుండా ఉన్నాడు.

16:7 క్రీస్తు శారీరికంగా మనతో ఉండడంకన్నా మేలైనది ఏదన్నా ఉందా? “లేదు” అనేవారే ఆయన శిష్యులు. “ఉంది” అంటున్నాడు యేసు. కారణం? క్రీస్తు చనిపోయి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోకుంటే పవిత్రాత్మ (ఆదరణకర్త - 14:26) వారిలో నివసించేందుకు వచ్చేవాడు కాదు. వారు చేయవలసిన పనికోసం వారిని బలప్రభావాలతో అభిషేకించేవాడు కాదు. 7:39 పోల్చి చూడండి. క్రీస్తు శారీరికంగా వారితో ఉండడం కంటే ఆయన ఆత్మ వారిలో ఉండడం ఇంకా మంచిది. తాను వెళ్ళిపోకముందే ఈ విధంగా వారికి ఆత్మను ఎందుకు అనుగ్రహించ లేకపోయాడో చెప్పలేదు. ఇది దేవుని నిర్ణయం, ఏర్పాటు అని తెలుసుకుంటే చాలు మనకు. ఆత్మను ప్రసాదించడం అనేది క్రీస్తు మరణం, పునర్జీవితం, ఆరోహణపై అధారపడి ఉందని అందరికి స్పష్టం కావాలని ఆయన ఉద్దేశం కావచ్చు.

పంపుతాను.

8 “ఆయన వచ్చేటప్పుడు పాపాన్ని గురించీ న్యాయాన్ని గురించీ తీర్పును గురించీ లోకాన్ని ఒప్పిస్తాడు. 9 వారునా మీద నమ్మకం పెట్టడం లేదు, గనుక పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. 10 నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను, ఇకనుంచి మీరు నన్ను చూడరు గనుక న్యాయాన్ని గురించి ఒపమ్పిస్తాడు. 11 ఈ లోక పాలకుడికి తీర్పు జరిగింది గనుక తీర్చును గురించి ఒప్పిస్తాడు.

12 “నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. 18 అయితే ఆయన - సత్యాత్మ - వచ్చేటప్పుడు మిమ్ములను

సర్వ సత్యంలోకి తీసుకువస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతో తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరగబోయేవి కూడా మీకు తెలియజేస్తాడు. 14 నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేసి నాకు మహిమ కలిగిస్తాడు. 15 తండ్రికి చెందేవన్నీ నావి. అందుచేతే నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను. 16 నేను తండ్రిదగ్గరికి వెళ్ళిపోతాను గనుక కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు, మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.”

17 అందుకు ఆయన శిష్యులలో కొందరు ఒకడితో ఒకడు ఇలా చెప్పుకొన్నారు: “ఆయన “కొద్ది కాలానికి మీరు నన్ను ఇక

16:8 తాను వెళ్ళిపోవడం మంచిదనడానికి యేసు దీన్ని మరో కారణంగా ఇస్తున్నాడు. పవిత్రాత్మ వచ్చి యేసు శరీరికంగా పరిచర్య చేసిన ఒక మారుమూల ప్రాంతంలోనే గాక లోకమంతటా మనుషులను ఒప్పించే పని చేస్తాడు. పాపం, నీతిన్యాయాలు, తీర్పు గురించిన సత్యాలను వారికి నేర్పిస్తాడు. ఈ విషయాల్లో వారికున్న పొరపాటు అభిప్రాయాలను బట్టి వారిని మందలిస్తాడు. యేసును గురించి యూదుల అభిప్రాయాలు పూర్తిగా తప్పనీ, క్రీస్తు, ఆయన పరిచర్య వారు ఊహించని దానికి పూర్తిగా భిన్నమనీ లోకానికి తెలియజేస్తాడు. పవిత్రాత్మ మనుషుల్ని ఇలా ఒప్పించినదాని ఫలితం అపొ కా £2:37లో చూడవచ్చు.

16:9 తమ అపనమ్మకంలో క్రీస్తును నిరాకరించి సిలువ వేసినవారు భయంకరమైన పాపం చేశారని పవిత్రాత్మ అంతటా ఉన్న మనుషుల్ని ఒప్పిస్తాడు. అంతేగాకుండా ఎవరైనా ఎక్కడైనా ఇష్టపూర్వకంగా ఆయన్ను నమ్మడానికి నిరాకరించడం పాపమనీ, పాపంయొక్క సారమే అనీ వ్యక్తులను ఒప్పిస్తాడు. బైబిల్లో అన్నిచోట్లా అపనమ్మకం నేరస్థాపనకూ, శిక్షకూ అర్హమని చెప్పడం

చూడవచ్చు - 3:18,86,; 8:24; మార్కు 16:14,16, 2 తెస్స 1:8; 2:12; హీబ్రూ 3:12,18; 4:11; 11:31; యూదా 5; (ప్రకటన 21:8. అయితే పవిత్రాత్మ మాత్రమే ఈ

విషయం మనుషుల్ని ఒప్పించగలడు.

16:10 దీని అర్ధం ఇది కావచ్చు - క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత, క్రీస్తు మోసగాడు కాదనీ (యూదులు చెప్పినట్టు, దేవదూషకుడు కాదనీ, పూర్తిగా న్యాయవంతుడనీ పవిత్రాత్మ మనుషుల్చి ఒప్పిస్తాడు. అపొ కా 3:14,15 పోల్చి చూడండి. అంతేగాక నీతిన్యాయాల విషయంలో మనుషులకు వ్యక్తిగతంగా ఉన్న అవసరతను గురించి కూడా ఒప్పిస్తాడు. మనుషులను న్యాయవంతులుగా చేసేందుకు దేవుడు సిలువద్వారా ఒక మార్గాన్ని ఏర్పరచాడని కూడా తెలియజేస్తాడు. 16:11 “లోక పాలకుడు” - 12:81. క్రీస్తు సిలువ పాపంపై తీర్చు. పాపం ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్లా అది భయంకరమైన శిక్షకు తగినదని సిలువ తెలియజేస్తున్నది. పాపం ఎంత ఘోరమైనదంటే మనుషులను దానినుంచి విడిపించాలంటే దేవుని కుమారుని మరణం అవసరమైంది. సైతానులో ప్రాపమంతా రూపుదాల్చింది. అతడు మనుషుల్లో పాపాన్ని ప్రోత్సహించి దానిద్వారా వారిని ఏలుతాడు. సిలువపై పాపానికి తీర్పు తీర్చడంద్వారా సైతాను, వాడికి చెందినదంతా బహిరంగంగా తీర్పుకు గురైంది. అంటే పాపంలో నిలిచి ఉండే వారందరికీ, తనకు వ్యతిరేకంగా సైతాను పక్షం చేరే వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడని అది చెప్తున్నది. “తీర్చు” గురించి మత్తయి 10:15; అపొ కా 17:31; రోమ్‌ £2:2,16; 14:10; 2 పేతురు 2:9; (ప్రకటన 14:7; 20:11-15.

16:12 క్రీస్తు తన ప్రజలను క్రమక్రమంగా దేవుని లోతైన సత్యాలలోకి నడిపిస్తాడు. సత్యమంతా ఒకే సారి చెప్తే వారు ఇముడ్చ్బుకోలేరు గనక అలా చెప్పడు. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలను తరుచుగా ఆయన శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు గదా.

16:18 14:17,26. దేవుణ్ణి గురించి ఆయన రాజ్యం గురించీ తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించిన దానంతటినీ పవిత్రాత్మ శిష్యులకు నేర్పించాడు. ఈ సత్యాన్ని బయట పపెట్టినది క్రొత్త ఒడంబడిక (గ్రంథం. పవిత్రాత్మ ఇప్పుడు దేవుని వాక్కును వాడుకొంటూ ఒక్క సారే వెల్లడి అయిన సత్యాన్ని వ్యక్తిగతంగా విశ్వాసులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన వారిలో ఉంటూ వారి మనస్సులను వెలిగిస్తాడు (1 యోహాను 2:27; ఎఫెసు 1:17,18). ఇలాంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మ ఇచ్చె జ్ఞానప్రకాశాలను వెతకాలి. దాన్ని నేర్చుకునేందుకు ఆయనపై ఆధారపడాలి. దేవుడే ఉపదేశకుడుగా ఉండడం గురించి కీర్తన £25:8,4; మొ॥ నోట్స్‌ చూడండి.

“జరగబోయేవి” - పవిత్రాత్మకు భవిష్యత్తులో జరగబోయేవి తెలుసు. ఏఏ భవిష్యద్‌ విషయాలు తన ప్రజలకు తెలియాలని దేవుడు తలచుకున్నాడో వాటిని పవిత్రాత్మ ఆ శిష్యులకు తెలియజేశాడు. వారు ఆ సంగతులను మనకోసం తమ లేఖల్లోను, ప్రకటన (్రంథంలోను రాసిపెట్టారు.

16:14 15:26. యేసుప్రభువుకు మహిమ కలిగించని ఏ ఉపదేశమైనా దేవుని నుంచి వచ్చినది కాదు. మనం ఏ మత బోధన విషయంలో అయినా అది ఎలాంటిదో తెలుసుకోగలిగే మార్గం ఇదే. ఆత్మ క్రీస్తును గురించిన విషయాలను ఆయనకు చెందిన నిజ శిష్యులు అనుభవించేలా చేస్తాడు. 1 కొరింతు 2:9-16 పోల్చి చూడండి.

16:15 పవిత్రాత్మ తండ్రి అయిన దేవుణ్ణి గురించి ఏమీ వెల్లడి చేయడు అని యేసుప్రభువు ఉద్దేశం కాదు. ఆయనకు చెందినవాటిని గురించి మాట్లాడడమంటే తండ్రికి చెందిన వాటిని గురించి మాట్లాడ్డమే. అవీ ఇవీ ఒకటే. 17:10 చూడండి. ఈ వచనంలో త్రిత్వం కనిపిస్తున్న సంగతి గమనించండి. మత్తయి 8:16 నోట్‌.

16:16 ఇక్కడ రెండు అర్థాలకు అవకాశం ఉంది. యేసుప్రభువు చనిపోయి వారికి కనిపించకుండా సమాధిలో ఉంటాడు. మూడో రోజున సజీవంగా లేచి వారికి మళ్ళీ కనిపిస్తాడు. ఇది స్పష్టమే. కానీ ఒక వేళ ఆయన తాను పరలోకానికి వెళ్ళిపోయే సంగతి చెప్తున్నాడేమో. ఆ తరువాత శిష్యులు ఆయన్ను చూడరు. ఆయన రెండో రాకడ సమయంలో మళ్ళీ చూస్తారు. వ 10లోని మాటలు ఆ రెండో అభిప్రాయానికి ఆధారంగా ఉన్నట్టుంది. తరువాతి వచనాల్లో యేసుప్రభువు ఈ చూడరు. మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను గనుక అని మనతో చెపుతున్నదేమిటి? 18 ఆయన “కొద్దికాలం” అనడంలో అర్ధం ఏమిటి? ఆయన చెప్పేది ఏమిటో మనకు తెలియదు” అన్నారు.

19 వారు తనను అడగాలనుకొంటున్నారని తెలుసుకొని యేసు వారితో ఇలా అన్నాడు: “కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు. మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు అని నేను చెప్పిన దాన్ని గురించి ఒకరినొకరు విచారణ చేసుకొంటున్నారా? 20 మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు ఏడుస్తారు, శోకిస్తారు గానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు గానీ మీ దుఃఖం ఆనందంగా మారిపోతుంది.

21 “స్త్రీ ప్రసవిస్తూ ఉంటే, తన గడియ వచ్చినందుచేత బాధలు అనుభవిస్తుంది. శిశువు పుట్టినప్పుడు ఒకరు లోకంలో పుట్టడంవల్ల వచ్చిన సంతోషం మూలాన ఆ వేదన ఇంకా జ్ఞాపకం చేసుకోదు. 22 అలాగే ఇప్పుడు మీకు దుఃఖం ఉంది గాని నేను మిమ్ములను మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయాలకు ఆనందం కలుగుతుంది. మీ ఆనందాన్ని మీకు లేకుండా ఎవరూ తీసివేయరు. 28 ఆ రోజున మీరు నన్ను

ఏమీ అడగరు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు తండ్రిని నా పేర ఏది అడిగినా అది ఆయన మీకిస్తాడు. 24 ఇదివరకు మీరు నా పేర అడిగినది ఏదీ లేదు. అడగండి, మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.

25 “అలంకారిక భాషలో ఈ విషయాలు మీతో చెప్పాను. అయితే ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో నేను అలంకారిక భాషలో మీతో మాట్లాడక, తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెపుతాను. 26 ఆ రోజున నా పేర మీరు తండ్రిని అడుగుతారు. నేను మీకోసం తండ్రిని వేడుకొంటానని చెప్పడం లేదు. £7 ఎందుకంటే తండ్రి తానే మిమ్ములను (ప్రేమిస్తూ ఉన్నాడు. కారణమేమంటే మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని దగ్గరనుంచి వచ్చానని నమ్మారు. £28 నేను తండ్రి దగ్గరనుంచి బయలుదేరి లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచి తండ్రిదగ్గరకు వెళ్ళిపోతున్నాను.”

29 ఆయన శిష్యులు “ఇదిగో, ఇప్పుడు అలంకారిక భాషలో గాక, స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30 నీకు అన్ని విషయాలూ తెలుసుననీ నిన్ను ఎవరూ ఏమీ అడగనవసరం లేదనీ ఇప్పుడు తెలుసుకొన్నాం. నీవు దేవుని దగ్గరనుంచి వచ్చావని

రెండు అభిప్రాయాలను సూచిస్తూ మాట్లాడి ఉండవచ్చు. సిలువపై తన మరణానికి ముందు శిష్యులకొక సందేశమిచ్చాడు; ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న విశ్వాసులందరికీ ఒక

సందేశం ఇచ్చాడు.

16:18 అంతకుముందు అయోమయంగా అనిపించి కలవర పెట్టినవి క్రీస్తు మరణించి లేచిన తరువాత స్పష్టం అయ్యాయి.

16:20 క్రీస్తు మరణం ఆయన మిత్రులకు తీవ్ర వేదన, శత్రువులకు సంతోషం కలిగించింది.

16:21,22 క్రీస్తు మరణం తరువాతి దినాలు నూతన శకానికి నాంది వంటివి. శిష్యులు ఆ నవ యుగాన్ని ఆయన్ను చూచి సంతోషిస్తారు. ఆయన ఇచ్చే ఆనందం వారిలో ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది (15:11; 20:20; లూకా 24:52; రోమ్‌ 14:17). ఒక విధంగా చూస్తే పరలోకంనుంచి క్రీస్తు రాకడకోసం ఇప్పుడు ఎదురుచూస్తున్న విశ్వాసులక్కూడా ఇది వర్తిస్తుంది. ఆయన రెండో రాకడ కూడా మరో నూతన శక ఆరంభంవలె ఉంటుంది. మత్తయి £24:8; రోమ్‌ 8:19-22 చూడండి. ఆ సమయంలో విశ్వాసులకు కలిగే ఆనందంతో పోల్చుకుంటే (ప్రభువు పరలోకంలో ఉండగా వారు ఈ భూమిపై గడిపిన సమయం దుఃఖపూరితంగా అనిపిస్తుంది. మత్తయి

9:15; రోమ్‌ 8:18,28; £ కొరింతు 4:17; 6:10; 1 పేతురు 1:6; కీర్తన 42:1-8. 16:28 యేసు చనిపోయి లేచిన తరువాత వారికి అనేక

సత్యాలు నేర్పించి పాత ఒడంబడిక (గ్రంథాన్ని వారికి అర్ధం అయ్యేలా చేశాడు (లూకా £4:44,45; అపొ కా 1:38). ఇక్కడ ఇప్పటి విశ్వాసులకేదైనా సందేశం ఉందనుకుంటే అది ఇది - క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇంతవరకు విశ్వాసులను కలవర పెట్టిన, విబ్రాంతి నొందించినవన్నీ తేటతెల్లమౌతాయి. 1 కొరింతు 18:12 పోల్చి చూడండి. “నా పేర” - 14:14.

16:24 అప్పటివరకు శిష్యులు నేరుగా క్రీస్తును అడుగుతూ వచ్చారు. లేక క్రీస్తు అధికారాన్ని ఉపయోగించకుండా ఆయన్ను మధ్యవర్తిగా ఎంచకుండా నేరుగా దేవునికి ప్రార్థన చేశారు. ఇప్పుడు విశ్వాసులకు క్రీస్తు మూలంగా ఆనందం ఉంది,

ఎందుకంటే దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన వాస్తవంగా తమతో ఉన్నాడనే విషయాన్ని, ఆయన కృప, (ప్రేమలను వారు తెలుసుకోగలిగే ఒక మార్గమిది. 16:25 తాను చనిపోయి లేచిన తరువాత శిష్యులకు తండ్రి అయిన దేవుణ్ణి గురించి నేర్చిస్తానని ఆయన భావం. ఇది ఆయనకు అమితానందం కలిగించే పని. ఆయన నెరవేర్చేందుకు వచ్చిన పనుల్లో ఒకటి (1:18; మత్తయి 11:27). 16:26 వారి విన్నపాలను తండ్రి అయిన దేవునికి తాను రెండోసారి చెప్పవలసిన పని లేదని దీని అర్ధం కావచ్చు. వారు తన పేర నేరుగా తండ్రికి ప్రార్ధిస్తే చాలు! ఇతర విషయాల గురించి వారికోసం తండ్రికి విజ్ఞాపన చెయ్యనని ఆయన అనడం లేదు. రోమ్‌ 8:34; హీబ్రూ 7125 చూడండి. 16:27 “మిమ్ములను ప్రేమిస్తూ” - తన ప్రజపట్ల దేవునికున్న కుటుంబ తరహా (ప్రేమను ఇది తెలియజేస్తున్నది (14:21). క్రీస్తులో తమ నమ్మకం ద్వారా విశ్వాసులు దేవుని పిల్లలై ఉన్నారు (1:12,13). అలాంటివారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడు తమ ప్రార్ధనలు వింటాడని గ్రహించవచ్చు. హీబ్రూ 10:19-22 పోల్చి చూడండి. తమ విన్నపాలు దేవునికి వినిపించేందుకు క్రీస్తు సహాయం కూడా విశ్వాసులకు అవసరం లేదంటున్నాడు (ప్రభువు, కాబట్టి ఇతరులింకెవరూ (పరలోకంలో పవిత్రులు గానీ యేసు తల్లిమైన మరియ గానీ మరెవరూ గానీ) వారికి అవసరం లేదన్నది నిస్సందేహమే. దేవుడు వారికి ప్రేమగల తండి. వారాయన చెంతకు నేరుగా వస్తే, సంతోషంగా వారికి అవసరమైనవాటన్నిటినీ ఇస్తాడు (మత్తయి 7:11; 2 కొరింతు 9:8; ఫిలిప్పీ 4:19). తన ప్రజలపట్ల దయ చూపమని తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పించే భక్తులు, ఇతరులింకెవరూ అవసరం లేదు. 16:28-80 తండ్రి తనను పంపాడనీ, తాను తండ్రి వెళ్తున్నాననీ, తాను ఈ లోకానికి చెందినవాణ్ణి కాననీ యేసుప్రభువు ఇంతకుముందు చెప్పాడు (5:36; 6:38; 8:28; 1428). యేసు దేవుని నుంచి వచ్చాడని శిష్యులు నమ్మారు (వ 27) గానీ ఏ కారణం చేతనో ఆయన చెప్పింది వారు పూర్తిగా (గ్రహించలేదు. ఇక్కడ ఆ సత్యం ఒక్క సారిగా వారి మనస్సులను తాకింది.

దగ్గరికి గ్గ దీనిని బట్టి నమ్ముకొంటున్నాం” అన్నారు.

81 యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీరిప్పుడు నమ్ముతున్నారా? 32 ఇదిగో వినండి. ఒక కాలం రాబోతుంది. అది వచ్చి ఉంది కూడా. ఈ కాలంలో మీరంతా చెదరి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. నన్ను ఒంటరిగానే వదలివేస్తారు. అయినా నేను ఒంటరివాణ్ణి కాను - తండ్రి నాతో ఉన్నాడు.

88 “నా మూలంగా మీకు శాంతి ఉండాలని ఈ సంగతులు మీకు చెప్పాను. లోకంలో మీకు బాధ ఉంటుంది. అయినా ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించాను.”

177” మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం

16:31,82 “వదలివేస్తారు” - వారి నమ్మకం ఇంకా దుర్బలమైనదనీ వారు కూడా ఆధ్యాత్మికంగా బలహీనులనీ యేసుకు బాగా తెలుసు. ఆ రాత్రే ఆయన చెప్పిన ఈ మాట ప్రకారం వారు చేశారు (మత్తయి £26:31,56; మార్కు 14:50). అయితే వారు ఆయన్ను వదిలిపోయినా ఆయన వారిని వదలలేదు, (్రేమిస్తూనే ఉన్నాడు, వారికోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. మత్తయి 12:20, లూకా £22:31,32 పోల్చి చూడండి. తరువాత వారిని తిరిగి సమకూర్చి, బలపరచి, వారు ఆధ్యాత్మికంగా ఎదిగేలా తోడ్పడుతూ ఉపదేశిస్తూ వచ్చాడు. వారు చెడ్డ గొర్రెలుగా తమను తాము స్పష్టంగా కనపరచుకున్న సమయంలోనే ఆయన తనను మంచి కాపరిగా ఎక్కువ స్పష్టంగా కనపరచుకున్నాడు (10:11).

16:38 “ఈ సంగతులు” - 14:1 నుంచి ఆయన చెప్తూ వచ్చిన సంగతులన్నీ అన్నమాట.

“శాంతి” - 1427. శాంతి ఎక్కడ దొరుకుతుందో గమనించండి. “నా మూలంగా” అన్నాడు యేసు. శాశ్వత శాంతి మరెక్కడా దొరకదు.

“బాధలు” - 15:18-21; 16:1-4. శిష్య జీవితం తేలికగా, సుఖభోగాలతో సౌఖ్యంతో నిండిన జీవితం కాదని ఆయన వారికి తేటగా చెప్పాడు. ఇతరులకంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయి. విశ్వాసపాత్రులైన ఆయన సేవకులు కూడా ఆయన నేర్పిన ఈ సత్యాన్ని ఈ రోజుల్లో ప్రకటిస్తారు.

“ధైర్యంగా ఉండండి” - రెండు సంగతుల మూలంగా వారు (ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. అంతిమ విజయం క్రీస్తుకూ, క్రీస్తులో వారికీ చెందుతుందని వారు తెలుసుకోగలరు. ఈ లోక బాధల స్థానంలో శాశ్వత మహిమ వారికి చేకూరుతుంది (2 కొరింతు శ్త;17),

“లోకాన్ని జయించాను” - ఆ మరుసటి రోజే తనకు మరణ శిక్ష సిలువ మరణం ప్రాప్తిస్తాయని ఆయనకు తెలుసు. అయినా ఇలాంటి మాటలు పలికాడు. తాను పరలోకంనుంచి వచ్చాననీ, అక్కడికే వెళ్తున్నాననీ, పాపులకోసం తన మరణం తన ఓటమి కాదు గాని విజయమనీ తెలిసిన వ్యక్తి మాటలు ఇవి. దుర్మార్గత, అంధకారం నిండిన ఈ లోకంపై తన గెలుపుకు పునాది తన సిలువ అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పీ £2:8-11; కొలస్సయి 2:15 పోల్చి చూడండి.

17:1 కుమారుడైన దేవుడు భూలోకంనుంచి మనిషిగా (1:14) పరలోకంలోని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం ఇక్కడ చూస్తున్నాం. అయితే 5వ వచనాన్ని బట్టి ఆయన శాశ్వతుడైన దేవ కుమారుడుగా మాట్లాడుతున్నాడని స్పష్టంగా ఉంది. ఆయన తండ్రికి వేరుగా ఉన్న వేరొక వ్యక్తి అని ఈ ప్రార్థన అంతా తేటగా తెలియజేస్తున్నది. మత్తయి 3:16,17; ఫిలిప్పే 2:6 కూడా చూడండి. బైబిలంతటిలోకీ ఈ ప్రార్ధన అత్యంత గంభీరమైన గొప్ప అధ్యాయాల్లో ఒకటి. బహుశా ఇది అన్నిటికన్నా అసాధారణమైన ధన్యకరమైన అధ్యాయం. దేవుడూ మనుషుడూ అయి ఉన్న వ్యక్తిగానూ, దేవునికీ మనుషులకూ ఏకైక మధ్యవర్తిగానూ (1 తిమోతి 2:5), తన (ప్రజల ప్రముఖయాజిగానూ (హీబ్రూ 4:14-16; 7:24,25) యేసు ఈ

ప్రార్థన చేశాడు.

"ఈ ప్రార్ధనలో ఆయన తనగురించీ (వ 1,5), తనలో విశ్వాసుల గురించీ మాత్రమే దేవునికి విన్నపాలు చేశాడు గానీ ఇతరుల గురించి కాదు (వ 9,20). తన కోసం ఒకే ఒక సంగతి అడిగాడు.

విశ్వాసుల కోసం పాపవిముక్తి, శాశ్వత ధన్యత భద్రంగా ఉండేందుకు అవసరమైన వాటన్నిటినీ అడిగాడు. తండ్రి అయిన దేవుడు వారిని కాపాడాలనీ (11-16), పవిత్రపరచాలనీ (వ 20-28), తన మహిమను చూడగలిగేలా చివరికి వారిని పరలోకంలో చేర్చుకోవాలనీ (వ 24) ప్రార్ధించాడు.

క్రీస్తు కేవలం దేవుని సంకల్పం (ప్రకారం మాత్రమే ప్రార్ధించేవాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని కోసం ఈ విన్నపాలన్నిటి (ప్రకారం చేస్తాడు (11:24 1 యోహాను 5:14,15 చూడండి). తాను ప్రార్ధనలో విశ్వాసులకోసం అడిగినవన్నీ వారివేనని వారు గ్రహించి ఆనందించాలని యేసు ప్రార్ధించాడు (వ 13).

క్రొత్త ఒడంబడిక గ్రంధంలో రాసి ఉన్న ఆయన ప్రార్థనల్లో కొద్దిగా దీర్ధమైనది ఇదొక్కటే. క్రీస్తు అన్నిటిలోకీ అతి ప్రధానంగా ప్రియంగా "ఎంచినవి మాత్రమే ఈ ప్రార్ధనలో కనిపిస్తున్నవి. ఈ విధంగా మనం దేవుని (ప్రజలను తలుచుకుని కొంతవరకు ఏమి ప్రార్ధించాలో ఇక్కడ నేర్చుకోవచ్చు (అయితే మానవ మాత్రులం కాబట్టి ఈ ప్రార్ధనలో కనిపించే మాటలన్నిటినీ మనం ఉపయోగించలేము గదా). ఆయన విశ్వాసులకు కలగాలని ఆశించిన వాటన్నిటినీ మనం ఆశించాలి.

“సమయంవచ్చింది” - 7:30; 12:28. “మహిమ చేకూర్చు” - యేసు తనకోసం దేవుణ్ణి వేడుకున్న ఒకే ఒక విషయం. వ 5లో దీని భావమేమిటో మరింత వివరంగా తెలియజేశాడు. విశ్వ సృష్టికి మునుపు తనకున్న మహిమలోకి తిరిగి ప్రవేశించాలనీ, తాను ఈ లోకానికి వచ్చినప్పుడు వదులుకున్న స్థితి, ఘనత హోదాలను తిరిగి పొందాలనీ కోరాడు (ఫిలిప్పీ 2:57; £2 కొరింతు 8:9 చూడండి). మరణం తరువాత తనను సజీవంగా తిరిగి లేపి పరలోక మహిమలో దేవుని కుడివైపుకు తిరిగి హెచ్చించమనీ దేవుణ్ణి అడుగుతున్నాడు. దీన్నే మరో విధంగా చూడాలంటే మహిమ చేకూర్చడం అంటే, ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి హెచ్చించి, ఘనపరచి, గొప్పవాడిగా అందరూ గుర్తించేలా చెయ్యడం. ఆ విధంగా తన నిజ స్వభావాన్ని లోకంలోని మనుషులంతా గుర్తించేలా చెయ్యమని యేసుప్రభువు దేవుణ్ణి అడిగాడు. అంటే తాను దేవుని అవతారమనీ లోక రక్షకుడనీ వారికి తెలియజేయాలని అడిగాడు. మహిమ ఘనతలను స్వార్ధం కోసం సంపాదించుకోవాలని చూచే మనసు కాదిది (ఫిలిప్పీ £2:5-7 మళ్ళీ చూడండి). తనకు మహిమ చేకూర్చవలసినదని క్రీస్తు తండ్రిని అడగడానికి చాలా (ప్రముఖ్యమైన కారణాలున్నాయి.

మొదటిది అందుకు తగిన సమయం ఇప్పుడు వచ్చింది. మరుసటి రోజు ఆయన మరణించనున్నాడు. క్రీస్తు పరలోకంలో తన మహిమను వదిలి పాపులకోసం బాధలు, మరణం అనుభవించి తిరిగి మహిమలోకి (ప్రవేశించాలన్నది దేవుడు నియమించిన ఏర్పాటు (లూకా 24:26).

↑ Back to top

↑