Part 2 of 14

యోహాను శుభవార్త – భాగము 1 (పుటలు 3–8)

యోహాను శుభవార్త – భాగము 1 (పుటలు 3–8)

ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. క్షే “వాక్కు” దేవుడే. 2 ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. 8 సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగినది ఏదీ లేదు. 4 ఆయనలో జీవం ఉంది. ఈ జీవం మనుషులకు వెలుగు. 5 ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది గానీ చీకటి దానిని గ్రహించలేదు. 6 దేవుడు పంపిన మనిషి ఒకడు ఉన్నాడు. అతని పేరు యోహాను. 7 అతని మూలంగా అందరికీ నమ్మకం కుదరాలని

ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు సాక్షిగా వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.

9 ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి ఒక్కరినీ వెలిగించే వాస్తవమైన వెలుగు. 10 ఆ వెలుగుగా ఉన్న ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయనమూలంగా కలిగిందే. అయినా లోకం ఆయనను గుర్తించలేదు. 11 ఆయన తన సొంతదాని దగ్గరికి వచ్చాడు గానీ తన స్వజనం ఆయనను స్వీకరించలేదు. 12 అయితే ఆయనను స్వీకరించినవారికి - అంటే, ఆయన

1:1,2 “ఆదిలో” - 17:5; ఆది 1:1; 1 యోహాను 1:1,2. దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు వాక్కు అంతకు ముందునుంచే ఉన్నాడు. విశ్వానికి ఆరంభం ఉంది గానీ వాక్కు శాశ్వతుడు, అన్నిటినీ సృష్టించినవానితో సంపూర్ణ ఐక్యత ఉన్నవాడు. తరువాత వస్తున్న వచనాలు, ముఖ్యంగా 14వ వచనం, వాక్కు అంటే (ప్రభువైన యేసు క్రీస్తు అని స్పష్టం చేస్తున్నాయి. వాక్కు అనే మాట సూచించేదేమంటే ఒక భావాన్ని ఇతరులకు చెప్పడం, మాట్లాడడం, సందేశాన్ని తెలియజేయడం. దేవుని మనసులో ఏమున్నదో అది వాక్కుగా యేసు క్రీస్తు మూలంగా ప్రత్యక్షం అయింది. ఆయన తన వ్యక్తిత్వంలో దేవుని హృదయం, స్వభావం బహిరంగంగా వెల్లడి చేసినవాడు (వ 18; 10:30; 149; హీబ్రూ 1:3).

ఈ వచనాల్లో దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అని అర్ధం (వ 18 చూడండి). తండ్రిని గురించి నోట్‌ మత్తయి 5:16. త్రిత్వం గురించి నోట్స్‌ 5:30; మత్తయి 3:16,17; 28:19; 2 కొరింతు 13:14.

“వాక్కు దేవునితో ఉన్నాడు” అంటే వాక్కు తండ్రి ఒకటే వ్యక్తి కాదన్నమాట. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

“వాక్కు దేవుడే అంటే ఆయనకు దేవుని స్వభావంలో సంపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నదని అర్థం. ఈ సత్యం గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీ 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.

దేవుని “తోకూడా” అనేదాన్ని “ముఖాముఖిగా” అని అనువదించవచ్చు. ఇది సంపూర్ణ సహవాసాన్నీ సూచిస్తున్నది. 1వ వచనం “వాక్కు ఒక దేవుడు” అని చెప్పడం లేదు. లేక “వాక్కు కొంతవరకు దైవ లక్షణాలు ఉన్నవాడు” అనడం లేదు. ఇలా చెప్పే అనువాదం ఏదైనా మూల భాషకు (ద్రోహం చేస్తున్నది. మూలభాష గ్రీకులో స్పష్టంగా “వాక్కు దేవుడే” అని రాసి వుంది.

1:త ఆది 1వ అధ్యాయం; 1 కొరింతు 8:6; కొలస్సయి 1:16; హీబ్రూ 1:2. విశ్వాన్ని సృష్టించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో, ఆయన ద్వారా పని చేశాడు. ఈ లోకం ఎవరో ఒక ఉపదేవుడు, ఒక చిల్లర దేవుడు చేసిన పని కాదు. ఇది ఏకైక దేవుని సృష్టి.

1:4 వాక్కు కేవలం దేవుని మనసులోని ఒక భావం కాదు. దేవుని చర్యల్లో కనిపించే ఒక సూత్రమూ కాదు. వాక్కు సజీవుడైన ఒక వ్యక్తి. ఆయన ద్వారానే ఈ విశ్వమంతా, అందులో ఉన్నదంతా ఉనికిలోకి వచ్చాయి. 5:26; ర6:57; 11:25 చూడండి. ఇప్పుడు ఆయన ద్వారానే మనుషులు నూతన, ఆధ్యాత్మిక, శాశ్వత జీవాన్ని పొందగలరు. - వ 12, 13; 8:16; 5:24; 20:31. యోహాను శుభవార్త అంతటా కనిపిస్తూ ఉండే ముఖ్యాంశాల్లో “జీవం” ఒకటి. ఈ పదం 36 సార్లు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. యోహానుకు ఇష్టమైన మరో మాట “వెలుగు”. వెలుగు అంటే యోహాను ఉద్దేశం సత్యం, ఆధ్యాత్మిక వాస్తవికత. దేవుని వెలుగును మనుష్యులకు తెచ్చినది యేసు

ప్రభువే (8:12; 9:5; 12:36,46). ఆయన దేవుణ్ణి గురించిన సత్యాన్నీ మన గురించి, పాపవిముక్తి గురించిన సత్యాలనూ ఆధ్యాత్మిక జీవనం గురించిన (ప్రాముఖ్య సత్యాలన్నిటినీ మనం గ్రహించేలా చేస్తాడు. 1:5 దేవుని వెలుగు ఎడతెగక ప్రసరిస్తూనే ఉంటుంది. మనుషులు దాన్ని అర్ధం చేసుకోలేకపోవడానికి కారణం 8:19; రోమ్‌ 1:18-21; 2 కొరింతు 4:4లో ఉంది. 1:6 ఈ యోహాను ఈ శుభవార్త రచయిత యోహాను కాదు. బాప్తిసమిచ్చే యోహాను. మత్తయి 3:1; 11:1 నోట్స్‌ చూడండి 1:7,8 వ 15-36; 5:38. 1:9 వ క4- యేసుప్రభువు నిజమైన వెలుగు. అంటే ఆయనకూ, వెలుగు కాకపోయినా తాము వెలుగని చెప్పుకున్నవారికీ ఇతరుల దృష్టిలో వెలుగుగా చెలామణి అయినవారికీ ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుణ్ణి గురించిన సత్యం మొదలైనవాటిని మనుషులకు కనిపించేలా చెయ్యగలడు కాబట్టి యేసు నిజమైన వెలుగు. ఆయన అందరిమీదా, లోకమంతటిమీదా (8:12) వెలుగును (ప్రసరింపజేస్తాడు. అయితే అందరూ ఆ వెలుగును స్వీకరించరు. 1:10 “లోకంలో” అనే మాటలు ఈ లోకంలో ఆయన జననం, జీవితాలను సూచించేవి. మనుషులు తమ సృష్టికర్తను గుర్తించలేదు. పాపం వారి మనసులు బండబారిపోయేలా చేసింది. వారి ఆధ్యాత్మిక వివేచనను చంపేసి దేవుని నుంచీ, ఆయన విధానాల నుంచీ వారిని వేరు చేసింది. యెషయా 1:2,3; ఎఫెసు 418; కొలస్సయి 1:21 పోల్చి చూడండి. 1:11 “తన స్వజనం” అంటే ఇస్రాయేల్‌వారు, యూదులు. లోకం ఆయన్ను గుర్తించలేకపోవడం మాత్రమే కాదు చాలావరకు ఆయన సొంత జాతే ఆయన్ను ఒప్పుకోలేదు (5:18,40; 7:47; 8:59; 19:6-15). అయితే తరువాతి వచనం స్పష్టం చేస్తున్న విధంగా వారిలో కొందరు అయన్ను స్వీకరించారు. 1:12 బైబిలంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుషులు సహజంగా దేవుని పిల్లలు కారు. వారు ఆయన పిల్లలుగా కావలసి ఉంది. 8:6; 8:44; ఎఫెసు 2:1,2; మొ॥ పోల్చి చూడండి. స్వభావ రీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడి, దేవునికి వేరైన జీవులు (యిర్మీయా 17:9; ఆది 8:21; యెషయా 245; 59:1,£2; రోమ్‌ 3:9-19). దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, వాక్కు రక్షకుడు, ముక్తిదాత అయిన యేసుప్రభువును స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు. ఆయన్ను స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం.

“నమ్మకం” ఈ శుభవార్తలో అతి ప్రాముఖ్యమైన పదాల్లో ఒకటి. “నమ్మకం అని తర్జుమా చేసిన (గ్రీకు పదం రకరకాల ప్రయోగాలు ఈ శుభవార్తలో సుమారు 100 సార్లు కనిపిస్తాయి.

పేరుమీద నమ్మకం ఉంచినవారికి - దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు. 138 వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ళవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.

14 “వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.

15 యోహాను ఆయనను గురించి సాక్ష్యం చెపుతూ ఇలా

బిగ్గరగా అన్నాడు: “నా తరువాత వచ్చేవాడు నాకు మునుపు ఉన్నవాడు గనుక ఆయన నన్ను మించినవాడని నేను చెప్పినవాడు ఈయనే.”

16 మేమందరమూ ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందాం. 17 ఎందుకంటే, ధర్మశాస్త్రం మోషేద్వారా ఇవ్వడం జరిగింది; కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగాయి. 18 ఎవరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఒకే ఒక దేవుని కుమారుడు తండి రొమ్మున ఉన్నాడు. ఆయన దేవుణ్ణి వెల్లడి చేశాడు.

బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు ఈ మాట కన్పించదు. మనం ఆయన్ను నమ్మకం ద్వారానే స్వీకరిస్తాం, నమ్మకం ద్వారానే దేవుని పిల్లలమౌతాం (8:15,16,36; 5:24; 6:47; అపొకా 16:31; రోమ్‌ 10:9; గలతీ 3:26). ఆయన పేరు మీద నమ్మకం ఉంచడమంటే ఆయన పై నమ్మకం ఉంచడమే, బైబిల్లో వెల్లడి అయిన ఆయన గుణశీలాలపై, లక్షణాలపై నమ్మకం ఉంచడమే.

“అధికారమిచ్చాడు” - మొదటి నుంచి చివరివరకు పాపవిముక్తి దేవుడు ఉచితంగా ఇచ్చినదే. 4:10; రోమ్‌ 3:24 శ్ర;4,5; 6:28; ఎఫెసు 2:8 చూడండి.

1:18 “పుట్టినవారు” - దీని అర్ధం కొత్త జన్మ, దేవుని నుంచి నూతన ఆధ్యాత్మిక జీవం పొందడం. యోహాను 3:3; 5:21,24; ఎఫెసు £2:1-ర; యాకోబు 1:18; 1 పేతురు 1:28; 2:2; 1 యోహాను 38:9. ఇది వంశ పారంపర్యంగా వచ్చేది కాదు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేక పూర్వీకులు దేవుని పిల్లలు కాబట్టి అతడు కూడా దేవుని సంతానమని అనుకోరాదు (3:6). (ప్రతి మనిషీ వ్యక్తిగతంగా క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి దేవుని నుంచి కొత్త జీవాన్ని పొందాలి (మత్తయి 3:9 పోల్చి చూడండి). ఆధ్యాత్మిక జీవం శారీరకమైన పద్ధతి ద్వారా ఎవరికీ రాదు. ఏ వ్యక్తీ కూడా తన సంకల్పం చేత మరో వ్యక్తిని దేవుని సంతానంగా చెయ్యలేడు. దేవుడొక్కడే అలా చేయగలడు. యేసు ప్రభువును మనుషులు స్వీకరిస్తేనే అలా చేస్తాడు (వ 12). ఆధ్యాత్మిక సంతానాన్ని దేవుడు మాత్రమే పుట్టించగలడు. మానవజాతి అంతా రెండు గుంపులుగా ఉంది - దేవుని మూలంగా పుట్టినవారు, ఆ విధంగా పుట్టనివారు.

1:14 “వాక్కు - వ 1. దేవుడు మనిషి అయ్యాడు. రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం కలిగినవాడయ్యాడు. ఆయన పేరు యేసు. క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆ ఒకే వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావం పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి (మత్తయి 11:18-23; లూకా 1:26-85; గలతీ 4:4 హీబ్రూ 2:14,17). క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనం నమ్మకంద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి.

“మహత్యం” - అంటే బహుశా క్రీస్తు స్వరూపం మారిపోయిన సందర్భాన్నీ (2 పేతురు 2:16,17; మత్తయి 17:1,2), మొదటి నుంచి చివరిదాకా కృప, సత్యాలతో నిండి వున్న ఆయన జీవితం, పరిచర్యలను రెంటినీ సూచిస్తున్నది.

“కృప” - రోమ్‌ 1:7 నోట్‌. ఇది కొత్త ఒడంబడిక (గ్రంథంలోని గొప్ప మాటల్లో ఒకటి. దేవుని కృప, అనుగ్రహం గురించి 100 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. కృప అంటే అర్హత లేని పాపులకు దేవుడు పాపవిముక్తినీ కొత్త జన్మనూ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే. మన కోసం చనిపోయేందుకు తన కుమారుణ్ణి

ఇవ్వడమూ, మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడమూ కృప. దేవుని కృప ఎంతో తేటతెల్లంగా యేసు క్రీస్తులో వెల్లడి అయింది. £2 కొరింతు 8:9 చూడండి. కృప గురించి కొన్ని (ప్రాముఖ్యమైన రిఫరెన్సులు వ 17; అపొ కా 15:11; 18:27; 20:24 రోమ్‌ 1:7; 38:24 5:2,15,20,21; 6:1,14; 2 కొరింతు 8:9; గలతీ 1:6; ఎఫెసు 1:6; 2:5-10; 22 తెస్స 2:16; తీతు 2:11; 38:7; హీబ్రూ 2:9, 4:16; యాకోబు 4:6; 2 పేతురు 3:18.

“సత్యం” - క్రీస్తు అవతారం అంటే సత్యాన్ని వెల్లడి చేయడమే. యోహాను ఒక్కడే సత్యం అనే మాట దాదాపు £2ర5 సార్లు ఉపయోగించాడు (4:24; 8:31,82; 146,17; 16:18; 18:87 చూడండి). పాత ఒడంబడిక గ్రంథంలో కూడా దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడు - కీర్తన 81:5. యేసు ఆయన అవతారం.

“ఒకే ఒక” - క్రీస్తు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గట్టిగా నొక్కి చెప్పే విధానం ఇది. తండ్రి అయిన దేవునికి ఆయన దైవస్వభావంలో, శాశ్వతమైన ఉనికిలో పాలుగొన్న ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ శుభవార్తలో దేవుణ్ణి 122 సార్లు “తండ్రి” అనడం జరిగింది. ఇతర శుభవార్తల్లో కంటే ఇది చాలా ఎక్కువ సార్లు. మత్తయి 5:16 నోట్‌ చూడండి.

1:15 వ 6,80 యోహాను యేసుకన్నా ముందు జన్మించాడు. అతని పరిచర్య కూడా ముందే ఆరంభం అయింది. ఇక్కడ యేసు ఈ లోకంలోకి రాకముందే ఆయన ఉన్నాడని చెప్తున్నాడు రచయిత.

1:16 ఈ వచనం గ్రీకు మూలం అస్తమానం (ప్రవహించే కృపను సూచిస్తూ ఉంది. సముద్రం అలల్లాగా ఒక కృప చర్య తరువాత మరో కృప చర్య వస్తూ ఉండడమన్నమాట. ఈ కృప ప్రవహించే మార్గం యేసు క్రీస్తు,

1:17 ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతం పై చేసిన పాత ఒడంబడిక. అది దాదాపు పాత ఒడంబడిక (గ్రంథమంతటికీ పునాది. నిర్గమ 19 అధ్యాయం నోట్స్‌ చూడండి. మోషే రచనల్లో దేవుని కృప, సత్యం బొత్తిగా వెల్లడి కాలేదని కాదు యోహాను ఉద్దేశం. క్రీస్తులో కృప, సత్యం రూపు దిద్దుకున్నాయనీ, ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశమానంగా కనిపించిందనీ, కృప (ప్రదర్శన అయిందనీ అతని భావం. క్రీస్తు శుభవార్త, మోషే ధర్మశాస్త్రం అనే ఈ రెండు మార్గాలకున్న తేడాను అతడు ఎత్తిచూపుతున్నాడు. ధర్మశాస్త్రం మనుషులకు పాపవిముక్తి కలిగించలేకపోయింది. మనుషులకు అవసరమైన సత్యమంతటినీ అది వెల్లడి చేయలేకపోయింది.

1:18 కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు దేవుని మహిమ (ప్రత్యక్షాన్నీ మానవ రూపంలో ఆయన స్వరూపాన్నీ చూశారు (నిర్గమ 24:9-11; 83:22,28; యెషయా 6:1). అయితే ఆత్మ స్వరూపిగా ఉన్న దేవుణ్ణి, మిరుమిట్లు గొలిపే ఆయన మహిమాన్విత తేజోరూపమైన తత్వాన్ని ఎవరూ చూడలేదు 19 “మీరెవరు?” అని అడగడానికి యూదులు జెరుసలం నుంచి యాజులనూ లేవిగోత్రికులనూ యోహానుదగ్గరికి పంపారు. అప్పడతడు చెప్పిన సాక్ష్య మిదే: 20 “అభిషిక్తుణ్ణి కాను” అని ఒప్పుకొన్నాడు. అలా ఒప్పుకోవడానికి నిరాకరించలేదు.

21 “అలాగైతే మీరు ఎవరు? ఏలీయా?” అని వారు అతణ్ణ్టి అడిగారు.

అతడు “కాను” అన్నాడు.

“మీరు ఆ ప్రవక్తా?” అని వారు అడిగారు.

“కాను” అని జవాబిచ్చాడు.

22 “మీరు ఎవరైనట్టు? మమ్మల్ని పంపినవారికి మేము జవాబివ్వాలి. మీ గురించి ఏమని చెప్పుకొంటున్నారు?” అని వారు అతనితో అన్నారు.

28 అతడు “యెషయాప్రవక్త చెప్పినట్టు, ప్రభువుకోసం మార్గం తిన్ననిది చేయండి అంటూ అరణ్యంలో ఘోషిస్తూ ఉన్న ఒకని స్వరాన్ని నేను” అన్నాడు.

24 వారిని పంపినది పరిసయ్యులు. £25 వారతణ్ణి ఇలా అడిగారు: “మీరు అభిషిక్తుడు గానీ ఏలీయా గానీ ఆ ప్రవక్త గానీ కాకపోతే ఎందుకు బాప్తిసం ఇస్తున్నారు?”

26 యోహాను “నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను గాని మీరెరుగనివాడొకడు మీ మధ్య నిలుచున్నాడు. £27 నా తరువాత

వచ్చేవాడు ఆయనే. ఆయన నన్ను మించినవాడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను తగను” అని వారితో బదులు చెప్పాడు.

28 ఇది యొర్దాను నదికి అవతల ఉన్న బేతబరలో జరిగింది. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు.

£29 మరుసటి రోజున యేసు తనవైపు రావడం చూచి యోహాను “అడుగో, లోక పాపాన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30 ఈయనను ఉద్దేశించే నేను ఈ మాట చెప్పాను: నా తరువాత ఒక మనిషి వస్తాడు. ఆయన నాకు మునుపు ఉన్నవాడు గనుక నన్ను మించినవాడు. 81 నేను ఆయనను గుర్తుపట్టలేదు గానీ ఆయన ఇస్రాయేల్‌ ప్రజలకు ప్రత్యక్షం కావాలని నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను” అన్నాడు.

82 యోహాను ఇలా సాక్ష్యం చెప్పాడు: “పరలోకంలో నుంచి దేవుని ఆత్మ పావురంలాగా దిగిరావడం, ఆయన మీద నిలిచి ఉండడం నేను చూశాను. 33 నేనాయనను గుర్తుపట్టలేదు గాని నీళ్ళలో బాప్తిసం ఇమ్మని నన్ను పంపినవాడు నాతో ఇలా అన్నాడు: ఎవరిమీద ఆత్మ దిగివచ్చి నిలిచి ఉండడం నీవు చూస్తావో ఆయనే పవిత్రాత్మలో బాప్తిసం ఇస్తాడు. 34 దానిని నేను చూశాను. ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను.”

35 మరుసటి రోజు యోహాను, అతని శిష్యులలో ఇద్దరు

(1 తిమోతి 6:16).

“తండ్రి రొమ్మున” - ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, (ప్రేమను సూచిస్తున్నది. వీరిద్దరూ వేరువేరు ప్రత్యేక వ్యక్తులని కూడా గమనించండి. మనుషులు దేవుణ్ణి చూడలేరు. కానీ యేసుప్రభు జీవితం, చర్యలు, మాటల్లో దేవుని లక్షణాలు మనకు సంపూర్ణంగా వెల్లడి అయ్యాయి. ఆయన ఈ లోకానికి రావడంలో ఆయనకున్న గొప్ప ఉద్దేశాల్లో ఒకటి తండ్రి అయిన దేవుడు ఎలాంటివాడో వెల్లడించడమే (8:19; 10:30,

14:9, 17:6). 1:19 యోహాను కీర్తి వ్యాపిస్తున్నది. అందువల్ల విషయమేమిటో తెలుసుకోదలిచారు. నాటి ఇస్రాయేల్‌

మతాధిపతులు. యాజుల గురించి నోట్‌ నిర్గమ 28:1.

“లేవీ గోత్రికులు” - సంఖ్యా 1:47-50. 1:20 “క్రీస్తు గురించి నోట్‌ మత్తయి 1:1. తాను ఆ వ్యక్తిని కాదని యోహానుకు తెలుసు. అలాంటి గౌరవం తనదని చెప్పడానికి అతడు ప్రయత్నించలేదు. 1:21 క్రీస్తు రాకడకు ముందు ఏలీయా మరో సారి వస్తాడని యూదులు నమ్మారు (మలాకీ 4:5). మత్తయి 11:14; 17:10-12 నోట్‌ చూడండి. “ప్రవక్త” గురించిన ఈ ప్రశ్నను యూదులు ద్వితీ 18:15-19ను ఆధారం చేసుకుని అడిగారు. 1:28 యెషయా 40:3; మత్తయి 3:3. అందరి దృష్టి తనవైపు మరలించుకోవాలని గానీ గొప్ప వాణ్ణనిపించుకోవాలని గానీ యోహాను ఉద్దేశం కాదు. యేసుప్రభువు కోసం దారి సిద్ధం చేసే ఒక స్వరంగా కేవలం ఉండడానికి అతనికి సమ్మతమే. మనుషుల పాలిట యేసు క్రీస్తు అన్నీ అయితే తాను వారికి ఏమీ కానివాడుగా ఉండడం అతనికి సంతోషమే (వ 27; 3:30). ఇందులో ఇతడు మనందరికీ ఆదర్శం. దేవుడు మనలో చూడాలనుకునేది అణకువే గాని గొప్పవాళ్ళం కావాలనీ, కీర్తి ప్రతిష్టలు కలగాలనీ తాపత్రయం కాదు. 1:24 పరిసయ్యుల గురించి నోట్‌ మత్తయి 38:7. 1:25 బాప్తిసం గురించి నోట్‌ మత్తయి 38:6.

1:26 ఈయన యేసుప్రభువు అని అతని ఉద్దేశం. ఇంతవరకు ఎవరూ ఆయన్ను అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా గుర్తించలేదు. వ 10,11 పోల్చి చూడండి.

1:27 మత్తయి 3:11 చూడండి.

1:28 జెరుసలం దగ్గర మరో బేతనీ ఉంది.

1:29 పాత ఒడంబడిక (గ్రంథంలో వర్ణించిన బలులను “గొర్రెపిల్ల” అనేమాట గుర్తుకు తెస్తూవుంది. లేవీ 1:2,10-14; 3:6-8; 14:12,21,24; నిర్గమ 12:38-18; ఆది £22: 7-14. తండ్రి అయిన దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసుప్రభువును బలిగా చేస్తాడని యోహాను ఉద్దేశం. రోమ్‌ 8:25; 1 కొరింతు 5:7; ఎఫెసు 5:2; హీబ్రూ 9:26; 10:12; 1 పేతురు 1:19 పోల్చి చూడండి. ఈ బలి పాత ఒడంబడిక బలుల్లాగా ఇస్రాయేల్‌లోని వ్యక్తుల కోసమో, ఆ జాతి అంతటి కోసమో కాదు. ఇది మానవ జాతి అంతటికోసం. యేసుప్రభువు మానవ పాపాన్నీ దేవునికి మనిషి చెల్లించవలసిన రుణాల భారమంతటినీ తీసివేశాడు. అంటే మనుషులంతా పాపవిముక్తి పొందారని కాదు. రక్షణ మార్గం, పరిపూర్ణ క్షమాపణ మనుషులందరికీ అందుబాటులోకి వచ్చింది అని అర్థం.

1:30 వ 15.

1:31 దేవుడు అతనికి వెల్లడి చేసేంతవరకు యోహాను యేసును అభిషిక్తునిగా గుర్తించలేదు. కానీ తన పని ఏమిటో అతనికి తెలుసు - వ 23.

1:32 మత్తయి 38:16. దేవుని ఆత్మను గురించి నోట్స్‌ 14:16,17.

1:38 మత్తయి 3:11.

1:34 దేవుని కుమారుని గురించి నోట్స్‌ 8:16; 5:18-23; మత్తయి 3:16,17, 11:27.

1:35-87 “శిష్యులు” అని తర్థుమా చేసిన గ్రీకు పదానికి “నేర్చుకునేవారు” అని అర్ధం. మత్తయి 10:1 నోట్‌ చూడండి. యోహాను తనకు శిష్యుల గుంపును ఏర్పరచుకుందాం మళ్ళీ అక్కడ నిలుచున్నారు. 86 ఆ దారిన నడుస్తూ ఉన్న యేసును చూచి అతడు “ఇడుగో, దేవుని గొర్రెపిల్ల!” అన్చాడు.

387 అతడు చెప్పినది ఆ ఇద్దరు శిష్యులు విని యేసును అనుసరించారు. 88 యేసు వెనక్కు తిరిగి, వారు తనను అనుసరించడం చూచి “మీరు దేనిని వెతుకుతున్నారు?” అని వారినడిగాడు.

వారు “రబ్బీ! మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. (రబ్బీ అంటే బోధకుడని తర్జుమా).

39 “వచ్చి చూడండి” అని ఆయన వారితో అన్నాడు గనుక వారు వెళ్ళి ఆయన ఉన్న స్థలం చూశారు. అప్పటికి సుమారు నాలుగు గంటలైంది గనుక వారు ఆ రోజు ఆయనతో ఉండిపోయారు.

40 యోహాను చెప్పినది విని యేసువెంట వెళ్ళిన ఆ ఇద్దరిలో ఒకడు అంద్రెయ. అతడు సీమోను పేతురుకు తోబుట్టువు. 41 అతడు మొట్టమొదట తన తోబుట్టువు సీమోనును కనుక్కొని అతనితో “మేము అభిషిక్తుణ్ణి చూశాం!” అన్నాడు. (అభిషిక్తుడు అంటే క్రీస్తు అని తర్జుమా.) 42 అతణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చాడు. యేసు అతణ్ణి చూచి “నీవు యోనా కుమారుడైన సీమోనువు. నిన్ను 'కేఫ” అంటారు” అన్నాడు (కేఫా అంటే రాయి అని తర్జుమా).

48 మరుసటి రోజు యేసు గలలీకి వెళ్ళాలని ఉండి ఫిలిప్పును చూచి “నా వెంట రా” అన్నాడు. 44 ఫిలిప్పు బేత్‌సయిదా వాడు. అది అంద్రెయ, పేతురుల గ్రామం.

45 ఫిలిప్పు నతనియేలును కనుక్కొని “ధర్మ శాస్త్రంలో మోషే, ప్రవక్తలు కూడా ఎవరిని గురించి రాశారో ఆయనను చూశాం. ఆయన యోసేపు కుమారుడైన యేసు. ఆయన నజరేతు గ్రామంవాడు” అన్నాడు.

46 అందుకు నతనియేలు “నజరేతునుంచి మంచిది ఏదైనా రాగలదా?” అని అతనితో అన్నాడు.

ఫిలిప్పు అతనితో “వచ్చి చూడు” అన్నాడు.

47 తన దగ్గరకు నతనియేలు రావడం చూచి యేసు అతణ్ణి గురించి “ఇడుగో, అసలైన ఇస్రాయేల్‌వాడు! అతనిలో కపటమేమీ లేదు” అన్నాడు.

48 “నేను మీకు ఎలా తెలుసు?” అని నతనియేలు ఆయనను అడిగాడు.

యేసు అతనితో జవాబిస్తూ “ఫి ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరచెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూశాను” అన్నాడు.

49 “గురువర్యా! మీరు దేవుని కుమారులే! ఇస్రాయేల్‌ రాజే!” అని నతనియేలు ఆయనకు బదులు చెప్పాడు.

50 “నిన్ను అంజూరచెట్టు క్రింద చూశానని నేను నీతో చెప్పినందుచేత నమ్ముతున్నావా? వీటికి మించిన వాటిని చూస్తావు” అని యేసు అతనికి జవాబు చెప్పాడు. 51 ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇకమీదట ఆకాశం తెరుచుకోవడమూ దేవదూతలు మానవ పుత్రుని మీదుగా ఎక్కిపోవడమూ దిగిరావడమూ మీరు చూస్తారు.”

అనుకోలేదు. మనుషులు యేసు శిష్యులు కావాలని అతని ఆశ. 38:26-80 చూడండి. ఇందులో కూడా మనం అనుసరించదగిన ఆదర్శాన్ని ఇతడు చూపిస్తున్నాడు.

1:38 సరైన కారణం లేకుండా ఎవరైనా తనను అనుసరించడం యేసుప్రభువుకు ఇష్టం లేదు. ఏదో విచిత్రాన్ని చూద్దాం అనే మనస్తత్వం నిజమైన శిష్యుణ్ణి చేయదు. లూకా 9: 57-62; 14:25-27 పోల్చి చూడండి.

“రబ్బీ” - ఒక గురువును సంబోధించడానికి యూదులు సాధారణంగా ఉపయోగించే పదం. “నా ఉపదేశకుడు” అని దీనికి అర్థం. తమ మాటల ద్వారా ఈ ఇద్దరూ ఆయనతో ఉండి, ఆయన దగ్గర నేర్చుకోవాలన్న అభిలాష కనపరచుకున్నారు. ఇది అందరికీ ఉండాలి గాని కొద్దిమందిలోనే కనిపిస్తుంది.

1:39 ఈ ఇద్దరికీ అందిన దయామయమైన ఆహ్వానం వేరే మాటల్లో ఇప్పుడు అందరికీ అందుతున్నది (7:37; మత్తయి 11:28; (ప్రకటన 22:17). ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా ఆయన శాశ్వత నివాసం తండ్రి ప్రక్కన (వ 18) అని మనం తెలుసుకుంటాం, ఆయనతో అనంత కాలం అక్కడ జీవిస్తాం.

1:40 మత్తయి 16:17,18.

1:41 సత్యం ఈ భూమిపై ఇప్పటికీ వ్యాపిస్తున్న విధానం ఒకరు మరొకరికి చెప్పడం ద్వారా. వ కిర్‌; 44:28-30; 15:27 చూడండి.

“అభిషిక్తుణ్ణి” - నోట్‌ మత్తయి 1:1.

1:42 అరమేయక్‌ భాషలో కేఫా అంటే రాయి. గ్రీకులో పేతురు (పెట్రొస్‌) అన్నా అదే అర్ధం.

1:43 మత్తయి 419-22; 9:9 పోల్చి చూడండి.

1:44 గలలీ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఊరు బేత్సయిదా. 1:45 ఇలా మాట్లాడేందుకు పాత ఒడంబడిక (గ్రంథంతో బాగా పరిచయం అవసరం. లూకా £24:27,44 పోల్చి చూడండి.

ఇతడు యోసేపును యేసు తండ్రిగా చెప్తున్నాడు. ఆయన అసలైన తండ్రి దేవుడు (5:17,18; లూకా 1:35). యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు యోసేపు ఆయనకు చట్టబద్ధమైన తండ్రి.

1:46 నతనియేలు ప్రశ్నను బట్టి. నజరేతు ఊరికి ఏమాత్రం మంచి పేరు లేదనీ, బొత్తిగా గుర్తింపులేని అల్పమైన ఊరనీ అర్థం అవుతున్నది.

“వచ్చి చూడు” - క్రీస్తును గురించి సందేహాలున్న వారందరికీ

చెప్పదగిన మంచి మాట. వారంతా వచ్చి రుచిచూస్తే ఆయన గొప్పతనం, మంచితనం అర్ధం అవుతుంది (కీర్తన 84: |: 8), 1:47 అసలైన ఇస్రాయేల్‌వాడు అంటే హృదయంలోనూ, జీవిత విధానంలోను ఇస్రాయేల్‌వాడు ఎలా కపటం లేకుండా ఉండాలో అలా ఉండేవాడు అని అర్థం. రోమా £2:28,29; మత్తయి 3:9,10 పోల్చి చూడండి. 1:48,49 మనుషులకు సహజంగా లేని శక్తి యేసుకు ఉంటే తప్ప నతనియేలును చూడడం గానీ అతని మాటలు వినడం గానీ సాధ్యం కానంత దూరంలో అంజూరు చెట్టు ఉన్నట్టుంది. నతనియేలు దీన్ని వెంటనే అర్థం చేసుకుని యేసును “దేవుని కుమారుడు” అన్నాడు.

“ఇస్రాయేల్‌ రాజు” - మత్తయి 1:1; కీర్తన 2:6; యెషయా 9:6,7 నోట్స్‌.

1:50 నతనియేలు మాటలను నిజమేనని అంగీకరిస్తూ, అవి సత్యమేననడానికి మరింత గొప్ప రుజువులు చూపుతానని యేసు అన్చాడని గమనించండి. £20:28,29 పోల్చి చూడండి.

1:51 “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” (“నిశ్చయముగా చెప్పుచున్నాను” - పాత అనువాదం) అనే మాటలను యేసు యోహాను శుభవార్తలో £5 సార్లు ఉపయోగించాడు. ఇవి చాలా గంభీరంగా నొక్కి చెప్పేందుకు వాడే మాటలు. వింతగానూ, నమ్మడానికి కష్టసాధ్యంగానూ అనిపించే సత్యాన్ని ఆయన చెప్పినప్పుడు ఈ మాటలు పలికేవాడు. ఇక్కడ యేసు ఆది మూడో రోజున గలలీలోని కానాలో పెండ్లి జరిగింది.

యేసు తల్లి అక్కడ ఉంది. 2 యేసునూ ఆయన శిష్యులనూ కూడా పెండ్లికి పిలిచారు. 8 (్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో “వారిదగ్గర (ద్రాక్షరసం లేదు” అంది. 4 యేసు ఆమెతో “అమ్మా, నీతో నాకేమి వని? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5 ఆయన తల్లి పనివారితో “మీతో ఆయన చెప్పినది చేయండి” అంది. 6 అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సుమారు డెబ్బయి, లేదా నూరు లీటర్ల నీళ్ళు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం. అక్కడ ఉంచారు. 7 యేసు వారితో “ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. 8 అప్పుడాయన వారితో “ఇప్పుడు

ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. 9 ద్రాక్షరసంగా మారిన ఆ నీరు ఎక్కడనుంచి వచ్చిందో ఆ నీళ్ళు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి ఇలా అన్నాడు: 10 “ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి (ద్రాక్షరసం వడ్డిస్తారు. అతిథులు బాగా త్రాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు.”

11 యేసు చేసిన సూచనకోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలలీలోని కానాలో చేసి తన మహాత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయనమీద నమ్మకం ఉంచారు.

£29:12లో రాసి ఉన్న యాకోబు కల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కలలో పరలోకానికి, భూమికీ ఒక నిచ్చెన వేసి ఉంది. ఆ నిచ్చెన తానే అని యేసు అంటున్నాడు. దేవుడు మనుషులకు చెప్పదలచుకున్న సందేశాలూ, ఇవ్వదలచుకున్న దీవెనలూ వారికి చేరే మార్గం క్రీస్తే అన్నమాట. మనుషులు దేవుని సన్నిధికి ఎక్కివెళ్ళే మార్గం కూడా ఆయనే. నతనియేలు (క్రీస్తు శిష్యులందరూ కూడా) కాలక్రమేణ దీన్ని (గ్రహిస్తారు అంటున్నాడు. దేవదూతల గురించి నోట్‌ ఆది 16:7. “మానవ పుత్రుడు” గురించి నోట్‌ మత్తయి 8:20.

2:1 నజరేతుకు ఉత్తరాన సుమారు 15 కి.మీ. దూరంలో ఉన్న చిన్న ఊరు కానా. తరువాతి వచనాలను బట్టి యేసు తల్లి మరియ ఈ పెళ్ళివారికి సహాయం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. 2:2 వివాహమనే వ్యవస్థను యేసుప్రభువు ఆమోదించాడు. దానికి తాను హాజరు కావడం ద్వారా దానిపట్ల తన గౌరవాన్ని ప్రకటించాడు (మత్తయి 19:4-6; హీబ్రూ 18:4 పోల్చి చూడండి).

2:3 వేడుకైన, ఆనందకరమైన సందర్భంలో ఉన్నట్టుండి ఇలా జరగడం ఆ ఇంటి యజమానికి చాలా తలవంపులు కలిగించే విషయం. మరియ అందుకు ఆందోళన కనపరస్తూ యేసుప్రభువు ఆ విషయంలో ఏమైనా చెయ్యాలని పరోక్షంగా సూచించింది. ఇప్పటివరకు యేసు ఏ అద్భుతాలు బహిరంగంగా చెయ్యలేదు (వ 11. రహస్యంగా కూడా చేసినట్టు ఏమీ సూచన లేదు). అయితే ఆయన సాధారణ వ్యక్తి కాదని మరియకు తెలుసు (లూకా 1:35).

2:4 “నీతో నాకేమి పని?” - దీని అర్థం ఇది కావచ్చు - యేసుప్రభువు దేవుని కుమారుడుగా ఇస్రాయేలువారి అభిషిక్తుడుగా తన పరిచర్య ఆరంభిస్తున్నాడు. మునుపు తమ ఊరు నజరేతులో తన తల్లితో తనకున్న పాత అనుబంధం ఇకపై కొనసాగదు. అప్పటినుంచి ఆమెకు ఆయన పై ఎలాంటి అధికారం ఉండదు. ఇకపై ఆయన నిర్ణయాలను చేస్తుంటే ఆమె మాటలు ఆయనపై ఏమీ (ప్రభావం చూపవు. ఆయన ఏమేమి చేయాలో తండ్రి అయిన దేవుడే ఆయనకు తెలియజేస్తాడు

(4:34; 5:36; 8:28,29; 17:4; మత్తయి 12:46-50 పోల్చి చూడండి). 2:5 యేసు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయన ఏదో

చేయనున్నాడని మరియకు అనిపించింది. ఆ సమయానికి ఆ సేవకులతో మరియ చెప్పిన మాటలు చక్కగా సరిపోయే మాటలు. ఈ మాటలే మరింత ఉన్నతమైన పరిపూర్ణమైన స్తాయిలో మనుషులందరూ ఎప్పుడూ అనుసరించదగినవి.

సుప్రభువు మనతో చెప్పినది చేస్తే మనం ఎన్నడూ తప్పటడుగు వేసే అవకాశం ఉండదు.

2:6 మార్కు 7:1-5.

2:9 ఈ అద్భుతం గురించి వివరణ ఏమీ లేదు. బానల్లో నీళ్ళు పోశారనీ, ద్రాక్షరసం ముంచుకుని తీసుకువెళ్ళారనీ మాత్రం రాసి ఉంది. అంతకుముందంతా తాగిన (్రాక్షరసానికీ దీనికీ తేడా ఏమీ ఉన్నట్టుగా చెప్పలేదు. దానికంటే ఇదే ఎక్కువ రుచిగా ఉందని మాత్రం రాసి ఉంది. యేసు ఈ (దాక్షరసాన్ని చేశాడంటే కొందరు విశ్వాసులు కొద్దిగా ఆందోళన చెందుతుంటారు. అయితే ఆ రోజుల్లో భోజన సమయంలో (ద్రాక్షరసం తాగడం సర్వసాధారణమే. ఇది హానికరంగా ఎంచబడలేదు. మామూలుగా వారు (ద్రాక్షరసంలో నీళ్ళు కలిపేవారు - ఒక పాలు ద్రాక్షరసానికి మూడు పాళ్ళు నీరు కలిపేవారు. త్రాగుబోతు తనాన్ని మాత్రం బైబిల్లో అంతటా ఖండించడం చూడవచ్చు. ఆది 9:21; మొ! నోట్స్‌ చూడండి. బైబిల్లో కొన్ని సార్లు (ద్రాక్షరసం అనేమాటను మంచిదానికి గుర్తుగా వాడారు (సామెత 9:1,2,5; యెషయా 55:1; మత్తయి 26:37-89). మత్తయి 9:17లో యేసుప్రభువు శుభవార్తకు చిహ్నంగా కొత్త (్రాక్షరసాన్ని చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైన పాత ఒడంబడికకు వేరుగా ఆయన తెచ్చిన శుభవార్త కొత్త (ద్రాక్షరసం వంటిది. ఇక్కడ యూదులు తమ మతాచారం సంబంధంగా కాళ్ళు కడుక్కునే నీరు ఉంచిన బానల్లోనుంచి యేసుప్రభువు కొత్త (ద్రాక్షరసం రప్పించాడు. యేసు ఏ పని చేసేందుకు వచ్చాడో దానికి ఇది ఒక చిన్న సాదృశ్యం కావచ్చు. పాత ఒడంబడిక స్థానంలో తన కృప, ఆనంద రాజ్యాన్ని స్థాపించేందుకు ఆయన వచ్చాడు.

2:10 ఈ మనిషి విందుల్లో సామాన్యంగా జరిగే సంగతి గురించి చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్న విందులో మనుషులు మత్తెక్కి తూలుతున్నారని చెప్పడం లేదు. అతిథులు మత్తెక్కిపోయేలా తాగుతున్న విందులో యేసు పాల్గొనేవాడు కాదు, అలాంటివారికోసం (ద్రాక్షరసం చేసి ఇచ్చేవాడూ కాదు. 2:11 యోహాను శుభవార్తలో యేసుప్రభువు చేసిన అద్భుతాలను “సూచనకోసమైన అద్భుతాలు” అనడం 11 సార్లు కనిపిస్తుంది. ఎందుకంటే అవి చాలా అంతరార్ధంతో నిండి ఉన్నాయి. ఆధ్యాత్మిక సత్యాలను అవి చూపిస్తున్నాయి. యేసుప్రభువు ద్వారా దేవుడే పని చేస్తున్నాడనీ, యేసుప్రభువు ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడనీ, దేవుని కుమారుడనీ, పరలోకం నుంచి వచ్చినరాజు అనీ అవి తెలియజేస్తున్నాయి. అవి ఆయన ప్రభావాన్నీ, కృపనూ, (శ్రేమనూ వెల్లడి చేస్తున్నాయి. క్రీస్తు ఎవరో మనుషులు అర్ధం చేసుకోగలిగేలా సహాయం చేయడమే వీటి ఉద్దేశం. వ 28; 38:2; £20:30,81 చూడండి. అవి ఉదాహరణలు - మాటల్లో కాదు, చేతల్లో. తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభువు వెల్లడి చేసిన పద్ధతుల్లో ఇదొకటి (1:17,18). అద్భుతాల గురించి మత్తయి. 8:1 నోట్‌ చూడండి.

12 ఆ తరువాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు, ఆయన శిష్యులు కపెర్‌నహూం వెళ్ళారు. వారు అక్కడ అనేక రోజులు ఉండిపోలేదు.

18 యూదుల పస్కా పండుగ దగ్గరపడింది. యేసు జెరుసలం వెళ్ళాడు.

14 దేవాలయంలో ఎద్దులనూ గొర్రెలనూ పావురాలనూ అమ్మేవారినీ కూర్చుని ఉన్న డబ్బు మారకందారులనూ ఆయన చూశాడు.

15 ఆయన ్రాళ్లతో కొరడా చేసి వాళ్ళందరినీ గొర్రెలతో ఎద్దులతోపాటు దేవాలయంనుంచి వెళ్లగొట్టాడు. డబ్బు మారకందారుల నాణేలు వెదజల్లివేశాడు. వాళ్ళ బల్లలు పడద్రోశాడు.

16 పావురాలు అమ్మేవారితో ఆయన “వీటిని బయటికి తీసుకువెళ్ళండి. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయకండి!” అన్నాడు.

17 “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేసింది” అని (వ్రాసి ఉందని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.

18 అప్పుడు యూదులు జవాబిస్తూ ఆయనతో “నీవు ఈ (క్రియలు చేస్తూ ఉన్నావే. సూచనగా ఏ అద్భుతం మాకు చూపుతావు?” అన్నారు.

19 “ఈ దేవాలయాన్ని నాశనం చేయండి, మూడు

“మహత్యం” - 1:14. ఆయన శిష్యులు ఇప్పటికే నమ్మడం మొదలు పెట్టారు. ఈ సూచన మూలంగా వారి నమ్మకం ఎక్కువై స్థిరపడింది.

2:12 కపెర్‌నహూం గలలీ సరస్సు తీరాన ఉన్న ఊరు. గలలీ ప్రాంతంలో యేసు ఈ ఊర్లో నివసిస్తూ అక్కడనుంచి ఆయా చోట్లకూ వెళ్తూ పరిచర్య జరిగించాడు (మత్తయి 9:1). యేసు తమ్ముళ్ళు గురించి 7:3; మత్తయి 12:46; 18:55లో ఉంది. 2:13 పస్కా గురించి నోట్స్‌ నిర్గమ 12వ అధ్యాయం; లేవీ 23: 4-8.

2:14-16 మత్తయి, మార్కు లూకా ముగ్గురూ ఇలాంటి సంఘటనే క్రీస్తు సిలువ మరణానికి కొద్ది కాలానికి ముందు జరిగినట్టుగా రాశారు. మత్తయి £21:12,18 నోట్స్‌ చూడండి. యోహానైతే క్రీస్తు పరిచర్య ఆరంభంలో ఇది జరిగినట్టు రాస్తున్నాడు. ఆలయానికి చెందనివాటిని యేసు రెండు పర్యాయాలు అక్కడినుంచి తొలగించినట్టుంది.

2:16 ఆలయం సరైన ఉపయోగాన్ని వారు వక్రం చేశారు. దానిద్వారా తమకు ఏం లాభం కలుగుతుందా అని మాత్రమే చూశారు. 1 తిమోతి 6:5 పోల్చి చూడండి.

2:17 కీర్తన 69:9.

2:18 వ 11.

2:19-2£22 యేసు పలికిన ఈ మాటలను తరువాతి కాలంలో ఆయన శత్రువులు వక్రం చేసి ఆయనకు తీర్పు తీర్చేటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించారు (మత్తయి 26:61). ఇక్కడ తన పరిచర్య ప్రథమ దశలోనే యేసు తన మరణం గురించీ, తిరిగి సజీవంగా లేవడం గురించీ చెప్తున్నాడు. ఆయన దేహం దేవునికి నివాస స్థలమైన ఆలయం (1 కొరింతు 6:19,20 పోల్చి చూడండి). వారు దాన్ని చంపేస్తారు గానీ ఆయన దాన్ని తిరిగి బ్రతికించి లేపుతాడు. యూదులు ఆయన్ను సరిగా అర్థం చేసుకోలేక ఎగతాళి చేశారు. ఆయన శిష్యులు సైతం ఆయన సజీవంగా తిరిగి లేచిన సమయం వరకు ఆయన మాటల్లోని అర్థాన్ని (గ్రహించలేదు. మత్తయి 16:21,22; లూకా

రోజులలో దీనిని లేపుతాను” అని యేసు వారికి బదులు చెప్పాడు.

20 అందుచేత యూదులు “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరేళ్ళు పట్టిందే. నీవు దాన్ని మూడు రోజులలో లేపుతావా?” అన్నారు.

£21 అయితే ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని ఉద్దేశించి అలా చెప్పాడు.

£22 కనుక చనిపోయిన వారిలో నుంచి ఆయన సజీవంగా లేచిన తరువాత, ఆయన తమతో అలా చెప్పాడని ఆయన శిష్యులకు జ్ఞప్తికి వచ్చింది. యేసు చెప్పిన మాట, లేఖనం వారు నమ్మారు.

£28 ఆయన పస్కా పండుగ సమయాన జెరుసలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సూచనకోసమైన అద్భుతాలు చూచి అనేకులు ఆయన పేరుమీద నమ్మకం ఉంచారు. £24 కానీ యేసు తనను వారి వశం చేసుకోలేదు. ఎందుకంటే అందరూ ఆయనకు తెలుసు. £5 మనిషిలో ఉన్నదంతా ఆయన తెలిసినవాడు గనుక మనిషిని గురించి ఎవరి సాక్ష్యమూ ఆయనకు అక్కర లేదు.

3 పరిసయ్యులలో నీకొదేము అనే పేరు గల మనిషి ఉన్నాడు. అతడు యూదులకు ఒక అధికారి. 2 ఈ

18:31-34 చూడండి.

2:22 14:26. లేఖనం అంటే ఇక్కడ పాత ఒడంబడిక గ్రంథం అని అర్ధం. లేఖనం అని ఏకవచనం వాడితే ఒక్క వచనాన్ని, లేక కీర్తన 16:10 లాంటి ఒక వాగ్దానాన్ని సూచించవచ్చు.

2:28 వ 12. ఆయన పేరుమీద నమ్మకం ఉంచడమంటే ఆయనను నమ్మి స్వీకరించడమే (1:12).

£2:24,25 కొందరు ఆయన పేరులో నమ్మకం ఉంచారు గాని ఆయన వారిలో నమ్మకం ఉంచలేదు. యేసు శరీరంతో ఉన్న దేవుడు (1:14). మానవ స్వభావం గురించి దేవుని కున్న జ్ఞానం ఆయనలో ఉంది - 1 రాజులు 8:39; యిర్మీయా 17:9,10. ఈ శుభవార్తలో ఆయనకున్న మానవాతీత జ్ఞానం గురించిన అనేక ఉదాహరణలున్నాయి (1:48,49; _ 4:17,18; 5:42; 6:26; మొ). మనుషులందరిలోనూ (భ్రష్ట స్వభావం ఉన్నదనీ విశ్వాసులు సైతం కొన్నిసార్లు తమ నమ్మకంలో చంచలంగా, అపనమ్మకంగా, లోతు లేకుండా ఉంటారనీ ఆయనకు తెలుసు. ఆయన సన్నిహితులూ, శిష్యులందరిలో (ప్రధాన శిష్యులైనవారు కూడా కొన్నిసార్లు ఆత్మ విషయాల్లో మందమతులుగా ఉండి ఆయన మార్గాలను అనుసరించలేదు. ఆయనకు గొప్ప అత్యవసర స్థితి వాటిల్లినప్పుడు కూడా ఎంతమాత్రం ఆయనకు తోడ్పడలేదు (మత్తయి 26:36-56).

3:1 పరిసయ్యుల గురించి మత్తయి 3:7 నోట్‌, ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఆచారాలు, మత కార్యకలాపాలూ ఆచరించడంతో కూడిన యూదుల మతానికి నీకొదేము చక్కటి ప్రతినిధి. ఇక్కడ మనం చదవబోతున్న సంభాషణలో యేసుప్రభువు ఒక విషయం స్పష్టం చేశాడు. అదేమంటే అలాంటి మతం అంతటినీ కలిపినా ఎవరినీ దేవుని సంతానంగా చెయ్యడం దానికి సాధ్యం కాదు. 8:2 నీకొదేము రాత్రివేళ ఎందుకు వచ్చాడో మనకు తెలియదు, గానీ యేసు అతణ్ణి ఉన్నది ఉన్నట్టుగా మామూలుగా స్వీకరించాడనీ (యోహాను 6:87 పోల్చి చూడండి), అతనికో గొప్ప సత్యాన్ని నేర్పించాడనీ మాత్రం తెలుసు. ఈ సత్యం కొత్త

↑ Back to top

↑