
నడిపించారు.
గోపాళం సునిత సాగర్, హైదరాబాదు
""శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను�� యిర్మయా 31:3
పరిచయము :
క్రీస్తు ప్రభువునకు సదా స్తుతి మహిమలు కలుగును
గాక! నా పేరు దినలకిష్మ మా తల్లిదండ్రుల పేర్లు మన్నెం
సుబ్బారావు గారు, మన్నెం తులసమ్మ గారు. నా బాల్యం
కృషాణ జిల్లాలో ఉయయారు సమీపాన గల కాటారు
గ్రామంలో గడిపాను. సస్యశామలంగా అందమైన పల్లెటూరులో కల్లా కపటము తెలియని ప్రజల మధ్య మమకారాలు ఆప్యాయతల సంపదలో తొమ్మది సంతానములో తల్లిదండ్రులకు చివర కుమార్తెగా పుటాటను. బాల్యము నుండి పూజలు చేసేవారము. నా మాడవ అక్క ప్రసవ సమయంలో గు��ం వాతం వలన ప్రమాధ స్థితికి చేరింది. ఉయయారు సి.భ.యం ఆసుప్రతిలో రక్రైస్తవ నర్సు సలహామేరకు అమ్మ పూజలతో పాటు క్రీస్తు అక్కను బ్రతికిసేత ఆయననే నవ్ముకుంటనని ప్రార్థించింది. ఆపరషన్ చేయుటకు సిద్ధపడిన వైద్య సిబ్బంది ఆశ్చర్యపడురీతిగా అక్క సుఖముగా ప్రసవించుట వల్ల అమ్మ వెంటనే క్రీస్తును నమ్మింది. ఆ రోజు నుండి బైబిలు సంపాదించుకొని వాక్యము చదువుకొని ప్రార్థిస్తూ ఒకటిన్నర సంవత్సరాలు రహస్య విశ్వాసిగా జీవించింది
అమ్మ పూజలు చేయుట మాని వేసి ప్రార్థించుకొనుట ఆనందంగా జీవించడం నేను గమనించేదాన్ని మా అమ్మ క్రీస్తు పట్ల విశావాసంతో చేస్తున్న ప్రార్థనలలో ఏకీభవించే దానిని అయిననా మా పెద్దమ్మ విగ్రహాలను పూజించేది ఆమెతో పాటు అలవాటుగా పూజలు కూడా చేసేదాన్ని ఆ రోజుల్లో నాకొక కల వచ్చింది. నా దగ్గర సమృద్ధిగా పండ్లున్నాయి. నేను చదువుకొనే వారందరికి పంచి పెట్టుచుండగా, ఇంకా చాలలేదని తెలసుకొన్నాను. మరలా తెచ్చి 35
సజీవ సాక్ష్యములు పంచుతానని చెప్పుచున్నట్లుగా కలలో కనిపించింది. నా కారోజులలో సరిగా అర్థం కాలేదు, ఆ తరువాత సంక్రాంత్రి పండుగ వచ్చింది. అందరితో పాటు కళాిపు వేసి ఆవుేపడతో గొ�ై్బమ్మ వేసి వాకిట్లో పెట్టుచున్నాను. ఆ క్షణంలో నా కొక స్వరం వినిపించింది. అమ్మ, ఆ పని చేయవద్దు అయిననా ఆ స్వరాన్ని లక్ష్యపెట్టలేదు. నా పని నేను కొనసాగించాను. ఆ తరువాత నాకు విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. మా అమ్మ ప్రార్థనలు ఆ స్వరం నాకు జ్ఞాపకం రాగానే ఆ పని వెంటనే ఆపివేసాను. ప్రార్థన చేసుకోగలిగాను. వెంటనే కడుపు నొప్పి తగిగపోయింది. ఆ తరువాత పూజలు చేయుటలో ఆసక్తి తగిగపోయింది. మెల్లగా పూజలు చేయుట మానివేసాను.
అమ్మ పాటలు పాడుచూ, ప్రార్థనచేసుకుంటున్నప్పుడు ఆమెతో కలిసి ప్రార్థనలో పాలుగనే దానిని. మా నాన్నగారికి నేను క్రీస్తును ప్రార్థించి పూజలు మానివేసినందుకు కోపం వచ్చేది. మీ అమ్మను ప్రార్థన చేసుకోనీయండి గాని మీరు మాత్రం ఆ నమ్మకంలోనికి పోవద్దు అనేవారు. ఒకరోజు మా నాలుగవ అక్క చెవిపోగులు స్నానాల గదిలో పెట్టి మరచిపోయింది. వాటిలో ఒకదానిని కాకి ఎత్తుకొని పోయింది. అమ్మకు తెలిసేత కొపపడుతుందని భయపడింది. అది అవసరమైన సమస్యగా తోచి నేను అక్క దేవునిని నమ్మకంగా ప్రార్థించాము. అద్భుతంగా కాకి తిరిగి అదే స్థలములో పడవేసింది. ఏలియాకు కాకులే ఆహారము తినకుండా అందించాయి అనే కదా నాకు తెలసు. దేవుని చిత్తంలో అసాధ్యములన్ని సుసాధ్యము చేస్తారని నమ్మాను. నాలో ఆ సంఘటన విశ్వాసాన్ని పెంచింది. అమ్మతో కలిసి ఆసక్తితో ప్రార్థించుట ఆరంభించాను. నాకు ప్రార్థన చేయు పద్ధతి సరిగా తెలియకపోయినా వచ్చి రాని పద్ధతిలో ప్రార్థించుటకు అలవాటు చేసుకున్నాను. అమ్మ పాటలు చాలా ఇష్టపేదానిని మా అమ్మ విశ్వాసము, పట్టుదల వలన నాలుగవ అకకయ్యకు పరిశుద్ధ వివాహము జరిపించింది. అది దేవుడే సమకూర్చినదని ఆనందించాము. ఒకరోజు నేను నిద్దపోవు సమయంలో ఎవరో ఒకరు మెడ పట్టి నొకికనట్లుగా భావించాను. అరచి సహాయము కోరాను గాని నా స్వరము పైకి రాలేదు. చాలా భయపడి యేసు నామంలో ప్రార్థించి యేసయ్యా అని గట్టిగా అరిచాను. నన్ను వెుడపట్టి బాధించిన ఆకారము పారిపోయింది. ఆ తరువాత నెమ్మది కలిగింది. మా అమ్మ క్రీస్తును నమ్మిందని తెలిసికొన్న కొందరు రక్రైస్తవుల
36 పాస్టు గారు విశ్వాసులు అమ్మను దర్శించి ప్రార్థించేవారు.
నాకు తెలిసిన పాస్టు �జక�గారు ఆయన భార్య ఒంటిపై ఏమ బంగారు వసతువులు ఉండేవి కాదు. నేను ఆ పరిస్థితి ఇష్టపడక బైబిలులో నగలు ఉపయోగించరాదని వ్రాసియున్నదా? అని ప్శ్నంచేదాన్ని. పాస్టరుగారు మెల్లగా చెప్పారు. అవ్మా, విశావాసంలో ఎదికగకొలది నీకే పూర్తిగా అర్థం అవుతుంది అనేవారు. నేనింకా హైాసాకలులోనే చదువుచుండగా వివాహము చేయాలని హిందా మతసతులనే వెదకుటకు నాన్నగారు రెండవ అన్నయ్య చాలా శ్రద్ధ వహించారు. నేను నా మనసులో ప్రార్థించుకొన్న విషయం ఏమనగా క్రీస్తు నమ్మిన వ్యక్తి మాత్రమే నాకు భర్తగా రావాలనియు, ఆమెతో కలిసి ప్రార్థించుట ప్రాముఖ్యమైన కోరికగా నాలో నిలిచింది. అంతే కాదు హిందామతంలో వ్యక్తిని తప్పించి మంచి విశ్వాసిగా ఉంచు కృప్రై వేడుకొన్నాను.
మా నాన్న వ్యవసాయం చేసేవారు, మాది మధ్య తరగతి కుటుంబము నేను పుట్టిన తరువాత నాన్నకు ఆస్తి బాగా కలిసి వచ్చిందని నన్ను చాలా ప్రేమగా చూచేవారు. ఏది అడిగినా వెంటనే ఇచ్చేవారు. అందరిలో చిన్నదానిగా పుట్టుట వల్ల అందరి ప్రేమను పొందాను. అందువలన నాకే బాధ్యతలు తెలిసేవి కావు. బాగా చదువుకోవాలని ఇష్టంగా ఉండేది. 1977వ సంవత్సరము మే 24వ తేదిన నేను తొమ్మదవ తరగతిలో ఉండగానే నిశ్చితార్థము జరిగించారు. అదే రోజుల్లో క్రీస్తును నమ్మిన కుటుంబంలో వివాహము నిరణయించినందన పేరు సునీతగా మార్చారు. విద్యాసాగర్ గారు విద్యావంతునితో నాకు మే 27వ తేదిన 1978 లో వివాహము జరిగింది. మా మామగారు బీరుకరు హైస్కూలులో ఉపాద్యాయ పని చేసేవారు. ఆయన మాతో పరిచయంగా ఉండుట వలన గోపాళ్నరసింహారావుగారు, కోటేశవారమ్మగారు క్రీస్తును నమ్మిన విశ్వాసులు నాకు మామగారుగా అతతగారుగా ఉండుట ప్రభువును స్తుతించాను. నాకు అక్కయ్యలు వదినలు ఉండుట వలన వంట పని నాకు తెలియకుండా వార చేసుకొనేవారు. ఇంటిలో పనివారుండేవారు పని చేసే అవసరత లేదు. మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదురొకన్నాను. మా మామగారు చాలాప్రేమగా స్వంత భడడ్ వలై చూచుకొనేవారు. అత్తగారు భక్తి జీవితాన్ని నేర్పింది. మామగారు నా పరిస్థితి అర్థము చేసుకొని వివరంగా బోధించి నన్ను దయతో కనిపెట్టి చూచుకొనేవారు. 37
సజీవ సాక్ష్యములు మా వారితో నా పెండ్లి జరుగునాటికి యం.ఎ. పూర్తి చేశారు. నేను ఒకరోజు బైబిలు ఏకాగ్రతతో చదువు సమయంలో ఒక పెద్ద త్రాచుపాము మంచము దగ్గరకు సమీపించింది పెద్దగా కేకలువేసి అరిచాను. బైబిలు చేతిలో తీసుకొని వేగంగా పరిరగతాతను. యేసు రక్తమే జయం అని మాడు సార్లు ఉచ్చరించాను. పాము నా వెనుక పడుట గమనించి యేసు నామంలో అరచి ప్రార్థించగానే వెనక్కు తిరిగి మా పడక గదికి చేరింది. ఆ రోజు ఎవరు లేనందన నా అరుపులు విని ప్రక్క ఇంటి వారు వచ్చి పామును వెదకి పట్టుకొని చంపారు. అది నేను ఉన్న దిశలో వస్తుందని చూచిన అంకుల్, అమ్మ, ఆ పాము నీపై పగ పట్టింది ఈ రోజు దానిని చంపక పోయినటై�్లతే అది పగ పట్టి నిన్ను కరిచేది. ఈ రీతిగా గొప్ప ప్రమాదము నుండి ప్రభువే నన్ను తప్పించారు. మా వారికి చదువుపై శ్రద్ధ ఎకుకవ కాబట్టి ఉన్నత విద్య చేయాలని ఎం.ఫిల్ చేస్తూ హైదరాబాదులో ఉండేవారు. నెలకు ఒక్కసారి వచ్చి 4 లేదా 5 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు. నిజమాబాదు జిల్లా ధర్మవరం అనే గ్రామంలో ఉన్న రోజుల్లో ప్రభువు నాతో సాటిగా మాట్లాడుట కారంభంచాడు. క్రీస్తు సజీవుడు, ప్రేమామయుడు ఆయన మెల్లని స్వరముతో నన్ను చేరి అమ్మ, నీవు నాలో నిలిచి నన్ను ప్రేమిస్తున్నావు, నీ మీద ఉన్న నగలు తీసివేయగలవా? అని అడిగినపుడు మా అత్తగారితో కూడ ఏమ చెప్పలేదు. కొన్ని రోజులుగా పదే పదే ఆ మాటలు వినిపించుట వలన ఆంధోళ్న కలిగించింది. ఆ తరువాత నాకు రకత స్రావము ఆరంభము అయింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నీర్సపడినందన గోడలు పట్టుకొని నడిచేదానను. కన్ను మాసిన వెంటనే ఆ స్వరము వినిపించేది. కళ్ళు తెరిసేత పై కసపు దాలాలు కనిపించేవి. ఈ రీతిగా 20 రోజులు కొనసాగింది. ఆ తరువాత ప్రభువు ఒక మంచి దర్శనాన్ని చూపించారు. నేను ఒక స్రీతని చూచాను. ఆమె ఒంటి నిండా నగలు పెట్టుకొన్నది. ఆమె చుట్టు పాములున్నవి ప్రక్కన మరో స్రీతకి నగలు లేవు. ఆమె చుట్టు వెలుగు ఆవరించి యున్నది. ఈ దృశ్యము నా కంటికి పదే పదే కనిపించసాగింది. నిజానికి బంగారము అంటే నాకు చాలా ఇష్టము ఉండేది. కళ్ళు మాసినా, తెరచినా అదే దృశ్యము 3 రోజులుగా నా వెంట పడింది. ఒక వేళ్ నేను చనిపోతే నా పాప ఒంటరిగా మగిలి దికుక లేనిదై పోతుంది అనిపించింది. నేను నరకానికి వెళ్ళిపోతానన్న భయం ఆవరించింది. నాలో
38 అంతరంగ ఆలోచనలకు జవాబుగా నేను నగలు తీసివేయాలని నిరణయించుకొన్నాను. ""ప్రభువా, నీవు నాకు చూపిన దర్శనానికి లోబడి నా నగలు తీసివేస్తున్నాను. అని తెలిపాను. నా నగలు పెటైటలో పెట్టి ప్రక్కలో పెటాటను. అదే రాత్రి మరొక దర్శనము చూపించారు. నేను పెద్ద కాలువ దాటి గుట్టు కూడ దాటను. ఇద్దరు దేవదాతలు తెల్లని వస్త్రములతో కనిపించారు. నన్ను చేయి పట్టి నడిపిస్తున్నారు. నాతో వారు సంచరించుచు నడసతున్నారు. ఎదురుగా ఒక కొండ కనిపించింది. ఆ కొండపై ఒక సిలువను చూచాను. ముగ్గురము ఆ ప్రాంతమును సమీపించాము. నన్ను చేయి పట్టుకొని చివరకు పరలోక రాజ్యమునకు తీసుకొని వచ్చి అందలి అందమైన దృశ్యములను చూపించారు. దాన్ని చూచి పరమానంద బభరితురాలనయయాను. అంతలో ఆ దర్శనము ముగిసింది. వెంటనే మెలకువ వచ్చింది. నాకు తెలియని రీతిగా కొండంత ధైర్యము శరీరంలో శక్తి చేరింది. నా అనారోగ్యము మటుమాయవైంది. నేను వెంటనే లేచి వంటగదిలో ఉన్న అత్త గారితో నేను వంట చేస్తానండి అన్నాను, నా వైపు చూచి ఆశ్చర్యపడింది. అప్పటికే నా ఒంటిమీద నగలు తీసివేశాను. నా అత్తగారితో నా దర్శనము గురించి నా నిరణయముల గురించి వివరంగా తెలిపాను. నా అత్త మామగారు క్రీస్తును ప్రేమించే విశావాసులైనందన నా నిరణయమును బట్టి చాలా సంతోషించారు. నా భర్త హైదరాబాదు నుండి వచ్చి నన్ను చూచి ఆశ్చర్యపడిననా విషయము తెలసుకొని ఏమ విమర్శంచలేదు. ఏమ ప్శ్నంచక మౌనంగా అంగీకరించారు. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడనా ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ప్రభువు నా సహాయకుడు నేను భయపడను. ఆ రాత్రి నేను ఆ వాగా�నములో ఉన్న మాటలను బట్టి ప్రభువా నన్ను ఎన్నటికినీ విడచిపెటటకూడదు. నేను కూడ నీ ప్రేమకు దారంగా ఉండక నీతోనే ఉంటనని నిబంధన చేసుకోగలిగాను. ఆ ప్రేమ నన్ను ఆనాటి నుండి ఈ నాటి వరకు గొప్ప ఆనందము నిరీక్షణతో మంచి విశ్వాసిగా క్రీస్తును ఆరాదించుచూ స్తుతించి మహిమపరచుకృప నిచ్చి నడిపించుచున్నది. హల్లెలూయ.
నా భర్త పై చదువులు చదువుచుండుట వలన ధన సంపాదన లేనందన నాకు చింతగా ఉండేది. నేను నా భర్త, నా పాప ఇంటిలోభారంగా ఉన్నామని 39
సజీవ సాక్ష్యములు ఆలోచన కలిగి నా భర్తకు మంచి ఉద్యోగము రావాలని చాలా భారముతో ప్రార్థించుట కారంభంచాను. 15 రోజుల తరువాత నా భర్త విద్యాభ్యాసం చేసిన కామారెడిడ్ కాలేజిలో ఖా�లున్నవని తెలిసికొని అప్లై చేయగా వెంటనే ఉద్యోగము అభించింది. దేవుని మహా కనికరమును బట్టి చాలా స్తుతించాను. ప్రత్యేకంగా కాపురము పెట్టినపుడు నా తల్లి �లాంబరి మన్నె తులసమ్మ గారు వచ్చి వస్తులన్ని అమర్చి ప్రార్థించి వెళ్ళారు. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు అతి సన్నిహితంగా ఉండుటను బట్టి నా కుటుంబాన్ని దీవించి, గర్బ�పఘలమును బహుమతిగా ఇచ్చి కుమారుని స్వాస్థ్యముగా ఇచ్చి నాకు అధిక సంతోషము కలిగించారు. మా పెద్దన్నగారి అవ్మాయి, చిన్నతతగారి అబ్బాయి కూడ మా కుటుంబముతో పాటు కలిసి ఉంటా మా వారి కాలేజిలో విద్య నబభ్యసించేవారు.
చేతబడి ప్రభావము నుండి ప్రభువు తప్పించారు :
ఒక రోజు నా ఇంటి పైనండి క్రిందికి చూస్తు గమనించినపుడు కూరగాయలు కొనేవారు వస్తూ, పోతు కనిపించారు. ఒక వ్యక్తి కాష్య వస్త్రములు ధరించి అతడు వంకాయలు కొంటున్నాడు. అతని సంచి నిండా వంకాయలు నింపుకొనుచా, ప్రక్కనన్న ముగ్గురు వ్యకుతలకు వంకాయ ఇప్పించుట చూచాను. నేను అతనిని గమనిస్తూ ప్రభువా ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు. అని మనసులో అనుకొనే దానను. వెంటనే అతడు తల పైరకతిత చూచాడు. అదే రాత్రి అతను నా కలలోకి వచ్చాడు. చిజానికి అతను చేతబడి చేయించే వ్యక్తిగా నాకు ప్రభువు పరిశుద్ధాత్మతో గ్రహింపునిచ్చాడు. ఆ రాత్రి కలలో నాకు అతడు కనిపించాడు. అతని చేతిలో మట్టితో చేసిన బుమ్మలు ఉన్నవి. అవి నెమ్మదిగా నా దగ్గరకు సమీపిస్తున్నవి. ఆ రీతిగా నా వైపు 9 బుమ్మలు పంించసాగాడు. ఆశ్చర్య రీతిగా ఆ బుమ్మలు నన్ను చేరుటకు సాహసము చేయలేకపోయాయి. ఎందుకనగా నా చుట్టు వింతైన కాంతివంతమైన వెలుగు ఆవరించినట్లు నేను చూడగలిగాను. అవి నాకు దారంగా నిలిచిపోయాయి. అవి చేతబడి ప్రభావముగా గుర్తించాను. వెంటనే 3 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాను. అవి ఇక ఎన్నటికినీ నన్ను సమీపించలేదు. ఆ రీతిగా నా ప్రార్థనల ద్వారా పసైతాను శకుతలు, అంధకార
40 శకుతల ప్రభావము నన్ను హాని చేయకుండనట్లు ప్రభువే నన్ను కాపాడి రక్షించాడు. దేవునికే మహిమ కలుగును గాక!
బాబుకు అస్వస్థత నుండి క్రీస్తు రక్షించాడు :
మా విశావాస జీవితము క్రమంగా సాగిపోవుచున్న రోజుల్లో మా బాబుకు చాలా అస్వస్థత కలిగింది. సరిగాగ 9 నెలల పసివాడుగా ఉన్నప్పుడు బాగా విరోచనాల వలన నీర్సంగా ఉండగా మా వారు అసుప్రతి తీసుకొని వెల్లు అని చెప్పి కాలేజికి వెళ్ళారు. అందరు ఇళ్ళు విడచి వెళ్ళగానే బాబును ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాలని ఇంటికి తలుపు తాళ్ము వేయుచుండగా ప్రభువు సాటిగా స్వరముతో మాట్లాడారు. అమ్మ, నేను నీకు సహాయము చేయలేనా, నేను నీకు లేనా? అని చెప్పిననా, ఆ స్వరమును లెక్క చేయక పిల్లవాడు ఏమగునో అనే భయం ఆవరించి దగ్గరలో ఉన్న ఆసుప్రతికి తీసుకొని వెళ్ళాను. ఆయన వెంటనే వైద్యము చేసి రెండు ఇంజక్షన్లు ఇచ్చి, టానిక� రాసి పంపించారు. బాబుకు విరోచనాలు తగ్గలేదు ఇంకా ఎకుకవ అయయాయి. బాబు నీరసించి పోయాడు. నా భర్త కాలేజి నుండి ఆలస్యంగా వచ్చాడు. బాబు గుకక పెట్టి ఎడువటం వెుదటు పెటాటడు. నేను బట్టలు శుభ్రం చేసే పనిలో ఉన్నాను. మా అన్న కుమార్తె బాబును ఎత్తుకొని ఆడిస్తుంది. ఆమె చేతిలో వ్రేలాడిపోవుచున్న బాబు మన స్రృహాలో లేడని గుర్తించి మధు నన్ను పిలిచింది. పరుగున వచ్చి పిలిచాను. బాబు కళ్ళు తెరచుట లేదు.
ఆ బాబును చాప మీద పడుకోబైట్టి తలుపువేసి మోకరించి ఎలురగత్తి వెు��పెటాటను. ప్రభువా నా భడను బ్రతికించు అని కన్నీరు కార్చాను. వాబు బ్రతికితే నీకే సమర్పిస్తానని నిబంధన చేసుకొన్నాను. ప్రతి ప్రమాదకరమైన స్థితిలో, ఆపతాకలములో నాకువెు��పెట్టుము నేను నీకు ఉతతరముచ్చెిదనని వాగ్దానము చేసిన నా ప్రభువు నమ్మదగినవాడు. మాట ఇచ్చి నెరవేరచువాడు. సరిగాగ 15 నిముషములలో ఆశ్చర్యరీతిగా మెల్లగా కన్నులు తెరచి నా వైపు తేరి చూచాడు. పటటలేనంత ఆనందంలో దేవుని స్తుతించాను. యెహోవాను ఆశ్రయించు నరుడు ధనయడు. ఆయన తనను నవ్ముకొనువారికి కేడెముగా, ఆశ్రయ దుర్గముగా, కోటగా, కాపరిగా ఉండి రక్షించు సమర్థుడు. నన్నా 41
సజీవ సాక్ష్యములు కనిపెట్టి కాపాడుచూ, నా దీన ప్రార్థనలను ఆలకిస్తూ సంతోషం కలిగించారు. నాలో క్రీస్తు పట్ల ప్రేమ విశ్వాసములు అదికవైనందన ఆయనలో ఆనందిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ దేవునిని స్తుతించి ఘనపరచుటకు అలవాటు చేసుకొన్నాను. ఆ రోజులలో రాజకీయములు అధికమైన ప్రాధాన్యత గల కాలము తెలుగు సినిమా రంగంలో పేరు గడించిన రాజకీయ రంగంలో చేరిన శ్రీ యన్.టి. రామారావు గారు ప్రభావితం చేసిన కొందరిలో నా భర్త మొదటి వ్యక్తిగా మారిపోయారు. కాలేజి ఉద్యోగాన్ని వదలిపెట్టి రాజకీయాలలో కాలం గడిపేవారు. చివరకు యం.ఎల్.ఎ పదవి వ్యామోహంలో కాలేజిలో ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పేవారు. నేను నా పిల్లలను, నిన్ను పోషిస్తానులే అని చెప్పేవారు. నేను సరనని ఒప్పుకొన్నాను. ఒక రోజు ఉ దయూన్నే నా భర్త ప్రిన్సిపాల్ యొద్దకు వెళ్ళి నా బదులు నా ఉద్యోగము వేర వాళ్ళకు ఇవ్వండి. నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వచ్చారు.
నాతో చెప్పినదేమనగా లారీ తీసుకొని వస్తాను సామాను స్ర్దిఉంచు మనము ధర్మారము వెళ్ళిపోదాము అన్నారు. నేను పిల్లలను సాకలుకు పంపి, సామాన్లు సరు�టకు సిద్ధపడినాను. ప్రభువు ఆ క్షణములో సాటిగా నాతో మాట్లాడారు. అవ్మా, లేచి ప్రార్థన చేయి అని వెంటనే నేను లేచి ప్రార్థన చేశాను. ప్రభువు ఆయన మెల్లని మధుర స్వరముతో తిరిగి మాట్లాడి అవ్మా, నేను ఉన్నాను. బభయపడకుమని అభయమిచ్చారు. ఆ మాటలు నన్ను చాలా ధైర్యపరిచాయి. మా అత్త మామలు విశావాసులైనందన వారి కుమారుడిని భక్తిలో పెంచారు. కష్టపడి చదివించారు. యోగ్యమైన ఉద్యోగము చేసి భార్య భడడ్లను పోషించుకొనవలసిన వయససులో రాజకీయ జీవితం ఆధారము లేని వ్యర్థ జీవితమని వారి కుమారునికి, నా భర్తకు నచ్చిజైప్పి ప్రార్థించసాగారు. మా వారు ముకుకసాటిగా, నిర్మోహామాటంగా జీవించే వ్యక్తి అయిననా ఆ సమయంలో తల్లిదండ్రుల మాటను మన్నించారు. వారి అభ్యర్థన మేరకు ్ర్రిన్సిపాల్గారు రాజీనామా ప్రతాన్ని ఉపసంహారించుకొని తిరిగి ఉద్యోగాన్ని వారికి ఇచ్చారు. ఆ విధంగా నా ప్రార్థన, మా అత్త మామ గారి ప్రార్థన వలన తిరిగి అసాధ్యమైన పరిస్థితిలో ఉద్యోగము నిలబడింది. దేవుడు మనకు కృపతో దయచేసినదే అంగీకరించాలి గానీ ఇష్టము వచ్చిన స్థానములను
42 కోరుకొనరాదని ్రశ�యసకరవైనది ప్రభువు తనను ప్రేమించిన వారికి ఇస్తారని మేమంతా నవ్మాము. మాకు రాజకీయ పదవులు ఏమాత్రం ఇష్టం లేదు. పాపకు 5వ సం��లో ఒంటి నిండా పొకుకలు వచ్చాయి నాకు తెలియక సా�నము చేయించాను. మొదటిగా చిన్నగా ఉన్న పొకుకలు పెద్దగా మారి కాలిన బుబ్బల వలై అయయాయి. ఏమ చేయాలో తోచలేదు. ధర్మారం వైద్య చికిత్స కొరకు తీసుకొని వెళ్ళాము. ఆ తరువాత పాప కోసం ప్రార్థించాను. ఆ రోజు మా పాపను ఎవరో తీసుకొని వెళ్ళాలని కంప�ండు లోనికి ప్రవేశించుట చూచి భయపడి ప్రార్థన చేస్తూ సన్నిహితులందరిని ప్రోగు చేసి భారముతో ఏకంగా చేరి పట్టుదలతో ప్రార్థన చేశాము. ఆ రోజు మొఱ్ఱ పెట్టిన ప్రార్థన పఘలితంగా పెద్దగా ఉన్న పుండ్లన్ని కీషణించి సంపూరణ స్వస్థత ఇచ్చారు.
దేవునికే సంపూరణ మహిమ ఇచ్చి ఘనపరిచాము. దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించే సమయంలో ఏదో ఒక శోధన మరల పొంచి ఉందని తెలిసింది. నేను ప్రార్థన చేయు సమయంలో పడగ విప్పిన పాము కనిపించింది. మరలా 3 రోజులు శోధన నుండి, కీడు నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థించాను. అనుకోని రీతిగా నా భర్త కాలేజిలో కా�సులోనికి ప్రవేశించు సమయంలో ఒక విధ్యార్థి చేతితో రాయి తీసుకొని నా భర్త తల పైకి విసిరాలని ప్రయత్నించాడు. ఇది గమనించిన మరొక విధ్యార్థి గాయపరచాలనుకొన్న వ్యక్తి నుండి రాయిని లాగివేశారు. ఆరీతిగా ప్రభువు నా భర్తకు రాబోయే కీడు నుండి తప్పించారు. ఎదురొకనే శోధన గురించి ప్రభువు శిష్యులతో చెప్పినట్లుగా మీరు మెలకువగా నుండి ప్రార్థించండి అని హెచ్చరించగా నిద్దపోయారు. నాకు కలిగిన హెాచ్చరికకు లోబడి ప్రార్థించి జయం పొందాను.
మా పాప ఎదురొకన్న మరొక ప్రమాదము నుండి క్రీస్తు రక్షించారు.
నేను క్రీస్తుతో అతి సన్నిహితముగా జీవిస్తూ ప్రార్థన, వాక్యము, సహవాసము సంఘపరిచర్యలో ఎడతెగక ఆసక్తితో గడుపుచున్న సమయాన్ని బట్టి రాబోవు ప్రమాదాల నుండి దేవుడు ముందుగా చూపించి నాచేత తగిన రీతిగా భద్రత కోసం ప్రార్థించుమని హెచ్చరికలు చేసిన క్రీస్తుకే సదా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మా పాపను ధర్మారంలో వాళ్ళ నానమ్మ, తాతయ్య దగ్గర ఉంచి మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. అన్నయ్య మనువుడు 43
సజీవ సాక్ష్యములు ప్రమాదవశాతతు బాలుడుగా ఉన్నపుడే మరణించాడు. నా స్వకీయులంతా దు:ఖములో ఉండగా నేను కూడ వారి ఇంటికి చేరాను. పాప భద్రత కొరకు ప్రార్థిస్తునే ఉన్నాను. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. అవ్మా, నీవు ధర్మారం వెళ్ళు నేను వెళ్ళుటకు వీలు లేక అందరా బాబు మరణించిన బాదలో నుండగా నేను ప్రయాణం చేయలేకపోయాను. ప్రభువా, పాపను ప్రమాదము నుండి కాపాడు, ఏ కీడు రానీయకండి అని ప్రార్థించి, మా అన్న ఇంటిలోనే ఉండిపోయాను. ఆ రాత్రి నాకు కలలో మా పాప మరణించినట్లు గాను, అందరు ఏడసతున్న దృశ్యము కనిపించింది. నాలో కాసత భయము కలిగిననా చర్చికి వెళ్ళి మౌనంగా ఏడ్చి ప్రార్థించుకొని వచ్చి ఆ తరువాత తిరిగి ధర్మారంలో మా అత్త మామలు పాప ఉన్న ఇల్లు చేరాను. వారు చెప్పిన విషయవేమనగా పాప ఉదయ కాలములో కోళ్ళను తరుముచున్నప్పుడు తన కాళ్ళ మీద పెద్ద త్రాచు పాము వెళ్ళి దాటినదట. ఆ స్థితిలో పాప వెంటనే నాన్నమ్మ పాము, పాము అని అరచిందంటా నాన్నమ్మ పరుగున వచ్చి పాపను దగ్గరకు తీసుకొని ప్రభువే ప్రమాదము నుండి తప్పించాడని దేవుని స్తుతియించినదట నేను ఆ ఇల్లు చేరిన వెంటనే ఈ విషయం తెలిపారు.
""యెహోవా యందు భయభక్తులు గలవారి చుటాట ఆయన దాత కావలియండి వారిని రక్షించను�� కీర్తన 34:7
పాప తప్పిపోయి దొరుకుట :
ఒక రోజు మా పాప 4వ తరగతిలో ఉండగా సమీపంలో నున్న సాకలులో నవంబరు 3వ తేదిన జాతీయ పండుగల వేడుకలు జరుగుట వల్ల ఆ రోజు కొంచెము ఆలస్యమగుట వలన త్వరపడి ఇల్లు చేరుటకు ప్రయత్నించింది. వచ్చే కంగారులో ఒక బాటు చిన్న గంటగా నున్న గోతిలో పడింది. చీకటిలో తాను భయపడింది. తాను లేచి నిలువబడి బాటు తీసుకొని వచ్చునపుడు ఒక వ్యక్తి పాపను సమీపించి పాప, మీ నాన్నగారు ష� షాపులో ఉన్నారు నిన్ను తీసుకొని రమ్మన్నారు వెళ్దాము రమ్మని పిలిచాడు. నిజముగా నాన్న గారు పిలిచారని పాప నమ్మి అతని ప్రక్కగా నడిచి వెళ్ళసాగింది. కొంత దారము వెళ్ళిన తరువాత పాప తెలివిగా ప్రశ్నించింది. మా నాన్న కనబడలేదు ఎక్కడ ఉన్నారు అన్నది. ఆ సమయంలో శనివారము గనుక ఉపవాస ప్రార్థన
44 సమయం గనుక ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రభువు తన భడడ్లకు ప్రమాదము పొంచి యున్నదని గుర్తించి నన్ను హెచ్చరించారు.
""అవ్మా, నీవు వెంటనే వెుయిన్ రోడడు మీదకు వచ్చి చూడు�� ప్రభువా నీవే నా భడను తీసుకొని రావాలి. నేను వెళ్ళలేను అని జవాబిచ్చాను. నా పాపను ఎత్తుకొని వెళ్ళిన వ్యక్తి వెంటనే ఆ పాపను ఆ పాపతోనే పలికించిన మాట ఆశ్యర్యం కలిగింది. పాప నేను నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. ఆ మాట చెవిన పడగానే మా పాప పరురగతతుకు తప్పించుకోవాలని ప్రయతి�ంచిందట అతడు వెంటనే పాప చేయి పట్టుకొని ఎతతుకున్నాడట. పాపకు ప్రార్థన చేయుట తెలియును గనుక ప్రభువా నన్ను కాపాడు అని మనసులో ప్రార్థన చేసిందంటా అదే సమయంలో ఒక పోలిసు ఎదురయయాడు అతనికి సంశయము రాకుండా తప్పించుకొని పోవడానికి ప్రయతి�ంచాడట పాప ధైర్యముగా పోలీసు భుజము పై చేయి ఉంచి నన్ను ఎత్తుకొని పోతున్నాడండి అన్నదంట. పోలీసు పాపను ఎత్తుకొని పరురగతతుచున్న వ్యక్తిని వెంబడించినపుడు చుట్టుప్రక్కల ప్రయాణించేవారు గమనించి అతనిని పాపను విడిపించారట. పోలీసు నా పాపను నా ఇంటికి తీసుకొని వచ్చి అప్పగించాడు. సరిగాగ 5 నిమషాలు గడిేసత ఆ దారిలో ఎవరా నడసతూ కనిపించేవారు కాదు గనుక సుళువుగా నా పాపను దొంగ ఎతతుకొనిపోయేవాడే . నా పాప నాకు దకేకది కాదు. నేను వెంటనే నా పాప పట్ల చేసిన అద్భుత కార్యములను బట్టి కృతజ్ఞతతో ప్రార్థించాను నా భడను నాకు అద్భుతముగా దకికంచిన దేవునికి సోత్రతము చెల్లించాను. ఈ విధమైన పలు శోధన బాధలు, ఇరుకులను ఎదురొకన్నాను. నా శ్రమలు బాధలు ఎవరికి చెేపపదానను కాదు. ప్రతి విషయాన్ని ప్రభువు సన్నిధిలో నుండి ప్రార్థించుకొనేదానను. ఎన్నోసారులు ప్రభువే నాకు నేర్పించి జ్ఞానోదయం కలిగించేవారు. యిర్మయా 33:3
ఈ వాక్యము నాకు ఆదర్శముగా నిలిచి ఆదరించింది. ఆ తరువాత 1991 వ సంవత్సరములో మేము హైదరాబాదు చేరాము. నా భర్త ఉన్నత విద్యాబ్యాసము పి.హెచ్.డి చేయదలచి రోజు హైదరాబాదు నుండి కామారెడిడ్ కాలేజికి వచ్చేవారు. ఆ రోజుల్లో నా కుమారునికి శరీరముపై పొకుకలు వచ్చాయి జ్వరం కూడా వచ్చింది. అదే రోజుల్లో మా అమ్మ లకీ� తులసమ్మ గారి ఆరోగ్యం కీషణించి నన్ను చూడదలిచారు. నా ఇద్దరి భడడ్లను అత్త మామగార్ల 45
సజీవ సాక్ష్యములు వద్ద వదలి ఒంటరిగా అమ్మను చూడాలని వెళూత వారిరకై ప్రార్థించి వెళ్ళాను. ఆ తరావాత మా ఆడపడచనకు బాబు పుట్టినందుకు చూడాలని నిజమాబాదు వచ్చాను. ఆ సమయంలో నా పెద్ద ఆడపడచు రాణి భర్తగారైన దైవజనులు భ.ఎస్ పాలుగారు అవ్మా, నీవు తిరిగి హైదరాబాదు వెళ్ళవద్దు. మీ అమ్మగారు మరణించబోవు చున్నారు. రపటి రోజు ఆమె ప్రభువు దగ్గరకు వెళ్లాలని సిద్దపడి ఉన్నారని తెల్పారు. నేను చర్చిలోనికి వెళ్ళి నా తల్లి కోసము, నా బాబు కోసం భారంతో ప్రార్థించాను. అమ్మ దగ్గరకు వెళ్ళుట అత్యవసరమని గ్రహించి వెళ్ళాను. మా అమ్మ చాలా నీర్సంగా కనిపించారు కానీ ప్రభువు చేరాలనే ఆనందం చూచాను. పిల్లలను తేలేదేమ అని అమ్మ అడిగింది. పిల్లలను చూడాలని ఆశించింది. బందువులు స్వకీయులు సన్నిహితులందరి సమక్షంలో ప్రాంతంగా ఆమె ఎకుకవగా ప్రేమించిన ప్రభుని దగ్గరకు వెళ్ళిపోయింది.
మా అందరికీ క్రీస్తు వెలుగును అందించిన మా తల్లి గొప్ప విశ్వాసిగా అనేకులకు సాక్షిగా నిలిచిన ప్రియమైన తల్లి ప్రభువునందు నిద్రించినది. సమాధి కార్య్రకమము చాలా ఘనముగా ప్రాంతంగా కొనసాగింది. అన్ని కార్య్రకమములు అనగా జ్ఞాపకార్థ కూడికలన్ని ముగించుకోని తిరిగి నా గృహము చేరాను. అప్పటికే నా కుమారుని శరీరముపై పొకుకలు వీపుపై బాగా బాధించి మండుట వల్ల బాధ పడుచునే ఉన్నాడు. నేను భారంగా ప్రార్థించే సమయంలో బాబు మంచము చుటాట కంచె వున్నట్లు దర్శనములో చూచాను. పాస్టు గారికి కబురు చేసి వచ్చి బాబు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలని కోరాను. పాస్టు గారు వచ్చి యేసు నామంలో నానె రాసి ప్రార్థన చేసి వెళ్లారు. యెహోవా స్వస్థపరచు దేవుడు గనుక ప్రార్థనా పఘలితంగా బాబు బాగయయాడు.
నా భర్త కాలేజి లైక్చిరరుగా పని చేయుచున్నపపటికీ ఆయన మనససు నిండ రాజకీయాలు చేయాలనీ ఆశ ఉండేది. ఇక ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఆ రోజుల్లో ఎన్.టి. రామారావు గారు నీకు ఎన్నికలలో పదవి ఇప్పించగలనని వాగ్దానం చేసారట ఇక పగలు రాత్రి అదే పనిలో తిరుగుచూ ఇల్లు పట్టించుకోలేకపోయేవారు. మా అత్త, మామగారు, నేను ఆయన గురించి ప్రార్థన చేసేవారము. ఆశించిన రీతిగా పఘలితము
46 రాలేదు. ఆయన కోరినట్టు సీటు పొందలేదు. ఆ రోజులలో రాజకీయములలో చాలా గొడవలు జరుగుచూ ఉండేవి. ఎన్.టి. రామారావు గారు నా భర్తను పర్సనల్ పసర్రకటరీగా నియమంచుకొని పనులు అప్పగించారు. ఈ రీతిగా కొంత కాలము కొనసాగింది. నా పరిస్థితి చాలా దిగులుతో దిగజారింది. నా భర్త ఉద్యోగము పోయింది. ఆధారపడిన నాయకుడు మరణించాడు. ఏ పోస్టు చేయుటకు నా భర్తకు పని లేదు. నా భర్త చాలా కృంగిపోయారు.
ఆ రోజుల్లో నాకున్న ఒకే ఒక్క ఆదారం ప్రభువు సన్నిధి. ఖాళ్ళ సమయంలో మోకరించి కన్నిటితో ప్రార్థన చేశాను. నా ఇద్దరు పిల్లలు చదువుచున్న సమయంలో అవసరములు ఎకుకవైనపుడు క్లిష్ట పరిస్థితుల నెదురొకన్నాము. పాప ఇంటరు, బాబు 9వ తరగతి చదువుచుండగా అందరం ప్రార్థన చేసేవారము. ప్రభువు నాకు ఆలోచనచెప్పెవాడు గనుక పఘలానా వ్యక్తికి ఫొను చేయువ్మా అని చెప్పాడు. నాకు నిద్ద రాలేదు. ప్రభువు మరలా నన్ను నిద్దలేపి ఫోను నెంబరు రాసకో అన్నారు. పదే పదే సాటిగా స్పష్టంగా వివరించారు. ఆ నిద్మతతులో లేచి డైరీలో నెంబరు వ్రాసుకున్నాను. ఆదివారము ఆరాధనకు వెళ్ళినపుడు ఆ ఫోను నెంబరు గల వ్యక్తికి ఫోను చేశాను. అవ్మా, మీ ఆయన నాపై కోపం తెచ్చుకున్నారు కదా అసలు ఉద్యోగము చేస్తాడో లేదో అని అపనమ్మకము కనపరిచాడు. ప్రభువా మీర నాకు నెంబరు ఇచ్చి ఈ వ్యక్తి నా భర్త ఉద్యోగము గార్చి సహాయపడగలరనే ఆశ కనపరిచారు కదా! అని నమ్మకముతో ప్రార్థించుకున్నాను. నా భడడ్లతో చెప్పినదేమనగా ప్రభువు నాన్నకు తప్పక ఉద్యోగము ఇస్తాడు. అన్నపుడు వారు అవ్మా, నాన్న ఉద్యోగము మాని చాలా రోజులు అయింది కదా, తిరిగి ఉద్యోగము వచ్చే ఆశ ఉందా అని అనుమానము వ్యక్తం చేశారు. ప్రభువు నెంబరు ఇచ్చిన వ్యక్తి బ్రాహ్మాణుడు, అనయడు అయినను ఆయన ఫోను దేవుడే చెప్పి ఇచ్చినందన నమ్మకంతో ప్రార్థించాను. ఆయన వెంటనే నా భర్తను రమ్మని పిలిచి మాట్లాడారు నేను ఆ వ్యక్తితో కలిసి ధైర్యంగా కమీషనర్ గారి చెంతకు వెళ్ళాము. నా ప్రభువు నమ్మదగినవాడు ఆలోచన కరత, ఆశ్చర్యకరుడు గనుక నేను ఎలా మాట్లాడవలైనో, ఏమ మాట్లాడవలైనో సమసతము చెప్పారు. ప్రభువు నాతో చెప్పిన జవాబు చెప్పాను. ఆ కమీషనర్ ఒక స్రీత అయినను నా పట్ల దయతో మాట్లాడి, 47
సజీవ సాక్ష్యములు వెంటనే నా భర్త పని చేసి రిజైన్ చేసిన కామారెడిడ్ కాలేజి ఆపఫిసరు గారికి ఫోను చేసి మాట్లాడారు. మరుస్టి రోజు నుండే ఉద్యోగములో చేరవచ్చును అని చెప్పి వివరించారు. దేవుడే నా కుటుంబము పట్ల చేసిన గొప్ప అద్భుత కార్యమును బట్టి దేవుని స్తుతించి ఘనపరిచాము. ఇది ప్రభువే నాకు ఆలోచన చెప్పి గొప్ప కార్యము తలపెట్టి కొనసాగించి మమ్ములను ప్రేమించి కృప చూపినందన మా అందరిలో అధిక విశ్వాసము కలిగింది. ఆయన మన గురించి చింతించేవాడు ఆయన తలపెటటగా ఎవరా ఆపలేరు అని గ్రహించాము. దేవునికి సోత్రతము నా భర్త తిరిగి ఉద్యోగములో చేరి శ్రద్ధగా పని చేసుకొనుట మాకు ఆనందం కలిగించింది. మా మామగారు నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. అనుకొనని రీతిగా రెండవ సారి గండెపోటు వచ్చినందన ఆసుప్రతిలో చేర్చాము. ఒక వారము ఆసుప్రతిలో ఉంచాము కొంచెము తగిగంది.
ఆయన పిల్లలందరిని దగ్గరకు తీసుకొని ఇస్సాకు తన భడడ్లను దీవించినట్లు, యాకోబు తన భడడ్లను దీవించిన రీతిగా దీవించి మంచి ప్రార్థన చేసి ఆశీర్వాదించారు. అందరికీ మంచి మాటలు చెప్పారు బాగా చదువుకొని మంచి బిడ్డలుగా జీవించాలనీ హెచ్చరించారు. ఆ తరువాత గండెపోటు తీవ్రంగా వచ్చినందున ప్రభువు ప్రేమించిన వ్యక్తిగా మంచి జీవితం జీవించి ఆదర్శంగా మంచి విలువలు పాటించి ప్రభువునందు నిద్రించారు. నన్ను తన స్వంత భడడ్గా ప్రేమించేవారు. తండ్రి ప్రేమను ఆయనలో కనుగొన్నాను. నన్ను ప్రేమించి సలహాలిచ్చి ఆత్మీయతలోనికి నడిపించిన ఇద్దరు గొప్ప వ్యకుతలు నా తల్లి, నా మామ గారు ప్రభువును చేరిన తరువాత నాకు కొండంత అండ పోయినదని దు:ఖించాను. నన్ను సరిగా అర్థం చేసుకొన్న ప్రభువు నన్ను ఆదరించి ధైర్యపరిచారు. నా అత్తగారు దైవ భక్తి గల వ్యక్తి మేము ధర్మారం వెళ్ళి ఆమె దగ్గరకు చేరాము. ధర్మారంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయయాయి. తిరిగి అత్తగారిని తీసుకొని హైదరాబాదు చేరి అద్దె ఇంటిలో నివసించాము. నా అత్తగారితో కలిసి స్వంత గృహము కొరకు భారంతో ప్రార్థన చేశాము. ఆయన మా మొఱ్ఱ ఆలకించి మౌలాలి హెచ్.భ. కాలనీలో ఇల్లు కొనుటకు కృప చూపించారు. క్రొత్త గృహము చేరిన తరువాత 2000 సం��లో మా కుమార్తెకు వివాహము జరిగినది. మా బాబు డి�్లలో యం.భ.ఎ
48 చదుకోవడానికి వెళ్లాడు. ఇద్దరు బిడ్డలు ప్రభువును ప్రేమించి ప్రార్థించుకొనేవారు. మా పాపకు గర్బ�పఘలాన్ని బహుమతిగా ఇచ్చి పాపను అనుగ్రహించాడు. నా బాబు విద్యాబ్యాసము ముగిసిన వెంటనే �.సి.�.సి.� బ్యాంకులో ఉద్యోగము లభించింది. దేవుడు మా అందరినీ చల్లగా చాస్తున్నాడు. ఆత్మీయముగా బలపడాను. నేను దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతతో ప్రార్థించుకుంటున్నాను. ఆ రోజులలో నా కుమార్తెకు అనారోగ్యం కలిగింది బలహీనురాలైంది ఆమె బుడడు నుండి చీము రక్తము కారుచూ గాయవైనది డాకటర్లు వైద్యం చేసి ఆపరషన్ చేశారు. గాయం తగిగనట్లుగా ఉన్నను ప్రార్థన ద్వారా సంపూరణ స్వస్థత పొందింది. ఆ తరువాత మా అల్లుడుగారు కాట్రాకుట పని వలన భోపాలు వెళ్ళవలసి వచ్చింది.
నేను మా కుమార్తెతో బోపాలు వెళ్ళినపుడు మా కుమార్తె గాయం నుండి మరలా చీము రక్తము వచ్చింది. డాకటర్లు చికిత్స చేసే హైాదరాబాదులోనే చేర్పించాము. ఇది ఎవరికీ రాదు నాకు అర్థం కాలేదు అని చెప్పి గతంలో ఇచ్చిన మందులన్నీ ఇచ్చి పంపింది. నా కుమార్తె ఎంత కష్టం కలిగినా ధైర్యంగా ఉంటా కంట తడి పెటైటది కాదు. అయిననా అవ్మా, నాకు మరణము తప్పదు ఈ ఇన్పసపకషన్ చాలా బాధిస్తుంది. అని చెప్పింది. నాకు చాలా దిగులు బాధ కలిగి తీవ్రంగా ప్రార్థన చేశాను. ప్రభువా నా భడను బ్రతికించు నీకు అసాధ్యవైనదేమ లేదు కదా! నా భడడ్ మరణిసేత నీ భడడ్గా నాకు అవమానము కలుగుతుంది కదా! నీ భడడ్లను నీవు కాపాడి సవాస�పరచగలవని దృడింగా నవ్ముచున్నాను. దేవా, నా బలహీనతలను నా భడడ్ బలహీనతలను దయతో క్షమించు అని కన్నిటితో ప్రార్థించాను. ప్రభువు గొప్ప శక్తి గల దేవుడు గనుక ఆయన కృప చూపి నా భడడ్కు సంపూరణ స్వస్థత ఇచ్చి నన్ను ఆదరించి ధైర్యపరచి ఆనందం కలిగించాడు. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక! దేవుని మొఱ్ఱపెట్టు వారికి ఆయన అతి సమీపముగా ఉండి సంరక్షిస్తారు.
నా కుమారుని వివాహము నిశ్చయించబడుట :
మేము రావంతపూర్లో కాపురము ఉంటున్న రోజులలో నా కుమారునికి వివాహము జరిగించాలని తలంచి ప్రార్థించుట కారంభంచాను. ప్రభువా, నా ఏకైక పుత్రునికి నీ చిత్తములో నున్న భడను నా గృహానికి రప్పించండి. 49
సజీవ సాక్ష్యములు పరిశుద్ధ వివాహము జరిగించాలి. హిందా పద్ధతులు రానీయక రక్రైస్తవ నమ్మకాలలోనున్న భడను నా కుమారునికి సిద్ధపరచండి అని ప్రార్థించాను. నా అత్తగారు మంచి విశ్వాసి గనుక నేను ప్రార్థన చేయు సమయంలో ఆమె చాలా సహకరించి నా కోరిక నెరవేరాలని చాలా ఆశతో ప్రార్థించింది. బైబిలు గ్రంథదములో ఇస్సాకునకు ప్రార్థన ద్వారా మంచి భార్యను ఇచ్చావు, అవసరాలలో ప్రార్థించగా అద్భుతాలు చేసావు, ఎస్తేరు ప్రార్థన, హాన్న ప్రార్థన, ఎబే�జు ప్రార్థన ఆలకించి వెంటనే జవాబునిచ్చావు. ఎరికో గోడలను స్తుతితో కూల్చాివు, యెహె�షాపాతు రాజు నీవే దికుక అని ప్రార్థించి స్తుతించి జయము పొందాడు. దానియేలను సింహపు బోనులో నుండి రక్షించావు. అందరికీ సహాయము చేసిన అద్భ�తకరుడవైన నీవు నా కుటుంబములో గొప్ప కార్యము జరిగించండి అని కన్నిటితో ప్రార్థించాను.
మా బాబు కూడా స్వంత ఆలోచన విడిచి విశ్వాసముతో ప్రార్థించాడు. తన ఆలోచనలన్నిటిని సహాకరించగల వ్యక్తి తోడుగా రావాలనియు మా కుటుంబంతో ప్రేమగా సహకరించి శాంతితో జీవించాలని ఆశించేవాడు. అద్భ�తరీతిగా విజయవాడలో సంఘకాపరిగా ఉన్న దైవజనులు జాషువగారి రెండవ కుమార్తెను మా ఇంటికి జ్యోతినిచ్చెి ""జ్యోతి��ని మా బాబుకు భార్యగా ఇచ్చాడు. దేవుని మహా కృపగా భావించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాము. మా బాబు, కోడలు కలిసి విదేశాలకు వెళ్ళు అవకాశం కలిగింది. బైహారన్లో కొంత కాలము ఉన్న తరువాత అమెరికా లో ప్రవేశించే ధన్యత లభించింది. అన్యజనుల మధ్య మా కుటుంబమును ప్రత్యేకించి ఘనపరచిన ప్రభువునకు ఆయన నామమును బట్టి ఆయనకు స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక!
నా భర్తగారు ఉద్యోగములో స్థిరపడి శ్రద్ధగా పని చేయుచున్నందున ఎల్లారెడిడ్ డిగ్రీ కాలేజిలో పనిచేయు ధన్యత లభించింది. అది దేవుడిచ్చిన ప్రమోషన్ గనుక అందరం ఆనందించి దేవుని స్తుతించాము. గతంలో కామారెడిడ్ కాలేజిలో లైక్చిరర్గా పని చేశారు కాని అనుకోని రీతిగా అదే కాలేజిలో ప్రిన్సిపాల్గా పదవి లభించింది. నేను ఆ కాలేజిలో ప్రిన్సిపాల్గా పదవి వేసత బాగండు అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనకు జవాబు రాలేదు మర్చిపోయాను తిరిగి కామారెడిడ్ కాలేజిలో ప్రిన్సిపాల్గా పదవి సీవాకరించు సమయంలో ప్రభువు నాకు జ్ఞాపకం చేశారు. అవ్మా, నీవు ప్రార్థన చేసి ప్రిన్సిపాల్గా పదవి
50 అడిగావు కదా. ప్రభువు నమ్మదగినవాడు దేవుడు తనను నమ్మి ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చి సంతోషము కలిగించుటకు ఇష్టపడువాడు. నా ప్రభువు, నా రక్షణ దుర్గము, కేడెము, నా కోట, నా మంచి దేవుడు. ప్రతి చోట నా పట్ల చేసిన అద్భుతములను బట్టి సాక్ష్యము చెప్పుటలో ఆనందించేదానను. విశావాసంలో ఎదుగుచు, ఆయన సన్నిధిలో నిరంతరము స్తుతిస్తూ నా కాలము గడిపేానను. నా భర్త 2013 సంవత్సరము అకోటబరు 21వ తేదిన రిటై�ర్వెంట్ తీసుకునే కృప చూపించారు.
రిటై�ర్వెంటు సమయంలో వేడుక చేసుకొను సమయంలో నా బాబు బైహారన్ నుండి వచ్చాడు. నా కోడలు జ్యోతికి ఆరోగ్యము సరిగా లేదు. ఆ సమయంలో లేవలేని స్థితిలో ఉండగా మా బాబు, ""మీరు వెళ్ళండి నేను నా భార్య కోసము ప్రార్థించి ఆమెను చూసుకుంటను��, అన్నాడు. మా కుమార్తె, నేను రాలేనని చెప్పింది. నాకు చాలా దు:ఖము కలిగింది. ముందుగా నిరణయించబడిన ఆ రిటై�ర్వెంటు రోజును మార్చలేము. కన్నిటితో ప్రార్థించాను నా భర్త స్నేహితులు వచ్చారు. ఆ సమయంలో దిగులుతో ప్రార్థన చేసినపుడు ప్రభువు కనిపించి అవ్మా, నేను ఉన్నాను కదా! భయపడకు అన్నాడు ఎంతో నెమ్మది కలిగింది. ఆ తరువాత దేవుడు మా కోడలను సవాస�పరిచాడు.
నా మనుమరాలిని ప్రభువు కాపాడినాడు.
మేము రావంతపూర్లో ఉన్నపుడు నా కుమారెత భడను మా దగ్గర ఉంచుకొనేవారము. ఆరోజులలో డెంగు జ్వరము వచ్చి చాలా నీర్సపడి పోయాను నా భర్త ఉదయాన్నే కాలేజికి వెళ్ళిపోయాడు. రెండు కాలేజిలలో బాధ్యతలు సీవాకరించడం వలన చాలా భజీగా ఉండేవారు. చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. మా కుమార్తె అత్తగారు పాపను తనతో పాటు చితాతరు తీసుకొని వెళ్ళారు. నా కుమారుడు బైహారన్లో ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను జ్వరంతో వాంతులు, విరోచనాలు బలహీన స్థితికి చేరాను. దగ్గరగా ఉన్న డాకటరుగారితో వైద్యం చేయించుకున్నాను. ప్రయోజనం లేదు స్థానికంగా ఉన్న బాప్టిస్టు పాస్టరుగారికి కబురు పంపగా వచ్చి ప్రార్థన చేశారు. నా కన్నులు చూచుటకు పనికి రాని గ్రుడిడ్తనం అవరించింది. నా భర్త నా స్థితి గమనించారు. ఆ రాత్రి కన్నీటీతో ప్రార్థించాను. ప్రభువా దయతో నన్ను కనికరించి 51
సజీవ సాక్ష్యములు స్వస్థ పరచండి. నన్ను అవమానపరచవద్దు. నీ నామమునకు మహిమ రావాలి అని ప్రార్థించగా ఆ రాత్రి కలలో వింత దృశ్యము చూచాను. మా గదిలోఉన్న కరెంటు బల్బు నుండి గొప్ప కాంతి కిరణము ఫోకస్ నా కండ్లపై పడడం చూశాను. వెంటనే నా కన్నులు తెరువబడినవి అద్భుతంగా నేను మరలా చూడగలిగాను. పరమానంద భరితురాలనై దేవునికి కృతజ్ఞత తెలిపాను. నాకు గొప్ప అద్భుతం కలిగింది ఆ బలముతోనే ఉదయాన్నే లేచి నా భర్తకు కాఫీ చేతికిచ్చాను. నా భర్త నన్ను ఆశ్చర్యంగా చాస్తున్నారు. నా ప్రభువు నన్ను సవాస�పరచినారని చెప్పాను. నిజముగా ఆయన చేయు మాహాతాకర్యములు గొప్పవి గనుక ప్రభువు కీర్తనీయుడుగా నా జీవితంలో నాకు విలువైన సాక్ష్యము చెప్పే ధన్యత ఇచ్చి సంతోషపెట్టుచున్నారు. నమ్మదగిన నా ప్రభువునకు స్తుతి సోత్రతము సదా కలుగును గాక.
నా కుమారునికి 2015వ సంవత్సరములో కుటుంబముతో అమెరికా వెళ్ళి ఉద్యోగము చేయు అవకాశము దేవుడే అనుగ్రహించాడు. అమెరికాలోనే దేవుడు బాబుకు ఒక కుమారుని స్వాస్థ్యముగా ఇచ్చినారు. నా బాబును కోడలు జ్యోతిని వారికి పుట్టిన భడను దర్శించుటకు ఎన్నిక లేని నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను.
2016వ సంవత్సరములో అమెరికాలో గల నయా జైర్సీ చేరి మంచి రక్రైస్తవ సహవాసంలో తెలుగువారి మధ్య ఆడియోలో సాక్ష్యము చెప్పు ధన్యత ఇచ్చిన సహె�దరీ జయశీల గారికి వందనములు చెప్పుచున్నాను. నా తల్లి మన్నెం తులసమ్మ (నీలాంబరీ) గారి సంతానములో కొందరు అమెరికాలో నివసించు ఆశీర్వాదాన్ని పొందారు. వారిని నా భర్తతో కలిసి దర్శించి ఆనందించే కృప దేవుడు ఇచ్చాడు.
""యెహోవా ఇంతగా నీవు నన్నా హెచ్చించుటకు నేను ఎంతటివాడను. నా కుటుంబము ఏపాటిదీ, నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడునుగాక��. ఈ సాక్ష్యము ప్రచురించుటకు సహకరించిన నా తల్లి స్నేహితురాలైన గంటా సంతోషమ్మగారి కుమార్తె గ్రేస్ విజయ అక్క గారికి వందనములు.
అందరినీ ప్రభువు దీవించను గాక! ఆమెన్
52