Part 5 of 14

1. దేవుని రాజ్య సందేశము – యేసు క్రీస్తు నందు రక్షణ

1. దేవుని రాజ్య సందేశము – యేసు క్రీస్తు నందు రక్షణ

ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు భూమిమీద వున్నపుడు దేవుని రాజ్య సందేశమును ప్రకటించెను. అదేమనగా తాను మానవులందరి పాపము పరిహరించుటకు లోకమునకు వచ్చెను (యోహాను 1:29) మరియు తనద్వారానే దేవుని రాజ్యములో ప్రవేశము దొరుకునన్నది. పరిశుద్ధ గ్రంథములో 'కాలము సంపూర్ణమైయునశ్హది. దేవుని రాజ్వము సమీపించియుశ్హది. మారు మనస్సు పొంది, సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్తను ప్రకటించుచు యేసుక్రీస్తు గలిలయకు వచ్చెనని" మార్కు 1:15లో వ్రాయబడియున్వది. యేసు క్రీస్తు, నేనే మార్గమును, సత్సమును, జీవమును. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడం (యోహాను 14:6), నా మాట విని, నన్ను పంపిన వానియందు విశ్వానముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్శ్ణులోనికి రాక, మరణములోనుండి జీవములోనికి దాటి యున్హాడని నిశ్చమముగా చెప్పుచున్హాను (యెహాను 5:24)” అని దేవుని వాక్యములో సెలవిచ్చెను. పాపములో నశించుచున్న వారినందరినీ రక్నించుటకం తానీలోకవునకం వచ్చెనన్న నత్యమును తెలియజేయుటకు యేసు క్రీస్తు యీ క్రింది ఉపమానములను చెప్పెను. (2) మంచి సమరయుడు (లూకా 10:80-87):

యేనుక్రీన్తను ఒక ధర్మ శాస్త్రోవదేశకండం, “బోధ కుడా,

నిత్సజీవనమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని” అడిగినపుడు, ఆయన ధర్మశాస్త్రమంతటికీ ప్రధానమైన రెండు ఆజ్ఞలను (దేవుని ప్రేమించుట, పొరుగు వానిని ప్రేమించుట) పాటించుమని చెప్తెను (లూకా 10:25-27). అంతట ఆ ధర్మ శాస్త్రోపదేశకుడు నా పారుగువాడెవడని యేసుక్రీస్తును అడుగగా, యేసు తానే 'ఒక మంచి పొరుగువాని"గా మానవుని పాపమునుండి రక్షింపవచ్చైనను అర్థమిచ్చుటకు 'మంచి నమరయుడు” అను ఉపమానమును చెప్పి, ఆ ధర్మశాస్త్రోపదేశకుని కూడా వెళ్లి, దేవుని ప్రేమను యితరులకు కనుపరచుమని చెప్పెను (లూకా 10:28-37).

లూకా 10:30-37 వచనములలో యీలాగు వ్రాయబడినది. 'అందుకు 1 యేసు యిట్లనెను - ఒక మనుష్కుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లుచు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి, కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆత్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడిొకడు ఆ చోటికి వచ్చి, చూచి, ప్రక్కగా పోయెను. అయితే, ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు, ద్రాక్షారసమును పోసి, అతని గాయములను కట్టి, తన వాహనముమీద యెక్కించి, ఒక పూటకూళ్ల వాని యింటికి తీసుకుని పోయి, అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి, ఆ పూటకూళ్లవానికిచ్చి - యితని పరామర్కించుము. నీ వెంకేమైననూ ఖర్చు చేసిన యెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్తిపోయెను. కాగా, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగు వాడా యెనని నీకు తోచుచున్హది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు - నీవును వెళ్ళి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను'.

యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు యిరువది మైళ్లదూరము. దీనికి “రక్తపు త్రోవి అని పేరు. యిది దిగుడు మార్గము మరియు బందిపోటు దొంగలకు పేరు గాంచిన మార్గము. ఉపమానములో చెప్తబడిన మనుష్క్యుడు యెరూషలేమునుండి యెరికోకు వెళ్లు చుండెనను మాట, మానవుడు దేవుని సన్నిధివదలి లోకమువైపు వెళ్తున్నాడను సత్యమును సూచిస్తున్నది. ఆ మనుష్యుడు దొంగలచేతికి చిక్కి, దోచుకొనబడి, కొట్టబడి, కొర ప్రాణముతో విడువబడెనను మాట, మానవుడు సాతానుని చేత లోక పాపములోనికి నడిపింపబడి, నాశనము వైపునకు తీసుకెళ్ల బడుతున్నాడని తెలియజేయుచున్హది. మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినవారై, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి, యీ ప్రపంచధర్మము చొప్పన నడుచుకొంటిరి (ఎఫెసి 2:1,2).

వస్తహీనుడై, గాయపడిన ఆ మనుష్యుని యాజకుడు, లేవీయుడు చూచియు, సహాయము చేయకుండా, ప్రక్కగా పోయిరి (లూకా 10:31, 32). యాజకుడనగా దేవుని ధర్మశాస్త్ర విధులను ఇశ్రాయే లీయులకు బోధించువాడు (లేవీ కా.10:11), ఇశ్రాయేలీయుల పక్షమున బలులు అర్హించువాడు (లేవీ కాం. 1:1-17). లేవీయుడనగా యాజకునికి బలులు అర్హించు విషయములో సనహాయము చేయువాడు (2దినవ్యత్తాంతములు 35:10-14) మరియు మందిరమును కాయువాడు (సంఖ్యా కాండము 18:3). వీరిరువురును పరదేశు ల యెడల జాలిగలిగి వారిని ప్రేమించవలెనని ఆజ్ఞాపింప బడిరి (లేపీ. కాం.19:33-34; ద్వీతీయోపదేశ కాండం 10:17-19). అయితే, వరు గాయపడిన ఆ మనుష్యునికి సహాయము చేయక పోయిరి. టీనిని బట్టి, ధర్మ శాస్త్రము, బలులు మరియు మన ధార్మికత; మనలను రక్షించవని తెలుసుకొనుచున్నాము.

అయితే, ఒక నమరయుడం ఆదారిన వెళుతూ, గాయవడిన ఆమనుష్ముని మీద జాలిపడి, అతనికి సహాయము చేసెను (లూకా 10:33,34). యీ సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. సమరయులు యూదుల చేత ద్వేషింపబడిరి (యోహాను 4:9). యేసు క్రీస్తు అనేకుల చేత ద్వేషింపబడి, తృ్యణీకరింపబడెను (యెషయా 53:3; యోహను 1:11).ఉ పమానములో చెప్తబడిన సమరయుడు గాయపడిన మనుష్యుని దగ్గరకు పోయి, నూనెయు, ద్రాక్షారసమును పోసి, అతని గాయములను కట్టి, పూట కూళ్లవాని యింటికి అతనిని తీసుకువెళ్లెననుమాట, యేసు క్రీస్తు మానవుని పాపము తన రక్తము (ద్రాక్షారసము) తో కడిగి, పరిశుద్ధాత్మాభిషేకము (నూనెనిచ్చి, సంఘము (పూటకూళ్లవాని యిల్లు) లో ప్రవేశ పెట్టునన్న సత్యమును తెలియజేయుచున్దది. యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహాను 1:7). అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొళ్టెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత మనము విమోంచింప బడుదుము (1 పేతురు 1:19).

యేసుక్రీస్తు ఒక 'మంచి సమరయుడు” గా యీ లోకమునకు వచ్చి, పాపములో నశిస్తున్న మానవులందరి కొరకూ తన్సుతాను బలిగా అర్హించుకొని, తన రక్తము కార్చి, తన్ను యెందరైతే రక్షకునిగా స్వీకరింతురో వారి పాపములను క్షమించి, క్రీస్తు సంఘములో వారిని ప్రవేశపెట్టి, తన శాంతి, నమాధానములు వారికి అనుగ్రహించునని యీ ఉపమానము ద్వారా మనము తెలుసు కొనుచున్నాము. క్రీస్తు మనపట్ల కనపరచిన యీ ప్రేమను మనముకూడా యితరులకు కనపరచవలెనన్న సత్యమును లూకా 10:37 వచనము ద్వారా గమనించుచున్నాము.

(1) తప్పిపోయిన గొత్టె (మత్తయి 18:12-14; లూకా 15:3-7) :

ప్రభువైన యేసు క్రీస్తు బోధవినుటకు సమస్తమైన సుంకరులును, పాపులును వచ్చు చుండిరి (లూకా 15:1). ఆదినములలో శాస్త్రులకును, పరిసయ్ములకును సుంకరులనగా సరిపోదు. సుంకరులు కావలసిన దానికంటే యెక్కువగా పన్ను వసూలు చేయుదురని శాస్త్రులును, పరిసయ్మ్యులును వారిని హేయ భావముతో చూచుచుండిరి. కనుకనే వారు యేసు క్రీస్తునొద్దకు వచ్చినపుడు ఆయన సుంకరులను చేర్చుకుంటున్హాడని సణుగుకొనిరి (లూకా 15:2). అందుకు యేసు క్రీస్తు వారి హృదయాలోచనలెరిగి, పాపముతో పతనమై, తప్పిపోయిన వారి కొరకే తానీలోకమునకు వచ్చెైనను సంగతి తెలియబరుస్తూ, 'తప్తిపోయిన గొట్టె, 'పోగొట్టుకొనబడిన నాణెము” మరియు 'తప్తిపోయిన కుమారుడు” అను మూడు ఉపమానములు చెప్తెను.

“తప్పిపోయిన గొట్టి” ఉపమాన వాక్య భాగము లూకా 15:3-7 లో యీలాగు వ్రాయబడినది. “అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్తెను. మీలో ఏమనుష్యునికైనను నూరుగొర్రెలు కలిగి యుండగా, వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదకవెళ్లడా ? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసికొని, యింటికి వచ్చి, తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి - మీరు వారితోకూడా సంతోషించుడి. తప్పి పోయిన నా గొట్టె దొరికినదని వారితో చెప్పునుగదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయముపై కలుగు సంతోషము కంటే మారు మనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.”

పై వాక్క భాగమును పరిశీలించిన యెడల యీ క్రింది విషయములను గమనింపవచ్చును.

(1) గొట్టెయొక్క తప్పిపోయిన స్థితి :

ఒక 'తప్తి పోయిన గొట్టి మందనుండి వేరుపడి, త్రోవ తప్తి, అరణ్యములో చిక్కుకుని, దారి తెలియక, కావరికొరకం లేదా తోటి గొత్టెలకొరకం అరచుచుండును. అటువలె మనుష్క్మాలందరూ దేవుని నుండి వేరుపడి, పాపములో తప్పిపోయి, తిరుగులాడుచున్నట్లు పంరిశుద్ధ గ్రంధము తెలియజేయుచున్హది. మనమందరము గొళ్టెలవలె త్రోవ తప్తిపోతిమి. మనలో పతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను (యెషయా 53:6). మీరు గొళ్టెలవలె దారి తప్తిపోతిరి (1 పేతురు 2:25). తిన్నని మార్గమును విడిచి, త్రోవ తప్తి పోయిరి (2 పేతరు 2:15). తప్తిపోయిన గొళ్లెవలె నేను త్రోవవిడచి, తిరిగితిని (కీర్తన 119:176). వారందరూ దారి తొలగి, బొత్తిగా చెడియున్హారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు (కీర్తన 14:3). నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవతప్తి, యేకముగా పనికిమాలిన వారైరి (రోమా 33:11-12).

(2) తప్పిపోయిన గొత్టెకు పొంచివున్న ప్రమాదము :

తప్పిపోయిన గొట్టెకు అరణ్యములో దుష్టమృగములనుండి ప్రమాదము ప్రమాదము పొంచియునశ్చది. పాపము వలన వచ్చు జీతము మరణము (రోమా 6:23).

ర్‌ (3) తప్పిపోయిన గొత్టెవట్ల దేవునికున్న ప్రేమ

యీ ఉపమానములో చెప్తబడిన గొత్టెల కాపరి నూరు గొళట్టెలలో తొంబదితొమ్మిదింటిని అరణ్యములో వదలివేసి, తప్తిపోయిన ఆ ఒక్క గొట్టెను వెదక వెళ్లెను (లూకా 15:4). ఆ గొట్టె దొరకువరకు వెదకెను. అటువలె దేవుడు పాపములో తప్తిపోయిన మానవుని ప్రేమించి, తనకుమారుడు యేసు క్రీస్తును యీలోకమునకు పంపెనని పరిశుద్ధ గ్రంధము సెలవిస్తున్నది (యోహాను 3:16). మనుష్కులందరూ యేసు క్రీస్తు నందలి రక్షణపాొంది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై యుండవలెనని దేవుడు యిచ్చయించు చున్హాడు (1 తిమోతి 2:4). సుంకరియైన జక్కయ్యయింటికి వెళ్లినపుడు యేసుక్రీస్తు 'నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్కకుమారుడు వచ్చెనని” చెప్పెను (లూకా 19:10). యేసుక్రీస్తు 'నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదు (మార్కు 2:17), నేను గొతళ్టెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొతళ్టెలకొరకు తన ప్రాణముపెట్టును (యోహాను 10:115 అని చెప్తి, పాపములో నశిస్తున్న మానవులపట్ల తన ప్రేమను వ్యక్తపరచెను.

తప్పిపోయిన గొళ్టె కాపరిచేత కనుగొనబడి, యింటికి తీసుకు రాబడిన రీతిలో పాపములో తప్తిపోయిన మానవుడు యేసుక్రీస్తును కాపరిగా, రక్షకునిగా చేర్చుకొని, దేవుని రాజ్యములో ప్రవేశింప వలెనను సత్యమును యీ ఉపమానము ద్వారా తెలుసుకొనుచున్నాము. తద్వారా పరలోకమందు యెంతోసంతోషము కలుగును (లూకా 15:7).

(0) పోగొట్టుకొనబడిన నాణెము (లూకా 15:86-10) :

“తప్పిపోయిన గొట్టె” అను ఉపమానములో గొట్టెను పోగొట్టుకున్న మనుష్యుడు దాని కొరకు వెదకుచూ వెళ్లిన విధానములో పాపములో తప్తిపోయిన మానవులను రక్షించుటకు యేసుక్రీస్తు యీలోకమునకు వచ్చెనను సత్యమును చూచితిమి. యిదే అర్థమునిస్తూ, యేసుక్రీస్తు 'పోగొట్టుకొనబడిన నాణెము” అను మరొక ఉపమానముచెపస్తైను. 'తప్తిపోయిన గొట్టె తెలియని తనముతో దేవునికి దూరమై జీవించు మానవుని సూచిస్తున్నది. 'పోగొట్టుకొనబడిన నాణెము” గదిలోనే తన యజమానురాలు కనుగొనలేని విధముగా ఒక మూలనే పడియుశ్హది. యిది తాము దేవునితోవున్నామని అనుకుని జీవించు వేషధారులను, నామకార్థంగా క్రీస్తును వెంబడించ ప్రయత్నించు వారిని సూచిస్తున్హది.

లూకా 15:8-10లో యీలాగు వ్రాయబడినది : ఏస్తీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటె ఆమె దీపము వెలిగించి, యిల్లు ఊడ్చి, అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా ? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతోకూడా సంతోషించుడి. నేను పోగొట్టు కొనిన నాణెము దొరికినదని వారితో చెప్పునుగదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగునని మీతో చెప్పచున్హాననెను.

యీ ఉపమానములో పోగొట్టు కొనబడి న నాణెము చీకటిలో పోగొట్టుకొనబడినదని తెలియుచున్నది. కనుకనే నాణెము కలిగినస్తీ దానిని కనుగొనలేక, దీపమును వెలిగించెను (లూకా 15:8). దవీపమునుండి కలుగు వెలుగువలన అంధకారము పారదోలబడి, అంధకారములో నున్న వన్నియు కనిపించును. యేసుక్రీస్తు, 'నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగియుండునని' చెప్పెను (యోహాను 8:12). ఆయన మరణమును నిరర్థకము చేసి, జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను (2 తిమోతి 1:10). కనుక దీపము యొక్క వెలుగు చీకటిని పారదోలి, నాణెమును కనుగొనినట్లు, మానవుని హృదయములోని చీకటిని యేసుక్రీస్తు సువార్త పారదోలి, వెలుగులోనికి నడిపించును.

మనిమింకను గమనించిన యెడల, నాణెము పోగొట్టు కొనిన స్త్రీ ఒక చేత్తో వెలిగింపబడిన దీపమును పట్టుకొని, రెండవ చేత్తో చీపురు చేత యిల్లు ఊడ్తి, నాణెము దొరుకువరకు జాగ్రత్తగా వెతికెను (లూకా 15:8). 'దీపపు వెలుగులో యిల్లు ఊడ్దబడుట" అనునది 'లోకమందంతటా చీకటిలో నివసిస్తున్న జనులను సువార్త సత్మ్కపు వెలుగునొద్దకు నడిపించుటి యను సత్మ్యమును సూచిస్తున్నది. యేసుక్రీస్తు రాజ్యసువార్త ప్రకటించుచు, సమస్త పట్టణముల యందును, గ్రామములయందును సంచారము చేసెను (మత్తయి 9:35). పేతురు, యోహానులు యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి (అపొ.కా. 8:25). మరియు యీ రాజ్యసువార్త సకలజనములకు సాక్ష్కార్హమై లోకమందంతటను ప్రకటింపబడును. అటుతరువాత

లిధ అంతము వచ్చును (మత్తయి 24:14)

నాణెమును పోగొట్టుకొన్న స్త్రీ దాని కొరకు యిల్లు ఊడ్చి, అది దొరకువరకు జాగ్రత్తగా వెదకెను. టీనిని బట్టి ఆ స్త్రీ యొక్క దీర్ధశాంతము, పట్టుదల బయలు పరచబడినవి. ఆలాగుననే దేవుడు, యెవరును నశింపక, అందరూ మారుమనసు పొందవలెనని కోరుచూ, అందరియెడల దీర్ధశాంతము కలిగియున్హాడు (2 పేతురు 3:9). ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి, చూడనట్టుగా వుండెను. యిప్పడైతే, అంతటను అందరును మారుమనసు పొందవలెనని మనుష్కులకు ఆజ్ఞాపించు చున్హాడు (అపా.కా.17:30). యేసుక్రీస్తు, “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యుశ్నది” అని చెప్తెను (యోహాను 4:34). అపొస్తలుడైన పౌలు, “సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్హది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ” అని చెప్తెను (1 కొరింథి 9:16).

పైవచనములలో దేవుని దీర్ధశాంతము, యేసుక్రీస్తు యొక్క మరియు పౌలుయొక్క పట్టుదల అగుపడుచున్నవి. తప్పిపోయిన నాణెమును కనుగొనిన స్త్రీ మిక్కిలి సంతోషించినట్లు, మారుమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో యెక్కువ సంతోషము కలుగును (లుకా 15:9, 10)

(3) తప్పి పోయిన కుమారుడు (లూకా 15:11-82) :

'తప్తి పోయిన కుమారుడు” అను ఉపమానము తన తండ్రిని తృణీకరించి, దూరదేశమునకు వెళ్లి, వ్యర్ధమైన జీవితము జీవించి, పశ్చాత్తాప పడి, తిరిగి తన తండ్రి చెంతకు చేరిన ఒక కుమారుని గురించి తెలియజేయు చున్చది. 'తప్తి పోయిన కుమారుడు” తెలిసి, కావాలనే దేవుని ధిక్కరించి, దేవునికి దూరముగా జీవించు మానవుని సూచిస్తున్నాడు. యీ ఉపమానము క్రింద తెలుపబడిన మూడు భాగములలో విభజింపబడినది.

(1) తకప్తిపోయిన కుమారుని తిరుగుబాటు న్వభావము :

తప్పిపోయిన కుమారుడు తన తండ్రియొద్దనుండి తనకు రావలసిన ఆస్తిని సమకూర్చుకొని, దూరదేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారము వలన, వేశ్యా సాంగత్యము వలన పాడుచేసెనని లూకా 15:12,13,30 వచనములలో వ్రాయబడియున్నది. దీనిని బట్టి తప్పిపోయిన కుమారునికి తన తండ్రియింటవుండి జీవించుట యిష్టము లేదని, తన తండ్రిని తృణీకరించి, అతని నుండి వేరుపడి జీవించుటకు యిష్టపడినాడని తెలియుచున్నది. తండ్రి యింటిని వదిలి, దుర్వాపారములో, వేశ్వా సాంగత్మములో జీవించడమనునది మానవుడు దేవుని నన్నిధిని వదిలి, పావములో జీవించంటకం యువ్త వడం చున్నాడనుటకం సాద్యశ్వముగావున్నది. ఇశ్రాయేలీయులు తాముకోరిన వాటినిబట్టియు, చూచిన వాటినిబట్టియు వ్యభిచరించిరి (సంఖ్యా కాండం 15:39). వారు అవిధేయులై, దేవుని మీద తిరుగుబాటు చేసి, ప్రవక్తలను చంపి, దేవునికి బహుగా విసుగు పుట్టించిరి (నెహెమ్యా 9:26). యెషయా 1:2, 5 వచనములో వారు దేవుని మీద తిరుగ బడియున్హారనియు, నిత్యము తిరుగు బాటు చేయుచున్నారనియు చదివెదము. అనేకులు నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునైయుండి, క్రీస్తుకు దూరస్థులుగా యుంటున్నారు (ఎఫెసీ 2:12). వారు అంధకారమైన మనస్సు గలవారై, తమహ్యృదయ కాఠరిన్మము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి, నడచుకొను చున్హారని పరిశుద్ధగ్రంధములో వ్రాయబడియున్నది (ఎఫెసీ 4:18)

(2) తప్పిపోయిన కుమారుని వపశ్వాత్తావము :

తన ఆస్తి అంతయు పాడుచేసి, కరువు కలిగిన దేశములో ఆకలితో జీవిస్తున్న సమయములో తప్తిపోయిన కుమారుడు తన తప్పిదమును బట్టి పశ్చాత్తాప పడసాగెను (లూకా 15:14-17.

తన వశ్వాత్తావములో తప్పిపోయిన కుమారుడు :

(1) తన తండ్రియింటి ఐశ్వర్యమంతటిని జ్ఞాపకము చేసుకొనెను (లూకా 15:17). దేవుని యింట అత్మథికమైన కృప (1 తిమోతి 1:14), సమృద్ధియైన సత్వ సమాధానములు (యిర్మియా 33:6), విస్తారమైన కృపాసత్యములు (నిర్గమ కాండం 34:6) కలవు.

(11) వినయ మనస్కుడై, తన తండ్రియింటికి తిరిగివెళ్లి, తనతప్తిదమును తన తండ్రితో ఒప్పుకొనుటకు నిర్ణయించుకొనెను (లూకా 15:18, 19). 2 కొరింథీ 7:10లో ధైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగ జేయునని వ్రాయబడియున్వది.

(3) తప్పిపోయిన కుమారుని తండ్రి యింట చేరిక (లూకా 15:20-24) :

తప్పిపోయిన కుమారుడు తనతండ్రి యింటిని నమీవించగానే, ఆ తండ్రిక్రింద తెలిపిన ప్రకారము చేసెను.

1)ుతనకు గా నున్హప్పడే వానిని చూచెను. పశ్చాత్తాప మారుడు దూరము నృప్పడే చె ర్హ్రాత్తా హృదయులైన పాపులందరినీ దేవుడు దృష్టించును. యెహోవా మహోన్హతుడైనను, ఆయన దీనులను లక్ష్మ్యపెట్టును (కీర్తన 138:6).

(1) తన కుమారుని చూచి, కనికర పడెను. యేసుక్రీస్తు మానవుల పట్ల కనికర పడెను (మత్తయి 9:36; 14:14; 15:32; 20:34)

(111) తన కుమారుడి మెడమీద పడి, ముద్దు పెట్టుకొనెను. దీనిని బట్టి తండ్రికి తన కుమారుని పట్ల ఉన్న ప్రేమ వ్యక్తమవుతున్నది. పరిశుద్ధ గ్రంధము దేవుడు ప్రేమాస్వరూపియని తెలియ జేయుచున్హది (1యోహాను 4:8). దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడివరచుచున్నాడు; ఎట్లనగా మనవమింకను పాపులమైయుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను (రోమా 5:8).

(1) తన దాసులతో తన కుమారునికి ప్రశస్త వస్తములనిమ్మని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధులకు రక్షణ వస్త్రములను ధరింపచేయును (యెషయా 61:10, కీర్తనలు 132:9; ప్రకటన 19:8; జెకర్మా 3:4).

(1) తన కుమారుని చేతికి ఉంగరము పెట్టించి, పాదములకు చెప్పులు తొడిగించెను. ఉంగరము ఒక స్థానమును సూచిస్తుంది. ఫరో తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టెను (ఆది కాండము 41:42). పాపి పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వచ్చినపుడు, దేవుడు అతనిని తన కుమారునిగా స్వీకరించును. ఎఫిసీ 6:15లో “పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతోడుగుకొని నిలువబడుడి” అని వ్రాయబడియున్షది.

(14) క్రొవ్విన దూడను వధించి, విందు చేయించెను. “నా కుమారుడు చనిపోయి, మరల (బతికెను, తప్పిపోయి దొరికెను” అని, తండ్రి తన యింటి వారందరికిని విందు చేయించి, సంతోషించెను. మారుమనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో అధికమైన సంతోషముకలుగును.

ప్రియులారా, ఈ అధ్యాయములో చెప్తబడిన నాలుగు ఉపమానముల ద్వారా యేసుక్రీస్తు పాపములో తప్పిపోయిన మనుష్మాలందరినీ వెదకి, రక్షించాలనే సంకల్పము కలిగియున్తట్లు మనము గమనించుదుము (1తిమోతి 1:15). పరిశు ద్ధ గ్రంధము. “ఏ భేదమును లేదు అందరూ పాపముచేసి, దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్న్హారు (రోమా 3:23); పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము (రోమా 6:235” అని సెలవిస్తున్నది. తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకొని, యేసుక్రీస్తును రక్షకునిగా హృదయమందు విస్వసించి, తమ పాపములను క్షమించుమని అడుగు వారందరికీ దేవుడు నిత్య జీవమిచ్చ రక్షించుటకు యిష్టపడు చున్నాడు (రోమా 10:9; 10). వారి పాపములను యిక యెశ్హడును జ్ఞాపకము చేసికొననని (యెషయా 43:25; హెబ్రీ 10:17; యిర్మియా 31:34) ప్రభువు సెలవిచ్చుచున్హాడు. యూదారాజైన హిజ్కియా ఆరోగ్యము పొందిన తరువాత 'నీ వీపు వెనుక తట్టు నా పాపము లన్నియు నీవు పారవేసితివి అని రచించెను (యెషయా 38:17). “వారి పాపములన్షియు సముద్రపు అగాధములో నీవు పడవేతువు” అని మీకా 9:17లో వ్రాయబడియున్నది. 'పడమటికి తూర్హు యెంతదూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతదూరపరచి యున్హాడు” అని దావీదు రాజు కీర్తన 103:12 లో చెప్పెను. ప్రియులారా, యీ ఉపమానముల ద్వారా దేవుడు మీతో మాటలాడుచున్న యెడల, మీరింక యేను ప్రభువును సొంతరక్షకునిగా యెరుగకుండిన యెడల, “ప్రభువా ! నేను పాపిని. నా పాపములు క్షమించుము. నా కొరకు సిలువలో మీరు రక్తము కార్చినందుకు వందనములు. మీ రక్తముతో నన్ను కడుగుము. మీ శాంతి, సమాధానము నాకు దయచేసి, మీ బిడ్డలలో నన్ను చేర్చుకొనుము” అని ప్రార్ధించిన యెడల దేవుడు మీ ప్రార్ధనవిని, మిమ్ములను రక్షించును.

↑ Back to top

↑