దేవుని రాజ్యము
చరిత్రలో యెన్నో రాజ్యములు, సామ్రాజ్యములు ఏర్పరచబడి, గతించిపోయినవి. ఎంతో మంది రాజులు ఏలిరి, గతించి పోయిరి. కానీ, యే రాజును, యే రాజ్యమును మానవునికి పరిపూర్ణ శాంతి, సంతోషము, సమాధానము యివ్వలేదు. దీనికంతటికీ కారణము మానవునిలో వున్న పాపము. అయితే, దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోవు చున్నాడు. ఈ రాజ్యము యేసుక్రీస్తు ద్వారా పాప విమోచన పొందిన మానవులందరి సముదాయముగా (కొలొస్సి 1:18) ప్రస్తుతము అదృశ్యమైయున్నది (లూకా 17:20,21). కానీ, ఒకానొకరోజు యీ రాజ్యము దృశ్యమైనదిగా స్థాపించబడబోవుచున్నది (1 కొరింథి 18:12). యీ రాజ్యమునకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు (యెషయా 9:6,7; యోహాను 18:37,88; మత్తయి £:6).
ఈ రాజు తన మొదటి రాకలో మానవుల పాపపరిహారార్థము ఒక గొళ్టెపిల్లగా వచ్చెను (యోహాను 1:29; 1 కొరింథి 5:7; 1 పేతురు 1:18-19). కలువరి సిలువలో మృతిపొంది, సమాధి చేయబడి, మూడవ దినమున పునరత్గాను డాయెను (రోమా 5:6,8; 14:9; 1 కొరింథి 15:8,4). తదుపరి ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను ఎంతో హెచ్చుగా దేవుని కుడి పార్య్శ్య మునకు హెచ్చింపబడి, సమస్తమును తన పాదముల క్రింద కలిగియున్నాడు (ఎఫెసి 1:20-28). యిట్టి అధికారము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు తన రెండవ రాకడలో శతృవులను జయించి (ప్రకటన 86:16; 14:10; 17:12-14, 19:11-21), యూదా గోత్రపు సింహముగా (ఆది. కాం. 49:88-10; ప్రకటన 5:5) తన రాజ్యమును యేర్చరచును (యిర్మియా 28:5,6; 88:14-18; యెహెజ్కేలు 87:21-28).
ఈ రాజును సకలజనులు స్తుతించెదరు (ప్రకటన 5:11-14; 7:9-17; 11:15-18; 15:4). యీ క్రీస్తు రాజ్యము యొక్క మహిమ ఊహింపశక్యము కానిది. యీ రాజ్యములో నీతి, సమాధానము, ఆనందము వుండును (రోమా 14:17; యెషయా 11:6-10). పాపమువలన మానవుడు కోల్పోయిన మహిమను యీ రాజ్యములో తిరిగి పొందును. అచ్చట వ్యాధులు, కన్నీరు, భయము, మరణము యిక వుండవు (యెషయా 95:8; ప్రకటన 7:17, 21:4). దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము (దాని యేలు 77:18-14; ప్రకటన 11:15). ప్రియులారా యిట్టి దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములను చదివి, ఆత్మీయంగా ఆశీర్వదించబడుదురు గాక,
