9. దేవుని రాజ్యవారసుల తలాంతులు – బహుమానములు
యేసుక్రీస్తును వెంబడించువారు ఆయా తలాంతులు కలిగిన వారై, సార్వత్రిక సంఘ క్షేమాభివ్యద్ధికై క్రీస్తు రాకడవరకూ పనిచేయుచుండవలెనని చెప్పుటకు ఆయన యీ క్రింద తెలుపబడిన మూడు ఉపమానములను చెప్తెను. ఎఫెసీ 4:13లో, “పరిశుద్ధులు సంపూర్తులగునట్లు, క్రీస్తు శలీరము క్షేమాభివ్యధ్ధి చెందంటకును, పరిచర్య థర్మముం జరుగుటకంను, ఆయన కొందరిని అపాస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులను గాను నియమించెను” అని చదువు చున్నాము. దీనిని బట్టి, ప్రతి విశ్వాసికి ఒకటి లేక అంతకన్నా యెక్కువైన తలాంతులు యివ్వబడిన వనియు, వాటిని క్రీస్తుశలీర క్షేమాభివ్యద్ధికి వాడవలెననియు చూచుచున్నాము. యీ తలాంతుల యొక్క లెక్క ఒకానొకదినమున క్రీస్తు న్మాయపీఠము యొదుట మనము అప్పజెప్తవలసియుండును. “తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మన మందరమును క్రీస్తు న్యాయ పీఠము యెదుట ప్రత్యక్షము కావలయును” (2 కొరింథి 5:10).
(2) ద్రాక్ష తోటలోని వనివారు (మత్తయి 20:1-16) :
అపొస్తలుడైన పేతురు యేసుక్రీస్తుతో, 'ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి, నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని' అడిగినపుడు ఆయన సమాధానమిస్తూ, యీ ఉపమానమును చెప్తెను.
మత్తయి 20:1-7 వచనములలో ఒక యింటి యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు దినములో ఆయా సమయములలో వెళ్లి, పనివారిని కుదుర్ముకొనెనని చదువు చున్నాము. అయిదు దఫాలుగా (ఉదయమున ఆరుగంటలకు, తొమ్మిదిగంటలకు, పన్నెండు గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు, సాయంత్రం అయిదు గంటలకు) పనివారు కుదుర్ముకొనబడిరి. దేవుని రాజ్యములో పనిచేయుటకు దేవుడు తన పని వారిని ఆయా సమయములలో పిలిచెను. దేవుడు యిర్మియాతో, 'నీవు గర్హమునుండి బయలు పడకమునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని” (యిర్మ్కియీ 1:5)అనెను. బాప్తిస్మమిచ్చు యోహాను 'తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండు కొనినవాడై, ఇశ్రాయేలేయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పనని” వ్రాయబడినది (లూకా 1:15). కొందరు బాల్యము నుండియు, కొందరు మధ్యవయస్కులుగాను మరికొదరు చివరి దశలోను యేసును వెంబడించుదురు. సాయంత్రం అయిదు గంటలకు పిలువబడిన వారు క్రీస్తు రాకడ బహు సమీపముగా నున్న యీ దినములలో విశ్వాసములోనికి వచ్చుచున్న అనేకులను సూచిస్తున్నారు.
ద్రాక్షతోటలో పని చేయు ప్రతి పనివానికి జీతము నిర్ణయింపబడినది. “యిదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియల చొప్పన ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్దవున్నది”(ప్రకటన 22:12). మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, తన దూతలతోకూడ రాబోవు చున్హాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పన వానికి ఫలమిచ్చును (మత్తయి 16:27. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే యుశ్తది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చు చున్హాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి (యెషయా 62:11). విశ్వాసులందరూ పైవాక్క భాగములనుబట్టి శరీరములో జరిగించిన క్రియల చొప్పున ప్రతిఫలము పొందుదురని చూచుచున్నాము. (2 కొరింథి 5:10).
అయితే, యీ ఉపమానము చెప్పడానికి ముందే యేనుక్రీన్తు మొదటివారు కడపటి వారగుదురని, కడపటి వారు మొదటి వారగుదురని హెచ్చరించెను (మత్తయి 19:30). యీ ఉపమానములోని ద్రాక్షతోట యజమానుడు తనగృహనిర్వాహకునితో చివర వచ్చిన పనివారితో మొదలుకొని, మొదట వచ్చిన పని వారి వరకూ అందరికీ ఒక్క దేనారమునే యిప్తించెనని వ్రాయబడినది (మత్తయి 20:8-9). అందరికీ యివ్వబడినది ఒక్కదేనారమే అయినను, వారు చేసిన పనిని బట్టి, దానికి విలువ కట్ట బడుతున్నది. యీ సత్యమును చివర వచ్చినవారిని యజమానుడు ముందు పిలుచుటను బట్టి గ్రహించుచున్నాము. చివరవచ్చిన వారు ఒకదేనారము పొందుట చూచి, మొదట వచ్చిన వారు తాము యెక్కువ సమయము పని చేయుటను బట్టి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి (వుత్తయఠం 20:10). చివరవచ్చిన వారిని కూడా యజమానుడు వారితో సమానము చేసెనని మొదట వచ్చినవారు అతనిపై సణుగుకొనిరి. దీనిని బట్టి, మనము యెంత కాలము విశ్వాసములో వున్హాము అన్న మాటను బట్టి కాకుండా, క్రీస్తు కొరకు మనము యెంతపని చేశాము అన్న మాటను బట్టి మాత్రమే మన బహుమానము నిర్ణయింపబడునన్న సత్వమును గ్రహించుచున్నాము.
విశ్వాసములో దిగజారిపోయి, కడపటి వారము కాకుండునట్లు వునలనం వునవమం కాచుకొనవలెను. తానం నిలుచంచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను (1కొరింథి 10:11). క్రీస్తును పునాదిగా కలిగిన మనము కళజ్ట, గడ్డి,కొయ్యకాలు మొదలైన వాటితో కాకుండా బంగారము, వెండి, వెలగల రాళ్లు అనువాటితో మన విశ్వాస జీవితములను కట్టు కొనవలెనని హెచ్చరింపబడుచున్నాము. సపునాదిమీద ఒకడు కట్టినపని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని వని కాల్పివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్తించుకొన్నట్టు రక్షింపబడును (1 కొరింథి 13:13-15).
(1) తలాంతులు (మత్తయి 25:14-30)
'ద్రాక్షతోటలోని పనివారు" అను ఉపమానములో దేవుని రాజ్యము పట్ల మనము చేసిన పనిని బట్టి మన బహుమానము వుండునని చూచితిమి.
“తలాంతులు” అను యీ ఉపమానములో ఆపని చేయుటకు అవసరమైన 'తలాంతు” ను కూడా యేసుక్రీస్తు విశ్వాసులకు అనుగ్రహించునని గమనించుదుము. 'తలాంతు' అనగా భూమి మీద దేవుని పరిచర్య జరిగించుటకు దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన కృపావరము. రోమా 12:6-8 లో ”మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై యున్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణముచొప్తున ప్రవచింతము, పరిచర్మయైతే పరిచర్మలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను” అని వ్రాయబడినది. కనుక బోధించుట, హెచ్చరించుట, కరుణించుట మొదలగునవి విశ్వానులకు దేవుని చేత యివ్వబడిన తలాంతులు. దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన తలాంతు యెంతో విలువైనది. యూదుల లెక్క ప్రకారము ఒక తలాంతు 6,000 దేనారములు. ఒక దేనారము ఒక్క రోజు జీతము. ఆ చొప్పన 6000 దేనారములు దాదాపు ఇరవై సంవత్సరాల జీతమగును. దీనిని బట్టి తలాంతు విలువ మనకు తెలియుచున్దది.
మత్తయి 25:14-30 వచనములో వ్రాయబడిన ఉపమానము పరిశీలించిన యెడల యీ క్రింది సంగతులను గమనించుదుము.
(1) తలాంతులు వేర్వేరు వరిమాణములలో సామర్థ్యము చొప్పన విశ్వానులకు యివ్వబడును (మత్తయి 25:15)
తలాంతులు దేవుని ఆస్తిగా చెప్తబడినవి (మత్తయి 25:14). యివి వారి వారి సామర్థ్యమును బట్టి విశ్వాసులకు యివ్వబడు చున్హవి. సామర్థ్యమనగా దేవుని చిత్తానికి లోబడి జీవించు స్వభావపు పరిమాణము లేదా దేవుడు ఒక్కొక్కరికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణము (రోమా 12:3). మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పన కృప యియ్య బడెను (ఎఫెసి 4:8). ఉపమానములో చెప్తబడిన మనుష్యుడు వారి సామర్థ్యమును బట్టి తన దాసులలో ఒకనికి అయిదు తలాంతులను, ఒకనికి
రెండు, ఒకనికి ఒకటియు అనుగ్రహించెను (మత్తయి 25:15).
(22 యుజవానుండం తన దానంల తలాంతంల లెక్క చూచుకొనును (మత్తయి 25:19)
'కనికరములేని చెడ్డ దానుడు అను ఉపమానములో దానుని యజమానుడు లెక్క చూచు కొనెను (మత్తయి 18:24). “యుక్తి పరుడైన గృహనిర్వాహకండుం” అను ఉపమానములో '“గృహనిర్వాహకత్వపు లెక్క” అప్తగించుమని అన్మాయస్థుడైన గృహనిర్వాహకునితో అతని యజమానుడు చెప్పెను (లూకా 16:2). అదే విధానములో ప్రస్తుత ఉపమానములో బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను (మత్తయి 25:19). మన జీవితముల లెక్క దేవునికి అప్ప జెప్తవలసి యుండునని మనము గ్రహించు చున్నాము (ప్రసంగి 11:9; 2 కొరింథి 5:10).
(3) దానుల తలాంతుల లెక్క అవ్తగింత, వారి బహుమానములు (మత్తయి 25:20-30)
ఉపమానములో చెప్పబడిన దానంలలో అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి, వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెననియు, రెండు తలాంతులు తీసుకొనిన వాడు మరి రెండు తలాంతులు సంపాదించెననియు చదువు చున్హాము (మత్తయి 25:16,17. దేవుడు మనకిచ్చిన తలాంతులను రెట్టింపు చేసుకొనడమనగా మనకున్న తలాంతులను దేవుని పరిచర్యలో సక్రమముగా వాడుకొనడమని అర్థము. ఉన్న తలాంతులను వినియోగించినప్పుడే కృపావరములో యింకను బలపడి, వ్యృద్ధిపొందుదుము.
యేసు క్రీస్తును వెంబడించు ప్రతివిశ్వాసికి ఒకటి లేదా యెక్కువ తలాంతులు అనుగ్రహింపబడినవి. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది (1కొరింథి 12:7). తనలో దాగియున్న ఆ ప్రత్యక్షతను లేదా తలాంతును ప్రతి విశ్వాసి ప్రజ్వలింప చేసు కొనవలెను (2 తిమోతి 1:6). తన తలాంతును కనుగొనిన తరువాత ప్రతి విశ్వాసి దానిని దేవుని పరిచర్య లో నమ్మకముగా వాడ వలయును. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహనిర్వాహకులై యుండి, యొక్కొక్కడు కృపావరము పొందిన కొలదీ యొకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన యెడల ధైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యము నొంది, చేయవలెను (1 పేతురు 4:10,11)
యీ ఉపమానములో, అయిదు తలాంతులు పొందిన దాసుడు మరి అయిదు తలాంతులు సంపాదించి, తన యజమానిముందు నిలిచినపుడు, అతని యజమానుడు - భళా,నమ్మకమైన మంచి దాసుడా, నీవు యీ కొంచెములో నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటిమీద నియవమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే రెండు తలాంతులు సంపాదించిన దాసునితోనూ చెప్పెను (మత్తయి 25:20-23). దీనిని బట్టి, మన నమ్మకత్వమును బట్టి దేవుడు మనకు అధికమైన బాధ్యత అప్పగించునని చూచు చున్నాము. అంతే గాక క్రీస్తు మహిమలోను, సంతోషములోను పాలివారమైయుందుమని చెప్తబడుచున్మాము (1పేతురు 5:1; 2 థెస్సలొనీ కయులకు 1:9).
అయితే, ఒక్క తలాంతు పొందిన దాసుడు భూమిని త్రవ్వి, దానిని దాచిపెట్టెననియు, మరియు తనలెక్క అడిగినప్పుడు యజమానునితో యెంతో నిర్లక్ష్మముగా మాటలాడెననియు మనము చదువు చున్నాము (మత్తయి 25:18, 24, 25). తలాంతును భూమిలో దాచిపెట్టడమనగా దేవుడను గ్రహించిన కృపావరమును పరిచర్యలో వాడకుండా, పూర్తిగా నిర్లక్ష్యము చేసి, సోమరిగా వుండుట. ఒక్క తలాంతు పొందిన దాసుడు, దానిని దాచిపెట్టడమే కాకుండా తన యజమానుడు లెక్క అడిగినపుడు “అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొను వాడవునైన కఠరినుడవని నేనెరుగుదును. కనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నీవు తీసికొనుమని' చెప్పెను (మత్తయి 25:24,25). యిట్లుచెప్పట ద్వారా సోమరియైన ఆదాసుడుతన సొంత జ్ఞానమును ప్రదర్శించెను. కనుకనే, “హేతంవులం చూవగల యేడుగురి కంటె సోమరి తన దృష్నికితానే జ్ఞానిననుకొనునని” వ్రాయబడినది (సామెతలు 26:16). యిటువంటి దాసులు తమ ప్రతిఫలమును అనుభవించెదరని మత్తయి 25:26-30 వచనములలో చదువు చున్నాము.
ప్రియులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని పరిచర్యలో వాడు చున్హామా ?
(1) మినాలు (లూకా 19:11-27)
'తలాంతులు” అను ఉపమానములో క్రీస్తు రెండవ రాకడవరకూ దేవుడు మనకిచ్చిన తలాంతులతో వ్యాపారము చేసి (దేవుని పరిచర్యలో వాడి), వాటిని అధికము చేసుకొనవలెనన్న సత్యమును చూచితిమి. ఇదే అర్ధమునిస్తూ యేసు క్రీస్తు 'మినాలు” అను ఉపమానమును చెప్పెను. 'తలాంతులు' అను ఉపమానమును యేసు క్రీస్తు యెరుషలేములో ప్రవేశించి, సిలువ వేయ బడుటకు ముందు తన చివరి వారములో చెప్తెను. అయితే, 'మినాలు” అను యీ ఉపమానమును యేసుక్రీస్తు యెరూషలేములోనికి గాడిదపిల్లమీద ప్రవేశించుటకు ముందు చెప్ప్తెను.
యీ ఉపమానము చెప్పుటకు ముందు యూదులు దేవుని రాజ్యము వెంటనే అగుపడునని తలంచుచుండిరి(లూకా 19 :11). అపా.కా. 1:6లో కూడా శిష్యులు, 'ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా ?” అని యేసుక్రీస్తును అడిగినపుడు, 'కాలములను, సమయములను తండ్రి తన స్వాధీినమందుంచు కొని యున్వాడు. వాటిని తెలిసికొనుట మీపనికాదు'” (అపా.కా. 1:7) అని చెప్పెను. దీనిని బట్టి, భౌతికపరమైన క్రీస్తు రాజ్యము యేసు క్రీస్తు సిలువ వేయబడి, రాజుగా తన రెండవరాకడలో వచ్చినపుడు ఏర్పరచునని తెలిసి కొందుము. అయితే, తాను రాజుగా వచ్చువరకు, తన పరిచర్యలో నిమగ్నులై యుండుడని తెలుపుటకు 'మినాలు” అను ఉ పమానమును చెప్పెను.
లూకా 19:12-15 లో యీలాగు వ్రాయబడినది. “రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని, మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై, తన దాసులను పదిమందిని పిలిచి, వారికి పది మినాల నిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి, ఇతడు మమ్మునేలుట మాకిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడా రాజము సంపాదించుకొని, తిరిగి వచ్చినపుడు, ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సామ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.” యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్లి, దూతలమీదను, అధికారుల మీదను, శక్తులమీదను అధికారము పొందినవాడై, దేవుని కుడి పార్శ్యమున ఉన్హాడు (1 పేతురు 3:22). దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండిలేపి, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తికంటెను, ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్మ్య మున కూర్చుండబెట్టు కొనియున్హాడు (ఎఫెసీ 1:21). ఉపమానములో చెప్పబడిన రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని వచ్చిన రీతిలో, దేవుని కుడి పార్శ్యమునకు హెచ్చింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అను నామమును కలిగినవాడై, తెల్లని గుర్రము మీద తన పరిశుద్ధుల సమూహముతో వచ్చునని దేవుని వాక్యము సెలవిస్తున్నది (ప్రకటన 19:11-16).
'తలాంతులు” అను ఉపమానములో యజమానుడు దాసుల యొక్క తలాంతుల లెక్క అడిగిన విధానములో యీ ఉపమానములో కూడా రాజు తన దాసుల వ్యాపారపు లెక్క అడుగు చున్హాడు (లూకా 19:15). తలాంతులు” అను “ ఉపమానములో చెప్తబడినట్లు తమ కప్ప జెప్తబడిన బాధ్యతను నమ్మకముగా నిర్వర్తించు వారికి అధికమైన బాధ్యత నప్పరించి, తన సంతోషములో వారు పాలుపొందునట్లు చేసి, నిర్లక్ష్మముగా వ్యవహరించుదాసులను శిక్షించునని లూకా 19:16-26 వచనములలో చదువు చున్నాము. అంతే గాక, తన రాజరికమును తృణీకరించు వారుకూడా శిక్షింపబడుదురని లూకా 19:27లో చదువు చున్నాము.
