ఉపోద్ఘాతము

ఉపోద్ధాతము ప్రియ సహోదర, సహోదరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా వందనములు. “క్రీస్తు ఉపమానములు - దేవుని రాజ్యమర్శములు” అను పుస్తకము ద్వారా పరిశుద్ధ గ్రంథమందు యేసుక్రీస్తు దేవుని రాజ్యము (లేక పరలోక రాజ్యము)ను గూర్చి తెలియ జెప్పిన ఉపమానములను పాఠకలోకముతో పంచుకొనుటకు ప్రభువు కృపనిచ్చినందుకు (ప్రభువుకు నా వందనములు.

ఉపమానమనగా పరలోక సంబంధమైన అర్థమునిచ్చెడు భూ సంబంధమైన కథ లేక వర్ణన. (ప్రతి ఉపమానము ఒక సత్యమును తెలియజేయుచున్నది. ప్రతి ఉపమానము అది బోధించుచున్న ప్రధానాంశమును బట్టి విషయ సూచికలో పొందుపరచబడియున్నది.

యేసు క్రీస్తు శిష్యులు నీవు ఉపమాన రీతిగా వారితో (జనులతో) యెందుకు మాటలాడుచున్నావని అడిగినపుడు, ఆయన, “పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. వారు చూచుచుండియు చూడరు. వినుచుండియు వినకయు, (గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను” అని చెప్పెను (మత్తయి 18:10-18). యీ మాటలను బట్టి యేసుక్రీస్తు ఉపమానముల ద్వారా ప్రజలందరూ దేవుని రాజ్య మర్మ్శములను గూర్చి తెలిసి కొనుటయనునది దేవుని ఉద్దేశ్యమై యున్నది. యీ పుస్తకము చదివి, అనేకులు ఆత్మీయమైన మేలు పొందుదురని ఆశిస్తున్నాను.

యీ పుస్తకమును ప్రచురించుటలో ఎంతో (శ్రమించిన పాస్టర్‌ డేవిడ్‌ రాజుగారికి, సహో. సుందర్‌ గారికి, సహో.హానోకు గారికి మరియు ప్రచురణ కర్తలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. యిందు నిమిత్తమై ప్రార్ధించిన విశ్వాసులందరికి నా వందనములు.

(ప్రభువునందు, సహో! ధర్మా మల్లు (1/.8/11) 2.101811: 1000013075 (2 [0&11.0010

↑ Back to top

↑